Hindi/Tamil./English/Telugu/Kannada/Malayalam
16-05-2022 ప్రాత:మురళి ఓంశాంతి “బాప్ దాదా”మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈశ్వరీయ
పరివారానికి చెందినవారు, ఈశ్వరీయ పరివారం యొక్క లా (నియమము) -
పరస్పరంలో సోదరులుగా ఉండడము, బ్రాహ్మణ కులం యొక్క లా -
సోదరీ-సోదరులుగా ఉండడము, అందుకే వికారీ దృష్టి ఉండలేదు’’
ప్రశ్న:-
ఈ సంగమయుగము కళ్యాణకారీ యుగము - ఎలా?
జవాబు:-
ఈ సమయంలోనే తండ్రి తమ ప్రియమైన పిల్లల సమ్ముఖంలోకి వస్తారు మరియు తండ్రి, టీచరు, సద్గురువు యొక్క పాత్ర ఇప్పుడే
నడుస్తుంది. ఈ కళ్యాణకారీ సమయంలోనే పిల్లలైన మీరు తండ్రి యొక్క అతీతమైన మతాన్ని, ఏదైతే నరకాన్ని స్వర్గంగా
తయారుచేస్తుందో మరియు అందరికీ సద్గతినిస్తుందో, ఆ శ్రీమతాన్ని తెలుసుకుంటారు మరియు దాని
అనుసారంగా నడుచుకుంటారు.
ప్రశ్న:-
మీ సన్యాసము సతోప్రధానమైన సన్యాసము - ఎలా?
జవాబు:-
మీరు బుద్ధి ద్వారా ఈ మొత్తం పాత ప్రపంచాన్ని మర్చిపోతారు. మీరు ఈ సన్యాసంలో
కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తారు, పవిత్రంగా అవుతారు మరియు పథ్యం పాటిస్తారు, తద్వారా దేవతలుగా అవుతారు. వారి
సన్యాసము హద్దులోనిది,
అనంతమైనది
కాదు.
గీతము:- భోళానాథుని కన్నా అతీతమైనవారు
ఎవ్వరూ లేరు... (భోలేనాథ్ సే నిరాలా...)
ఓంశాంతి. మొట్టమొదట తండ్రి పిల్లలకు అర్థం
చేయిస్తారు,
స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. 5 వేల సంవత్సరాల క్రితం కూడా తండ్రి మన్మనాభవ
అని చెప్పారు. దేహం యొక్క సంబంధాలన్నింటినీ విడిచి స్వయాన్ని అశరీరి ఆత్మగా
భావించండి. అందరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా? స్వయాన్ని ఎవరూ పరమాత్మగా భావించడం లేదు కదా? పాపాత్మ, పుణ్యాత్మ, మహాన్ ఆత్మ అని పాడుతారు కూడా.
మహాన్ పరమాత్మ అని అనడం జరగదు. ఆత్మ పవిత్రంగా అయినట్లయితే శరీరం కూడా పవిత్రమైనది
లభిస్తుంది. మాలిన్యం ఆత్మలోనే చేరుకుంటుంది. తండ్రి కూర్చొని పిల్లలకు యుక్తిగా
అర్థం చేయిస్తారు. తప్పకుండా ఆత్మ రూపంలో మనమంతా సోదరులము మరియు శరీరం పరంగా
సంబంధంలోకి వచ్చినప్పుడు సోదరీ-సోదరులము. ఇప్పుడు చాలామంది యుగళులు కూర్చుని
ఉన్నారు,
వారికి
పరస్పరంలో సోదరీ-సోదరులుగా భావించమని చెప్తే డిస్టర్బ్ అవుతారు. కానీ ఆత్మలమైన
మనందరి తండ్రి ఒక్కరే కావున మనం పరస్పరంలో సోదరులుగా అయ్యాము అన్న ఈ లా అర్థం
చేయించడం జరుగుతుంది. తర్వాత మనుష్య తనువులోకి వచ్చినప్పుడు ప్రజాపిత బ్రహ్మా
ద్వారా రచనను రచిస్తారు. కావున తప్పకుండా వారి ముఖవంశావళి పరస్పరంలో సోదరీ-సోదరులు
అయినట్లు. పరమపిత పరమాత్మ అని అందరూ అంటారు కూడా. తండ్రి ఉన్నదే స్వర్గ రచయిత. మనం
వారి పిల్లలము కావున మనం స్వర్గానికి యజమానులుగా ఎందుకు అవ్వకూడదు. కానీ స్వర్గము
ఉండేదే సత్యయుగంలో. అంతేకానీ తండ్రి వచ్చి కొత్త సృష్టిని రచిస్తారు అనేమీ కాదు.
తండ్రి వచ్చి పాతదానిని కొత్తగా చేస్తారు అనగా ఈ విశ్వాన్ని పరివర్తన చేస్తారు.
కావున తప్పకుండా తండ్రి ఇక్కడకు వచ్చారు. భారత్ కు స్వర్గం యొక్క వారసత్వాన్ని
ఇచ్చారు. వారి స్మృతి చిహ్నమైన సోమనాథ మందిరాన్ని అన్నింటికన్నా పెద్దదిగా
తయారుచేసారు. తప్పకుండా భారత్ లో ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉండేది, ఇతర ధర్మమేదీ ఉండేది కాదు, మిగిలినవన్నీ తర్వాత వృద్ధి
చెందాయి. కావున తప్పకుండా మిగిలిన ఆత్మలన్నీ నిర్వాణధామంలో తండ్రి వద్ద ఉంటాయి.
భారతవాసులు జీవన్ముక్తులుగా ఉండేవారు. సూర్యవంశములో ఉండేవారు. ఇప్పుడు జీవన
బంధనంలో ఉన్నారు. సెకెండులో జీవన్ముక్తి లభించింది అని జనకుని ఉదాహరణ కూడా ఉంది. జీవన్ముక్తి
అని మొత్తం స్వర్గాన్ని అంటారు. ఇకపోతే వారిలో ఎవరెంతగా శ్రమించారో, అంతటి పదవిని పొందారు.
జీవన్ముక్తులు అనైతే అందరినీ అంటారు. కావున తప్పకుండా ముక్తి-జీవన్ముక్తిదాత ఒక్క
సద్గురువై ఉండాలి. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడైతే అందరూ మాయా బంధనాలలో
ఉన్నారు. ఈశ్వరుని గతి-మతి అతీతమైనవి... అని అంటారు. వారిది శ్రీమతము. వారు
తప్పకుండా వస్తారు. చివర్లో అందరూ ఓహో ప్రభూ అని అంటారు. మీరిప్పుడు అంటున్నారు, ఓహో ప్రభూ, నరకాన్ని స్వర్గంగా తయారుచేసే మీ
ఈ గతి చాలా అతీతమైనది. మనం మళ్ళీ సహజ రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీకు తెలుసు.
కల్పక్రితం కూడా సంగమంలోనే నేర్పించి ఉంటారు కదా. తండ్రి స్వయంగా అంటారు - ‘‘ప్రియమైన పిల్లలూ, నేను పిల్లలైన మీ సమ్ముఖంలో
మాత్రమే వస్తాను.’’
వారు
సుప్రీమ్ తండ్రి కూడా,
అలాగే
సుప్రీమ్ టీచర్ కూడా. వారు జ్ఞానాన్ని ఇస్తారు, ఇతరులెవ్వరూ ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని
ఇవ్వలేరు. ఈ సృష్టి చక్రం యొక్క ఆదిమధ్యాంతాల గురించి లేక ప్రపంచం యొక్క
చరిత్ర-భౌగోళికం గురించి ఎవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ స్థాపన మరియు వినాశనం
యొక్క కార్యాలను ఎలా చేయిస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరు ఇప్పుడు
తెలుసుకున్నారు. మనుష్యులను దేవతలుగా మార్చడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు....
ఈ మహిమ వారిదే. మురికి పట్టిన వస్త్రాలను శుభ్రపరుస్తారు... ఇప్పుడు ప్రతి ఒక్కరు
స్వయాన్ని ప్రశ్నించుకోండి,
మేము
మురికి పట్టినవారి వలె ఉన్నామా లేక పవిత్రంగా ఉన్నామా? అకాల సింహాసనం కదా. అకాలమూర్తి, వారి సింహాసనం ఎక్కడ ఉంది? తప్పకుండా అది పరంధామము లేక
బ్రహ్మ మహాతత్వము. ఆత్మలమైన మనం కూడా అక్కడ ఉంటాము. దానిని కూడా అకాల సింహాసనమని
అంటారు. అక్కడికి ఎవరూ రాలేరు. ఆ స్వీట్ హోమ్ లో మనం ఉంటాము, బాబా కూడా అక్కడే ఉంటారు. ఇకపోతే
అక్కడ ఉండడం కోసం సింహాసనము లేక కుర్చీలు మొదలైనవేవీ లేవు. అక్కడైతే అశరీరిగా
ఉంటారు కదా. కావున క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది అనగా యోగ్యులుగా అవుతారు అని
అర్థం చేయించాలి.
తండ్రి అంటారు, శివబాబాను స్మృతి చేయండి, విష్ణుపురిని స్మృతి చేయండి.
ఇప్పుడు మీరు బ్రహ్మాపురిలో కూర్చున్నారు. మీరు బ్రహ్మాకు సంతానము మరియు శివబాబాకు
కూడా పిల్లలు. ఒకవేళ తమను తాము సోదరీ-సోదరులుగా భావించకపోతే కామ వికారంలోకి
వెళ్ళిపోతారు. ఇది ఈశ్వరీయ పరివారము. మొదట మీరు కూర్చుని ఉన్నారు, దాదా కూడా ఉన్నారు, బాబా కూడా ఉన్నారు, మీరు వారి పిల్లలు, మీరు బ్రహ్మా ద్వారా శివబాబా సంతానముగా
అయ్యారు. శివునికి మనవలు. మళ్ళీ మనుష్య తనువులో ఉన్నప్పుడు సోదరీ-సోదరులుగా
అవుతారు. ఈ సమయంలో మీరు ప్రాక్టికల్ గా సోదరీ-సోదరులుగా ఉన్నారు. ఇది బ్రాహ్మణుల
కులము. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకునే విషయము. జీవన్ముక్తి కూడా క్షణములో
లభిస్తుంది. ఇకపోతే పదవులైతే ఎన్నో ఉన్నాయి. అక్కడ దుఃఖమిచ్చేటువంటి మాయ అయితే
ఉండదు. సత్యయుగము నుండి మొదలుకొని కలియుగం వరకు రావణుడిని కాలుస్తూ ఉంటారని కాదు.
పరంపర నుండి కాలుస్తూ వస్తారు అని అంటారు కదా, అది అసంభవము. స్వర్గంలో అసురులు ఎక్కడ నుండి
వచ్చారు?
ఇది ఆసురీ
సంప్రదాయమని తండ్రి అన్నారు. ఇక వారికి అకాసురుడు, బకాసురుడు అన్న పేర్లు పెట్టారు. కృష్ణుడు
ఆవులను మేపారు అని అంటారు,
ఈ పాత్ర
కూడా నడిచింది,
శివబాబా
ఆవులు మీరే కదా. శివబాబా అందరికీ జ్ఞానమనే గడ్డిని తినిపిస్తారు. గడ్డిని
తినిపించేవారు,
పాలన
చేసేవారు వారే.
మనుష్యులు మందిరాలకు వెళ్ళి దేవతల మహిమను
పాడుతారు,
మీరు
సర్వగుణ సంపన్నులు మరియు మేము నీచులము, పాపులము... తమను తాము దేవతలుగా చెప్పుకోలేరు, హిందువులని చెప్పుకుంటారు. అసలు
పేరు భారత్. యదా యదాహి ధర్మస్య, గ్లానిర్భవతి భారత... అని గీతలో కూడా ఉంది.
గీతలో హిందుస్థాన్ అని అయితే అనలేదు. ఇది భగవానువాచ. భగవంతుడు ఒక్క నిరాకారుడు, వారు అందరికీ తెలుసు. స్వర్గంలో
అందరూ దైవీ గుణాల కల మనుష్యులు ఉంటారు. వారికే 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. కావున
తప్పకుండా స్వర్గం నుండి నరకంలోకి వస్తారు. మీరే పూజ్యులు మరియు మీరే పూజారులు
అన్నదానికి కూడా అర్థం ఉంటుంది కదా. నంబరువన్ పూజ్యులు శ్రీకృష్ణుడు. కిశోరావస్థను
సతోప్రధానమని అనడం జరుగుతుంది. బాల్యావస్థ సతో, యువావస్థ రజో, వృద్ధాప్యము తమో. సృష్టి కూడా సతో, రజో, తమోగా అవుతుంది. కలియుగం తర్వాత
మళ్ళీ సత్యయుగం రావాలి. తండ్రి సంగమంలోనే వస్తారు. ఇది అత్యంత కళ్యాణకారీ యుగము.
ఇటువంటి యుగము ఇంకేదీ ఉండదు. సత్యయుగం నుండి త్రేతాలోకి వచ్చారు, దానిని కళ్యాణకారీ అని అనరు
ఎందుకంటే రెండు కళలు తగ్గిపోయినప్పుడు దానిని కళ్యాణకారి యుగమని ఎలా అంటారు? తర్వాత ద్వాపరంలోకి వచ్చినప్పుడు
ఇంకా కళలు తగ్గిపోతాయి,
కావున ఇది
కళ్యాణకారీ యుగము కాదు. కళ్యాణకారి అయినది ఈ సంగమయుగము మాత్రమే, ఈ సమయంలో తండ్రి ముఖ్యంగా భారత్
కు మరియు సాధారణంగా అందరికీ గతి-సద్గతిని ఇస్తారు. ఇప్పుడు మీరు స్వర్గం కోసం
పురుషార్థం చేస్తున్నారు. తండ్రి అంటారు, ఈ దేవీ-దేవతా ధర్మమే సుఖమిచ్చేటువంటిది. మీరు
మీ ధర్మాన్ని మర్చిపోయారు,
అందుకే
వేరే-వేరే ధర్మాలలోకి వెళ్ళిపోతారు. వాస్తవానికైతే మీ ధర్మం అన్నింటికన్నా
ఉన్నతమైనది. ఇప్పుడు మీరు మళ్ళీ అదే రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కావున
శ్రీమతంపై నడుచుకోవాల్సి ఉంటుంది. మిగిలినవారంతా ఆసురీ రావణ మతంపై ఉన్నారు.
అందరిలోనూ 5
వికారాలున్నాయి, అందులోనూ మొదటిది అశుద్ధ
అహంకారము. తండ్రి అంటారు,
దేహ
అహంకారాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వండి, అశరీరి భవ. మీరు తండ్రినైన నన్ను
మర్చిపోయారు. ఇది కూడా తికమక దారుల ఆట. చాలామంది ఏమంటారంటే, కిందకు పడాల్సిందే అన్నప్పుడు ఇక
పురుషార్థం ఎందుకు చేయాలి?
అరే, పురుషార్థం చేయకపోతే స్వర్గం
యొక్క రాజ్యం ఎలా లభిస్తుంది. డ్రామాను కూడా అర్థం చేసుకోవాలి. ఇదంతా ఒకే సృష్టి, దీని చక్రం తిరుగుతూ ఉంటుంది.
సత్యయుగ ఆది సత్యము,
సత్యంగా
ఉంది,
సత్యంగా
ఉంటుంది కూడా... ప్రపంచ చరిత్ర-భౌగోళికములు రిపీట్ అవుతాయని అంటారు కూడా. మరి
ఎప్పుడు మొదలవుతుంది?
ఎలా
రిపీట్ అవుతుంది?
దాని కోసం
మీరు పురుషార్థం చేస్తారు. తండ్రి అంటారు, నేను మళ్ళీ మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు
వచ్చాను. మీరు కూడా నేర్చుకుంటారు. రాజ్యం స్థాపన అవుతుంది. యాదవులు, కౌరవులు సమాప్తమైపోతారు మరియు
జయజయకారాలు జరుగుతాయి. అప్పుడు ముక్తి-జీవన్ముక్తి యొక్క ద్వారాలు తెరచుకుంటాయి.
లేదంటే అంతవరకు దారి మూయబడి ఉంటుంది. యుద్ధం ప్రారంభమైనప్పుడే గేట్
తెరుచుకుంటుంది. తండ్రి వచ్చి మార్గదర్శకునిగా అయి తీసుకువెళ్తారు. వారు లిబరేటర్
(ముక్తిదాత) కూడా. మాయ పంజా నుండి విడిపిస్తారు. గురువుల సంకెళ్ళలో చాలా
చిక్కుకుని ఉన్నారు. గురువు ఆజ్ఞను పాటించకపోతే ఏదైనా శాపము లభిస్తుందేమోనని చాలా
భయపడతారు. అరే,
ఆజ్ఞను
మీరు అసలు ఎక్కడ పాటిస్తున్నారు. వారు నిర్వికారులు, పవిత్రులు మరియు మీరు వికారులు, అపవిత్రులు. గురువుల పట్ల
మనుష్యులకు ఎంత భావన ఉంటుంది. వారు ఏం చేస్తారో ఏమీ తెలియదు. అది భక్తి మార్గం
యొక్క ప్రభావము. ఇప్పుడు మీరు తెలివైనవారిగా అయ్యారు. బ్రహ్మా, విష్ణు, శంకరులు సూక్ష్మవతన వాసులని మీకు
తెలుసు. వారిలో కూడా బ్రహ్మా నుండి విష్ణువుగా అయ్యే పాత్ర ఇక్కడ ఉంది. శంకరునికి
ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నది జగదంబ, జగత్పిత మరియు పిల్లలైన మీరు. అయితే, ఇన్ని భుజాలు కల దేవీలు
మొదలైనవారిని ఎంతమందిని కూర్చుని తయారుచేస్తారు, ఎన్నో చిత్రాలున్నాయి. ఈ చిత్రాలన్నీ భక్తి
మార్గం కోసము. మనుష్యులైతే మనుష్యులే. రాధే-కృష్ణులు మొదలైన వారికి కూడా 4 భుజాలను చూపిస్తారు. దీపావళి నాడు
మహాలక్ష్మికి పూజ చేస్తారు,
వాటిలో 2 భుజాలు లక్ష్మివి, 2 భుజాలు నారాయణుడివి. అందుకే
ఇరువురికీ కంబైండు రూపంలో పూజ జరుగుతుంది. ఇది ప్రవృత్తి మార్గము, ఇక్కడ ఇంకేమీ లేదు. కాళీ నాలుకను
ఎలా చూపిస్తారు. కృష్ణుడిని కూడా నల్లగా చేసేసారు. వామ మార్గంలోకి వెళ్ళిన కారణంగా
నల్లగా అయిపోతారు. మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చోవడంతో తెల్లగా అవుతారు. జగదంబ అందరి
మనోకామనలను పూర్తి చేసేటువంటి మధురమైన మమ్మా, వారి మూర్తిని కూడా నల్లగా చేసేసారు. ఎంతమంది
దేవీలను తయారుచేస్తారు. పూజించి సముద్రంలో ముంచేస్తారు. కావున ఇది బొమ్మల పూజ
అయినట్లు కదా. బాబా అంటారు,
ఇదంతా
డ్రామాలో నిశ్చయించబడి ఉంది, మళ్ళీ అలాగే జరుగుతుంది. భక్తి మార్గం యొక్క
విస్తారము ఎంతగానో ఉంది. ఎన్ని మందిరాలు, ఎన్ని చిత్రాలు, శాస్త్రాలు మొదలైనవి ఉన్నాయి, ఇక అడగకండి. సమయము వృథా... ధనము
వృథా... మనుష్యులు ఈ సమయంలో పూర్తిగా తుచ్ఛబుద్ధి కలవారిగా ఉన్నారు. గవ్వ వలె
అయిపోతారు. తండ్రి అంటారు,
ఇప్పుడు
భక్తి మార్గం యొక్క ఎదురుదెబ్బలు చాలా తిన్నారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఈ
జంజాటాల నుండి విడిపిస్తారు. కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి
మరియు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది. పథ్యము కూడా పాటించాల్సి
ఉంటుంది. లేదంటే ఎటువంటి ఆహారమో, అటువంటి మనస్సు తయారవుతుంది. సన్యాసులకు కూడా
గృహస్థుల వద్ద జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అది రజోప్రధాన సన్యాసము, ఇది సతోప్రధాన సన్యాసము. మీరు
పాత ప్రపంచాన్ని సన్యసిస్తారు. ఆ సన్యాసంలో కూడా ఎంత బలముంది. ప్రెసిడెంటు కూడా
గురువుల ముందు తల వంచి నమస్కరిస్తారు. భారత్ పవిత్రంగా ఉండేది. దాని మహిమ గాయనము
చేయబడుతుంది. భారతవాసులు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఇప్పుడైతే సంపూర్ణ
వికారులుగా ఉన్నారు. దేవతల మందిరాలలోకి వెళ్తున్నారంటే, తప్పకుండా ఆ ధర్మానికి చెందినవారై
ఉంటారు. గురునానక్ మందిరానికి వెళ్తున్నారంటే తప్పకుండా సిక్కు ధర్మంవారై ఉంటారు
కదా. కానీ వీరంతా స్వయాన్ని దేవతా ధర్మానికి చెందినవారిగా చెప్పుకోలేరు ఎందుకంటే
పవిత్రంగా లేరు.
ఇప్పుడు తండ్రి అంటారు, నేను మళ్ళీ శివాలయాన్ని
తయారుచేయడానికి వచ్చాను. స్వర్గంలో కేవలం దేవీ-దేవతలు మాత్రమే ఉంటారు. ఈ జ్ఞానం
మళ్ళీ ప్రాయః లోపమైపోతుంది. గీత, రామాయణము మొదలైనవన్నీ సమాప్తమవ్వనున్నాయి.
డ్రామానుసారంగా మళ్ళీ వాటి సమయంలో వస్తాయి. ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన
విషయాలు. ఇది ఉన్నదే మనుష్యుల నుండి దేవతలుగా తయారయ్యే పాఠశాల. కానీ మనుష్యులు
మనుష్యుల సద్గతిని ఎప్పుడూ చేయలేరు. అల్పకాలికమైన సుఖాన్ని అయితే అందరూ ఒకరికొకరు
ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక్కడ అల్పకాలికమైన సుఖముంది, మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. సత్యయుగంలో దుఃఖం
యొక్క పేరే ఉండదు. దాని పేరే స్వర్గము, సుఖధామము. స్వర్గము యొక్క పేరు ఎంత ప్రసిద్ధమైనది.
తండ్రి అంటారు,
గృహస్థ
వ్యవహారంలో ఉండండి కానీ ఈ అంతిమ జన్మలో తండ్రితో ప్రతిజ్ఞ చేయాలి, బాబా, నేను మీ బిడ్డను, ఈ అంతిమ జన్మలో తప్పకుండా
పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచం యొక్క వారసత్వాన్ని తీసుకుంటాను. తండ్రిని స్మృతి
చేయడం చాలా సులభము. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. దేహ-అహంకారాన్ని వదిలి దేహీ-అభిమానులుగా
అవ్వాలి. అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి.
2. డ్రామాను యథార్థ రీతిలో అర్థం చేసుకుని
పురుషార్థం చేయాలి. డ్రామాలో ఉంటే చేస్తాములే అని ఆలోచించి పురుషార్థ హీనులుగా
అవ్వకూడదు.
వరదానము:-
సంగమయుగం యొక్క మహత్వాన్ని తెలుసుకుని శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని తయారుచేసుకునే
తీవ్ర పురుషార్థీ భవ
సంగమయుగము
చిన్న యుగము,
ఈ
యుగములోనే తండ్రి తోడు అనుభవమవుతుంది. సంగమ సమయము మరియు ఈ జీవితము, రెండూ వజ్రతుల్యమైనవి. కనుక
ఇంతటి మహత్వాన్ని తెలుసుకుని ఒక క్షణం కూడా తండ్రి తోడును వదలకూడదు. ఒక క్షణం
పోయిందంటే,
క్షణం
కాదు,
చాలా
పోయినట్లు. మొత్తం కల్పం యొక్క శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని జమ చేసుకునే యుగమిది, ఒకవేళ ఈ యుగం యొక్క మహత్వాన్ని
గుర్తుంచుకున్నా సరే,
తీవ్ర
పురుషార్థం ద్వారా రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు.
స్లోగన్:-
సర్వులకు స్నేహము మరియు సహయోగాన్ని ఇవ్వడమే విశ్వ సేవాధారిగా అవ్వడము.
0 Comments