Header Ads Widget

Header Ads

TELUGU MURLI 20.07.22

 Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala

20-07-2022  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 


Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - మీరు ఆత్మిక సైన్యము, మీరు తప్ప రావణుడి నుండి మొత్తం విశ్వం యొక్క రక్షణ ఇంకెవ్వరూ చేయలేరు, శుద్ధమైన నషాలోనే ఉండాలి’’

ప్రశ్న:-

బాప్ దాదా పిల్లల బలిహారము గురించి మహిమ చేస్తారు?

జవాబు:-

బాబా అంటారు, బలిహారము బంధనములో ఉన్న కుమార్తెలది (అబలలది), వారు దెబ్బలు తింటూ కూడా శివబాబాను స్మృతి చేస్తారు. దెబ్బలు తినడం వలన ఇంకా నష్టోమోహులుగా అవుతూ ఉంటారు, దీని కారణంగా వారి పదవి ఇంకా ఉన్నతంగా అవుతుంది. తండ్రి అటువంటి పిల్లలకు ఓదార్పును ఇస్తారు. పిల్లలూ, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహము మీది కాదు. మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున అవస్థ పక్కాగా అవుతూ ఉంటుంది. సత్యమైన హృదయంపై ప్రభువు రాజీ అవుతారు.

గీతము:-  మిమ్మల్ని పొంది... (తుమ్హే పాకే...) 

ఓంశాంతి. పిల్లలు ఎదురుగా కూర్చున్నారు. వారికి మేము సైన్యము అని తెలుసు కూడా. ఎవరి సైన్యము? ఈశ్వరుని సైన్యము. ఏమి చేస్తున్నారు? మనం రావణునిపై విజయం పొందుతున్నాము. అనగా మొత్తం సృష్టిని రావణ రాజ్యం నుండి విడిపించి మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. ఎంత సాధారణ రీతిలో కూర్చున్నారో చూడండి. చేతులు, కాళ్ళు ఏమీ ఉపయోగించరు కానీ మీరు చాలా శక్తివంతమైన సైన్యము. మీరు ఈశ్వరునికి సహాయకులు. ఈశ్వరుడు కూడా గుప్తంగా ఉన్నారు, మీరు కూడా గుప్తంగా ఉన్నారు. వారిని చక్రవర్తి అని కూడా అంటారు. మీ యుద్ధము ఎంత శక్తివంతమైనది మరియు గుప్తమైనది అంటే, దానితో మీరు వికారాలపై విజయం పొంది మొత్తం విశ్వంపై విజయం పొందుతారు. విధంగా సైన్యము ఉందో, అలాగే మేము కూడా ఆత్మిక సైన్యము అని మీకు అనుభవమవుతుంది. భారత్ యొక్క ఆధారమంతా సైన్యంపై ఉందని మీరు భావిస్తారు. సైన్యమైన మనం లేకపోతే ఇతరులు విజయం పొందేవారు. సైన్యంలోనైతే అప్పుడప్పుడు రాజులు మొదలైనవారిని కూడా పారద్రోలి మిలట్రీ వారు రాజ్యం చేస్తారు. మేము తప్ప ఇంకెవ్వరూ దేశం యొక్క రక్షణ చేయలేరని మిలట్రీ భావిస్తుంది. మీకు కూడా శుద్ధ అహంకారముంది. ఈశ్వరీయ సైన్యమైన మేము తప్ప రావణుడి నుండి ఇంకెవ్వరూ రక్షించలేరు. ఇప్పుడు మిలట్రీని కూడా చూడండి మరియు దీనిని కూడా చూడండి. మీరు ఎలా ఉన్నవారు అలాగే ఉన్నారు. మీ వద్ద డ్రెస్సు గాని లేక ఆయుధాల శక్తి గాని లేదు. వారైతే ఎన్ని డ్రెస్సులు ధరిస్తారు. విధంగానైతే మారువేషాలు వేస్తారు. హోలీలో కూడా మారువేషాలు వేస్తారు. రాముని సైన్యాన్ని కూడా చూపిస్తారు. వారికి కోతి ముఖం చూపించారు. వారు కేవలం బొమ్మలాటను ఆడుతారు. మనం రావణుడి రూపీ 5 వికారాల జైలు నుండి విముక్తిని పొందుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఒకటేమో రావణుడి జైలు, ఇంకొకటి రావణుడి మతంపై నడిచేవారి జైలు. భక్తి సంకెళ్ళు కూడా ఉన్నాయి, గురువుల సంకెళ్ళు ఉన్నాయి, ఆపై పతి యొక్క సంకెళ్ళు కూడా ఉన్నాయి. రావణుడి మతంపై మీరు ఎంత దుఃఖితులుగా అవుతారు. రావణుడు మమ్మల్ని చాలా విసిగిస్తున్నాడని ఎంతగా పిలుస్తారు.

ఎంతెంతగా మనం యోగంలో ఉంటామో, అంతగా మన ఆత్మ దుఃఖం నుండి విముక్తి చెందుతుందని మీకు తెలుసు. అబలలపై అత్యాచారాలైతే చాలా జరుగుతాయి. చాలా దెబ్బలు తింటారు. ఇప్పుడు మేము ఏమి చేయాలి అని అబలలు పిలుస్తారు. అప్పుడు తండ్రి ఓదార్పును ఇస్తారు. ఇదైతే అర్థం చేయించారు - మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహం మనది కాదు. మనం మరణించి ఉన్నాము. తండ్రికి చెందినవారిగా అయ్యాము, ఇంకే ఉపాయము లేదు. మనమైతే శివబాబాకు చెందినవారము. ఎవరైతే సత్యమైన పిల్లలు ఉంటారో, వారి అవస్థ పక్కాగా ఉంటుంది. కొద్దిగా కూడా వికారాల వైపు ఆలోచన వెళ్ళదు. ఇటువంటి పిల్లలపై ఒకవేళ ఎవరైనా బలవంతంగా అత్యాచారం చేస్తే, దాని పాపం వీరికి అంటదు. బాబా, మేమైతే మీ వారము, శరీరము శవం వలె ఉంది అని అంటూ వారు పిలుస్తారు. ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారు ఎవరైతే ఉన్నారో, వారు కూడా చాలా ఉన్నత పదవిని పొందుతారు కానీ ఒకవేళ సత్యమైన హృదయము ఉంటేనే. ఇటువంటి సత్యమైన హృదయంపై ప్రభువు తప్పకుండా రాజీ అవుతారు. దెబ్బలు తినేవారు ఎంతగానైతే స్మృతి చేస్తారో, అంతగా ఇక్కడ ఉండే కుమార్తెలు కూడా స్మృతి చేయరు. తండ్రి వద్దకు పిలుపు వస్తుంది - బంధనముంది, బాబా, బంధనం నుండి విడిపించండి. ఎంతగానైతే బంధనంలో ఉన్నవారు స్మృతి చేస్తారో, అంతగా విముక్తులుగా, బంధనముక్తులుగా ఉన్నవారు కూడా స్మృతి చేయరు. శివబాబా స్మృతితోనే నావ తీరానికి చేరుకుంటుంది. బాబా, మమ్మల్ని మురళి కూడా చదువుకోనివ్వడం లేదు అని కొందరు అంటారు. అరే, మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మురళిలో కూడా రోజూ ఇదే అర్థం చేయించడం జరుగుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్మృతి చార్టును పెట్టండి. మనం బాబాను ఎంత సమయం స్మృతి చేస్తాము. శ్రమను చాలా మంది చేయలేరు. ఘడియ-ఘడియ స్మృతిని మర్చిపోతారు, బంధనంలో ఉన్న కుమార్తెలైతే దెబ్బలు తింటూ-తింటూ ఇంకా ఎక్కువగా స్మృతి చేస్తారు. బలిహారము అబలలది, వారు దెబ్బలు తింటూ కూడా స్మృతి చేస్తారు. బాబా అంటారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎంత ఎక్కువగా కొడతారో, మీరు అంతగా ఇంకా నష్టోమోహులుగా అవుతూ ఉంటారు. దెబ్బలు కూడా మంచి పదవిని తయారుచేస్తాయి. బాబాకు కూడా అలాంటి-అలాంటి కుమార్తెలు గుర్తుకొస్తారు. అయితే కొందరు చాలా మంచి మహారథులు కూడా ఉన్నారు, వారు అనేకుల సేవ చేస్తారు, యోగిగా తయారుచేస్తారు. యోగానికి చాలా మహిమ ఉంది. మీరైతే అందరిపై దయ చూపించాలి.

పిల్లలైన మీరు గీతను రిఫర్ చేస్తారు, వారి బుద్ధిలో కేవలం కృష్ణ భగవానుడు రాజయోగాన్ని నేర్పించారు అన్నదే ఉంది. మీరు అంటారు, పరమపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పించారు. ఇది నిరూపించడానికే మీరు ఇలా అడుగుతారు, పరమపిత పరమాత్మతో మీకేమి సంబంధముంది? తండ్రి అని అంటారు కదా. తండ్రి యొక్క ఆజ్ఞనే ఉంది - నాతో యోగం జోడించినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. మనుష్యమాత్రులతోనూ యోగం జోడించకూడదు. ఒకవేళ నేర్పించేవారే మనిషి అయితే, మీ కళ్యాణం జరగదు. గీతలో కూడా దేహధారి పేరును పెట్టారు. మాకు నిరాకార పరమపిత పరమాత్మ యోగం నేర్పిస్తారని మనం అంటాము. మీరు ఎవరినీ నిందించరు. మీరు తండ్రి మహిమను చేస్తారు. కానీ అర్థం చేయించేవారు చాలా చురుకైనవారు మరియు తెలివైనవారై ఉండాలి ఎందుకంటే అక్కడకు పెద్ద-పెద్ద విద్వాంసులు, పండితులు కూడా చాలా మంది వస్తారు. సన్యాసుల సైన్యము కూడా ఉంది కదా. అందరి హెడ్స్ వస్తారు. పిల్లలైన మీరు ఎంత తెలివైనవారిగా ఉండాలంటే చాలా తక్కువగా మాట్లాడాలి కానీ పూర్తిగా బాణం తగలాలి. ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వారు చాలా క్రోధం కలవారిగా కూడా ఉంటారు. వారిది కూడా పెద్ద సైన్యముంది. ఎక్కడి నుండి ఆహ్వానం వచ్చినా కానీ మీరు వెళ్ళవచ్చు. మనలో ఎవరెవరు మంచిగా సవాల్ చేయగలరు అన్నది పిల్లలైన మీరు కూడా అర్థం చేసుకోగలరు. ఒక్క అల్ఫ్ యొక్క అర్థాన్నే అర్థం చేయించాలి. రెండు విషయాలు ఉన్నాయి, అంతే. అల్ఫ్ అయిన తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది అల్ఫ్ అయిన భగవంతుడే చెప్పగలరు, వారే రచయిత, హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు అంటారు - నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. శ్రీకృష్ణుడిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవ్వవు. కృష్ణుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వారైతే ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకున్నారు. నిరాకారుడైతే అవినాశీ. మొత్తం వివరణ అంతా విషయంపైనే ఇస్తారు. ఎంత పొరపాటు చేసారు. భగవానువాచ - నేను మీకు విశ్వ వారసత్వాన్ని ఇస్తాను. కృష్ణుడు ఎలా అందరికీ వారసత్వాన్ని ఇవ్వగలరు. కృష్ణుడు అయితే భారత్ కు చెందినవారు కదా. మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. అందరి పతిత-పావనుడైతే ఒక్క నిరాకారుడు మాత్రమే. మీ బుద్ధిలో విషయాలన్నీ ఉన్నాయి. భక్తి యొక్క పాత్రకు సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. మొట్టమొదట శివుని పూజ జరుగుతుంది. సోమనాథ మందిరం తయారై ఉంది. ఇంత పెద్ద సోమనాథ మందిరాన్ని ఎవరు తయారుచేసారు? ఇంకెవ్వరికీ శక్తి లేదు. తప్పకుండా సమయంలో ఇటువంటి మందిరాలను తయారుచేసేంత షావుకార్లుగా ఉండేవారు. పిల్లలైన మీలో ఇప్పుడు వివేకం ఉంది. తప్పకుండా మనము ఎంత షావుకార్లుగా ఉండేవారము. ఇంత పెద్ద సోమనాథ మందిరాన్ని తయారుచేసారు, వారు తప్పకుండా మహారాజు అయి ఉంటారు. దేవీ-దేవతలు స్వయమే పూజ్యులుగా ఉండేవారు, వారే పూజారులుగా అయ్యారు. మళ్ళీ వారే పూజలు చేసేందుకు మందిరాలను తయారుచేస్తారు. ఒక్క సోమనాథ మందిరాన్నే తయారుచేస్తారని కాదు. ఒకరు మొదలుపెట్టారు, తర్వాత అనేకులు తయారుచేసారు. తర్వాత చాలా మందిరాలను దోచుకుని ఉంటారు. కేవలం ఒక్క మందిరం నుండే ఎంత సామాను వెలువడిందంటే, దానిని ఒంటెలపై నింపుకుని తీసుకువెళ్ళారు. ఎప్పుడైతే దాడి చేస్తారో, అప్పుడు రాజధానిని చేతిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడిక వారికి విజయం లభిస్తుంది. తప్పకుండా ఢిల్లీ పరిస్తాన్ గా ఉండేదని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ధర్మరాజు స్థాపన చేసారు. ఢిల్లీ మళ్ళీ పరిస్తాన్ గా అవుతుంది. దాని కోసం మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మీరు వింటున్నారు కావున బుద్ధిలో నషా ఎక్కుతుంది. మన రాజ్యం స్థాపనవుతూ ఉందని మీరు భావిస్తారు. మన పేరు ప్రసిద్ధమైంది. గుప్త సైన్యము, అహింసాయుతమైనది అని కూడా అంటారు. ఇంత పెద్ద అర్థాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. మీరు స్థూల ఆయుధాలనూ ఉపయోగించరు, కామ ఖడ్గాన్నీ ఉపయోగించరు. మీరే అహింసాయుతమైన శక్తి సైన్యము, మీరు యోగబలంతో రాజ్యాన్ని పొందారు. విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు శ్రీమతంపై మనం ఒక్క తండ్రినే స్మృతి చేస్తాము. ఇప్పుడు నాటకం పూర్తవుతుందని, మళ్ళీ కొత్తగా ప్రారంభమవుతుందని మీకు తెలుసు. ఇది అవినాశీ నాటకము. ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. ఎప్పుడైతే కొత్త ప్రపంచం వస్తుందో అప్పుడు పాత ప్రపంచం సమాప్తమవుతుంది, ఇది తప్పకుండా జరుగుతుంది. చక్రమైతే తిరుగుతూనే ఉంటుంది. ఇది అనాది డ్రామా. విధంగా భగవంతుని కోసం, వారు హాజరై అన్నింటినీ చూస్తారు అని అంటారో, అలాగే డ్రామా తిరుగుతూనే ఉంటుంది. డ్రామాలో పాత్రధారులు అందరూ ఉండనే ఉన్నారు. మూలవతనం మరియు స్థూలవతనం ఉండనే ఉన్నాయని మీకు తెలుసు. సత్య, త్రేతాయుగాలు చక్రం తిరిగి మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇది అవినాశీ డ్రామా. పాత్రధారులైన మనం కూడా డ్రామాలో ఉండనే ఉన్నాము. ప్రారంభం నుండి అంతిమం వరకు అందరి పాత్ర ఉండనే ఉంది. డ్రామా చిన్నగా ఉంటుంది, అది పాతబడుతుంది. ఇది ఎప్పటికీ పాతబడదు. అవినాశీ డ్రామా ఎప్పుడైనా పాతబడుతుందా? లేదు. ఇకపోతే మనం పాత్రలోకి వస్తాము. కొత్త నుండి పాతగా అవుతాము, మళ్ళీ పాత నుండి కొత్తగా అవుతాము. మనం తప్పకుండా రాజు-రాణిగా ఉండేవారమని, ఇప్పుడు సేవకులుగా అయ్యామని, సేవకుల నుండి మళ్ళీ రాజులుగా అవుతామని మీకు తెలుసు. సేవకులు అంటే ఫకీరులు. తండ్రి వచ్చి అందరికీ మార్గాన్ని తెలియజేస్తారు. మీకు చాలా నషా ఉండాలి. కొత్త జ్ఞానం మీకు లభిస్తుంది మరియు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. మేము డైరెక్షన్ల అనుసారంగా సృష్టిపై మా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీరు భావిస్తారు కదా. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. ఇకపోతే అత్యాచారాలైతే ఉండనే ఉంటాయి. అత్యాచారాలు కూడా కర్మభోగమే. పురుషుడు స్త్రీని కొడతారు, ఊరికే ఎవరైనా కొట్టగలరా ఏమిటి? మీరు కూడా వారిని కొట్టి ఉంటారు. లెక్కాచారమే సమాప్తమవుతుంది. ఇదంతా కర్మల లెక్కాచారము. ఇప్పుడు మీరు శ్రీమతంపై శ్రేష్ఠ కర్మలు చేస్తున్నారు. ఇప్పుడు భ్రష్ట కర్మలు చేయకండి. అన్నింటికన్నా శ్రేష్ఠ కర్మ - అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వడము. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞ లభించింది. అందరూ తండ్రినే మర్చిపోయారు. శివుని పూజ చేస్తారు. కానీ ఏమీ తెలియదు. అమరనాథ్ లో కూడా పెద్ద లింగాన్ని తయారుచేసి పెట్టారు. తండ్రి రూపము అంత పెద్దగా ఉంటుందా? ఏమీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు విషయాలన్నింటినీ యథార్థంగా అర్థం చేసుకున్నారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతంపై సదా శ్రేష్ఠ కర్మలు చేయాలి. భ్రష్ట కర్మలేవీ జరగకూడదు, దీనిపై అటెన్షన్ పెట్టాలి. అనేకులను యోగిగా చేసే సేవ చేయాలి.

2. సత్యమైన హృదయం పెట్టుకోవాలి, శరీరమైతే శవం వలె ఉంది - దీని పట్ల అభిమానాన్ని విడిచిపెట్టాలి. పూర్తి-పూర్తిగా నష్టోమోహులుగా అవ్వాలి.

వరదానము:-

కల్ప-కల్పం యొక్క విజయము నిశ్చితమై ఉంది అన్నది స్మృతిలో ఉంచుకుని సదా నిశ్చింతగా ఉండే నిశ్చయబుద్ధి విజయీ భవ
నిశ్చయబుద్ధి పిల్లలు, వ్యవహారము మరియు పరమార్థం యొక్క ప్రతి కార్యంలో సదా విజయాన్ని అనుభూతి చేస్తారు. ఎలాంటి సాధారణ కర్మ అయినా కానీ వారికి విజయం యొక్క అధికారము తప్పకుండా ప్రాప్తిస్తుంది. వారు కార్యంలోనూ స్వయంతో నిరాశ చెందరు ఎందుకంటే మేమే కల్ప-కల్పం యొక్క విజయులము అన్న నిశ్చయముంది. ఎవరికైతే స్వయంగా భగవంతుడు సహాయకునిగా ఉన్నారో, వారికి కాకపోతే ఇంకెవరికి విజయం కలుగుతుంది, విధిని ఎవ్వరూ తప్పించలేరు! నిశ్చయము మరియు నషా నిశ్చింతులుగా చేస్తుంది.

స్లోగన్:-

సదా సంతోషం యొక్క ఔషధంతో ఆరోగ్యంగా మరియు సంతోషం యొక్క ఖజానాతో సంపన్నంగా, ఆనందంగా ఉండండి.

 

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

1. కల్పము 5000 సంవత్సరాలదని మరియు కల్పము, ప్రతి కల్పము యథావిధిగా రిపీట్ అవుతుందని మనం అంటాము, దీని గురించి చాలామంది మనుష్యుల ప్రశ్న ఏమిటంటే, కల్పము ఇంత పెద్దది, అది మరి 5000 సంవత్సరాలది ఎలా అవుతుంది? కల్పమైతే లక్షల సంవత్సరాలదిగా ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి వస్తువు వెలువడిందంటే, దాని ద్వారా అది లక్షల సంవత్సరాలది అని తెలుస్తుంది. మరి కల్పము 5000 సంవత్సరాలదని మనుష్యులు ఎలా ఒప్పుకుంటారు? ఒకవేళ లక్షల సంవత్సరాల చరిత్ర తయారై ఉందని ఎవరైనా అంటే, అప్పుడు వారికి లక్షల సంవత్సరాల చరిత్రలు ఎలా ఉండగలవు అన్నది అర్థం చేయించండి. కల్పంలో ఇంత అతలాకుతలం అవుతుంది, ఇంత వినాశనం జరుగుతుంది, ఇందులో మొత్తం రాజ్యాలన్నీ వినాశనమవుతాయి, అటువంటప్పుడు మీ చరిత్ర ఎలా నిరూపించబడుతుంది? అప్పుడిక ఏక్యురేట్ చరిత్ర గురించి ఎలా తెలుస్తుంది, కనుక విషయం ఋజువు అవ్వదు. ఇప్పుడు మనకైతే స్వయంగా వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అయిన పరమాత్మ ఏక్యురేట్ గా వినిపిస్తారు మరియు దానితో పాటు మనకు దివ్యదృష్టి ద్వారా సాక్షాత్కారం కూడా చేయిస్తారు, కనుక మనం దానిని విశ్వసించమా? అయితే తప్పకుండా ఒకవేళ ఎవరైనా సాక్షాత్కారాలను నమ్మకపోయినా కానీ స్వయంగా పరమాత్మ మనకు సమ్ముఖంలో వినిపిస్తున్నారు. మొదటైతే మనల్ని చదివించేవారెవరు మరియు మొత్తం సృష్టి అంతా యథావిధిగా ఎలా తిరుగుతుంది అన్న విషయాలలో మనకు నిశ్చయం ఉంది. రహస్యాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాము, అందుకే మనం మన అనుభవాన్ని మరియు ప్రాక్టికల్ జీవితాన్ని చూసి, కల్పము 5000 సంవత్సరాలదని యథార్థంగా చెప్తున్నాము.

2. ఆత్మ మరియు పరమాత్మ మధ్యన వ్యత్యాసము - దీని గురించి ఏమని అర్థం చేయించడం జరుగుతుందంటే - ఆత్మ మరియు పరమాత్మ యొక్క రూపము ఒకేలా జ్యోతి రూపము వలె ఉంటుంది. ఆత్మ మరియు పరమాత్ముని ఆత్మ యొక్క సైజు ఒకే విధంగా ఉంటుంది. ఇకపోతే ఆత్మ మరియు పరమాత్మలో కేవలం గుణాల యొక్క శక్తిలో తప్పకుండా తేడా ఉంది. ఇప్పుడు ఇన్ని గుణాలేవైతే ఉన్నాయో, మహిమ అంతా పరమాత్మదే. పరమాత్మ సుఖ-దుఃఖాలకు అతీతుడు, సర్వశక్తివంతుడు, సర్వగుణ సంపన్నుడు, 16 కళల సంపూర్ణుడు, వారి శక్తే మొత్తం పని చేస్తుంది. ఇకపోతే మనుష్యాత్మల శక్తి ఏదీ పని చేయదు. పరమాత్మదే మొత్తం పాత్ర నడుస్తుంది, అయితే పరమాత్మ పాత్రలోకి వస్తారు కూడా, కానీ స్వయము అతీతంగా ఉంటారు. ఆత్మ పాత్రలోకి వచ్చినప్పుడు పాత్రధారి రూపంలోకి వస్తుంది. పరమాత్మ పాత్రలోకి వస్తూ కూడా కర్మబంధనాల నుండి అతీతంగా ఉంటారు. ఆత్మ పాత్రలోకి వచ్చినప్పుడు కర్మ బంధనాలకు వశమవుతుంది, ఇది ఆత్మ మరియు పరమాత్మకు మధ్యన వ్యత్యాసము. అచ్ఛా - ఓం శాంతి.

 Download PDF

Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam/Ilangai Tamil/Sinhala

Post a Comment

0 Comments