Header Ads Widget

Header Ads

TELUGU MURLI 11.10.22

 Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala

11-10-2022 ప్రాత:మురళి  ఓంశాంతి "బాప్ దాదా"  మధువనం

 



Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - ఆత్మిక బ్రాహ్మణులైన మీకు పరస్పరంలో చాలా-చాలా ప్రేమ ఉండాలి. అందరికీ సత్యమైన తండ్రి పరిచయాన్ని ఎలా ఇవ్వాలో పరస్పరంలో కలిసి చర్చించుకుని సలహాలు తీయండి’’

ప్రశ్న:-

పిల్లలు నిశ్చయము యొక్క ఆధారముతో తమ భాగ్యాన్ని ఉన్నతముగా తయారుచేసుకోగలరు?

జవాబు:-

ఇక్కడ చదివించేవారు స్వయంగా పరమాత్మ, వారి నుండే మనము సౌభాగ్యము తీసుకోవాలి అని మొదట ఎప్పుడైతే బుద్ధిలో నిశ్చయం కూర్చుంటుందో, అప్పుడే చదువును రోజూ చదువుతారు మరియు తమ సౌభాగ్యాన్ని ఉన్నతముగా తయారుచేసుకోగలరు. తండ్రి శ్రీమతము ఏమిటంటే, పిల్లలూ, ఎటువంటి పరిస్థితిలోనైనా మీరు రోజూ చదవాలి. ఒకవేళ క్లాస్ కు రాలేకపోయినా కూడా ఇంట్లో మురళీని చదువుకోండి.

గీతము:-  నీవు ప్రేమ సాగరుడవు... (తూ ప్యార్ కా సాగర్ హై...) 



ఓంశాంతి. ఆత్మలు అనగా పిల్లలు తెలుసుకున్నారు, ఆత్మలమైన మనం బిందువు వలె ఉంటాము, ఒక నక్షత్రము వలె ఉంటాము. కానీ ఆత్మ ఏదైతే ఉందో అది స్వయం యొక్క తండ్రిని ఎలా రియలైజ్ చేయగలదు. ప్రపంచంలో ఎవ్వరికీ స్వయం గురించి, తండ్రి గురించి తెలియదు. మీకు తెలుసు, ఆత్మలమైన మనం బిందువులము. ఆత్మ ఎంత చిన్నది, తండ్రి కూడా అంత చిన్నగా ఉంటారు. ఆత్మ కన్నా పరమాత్మ అయిన తండ్రి పెద్దగా ఏమీ ఉండరు. శరీరమైతే చిన్నగా, పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మీరు శివబాబా స్మృతిలో కూర్చున్నారు. ఆత్మ చిన్నని బిందువు అని ఎవరైనా తెలుసుకోవచ్చు, కానీ అందులో 84 జన్మల పాత్ర ఉంది, ఇది ఆశ్చర్యము కదా. ఎప్పటివరకైతే ఆత్మ శరీరాన్ని ఆధారంగా తీసుకోదో, అప్పటివరకు పాత్రను అభినయించలేదు. అలాగే పరమాత్మ కూడా ఆత్మలమైన మన లాగ చిన్నగా ఉంటారు, కానీ వారిని తండ్రి అని ఎందుకు అంటారు? ఎందుకంటే వారు సదా పావనంగా ఉంటారు. వారికి పరమాత్మ గురించి తెలియకపోయినా కూడా, వారిని తండ్రి అని అంటారు. ఎలాగైతే మీరు వివేకంతో స్మృతి చేస్తారో, అలాగే వారు కూడా స్మృతి చేస్తారు. ఇంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో, అందరికీ భగవంతుడు ఒక్కరే, వారినే పతిత-పావనుడు అని అంటారు. కావున పతితులు అనేకులు ఉన్నారు మరియు పతిత-పావనుడు ఒక్కరే. సాధు-సన్యాసులు, మహాత్ములు కూడా పిలుస్తారు, వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. కావున వారు అందరికీ ఫాదర్ అయినట్లు కదా. ఫాదర్ పతితులను పావనంగా తయారుచేసేందుకు రావలసి ఉంటుంది. పావనంగా అయ్యే ఉపాయాన్ని వారే తెలియజేస్తారు ఎందుకంటే ఆత్మపై పాపాల భారము ఎక్కి ఉంది. మనం కేవలం బీ హోలీ (పవిత్రంగా ఉండండి) అని రాస్తాము, కానీ అటువంటి స్లోగన్లను పెట్టినంత మాత్రాన లాభమేమీ ఉండదు ఎందుకంటే బయటివారైతే అర్థం చేసుకోలేరు. ఇకపోతే, మీకు అర్థం చేయించడము జరిగింది, మీకు స్లోగన్ల అవసరం ఏముంది. దీని అర్థము, పవిత్రంగా అవ్వండి, బాబాను స్మృతి చేయండి. ఎప్పటివరకైతే ఎవ్వరికీ అర్థం చేయించడం జరగదో, అప్పటివరకు ఏమీ అర్థం చేసుకోలేరు. యోగంలో ఉండడం ద్వారా పవిత్రంగా అవ్వగలరు. హిస్ హోలినెస్ అని అంటారు. ఇది పవిత్రతకు టైటిల్. సన్యాసులను హోలీ అని అంటారు ఎందుకంటే వారు వికారాల్లోకి వెళ్ళరు. వారు పవిత్రంగా ఉంటారు, బ్రహ్మమును స్మృతి చేస్తారు, కానీ జన్మ వికారుల వద్దే తీసుకోవలసి ఉంటుంది. పవిత్రంగా ఉండండి మరియు శివబాబాను స్మృతి చేయండి అని మీకైతే చెప్పడము జరుగుతుంది. సన్యాసులు స్వయాన్ని కర్మ సన్యాసులుగా పిలిపించుకుంటారు, కానీ కర్మ సన్యాసము ఉండదు. ఎప్పుడైతే దేహం ఉండదో, అప్పుడే కర్మ సన్యాసం జరుగుతుంది. దేహం లేకుండా అయితే ఇంట్లో (పరంధామంలో) ఉంటారు. ఇక్కడ కర్మ సన్యాసము ఎలా జరగగలదు? అలా అనడము కూడా అసత్యము. గృహస్థులు కర్మలనైతే చేస్తారో, అవి మేము చేయము అని వారంటారు. గృహస్థుల కర్మలైతే చాలా ఉన్నాయి - యజ్ఞ-తపాదులు, తీర్థ యాత్రలు మొదలైనవి చేస్తారు. అవి సన్యాసులు కూడా చేస్తారు. ఇకపోతే, తేడా కేవలం ఇదే, గృహస్థులు సంపాదించి ఇంట్లో వంట చేసుకుంటారు, సన్యాసులు అది చేయరు. వారు యాచించి తింటారు ఎందుకంటే వారిది హఠయోగము. హఠయోగము ద్వారా పరమాత్మను కలుసుకోలేరు. ఎప్పుడైతే తండ్రి వచ్చారో, అప్పుడే వారిని ఎవరైనా కలుసుకోగలుగుతారు మరియు ఎప్పటివరకైతే తండ్రి రారో, అప్పటివరకు పావన ప్రపంచం యొక్క స్థాపన కూడా జరగజాలదు. ఎంతగా అర్థం చేయిస్తారు, అయినా అర్థం చేసుకోరు. ఇంతమంది వచ్చారు అని పిల్లలు సమాచారం రాస్తారు. ఎవరెవరు తమ సౌభాగ్యాన్ని తీసుకుంటారు అనేది ఇప్పుడు చూడాలి. రావడమైతే చాలామంది వస్తారు, కానీ వీరిని చదివించేవారు పరమపిత పరమాత్మ, మనం వారి నుండి సౌభాగ్యాన్ని తీసుకోవాలి అని బుద్ధిలో కూర్చోదు. తండ్రి రిజిష్టర్ ను కూడా చూస్తారు. కొందరు నెలలో 8-10 రోజులు కూడా వస్తారు, కొందరు రారు కూడా, అలాగని ఉత్తరం రాయరు. ఒకవేళ ఎవరైనా రాకపోతే వారు మురళీని చదువుతున్నారా లేదా. ఎటువంటి పరిస్థితిలోనైనా మురళీని రోజూ చదవాల్సి ఉంటుంది. ఎలాగైతే జప్ సాహెబ్, సుఖమని గ్రంథాలను చిన్న-చిన్నగా తయారుచేస్తారు, ఎలాగైనా చదవాలి అని భావిస్తారు. వాటిని చదవడం ద్వారా ఏం ప్రాప్తి ఉంటుందో మీరు అర్థం చేసుకున్నారు. ఏమీ ఉండదు. ఏదో కాస్త సమయం కొరకు బుద్ధి సరిగ్గా ఉంటుంది కానీ తండ్రిని ఎవ్వరూ కలుసుకోలేరు. మళ్ళీ వికారాలలో చిక్కుకుపోతారు, వాటి వలన ప్రాప్తి ఉండదు. వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు, తప్పకుండా ఇప్పుడు ఇది వినాశన సమయము, ఇంకెవ్వరికీ పరమాత్మ గురించి తెలియదు. మాకు రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియదు అని అంటారు కూడా, కానీ డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలుసుకోవాలి కదా. సత్యయుగము ఆది, కలియుగము అంతిమము అని తండ్రి అర్థం చేయిస్తారు. కావున మూడు కాలాలు, మూడు లోకాల గురించి అర్థం చేసుకోవాలి. మూడు లోకాలు ఉన్నాయి - స్థూలవతనము, సూక్ష్మవతనము... శాస్త్రాలు అనాది అని అంటారు కానీ తండ్రి అర్థం చేయిస్తారు, ఎప్పటి నుండైతే రావణరాజ్యం మొదలవుతుందో, అప్పటి నుండి శాస్త్రాలు కూడా మొదలవుతాయి, కావున ద్వాపరయుగము మధ్య కాలం అవుతుంది. అర్ధకల్పం సత్యయుగము, అర్ధకల్పం కలియుగము. సగం సగం లెక్క ఉంది. వారు మధ్య కాలం గురించి తెలుసుకోలేరు ఎందుకంటే కల్పం యొక్క ఆయువు లక్షల సంవత్సరాలు అని అంటారు. వారికి చెప్పాలి, తండ్రిని తెలుసుకోండి, బ్రహ్మాకుమారులు, కుమారీలుగా అవ్వండి, అప్పుడే వారసత్వం లభిస్తుంది. మొదట ఎవరైనా వచ్చినప్పుడు, ఎక్కడికి వచ్చారు అని అడగండి. బి.కె. వద్దకు వచ్చామని అంటారు. మీరు చెప్పండి, ఆలోచించండి - ఇంతమంది బ్రహ్మాకుమారులు, కుమారీలు ఉన్నారు, కనుక బ్రహ్మా తండ్రి కూడా ఉంటారు! ఎన్ని సెంటర్లున్నాయి, లెక్కలేనంతమంది బ్రహ్మాకుమారులు, కుమారీలు ఉన్నారు. ఒక్క తండ్రికి ఇంతమంది పిల్లలు ఎలా ఉండగలరు! ప్రజాపిత అని రాసి ఉంది కనుక ఇంతమంది బ్రహ్మాకుమారులు-కుమారీలు ఉన్నారు. ఇలా-ఇలా అర్థం చేయించి నిలబెట్టాలి. మరి ప్రజాపిత బ్రహ్మా ఎవరి సంతానమో ఆలోచించండి, ఇంతమంది పిల్లలను రచించడమైతే పరమాత్మ పనే కదా. కావున పరమాత్మ వచ్చి ఉండవచ్చు కదా. నీవే తల్లివి, తండ్రివి... అని అంటూ ఉంటారు. కావున తండ్రి బ్రహ్మా అయినట్లు కదా. కావున పరమాత్మ బ్రహ్మా ద్వారా రచిస్తారు, బదిలీ చేస్తారు. వారసత్వాన్ని ఇచ్చేందుకు దత్తత తీసుకుంటారు. పావనంగా ఎలా తయారుచేస్తారు? స్మృతి ద్వారా. అన్ని ధర్మాలను మరిచి నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. నేను నాలెడ్జ్ ఫుల్ ను, బ్లిస్ ఫుల్ ను, లిబరేటర్ ను, గైడ్ ను అని అందరూ పిలుస్తారు. కావున సుఖధామంలోకి తీసుకువెళ్తాను. సుఖం ఎక్కడ ఉంటుంది? సుఖధామంలో ఉంటుంది. ఇప్పుడు తండ్రి శాంతిధామంలోకి తీసుకువెళ్తారు, తర్వాత మీరు సుఖధామంలోకి వస్తారు. విషయాలను ఎలా స్మృతిలో ఉంచుకోవాలి. ప్రతిరోజు చెప్తూ ఉంటే, ఇతరులకు అర్థం చేయిస్తూ ఉంటే పాయింట్లు బుద్ధిలోకి వస్తూ ఉంటాయి. ఇతరులకు అర్థం చేయించేటప్పుడు వారితో రాయించాలి. ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ ఎవరైతే ఉన్నారో - తండ్రి శివుడు అని వారి ఎడ్రస్ ను రాయించాలి, అప్పుడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. కావున శ్రమించాలి, కానీ ఎవరు శ్రమించాలి? అందుకే పిల్లలు తమకు తాముగా నిలబడి మళ్ళీ ఇతరులను కూడా నిలబెట్టాలి మరియు సేవ కొరకు ప్లాన్లు తయారుచేయాలి. ఎలాగైతే మిలట్రీలో పెద్ద కమాండర్లు పరస్పరంలో కలుస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా పిల్లలు కలుసుకోవాలి, కానీ ఏం చేయాలి, పరస్పరంలో అలా కలుసుకోవడం లేదు. వాస్తవానికి బ్రాహ్మణులైన మీకు పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి. ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి అని సలహాలు తీయాలి.

చూడండి, లక్ష్మీ-నారాయణులకు ఎన్ని మందిరాలు ఉన్నాయి. కావున మందిరాలను తయారుచేసేవారిని కలవాలి, మీరు మందిరాన్ని తయారుచేసారు కానీ మీకు తెలుసా, వీరు రాజ్యం ఎలా పొందారు? మళ్ళీ రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నారు? శ్రీకృష్ణుని చిత్రము చాలా బాగుంది, అందులో 84 జన్మల కథ చాలా బాగుంది. కేవలం చిత్రాన్ని పెద్దగా తయారుచేయాలి. బాబా అంటారు, ఎవరైనా వస్తే యుక్తిగా అడగాలి, మీరు గీతను చదివారా? అలా అయితే గీతా భగవంతుడు ఎవరో చెప్పండి. కావున విధంగా యుక్తిగా అర్థం చేయించాలి. నీవే తల్లివి, తండ్రివి... అని అంటారు కదా. కావున బ్రహ్మా తల్లి అయినట్లు, వారితో సంబంధము పెట్టుకోవాలి. ఒకవేళ వారి పట్ల ప్రేమ తొలగిపోయినట్లయితే ఇక ఆట సమాప్తము, తండ్రి నుండి వారసత్వాన్ని ఎలా పొందుతారు. మీ యుద్ధం పాత శత్రువుతో ఉంది. రావణుడితో కూడా యుద్ధం జరుగుతుంది అని ఎవ్వరికీ తెలియదు. సత్యమనే నావ కదులుతుంది కానీ మునగదు అని అంటారు. మరి ఎంతగా కదులుతుంది. ఇతర సత్సంగాలలోనైతే ఇలా కదిలే విషయమే ఉండదు. ఇక్కడ మాయతో యుద్ధం ఉంది. ఎప్పటివరకైతే తండ్రిని అర్థం చేసుకోలేదో, అప్పటివరకు రాసి ఇచ్చినా కానీ, పలికే చిలుకల వలె అవ్వలేరు. అడవి చిలుకలు వస్తాయి మరియు వెళ్ళిపోతాయి. అల్ఫ్ ను అర్థం చేసుకోవాలి. ఇటువంటి ప్రజలైతే చాలామంది ఉన్నారు, ఇకపోతే, రాజ్యం కొరకు ఎవ్వరూ నిలబడరు. దీపంపై బలిహారమైపోవడము, ఇది చాలా కష్టము.

అచ్ఛా - మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాస్

పిల్లలైన మీకు తండ్రి యొక్క డైరెక్షన్ లభించి ఉంది, పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి. బాబా, తీరిక లభించడము లేదు అని పిల్లలు అంటారు. ఇప్పుడు తీరిక ఎక్కడికి వెళ్ళిపోతుంది? తప్పకుండా మాయ మీ సమయాన్ని తీసేసుకుంటుంది. మాయ కూడా చాలా చురుకైనది, అది మీకు తండ్రిని స్మృతి చేసే తీరికను ఇవ్వదు, అందుకే, బాబా, రోజంతటిలో అరగంట, 20 నిముషాలు స్మృతిలో ఉన్నాము అని అంటారు. కొందరో కష్టంగా రోజంతటిలో రెండు గంటలు తండ్రిని స్మృతి చేస్తూ ఉండవచ్చు. మేము రెండు గంటలు స్మృతి చేస్తున్నామని ఎవరైతే భావిస్తారో, వారు చేతులెత్తండి. స్థూలమైన స్మృతి, పాత స్మృతి అయితే కొనసాగుతూనే వస్తుంది. వీరైతే నిరాకారుడు, వీరికి తమ కళ్ళు, చెవులు అయితే లేవు. పిల్లలకు చెబుతారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. కావున ఎన్ని గంటలు స్మృతిలో ఉంటున్నారు అని బాబా అడుగుతున్నారు. పిల్లలు ఆడుకునేందుకు వెళ్ళినప్పుడు టీచరును గుర్తు చేస్తారు. ఇంట్లో చదువుకున్నప్పుడు కూడా టీచర్ స్మృతి ఉంటుంది. అది స్థూలమైన స్మృతి. ఇందులో కొంచెం కష్టము ఉంది, కావున బాబా అడుగుతున్నారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఎవరైతే రెండు గంటలు తండ్రిని స్మృతి చేయగలరో, వారు చేతులెత్తండి. సిగ్గుపడకండి, ఏక్యురేట్ గా చెప్పండి.

మీరు ఇక్కడ కూర్చుంటారు, బాబా మురళీ వినిపించేటప్పుడు బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోతుంది కదా! ఇంతగా బుద్ధిలో ధారణ కూడా జరగదు. ఇక్కడ ఉదయం బాబా ఒక గంట అర్థం చేయిస్తారు, మరి ఒక్క గంట బాబాను స్మృతి చేస్తారా లేక బుద్ధి బయటికి వెళ్ళిపోతుందా? తప్పకుండా నంబరువారు పురుషార్థం అనుసారముగా బుద్ధి ఎక్కడో ఒక చోటుకు వెళ్ళిపోతుంది. మొత్తం వినరు. ఒకవేళ కూర్చొని మొత్తం విన్నట్లయితే మరియు నోట్ చేస్తూ ఉన్నట్లయితే, అవును, వీరి యోగం సరిగ్గా ఉంది అని బాబా అంటారు. కావున వినే సమయంలో అటెన్షన్ పెట్టాలి మరియు పాయింట్లను పూర్తిగా రాయాలి. ఒకవేళ లింక్ తెగిపోతూ ఉన్నట్లయితే పాయింట్లు మర్చిపోతారు.

తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, హార్ట్ ఫెయిల్ యొక్క మృత్యువు చాలా మధురమైన మృత్యువు. ఇందులో నీది, నాది అన్న వలయాలేవీ ఉండవు. కూర్చుంటూ-కూర్చుంటూ పడిపోతారు, స్పృహ పోతుంది, అంతమైపోతారు, అంతే. మళ్ళీ స్పృహ లోకి రానే రారు. ఇది చాలా మంచి మృత్యువు. ఇకపోతే, మనుష్యులు ఏడుస్తూ-రోదిస్తూ ఉంటారు మరియు మీరు సంతోషపడతారు, అరే వాహ్! వీరి మరణం చాలా సహజంగా జరిగింది, వీరికి ఎటువంటి దుఃఖం కలగలేదు. ఒకవేళ మృత్యువు అనేది ఉంటే ఇలా ఉండాలి, లేదంటే మందులు, నర్సులు ఇలా చాలా ఉంటాయి కదా, అందుకే ఎవరైతే కూర్చుని-కూర్చుని తమ పాత చెప్పును వదిలేస్తారో, కర్మాతీత అవస్థను పొందుతారో, అలాగే శరీరము విడిచిపెడితే అది అన్నింటికన్నా మంచిది. మీరు మున్ముందు చూస్తారు, ఆకస్మికంగా బాంబులు వదులుతారు మరియు అందరూ కూర్చుని-కూర్చుని వెళ్ళిపోతారు. వారి ముఖము కూడా హర్షితముగా ఉంటుంది. అప్పుడప్పుడు మంచి మృత్యువును పొందినప్పుడు, చూసేవారు అంటారు - వీరు మెలకువగా ఉన్నట్లే ఉన్నారు, వీరైతే హర్షితముగా ఉన్నారు, వీరు మరణించారని ఎవరూ అనలేరు. ఆత్మ హర్షితముగా వెళ్ళిపోతుంది కదా, మరి ఆత్మలో ఒకవేళ హర్షితత్వము ఉన్నట్లయితే ముఖముపై బయటి నుండే కనిపిస్తుంది కదా! ఆత్మ ఏమీ అంతమైపోదు, ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. కావున చాలా సంతోషముగా శరీరాన్ని నవ్వుతూ వదిలేస్తుంది, దీనిని కర్మాతీత అవస్థ అని అంటారు. వారే ఇంత ఉన్నతముగా గాయనం చేయబడతారు. పిల్లలైన మీరూ ఇలాగే వెళ్ళిపోవాలి, శరీరం యొక్క చింత ఏమీ ఉండకూడదు, ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు, దీనినే అంటారు, అన్నింటికన్నా మధురమైన మృత్యువు, తమంతట తామే శరీరాన్ని విడిచిపెట్టడము, అందుకే సర్పము యొక్క ఉదాహరణ కూడా ఇస్తారు. సత్యయుగంలో ఇలాగే ఉంటుంది, సంతోషంగా శరీరం విడిచిపెడతారు. మరి అభ్యాసం ఇక్కడి నుండే జరుగుతుంది, తర్వాత అభ్యాసం కొనసాగుతూ ఉంటుంది.

పిల్లలైన మీరు తండ్రిని ఎంత ప్రేమగా స్మృతి చేస్తారు. ఆంగ్లంలో మోస్ట్ బిలవడ్, పరమ ప్రియమైనవారు, చాలా మధురమైనవారని అంటారు. మనుష్యులను ఇలా పరమ ప్రియమైనవారు, మోస్ట్ బిలవడ్ అని అనలేరు. తండ్రి అంటారు, పిల్లలూ, నేను మీకు తండ్రిని కూడా, టీచరును కూడా, గురువును కూడా. మీరు ఎప్పుడైనా టీచరును మర్చిపోతే తండ్రిని స్మృతి చేయవచ్చు. బాబా గైడ్, గైడ్ ను పండా అని కూడా అంటారు. వారు దుఃఖము నుండి విముక్తులుగా చేసేవారు, శాంతిధామంలోకి తీసుకువెళ్ళేవారు, తర్వాత సుఖధామం ఉంటుంది. కావున మీకు జ్ఞానమనే గడ్డి లభిస్తుంది, మళ్ళీ దీనిని విచార సాగర మథనము చేస్తూ ఉండండి. ఎలాగైతే ఆవు నోటితో నెమరువేస్తూ ఉంటుందో, మీరు నోటిని కదిలించే అవసరం లేదు, ఇకపోతే, లోలోపల అన్నీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. విధంగా మీరు ఉన్నారో, అలాగే నేనూ ఉన్నాను. నాకైతే ఇంకా తక్కువ గంటలు లభిస్తాయి, ఎందుకంటే నా బుద్ధియోగము బయటికి ఎక్కువగా వెళ్తుంది, ఎప్పుడైనా, ఫలానావారి మధ్య గొడవ ఉంది, అది ఉంది, ఇది ఉంది... అని ఉత్తరం వస్తే అప్పుడు రోజంతా అటు వైపు బుద్ధి వెళ్తుంది, కానీ పిల్లలకన్నా ఎక్కువగా బహుశా బాబాకే సహజము ఎందుకంటే శివబాబా పక్కనే తోడుగా ఉంటారు. బాబా భోజనం చేసేందుకు కూర్చున్నప్పుడు, అచ్ఛా, నేను బాబాను స్మృతి చేస్తానని ఆలోచిస్తాను, 2-3 నిముషాలు స్మృతి ఉంటుంది, తర్వాత మర్చిపోతాను. స్మృతి గాలి వలె ఎగిరిపోతుంది, పిల్లలూ, ప్రయత్నించి చూడండి. ఇది సహజముగా ఉన్నా కూడా స్మృతిలో ఉండేందుకు సమయమైతే పడుతుంది కదా. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మరియు దాదా యొక్క హృదయపూర్వకమైన, ప్రియాతి ప్రియమైన ప్రియస్మృతులు మరియు గుడ్ నైట్. మధురాతి-మధురమైన సికీలధే ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పరస్పరంలో చాలా ప్రేమతో ఉండాలి, యుక్తితో ప్రతి ఒక్కరికీ తండ్రి సందేశాన్ని చేరవేయాలి అని అందరూ కలిసి పరస్పరంలో చర్చించుకుని సలహాలు తీయాలి.

2. ఇది వినాశన సమయము, అందుకే ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతినుంచాలి. యోగముతో ఆత్మను పావనంగా తయారుచేసుకోవాలి.

వరదానము:-

స్వరాజ్యంతో పాటు అనంతమైన వైరాగ్య వృత్తిని ధారణ చేసే సత్యాతి-సత్యమైన రాజఋషి భవ
ఒకవైపు రాజ్యము మరియు రెండవ వైపు ఋషి అనగా అనంతమైన వైరాగి. ఇటువంటి రాజఋషికి ఎక్కడా కూడా - స్వయంలో గానీ, వ్యక్తులలో గానీ, వస్తువులలో గానీ... ఆకర్షణ ఉండదు ఎందుకంటే స్వరాజ్యము ఉంది కనుక మనసు-బుద్ధి-సంస్కారము అన్నీ వారి వశంలో ఉంటాయి మరియు వైరాగ్యం ఉంది కనుక పాత ప్రపంచంపై సంకల్ప మాత్రము కూడా ఆకర్షణ ఉండదు, అందుకే స్వయాన్ని రాజఋషిగా భావించడము అనగా రాజుతో పాటు అనంతమైన వైరాగిగా అవ్వడము.

స్లోగన్:-

అన్ని ఆధారాలు తెగిపోవడానికి ముందే ఒక్క తండ్రిని తమ ఆధారంగా చేసుకునేవారే తెలివైనవారు.

 Download PDF

Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala

 

Post a Comment

0 Comments