Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala
01-10-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- పరస్పరంలో ఒకరిపై
ఒకరు గౌరవం
ఉంచాలి, మిమ్మల్ని
మీరు అన్నీ
తెలిసినవారిగా భావించకూడదు, ఏ కర్మనైతే
నేను చేస్తానో,
నన్ను చూసి
అందరూ చేస్తారు
అని బుద్ధిలో
ఉండాలి’’
ప్రశ్న:-
ఏ అవస్థను తయారుచేసుకునేందుకు చాలా చాలా కష్టపడాలి?
జవాబు:-
గృహస్థ వ్యవహారములో
ఉంటూ స్త్రీ-పురుష భానము సమాప్తమైపోవాలి,
మనస్సులో కూడా సంకల్ప వికల్పాలు నడవకూడదు. ఆత్మలమైన మనము పరస్పరము సోదరులము, ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలుగా సోదరీ-సోదరులము, ఈ అవస్థను తయారుచేసుకోవడానికి సమయం పడుతుంది. కలిసి ఉంటూ వికారాల అగ్ని అంటుకోకూడదు, అశుద్ధ దృష్టి ఉండకూడదు, ఈ అభ్యాసము చేయాలి. సర్వ సంబంధాల శ్యాక్రిన్ అయిన మాతా-పితలను స్మృతి చేయాలి.
గీతము:- ప్రపంచము మారినా మేము మారము... (బదల్ జాయే దునియా న బదలేంగె హమ్)…
ఓంశాంతి. ఇది పిల్లల గ్యారంటీ లేక ప్రతిజ్ఞ.
ప్రతిజ్ఞ అనేది ఏమీ నోటితో చేయబడదు. ఎప్పుడైతే పిల్లలు తండ్రిని గుర్తిస్తారో, అప్పుడు ప్రతిజ్ఞ దానంతట అదే జరిగిపోతుంది.
ప్రతి ఒక్కరూ పదవిని పొందేందుకు ఎవరికి వారు
(స్వతంత్రంగా) పురుషార్థం చేస్తారు. స్కూల్లో కూడా మేము ఉన్నత పదవిని పొందాలి అని అందరూ ఎవరికి వారు పురుషార్థం చేస్తారు. ఇక్కడ ఆత్మ చదువుకుంటుంది మరియు పరమాత్మ చదివించేందుకు జీవాత్మగా అవుతారు. మరియు వీరిలోకి ప్రవేశించి వీరిని (బ్రహ్మాను)
మరియు బ్రహ్మా ముఖ వంశావళిని చదివిస్తారు. స్వయము బ్రహ్మాను ముఖ వంశావళి అని అనరు. బ్రాహ్మణులే బ్రహ్మా ముఖ వంశావళి. బ్రహ్మా శివుని ముఖ వంశావళి కాదు.
శివబాబా వచ్చి వీరిలోకి ప్రవేశించి తమవారిగా చేసుకుంటారు.
వీరు కూడా రచనయే. మొదట బ్రహ్మాను రచిస్తారు,
విష్ణువును రచించరు.
బ్రహ్మా, విష్ణు మరియు శంకరులు అని అంటూ ఉంటారు కూడా.
విష్ణు, శంకర మరియు బ్రహ్మా అని అనరు.
మొదట బ్రహ్మాను రచిస్తారు. బ్రహ్మా కర్తవ్యము వేరు.
ప్రతి విషయము అర్థం చేసుకోవాల్సినది. వారిని త్వమేవ మాతాశ్చ పితా...
అని అనడం జరుగుతుంది. అయితే వారు నిరాకారుడు కదా. కావున సాకారంలో మాతా-పితలు కావాలి.
మరి మమ్మాకు తల్లి ఉన్నారా అని అప్పుడు అడుగుతారు. అవును,
ఉన్నారు అని అంటాము. బ్రహ్మా,
మమ్మాకు కూడా తల్లి. బ్రహ్మాకు తల్లి ఎవరూ లేరు. ఈ తల్లి (బ్రహ్మా)
స్త్రీ కాదూ కావున సరస్వతిని మమ్మా అని అంటారు. తండ్రి చదివించినప్పుడు వీరు కూడా చదువుకుంటారు.
ఏ విధంగా మీరు విద్యార్థినో అలాగే వీరు కూడా. శివబాబా విద్యార్థి కారు.
పిల్లలైన మీరు బ్రహ్మా పదవిని కూడా చూస్తున్నారు,
వీరు అందరికన్నా ఎక్కువగా చదువుకుంటారు.
వీరు తప్పకుండా సమీపముగా ఉండడాన్ని మీరు చూస్తారు.
మొదట ఎవరి చెవులు వింటాయి?
ఈ బ్రహ్మా అందరికన్నా సమీపముగా ఉన్నారు. కావున మమ్మా, బాబాలు ఎక్కువగా చదువుకుంటారని, ఆ తర్వాత పిల్లలందరూ నంబరువారుగా చదువుకుంటారని అంటారు.
బాబా ఏమంటారంటే,
జగదీశ్ బిడ్డ మమ్మా బాబాల కన్నా కూడా బాగా అర్థం చేయిస్తారు, వారు బాబా మురళిని చదివి, ధారణ చేసి, ఆ తర్వాత గీతా మ్యాగజైన్ మొదలైనవి తయారుచేస్తారు ఎందుకంటే వారు శాస్త్రాలు మొదలైనవి చదివి ఉన్నారు. వారు ఇంగ్లీష్ లో కూడా చురుకైనవారు.
దీనిని గౌరవం ఇవ్వడము అని అంటారు. విద్యార్థులు ఒకరిపై ఒకరు గౌరవమును ఉంచాలి.
బాబా కూడా గౌరవం ఉంచుతారు కదా. కావున తండ్రిని ఫాలో చేయాలి. ప్రస్తుతం ఇంకా ఎవరూ
16 కళల వారిగా అయి ఉండకపోవచ్చు.
నంబరువారుగా ఉంటారు కదా. ఏవో ఒక పొరపాట్లు అందరి ద్వారా జరుగుతూ ఉంటాయి.
అందుకే స్వయాన్ని అన్నీ తెలిసినవారిగా భావించకూడదు. ఎటువంటి కర్మలు తండ్రి చేస్తారో లేక నేను చేస్తానో,
నన్ను చూసి అందరూ చేస్తారు.
కావున ఒకరిపై ఒకరు గౌరవము ఉంచాలి. బాబా కూడా గౌరవమును ఉంచవలసి ఉంటుంది.
వీరు స్త్రీ-పురుషులను సోదరీ-సోదరులుగా చేస్తారు అని మనుష్యులు అంటారు. అప్పుడు తెలివైన బిడ్డ ఎవరైతే ఉంటారో,
వారు వెంటనే అంటారు, అందరమూ పరమాత్ముని పిల్లలమే కావున సోదరీ,
సోదరులు అయినట్లే కదా. ప్రజాపిత బ్రహ్మా పిల్లలు సోదరీ-సోదరులవుతారు కదా. సోదరీ-సోదరులుగా అవ్వడము మంచిది కదా.
బాబాకు పిల్లలుగా అయితే వారసత్వాన్ని తీసుకోగలుగుతారు. శివబాబా నుండి బ్రహ్మాబాబా ద్వారా వారసత్వం లభించనున్నది. కావున బ్రహ్మాకుమార, కుమారీలుగా అవ్వవలసి ఉంటుంది.
ఇక మళ్ళీ ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళకూడదు. లేదంటే అశుద్ధ కర్మ జరుగుతుంది. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు.
పవిత్రముగా ఉండేందుకు యుక్తులను కూడా చెప్తారు. స్త్రీ కూడా బాబా అని అంటారు,
పురుషుడు కూడా బాబా అని అంటారు. కావున స్త్రీ, పురుషుల భానం తొలగిపోతుంది.
ఆదమ్ మరియు బీబీ ద్వారా సృష్టి స్థాపన జరిగింది అని అంటారు కూడా,
మరి అందరూ వారి సంతానమే.
సోదరీ-సోదరులవుతారు.
కుమారీ, కుమారులకు అంత కష్టం కాదు. ఎవరైతే మెట్లు ఎక్కారో వారు దిగవలసి ఉంటుంది. కావున దిగడంలో శ్రమ ఉంది. అలాగని ఇరువురూ వేర్వేరుగా ఉండాలని కాదు.
కేవలం కంపానియన్లుగా (సహచరులుగా) అయి ఉండండి. సత్యయుగములో ఎవరూ అపవిత్రంగా అవ్వరు. మరియు అక్కడ కొడుకు కోసం ఎదురుచూడడం ఉండదు. ఇక్కడ కొడుకు కోసం ఎదురుచూస్తారు. అక్కడ సమయమనుసారముగా దానంతట అదే సాక్షాత్కారమవుతుంది. ఇది ఎలా జరగగలదు అని మనుష్యులు అంటారు.
అక్కడ అందరూ నిర్వికారులుగా ఉంటారని ఇక్కడ ఉన్న సంపూర్ణ వికారులు ఎలా అర్థం చేసుకోగలుగుతారు. అక్కడ దేహాభిమానం ఉండదు.
ఇక్కడ దేహాభిమానం ఉంటుంది. ఎవరైనా దేహం వదిలేస్తే మనుష్యులు ఎంతగా ఏడుస్తారు. అక్కడ ఏడ్వడము ఉండదు.
అక్కడ సమయం వచ్చినప్పుడు శరీరం వదిలి వెళ్ళి యువరాజుగా అవ్వాలి అని సాక్షాత్కారమవుతుంది. మీరు భవిష్యత్తులో వెళ్ళి మహారాజా,
మహారాణిగా అవుతారని ఇక్కడ కూడా మీకు సాక్షాత్కారమవుతుంది. శ్రీకృష్ణుని వంటి బాలుడిని ఒడిలో చూస్తారు. సూర్యవంశీ మహారాజా, మహారాణిగా అవుతారా లేక చంద్రవంశీయులుగా అవుతారా అన్నది సాక్షాత్కారం ద్వారా తెలియదు ఎందుకంటే ఇది పూర్తిగా కొత్త విషయము. అందుకే మొదట తండ్రిని గుర్తించండి అని చెప్పడం జరుగుతుంది.
తండ్రి అంటారు,
నేను ఎంత ప్రియమైనవాడినో చూడండి!
తండ్రి అంటారు,
నేను అన్ని సంబంధాల శ్యాక్రిన్ ను, నన్ను స్మృతి చేయండి అని నేను అంటాను. త్వమేవ మాతాశ్చ పితా...
అని అంటారు.
ఒక్కొక్క విషయములోనూ నిశ్చయం కూర్చోబెట్టాలి. కానీ ఏదో ఒక విషయంలో సంశయం వచ్చేస్తుంది.
ఇక రాజ్య పదవిని పొందలేరు,
అందుకే తండ్రి మన్మనాభవ అని అంటారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు ప్రేయసులవుతారు. వీరు ఆత్మిక ప్రేయసీ-ప్రియులు.
ఆత్మనైన నేను పరమాత్ముని ప్రేయసిని అన్నది పక్కా చేసుకోవాలి. శ్రీకృష్ణుడు అందరికీ ప్రియుడు కాలేరు. శ్రీకృష్ణుడిని అందరూ తలచుకోరు.
మన్మనాభవ అని తండ్రి అంటారు.
ఇప్పుడు నా వద్దకు రావాలి,
నాటకం పూర్తి అవ్వనున్నది, ఇక ఇంటికి వెళ్ళాలి.
కావున ఇల్లు తప్పకుండా గుర్తుకొస్తుంది. ప్రతి విషయము గురించి మురళిలో వివరణ లభిస్తూ ఉంటుంది. పిల్లలు మురళిని నోట్ చేసుకోరు, అందుకే మళ్ళీ అవే విషయాలను బాబాను అడుగుతూ ఉంటారు.
ముఖ్యమైన విషయం ప్రేయసి మరియు ప్రియుడికి సంబంధించినది.
భక్తులందరూ ప్రేయసులు ఎందుకంటే పరమాత్మను తలచుకుంటారు. నాకైతే ఒక్కరు తప్ప ఇతరులెవ్వరూ లేరు అని అంటారు.
పిల్లలైన మీరు ఈ సమయంలో అన్ని కొత్త-కొత్త విషయాలను వింటారు. కానీ వింటూ, వింటూ మాయ చెంపదెబ్బ వేస్తుంది. రావణుడు ఏమైనా తక్కువా.
తండ్రి సర్వశక్తివంతుడు, మాయ కూడా సర్వశక్తివంతమైనది. అర్ధకల్పం మాయ రాజ్యము కొనసాగుతుంది. ఇప్పుడు తండ్రి అంటారు,
పంచ వికారాలను దానమిచ్చినట్లయితే గ్రహణం వదులుతుంది. అయినా అవి ఒక్కసారిగా వదలవు. చాలామంది దానమిచ్చి మళ్ళీ తిరిగి తీసుకుంటారు.
ఇక్కడ ఇది ధనం యొక్క విషయము కాదు,
ఇది వికారాలకు సంబంధించిన విషయము.
సాధు-సన్యాసులు ధనం గురించి
- దానమిచ్చి తిరిగి తీసుకోకూడదు అని అంటారు, ఎందుకంటే అందులో వారి సంపాదన ఉంది.
చాలామంది మనుష్యులు సన్యాసుల వద్దకు వెళ్ళి కొడుకు కావాలి అని అంటారు. మా ఆశీర్వాదంతో అది నెరవేరుతుంది అని వారు అంటారు.
ఒకవేళ కొడుకు పుడితే నేను ఇచ్చాను అని అంటారు. మరణిస్తే అది విధి అని అంటారు.
ఒకవేళ ఎవరైనా ఒకరిది పని జరిగితే చాలామందికి విశ్వాసం కూర్చుంటుంది.
ఇక అలా వారి వృద్ధి జరుగుతుంది. ఒకవైపు తమ మహిమను చేసుకుంటారు, ఇంకొకవైపు విధి అని అంటారు. మీరు ఈ సమయంలో గుప్త యోధులు.
ఆ గుప్త యోధులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ స్మారక చిహ్నాలను తయారుచేస్తారు మరియు పెద్ద-పెద్దవారు అక్కడకు వెళ్తారు.
సైనికులపై పుష్పాలు చల్లండి అని అంటారు. అరే,
ఎవరి గురించైతే అసలు తెలియనే తెలియదో, వారి స్మారక చిహ్నము ఎలా తయారవుతుంది.
ఇప్పుడు మీరు గుప్తముగా ఉన్నారు,
తర్వాత చాలా ప్రసిద్ధులవుతారు. మీ మందిరాలు తయారవుతాయి.
ఇప్పుడు మీరు గుప్తముగానే రామ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అచ్ఛా!
మధురాతి మధురమైన పిల్లలూ - మీరు చాలాకాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు కదా!
మీరు 5,000 సంవత్సరాల తర్వాత కలిసారు. ఎవరి పిల్లలైనా తప్పిపోయి మళ్ళీ దొరికితే ఆ తల్లిదండ్రులకు ఎంత సంతోషం ఉంటుంది. ఆ బిడ్డ కూడా బాబా, బాబా అని అంటూ ఉంటాడు. అలా ఇప్పుడిక వినాశనం జరుగుతుంది మరియు మీరు తప్పిపోతారు అనగా తండ్రి నుండి దూరమైపోతారు.
మళ్ళీ కల్పం తర్వాత తండ్రిని కలుసుకుంటారు, కావున మాతా-పితలకు మీపై ఎంత ప్రేమ ఉంటుంది.
అర్ధకల్పం మీరు సుఖము అనుభవిస్తారు,
తర్వాత మెల్లమెల్లగా దుఃఖితులుగా అవుతారు.
సుఖము కాకిరెట్టతో సమానమైనది అని సన్యాసులు అంటారు కదా. వారు కూడా వికారాల విషయములోనే అలా అంటారు. మురికి పట్టిన వస్త్రాలను శుభ్రం చేసారు అని గురునానక్ కూడా అంటారు,
మరి ఎవరు శుభ్రం చేస్తారు?
వారు ఒక్క పరమాత్మ మాత్రమే,
వారినే ఏక్ ఓంకార్... అని అంటారు. సిక్కులు ఇలా పాడుతూ ఉంటారు. ఈ జ్ఞానములో పిల్లలైన మీ బుద్ధి చాలా చురుకుగా ఉండాలి ఎందుకంటే ఆత్మను మేల్కొలపవలసి ఉంటుంది. తద్వారా ఆత్మ కూడా చురుకైనదిగా అవుతుంది.
కొందరు చాలా మంచి చురుకైన బుద్ధి కలవారిగా అవుతారు. మాతలు,
కన్యలు చాలా బాగా నిలబడతారు.
నిజానికి మాతలు కూర్చొని పతికి అర్థం చేయించాలంటే దానికి ఎంతో ధైర్యము మరియు నిర్భయత కావాలి.
మిగిలినవారంతా నరకవాసులే,
దుర్గతిలో ఉన్నారు.
వారు భక్తిలో ఎంతో నాట్యం చేస్తూ, చప్పట్లు కొడుతూ ఉంటారు కానీ సద్గతి అయితే లభించదు.
పిల్లలైన మీరు సద్గతిలోకి వెళ్ళేందుకు పూర్తిగా మౌనంగా ఉంటారు. నేను లక్ష్మిని వరిస్తాను అని నారదుడు అన్నారు. నిజానికి లక్ష్మిని వరించేందుకే మీరు పురుషార్థం చేస్తున్నారు. భక్తులు వరించలేరు. లక్ష్మీ-నారాయణులకు రాజ్యం ఎలా లభించింది,
ఎప్పుడు లభించింది,
మరియు వారు ఇప్పుడు ఎక్కడకు వెళ్ళారు, ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు కావున మీరు మందిరాలకు వెళ్ళి తల వంచి నమస్కరించరు.
మేమే లక్ష్మీ-నారాయణులుగా అవుతున్నాము అని భావిస్తారు.
మీరు తల వంచి నమస్కరించడం సమాప్తమైపోయింది. వారు అంటారు, ఎవరైతే తల వంచి నమస్కరించరో వారు నాస్తికులు అని.
నిజానికి మీరే ఆస్తికులు, నంబరువారు పురుషార్థానుసారముగా. పరమాత్మ గురించి తెలియని వారే నాస్తికులు.
ఇప్పుడు మీరు సనాథలుగా అయ్యారు,
అయినా మాయ దెబ్బ వేస్తే అనాథలుగా అయిపోతారు.
వృద్ధులైనా కానీ మాయ వారిని కూడా యవ్వనులుగా చేసేస్తుంది. మాయ తుఫానులు వస్తాయి.
మీరు ఒకరి చేతిని ఒకరు పట్టుకొని, సహయోగులుగా అయి ఈ కొత్త యాత్రలో,
తండ్రి శ్రీమతముపై నడుస్తూ ఉండాలి.
మొత్తం ఆధారమంతా బుద్ధి యాత్ర పైనే ఉంది.
అచలముగా, స్థిరముగా అంగదుని వలె అవ్వాలి. చివర్లో ఆ అవస్థ రానున్నది. అచ్ఛా!
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
ఒకరి చేతిని ఒకరు పట్టుకొని సహయోగులుగా అయి తండ్రి శ్రీమతంపై నడుస్తూ ఉండాలి.
సర్వ సంబంధాల శ్యాక్రిన్ అయిన తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి.
2.
ఏ విధంగా తండ్రి పిల్లలు ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇస్తారో,
అలా వారిని ఫాలో చేయాలి.
మీ పెద్దలపై తప్పకుండా గౌరవమును ఉంచాలి.
వరదానము:-
నథింగ్ న్యూ
(కొత్తేమీ కాదు)
అనే పాఠం
ద్వారా విఘ్నాలను
ఆటగా భావిస్తూ
వాటిని దాటి
వేసే అనుభవీ
మూర్త భవ
విఘ్నాలను చూసి భయపడకండి. మూర్తిగా తయారవుతున్నారు
కావున ఎన్నో కొన్ని ఉలి దెబ్బలు అయితే పడతాయి. సుత్తితోనే దెబ్బలు వేస్తూ-వేస్తూ సరిచేస్తారు. కావున ఎంతగా ముందుకు వెళ్తారో, అంతగా తుఫాన్లను ఎక్కువగా దాటాల్సి ఉంటుంది. కానీ మీ కొరకు ఈ తుఫానులు అనుభవజ్ఞులుగా అయ్యేందుకు కానుక వంటివి, అందుకే ఇలా ఆలోచించకండి - అన్ని విఘ్నాల అనుభవాలు నా వద్దకే రావాలా అని. అలా కాదు. వాటిని వెల్కమ్ చేయండి - రండి అని. కొత్తేమీ కాదు యొక్క పాఠాన్ని పక్కా చేసుకున్నట్లయితే
ఈ విఘ్నాలు ఆట వలె అనిపిస్తాయి.
స్లోగన్:-
సత్యత యొక్క విశేషత ఉన్నట్లయితే ఆత్మ రూపీ వజ్రం యొక్క మెరుపు నలువైపులా స్వతహాగా వ్యాపిస్తుంది.
మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు
ఒకవేళ ఎవరైనా ఈ ప్రశ్నను అడిగితే - మనకు ఈ సంగమ సమయంలో ఏ ఈశ్వరీయ జ్ఞానమైతే లభిస్తుందో, అది మళ్ళీ మనకు సత్యయుగంలో లభిస్తుందా?
ఇప్పుడు దీనిపై అర్థం చేయించడం జరుగుతుంది - సత్యయుగంలో మనం స్వయంగా జ్ఞాన స్వరూపులుగా ఉంటాము, దైవీ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటాము, అక్కడ జ్ఞానం ఇచ్చి-పుచ్చుకోవడము ఉండదు.
జ్ఞానం యొక్క అవసరము ఇప్పుడు అజ్ఞానులకు ఉంది.
కానీ అక్కడైతే అందరూ జ్ఞాన స్వరూపులే, అక్కడ జ్ఞానం ఇచ్చే అవసరం ఉండడానికి అజ్ఞానులు ఎవరూ ఉండనే ఉండరు.
ఇప్పుడు ఈ సమయంలో మనకు మొత్తం విరాట డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. ఆదిలో మనం ఎవరిమి,
ఎక్కడి నుండి వచ్చాము మరియు మధ్యలో కర్మ బంధనంలో చిక్కుకొని మళ్ళీ కిందకు ఎలా పడిపోయాము,
అంతిమంలో మనం కర్మ బంధనాల నుండి అతీతమై కర్మాతీత దేవతలుగా అవ్వాలి. ఏ పురుషార్థమైతే ఇప్పుడు నడుస్తూ ఉందో,
దాని ద్వారా మనం భవిష్య ప్రారబ్ధమైన సత్యయుగీ దేవతలుగా అవుతాము.
ఒకవేళ దేవతలమైన మనం పడిపోతాము అని అక్కడ మనకు తెలిస్తే,
ఈ ఆలోచన రావడముతోనే సంతోషం మాయమైపోతుంది, కావున అక్కడ పడిపోవడం గురించి జ్ఞానం ఉండదు. ఈ ఆలోచన అక్కడ ఉండదు. ఈ జ్ఞానం ద్వారా మనకు ఇప్పుడు తెలిసింది - మనం ఎక్కాలి మరియు సుఖమయమైన జీవితాన్ని తయారుచేసుకోవాలి, మళ్ళీ అర్ధకల్పం తర్వాత మన ప్రారబ్ధాన్ని అనుభవించి తర్వాత మళ్ళీ మనల్ని మనం మర్చిపోయి మాయకు వశమై పడిపోతాము. ఇలా ఎక్కడము మరియు పడిపోవడమనేది అనాదిగా తయారై తయారుచేయబడిన ఆట. ఈ మొత్తం జ్ఞానం ఇప్పుడు బుద్ధిలో ఉంది, ఈ జ్ఞానం సత్యయుగంలో ఉండదు.
2-
చాలామంది మనుష్యులు ఏమని భావిస్తారంటే
- మనం ఏ కర్మలనైతే చేస్తామో,
మంచి కర్మలను చేసినా లేక చెడు కర్మలను చేసినా, వాటి ఫలము తప్పకుండా లభిస్తుంది. ఎవరైనా దాన పుణ్యాలు చేస్తే, యజ్ఞాలు-హోమాలు చేస్తే,
పూజలు చేస్తే,
వారు ఏమని భావిస్తారంటే - మేము ఈశ్వరార్థము ఏదైతే దానం చేసామో అది పరమాత్ముని దర్బారులో జమ అవుతుంది, మనం మరణించినప్పుడు ఆ ఫలము తప్పకుండా లభిస్తుంది మరియు మనకు ముక్తి కలుగుతుంది అని.
కానీ ఇలా చేయడము ద్వారా సదా కాలం కోసం లాభమేమీ ఉండదు అని మనం తెలుసుకున్నాము. ఎలాంటి కర్మలు చేస్తారో దాని అనుసారంగా అల్పకాలిక క్షణభంగుర సుఖం యొక్క ప్రాప్తి తప్పకుండా లభిస్తుంది.
కానీ ఎప్పటివరకైతే ఈ ప్రాక్టికల్ జీవితం సదా సుఖమయంగా అవ్వదో,
అప్పటివరకు దాని ఫలితం లభించదు.
ఒకవేళ మనం ఎవరినైనా ఇలా అడిగితే - మీరు ఇదంతా ఏదైతే చేస్తూ వచ్చారో,
ఇది చేయడము వలన మీకు పూర్తి లాభం లభించిందా? ఈ ప్రశ్న విన్నప్పుడు వారు జవాబు చెప్పలేకపోతారు. పరమాత్మ వద్ద జమ అయ్యిందా లేదా అన్నది మనకేం తెలుసు? ఎప్పటివరకైతే మన ప్రాక్టికల్ జీవితంలో కర్మలు శ్రేష్ఠంగా అవ్వవో,
అప్పటివరకు ఎంత శ్రమ చేసినా కానీ ముక్తి-జీవన్ముక్తిని పొందరు.
అచ్ఛా, దాన పుణ్యాలు చేసారు,
కానీ అవి చేయడము వలన వికర్మలేమీ భస్మము అవ్వలేదు, మరి ముక్తి జీవన్ముక్తి ఎలా ప్రాప్తిస్తుంది! ఇంతమంది సన్యాసులు,
మహాత్ములు ఉన్నారు,
ఎప్పటివరకైతే వారికి కర్మల జ్ఞానం ఉండదో, అప్పటివరకు ఆ కర్మలు అకర్మలుగా అవ్వవు,
అలాగే వారు ముక్తి-జీవన్ముక్తిని కూడా పొందరు.
వారికి కూడా
- సత్యమైన ధర్మము ఏమిటి మరియు సత్యమైన కర్మ ఏమిటి అన్నది తెలియదు, కేవలం నోటితో రామ-రామ అని అనడం వలన ముక్తి ఏమీ లభించదు. ఇకపోతే,
మరణించిన తర్వాత మాకు ముక్తి లభిస్తుంది అని ఇలా భావించి కూర్చుంటే అలాంటివారిని తెలివిహీనులు అని అనడం జరుగుతుంది.
మరణించిన తర్వాత ఏం లాభం కలుగుతుంది అన్నది వారికి తెలియనే తెలియదు. ఏమీ లభించదు. ఇకపోతే,
మనుష్యులు తమ జీవితంలో చెడు కర్మలు చేసినా లేక మంచి కర్మలు చేసినా వాటిని కూడా ఈ జీవితంలోనే అనుభవించాలి. శుద్ధ కర్మలు చేసి ఏ విధంగా మన ప్రాక్టికల్ జీవితాన్ని తయారుచేసుకోవాలి అన్న ఈ మొత్తం జ్ఞానమంతా ఇప్పుడు మనకు పరమాత్మ టీచరు ద్వారా లభిస్తుంది.
అచ్ఛా. ఓం శాంతి.
Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala


0 Comments