Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala
03-09-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ -
శరీరముపై ఎటువంటి నమ్మకము లేదు, అందుకే ఏ శుభ కార్యాన్ని
అయితే చేయాలో,
దానిని
ఈ రోజే చేయండి,
రేపటికి
విడిచిపెట్టకండి’’
ప్రశ్న:-
స్వయము సమృద్ధి చెందేందుకు అనగా సుసంపన్నముగా అయ్యేందుకు
యుక్తి ఏమిటి?
జవాబు:-
శివబాబాను తమ వారసునిగా (కొడుకుగా) చేసుకోండి, అప్పుడు వారు మిమ్మల్ని 21 జన్మల కోసం సుసంపన్నముగా
చేస్తారు. వీరొక్కరే అందరికీ కొడుకుగా అయి అందరికీ సమృద్ధతను అందిస్తారు. కానీ
చాలా మంది భయపడతారు,
బహుశా
అంతా ఇచ్చేయాల్సి ఉంటుందేమో అని భావిస్తారు. బాబా అంటారు, భయపడాల్సిన విషయమేమీ లేదు.
మీరు మీ పిల్లలు మొదలైనవారిని సంభాళించండి, వారి పాలన చేయండి కానీ స్మృతి చేయడము ఈ
కొడుకునే స్మృతి చేయండి,
అప్పుడు
వారు మిమ్మల్ని సుసంపన్నముగా చేస్తారు. ఒకవేళ ఈ కొడుకుపై బలిహారమైనట్లయితే మీకు
చాలా సేవ చేస్తారు.
ఓంశాంతి. ఈ సమయంలో అన్ని సెంటర్లలో ఏ-ఏ
పిల్లలైతే కూర్చున్నారో,
వారు
తప్పకుండా - మేము శివబాబా మహావాక్యాలను వింటామని భావిస్తూ ఉండవచ్చు. ఇటువంటి సంస్థ
వేరే ఏదీ ఉండదు ఎందుకంటే శాఖలైతే చాలా మందివి ఉన్నాయి కదా. ఎక్కడైతే వారి హెడ్
ఆఫీసు ఉంటుందో,
ఎక్కడైతే
వారి గురువు ఉంటారో,
అక్కడ
వారు టేపులు మొదలైనవి కూడా రికార్డ్ చేస్తూ ఉండవచ్చు. ఆ గురువునే తలచుకుంటూ
ఉండవచ్చు. నిరాకార పరమపిత పరమాత్మను మీరు తప్ప ఇంకెవ్వరూ స్మృతి చేస్తూ
ఉండకపోవచ్చు. ఈ సంగమ సమయంలోనే పారలౌకిక తండ్రి వస్తారు, కూర్చుని పిల్లలకు పరిచయాన్ని
ఇస్తారు మరియు పిల్లలు నిశ్చయబుద్ధి కలవారిగా అయి అదే ధ్యాసలో ఉంటారు. పరమపిత
పరమాత్మ ఈ సమయంలోనే మురళీ వినిపిస్తారు. శాస్త్రాలలో కూడా కృష్ణుడు మధుబన్ లో
మురళీ వినిపిస్తారు అని ఉంది. ముఖ్యమైనది మధుబన్ ఒక్కటే, మిగిలిన అన్ని స్థానాలకు మురళీ
వెళ్తుంది. కృష్ణుడు మురళీ వినిపిస్తారని మనుష్యుల బుద్ధిలో ఉంది. శివబాబా మురళీ
వినిపిస్తారు - ఈ విషయం ఎవరి బుద్ధిలోకి ఎప్పుడూ రాదు. ఇది ఎవరికీ తెలియదు.
ఎక్కడెక్కడైతే మీ సెంటర్లు తెరవబడతాయో, అక్కడ బ్రహ్మా ద్వారా శివబాబా మురళి
మ్రోగుతుందని అందరూ అర్థం చేసుకుంటారు. దానిని మళ్ళీ జ్ఞాన గంగలు అందరూ విని ఇతరులకు
వినిపిస్తారు. బుద్ధిలోనైతే శివబాబా గుర్తున్నారు కదా. శివబాబాను భగవంతుడని
అంటారు. శివబాబా మురళి వినిపిస్తారు అన్నది ఏ శాస్త్రాలలోనూ లేదు. పిల్లలైన మీరు
ఎక్కడున్నా సరే,
మీరు ఏమని
భావిస్తారంటే - ఈ మురళి ఏదైతే ముద్రించబడి వచ్చిందో, ఇది శివబాబాదే. శివబాబా తప్ప ఇంకెవ్వరూ
నేర్పించలేరు. తండ్రియే అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే, నేను వారసత్వాన్ని ఇస్తాను. బాబా
పిల్లలకు ఏమని అర్థం చేయిస్తూ ఉంటారంటే - నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇతరులెవ్వరి నామ-రూపాలను స్మృతి
చేయకండి. సాకార మనుష్యుల ఫోటోలు మొదలైనవాటినైతే జన్మ-జన్మాంతరాలుగా పోగు చేస్తూ
వచ్చారు,
ఉపాసన
చేస్తూ వచ్చారు. దేవతలు మొదలైనవారి చిత్రాలను పెట్టుకోవడము, వీటన్నింటి నుండి మీరు
విముక్తులవుతారు. భక్తి మార్గంలో ఆత్మలు తండ్రిని స్మృతి చేస్తారు. ఎప్పుడైతే
దేహాభిమానులుగా అవుతారో,
అప్పుడు
శరీరాలను స్మృతి చేస్తారు. తండ్రి ఘడియ-ఘడియ చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఆత్మనే పతితముగా, దుఃఖితముగా అయ్యింది. ఆత్మ అంటుంది - నేను
మహారాజుగా ఉండేవాడిని,
ఇప్పుడు
నిరుపేదగా అయ్యాను. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది, మేము బాబా పిల్లలము, తండ్రి నుండి మేము వారసత్వాన్ని
పొందాము. ఇప్పుడు తండ్రి అంటారు, అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఇటువంటి
శుభకార్యము ఇంకేదీ ఉండదు. ఈ శుభకార్యములో ఆలస్యం చేయకూడదు. శరీరముపైనైతే నమ్మకం
లేదు. యువకులకు లేదు,
వృద్ధులకు
లేదు,
అందుకే
ఏదైతే చేయాలో,
అది ఈ
రోజే చేయాలి. ఈ రోజు,
రేపు
అంటూ-అంటూ మృత్యువు కబళించివేస్తుంది. తండ్రి ఎంత పెద్ద హాస్పిటల్ మరియు
యూనివర్సిటీని తెరిచారు. దాని ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము లభిస్తాయి. ఆరోగ్యము, ఐశ్వర్యము ఉంటే సంతోషము ఉండనే
ఉంటుంది. నిరోగి శరీరము,
ధనము ఉంటే
మనుష్యులు సుఖంగా ఉంటారు. అందుకే తండ్రి అంటారు, ఎవరైతే శుభకార్యం చేయాలనుకుంటున్నారో, వారు చేసేయండి. కేవలం 3 అడుగుల
భూమిని తీసుకుని ఈ హాస్పిటల్ ను తెరవండి. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి.
తండ్రి స్వర్గ రచయిత కావున తప్పకుండా తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభించాలి.
భారతవాసులకు వారసత్వముండేది కదా. ఈ విషయాలను భారతవాసులు సహజంగా అర్థం చేసుకోగలరు.
భగవంతుడిని వెతికేందుకు మందిరాలున్నాయి. ఆర్య సమాజము వారు దేవతలను నమ్మనే నమ్మరు, అందుకే ఈ చిత్రాలు మొదలైనవేవైతే
తయారుచేసారో,
ఇవన్నీ
బూటకము అని వారు భావిస్తారు. విఘ్నాలైతే చాలా కలుగుతూ ఉంటాయి. అర్థం చేయించడమైతే
చాలా సహజము. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - త్వరగా నాతో నిశ్చితార్థం చేసుకోండి కదా, నిశ్చితార్థం చేసుకుంటేనే
వారసత్వానికి అధికారులుగా అవ్వగలరు.
తండ్రి
ఆత్మిక సర్జన్,
మీరు వారి
పిల్లలుగా పిలవబడతారు కావున మీరు కూడా సర్జన్లు. తప్పకుండా ఆత్మలకు జ్ఞాన
ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మన్మనాభవ. ఇది అత్యంత పెద్ద ఇంజెక్షన్. బాబా
స్మృతితోనే అన్ని దుఃఖాలు దూరమవుతాయి. యోగముతో పుణ్యాత్ములుగా అవుతారు. యోగము
ఒక్కటే మందు. కొడుకు జన్మిస్తాడు, తండ్రి ఒడిలోకి వెళ్తాడు మరియు వారసత్వానికి
యజమానిగా అవుతాడు. మనము అనంతమైన తండ్రి నుండి స్మృతి ద్వారా వారసత్వాన్ని
తీసుకుంటామని మీకిప్పుడు తెలుసు. స్మృతిలోనే అనేక రకాల విఘ్నాలు కలుగుతాయి, అందుకే స్మృతిని పక్కా చేసుకుంటూ
వెళ్ళండి. కేవలం 3 అడుగుల భూమిని తీసుకుని ఈ హాస్పిటల్ ను తెరవండి. ఇది 3 అడుగులే
కదా! లేదంటే ఇంత ఉన్నతమైన కాలేజీ కోసం 50-60 ఎకరాల భూమి ఉండాలి, ఇక్కడికి ఎంతోమంది మనుష్యులు
వచ్చి చదువుకోగలగాలి,
జ్ఞాన
ఇంజెక్షన్ ను వేయించుకుంటూ ఉండాలి. 3 అడుగుల భూమి కూడా లభించలేదు కానీ విశ్వానికి
యజమానులుగా అయ్యారు అన్న గాయనము కూడా ఉంది. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు
కదా. 3 అడుగుల భూమి అంటే పెద్ద విషయమేమీ కాదు, తర్వాత నెమ్మది-నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది.
పునాది వేసిన తర్వాత ఎన్ని సెంటర్లు తెరుచుకున్నాయి. ఎంత మంది గవ్వ వలె ఉన్నవారు
వజ్రం వలె అవుతారు. చేసేవారికే ఎంతో లాభముంటుంది. ఎంతో మంది కళ్యాణం కోసమే
హాస్పిటళ్ళు మరియు కాలేజీలు తెరవబడతాయి. ఇవి కూడా అటువంటివే, బయట బోర్డు పెట్టండి. క్లినిక్
ఫోర్ హెల్త్ వెల్త్ (ఆరోగ్యము మరియు ఐశ్వర్యము యొక్క క్లినిక్) 21 జన్మల కోసము.
హిందీలో - 100 శాతము పవిత్రత, సుఖ-శాంతుల చికిత్సాలయము అని అంటారు. కానీ
పిల్లలలో సేవ చేయాలనే అభిరుచి లేదు. కుటుంబము మొదలైనవాటి యొక్క వలను సాలెపురుగు వల
అని అంటారు,
ఆ వలలో
స్వయమే చిక్కుకుంటారు. తండ్రి వచ్చి రావణ రూపీ సాలెపురుగు వల నుండి బయటకు
తీస్తారు. సత్యయుగంలో ఇలా అనరు. ఇక్కడ కూడా తమ వలలో తామే చిక్కుకుని మరణిస్తారు.
ఇది ఉన్నదే రావణ రాజ్యము. ఈ మొత్తం సృష్టిపై ఎంత పెద్ద-పెద్ద రావణుడి వలలు ఉన్నాయి.
అందరూ శోకవాటికలో కూర్చున్నారు. ఈ రావణుడి వలలో సాధు, సత్పురుషులు మొదలైనవారందరూ
చిక్కుకుని ఉన్నారు. ఇప్పుడు తండ్రి అంటారు, వీరందరినీ మరచి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం
చేసుకోండి మరియు అందరికీ ఇదే మార్గాన్ని తెలియజేస్తూ ఉండండి. ఈ సృష్టి చక్రం యొక్క
రహస్యాన్ని ఇంకెవ్వరూ తెలియపర్చలేరు. తండ్రి అంటారు, వీరందరినీ విడిచి నన్నొక్కరినే స్మృతి
చేయండి. స్మృతితోనే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. శుభ కార్యములో ఆలస్యం చేయకూడదు.
ఆలస్యం చేస్తూ-చేస్తూ మరణిస్తారని ఉదాహరణ కూడా చెప్తారు. తర్వాత భోగ్ సమయములో ఆ
ఆత్మ వచ్చినప్పుడు చాలా ఏడుస్తుంది. అప్పుడు ఇలా చెప్పడం జరుగుతుంది - చూడు, నీవు ఆలస్యం చేసావు, ఈ రోజు-రేపు అంటూ-అంటూ మృత్యువు
కబళిస్తుంది,
ఇప్పుడిక
జ్ఞానాన్ని తీసుకోలేవు. ఈ విధంగా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. చాలా మంది పిల్లలు, అచ్ఛా - రేపు ఇది చేద్దాము అని
ఆలోచిస్తారు,
అంతలోనే
మరణిస్తారు. అందుకే మమకారాన్ని విడిచిపెట్టండి అని అర్థం చేయించడం జరుగుతుంది.
లౌకిక సంబంధీకులేమీ మీ కళ్యాణం చేయరు. ఈ శివబాబా ఇప్పుడు మీకు కొడుకుగా అవుతారు.
వారంటారు,
మీరు
నన్ను వారసునిగా చేసుకున్నట్లయితే నేను మీకు చాలా సేవ చేస్తాను. అందుకే బాబా
అడుగుతారు కూడా - మీకెంతమంది పిల్లలు? శివుడినైన నన్ను మీ కొడుకుగా
చేసుకున్నట్లయితే 21 జన్మల కోసం సుసంపన్నంగా అవుతారు. కన్య అయితే తమ ఇంటికి
వెళ్తుంది. కొడుకుల కోసం ఎంతగా హైరానా పడతారు. కొడుకు జన్మించకపోతే రెండవ-మూడవ
వివాహం కూడా చేసుకుంటారు. తండ్రి అంటారు, ఆ లౌకిక కొడుకైతే మీకు ఏ సేవనూ చేయడు.
వీరొక్కరే అందరికీ కొడుకుగా అవుతారు, అందరినీ పూర్తిగా సమృద్ధిగా చేయడానికి. కానీ
చాలా మంది అంతా ఇచ్చేయాల్సి ఉంటుందేమో, ఏం జరుగుతుందో అని భయపడతారు. తండ్రి అంటారు -
తమ పిల్లలు మొదలైనవారి యొక్క పాలన అయితే చేయాల్సిందే. కానీ స్మృతి ఈ కొడుకును
చేయండి. వీరైతే మిమ్మల్ని సంపన్నంగా చేస్తారు. కాశీలోని మందిరానికి వెళ్ళి బలి
అవుతారు. శివునిపై బలి అవ్వడంతో జీవన్ముక్తి లభిస్తుంది అని భావిస్తారు.
వాస్తవానికి అది ఇక్కడి విషయము. ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళారు. ఒకవేళ
మీరు ఈ కొడుకుపై బలిహారమైనట్లయితే, వీరు మీకు చాలా సేవ చేస్తారు, స్వర్గంలో మహళ్ళు ఇస్తారు. ఆ
కొడుకైతే ఏమీ చేయడు,
మహా అయితే
బ్రాహ్మణులు మొదలైనవారికి తినిపిస్తాడు. మనుష్యులు దాన-పుణ్యాలు మొదలైనవి ఏవైతే
చేస్తారో,
అవి తమ
కోసమే చేసుకుంటారు. కావున ఈ హాస్పిటల్ ను తెరవడం ఎంతటి పుణ్యము. షావుకార్లు అయితే
10-15 హాస్పిటళ్ళను తెరవగలరు. ఈ ధనము మొదలైనవన్నీ అయితే సమాప్తమైపోతాయి. మీరు
అద్దెకు ఇళ్ళను తీసుకుని 50 వేలతో 50 హాస్పిటళ్ళను తెరవండి. తర్వాత అవి వాటంతటవే
తమ కాళ్ళపై నిలబడతాయి. తండ్రి సేవ కోసం ఎంతటి సహజమైన యుక్తులను తెలియజేస్తారు.
గంగా నది తీరానికి వెళ్ళి సేవ చేయండి. తమ వీపుపై ఈ బాబా పరిచయాన్ని తగిలించుకోండి.
వారంతట వారే చదువుతూ ఉంటారు. దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. ఎవరైనా షావుకారు ఇలా
చేసినట్లయితే అందరూ - వాహ్! వీరికైతే దేహాభిమానం అస్సలు లేదు అని అంటారు. తండ్రి
పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి స్వర్గ రచయిత, మరి మనం నరకంలో ఎందుకు పడి ఉన్నాము! ఇప్పుడు
తండ్రి వచ్చారు - దేహం యొక్క అన్ని సంబంధాలను విడిచి నన్ను స్మృతి చేయండి అని
అంటారు. భారత్ స్వర్గం నుండి నరకంగా ఎలా అయ్యింది, లక్ష్మీ-నారాయణులు 84 జన్మలను ఎలా
తీసుకున్నారు,
మీరు
వచ్చినట్లయితే మేము మీకు ఈ కథను వినిపిస్తాము. అనేక మంది పోగు అవుతారు. పతిత-పావని
అని గంగా నదిని కూడా అంటారు, అలాగే యమునా నదిని కూడా అంటారు. అచ్ఛా, ఒకవేళ గంగా నది పతితపావని అయితే, ఆ ఒక్కదానినే పట్టుకోండి కదా.
ఇప్పుడు
పిల్లలైన మీరు డ్రామాను తెలుసుకున్నారు కావున ఇతరులకు అర్థం చేయించాలి. ఒకవేళ
ఇతరులకు ప్రకాశాన్ని అందించకపోతే, వీరి బుద్ధిలో ప్రకాశముందని ఎవరంటారు. సర్జన్
ఇంజెక్షన్ వేయలేకపోతే వారిని సర్జన్ అని ఎవరంటారు? పిల్లలైన మీకు మొత్తం ప్రకాశము లభించింది. 84
జన్మల రహస్యం బుద్ధిలో ఉంది. మీకు ఈ డ్రామా గురించి మరియు పాత్రధారుల పాత్ర
గురించి తెలుసు. ఉన్నతోన్నతమైన పాత్ర తండ్రిది. వారు పిల్లలతో పాటు పాత్రను
అభినయిస్తారు. మీరు భారత్ ను స్వర్గంగా తయారుచేస్తారు. కానీ గుప్తంగా ఉన్నారు.
మీరు గుప్తమైన,
అహింసాయుతమైన, శివశక్తి సైన్యము. వాళ్ళ
విషయాలన్నీ భౌతికమైనవి. ఎంతమంది కుంభమేళాలకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ భౌతిక విషయాలేవీ
ఉండవు. మీరు లేస్తూ,
కూర్చుంటూ, నడుస్తూ యాత్రలో ఉన్నారు, స్మృతితో మీరు పావనంగా అవుతారు.
బాబా అంటారు - మీరు కర్మలు చేసే సమయంలో కూడా శివబాబాను స్మృతి చేయండి. వారేమో
అందరిలోనూ పరమాత్మ ఉన్నారని అంటారు. తేడా ఉంది కదా! తండ్రి అంటారు, ఎక్కడ కూర్చున్నా సరే నన్ను
స్మృతి చేయండి. ఇంకా సేవ కూడా చేయాలి. మందిరాలకు చాలా మంది భక్తులు వెళ్తారు.
కేవలం ఈ చిత్రాన్ని వీపుపై తగిలించుకోండి, తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉండండి. యుక్తులైతే
చాలా చెప్తారు. శ్మశానానికి వెళ్ళి అర్థం చేయించండి. నిరాకారుడైన తండ్రి మహిమను
మరియు శ్రీకృష్ణుని మహిమను వినిపించండి. ఇప్పుడు గీతా భగవంతుడెవరో చెప్పండి అని
అడగండి. చిత్రాలు కూడా మీతో పాటు ఉండాలి. మీరు చాలా సేవ చేయవచ్చు. స్త్రీలు లేక
ఎవరైనా కుమారీ చేస్తే అహో సౌభాగ్యము. కన్య అయితే అందరికన్నా మంచివారు. కన్యల
కన్నయ్య అయిన తండ్రి నిరాకారుడు. కన్నయ్య అనగా కృష్ణుడు కాదు, కన్నయ్య అనగా తండ్రి. పిల్లలకు
ఎలా నేర్పించను అని తండ్రి ఆలోచిస్తారు! కల్పక్రితం కూడా డ్రామానుసారంగా ఇదే
విధంగా అర్థం చేయించాను,
మళ్ళీ
ఈరోజు అర్థం చేయిస్తాను. కావున మీరు కూడా అంధులకు చేతికర్రగా అవ్వాలి. ఏ
పిల్లలకైతే పరిచయం లభిస్తుందో, వారు మళ్ళీ ఇతరులను తీసుకువస్తారు. దానికి
కూడా పుణ్యం వస్తుంది. మీ వద్ద లెక్క ఉంచుకోండి. ఎంతగా చేస్తారో, దానికి ఫలమైతే లభిస్తుంది కదా.
ఎవరినైనా తీసుకొస్తే,
వారి
కళ్యాణము కూడా ఎంతగానో జరుగుతుంది. ఈ వ్యాపారంలో పిల్లలకు చాలా అటెన్షన్ ఉండాలి.
సేవ చేయకపోతే ఏమి లభిస్తుంది? సేవ, సేవ మరియు సేవ. మీరు కూడా, మేము భగవంతుని సేవలో ఉన్నామని
భావిస్తారు. ఇంటి సేవను కూడా చేయండి.
తండ్రి
ఏమని శిక్షణ ఇస్తారంటే - పిల్లలను ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళనివ్వకండి. ఒకవేళ వారు
మీ ఆజ్ఞను పాటించకపోతే ఆజ్ఞను ఉల్లంఘించినవారు అవుతారు. ఒకవేళ పిల్లలకు
ధనమిచ్చినట్లయితే,
దానితో
వారు పాపం చేస్తే,
ఆ శిక్ష
మీ తలపైకి వస్తుంది. బాబా అయితే సలహాలు ఇస్తారు కదా. కానీ చాలా మంది చేసేసిన
తర్వాత చెప్తారు. కావున పిల్లలకు సేవ కోసం అనేక రకాల యుక్తులను తెలియజేస్తారు.
పిల్లలైన మీరు ఇదే వ్యాపారము చేయాలి. ట్రైన్ లో కూడా ఇదే సేవ చేస్తూ ఉండండి, అప్పుడు తండ్రి కూడా
సంతోషిస్తారు మరియు భవిష్య 21 జన్మల కోసం సదా సుఖం యొక్క వారసత్వం లభిస్తుంది.
అచ్ఛా!
మధురాతి-మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత,
బాప్
దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు
ముఖ్య సారము:-
1. మాయ
ఏదైతే చాలా పెద్ద వల వేసిందో, తండ్రి స్మృతితో ఇప్పుడు ఆ వల నుండి బయటకు
రావాలి. శుభ కార్యములో నిమగ్నమవ్వాలి. ఏ దేహధారుల వలలోనూ చిక్కుకోకూడదు, అందరి నుండి మమకారాన్ని
తొలగించాలి.
2. జ్ఞానం
యొక్క ప్రకాశం ఏదైతే లభించిందో, దానిని అందరికీ ఇవ్వాలి. దేహాభిమానాన్ని
వదిలి రకరకాల యుక్తులతో సేవ చేయాలి. అంధులకు చేతికర్రగా అవ్వాలి.
వరదానము:-
అనేక రకాల భావాలను సమాప్తం చేసి ఆత్మిక భావాన్ని ధారణ చేసే
సర్వుల స్నేహీ భవ
దేహ
భానములో ఉండడంతో అనేక రకాల భావాలు ఉత్పన్నమవుతాయి. ఒక్కోసారి ఒకరు మంచిగా అనిపిస్తారు, ఒక్కోసారి ఒకరు చెడుగా
అనిపిస్తారు. ఆత్మ రూపంలో చూసినట్లయితే ఆత్మిక ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఆత్మిక
భావము,
ఆత్మిక
దృష్టి,
ఆత్మిక
వృత్తిలో ఉండడంతో,
ప్రతి
ఒక్కరి సంబంధంలోకి వస్తూ అతి అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. కావున
నడుస్తూ-తిరుగుతూ అభ్యాసం చేయండి - ‘‘నేను ఆత్మను.’’ దీని ద్వారా అనేక రకాల భావ-స్వభావాలు
సమాప్తమవుతాయి మరియు అందరికీ స్నేహీలుగా స్వతహాగా అవుతారు.
స్లోగన్:-
ఎవరి వద్దనైతే ఉల్లాస-ఉత్సాహాల రెక్కలు ఉన్నాయో, వారికి సఫలత సహజంగా
ప్రాప్తిస్తుంది.
Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala


0 Comments