Header Ads Widget

Header Ads

TELUGU MURLI 21.07.22

  Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala

21-07-2022  ప్రాత:మురళి ఓంశాంతి  "బాప్ దాదా" మధువనం 

Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - సదా సంతోషంగా ఉన్నట్లయితే స్వర్గ రాజ్యాధికారం యొక్క నషాను ఎప్పుడూ మర్చిపోలేరు’’

ప్రశ్న:-

తండ్రి ఎటువంటి అద్భుతమైన అంటును కడతారు?

జవాబు:-

పతిత మనుష్యులను పావన దేవతలుగా తయారుచేయడము - ఈ అద్భుతమైన అంటును తండ్రే కడతారు, ఏ ధర్మమైతే ప్రాయఃలోపమయ్యిందో, దానిని స్థాపన చేయడము, ఇది అద్భుతము.

ప్రశ్న:-

తండ్రి చరిత్ర ఎటువంటిది?

జవాబు:-

తెలివిగా పిల్లలను గవ్వ నుండి వజ్ర తుల్యంగా తయారుచేయడము - ఇది తండ్రి చరిత్ర. ఇకపోతే, కృష్ణుడికైతే ఎటువంటి చరిత్ర లేదు. వారైతే చిన్న బాలుడు.

గీతము:-  రాత్రి ప్రయాణీకుడా... (రాత్ కే రాహీ థక్ మత్ జానా... )

ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలకు తెలుసు, ఈ పాట ఇక్కడ తయారుచేయబడినది ఏమీ కాదు. పాట వింటున్నప్పుడు నిజంగా బాబా మన చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నట్లుగా భావిస్తారు. ఎలాగైతే చిన్న పిల్లలు ఉంటారు, చేయి పట్టుకోకపోతే పడిపోతామని భావిస్తారు, అలాగే ఇప్పుడు మీకు తెలుసు, ఇది ఘోర అంధకారము. ఇబ్బందులే ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. బుద్ధి కూడా చెప్తుంది, ఒక్క బాబా మాత్రమే స్వర్గాన్ని, సత్య ఖండాన్ని స్థాపన చేసేవారు. ఆ సత్యమైన బాబా ఉన్నతోన్నతమైనవారు, ఇతరులను నిశ్చయబుద్ధి కలవారిగా చేసేందుకు వారి మహిమను చేయాల్సి ఉంటుంది. తండ్రి ఉన్నదే స్వర్గాన్ని స్థాపన చేసేవారు అనగా హెవెన్లీ గాడ్ ఫాదర్. వారే పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ అనగా హెవెన్ ను స్థాపన చేసేవారు. తప్పకుండా హెవెన్ ను స్థాపన చేస్తారు, అయితే హెవెన్ కు యజమాని శ్రీకృష్ణుడు. వారు హెవెన్ ను రచించేవారు అయ్యారు మరియు వీరు హెవెన్ యొక్క రాకుమారుడు. రచయిత అయితే ఒక్క బాబానే. హెవెన్లీ ప్రిన్స్ గా అవ్వాలి. కేవలం ఒక్కరైతే ఉండరు. 8 వంశాలు లెక్కించబడతాయి. ఈ నిశ్చయము కూడా ఉంది, బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బాబా హెవెన్ యొక్క రచయిత. మనము ఆ బాబా నుండి కల్ప-కల్పము వారసత్వాన్ని తీసుకుంటాము. 84 జన్మలు పూర్తి చేస్తాము. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దుఃఖము ఉంది. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. ఇప్పుడు మనము మళ్ళీ శ్రీమతముపై నడుచుకుంటూ స్వర్గానికి యజమానులుగా అవుతున్నాము. ఇది మర్చిపోయే విషయము కాదు. లోపల చాలా సంతోషము ఉండాలి. ఆత్మకు లోపల సంతోషం కలుగుతుంది. ఆత్మ యొక్క దుఃఖం లేదా సుఖం ముఖముపై కనిపిస్తుంది. దేవతల ముఖము ఎంత హర్షితముఖముగా ఉంటుంది. వారు స్వర్గానికి యజమానులుగా ఉండేవారని మీకు తెలుసు. అర్థము చేయించేందుకు బాబా బోర్డులు మొదలైనవి తయారుచేయిస్తున్నారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ యొక్క మహిమనే వేరు మరియు హెవెన్లీ ప్రిన్స్ యొక్క మహిమ వేరు. వారు రచయిత, వీరు రచన. పిల్లలైన మీకు అర్థం చేయించేందుకు బాబా యుక్తిగా రాస్తూ ఉంటారు, అప్పుడు మనుష్యులకు మంచి రీతిగా అర్థమవుతుంది. ఎవరినైతే పరమపిత పరమాత్మ అని అంటారో, వారే పతిత-పావనుడు. వారు అనంతమైన రచయిత. రచించడము కూడా తప్పకుండా స్వర్గాన్ని రచిస్తారు. సత్య-త్రేతా యుగాలను మనుష్యులు స్వర్గము అని అంటారు. స్వర్గము మరియు నరకము సగము-సగము ఉంటాయి. సృష్టి కూడా తప్పకుండా సగము సగము, కొత్తగా మరియు పాతదిగా ఉంటుంది. ఆ జడ వృక్షానికి నిర్ణీతమైన ఆయువు ఏమీ ఉండదు. ఈ వృక్షము యొక్క ఆయువు పూర్తిగా నిర్ణీతమై ఉంది. ఈ మనుష్య సృష్టి వృక్షము యొక్క ఆయువు పూర్తిగా ఖచ్ఛితంగా ఉంది. ఇలా ఇంక దేనికీ ఉండదు. ఒక్క క్షణము కూడా తేడా ఉండజాలదు. ఇది వెరైటీ వృక్షము. ఏక్యురేట్ గా తయారై తయారుచేయబడిన డ్రామా. ఈ ఆట 4 భాగాలుగా విభజించబడింది. జగన్నాథపురిలో అండాలలో అన్నాన్ని వండుతారు. అందులో 4 భాగాలుగా ఉంటుంది. ఈ సృష్టి కూడా 4 భాగాలుగా విభజించబడింది. ఇందులో ఒక్క క్షణం కూడా ఎక్కువ తక్కువ అవ్వజాలదు. మీకు తెలుసు, తండ్రి 5 వేల సంవత్సరాల క్రితము కూడా అర్థం చేయించారు. మళ్ళీ అదే విధంగా అర్థం చేయిస్తున్నారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వర్గ స్థాపన చేసే హెవెన్లీ గాడ్ ఫాదర్ మనకు స్వర్గ రాజ్యాన్ని ప్రాప్తి చేయించేందుకు యోగ్యులుగా చేస్తున్నారని మీకు నిశ్చయము ఉంది. బాబా యోగ్యులుగా చేస్తారు, రావణుడు అయోగ్యులుగా చేస్తాడు, దాని వలన భారత్ గవ్వ తుల్యంగా అవుతుంది. బాబా మనల్ని ఎటువంటి యోగ్యులుగా చేస్తారంటే, దాని వలన భారత్ వజ్ర తుల్యంగా అవుతుంది. నంబరువారు పదవులైతే ఉండనే ఉంటాయి. ప్రతి ఒక్కరికీ తమ-తమ కర్మ బంధనము యొక్క లెక్కాచారము ఉంది. కొంతమంది అడుగుతారు, బాబా, మేము వారసులుగా అవుతామా లేక ప్రజలుగా అవుతామా? బాబా చెప్తారు, మీ కర్మ బంధనాలను చూసుకోండి. కర్మ-అకర్మ-వికర్మల గతినైతే తండ్రే అర్థం చేయిస్తారు. బాబా ఎల్లప్పుడూ అంటారు, స్వయం కోసం వేరుగా సలహాను అడగండి. మీ లెక్కాచారాలు ఏ విధమైనవి ఉన్నాయి, మీరు ఏ పదవిని పొందగలరు అన్నది బాబా చెప్తారు. పూర్తి రాజధాని స్థాపన అవుతుంది. ఒక్క తండ్రి మాత్రమే రాజధానిని స్థాపన చేస్తారు. మిగిలినవారంతా తమ-తమ ధర్మాలను స్థాపన చేస్తారు. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది కదా. అది వారి ప్రారబ్ధము, అది కూడా నంబరువారుగా ఉంటుంది. వారు ప్రారబ్ధాన్ని ఎలా పొందుతున్నారు అన్నది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమములో వస్తాను. ఇటువంటి అనేక కల్పము యొక్క సంగమాలు గడిచాయి, గడుస్తూనే ఉంటాయి. దానికి అంతము ఏమీ లేదు. బుద్ధి కూడా చెప్తుంది, పతిత-పావనుడైన తండ్రి సంగమములోనే వస్తారు, పతిత రాజ్యము యొక్క వినాశనము చేయించి, పావన రాజ్యము యొక్క స్థాపన చేయాల్సి వచ్చినప్పుడే వస్తారు. ఈ సంగమానికే మహిమ ఉంది. సత్య-త్రేతా యుగాల సంగమములో ఏమీ జరగదు. అక్కడైతే కేవలం రాజ్యము ట్రాన్స్ఫర్ అవుతుంది. లక్ష్మీ-నారాయణుల రాజ్యము మారి సీతా రాముల రాజ్యము అవుతుంది. ఇక్కడైతే ఎంత హంగామా జరుగుతుంది. తండ్రి అంటారు, ఇప్పుడు ఈ మొత్తం పతిత ప్రపంచమంతా సమాప్తము అవ్వనున్నది. అందరూ వెళ్ళాల్సిందే. తండ్రి అంటారు, నేను అందరికీ మార్గదర్శకునిగా అవుతాను. దుఃఖము నుండి విముక్తులుగా చేసి సదా కోసం శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్తాను. మీకు తెలుసు, మనము సుఖధామములోకి వెళ్తాము. మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్తారు. మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని ఈ సమయంలో మనుష్యులు అంటారు కూడా. సుఖము లభించాలి అని ఈ విధంగా ఎప్పుడూ అనరు. శాంతి కోసమే అంటారు. అందరూ శాంతిలోకే వెళ్తారు, మళ్ళీ తమ-తమ ధర్మాలలోకి వస్తారు. ధర్మము యొక్క వృద్ధి అయితే జరగాల్సిందే. అర్ధకల్పము సూర్యవంశీయుల, చంద్రవంశీయుల రాజధాని ఉంటుంది. తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. ఇప్పుడు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారెవ్వరూ లేరు. ఆ ధర్మమే ప్రాయఃలోపమైపోతుంది, మళ్ళీ స్థాపన అవుతుంది. అంటు కట్టడము జరుగుతుంది. తండ్రే ఈ అంటు కడతారు. వారు వృక్షాలు మొదలైనవాటి అంటును కడతారు. ఈ అంటు ఎంత అద్భుతమైనది. వీరు కూడా స్వయాన్ని దేవీ-దేవతా ధర్మానికి చెందినవాడినని చెప్పుకోరు. తండ్రి అర్థం చేయిస్తారు, ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, అప్పుడు నేను వస్తాను. ఇప్పుడు పిల్లలైన మీకు నేను అన్ని శాస్త్రాల రహస్యాన్ని అర్థం చేయిస్తాను. ఎవరు రైట్ అన్నది ఇప్పుడు మీరే నిర్ణయించండి. రావణుడు ఉన్నదే తప్పుడు మతాన్ని ఇచ్చేవాడు, అందుకే అన్ రైటియస్ అని అంటారు. తండ్రి ఉన్నదే రైటియస్. సత్యమైన తండ్రి సత్యాన్నే తెలియజేస్తారు. సత్య ఖండము కోసం సత్యమైన జ్ఞానాన్ని తెలియజేస్తారు. మిగతా ఈ వేద శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఎంతమంది మనుష్యులు చదువుతారు. లక్షల గీతా పాఠశాలలు లేక వేద పాఠశాలలు ఉంటాయి. జన్మ-జన్మాంతరాల నుండి చదువుతూనే వస్తారు. చివరికి ఏదో ఒక లక్ష్యము-ఉద్దేశ్యమైతే ఉండాలి. పాఠశాల కోసము లక్ష్యము-ఉద్దేశ్యము కావాలి. శరీర నిర్వహణార్థము చదువుకుంటారు, లక్ష్యము-ఉద్దేశ్యము ఉంటుంది. ఏదైతే చదువుతారో, శాస్త్రాలను వినిపిస్తారో, వాటితో శరీర నిర్వహణ జరుగుతుంది. ఇకపోతే, ముక్తి-జీవన్ముక్తిని పొందుతారని లేక భగవంతుడిని పొందుతారని కాదు. మనుష్యులు భగవంతుడిని పొందడము కోసం భక్తి చేస్తారు. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి, ఇక అంతే, భగవంతుడిని పొందాము అని భావిస్తారు, అందులోనే సంతోషిస్తారు. భగవంతుడి గురించైతే తెలియనే తెలియదు. హనుమంతుడు, గణేశుడు అందరిలో భగవంతుడు ఉన్నారని భావిస్తారు, సర్వవ్యాపి జ్ఞానము బుద్ధిలో కూర్చుని ఉంది కదా. బాబా అర్థం చేయించారు - ఎవరు ఏ భావనతో ఎవరి భక్తినైతే చేస్తారో, ఆ భావనను పూర్తి చేసేందుకు నేనే సాక్షాత్కారము చేయిస్తాను. ఇక అంతే, మాకు భగవంతుడే లభించారని వారు భావిస్తారు, సంతోషపడతారు. భక్తుల మాలయే వేరు మరియు జ్ఞాన మాల వేరు. దీనిని రుద్ర మాల అని అంటారు మరియు అది భక్తుల మాల. ఎవరైతే ఎక్కువ జ్ఞానాన్ని పొందారో, ఇది వారి మాల మరియు అది ఎక్కువ భక్తి చేసేవారి మాల. భక్తి యొక్క సంస్కారాన్నే తీసుకువెళ్ళినట్లయితే మళ్ళీ భక్తిలోకే వెళ్తారు. ఆ సంస్కారాలు ఒక్క జన్మ తోడుగా ఉంటాయి. అంతేకానీ, మరుసటి జన్మలో కూడా ఉంటాయని కాదు. అలా కాదు, మీ ఈ సంస్కారాలు అవినాశీగా అయిపోతాయి. ఈ సమయంలో ఏ సంస్కారాలైతే తీసుకువెళ్తారో, మళ్ళీ సంస్కారాల అనుసారంగా వెళ్ళి రాజా-రాణిగా అవుతారు. మళ్ళీ నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గుతూ వస్తాయి. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్నారు. బుద్ధి అక్కడ వేలాడుతూ ఉంది. మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము, కానీ బుద్ధి యోగము అక్కడ ఉంది. ఆత్మకు జ్ఞానము ఉంది, ఇప్పుడు మనం వెళ్తున్నాము. బాబానే స్మృతి చేస్తాము. ఆత్మలైన మనము అతీతంగా వెళ్తున్నాము, ఈ శరీరాలను ఈ తీరములోనే విడిచిపెడతాము. ఈ తీరములో పాత శరీరము ఉంది మరియు ఆ తీరములో సుందరమైన శరీరము ఉంది. ఇది హుస్సేన్ రథము. హుస్సేన్, ఎవరినైతే అకాలమూర్తి అని అంటారో, ఇది వారి సింహాసనము. ఆత్మ అయితే అకాలమైనది. ఆత్మ బంగారము, వెండి వర్ణాలలోకి రావాలి. స్టేజస్ ఉన్నాయి కదా. బాబా అయితే ఉన్నతోన్నతమైనవారు. వారు స్టేజస్ లోకి రారు. ఆత్మలు స్టేజస్ లోకి వస్తాయి. బంగారు యుగమువారు మళ్ళీ వెండి యుగములోకి రావలసి ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇనుప యుగము నుండి బంగారు యుగములోకి తీసుకువెళ్తారు. తమ పరిచయాన్ని ఇస్తూ ఉంటారు. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. వారిది అలౌకిక దివ్య జన్మ, నేను ఎలా ప్రవేశిస్తాను అన్నది స్వయమే చెప్తారు. దీనిని జన్మ అని అనరు. సమయము ఎప్పుడైతే పూర్తవుతుందో, అప్పుడు భగవంతుడికి, ఇప్పుడు వెళ్ళి రచనను రచించాలని సంకల్పము వస్తుంది. డ్రామాలో వారి పాత్ర ఉంది కదా. పరమపిత పరమాత్మ కూడా డ్రామాకు అధీనమై ఉన్నారు. భక్తికి ఫలాన్ని ఇవ్వడమే నా పాత్ర. పరమపిత పరమాత్మను సుఖాన్ని ఇచ్చేవారు అని అంటారు. మంచి కర్తవ్యాలను చేస్తే అల్పకాలము కోసం దాని రిటర్న్ లభిస్తుంది. మీరు అందరికన్నా మంచి కర్తవ్యాన్ని చేస్తారు. అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తారు.

ఇప్పుడు చూడండి, రాఖీ పండుగ వస్తుంది, కావున దీనిపై కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది. రాఖీ ఉన్నదే పతితులు పావనముగా అయ్యే ప్రతిజ్ఞ కోసము. అపవిత్రమైనవారిని పవిత్రముగా చేసే రక్షాబంధనము. మీరు మొట్టమొదట పతిత-పావనుడైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు ఎప్పటివరకైతే రారో, అప్పటివరకు మనుష్యులు పావనంగా అవ్వలేరు. తండ్రే వచ్చి పవిత్రముగా అయ్యే ప్రతిజ్ఞ చేయిస్తారు. తప్పకుండా ఎప్పుడో జరిగింది కనుక ఆచార-వ్యవహారాలు కొనసాగుతూ ఉన్నాయి, ఇప్పుడు ప్రాక్టికల్ గా చూడండి, బ్రహ్మాకుమారులు-కుమారీలు రాఖీ కట్టుకుని పవిత్రముగా ఉంటున్నారు. జంధ్యము, కంకణము మొదలైనవన్నీ కూడా పవిత్రతకు గుర్తులు. పతిత-పావనుడైన తండ్రి చెప్తున్నారు, కామము మహాశత్రువు. మేము పవిత్రముగా ఉంటాము అని ఇప్పుడు నాకు ప్రతిజ్ఞ చేయండి. ఇకపోతే, కంకణాలు మొదలైనవేవీ ధరించకూడదు. తండ్రి అంటారు, ప్రతిజ్ఞ చేయండి, నాకు 5 వికారాలను దానము చేయండి. ఈ రాఖీ బంధనము 5 వేల సంవత్సరాల క్రితము కూడా జరిగింది. అప్పుడు పతిత-పావనుడైన తండ్రి వచ్చారు, వచ్చి పవిత్రంగా అవ్వండి, అని రాఖీ కట్టారు ఎందుకంటే పవిత్ర ప్రపంచం యొక్క స్థాపన జరిగింది. ఇప్పుడైతే నరకము ఉంది. నేను మళ్ళీ వచ్చాను. ఇప్పుడు శ్రీమతమనుసారంగా ప్రతిజ్ఞ చేయండి మరియు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు. ఇప్పుడు పతితులుగా అవ్వకండి. మీరు కూడా చెప్పండి, బ్రాహ్మణులైన మేము ప్రతిజ్ఞ చేయించేందుకు వచ్చాము. మేము ఎప్పుడూ పతితంగా అవ్వము అని మేము ప్రతిజ్ఞ చేస్తాము. కానీ ఇలా రాసి కూడా చాలా మంది సమాప్తమైపోయారు. పతిత-పావనుడైన తండ్రి సంగమములోనే వస్తారు. పవిత్రంగా అవ్వండి అని బ్రహ్మా ద్వారా వచ్చి పిల్లలకు డైరెక్షన్ ఇస్తారు. ఇక్కడ అందరూ ప్రతిజ్ఞ చేసారు. మీరు కూడా నిర్ణయించుకోండి - అప్పుడే తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. మీరు పవిత్ర బ్రాహ్మణులుగా అయినట్లయితే తర్వాత దేవతలుగా అవుతారు. బ్రాహ్మణులైన మనము ప్రతిజ్ఞ చేసాము. ఈ రాఖి బంధనమనే ఆచారము ఎప్పుడు ప్రారంభమయ్యింది అన్నది ఆల్బమ్ కూడా చూపించాలి. ఇప్పుడు సంగమములో పవిత్రతా ప్రతిజ్ఞ చేసారు. మళ్ళీ 21 జన్మల వరకు పవిత్రముగా ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇలాంటి-ఇలాంటి పాయింట్లు తీసి ముందే భాషణ తయారుచేయాలి. ఈ పద్ధతి ఎప్పటి నుండి మొదలయ్యింది? ఇది 5 వేల సంవత్సరాల విషయము. కృష్ణ జన్మాష్టమి కూడా 5 వేల సంవత్సరాల విషయమే. కృష్ణుని చరిత్ర ఏమీ లేదు. వారైతే చిన్న బాలుడు. చరిత్ర అయితే ఒక్క తండ్రికి ఉంది, వారు తెలివిగా పిల్లలను గవ్వ నుండి వజ్ర తుల్యంగా తయారుచేస్తారు. బలిహారము వారొక్కరిదే. ఇంకెవ్వరి జన్మ దినాన్ని జరుపుకోవడము వలన ఉపయోగమేమీ లేదు. ఒక్క పరమపిత పరమాత్మ జన్మదినాన్ని జరుపుకోవాలి, అంతే, మనుష్యులకైతే ఏమీ తెలియదు. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వారసులుగా అయ్యేందుకు తమ అన్ని లెక్కాచారాలను, కర్మ బంధనాలను సమాప్తము చేసుకోవాలి. తండ్రి సలహా ఏదైతే లభిస్తుందో, దానిపైనే నడుచుకోవాలి.

2. అందరికీ తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని ఇచ్చి పతితులను పావనముగా తయారుచేసే శ్రేష్ఠ కర్తవ్యాన్ని చేయాలి. పవిత్రత యొక్క రాఖీ కట్టుకొని పవిత్ర ప్రపంచము యొక్క యజమానత్వపు వారసత్వాన్ని తీసుకోవాలి.

వరదానము:-

పాస్ అనే ఒక్క పదము యొక్క స్మృతి ద్వారా ఏ పేపర్ లోనైనా ఫుల్ పాస్ అయ్యేటువంటి పాస్ విత్ ఆనర్ భవ


ఏ పేపరులోనైనా ఫుల్ పాస్ అయ్యేందుకు ఆ పేపరులోని ప్రశ్నల విస్తారంలోకి వెళ్ళకండి, ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు చేసారు అని ఇలా ఆలోచించకండి. దానికి బదులుగా పాస్ అవ్వాలి అనుకొని, పేపరును పేపరుగా భావిస్తూ దాటివేయండి. కేవలం ఒక్క పాస్ అన్న పదాన్ని స్మృతిలో ఉంచుకోండి - నేను పాస్ అవ్వాలి, దాటివేయాలి మరియు తండ్రికి దగ్గరగా ఉండాలి, అప్పుడు పాస్ విత్ ఆనర్గా అవుతారు.

స్లోగన్:-

స్వయాన్ని పరమాత్మ ప్రేమ వెనుక బలిహారము చేసుకునేవారే సఫలతామూర్తులుగా అవుతారు.

 Download PDF

 Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala

Post a Comment

0 Comments