Header Ads Widget

Header Ads

TELUGU MURLI 29.07.22

 Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala

29-07-2022  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - మీరు మీ తోటివారిని ఉద్ధరించాలి, తండ్రి మాతలపై జ్ఞాన కలశాన్ని పెట్టారు, అందుకే మాతలపై చాలా పెద్ద బాధ్యత ఉంది’’

ప్రశ్న:-

మాతలైన మీరు ఏ విశేష కర్తవ్యానికి నిమిత్తులుగా ఉన్నారు? మీపై ఏ బాధ్యత ఉంది?

జవాబు:-

మీరు ఈ పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచముగా, నరకాన్ని స్వర్గముగా తయారుచేయడానికి నిమిత్తులుగా ఉన్నారు. తండ్రి మాతలైన మీపై జ్ఞాన కలశాన్ని పెట్టారు, అందుకే అందరికీ సద్గతినిచ్చే బాధ్యత మీపై ఉంది. మీరు శివశక్తి సైన్యము. మీరు ఇప్పుడు మీ తోటివారి కళ్యాణము చేయాలి. అందరినీ పతితముగా అవ్వడము నుండి రక్షించాలి. వేశ్యలను కూడా ఉద్ధరించాలి.

గీతము:-   రాత్రి ప్రయాణీకుడా... (రాత్ కే రాహీ...) 

ఓంశాంతి. పిల్లలు పాటలోని లైన్ ను విన్నారు... ఇప్పుడు వతనము వైపుకు పదండి అనగా సుఖధామము వైపుకు పదండి. సుఖధామము యొక్క స్థాపన కోసం మాతలనే పెట్టడము జరిగింది. జ్ఞానామృత కలశాన్ని మాతలపై పెట్టారు. ఏ విధంగా ప్రారంభోత్సవాన్ని లేక స్థాపన యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటారు కదా, అదే విధంగా పరమపిత పరమాత్మ వైకుంఠం యొక్క ప్రారంభోత్సవాన్ని మాతల ద్వారా చేయిస్తారు. కలశము మాతలపైనే పెడతారు. కనుక ఇప్పుడు కుమార్తెలు నిలబడాలి. శక్తి దళము కదా. తండ్రి పిల్లలపై బాధ్యతను ఉంచుతారు. అంతేకానీ, అందరికీ సద్గతినివ్వండి అని తండ్రి ఏమీ ఈ గురువులపై బాధ్యతను పెట్టలేదు. సద్గతినివ్వడము ఈ మాతల పని అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. సద్గతి అనేది జ్ఞానము ద్వారా లభిస్తుంది. జ్ఞాన కలశము మాతలకు లభించింది. మొట్టమొదట జగదంబపై కలశము పెట్టినట్లుగా చూపిస్తారు. శాస్త్రాలలోనైతే లక్ష్మి పేరును పెట్టారు. ఈ విషయంలో తేడా వచ్చింది. మాతలైన మీపై కలశము పెట్టారు. కాళిపై కలశము పెట్టారు. కాళికి మహిమ ఉంది కదా. చిత్రాలైతే అనేకము తయారుచేసారు. కనుక ఇప్పుడు మాతలపై కలశము పెట్టారు ఎందుకంటే ఈ సమయంలో మీ తోటి మాతలు దుర్గతిలో ఉన్నారు. మీరు శివశక్తులుగా పిలవబడతారు. మీరు గుప్త సైన్యము. మీ బుద్ధిలో ఉత్సాహము కలగాలి. మీరు మీ స్వరాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నారు. వందే మాతరం అని కూడా అంటూ ఉంటారు. భారత ఖండము యొక్క పేరు మాత్రమే గాయనము చేయబడుతుంది. భారత మాతకు జై అని అంటారు అనగా భారత్ లో నివసించే మాతలకు జై. ఏ మాతలైతే విశ్వాన్ని స్వర్గంగా తయారుచేస్తారో, అటువంటి మాతలకు జై. వారు ఇది మర్చిపోయి కేవలం భారత మాత అని అంటారు. బాబా, మాతలైన మీ పేరును ప్రఖ్యాతము చేస్తారు. స్వర్గం యొక్క ప్రారంభోత్సవాన్ని చేయిస్తారు. శివబాబా మాతలైన మా ద్వారా విశ్వాన్ని స్వర్గంగా తయారుచేస్తారని మీరంటారు. భీష్మ పితామహుడు మొదలైనవారిపై కూడా మీరు జ్ఞాన బాణాలు వేసారు. కనుక తండ్రి అంటారు, జ్ఞాన బాణాలను వేయడానికి భయపడకండి. చదవాలి, చదివించాలి. సైన్యమైన మీరే నిమిత్తముగా అయ్యారు. మీరు మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ కదా. సరస్వతికి పెద్ద వీణను చూపించారు ఎందుకంటే వారు అందరికన్నా చురుకైనవారు. ఇది ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు మనము నల్లగా ఉన్నవారి నుండి తెల్లగా అవుతున్నామని మీకు తెలుసు. కాళి వద్దకు వెళ్తారు. వారు తల్లి-తల్లి అని అంటూ ఎంతగా ఏడుస్తారంటే ఇక అడగకండి. నిజానికి అక్కడ ఏమీ ఉండదు. కలకత్తాలో కాళికి చాలా మహిమ ఉంది. ఇప్పుడు ఈ బ్రహ్మా అయితే తల్లి కాదు, అందుకే కలశము మళ్ళీ మాతలకు లభిస్తుంది. మీరు తల్లి యొక్క సైన్యము, ఆమెకు తోటివారు. మీరంటారు, బాబా, నేను ఎలా ఉన్నానో, అలా మీకు చెంది ఉన్నాను. వీరు కూడా అంటారు, ఎలా ఉన్నారో, అలా నా వారే, కానీ శ్రీమతముపై నడవాలి. అందరూ ప్రేయసులే. మేము ఈశ్వరునికి చెందినవారమని అందరూ అంటారు. ఇప్పుడు మీకు వివరణ కూడా ఇవ్వడము జరుగుతుంది, శివబాబాకు అందరూ సంతానమే. ఈ విషయాన్ని నిరూపించాలి. అందరికన్నా మొట్టమొదటిది శివుని మహిమ, వారు ఉన్నతోన్నతమైనవారు, వారినే భగవంతుడు అని అంటారు. శివబాబాయే వారసత్వాన్ని ఇస్తారు. వారు నిరాకారుడు, ఆత్మలందరికీ తండ్రి. కావున ఇప్పుడు పిల్లలైన మీరు మీ తోటివారిని ఉద్ధరించాలి. మాతలపైనే మొత్తం బాధ్యత అంతా ఉంది. వందే మాతరం అని తండ్రి కూడా అంటారు, శివుడు బాలకుడు కావున వందే మాతరం అని అనాల్సి ఉంటుంది కదా. వారు మిమ్మల్ని అంటారు, మీరు వారిని అంటారు. ఇది అద్భుతము కదా. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. శివబాబా సాక్షాత్కారము కూడా చేయిస్తారని మీకు తెలుసు. ఇంట్లో కూర్చుని కూడా నెమలి కిరీటధారి యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. కిరీటమైతే అందరికీ ఉంటుంది. ఇది ఒక ట్రేడ్ మార్క్ గా పెట్టేసారు. కృష్ణునికి ఇంత పెద్ద కిరీటాన్ని చూపించారు. నిజానికి ఇంత పెద్ద కిరీటాన్ని ధరించరు. తండ్రి కూర్చుని మాతలకు లక్ష్యము-ఉద్దేశ్యాన్ని సాక్షాత్కారము చేయిస్తారు. మీరు రాకుమారునికి తల్లిగా అవుతారు. కృష్ణుని తల్లిగా అయితే అందరూ అవ్వరు. రాకుమారులు-రాకుమార్తెలైతే చాలామంది ఉంటారు కదా. రాకుమారునికి తల్లి అనగా మహారాణి, మహారాజుగా అవుతారు. మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఎంత బాగుంది. మీ ఒడిలో రాకుమారుడు ఉంటాడు.

కావున పిల్లలైన మీపై చాలా బాధ్యత ఉంది. మీ సంగఠన చాలా పెద్దదిగా ఉండాలి. మెమోరాండము (స్మరణ లేఖ)ను తయారుచేయాలి - మేము శివ శక్తి భారత మాతలము, మేము భారత్ ను కల్పక్రితము కూడా శ్రీమతమనుసారముగా స్వర్గంగా తయారుచేసాము. మాతలు చాలా తెలివైనవారిగా ఉండాలి. ఈ రోజుల్లో విషము కోసము మీ తోటివారికి చాలా దెబ్బలు పడుతున్నాయి. కావున మీరు గర్జించాలి. గవర్నమెంట్ కు చెప్పాలి - మేము కల్ప-కల్పము భారత్ ను పవిత్రత యొక్క బలముతో స్వర్గంగా తయారుచేస్తాము, ఇందులో వీరు మాకు విఘ్నాలు వేస్తున్నారు, మేము పవిత్రంగా ఉండాలనుకుంటున్నాము. మీతో పాటు ఈ పురుషులు కూడా, తప్పకుండా పవిత్రత మంచిది అని అంటారు. మనుష్యులు మందులు మొదలైనవాటిని ఉపయోగించి పిల్లలు జన్మించకుండా ఆపుచేస్తారు. కానీ దీని వలన ఏమీ జరగదు. తండ్రి అర్థం చేయిస్తారు, పవిత్రముగా అవ్వండి. మాతలైన మీతో పాటు సహాయకులైన గోపులు కూడా ఉన్నారు. కుమార్తెలు నిలబడాలి. సత్తా చూపించాలి. భగవంతుడైన తండ్రి పవిత్రంగా అవ్వండి అని చెప్తున్నారని గవర్నమెంట్ కు చెప్పాలి. శివబాబాకైతే అందరూ పిల్లలే, కావున పరస్పరంలో సోదరులు అయినట్లు. తర్వాత ప్రజాపిత బ్రహ్మా యొక్క సంతానము కావున సోదరీ-సోదరులుగా అయ్యారు. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. శివబాబాకు సంతానము, ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలు సోదరీ సోదరులు కావున విషాన్ని ఇచ్చి పుచ్చుకోకూడదు. ఇది యుక్తి. కల్పక్రితము కూడా తండ్రి ఈ విధంగానే పవిత్రంగా తయారుచేసారు. మనము మాయా రావణునిపై విజయము పొందుతాము. ఈ రావణుడే భారత్ కు పెద్ద శత్రువు. రావణుడితో ఓడిపోతే ఓడిపోయినట్లే. రాముడు వచ్చి ఇతడిపై విజయాన్ని ఇప్పిస్తారు. ఇప్పటికీ చాలామందికి పతి మొదలైనవారి పట్ల మోహము అనేది ఎలా ఉందంటే ఇక అడగకండి. ఇప్పుడు మాతలైన మీకు కలశము లభిస్తుంది. మేమైతే స్వర్గ ద్వారాలను తెరుస్తామని అర్థం చేయించాలి. వారు కలశాన్ని లక్ష్మికి చూపించారు. కానీ లక్ష్మి ఉన్నదే పవిత్రముగా. వారు జ్ఞాన కలశాన్ని పెట్టుకుని ఏం చేస్తారు. జ్ఞాన కలశము జగదంబపై ఉంది. ఇప్పుడు పరమపిత పరమాత్మ ఆజ్ఞను జారీ చేసారు - కామము మహాశత్రువు, ఎవరైతే దీనిపై విజయం పొందుతారో, వారే శ్రేష్ఠాచారులుగా అయ్యి స్వర్గానికి యజమానులుగా అవుతారు.

పిల్లలైన మీకు పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి. బ్రహ్మాకుమారీ-కుమారులు సైన్యము అంతా కలిసి ఉన్నట్లు ఉండాలి. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అన్నది కూడా ఎవరికీ తెలియదు. అన్ని సెంటర్ల పిల్లలనైతే పిలవలేరు కూడా. మాతలకు బంధనాలు చాలా ఉంటాయి, పిల్లలను కూడా సంభాళించాలి. లేదంటే పురుషులు రిపోర్టు చేస్తారు. అదే పురుషులు వెళ్ళిపోతే ఇళ్ళు-వాకిళ్ళను ఎవరు సంభాళిస్తారు? వారు హఠయోగము నేర్పిస్తారు, మేము రాజయోగము నేర్పిస్తాము, అందుకే మాకు పరిష్కారము లభించాలి అన్నట్లు మీరు చూపించాలి. బాబా అర్థము చేయించారు, మీరు వేశ్యలకు కూడా ఏమని అర్థం చేయించండి అంటే - ఈ అశుద్ధమైన వ్యాపారాన్ని ఇప్పుడు ఆపు చేయండి, మీరు స్వర్గానికి ద్వారాలుగా అవ్వండి. మీరు ఈ పని చేసి చూపించినట్లయితే మీ పేరు చాలా ప్రసిద్ధమవుతుంది. వారి కళ్యాణము కూడా చేయాలి. ఈ సంగమయుగము ఉన్నదే కళ్యాణకారీ, పవిత్రత కోసం చాలా గట్టిగా మాట్లాడాలి. ఈ వేశ్యలపై దయ చూపించాలి. గవర్నమెంట్ కూడా ఇప్పుడు వారిని ఏదో ఒక పనిలో పెడుతూ ఉంటుంది. మీరు ఎలా అర్థం చేయించాలంటే, బ్రహ్మాకుమార-కుమారీలు వేశ్యలకు కూడా జ్ఞానాన్ని ఇచ్చి ఈ అశుద్ధమైన వ్యాపారము నుండి విడిపిస్తున్నారు అని వార్తాపత్రికలలో కూడా రావాలి ఎందుకంటే కామము మహాశత్రువు, దీని వలనే మీరు పతితముగా, అశుద్ధముగా అవుతారు. ఈ ప్రపంచమే భ్రష్టాచారిగా ఉంది కదా. తండ్రి వచ్చి మాతలను పైకెత్తుతారు. గోపుల పని, సహాయకులుగా అవ్వడము. ఎవరైతే శ్రమిస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. తమ తోటివారిపై దయ చూపించాలి, దీని పేరే వేశ్యాలయము. తండ్రి వచ్చి శివాలయముగా చేస్తారు. వాస్తవానికి ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. తండ్రి ఈ మనుష్య తనువులోకి వచ్చి మీకు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇప్పుడు మనము శ్మశానవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నామని మీకు తెలుసు. ఇది జ్ఞాన మానస సరోవరము. జ్ఞానములో మునకలు వేస్తూ ఉంటారు, అంతేకానీ నీటి యొక్క విషయమేమీ లేదు. తీర్థ యాత్రలకు వెళ్తారు, చాలా శ్రమిస్తూ ఉంటారు. కాలి నడకన వెళ్ళడము, సామాన్లు మొదలైనవి మోయడము, చాలా శ్రమ ఉంటుంది. బాబా మనుష్య తనువులో కూర్చుని జ్ఞాన స్నానము చేయిస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇకపోతే, దేవకన్యలు మొదలైనవారెవ్వరూ లేరు. మిమ్మల్ని జ్ఞాన దేవకన్యలుగా చేసేవారు బాబా. ధారణ చేయాల్సినవి ఎన్ని మంచి-మంచి విషయాలు ఉన్నాయి. కుమార్తెలు నిలబడితే చాలా పని చేయగలరు. వెళ్ళాల్సినది అయితే మాతలైన మీరే. ఎక్కడైతే వేశ్యలున్నారో, వారి సంగఠనను తయారుచేయమని చెప్పండి. పెద్ద-పెద్ద వారికి అర్థం చేయించండి. కానీ, నాకైతే ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు అని బయటకు అంటూ లోపల ఇంకెవరో లాగుతూ ఉండడము, ఇలా కూడా ఉండకూడదు. ఇలా ఉంటే పని అవ్వదు. తండ్రికి సత్యమైన పిల్లలుగా అవ్వాలి. ఆ ప్రసన్నచిత్త ముఖము ఎక్కడ? అరే, అనంతమైన తండ్రిని కలుసుకునేందుకు వెళ్ళేటప్పుడు పరుగు-పరుగున వచ్చి సంతోషంగా కలుసుకోవాలి. మేమైతే వెళ్ళి బాబా ఒడిలో హారముగా అవ్వాలి. అలసిపోకూడదు. మీ స్మృతియే పరుగు. అది దైహిక పరుగు. ఇది మీ ఆత్మిక పరుగు. ముఖము సంతోషంతో వికసించాలి. ఎవరి పతి అయినా తప్పిపోయి మళ్ళీ వచ్చి కలుసుకుంటే ఆ స్త్రీ వీధులలో పిచ్చిదాని వలె పరుగు-పరుగున వచ్చి కలుసుకుంటుంది. వీరేమో అనంతమైన పతులకే పతి. ఇందులో భయపడేది ఏముంది? ఎవరి నుండైతే స్వర్గ వారసత్వము లభిస్తుందో, వారిని పరుగు పరుగున వచ్చి కలుసుకోవాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రికి సత్యమైన పిల్లలుగా అవ్వాలి, లోపల ఒకటి, బయట ఒకటి ఉండకూడదు. స్మృతి యొక్క ఆత్మిక పరుగులో ముందుకు వెళ్ళాలి. ప్రసన్నచిత్తులుగా అవ్వాలి.

2. పరస్పరంలో చాలా-చాలా ప్రేమగా ఉండాలి, శివ శక్తి సైన్యము యొక్క సంగఠనను తయారుచేసి తమ తోటివారిని రక్షించాలి. పవిత్రముగా అయ్యే మరియు తయారుచేసే యుక్తులను రచించాలి.

వరదానము:-

శ్రేష్ఠ స్మృతి ద్వారా సుఖమయ స్థితిని తయారుచేసుకునే సుఖ స్వరూప భవ
స్థితికి ఆధారము స్మృతి. మీరు కేవలం స్మృతి స్వరూపులుగా అయినట్లయితే, స్మృతి రావడముతోనే ఎటువంటి స్మృతినో అటువంటి స్థితి స్వతహాగానే తయారవుతుంది. సంతోషం యొక్క స్మృతిలో ఉన్నట్లయితే స్థితి కూడా సంతోషకరమైనది తయారవుతుంది మరియు దుఃఖాన్ని స్మృతి చేసినట్లయితే దుఃఖపు స్థితి తయారవుతుంది. ప్రపంచంలోనైతే దుఃఖము పెరిగేదే ఉంది, అన్నీ అతిలోకి వెళ్ళనున్నాయి కానీ సుఖ సాగరుని పిల్లలైన మీరు సదా సంతోషంగా ఉండేవారు, దుఃఖాలకు అతీతముగా ఉన్న సుఖ స్వరూపులు, అందుకే ఏం జరుగుతున్నా సరే మీరు సదా ఆనందంలో ఉండండి.

స్లోగన్:-

సమయము రూపీ ఖజానాను వ్యర్థము నుండి రక్షించుకోవడము - ఇదే తీవ్ర పురుషార్థుల గుర్తు.

 

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

‘‘భారత్ యొక్క ప్రాచీన యోగము పరమాత్మ ద్వారా నేర్పించబడినది’’

మన ఈ ఈశ్వరీయ యోగము భారత్ లో ప్రాచీన యోగమనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఈ యోగాన్ని అవినాశీ యోగమని ఎందుకంటారు? ఎందుకంటే ఇది అవినాశీ పరమపిత పరమాత్మ ద్వారా నేర్పించబడినది. యోగాన్ని ఇతర మనుష్యాత్మలు కూడా నేర్పిస్తారు, అందుకే యోగాశ్రమాలు మొదలైనవి తెరుస్తూ ఉంటారు కానీ వారు ప్రాచీన యోగాన్ని నేర్పించలేరు. ఒకవేళ అటువంటి యోగమే ఉండి ఉంటే మరి ఆ బలము ఎక్కడ ఉంది! భారత్ అయితే రోజురోజుకు నిర్బలముగా అవుతూ ఉంది కావున ఆ యోగము అవినాశీ యోగము కాదని దీనితో ఋజువవుతుంది. ఎవరితోనైతే యోగం జోడించాలో, స్వయంగా వారు మాత్రమే అది నేర్పించగలరు. ఇకపోతే, ఇతరులతో యోగం జోడించేదే లేదు అన్నప్పుడు వారు ఎలా నేర్పిస్తారు? ఈ కార్యాన్ని స్వయం పరమాత్మనే చేయగలరు, వారే మనకు పూర్తి భేదాన్ని తెలుపగలరు. ఇకపోతే, అన్నివైపులవారు మేము యోగం నేర్పిస్తామని అంటూ ఉంటారు. సత్యమైన యోగాన్ని అయితే స్వయం పరమాత్మనే నేర్పించి సూర్యవంశమును, చంద్రవంశమును స్థాపన చేసి దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తారని మనకు తెలుసు. ఇప్పుడు ఆ ప్రాచీన యోగము కూడా పరమాత్మ వచ్చి కల్ప-కల్పము మనకు నేర్పిస్తారు. ఆత్మలైన మీరు పరమాత్మనైన నాతో నిరంతరం యోగము జోడించినట్లయితే మీ పాపాలు సమాప్తమవుతాయి. అచ్ఛా - ఓం శాంతి.

 Download PDF

Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala

Post a Comment

0 Comments