Header Ads Widget

Header Ads

TELUGU MURLI 13.10.22

 

13-10-2022  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 

Download PDF


Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీ మనసులో సంతోషపు సన్నాయి మ్రోగాలి ఎందుకంటే తండ్రి చేతిలో చేయి వేసి తోడుగా తీసుకువెళ్ళేందుకు వచ్చారు, ఇప్పుడు మీ సుఖం యొక్క రోజులు రానే వచ్చాయి’’

ప్రశ్న:-

ఇప్పుడు కొత్త వృక్షము యొక్క అంటు కట్టబడుతుంది, అందుకే ఎటువంటి జాగరూకత తప్పకుండా ఉంచాలి?

జవాబు:-

కొత్త వృక్షానికి తుఫానులు చాలా వస్తాయి. ఎలాంటి-ఎలాంటి తుఫాన్లు వస్తాయంటే, పుష్పాలు, ఫలాలు మొదలైనవన్నీ పడిపోతాయి. ఇక్కడ కూడా మీ కొత్త వృక్షం యొక్క అంటు కట్టబడుతుంది, దానిని కూడా మాయ బలంగా కదిలిస్తుంది. అనేక తుఫాన్లు వస్తాయి. మాయ సంశయబుద్ధి కలవారిగా చేస్తుంది. బుద్ధిలో తండ్రి స్మృతి లేకపోతే వాడిపోతారు, పడిపోతారు కూడా, అందుకే బాబా అంటారు, పిల్లలూ, మాయ నుండి రక్షింపబడేందుకు నోట్లో నాణెం వేసుకోండి అనగా వ్యాపారము మొదలైనవి చేసుకోండి, కానీ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇదే శ్రమ.

గీతము:-  ఓం నమఃశివాయ...



ఓంశాంతి. పిల్లలైన మీకు మంచి రీతిలో నిశ్చయం ఏర్పడింది, పతితంగా ఉన్న మనల్ని పావనంగా తయారుచేసేందుకు బాబా వచ్చి కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. అంతేకానీ, సృష్టి లేనే లేదు మరియు తండ్రి వచ్చి రచిస్తారని కాదు. పతితంగా ఉన్న మమ్మల్ని పావనంగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. ప్రపంచమైతే ఉండనే ఉంది. ఇకపోతే, పాతదానిని కొత్తగా చేస్తారు. జ్ఞానము మనుష్యుల కోసము, జంతువుల కోసం కాదు ఎందుకంటే మనుష్యులు చదువుకొని పదవిని పొందుతారు. ఇప్పుడు దుఃఖం కలిగించే సామాగ్రి ఏదైతే ఉందో, ఇందులో దేహము, దేహ ధర్మాలు మొదలైనవన్నీ వచ్చేసాయి. కనుక తండ్రి దుఃఖం కలిగించే సామాగ్రిని సుఖమునిచ్చే సామగ్రిగా తయారుచేస్తారు, అందుకే తండ్రి అన్నారు, నేను దుఃఖధామాన్ని సుఖధామముగా చేస్తాను, నేనే దుఃఖహర్త-సుఖకర్తను. మా సుఖం యొక్క రోజులు ఎదురుగా వస్తున్నాయని ఇప్పుడు మీ లోపల సన్నాయి మ్రోగాలి. తండ్రి కల్పం తర్వాత కలుస్తారని మీకు తెలుసు, ఇంకెవ్వరూ ఇలా ఎవరి కోసము చెప్పరు. భగవంతుడు రావడమే భక్తులకు సద్గతినిచ్చేందుకు వస్తారు. చేతిలో చేయి వేసి నాతో పాటు తీసుకువెళ్తాను. అంతేకానీ, సుఖధామంలోకి తీసుకువెళ్ళి మిమ్మల్ని వదిలిపెడతానని కాదు. అలా కాదు, సమయంలోని పురుషార్థానుసారముగా మీ అంతట మీరే వెళ్ళి ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. ఎంతగా ఇతరులకు అర్థం చేయిస్తారో, అంతగా వారికి డ్రామా పక్కా అవుతుంది. మనుష్యులు ఏదైనా డ్రామాను చూసి వస్తే, కొద్ది రోజుల వరకు అది పక్కా అయిపోతుంది. కావున మీకు కూడా ఇది పక్కా అయిపోతుంది ఎందుకంటే ఇది అనంతమైన డ్రామా. సత్యయుగం నుండి మొదలుకొని సమయం వరకు డ్రామా బుద్ధిలో ఉంది. సెంటర్లకు వస్తే సావధానము లభిస్తుంది. అప్పుడు ఇది గుర్తుకొస్తుంది. ఇక్కడ కూర్చుంటే కూడా గుర్తుంటుంది. సృష్టి అయితే అనంతమైన డ్రామా. కానీ ఇది సెకండు యొక్క పని. అర్థం చేయిస్తే వెంటనే డ్రామా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఎవరెవరు వచ్చి ధర్మ స్థాపన చేస్తారో మీకు తెలుసు. మూలవతనాన్ని స్మృతి చేయడము కూడా సెకండు యొక్క పని. రెండవ నంబరు సూక్ష్మవతనము. కావున అక్కడ కూడా పెద్ద విషయమేమీ లేదు ఎందుకంటే అక్కడ బ్రహ్మా, విష్ణు, శంకరులను చూపించారు. అది కూడా వెంటనే బుద్ధిలోకి వచ్చేస్తుంది. తర్వాతది స్థూలవతనము. ఇందులో 4 యుగాల చక్రం వచ్చేస్తుంది. ఇది తండ్రి రచన, అలాగని కేవలం మీరు స్వర్గాన్నే స్మృతి చేస్తారని కాదు. అలా కాదు, స్వర్గం నుండి మొదలుకొని కలియుగాంతము వరకు గల రహస్యం మీ బుద్ధిలో ఉంది కావున మీరు ఇతరులకు కూడా అర్థం చేయించాలి. కల్ప వృక్షము మరియు సృష్టి చక్రము యొక్క చిత్రాలు అందరి ఇంట్లో ఉండాలి. ఎవరు వచ్చినా కూడా కూర్చొని వారికి అర్థం చేయించాలి. దయాహృదయులుగా మరియు మహాదానిగా అవ్వాలి, వీటిని అవినాశీ జ్ఞాన రత్నాలు అని అంటారు. సమయంలో మీరు భవిష్యత్తు కోసం ధనవంతులుగా అవ్వండి.

తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, ఇప్పటి వరకు మీరు ఏదైతే చదివారో మరియు విన్నారో, వాటన్నింటినీ మర్చిపోండి. మనుష్యులు మరణించే సమయంలో అంతా మర్చిపోతారు కదా. కావున ఇక్కడ కూడా మీరు జీవిస్తూ మరణిస్తారు. కావున తండ్రి అంటారు, నేను కొత్త ప్రపంచము కొరకు విషయాలనైతే వినిపిస్తానో వాటినే స్మృతి చేయండి. ఇప్పుడు మనం అమరలోకానికి వెళ్తాము మరియు అమరనాథుని ద్వారా అమరకథను వింటున్నాము. మృత్యులోకం ఎప్పుడు మొదలవుతుంది అని ఎవరైనా అడుగుతారు. ఎప్పుడైతే రావణ రాజ్యం మొదలవుతుందో, అప్పుడు అని చెప్పండి. అమరలోకం ఎప్పుడు మొదలవుతుంది? రామరాజ్యం ప్రారంభమైనప్పుడు. భక్తి యొక్క సామాగ్రి ఎలా వ్యాపించిందంటే వృక్షం వ్యాపించినట్లుగా వ్యాపించింది. ఇప్పుడు కొత్త వృక్షం యొక్క అంటు కట్టబడుతుంది, మరి ఇటువంటి వృక్షానికి మాయ యొక్క తుఫానులు చూడండి ఎన్ని వస్తాయి. తుఫాన్లు వచ్చినప్పుడు తోటలోకి వెళ్ళి చూడండి, ఎన్ని ఫలాలు, పుష్పాలు పడిపోయి ఉంటాయి. కొన్ని మిగిలి ఉంటాయి. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, మాయా తుఫానులు రావడంతో మరియు బాబా స్మృతి ఉండకపోవడంతో వాడిపోతారు. కొందరైతే పడిపోతారు. హాతమతాయి ఆట ఉంది కదా, అతను నోటిలో నాణెం వేసుకునేవాడు. ఒకవేళ బుద్ధిలో బాబా స్మృతి ఉంటే మాయ యొక్క ప్రభావం ఉండదు. బాబా వ్యాపారము మొదలైనవి చేయకండి అని ఏమైనా చెప్తారా. వ్యాపారం మొదలైనవి చేస్తూ తండ్రిని స్మృతి చేయండి - ఇందులో శ్రమ ఉంది. రాజ్యాన్ని తీసుకోవడము, ఇదేమైనా తక్కువ విషయమా! కొందరు హద్దు రాజ్యం తీసుకుంటారు, అయినా కూడా ఎంత శ్రమ చేయాల్సి ఉంటుంది. సత్యయుగం యొక్క రాజ్యాన్ని తీసుకుంటారు. శ్రమ తప్పకుండా చేయవలసి ఉంటుంది. పరమాత్మను జ్ఞానసాగరుడు అని అంటారు, సర్వము తెలిసినవారు కారు. సర్వము తెలిసినవారు అనగా థాట్ రీడర్, అంటే అంతరంగాన్ని తెలుసుకునేవారు. వాస్తవానికి ఇది కూడా ఒక రిద్ధి-సిద్ధి, దీనితో ప్రాప్తి ఏమీ ఉండదు. ఒకవేళ తలక్రిందులుగా వేలాడినా కూడా ప్రాప్తి ఏమీ ఉండదు. రోజుల్లోనైతే అగ్ని మీద కూడా నడుస్తారు. ఒక సన్యాసి ఉండేవారు, అతను అగ్నిపై నడిచారు. సీత అగ్నిలోకి వెళ్ళి బయటకు వచ్చారని విన్నారు, అలాగే వీరు కూడా అగ్ని నుండి బయటకు వస్తారు. ఇప్పుడు ఇవన్నీ కట్టుకథలు. శాస్త్రాలు అనాది అని వారంటారు. ఎప్పటి నుండి? తారీఖు అయితే ఏమీ లేదు. ఇతర ధర్మాలకు తారీఖు ఉంది, దానితో లెక్క కట్టవచ్చు. ఎలాగైతే క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితము భారత్ హెవెన్ గా ఉండేదని అంటారు. కానీ హెవెన్ లో ఏముండేది, అది తెలియదు. వృక్షము యొక్క రహస్యం మీ బుద్ధిలో ఉంది. వృక్షానికి పునాది ఎలా వేయబడిందో, తర్వాత ఎలా వృద్ధి పొందిందో మీరు వర్ణించగలరు. ఫ్లవర్వాజ్ ను (పూల కుండీని) తయారుచేసేటప్పుడు, పైన పూలు తయారుచేస్తారు. ఇది కూడా అలాగే ఉంటుంది. మొదట దేవీ-దేవతా ధర్మం యొక్క కాండం ఉండేది. తర్వాత ధర్మాలన్నీ కాండం నుండి వెలువడతాయి అనగా వారి ప్రజల యొక్క పుష్పాలను చూపిస్తారు. ఇప్పుడు ఆలోచించండి, ప్రతి ధర్మము వచ్చినప్పుడు పూదోటగా ఉండేది. దిగే కళ తర్వాత వస్తుంది అనగా మొదట బంగారము, వెండి, రాగి, ఇప్పుడు ఇనుములో ఉన్నారు. చదువు మీ బుద్ధిలో ఉండాలి. నాలెడ్జ్ ఫుల్ అయి తండ్రి కూర్చుని వృక్షము మరియు డ్రామా యొక్క పూర్తి జ్ఞానాన్ని ఇస్తారు. కారణంగా పరమాత్మను జ్ఞాన సాగరుడు, బీజ రూపుడు అని అంటారు. వీరు మనుష్య సృష్టికి బీజరూపుడు, వారు పైన ఉంటారు. ఆత్మల యొక్క నిరాకారీ ప్రపంచం ఏదైతే ఉందో, దానిని బ్రహ్మాండము, బ్రహ్మ లోకము అని అంటారు. అక్కడ ఆత్మలు అండము వలె ఉంటాయి. ఆత్మ యొక్క బిందు రూపాన్ని సాక్షాత్కారం కూడా చేసుకుంటారు. ఎలాగైతే ఫైర్ ఫ్లై (మిణుగురు పురుగు) అన్నీ కలిసి ఎగిరేటప్పుడు ప్రకాశిస్తాయి, కానీ లైట్ తక్కువగా ఉంటుంది. అలాగే ఆత్మలు కూడా గుంపుగా ఎగురుతాయి. చిన్న బిందువులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. బాబా మీకు మొత్తం డ్రామా యొక్క సాక్షాత్కారం చేయిస్తారు. డ్రామాలో ఆత్మ పాత్రధారి, కానీ పాత్రధారులకు డ్రామా గురించి తెలియదు. ఒకటేమో బాబాను, రెండవది నాలెడ్జ్ ను మీరు స్మృతి చేయాలి. సెకండుకు సంబంధించిన జ్ఞానము చాలా సింపుల్. కానీ జ్ఞానం ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో, విస్తారం చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మర్చిపోతారు. మాయ యొక్క విఘ్నాలు కూడా వస్తాయి. శారీరక అనారోగ్యాలు వస్తాయి. ఇంతకుముందు ఎప్పుడూ జ్వరం వచ్చి ఉండకపోవచ్చు, జ్ఞానంలోకి వచ్చిన తర్వాత జ్వరం వస్తే, జ్ఞానంలోనైతే బంధనం సమాప్తమవ్వాలి కదా అని సంశయం కలుగుతుంది. కానీ బాబా అంటారు, అనారోగ్యాలు ఇంకా వస్తాయి, లెక్కాచారము కూడా సమాప్తం చేసుకోవాలి.

భక్తిలో మనుష్యులు నవరత్నాల ఉంగరం ధరిస్తారు. మధ్యలో విలువైన రత్నం పెడతారు, చుట్టు ప్రక్కల తక్కువ విలువ కలవాటిని పెడతారు. కొన్ని రత్నాలు వేల విలువ కలిగి ఉంటాయి, కొన్ని వందల విలువ... బాబా అంటారు, ఇది వజ్రం వంటి అమూల్యమైన జీవితము. కావున సూర్యవంశంలో జన్మ తీసుకోవాలి. సత్యయుగం యొక్క మహారాజా, మహారాణికి మరియు త్రేతా అంతిమములోని రాజా-రాణికి ఎంత తేడా ఉంటుంది. డ్రామా యొక్క కథను ఇతరులకు కూడా అర్థం చేయించాలి. మీరు వస్తే మేము మీకు అర్థం చేయిస్తాము, 5 వేల సంవత్సరాల క్రితము ఒక చాలా మంచి దేవతల రాజ్యం ఉండేది. వారు పదవిని ఎలా పొందారు! లక్ష్మీ-నారాయణులు, ఎవరైతే సత్యయుగ రాజ్యాన్ని తీసుకుంటారో, వారి 84 జన్మల చరిత్ర-భౌగోళికాన్ని వినిపిస్తాము. ఇలాంటి-ఇలాంటి టెంప్టేషన్ (ప్రలోభం) కలిగించి వారిని లోపలికి తీసుకురావాలి. ఇది సెకండు యొక్క కథ, కానీ పదమాల విలువ కలది. మీరు ఎక్కడికైనా వెళ్ళవచ్చు. కాలేజీలకు, యూనివర్సిటీలకు, హాస్పిటల్కు వెళ్ళండి, వారితో చెప్పాలి, మీరు ఎంత వ్యాధిగ్రస్థులవుతారు, మేము మీకు ఎటువంటి మందునిస్తామంటే, 21 జన్మలు వ్యాధిగ్రస్థులుగా కానే కారు. మీరు విన్నారా, పరమాత్మ మన్మనాభవ అని చెప్పారు. మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఎటువంటి కొత్త వికర్మలు జరగనే జరగవు. మీరు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అవుతారు. మీరు వస్తే మేము పరమపిత పరమాత్మ యొక్క జీవిత చరిత్రను చెప్తాము. పరమాత్మను సర్వవ్యాపి అని అనడము, ఇదేమైనా జీవిత చరిత్రనా. ఇలా-ఇలా అర్థం చేయించాలి.

అచ్ఛా - రోజు భోగ్ ఉంది. పాట:- ధరణిని ఆకాశము పిలిచింది... దీనిని పాత అసత్యపు ప్రపంచము అని అంటారు. దీనిని రౌరవ నరకము అని అంటారు. పాట కూడా బాగుంది, ప్రేమ యొక్క ప్రపంచంలోకి రావాల్సిందే. సూక్ష్మవతనంలో కూడా ప్రేమ ఉంది కదా. చూడండి, ధ్యానంలోకి చాలా సంతోషంగా వెళ్తారు. సత్యయుగంలో కూడా సుఖం ఉంటుంది, ఇక్కడైతే ఏమీ లేదు. మరి ప్రపంచంపై వైరాగ్యం కలగాలి. సన్యాసులది హద్దు వైరాగ్యము. మీదైతే అనంతమైన వైరాగ్యము. మీరైతే మొత్తం ప్రపంచాన్ని మర్చిపోవాలి. బాబా బాంబేలో ఒక ఉత్తరం రాసారు. బాబా కేవలం బొంబాయి వారికే చెప్పడం లేదు, కానీ అన్ని సెంటర్ల వారి కోసం బాబా సలహా ఇస్తారు. మీరు ఉదయము మరియు సాయంత్రము భాషణ చేయాల్సి ఉంటుంది. కావున ప్రతి పట్టణంలో పెద్ద-పెద్ద హాల్స్ అయితే ఉంటాయి మరియు చాలామందికి మిత్ర-సంబంధీకులు కూడా ఉంటారు, కనుక అడ్వర్టైజ్ చేయాలి, మేము పరమపిత పరమాత్మ యొక్క పరిచయం ఇవ్వాలి. అప్పుడు అందరూ పరమాత్మ నుండి తమ బర్త్ రైట్ (జన్మ హక్కు) ను తీసుకోగలరు. మాకు కేవలం గంటన్నర ఉదయము, గంటన్నర సాయంత్రము కోసం హాలు కావాలి. ఎటువంటి హంగామా ఉండదు, బాజా-భజంత్రీలు ఉండవు. అయితే, ఎవరైనా తగినంత అద్దెకు ఇచ్చినట్లయితే మేము తీసుకోగలము. ఏరియాను కూడా చూడాలి, బాగుందా లేదా అని ఇల్లును కూడా చూడాలి. మంచి వ్యక్తి అయితే మంచి జిజ్ఞాసువులను తీసుకొని వస్తారు. ఇలా-ఇలా 4-5 చోట్ల భాషణ చేయాలి. పెద్ద-పెద్ద పట్టణాలలో ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ లభించకపోతే సెకండ్ ఫ్లోర్, లేదంటే తప్పనిసరి పరిస్థితిలో థర్డ్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. ఇలా గ్రామ-గ్రామాల్లో కూడా చేయాలి. గ్రామం ఎలా ఉంటే అలా. ఏదైనా చిన్న ఇల్లు ఉండాలి. ఇల్లు అంతా అవసరం లేదు. కేవలం 3 అడుగుల భూమి కావాలి. అందరూ తమ సంబంధీకులతో మాట్లాడుతూ ఉండాలి, అప్పుడు ఎవరో ఒకరు ఇచ్చేస్తారు. ఇలా సెంటర్స్ తెరుస్తూ ఉండాలి. కొందరైతే అద్దెను కూడా తీసుకోరు. ఇంకా కొందరు తీసుకుంటూ-తీసుకుంటూ ఒకవేళ బాణం తగిలిందంటే అది కూడా తీసుకోవడము మానేస్తారు. విశాల బుద్ధి కలవారు ఎవరైతే ఉంటారో, వారు బాగా అర్థం చేసుకొని ధారణ చేస్తారు. ఎవరికైతే విశాల బుద్ధి ఉంటుందో, వారిని మహారథి అని అంటారు. వారైతే ఒకరి తర్వాత ఒకరు సెంటర్లు తెరుస్తూ వెళ్తారు. పిల్లలకు తెలుసు, మేము మా రాజ్యాన్ని శ్రీమతముపై గుప్తంగానే గుప్త స్థాపన చేస్తున్నాము. స్థాపన ఎలా చేస్తారు? దీని వేరెవ్వరూ తెలుసుకోలేరు. పవిత్రంగా ఉండాలి, అంతే. అయితే బాబా అన్నారు, మాయ దుఃఖం ఇచ్చింది, దీనిని వదిలేయండి. మాయాజీతులుగా, జగజ్జీతులుగా అవ్వండి. మనసును జయించే విషయం కాదు. మనసైతే శాంతిగా శాంతిధామంలోనే ఉంటుంది. ఇక్కడ శరీరం ఉంది కనుక శాంతిగా ఉండలేరు. శాంతిధామమంటే పరంధామము. ఇక్కడ వివరణ లభిస్తుంది కనుక చింతన కూడా నడుస్తూ ఉండాలి. అక్కడ సెంటర్కు వచ్చారు, కథను విన్నారు మరియు వ్యాపారంలో నిమగ్నమైపోయారు, ఇక సమాప్తము. ఇక్కడ తాజా-తాజాగా ఉంటారు, అందుకే పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. భారత్ పరమాత్మ యొక్క జన్మ-స్థానము అని ప్రపంచంవారి బుద్ధిలో ఉండదు. ఇక్కడ వినడము వలన మేము శరీరం వదిలి అమరలోకానికి వెళ్తామని మీకు నషా ఉంటుంది. సత్యయుగంలో ఇలా ఉండదు, ఫలానావారు మరణించారు. అలా ఉండదు, ఎప్పుడైతే పాత వస్త్రాన్ని విడిచిపెడతారు, కొత్తది తీసుకుంటారో మరి సంతోషం కలుగుతుంది కదా. వాయిద్యాలు మ్రోగుతాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అనంతమైన ప్రపంచముపై వైరాగ్యముంచి దీనిని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. అవినాశీ జ్ఞాన రత్నాలను ధారణ చేసి భవిష్యత్తు కోసం ధనవంతులుగా అవ్వాలి.

2. కొత్త ప్రపంచము కోసం తండ్రి విషయాలనైతే వినిపిస్తారో వాటిని గుర్తు పెట్టుకోవాలి. చదివిన మిగతా విషయాలన్నింటినీ మర్చిపోవాలి, ఇలా జీవిస్తూనే మరణించాలి.

వరదానము:-

కళ్యాణకారీ యుగంలో స్వయానికి మరియు సర్వులకు కళ్యాణము చేసే ప్రకృతిజీత్, మాయాజీత్ భవ


కళ్యాణకారీ యుగంలో, కళ్యాణకారి తండ్రితో పాటు పిల్లలైన మీరు కూడా కళ్యాణకారులు. మేము విశ్వ పరివర్తకులము - ఇది మీ ఛాలెంజ్. ప్రపంచము వారికి కేవలం వినాశనం కనిపిస్తుంది, అందుకే - ఇది అకళ్యాణ సమయము అని భావిస్తారు కానీ మీ ఎదురుగా వినాశనంతో పాటు స్థాపన కూడా స్పష్టంగా ఉంది మరియు మనసులో, ఇప్పుడు సర్వుల కళ్యాణం జరగాలి అన్న శుభ భావన ఉంది. మనుష్యాత్మలకే కాక ప్రకృతికి కూడా కళ్యాణం చేసేవారే ప్రకృతిజీత్, మాయాజీత్ అని పిలవబడతారు, వారి కోసం ప్రకృతి సుఖదాయిగా అవుతుంది.

స్లోగన్:-

అతీతంగా-ప్రియంగా అయి కర్మలు చేసేవారే సంకల్పాలకు సెకండులో ఫుల్ స్టాప్ పెట్టగలరు.

 Download PDF

 

Post a Comment

0 Comments