Header Ads Widget

Header Ads

TELUGU MURLI 20.09.22

 Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala

20-09-2022  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 


<

Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - తండ్రి సమానముగా పతితులను పావనులుగా తయారుచేసే పురుషార్థాన్ని చేయండి, సమయం చాలా విలువైనది, కావున వ్యర్థమైన విషయాలలో మీ సమయాన్ని పాడు చేసుకోకండి’’

ప్రశ్న:-

తండ్రికి పిల్లల యొక్క విషయంపై ఎంతో దయ కలుగుతుంది?

జవాబు:-

చాలా మంది పిల్లలు ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చెప్తూ తమ సమయాన్ని ఎంతగానో వ్యర్థం చేసుకుంటారు. విహరించేందుకు వెళ్ళినప్పుడు తండ్రిని స్మృతి చేసేందుకు బదులు వ్యర్థ చింతన చేస్తారు. తండ్రికి పిల్లలపై ఎంతో దయ కలుగుతుంది. తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోకండి. తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అయ్యేందుకు సత్యమైన హృదయంతో తండ్రిని యుక్తియుక్తంగా స్మృతి చేయండి , అంతేకానీ తప్పదు కదా అని స్మృతి చేయకండి.

భగవానువాచ. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారని పిల్లలు కూడా తప్పకుండా భావిస్తూ ఉండవచ్చు. మనం చాలా పాత విద్యార్థులము. ఎవరూ అలా ఒకే టీచర్ వద్ద చదువుకోరు. 12 నెలలు చదువుకుంటారు, తర్వాత టీచర్ ను మారుస్తారు, కానీ ఇక్కడ ముఖ్యమైన టీచర్ ఎప్పుడూ మారరు. ఇకపోతే, రాజయోగము నేర్పించేందుకు పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు. ఒక్కరితోనైతే పని నడవదు. పావనులుగా అయ్యేందుకు ఎంతమంది పిలుస్తూ ఉంటారు. అందరూ ఒక్కరినే పిలుస్తారు. పావనంగా తయారుచేసే టీచర్ ఒక్కరే. ఆశ్చర్యమేమిటంటే పతితపావనుడిని పిలుస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ద్రౌపది కూడా - వీరు నన్ను వివస్త్రగా చేస్తున్నారు, రక్షించండి అని పిలిచారు కదా. అర్ధకల్పముగా మీరు పిలుస్తూ వచ్చారు. చెప్పండి, మీరందరే పిలిచేవారు కదా. ద్రౌపది ఉదాహరణను ఇచ్చారు కానీ మొత్తం ప్రపంచమంతా పతితమైనదే. పతితులు మరియు పావనులలో రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. పతితులు రాతిబుద్ధి కలవారు, తండ్రి వచ్చి వికారాలన్నింటి పట్ల ద్వేషాన్ని కలిగిస్తారు. ఆత్మనైన నా శరీరము పతితమైనది అని ఆత్మ భావిస్తుంది. శరీరము పతితమైనదని, దీనికి తుప్పు పట్టి ఉన్నదని మీరు కూడా అర్థం చేసుకుంటారు. ఎవరికైతే పావనమైన ఫస్ట్ క్లాస్ శరీరము ఉందో, వారు మొత్తం విశ్వమంతటిపైనా రాజ్యం చేసేవారు, వారిని పారసబుద్ధి కలవారు అని అంటారు. రాతిబుద్ధి కలవారు మరియు పారసబుద్ధి కలవారు అన్న గాయనము కూడా కేవలం భారత్ లోనే ఉంది. కావున పతిత భారత్ ను పావనంగా ఎలా తయారుచేయాలి అని పిల్లలకు ఆలోచన నడవాలి కానీ సర్వీసబుల్ గా ఉన్నవారికి నంబరువారుగా ఆలోచనలు వస్తూ ఉండవచ్చు మరియు పతితుల నుండి పావనులుగా తయారుచేసే పురుషార్థము చేస్తూ ఉండవచ్చు. తండ్రి యొక్క మొదటి కర్తవ్యమే ఇది. తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా తయారుచేసేందుకే తండ్రి వస్తారు. కావున తండ్రికి ఎంత చింత ఉందో, పిల్లలకు కూడా అంత ఉండాలి. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని నా కన్నా ఉన్నతముగా తయారుచేస్తాను. మీకు ఆలోచనలు కూడా ఎక్కువగా నడవాలి. నా కన్నా ఎక్కువ సేవను పిల్లలైన మీరే చేస్తారు కదా. తండ్రి ఏమైనా ప్రదర్శనీ మొదలైనవాటిలో 3-4 గంటలు కూర్చుని అర్థం చేయిస్తారా. తండ్రి పిల్లల మహిమ చేస్తారు కానీ అంతటి సంతోషము లేక యోగము తక్కువగా కనిపిస్తుంది. అందుకే అనంతమైన తండ్రి వీరి ద్వారా చదివిస్తారు, వీరు అందరికన్నా సమీపంగా ఉన్నారు. ఇంతటి సమీపంగా ఉండే బాప్ మరియు దాదాను ఎప్పుడైనా చూసారా? ముఖ్యమైనది ఆత్మే. ఆత్మ వెళ్ళిపోతే శరీరం ఎందుకూ పనికిరాదు. మనుష్య శరీరానికి విలువా ఉండదు. అది ఎందుకూ పనికిరాదు, బూడిదైపోతుంది. జంతువులు మొదలైనవాటివైతే ఎముకలు కూడా పనికి వస్తాయి. అలాగే చర్మం కూడా పనికి వస్తుంది. మనుష్య శరీరంతోనైతే ఏమీ తయారవ్వదు. ఎముకలను నీటిలో కలిపి అంతం చేసేస్తారు. గుర్తులు కూడా మిగలవు. జంతువుల గుర్తులైతే అడవుల్లో పడి ఉంటాయి. మనుష్యులకు సత్యయుగము నుండి మొదలుకుని త్రేతా అంతిమము వరకు విలువ ఉంటుంది. దేవతలుగా ఉండేవారు, అందుకే పూజకు అర్హులుగా ఉన్నారు. తర్వాత పైస అంత విలువ కూడా ఉండదు, అందుకే రాతిబుద్ధి కలవారు అని అంటారు. పనివారి వలె ఉంటారు, ధనము మొదలైనవాటి చింత ఉంటుంది. కానీ అక్కడైతే చాలా నిశ్చింతగా ఉంటారు. కావున తండ్రి అంటారు, మీ శరీరము చాలా విలువైనది, సమయము కూడా విలువైనది, దీనిని వ్యర్థంగా పోగొట్టుకోకండి. వ్యర్థమైన విషయాలలో సమయాన్ని పోగొట్టుకోకండి. మీ ఆత్మను స్మృతి బలంతో సతోప్రధానంగా తయారుచేసుకోవాలి. పావనంగా అయ్యేందుకు ఇంకే ఉపాయమూ లేదు. ఒకే శాస్త్రములో భగవానువాచ అని ఉంది - దానినే శ్రీమత్ భగవద్గీత అని అంటారు. తండ్రి అంటారు - నిరుపేదలైన పిల్లలూ, రండి, మిమ్మల్ని శిరోకిరీటాలుగా తయారుచేస్తాను. తప్పకుండా మనం నిరుపేదలుగా ఉన్నామని మీరు కూడా అర్థం చేసుకున్నారు. ఎంతో ధనవంతులు, పదమపతులు ఉన్నారు, వారి ఫొటో, పేరు మొదలైనవి వేస్తారు కదా. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా ధనవంతులుగా ఉన్నారు. మేము స్థిరమైన, సత్యమైన ధనవంతులము అని మీరు అంటారు. ధనమే మన తోడుగా వస్తుంది. పదమపతులు అన్న పేరు ఉన్నా కానీ, మీ ముందు వారందరూ నిరుపేదలే. సద్గురువైన తండ్రి కూడా మీకు పదమాపదమపతులు అన్న పేరును అవినాశీగా పెట్టారు. మీరు స్వర్గములోని పదమపతులు. వారు నరకములోని పదమపతులు. నరకాన్ని మరియు స్వర్గాన్ని మీరు అర్థం చేసుకుంటారు. రాతిబుద్ధి కలవారు అస్సలు అర్థం చేసుకోరు. మున్ముందు మీ వద్దకు వస్తారు, ఎప్పుడైతే వినాశనాన్ని చూస్తారో, ఇక పాత ప్రపంచ వినాశనం జరిగిపోతుందని భావిస్తారు. అప్పుడు బ్రహ్మాకుమార-కుమారీలు చెప్పింది నిజమే అని అంటారు. అచ్ఛా! అప్పుడేమి చేయాలి? ఏమీ చేయలేరు. ధనము మొదలైనవన్నీ తగలబడిపోయి అంతా అంతమైపోతుంది. బాంబులు మొదలైనవి పడడంతో ఇళ్ళూ, ఆస్తులు మొదలైనవన్నీ అంతమైపోతాయి. శరీరాలు కూడా అంతమైపోతాయి. చాలా భయంకరమైన దృశ్యము రావడం మీరు చూస్తారు. సమయంలో జ్ఞానంలోకి రాలేరు. ఇప్పుడు విషయాలను భగవంతుడు కూర్చుని అర్థం చేయిస్తారు.

భగవంతుడి నుండి చదువుకునేందుకు మనం వచ్చామని పిల్లలకు తెలుసు. కావున మీరెంత అదృష్టవంతులు. నిశ్చయం కూడా అందరికీ లేదు, నిశ్చయం ఉన్నట్లయితే భగవంతుడి నుండి ఎందుకు చదువుకోరు. రాత్రింబవళ్ళు దీపాలు వెలిగించుకుని, తమను తాము పట్టించుకోకుండా, భోజనం మానేసి కూడా పూర్తిగా చదువుకోవడంలో నిమగ్నమైపోవాలి. వాహ్, ఇది 21 జన్మల సంపాదన. చదువుకోవడంలో చాలా బాగా నిమగ్నమైపోవాలి. చదువు కూడా ఏమిటి, ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడమే. బాబాకు చాలా దయ కలుగుతుంది. పిల్లలు విహరించేందుకు వెళ్ళినప్పుడు ఒక్కరు కూడా తండ్రి స్మృతిలో ఉండరని బాబాకు తెలుసు. అక్కడి మాటలు, ఇక్కడి మాటలు చాలా మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలకు ఎంతో చింత ఉండాలి. చాలా కొద్ది సమయమే ఉంది. భారత్ ఎంత పెద్దది. ఎంత సేవ ఉంది. మొదట మీ జీవితాన్ని అయితే తీర్చిదిద్దుకోండి. బాబా ఎన్నో సార్లు చెప్తూ ఉంటారు - పిల్లలూ, అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ మాట్లాడకండి. విషయాలను వదిలేయండి, మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోండి. అందరూ పరస్పరం కొట్లాడుకుని మరణించనున్నారు. డ్రామా విధి విధంగా ఉంది. తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవ్వడంలో సమయమైతే పడుతుంది కదా. నేను ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. సత్యమైన హృదయంతో ఎంతో ప్రేమగా యుక్తియుక్తముగా ఐదు నిమిషాలు కూడా కష్టం మీద స్మృతి చేస్తారు. ఎంతో ప్రేమగా స్మృతి చేయవలసి ఉంటుంది. ప్రేమ లేకుండా ఎప్పుడైనా, ఎవరినైనా స్మృతి చేస్తారా? తప్పని పరిస్థితుల్లో స్మృతి చేసేవారు చాలా మంది ఉన్నారు, వారికి ప్రేమతో స్మృతి చేయడమే రాదు. సత్యమైన హృదయంపై భగవంతుడు రాజీ అవుతారు. చూడండి, బాబా ఒకే ఒక మాట చెప్తారు - మన్మనాభవ అనగా స్మృతి చేయండి, అప్పుడు మీ పాపాలన్నీ తొలగిపోతాయి. నేనే మీ స్నేహితుడిని. మిగిలినవారందరూ శత్రువులే. మీరు పరస్పరం ఒకరికొకరు కూడా శత్రువులే. పరస్పరం చాలా కొట్లాడుకుంటూ ఉంటారు, మరి స్నేహితులు ఎలా అవుతారు? తండ్రి అంటారు, ఒకవేళ ఆత్మలందరూ సోదరులే అని భావించినట్లయితే శత్రుత్వమంతా అంతమైపోతుంది. ముక్కు, చెవులు, నోరు... లేకపోతే ఇక శత్రుత్వం ఎవరితో పెట్టుకుంటారు? శరీరాలను అసలు చూడకండి. మీరూ ఆత్మనే, వారూ ఆత్మనే, అప్పుడిక శత్రుత్వమే తొలగిపోతుంది, ఇందులో ఎంతో శ్రమ ఉంది. కష్టపడకుండా ఏమైనా లభిస్తుందా? చదువులో కూడా ఎంత కష్టపడుతూ ఉంటారు. ఇది సహజము కూడా. తండ్రి అంటారు - స్మరిస్తూ, స్మరిస్తూ సుఖాన్ని పొందండి. భక్తి మార్గంలో స్మరిస్తూ, స్మరిస్తూ దుఃఖాన్నే పొందారని కూడా మీకు తెలుసు. ఎవరినైతే స్మరిస్తున్నారో వారి కర్తవ్యము గురించే తెలియదు. ఎంతమందిని స్మరిస్తూ ఉంటారు, హనుమంతుడిని స్మరిస్తారు, గణేశుడిని స్మరిస్తారు... ఒకటేమో స్మరిస్తూ, స్మరిస్తూ సుఖము పొందడము, ఇంకొకటేమో స్మరిస్తూ, స్మరిస్తూ దుఃఖము పొందడము ఎందుకంటే భక్తి అనేది రాత్రి కదా. శివబాబాకు ఏమైనా రాత్రి ఉంటుందా. రాత్రివేళలో ఎదురుదెబ్బలు తినడం జరుగుతుంది. మొదటి నంబర్లో బ్రహ్మా ఎదురుదెబ్బలు తింటారు, వారితోపాటు బ్రాహ్మణులైన మీరు కూడా సహచరులుగా ఉంటారు. బ్రాహ్మణుల కులమంతా ఉంది, ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు వచ్చి స్మరణ ద్వారా సుఖాన్ని పొందుతారు. శివబాబాను స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి అని మీరు అందరికీ చెప్తారు. మీరు ఒక్క తండ్రిని స్మరిస్తారు, మనుష్యులైతే అనేకులను స్మరిస్తూ-స్మరిస్తూ పాపాత్ములుగా అయిపోతారు. మెట్లు దిగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు అర్థ సహితంగా ఒక్క తండ్రినే స్మృతి చేయండి.

తండ్రి అంటారు, నేను వారసత్వాన్ని ఇచ్చేందుకే, పావనంగా తయారుచేసేందుకే వచ్చాను. దీని అర్థమైతే ఉంది కదా. శివబాబా పతితపావనుడు, ఇది ఎవరికీ తెలియను కూడా తెలియదు. వారు వచ్చి ఎలా పావనంగా తయారుచేస్తారు అన్నది ఎవరైనా వచ్చి తెలియజేయాలి కదా. ఇక్కడ మీతోపాటు కూర్చున్నవారికి కూడా పూర్తిగా తెలియదు. మరపింపజేసే మాయ తక్కువైనదేమీ కాదు. బాబా, మేము స్మృతి చేస్తాము కానీ మాయ మరపింపజేస్తుంది అని మీరు స్వయం అంటారు. బాబా అంటారు, అరే, మీరు బాబాను స్మృతి చేయకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది. తండ్రి తప్ప ఇంకెవరైనా వారసత్వాన్ని ఇస్తారా! ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా వారసత్వం దానంతట అదే లభిస్తుంది. రాజ్య స్థాపన జరుగుతుందని, ఇందులో సూర్యవంశీయులుగా కూడా అవుతారని తండ్రి స్పష్టంగా అర్థం చేయిస్తారు. ఎంతమంది మనుష్యుల చెవుల వరకు శబ్దాన్ని చేర్చాలి. బాబా అంటారు, పిల్లలూ - మందిరాలకు వెళ్ళండి, వీధి-వీధిలోకి వెళ్ళి సేవ చేయండి. బాబా భక్తులే దేవతల భక్తులు కూడా. మందిరాలలో లేక సత్సంగాలలో కూర్చుంటారు, బుద్ధి అటూ-ఇటూ వ్యాపార, వ్యవహారాలలోకి, మిత్ర సంబంధీకుల వైపుకు పరిగెత్తుతూ ఉంటుంది, అప్పుడు ధారణ ఏమీ జరగదు. ఇక్కడ కూడా ఏమీ విననే విననివారు, కేవలం కునికిపాట్లు పడుతుండేవారు కొందరు ఉన్నారు. తండ్రినే చూడరు. అరే, ఇటువంటి తండ్రిని అసలు ఎంత బాగా చూడాలి. ఎదురుగా టీచర్ కూర్చుని ఉన్నారు. తండ్రి అంటారు, నేను కర్మేంద్రియాల ద్వారా మిమ్మల్ని చదివిస్తాను. ఆత్మ చదువుకుంటుంది. తండ్రి ఆత్మలతో మాట్లాడుతారు. కళ్ళు, చెవులు, ముక్కు మొదలైనవేమైనా చదువుకుంటాయా? చదువుకునేది ఆత్మ. ప్రపంచంలో విషయం ఎవరికీ తెలియదు ఎందుకంటే దేహాభిమానం ఉంది కదా. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉన్నాయి. తండ్రి అంటారు, ఆత్మను చూడండి, ఇది ఎంత శ్రమతో కూడుకున్న విషయము. కష్టపడకుండా విశ్వాధిపతులుగా ఏమైనా అవుతారా. కష్టపడితేనే విశ్వాధిపతులుగా అవుతారు. అనంతమైన చదువు ఎంత అద్భుతమైనదో చూడండి. చదివించేవారు అనంతమైన తండ్రి. రాజు నుండి పేదవారి వరకు చదువు ద్వారా ఇక్కడే తయారవుతారు. ఎవరు ఎంతగా చదువుకుంటారో మరియు చదివిస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి చదివించేందుకు, పతితుల నుండి పావనులుగా తయారుచేసేందుకే వస్తారు. తండ్రిని అసలు చూడనే చూడకపోతే వారినేమనుకోవాలి! పైసా విలువ చేసే పదవిని పొందుతారు, వెళ్ళి నౌకర్లుగా అవుతారు. రాజు వద్ద నౌకర్లు ఎలా ఉంటారో, అలాగే ప్రజల వద్దా ఉంటారు. ఇద్దరినీ నౌకర్లు అనే అంటారు. చివరిలో ఏదో కాస్త లిఫ్ట్ లభిస్తుంది. దెబ్బలు తిన్నాక రొట్టె ముక్క లభిస్తుంది. అందుకే పురుషార్థం చాలా బాగా ఉండాలి. తండ్రి చెప్పేది ఎంతో ప్రేమగా వినాలి, మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. స్కూల్లో చదువుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి స్కూల్ యొక్క పనులు చేసుకుంటారు. అంతేకానీ వ్యర్థముగా భ్రమించరు కదా. చదువు యొక్క చింత ఉంటుంది. ఇక్కడ ఏమీ అర్థం చేసుకోనివారు కూడా చాలామంది ఉన్నారు. పాత రాతిబుద్ధి కలవారి వలె ఉంటారు. బాబాకు చెందినవారిగా అయి మళ్ళీ కఠినమైన తప్పులు చేసినట్లయితే వంద రెట్ల శిక్ష పడుతుంది. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలూ, సమయాన్ని వృథా చేయకండి, ఇది చాలా పెద్ద గమ్యము. కల్ప-కల్పము మీ పదవి ఇలాగే తయారవుతుంది.

ఇక్కడకు మీరు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు. నౌకర్లుగా అయ్యేందుకు ఏమైనా వచ్చారా. మేము విధంగా అవ్వనున్నాము అని చివర్లో అందరికీ ఖచ్చితముగా సాక్షాత్కారమవుతుంది. ఎవరైతే అసలు ఎవరి కళ్యాణాన్ని చేయరో వారు ఏం పదవిని పొందుతారు అని బుద్ధి కూడా తప్పకుండా చెప్తుంది. కొందరైతే రాత్రింబవళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉంటారు. ప్రదర్శనీలు, మేళాలలో ఎంతో సేవ జరుగుతుంది. బాబా అంటారు, మ్యూజియంలో ఎటువంటి మంచి-మంచి వస్తువులను తయారుచేయాలంటే వాటిని చూసేందుకు మనుష్యులకు మనసు కలగాలి. ఇక్కడ స్వర్గం ఉన్నట్లుగా ఉంది అని భావిస్తారు. సెంటర్లను ఏమైనా స్వర్గమని అంటారా. రోజురోజుకు కొత్త విషయాలు జరుగుతూ ఉంటాయి, చిత్రాలు తయారవుతూ ఉంటాయి. విచార సాగర మథనము జరుగుతూ ఉంటుంది కదా. అర్థం చేయించేందుకే చిత్రాలు మొదలైనవి ఉంటాయి. బాబా ఇప్పుడు మనుష్యులను దైవీ గుణాలు కలవారిగా తయారుచేస్తారు. కావున ఆత్మ కొత్తగా అవుతుంది, అలాగే శరీరము కూడా కొత్తది లభిస్తుంది. కొత్తది అంటే కొత్తదే. కొత్త బట్టలను మార్చి మళ్ళీ పాత బట్టలను ఏమైనా వేసుకుంటారా. భగవంతుడు వచ్చారంటే తప్పకుండా అద్భుతం చేసి చూపిస్తారు కదా. భగవంతుడు స్వర్గ స్థాపన చేసేవారు. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి ఏదైతే వినిపిస్తారో, దానిని ఎంతో ప్రేమగా, ఆత్మాభిమానులుగా అయి వినాలి. ఎదురుగా కూర్చుని తండ్రిని చూస్తూ ఉండాలి. కునికిపాట్లు పడకూడదు. చదువులో ఎంతో అభిరుచి పెట్టుకోవాలి. భోజనాన్ని త్యజించి కూడా చదువును తప్పకుండా చదువుకోవాలి.

2. ఒక్క తండ్రినే సత్యమైన స్నేహితునిగా చేసుకోవాలి, పరస్పరంలో శత్రుత్వాన్ని సమాప్తం చేసుకునేందుకు ఆత్మలమైన మనం సోదరులము అని అభ్యాసం చేయాలి. శరీరాన్ని చూస్తూ కూడా చూడకూడదు.

వరదానము:-

లైట్ స్వరూపము యొక్క స్మృతి ద్వారా వ్యర్థము యొక్క బరువు నుండి తేలికగా ఉండే తీవ్ర పురుషార్థీ భవ
ఎవరైతే తమ అసలైన లైట్ స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో, వారిలో వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసే శక్తి ఉంటుంది. వారు వ్యర్థ సమయాన్ని, వ్యర్థ సాంగత్యాన్ని, వ్యర్థ వాతావరణాన్ని సహజంగా పరివర్తన చేసి డబల్ లైట్ గా ఉంటారు. దానితో పాటు బ్రాహ్మణ పరివారము యొక్క సంబంధంలో, సేవా సంబంధంలో కూడా తేలికగా ఉంటారు. వారికి పాత సంస్కారాలతో గాని, పాత ప్రపంచంతో గాని సంబంధము ఉండదు. వారికి దేహధారి వ్యక్తి లేక వస్తువు వైపు ఆకర్షణ ఉండదు. ఇటువంటి తీవ్ర పురుషార్థీ పిల్లలు సహజంగానే ఫరిశ్తా స్థితిని ప్రాప్తి చేసుకుంటారు.

స్లోగన్:-

నిశ్చింత చక్రవర్తిగా అవ్వాలంటే తనువు-మనసు-ధనములను ప్రభువుకు సమర్పించండి.

 

 Download PDF

Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala

Post a Comment

0 Comments