Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala
07-09-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
“మధురమైన పిల్లలూ - తండ్రి
శిక్షణలను ధారణ చేసి మీరు గుణవంతులైన పుష్పాలుగా అవ్వాలి, మీకు జ్ఞానం యొక్క
ప్రకాశము లభించింది,
అందుకే
సదా హర్షితంగా ఉండాలి’’
ప్రశ్న:-
పిల్లలైన మీ యొక్క ఏ గుహ్యమైన, రమణీకమైన విషయాలను
మనుష్యులు విని తికమకపడతారు?
జవాబు:-
మీరంటారు - ఇప్పుడు బ్రాహ్మణ కుల భూషణులైన మేము స్వదర్శన
చక్రధారులము. మేము జ్ఞానం యొక్క శంఖ ధ్వనిని చేసేవారము. మేము త్రినేత్రులము, త్రికాలదర్శులము. దేవతలకు
ఏవైతే అలంకారాలు చూపిస్తారో, అవన్నీ మావే. ఈ విషయాలు విని మనుష్యులు
తికమకపడతారు. 2.
మీరంటారు
- తండ్రి తమ నోటి ద్వారా ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తారో - అది శంఖధ్వని. దీనితో మేము
మనుష్యుల నుండి దేవతలుగా అవుతాము. దీనినే మురళీ అని అంటారు. ఇది వెదురు మురళీ
కాదు. ఇవి కూడా చాలా గుహ్యమైన, రమణీకమైన విషయాలు, వీటిని అర్థం
చేసుకోవడానికి మనుష్యులకు కష్టమనిపిస్తుంది.
గీతము:- ఇదే వసంతము... (యహీ బహార్
హై...)
ఓంశాంతి. మధురాతి-మధురమైన ఈశ్వరీయ
సంతానానికి తెలుసు - ఇది మా కోసం అన్నింటికన్నా ఉన్నతమైన వసంత ఋతువు అని. వసంత
ఋతువులో పుష్పాలు మొదలైనవన్నీ వికసిస్తాయి. ఇది అనంతమైన వసంత ఋతువు. మీపై జ్ఞాన
వర్షం కురుస్తుంది. కనుక మీరు ఎండిపోయిన ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇది కూడా
మీకు మాత్రమే తెలుసు,
అది కూడా
నంబరువారు పురుషార్థానుసారంగా. మేము ఈ జ్ఞాన వర్షంతో ముళ్ళ నుండి పుష్పాలుగా
అవుతామని కొంతమంది చాలా సంతోషంగా చెప్తారు. వృక్షం ఎప్పుడైతే పూర్తిగా ఎండిపోతుందో, అప్పుడు ఒక్క ఆకు కూడా ఉండదు.
ప్రతి సంవత్సరం ఈ పరిస్థితి ఏర్పడుతుంది, మళ్ళీ వర్షం కురిసినప్పుడు ఆకులు కూడా
సుందరంగా,
పుష్పాలు
కూడా చాలా సుందరంగా అవుతాయి. కనుక ఈ జ్ఞాన వర్షం యొక్క వసంత ఋతువు ఫస్ట్ క్లాస్
అయినది. ఇప్పుడిది ముళ్ళ ప్రపంచము. వృక్షం ఏమని అంటుందంటే - నేను ముళ్ళ వృక్షంగా
అయ్యాను,
మళ్ళీ
జ్ఞాన వర్షముతో పుష్పాల వృక్షంగా అవుతాను. మీరు ఒక్కొక్కరు చైతన్య వృక్షము కదా.
ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క ప్రకాశం లభించింది, దీనితో మీరు ఉన్నత పదవిని పొందుతారు. మీరు
ఎలా ఉన్నవారి నుండి ఎలా అవుతారు. ఇప్పుడు మేము అపవిత్రమైనవారి నుండి
పవిత్రమైనవారిగా అవుతామని మీకు తెలుసు. విష్ణువు కూడా యుగల్ రూపము కదా.
సాక్షాత్కారము జంట రూపానిది జరుగుతుంది. విష్ణవుకు 4 భుజాలను చూపిస్తారు కదా. కానీ
వారికి జ్ఞానమైతే అసలేమీ లేదు. రెండు రూపాలు కలిసి డ్యాన్స్ చేస్తారు. తండ్రి
అర్థం చేయిస్తారు - దీపావళి జరిగినప్పుడు మహాలక్ష్మి వస్తారు. మీరు ఇరువురినీ
పిలుస్తారు. ముందు లక్ష్మి,
ఆ తర్వాత
నారాయణుడు ఉంటారు. లక్ష్మి రెండు భుజాలు కలవారిగా ఉంటారు. మహాలక్ష్మి నాలుగు
భుజాలు కలవారిగా ఉంటారు. కానీ ఈ విషయాలు ఇప్పుడు మీకు తెలుసు - ఇంతకుముందు అసలు
ఏమీ తెలిసేది కాదు. పూర్తిగా ముళ్ళ వలె ఉండేవారు, ఇప్పుడు పుష్పాలుగా అవుతున్నారు. మనుష్యులను
దేవతలుగా మార్చడానికి భగవంతుడికి ఎంతో సమయం పట్టదు... అని గ్రంథ్ లో కూడా
చెప్పారు. దేవతలు సత్యయుగంలో ఉంటారు. వారు దైవీ గుణాలు కలవారు. ఈ సమయంలోని
మనుష్యులు ఆసురీ గుణాలు కలవారు. మీరు ఈశ్వరీయ గుణాలు కలవారు. ఈశ్వరుడు కూర్చుని
మనల్ని గుణవంతులుగా తయారుచేస్తారు. బాబా శిక్షణలతో మనం సర్వగుణ సంపన్నులుగా...
అవుతాము. భారత్ కు మహిమ ఉంది అనగా భారత్ లో నివసించేవారికి చాలా మహిమను పాడుతారు.
కానీ వారిని ఆ విధంగా తయారుచేసేవారు ఎవరు అన్నది వారికి తెలియదు. పెద్ద-పెద్ద
మందిరాలను నిర్మిస్తారు కానీ వారి కర్తవ్యం గురించి తెలియదు. మీకైతే చాలా ప్రకాశం
లభించింది. మీరు చాలా హర్షితంగా ఉండాలి. అక్కడ కూడా 21 జన్మల కోసం హర్షితంగా
ఉంటారు. మనం 21 జన్మల కోసం పదవి తీసుకునేందుకు చదువు చదువుకుంటామని మీకు తెలుసు.
సంపాదన జ్ఞానము ద్వారా జరుగుతుంది. ఇది గాడ్ ఫాదర్లీ స్టూడెంట్ లైఫ్. సూర్యవంశీ కుటుంబానికి
యజమానులుగా అవుతారు అనగా స్వర్గానికి యజమానులుగా అవుతారు. పావన ప్రపంచంలో కూడా
అందరూ ఒకే విధమైన పదవినైతే తీసుకోరు. కేవలం ఒక్క లక్ష్మీ-నారాయణులే రాజ్యం చేయరు
కదా. ఇది కూడా ఎవరికీ తెలియదు, కేవలం వంశము ఉంటుంది మరియు రాజ్యము కూడా
ఉంటుంది. సూర్యవంశీయులు,
చంద్రవంశీయులు
ఉండేవారు. శివబాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ప్రపంచంవారి బుద్ధిలోనైతే
అంధకారం ఉంది. మీ వద్దనైతే ప్రకాశం ఉంది. పతిత ప్రపంచము మరియు పావన ప్రపంచము
ఉంటాయి. పావన ప్రపంచములో కూడా నంబరువారు పదవులు ఉంటాయి. ప్రజలలో కూడా ఉంటాయి.
అక్కడైతే అందరికీ సుఖమే సుఖం ఉంటుంది. ప్రతి ఒక్కరికీ తమ తమ రాజ్యము, భూములు మొదలైనవి ఉంటాయి. పతిత
ప్రపంచంలో అందరూ పతితంగా ఉన్నారు కానీ వారిలో కూడా నంబరువారుగా ఉన్నారు. ఏ
విధంగానైతే సత్యయుగంలో ఉన్నతోన్నతమైన వంశము లక్ష్మీ-నారాయణులది. రాధే-కృష్ణులు
రాకుమార్తె-రాకుమారుడు,
వారు
స్వయంవరం తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. లక్ష్మీ-నారాయణుల వంశము అని అంటారు.
రాధే-కృష్ణుల వంశము అని అనరు. రాజుల పేరును తీసుకోవడము జరుగుతుంది. ఇంత చిన్న
విషయం కూడా ఎవరికీ తెలియదు. మీ అందరికీ తెలుసు, అది కూడా నంబరువారుగా తెలుసు, రాజధానిలోనైతే నంబరువారు పదవులు
ఉంటాయి కదా. సూర్యవంశీ రాజ్యము ఎక్కడ, మళ్ళీ ప్రజలలో కూడా ఛండాలుడు మొదలైనవారిగా
అవ్వడము ఎక్కడ. పతిత ప్రపంచంలో కూడా నంబరువారుగా ఉంటారు.
ఇప్పుడు
తండ్రి మీకు కర్మ-అకర్మ-వికర్మల గతిని అర్థం చేయిస్తున్నారు. తండ్రి అంటారు, పిల్లలూ, శ్రీమతముపై నడవండి. బాబా ఇంతవరకు
చూడను కూడా చూడనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. పరస్పరంలో చాలా మంచి సేవ
చేస్తున్నారు. తండ్రి పరిచయం ఇస్తూ ఉంటారు. బ్రాహ్మణీలను నియమించకపోయినా కూడా
సెంటరు నడుపుతూ ఉంటారు. సమ్ముఖంలో కలవను కూడా లేదు - అయినా సేవ చేసి తమ సమానంగా
చేస్తున్నారు. సమ్ముఖంలో ఉండేవారు ఇంత సేవ చేయరు. ఆత్మిక యాత్రను నేర్పించాలి కదా.
మీరు ఆత్మిక పండాలు. మీరు కూడా మార్గాన్ని తెలియజేస్తారు. ఓ ఆత్మలూ, తండ్రిని స్మృతి చేయండి. ఆత్మలు, పరమాత్మ చాలాకాలం వేరుగా
ఉన్నారు... అని అంటారు కూడా. అది కూడా లెక్క కదా. చాలా కాలము అని ఋజువు చేసి చెప్తారు
కదా. మీరే అందరికన్నా ఎక్కువకాలం నుండి విడిపోయి ఉన్నారు. సూర్యవంశీ, చంద్రవంశీ కుటుంబానికి
చెందినవారిగా ఉండేవారు,
మళ్ళీ
పునర్జన్మల చక్రంలోకి వస్తూ 84 జన్మలు అయ్యాయి. అది కూడా అందరికీ 84 జన్మలు ఉండవు.
పిల్లలైన మీరు ఈ జ్ఞానం యొక్క ప్రకాశంలో ఉంటారు. ఇది మీ విద్యార్థి జీవితము.
కొందరు గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ మళ్ళీ వేరొక కోర్సును కూడా తీసుకుంటారు.
ఇక్కడిది కేవలం పవిత్రత యొక్క విషయము. తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి
మరియు చదువుకోవాలి కూడా. పవిత్రముగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. పులి పాలు బంగారు
పాత్రలోనే నిలుస్తాయి అని అంటారు కూడా. తండ్రి కూడా అంటారు, పవిత్రత లేకుండా ధారణ జరగదు, అందుకే బాబా అంటారు - ఈ కామము
అనే మహా శత్రువును జయించండి. మీరు పవిత్రంగా అవ్వండి. నన్ను గుర్తించండి, అప్పుడు నేను బుద్ధి తాళాన్ని
తెరుస్తాను. ఎప్పటివరకైతే పవిత్రమైన బ్రాహ్మణ కుల భూషణులుగా అవ్వరో, అప్పటివరకు ధారణ కూడా జరగదు.
బ్రాహ్మణ
కుల భూషణులైన మీరు స్వదర్శన చక్రధారులు, ఇతరులెవ్వరూ ఇది అర్థం చేసుకోలేరు. మనుష్యులు
ఏమని భావిస్తారంటే,
స్వదర్శన
చక్రధారులైతే దేవతులు,
మరి
బ్రాహ్మణ కుల భూషణులైన మేము స్వదర్శన చక్రధారులము అని చెప్తున్నటువంటి వీరెవరు. ఈ
విషయాలను పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. ఇవి చాలా గుహ్యమైన రమణీకమైన విషయాలు.
జ్ఞానం యొక్క శంఖధ్వనిని మీరు చేస్తారు. దేవతలైతే చేయరు. వారు శివబాబా యొక్క శంఖ
ధ్వనిని విని దేవతలుగా అవుతారు. శివబాబా అయితే నాలెడ్జ్ ఫుల్. కానీ వారికి శంఖము ఎలా
చూపిస్తారు. జ్ఞానమైతే తప్పకుండా ఎవరో ఒకరి నోటి ద్వారా ఇస్తారు కదా. దానినే మురళీ
అని అంటారు. అంతేకానీ,
వెదురు
మురళీ ఏమీ కాదు. తప్పకుండా జ్ఞాన మురళీ మ్రోగుతుంది. మనుష్యులైతే ఈ పూజ, భక్తి మొదలైనవి పరంపరగా
కొనసాగుతూ వస్తున్నాయని భావిస్తారు. కానీ పరంపరగా ఏదీ కొనసాగదు. ఈ రక్షాబంధనము
మొదలైనవి పరంపరగా కొనసాగుతూ వస్తున్నాయని అంటారు కూడా. అచ్ఛా, పరంపరగా అంటే ఎప్పటి నుండి? ఇది చెప్పండి కదా. పరమాత్మ ఏమైనా
పతిత ప్రపంచాన్ని రచించారా?
మరి
వారిని పతిత-పావనుడు అని ఎందుకు అంటారు. చదువు యొక్క విషయాలు రోజూ బుద్ధిలోకి
రావాలి. నోరు తెరిచే ప్రాక్టీస్ చేయాలి. మీరైతే చాలామందికి అర్థం చేయించగలరు. తమ
ఉన్నతి కోసం ఏర్పాట్లు చేసుకోవాలి. ఏ విధంగా బాబా అందరికీ మార్గాన్ని
తెలియజేస్తారో,
అలా మనం
ఇతరులకు మార్గాన్ని తెలియజేయాలి, అప్పుడే తండ్రి నుండి వారసత్వాన్ని
పొందుతాము. అంతేకానీ,
విఘ్నాలు
వేస్తే వారసత్వాన్ని పొందలేరు. తండ్రికి చాలా దయ కలుగుతుంది, ఎంతగా అర్థం చేయిస్తారు కానీ
అదృష్టంలో లేదు. ఎన్ని రత్నాలు లభిస్తాయి. రత్నాల విస్తారం కూడా చాలా ఉంటుంది కదా.
రత్నాలలో కూడా చాలా తేడా ఉంటుంది. కొన్నింటి విలువ లక్ష రూపాయలు ఉంటుంది, కొన్నింటి విలువ ఒక్క రూపాయి
ఉంటుంది. ఇవి కూడా అవినాశీ జ్ఞాన రత్నాలు, వీటిని ధారణ చేసి మరియు చేయిస్తే ఎంత ఉన్నత
పదవిని పొందుతారు. పిల్లల నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. బుద్ధి అర్థం
చేసుకుంటుంది కానీ నోటితో చెప్పకపోతే వాటికి విలువ ఏముంటుంది. ఎవరైతే కష్టపడతారో, తమ సమానంగా తయారుచేస్తారో, వారికి ఫలం కూడా చాలా
లభిస్తుంది. ఈ సేవను చేయడము మరియు నేర్పించడము కూడా తక్కువ సేవనా ఏమిటి? మీ బుద్ధిలోకి ఇప్పుడు ప్రకాశము
వచ్చింది. అందరికన్నా పెద్ద షావుకార్లు ఎవరు? 10-12 మంది పేర్లు తీసుకుంటారు. అలాగే, ఈ డ్రామాలో ముఖ్యమైనవారు ఎవరెవరు
అన్నది మీకూ తెలుసు. పరమపిత పరమాత్మ శివుడు క్రియేటర్, డైరెక్టర్, ముఖ్యమైన యాక్టర్.
ఉన్నతోన్నతమైనవారు శివబాబా,
ఆ తర్వాత
సూక్ష్మవతనవాసులు,
స్థూలవతనవాసులు.
ఈ విషయాలన్నీ మీకు ఇప్పుడు తెలుసు. కల్పం ఆయువు లక్షల సంవత్సరాలు కాదు. కల్పం
ఆయువు 5000 సంవత్సరాలే. మనుష్యమాత్రులైతే ఎంత ఘోర అంధకారంలో ఉన్నారు. మీరు ఇప్పుడు
అజ్ఞాన అంధకారము నుండి బయటపడి ఎంతటి ప్రకాశములోకి వచ్చారు. కొందరు ప్రకాశములోకి
వచ్చారు,
కొందరు
ఇంకా అంధకారములోనే పడి ఉన్నారు. ఇందులో మొత్తమంతా బుద్ధికి సంబంధించిన విషయము.
కొందరు విశాల బుద్ధి కలవారైతే వెంటనే అర్థం చేసుకుంటారు. ఆత్మ అయితే నక్షత్రం వలె
ఉంటుంది. పెద్ద వస్తువైతే భృకుటి మధ్యలో నిలవ లేదు కూడా. తప్పకుండా అది ఈ కనులకు
కనిపించని వస్తువై ఉంటుంది. పెద్ద వస్తువైతే కనిపిస్తుంది. ఆత్మ అయితే అతి
సూక్ష్మమైనది,
బిందువు
వలె ఉంటుంది. ఇవి గుహ్యాతి గుహ్యమైన విషయాలు. ప్రారంభంలో అఖండ జ్యోతి తత్వము అని
అనేవారు. ప్రారంభంలోనే నక్షత్రము అని చెప్తే అర్థం చేసుకోలేకపోయేవారు. మొత్తం
జ్ఞానాన్ని ఒక్క రోజులోనే ఇస్తారా ఏమిటి. రోజు రోజుకు గుహ్యమైన విషయాలను తండ్రి
వినిపిస్తారు. జ్ఞాన సాగరుడి నుండి అపారమైన ధనం లభిస్తుంది. ఎప్పటివరకైతే
జీవించాలో,
అప్పటివరకు
జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. ఇది నీటి విషయం కాదు. జ్ఞాన సాగరుడి నుండి జ్ఞాన
గంగలు వెలువడుతాయి. అదైతే నీటి సాగరము, గంగ అనాది అని అంటారు. ఈ స్నానాలు మొదలైనవి
కొనసాగుతూ ఉంటాయి. కుమార్తెలు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు గంగ, యమున నదులలోకి వెళ్ళి రాసవిలాసము
చేయడాన్ని మీరు చూసేవారు. ఇక్కడైతే మునిగిపోతామేమో అని భయమనిపిస్తుంది. అక్కడైతే
మునిగిపోవడము మొదలైనవాటి విషయమే ఉండదు. ఎప్పుడూ ప్రమాదాలు జరగవు. కనుక ఇదే వసంతము, ఇప్పుడే మీరు గవ్వ నుండి
వజ్రములా మరియు పతితము నుండి పావనముగా అవుతారు. పావన ప్రపంచం తయారైతే తప్పకుండా
పతిత ప్రపంచం యొక్క వినాశనం జరుగుతుంది. మహాభారతంలోనైతే పూర్తిగా చూపించలేదు.
పాండవులు పర్వతాల పైకి వెళ్ళి కరిగి మరణించారని, వారితో పాటు కుక్కను తీసుకువెళ్ళారని
చూపిస్తారు. పాండవులు కుక్కలను కూడా పెంచుతారా ఏమిటి? మీరైతే కుక్కలను పెంచరు. కుక్కలకు
ఎంత గౌరవాన్ని ఇస్తారు. చాలామంది మనుష్యులు కుక్కలను పెంచుతారు.
పిల్లలైన
మీరు చాలా హర్షితంగా ఉండాలని తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. మీపై నిత్యం
జ్ఞాన వర్షం కురుస్తుంది. బాబా ఎలా వస్తారు అన్నది మీకు తెలుసు. వారు జ్ఞాన
వర్షాన్ని కురిపిస్తారు మరియు భారత్ లోనే వస్తారు, అందుకే భారత్ కు గొప్ప మహిమ ఉంది. భారత్ యే
అవినాశీ ఖండము. భారత్ యే అవినాశీ తండ్రి యొక్క జన్మ స్థలము, ఆ శివబాబా అందరినీ పావనంగా
తయారుచేసేవారు,
వారి
గురించి ఇతురులెవ్వరికీ తెలియదు. పరమాత్మ నామ రూపాలకు అతీతుడు, సర్వవ్యాపి అని వారు అంటారు. ఎన్ని
విషయాలు చెప్పారు. తండ్రి అంటారు, నేను వస్తాను, నేను బ్రాహ్మణులను తప్పకుండా రచించాలి. మేము
బ్రహ్మా సంతానము,
అందుకే
బ్రాహ్మణులుగా చెప్పుకుంటాము అని అంటారు కూడా. కానీ ఈ విషయాలను మర్చిపోయారు -
శివబాబా వచ్చి ఏం చేసారు! బ్రహ్మా ముఖ వంశావళిని ఎలా తయారుచేసారు! శివబాబా
వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. వారు రచయిత కావున తప్పకుండా కొత్త ప్రపంచాన్నే
రచించి ఉంటారు. ఇది కూడా ఎవరికీ తెలియదు. తెలియని కారణంగా నిందిస్తూ ఉంటారు, అందుకే తండ్రి అంటారు - యదా
యదాహి... ఇలా ఎవరు అన్నారు?
శ్రీకృష్ణుడైతే
అనలేదు. శ్రీకృష్ణుని ఆత్మకు కూడా - నేను 84 జన్మలు తీసుకుంటాను అని ఇప్పుడు
తెలిసింది. మీలో ఎవరైతే మొదట పాస్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతారో - వారే మొదటి జన్మను
తీసుకుంటారు. మీ బుద్ధిలో ఎంత ప్రకాశము ఉంది. ఆపరేషన్ చేసినప్పుడు ఒక కన్ను తీసి
మరొక కన్ను పెడతారు,
దానితో
చూపు వస్తుంది. కొందరికైతే లోపము ఉండిపోతుంది కూడా. ఆత్మలైన మీ జ్ఞాన నేత్రము
సమాప్తమైపోయింది - దానిని ఇవ్వడానికి బాబా వచ్చారు. మీ జ్ఞాన నేత్రాలు
తెరుచుకుంటున్నాయి. మూడవ నేత్రము జ్ఞానానికి సంబంధించినది. ఆ మూడవ నేత్రాన్ని
దేవతలకు చూపించారు. అలంకారాలైన చక్రము మొదలైనవి కూడా విష్ణువుకు చూపించారు.
వాస్తవానికి మూడవ నేత్రము బ్రాహ్మణులైన మీది. మీరే సర్వోత్తమ బ్రాహ్మణ కుల
భూషణులు. దైవీ కులము మరియు ఆసురీ కులము ఉంటాయి. వర్ణము అన్నా లేక కులము అన్నా -
విషయము ఒక్కటే,
జ్ఞానము
ఒక్కటే. ఇవి ఎంత మంచి విషయాలు, ఇవి ఏ శాస్త్రాలలోనూ లేవు. మీరు ఇప్పుడు
త్రికాలదర్శులుగా,
త్రినేత్రులుగా, స్వదర్శన చక్రధారులుగా అయ్యారు.
మీరు కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండే పురుషార్థం చేసేవారు. మీకు తెలుసు - కొందరి
నేత్రము బాగా తెరుచుకుంది,
కొందరిది
తెరుచుకుంటూ ఉంటుంది. చివరికి 100 శాతము తెరుచుకుంటుంది. నోటి నుండి జ్ఞాన రత్నాలు
వెలువడుతూ ఉండాలి,
అప్పుడే
రూప్-బసంత్ అని పిలవబడతారు. ఇప్పుడు మీరు కృషి చేయండి. పురుషార్థము చేయాలి, ఎంత వీలైతే అంత - జ్ఞానంలో చాలా
హరితముఖులుగా,
గంభీరంగా, విశాల బుద్ధి కలవారిగా అయి
సుఖాన్ని అనుభూతి చేస్తూ ఉండాలి. స్వర్గ వారసత్వము లభిస్తుంది, ఇంకేమి కావాలి! ఎంత సంతోషము
ఉండాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత,
బాప్
దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ
కొరకు ముఖ్య సారము:-
1. సదా
జ్ఞానం యొక్క ప్రకాశములో ఉండాలి. ఆత్మిక పండాగా అయ్యి అందరికీ మార్గాన్ని
తెలియజేయాలి. నోటి ద్వారా జ్ఞాన రత్నాలే వెలువడాలి.
2.
జ్ఞానాన్ని మననం చేసి సదా హర్షిత ముఖులుగా, గంభీరంగా, విశాల బుద్ధి కలవారిగా అయి సుఖాన్ని అనుభవం
చేయాలి మరియు చేయించాలి.
వరదానము:-
ధనాన్ని సంపాదిస్తూ లేక సంబంధాలను నిర్వర్తిస్తూ దుఃఖాల
నుండి ముక్తులుగా ఉండే నష్టోమోహా, ట్రస్టీ భవ
లౌకిక
సంబంధాల మధ్యన ఉంటూ సంబంధాలను నిర్వర్తించడము వేరే విషయము మరియు వారివైపు
ఆకర్షితులవ్వడము వేరే విషయము. ట్రస్టీగా అయి ధనాన్ని సంపాదించడము వేరే విషయము, ఆకర్షణతో సంపాదించడము, మోహంతో సంపాదించడము వేరే
విషయము. నష్టోమోహాగా ఉన్నవారికి లేక ట్రస్టీగా ఉన్నవారికి గుర్తు ఏమిటంటే దుఃఖము
మరియు అశాంతి యొక్క నామ-రూపాలు ఉండవు. ఎప్పుడైనా సంపాదనలో ధనము కింద-మీద అయినా
లేదా సంబంధాలు నిర్వర్తించడంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా అయినా, అప్పుడు కూడా దుఃఖము యొక్క
అల రాకూడదు. సదా నిశ్చింత చక్రవర్తులు.
స్లోగన్:-
ఎవరైతే బలహీనంగా ఉన్నవారికి ధైర్యాన్ని మరియు బలాన్ని ఇస్తూ
ఉంటారో,
వారినే
దయాహృదయులు అని అంటారు.
Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala


0 Comments