Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam
12-04-2022 |
ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" |
మధువనం |
‘‘మధురమైన పిల్లలూ - మీరు
దుఃఖహర్త, సుఖకర్త
అయిన తండ్రి పిల్లలు, మీరు మనసా-వాచా-కర్మణా
ఎవ్వరికీ కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు, అందరికీ సుఖాన్ని ఇవ్వండి’’ |
|
ప్రశ్న:- |
పిల్లలైన మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, అందుకే మీ ముఖ్యమైన ధారణ
ఏముండాలి? |
జవాబు:- |
మీ నోటి నుండి ఏ మాట వెలువడినా - ఆ ఒక్కొక్క మాట మనుష్యులను వజ్ర తుల్యంగా
తయారుచేయాలి. మీరు చాలా మధురంగా అవ్వాలి, అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఎవ్వరికీ కూడా
దుఃఖాన్ని ఇచ్చే ఆలోచన రాకూడదు. మీరిప్పుడు ఎటువంటి సత్యయుగీ స్వర్గం యొక్క
ప్రపంచంలోకి వెళ్తారంటే, అక్కడ సదా
సుఖమే సుఖం ఉంటుంది. దుఃఖం యొక్క నామ రూపాలు ఉండవు. కనుక మీకు తండ్రి శ్రీమతం
లభించింది, పిల్లలూ, తండ్రి సమానంగా
దుఃఖహర్త-సుఖకర్తలుగా అవ్వండి. మీ వ్యాపారమే అందరి దుఃఖాలను హరించి సుఖాన్ని
ఇవ్వడము. |
గీతము:- |
ఈ పాపపు ప్రపంచం నుండి... (ఇస్ పాప్ కీ దునియా సే...) |
ఓంశాంతి. పిల్లలు ఈ పాటను విన్నారు. పిల్లలకు తెలుసు, మనం పురుషార్థం చేస్తున్నాము
అటువంటి ప్రపంచంలోకి వెళ్ళేందుకు. ఎక్కడైతే ఒకటేమో, మాయ ఉండదు మరియు ఎప్పుడూ కూడా మనసా, వాచా, కర్మణా ఎవ్వరూ ఎవ్వరికీ
దుఃఖాన్ని ఇవ్వరు,
అందుకే
దాని పేరే స్వర్గం,
ప్యారడైజ్, వైకుంఠం మరియు తప్పకుండా అక్కడి
యజమానులైన లక్ష్మీ-నారాయణుల చిత్రాన్ని కూడా చూపిస్తారు. ప్రజల చిత్రాలనైతే
చూపించరు. లక్ష్మీ-నారాయణుల చిత్రం ఉంది, దీనితో, వారి రాజధానిలో తప్పకుండా ఇటువంటి మనుష్యులే
ఉంటారని నిరూపించబడుతుంది. భారత్ లోనే వీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు, అక్కడ దుఃఖం యొక్క నామ రూపాలు
ఉండవు. మనసా,
వాచా, కర్మణా ఎవ్వరూ ఎవ్వరికీ
దుఃఖాన్ని ఇవ్వరు. తండ్రి కూడా ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరు. దుఃఖహర్త, సుఖకర్త అని వారి పేరు ప్రసిద్ధి
చెందింది. వారు కూర్చుని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. ఈ ప్రపంచంలో అందరూ మనసా, వాచా, కర్మణా ఒకరికొకరు దుఃఖాన్ని
ఇచ్చేవారే. అక్కడ మనసా,
వాచా, కర్మణా అందరూ సుఖాన్ని
ఇచ్చేవారు. పరమపిత పరమాత్మ తప్ప ఎవ్వరూ స్వర్గానికి యజమానులుగా తయారుచేయలేరు.
తప్పకుండా స్వర్గం ఉండేది. ఇక్కడ కూడా చూడండి, సైన్స్ ద్వారా ఏమేమి తయారవుతూ ఉంటాయి.
విమానాలు,
మోటర్లు, మహళ్ళు మొదలైనవి ఎలా
తయారవుతున్నాయి. అక్కడ కూడా సైన్స్ అన్నింటికీ పనికి వస్తుంది. అంతేకానీ, భూమి నుండి వైకుంఠం ఏమీ బయటకు
వస్తుందని కాదు. ఎలాగైతే ద్వారక సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయిందని చూపిస్తారు.
సముద్ర గర్భంలోకి ఏదైతే వెళ్తుందో, అది కరిగిపోయి సమాప్తమైపోతుంది. అంతా కొత్తగా
తయారవ్వాలి. మరి తండ్రి నుండి మనం రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటున్నాము అన్నప్పుడు
మనసా,
వాచా, కర్మణా ఎవ్వరి పట్ల బుద్ధిలో
దుఃఖాన్ని ఇచ్చే ఆలోచన రాకూడదు. ఇది అయితే ఉన్నదే మాయా రాజ్యము. మనసులో తుఫానులైతే
వస్తాయి. ఇకపోతే,
మనసులో
ఎవ్వరికీ దుఃఖాన్ని ఇచ్చే ఆలోచన కూడా రాకూడదు. ఈ సమయంలో అందరూ ఒకరికొకరు దుఃఖాన్నే
ఇస్తారు. సుఖం అని భావిస్తారు, కానీ అది దుఃఖము. తండ్రి నుండి అందరినీ
విముఖులుగా చేస్తారు. ఈ భక్తి మార్గం కూడా డ్రామాలో ఉంది. డ్రామా గురించి ఎవ్వరికీ
కూడా తెలియదు. వారు ఏమని భావిస్తారంటే, మేము ఈ శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తాము, ఇవి కూడా జ్ఞానాన్ని ఇస్తాయి.
జపము,
తపము
మొదలైనవి చేయడం ద్వారా మనుష్యులు ముక్తి-జీవన్ముక్తిని పొందుతారు. అనేక రకాల
మార్గాలను తెలియజేస్తారు. చాలా కాలం నుండి భక్తి చేస్తూ వచ్చాము, అందుకే భగవంతుడు వచ్చారు అని
అంటారు. మనం కూడా అంటాము,
ఎప్పుడైతే
భక్తి యొక్క అంతం జరుగుతుందో అప్పుడు భగవంతుడు రావాల్సి ఉంటుంది, వచ్చి భక్తి యొక్క ఫలాన్ని
ఇస్తారు. మరి వారంతా భక్తి యొక్క లైనులోకి వెళ్ళిపోతారు. దీనిని జ్ఞానము అని అనరు.
శాస్త్రాల జ్ఞానం ద్వారా సద్గతి జరగదు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమైతే వారికి
లేనే లేదు. మీకు తెలుసు,
ప్రాచీన
జ్ఞానం మరియు యోగం ద్వారా భారత్ స్వర్గంగా తయారయ్యింది. దానిని తప్పకుండా భగవంతుడే
నేర్పిస్తారు. మనుష్యులైతే రాజయోగాన్ని నేర్పించలేరు. భగవంతుడు ఏ సహజ రాజయోగాన్ని
అయితే నేర్పించారో,
దానికి
సంబంధించిన శాస్త్రాలను తర్వాత తయారుచేసారు. ఇక్కడైతే భగవంతుడు స్వయంగా కూర్చుని
జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. గీతలో కేవలం ఒక్క పొరపాటు చేసారు. పేరు మార్చి
వేసారు మరియు సమయం కూడా వేరొకటి రాసేసారు.
ఇప్పుడు భగవంతుడు మనకు జ్ఞానం మరియు రాజయోగం
నేర్పిస్తున్నారని మీకు తెలుసు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం ఇంకే శాస్త్రంలోనూ
లేదు. కల్పం ఆయువును కూడా చాలా ఎక్కువగా చేసేసారు. మనుష్యులైతే ఆ శాస్త్రాలనే
చదువుతూ ఉంటారు. తండ్రి అర్థం చేయించారు - ఇది సృష్టి రూపీ వృక్షము. వృక్షంలో మొదట
కొన్ని ఆకులు ఉంటాయి తర్వాత వృద్ధి అవుతూ ఉంటాయి. భిన్న-భిన్న ధర్మాల ఆకులను
చూపించడం జరుగుతుంది. వాస్తవానికి ఈ వేద శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ భగవద్గీత యొక్క ఆకులు
అనగా దాని నుండే అన్ని శాస్త్రాలు వెలువడ్డాయి. తప్పకుండా కొత్త వృక్షం యొక్క
స్థాపన జరగడము మీరు చూస్తారు. తుఫానులు మొదలైనవాటిలో కొన్ని అయితే వెంటనే
వాడిపోతాయి,
రాలిపోతాయి.
ఇప్పుడు మన దైవీ వృక్షం యొక్క పునాది వేయబడుతూ ఉందని మీకు తెలుసు. మేము
క్రిస్టియన్ ధర్మానికి లేక ఫలానా ధర్మానికి పునాది వేస్తున్నామని ఇతర ధర్మ
స్థాపకులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియదు. ఫలానావారు ఈ పునాది వేసారని తర్వాత
అర్థమవుతుంది. ఇక్కడైతే ముళ్ళను పుష్పాలుగా తయారుచేయవలసి ఉంటుంది. మీకు తెలుసు, మనమైతే దేవతలుగా తయారవ్వాలి.
అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఎవరికైనా దుఃఖాన్నిచ్చే ఆలోచన కూడా రాకూడదు. నోటి నుండి
ఒక్కొక్క పదం ఎలా రావాలంటే అవి మనుష్యులను వజ్ర తుల్యంగా తయారుచేయాలి. తండ్రి కూడా
మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు. దానిని ధారణ చేస్తూ-చేస్తూ మనం వజ్ర తుల్యంగా
అయిపోతాము. వాస్తవానికి టీచరు ఎవరికైనా దుఃఖాన్ని ఎందుకు ఇవ్వాలి, వారైతే చదివిస్తారు. అయితే, అర్థం చేయించడం జరుగుతుంది -
మంచి రీతిలో చదువుకోకపోతే 21
జన్మలు
నష్టం చేకూరుతుంది. 21
జన్మల
కోసం ఇప్పుడే పురుషార్థం చేయాలి. తండ్రి లభించారు. వారినే భక్తి మార్గంలో, ఓ భగవంతుడా, అని స్మృతి చేసేవారము. సాధు
సన్యాసులు మొదలైనవారందరూ స్మృతి చేస్తారు. భగవంతుడైతే ఒక్కరే. కానీ వారెవరు అన్నది
తెలియదు. శ్రీకృష్ణుడైతే సత్యయుగంలో రాకుమారుడిగా ఉండేవారు. వారు సర్వుల దుఃఖహర్త
సుఖకర్త అని వారినైతే ఎవ్వరూ ఇలా అనరు. ఆ శ్రీకృష్ణుని ఆత్మ, ఏదైతే సుఖంలో ఉండేదో, ఇప్పుడు దుఃఖంలో ఉంది. భగవంతుడి
గురించి ఈ విధంగా అనరు కదా. వారైతే సుఖ దుఃఖాలకు అతీతమైనవారు. వారికి మనిషి తనువు
లేదు. తండ్రి దేనినైతే స్థాపన చేస్తారో, అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. అందుకే, దుఃఖహర్త, సుఖకర్త అని గాయనం చేయబడుతుంది.
మనం రావణ రాజ్యంలో అర్థకల్పము దుఃఖితులుగా
ఉండేవారమని మీకు తెలుసు. అల్పకాలిక సుఖం ఉంటుంది, మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. దానిని సన్యాసులు
కాకి రెట్ట సమానమైన సుఖం అని అంటారు ఎందుకంటే వికారాల ద్వారా జన్మిస్తారు కదా.
కానీ పవిత్ర ప్రవృత్తి మార్గం కూడా ఒకటి ఉంటుంది. అక్కడ ఏ వికారాలూ ఉండవు.
తప్పకుండా అది సత్యయుగంలో ఉండేది. దాని పేరే ఉంది స్వర్గము. అది పవిత్ర మార్గము, స్వర్గము. మళ్ళీ పతితంగా అవుతారు, అప్పుడు దానిని నరకం, భ్రష్టాచారీ మార్గము అని అనడం
జరుగుతుంది. ఈ సుఖ-దుఃఖాల ఆట తయారుచేయబడి ఉంది. మనుష్యులకు ఇప్పుడిప్పుడే సుఖము, ఇప్పుడిప్పుడే దుఃఖము ఉంది.
స్వర్గంలో సదా సుఖం ఉంటుందని, దుఃఖం యొక్క నామ రూపాలు కూడా ఉండవని వారికి
తెలియనే తెలియదు. ఇక్కడ మళ్ళీ సుఖం యొక్క నామ రూపాలు కూడా లేవు. వికారాలలోకి
వెళ్ళడము - ఇదైతే దుఃఖమే,
అందుకే
సన్యాసులు కూడా సన్యసిస్తారు కానీ అది నివృత్తి మార్గము. సత్యయుగంలో ప్రవృత్తి
మార్గం ఉండేది. అది శివాలయంగా ఉండేది. దేవీ-దేవతలు, లక్ష్మీ-నారాయణులు మొదలైనవారి జడ చిత్రాలు మందిరాలలో
కూడా కిరీటం మరియు సింహాసనాలతో ఎలా అలంకరించబడి ఉన్నాయి. భారత్ లోనే రాజా-రాణి
దైవీ సంప్రదాయానికి చెందినవారిగా ఉండేవారు, ఇంకే ధర్మంలోనూ ఈ విధంగా లేరు. రాజులైతే
ఉండేవారు కానీ డబల్ కిరీటం లేదు. సత్యయుగంలో ప్రారంభం నుండే రాజ్యం నడుస్తుంది.
ఆది సనాతన ద్వికిరీటధారీ దేవీ-దేవతా ధర్మం ఉండేది. ఆ ధర్మం ఎలా స్థాపన అయ్యింది, ఈ విషయాలన్నీ పిల్లలైన మీకు
మాత్రమే తెలుసు. శివబాబా మతంతో మీరు దుఃఖహర్త-సుఖకర్తగా అవుతారు. మీ వ్యాపారమే ఇది
- అందరి దుఃఖాలను హరించి సుఖాన్ని ఇవ్వడము. ఒకవేళ మీరు కూడా ఎవరికైనా
దుఃఖాన్నిస్తే,
వీరు
దుఃఖహర్త-సుఖకర్త సంతానము అని ఎవరంటారు. మొదట మనసులో ఆలోచనలు వస్తాయి, తర్వాత కర్మలోకి వస్తారు.
పిల్లలైన మీరైతే అతి మధురంగా అవ్వాలి. భగవంతుడు చదివిస్తున్నారు కావున
ఎప్పటివరకైతే మీ నడవడిక దైవీ నడవడికగా అవ్వదో, అప్పటివరకు మనుష్యులు మిమ్మల్ని ఎలా
విశ్వసిస్తారు. గీతలో కూడా రాసి ఉంది, భగవానువాచ - నేను మిమ్మల్ని నరుని నుండి
నారాయణునిగా చేస్తాను. భగవంతుడు తప్పకుండా సంగమంలో ఉంటారు. భగవానువాచ - నేను మీకు
రాజయోగాన్ని నేర్పిస్తాను కనుక తప్పకుండా పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా జరిగి
ఉంటుంది. ఈ పని కృష్ణుడిదేమీ కాదు. త్రిమూర్తిని చూపిస్తారు కానీ శివుడిని
తీసేసారు,
మళ్ళీ
అంటారు,
బ్రహ్మాకైతే
3
ముఖాలు
ఉంటాయి. మరి ఈ ఒక ముఖం కలిగిన బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు. ఇప్పుడు మనిషికి 3 ముఖాలు ఎలా ఉంటాయి. తండ్రి
అంటారు,
మీరు నా
తెలివైన పిల్లలు. మీరే విశ్వంపై రాజ్యం చేసేవారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని
దేహీ-అభిమానులుగా చేస్తున్నారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి. అందరినీ
అశరీరులుగా చేసి ముక్తిధామానికి పంపిస్తారు. ఇక్కడకు వచ్చి మీరు ఈ శరీరాన్ని ధారణ
చేసారు. శరీరాన్ని ధారణ చేస్తూ-చేస్తూ మీకు దేహాభిమానం పక్కా అయిపోయింది. ఇప్పుడు
మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మనైన నేను 84 జన్మల పాత్రను అభినయించాను. ఇప్పుడిది అంతిమ
జన్మ,
ఈ విధంగా
మీతో మీరు మాట్లాడుకోండి. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవ్వండి, తిరిగి వెళ్ళాలి, మళ్ళీ మీరు స్వర్గంలోకి వస్తారు.
ఇప్పుడు మీరు నా ద్వారా స్వర్గ రాజ్యాన్ని తీసుకునేందుకు శ్రమ చేస్తున్నారు.
తండ్రిని మీరు మర్చిపోయినట్లయితే సంతోషం యొక్క పాదరసం ఎక్కదు. శాస్త్రాలలో ఎంత
భారీ పొరపాటు చేసేసారు,
శివబాబానే
తీసేసారు. పూజ చేస్తూ కూడా,
నామ-రూపాలకు
అతీతమైనవారు అని అంటారు. అరే, అటువంటప్పుడు పూజ ఎవరికి చేస్తున్నారు!
స్మృతి ఎవరిని చేస్తున్నారు! ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుందని అంటారు కూడా. కానీ ఆత్మ
ఎవరి సంతానము అన్నది తెలియదు. ఆత్మనైన నేను భృకుటి మధ్యలో ఉంటూ ఈ శరీరం ద్వారా
పాత్రను అభినయిస్తున్నాను,
ఈ బొమ్మ
చేత నాట్యం చేయిస్తున్నాను. తోలు బొమ్మల డాన్స్ ఉంటుంది కదా. అక్కడ వేరే వ్యక్తి
కూర్చుని డాన్స్ చేయిస్తారు. మొట్టమొదట అయితే దేహీ-అభిమానులుగా అవ్వాలి మరియు
తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని ధారణ చేయాలి. ప్రదర్శినీలో మొట్టమొదట
అయితే తండ్రి పరిచయాన్ని అర్థం చేయించాలి, వీరు అందరికీ తండ్రి, వీరు నిరాకారుడు. రెండవవారు
సాకార ప్రజాపిత - ఇద్దరు తండ్రులు అని. లౌకిక తండ్రి కూడా ఉన్నారు, పారలౌకిక తండ్రి కూడా ఉన్నారని
మీకు తెలుసు. వారు హద్దు తండ్రి, వీరు అనంతమైన తండ్రి. ఇప్పుడు కొత్త రచనను
రచిస్తున్నారు. మనం వారసత్వం శివబాబా నుండి తీసుకుంటాము. ఇటువంటి మాటలు మీతో మీరే
మాట్లాడుకుంటూ పక్కా చేసుకోవాలి. దేహీ-అభిమానులుగా అవ్వాలి. మనం శివబాబా వద్దకు
చదువుకునేందుకు వెళ్తాము,
పరమపిత
పరమాత్మ నిరాకారుడు. ప్రజాపిత బ్రహ్మా
సాకారుడు. మీరు ప్రజాపిత బ్రహ్మా యొక్క ముఖవంశావళి బ్రాహ్మణులు. మిమ్మల్ని బ్రహ్మా
దత్తత తీసుకున్నారు. మీరు కొత్త రచన - బ్రాహ్మణులుగా అయ్యారు. వారు పాత దైహిక
బ్రాహ్మణులు. వారు దైహిక యాత్రను చేయిస్తారు. మీరు ఆత్మిక యాత్ర చేయిస్తారు.
పిల్లలైన మీరు ఇప్పుడు శ్రేష్ఠంగా
అవుతున్నారు. ఇది ఉన్నదే - భ్రష్టాచారుల నుండి శ్రేష్ఠాచారులుగా అయ్యేందుకు
ఈశ్వరీయ మిషన్. మనుష్యులైతే తయారుచేయలేరు. వాస్తవానికి సత్యాతి-సత్యమైన సదాచార
సమితి మీదే. మీ లీడర్ ఎవరో చూడండి! తండ్రి అంటారు, నేను మళ్ళీ రాజయోగం నేర్పించేందుకు వచ్చాను, ఇది అదే సంగమయుగము. ఇప్పుడు
మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తాను. మనం శూద్రుల నుండి ఇప్పుడు బ్రాహ్మణులుగా
అవుతున్నామని మీకు తెలుసు. బ్రాహ్మణులది పిలక స్థానము. బ్రహ్మాది కూడా పిలక
స్థానమే. బ్రహ్మాలో ఎవరైతే ప్రవేశిస్తారో, వారిని ఈ కనులతో చూడలేము. మిగిలిన వారందరినీ
అయితే చూస్తాము. నిరాకార తండ్రి మనల్ని చదివిస్తున్నారని బుద్ధి ద్వారా
తెలుసుకుంటాము. బ్రహ్మాకైతే బ్రాహ్మణులు ఇక్కడ కావాలి. సూక్ష్మవతనంలో ఉండరు. దత్తత
తీసుకుంటారు. వ్యక్త బ్రహ్మా సో అవ్యక్త బ్రహ్మాగా అవుతారు. ఇవి బాగా అర్థం
చేసుకోవాల్సిన విషయాలు. మొట్టమొదట లక్ష్యాన్ని అర్థం చేసుకుని తర్వాత ఎక్కడైనా
కూర్చొని చదువుకోవచ్చు. మురళీని రోజూ వినవలసి ఉంటుంది. ఒక్క రోజు మిస్ అయినా కూడా
చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే పాయింట్లు చాలా గుహ్యమైనవి, వజ్రాలు, రత్నాలు వెలువడుతూ ఉంటాయి. ఏదైనా
ఫస్ట్ క్లాస్ రత్నం వెలువడినప్పుడు దాన్ని మిస్ చేసినట్లయితే నష్టం జరుగుతుంది.
రెగ్యులర్ విద్యార్థులు చాలా ఏక్యురేట్(ఖచ్చితం)గా ఉంటారు. మంచి రీతిగా పురుషార్థం
చేయకపోతే ఉన్నత పదవిని పొందలేరు. ఇదైతే చాలా ఉన్నతమైన చదువు. సరస్వతికి వీణను
మరియు కృష్ణుడికి మురళీని ఇచ్చారు. వాస్తవానికి కృష్ణుడికి పొరపాటుగా ఇచ్చేసారు.
నిజానికి వారు బ్రహ్మా. వీరు శివబాబా ముఖం అని మీకు తెలుసు. కృష్ణుడికి మరియు
సరస్వతికి ఎటువంటి కనెక్షన్ లేదు. అంతా తికమక చేసేసారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. నేను ఆత్మ, ఈ శరీరం రూపీ బొమ్మతో నాట్యం చేయిస్తున్నాను.
నేను దీని నుండి వేరుగా ఉన్నాను, ఇలా అభ్యాసం చేస్తూ-చేస్తూ దేహీ-అభిమానులుగా
అవ్వాలి.
2. మురళీని ఎప్పుడూ కూడా మిస్ చేయకూడదు, రెగ్యులర్ అవ్వాలి. చదువులో
చాలా-చాలా ఏక్యురేట్ (ఖచ్ఛితం) గా ఉండాలి.
వరదానము:- |
మాయ మరియు ప్రకృతి యొక్క అలజడి నుండి సదా సురక్షితంగా ఉండే హృదయాభిరాముని
హృదయ సింహాసనాధికారి భవ |
స్లోగన్:- |
జ్ఞాన స్వరూపులుగా, ప్రేమ
స్వరూపులుగా అవ్వడమే శిక్షణలను స్వరూపంలోకి తీసుకురావడము. |
0 Comments