Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam
28-06-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ - బ్రహ్మా
ముఖ వంశావళి బ్రాహ్మణులైన మీరు అనంతమైన తండ్రి నుండి 21 జన్మల పూర్తి వారసత్వాన్ని
తీసుకునేందుకు శ్రీమతముపై తప్పకుండా నడవాలి’’
ప్రశ్న:-
పిల్లలైన మీరు ఏ ఏర్పాట్లు చేసుకుంటున్నారు? మీ ప్లాన్ ఏమిటి?
జవాబు:-
మీరు అమరలోకములోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మీ ప్లాన్,
భారత్
ను స్వర్గంగా తయారుచేయడము. మీరు మీ తనువు-మనసు-ధనముల ద్వారానే ఈ భారత్ ను
స్వర్గంగా తయారుచేసే సేవలో నిమగ్నమై ఉన్నారు. మీరు తండ్రికి పూర్తి సహాయకులుగా
ఉన్నారు. అహింసా బలముతో మీ కొత్త రాజధాని స్థాపన అవుతుంది. మనుష్యులైతే వినాశనం
కోసము ప్లాన్లు తయారుచేస్తూ ఉంటారు.
గీతము:- మాతా ఓ మాతా... (మాతా ఓ మాతా...)
ఓంశాంతి. ఎవరి మహిమను విన్నారు? ఇద్దరు మాతలది. ఒకటేమో, మీరే తల్లి-తండ్రి... అని తండ్రి
మహిమ జరుగుతుంది, నిరాకారునికి కూడా, నీవే తల్లివి-తండ్రివి... అని మహిమ
జరుగుతుంది ఎందుకంటే తండ్రి ఉన్నారంటే తల్లి కూడా తప్పకుండా ఉంటారు. మీకు తెలుసు, పరమపిత పరమాత్మ ఎప్పుడైతే సృష్టి
రచించాల్సి ఉంటుందో, అప్పుడు తల్లి తప్పకుండా కావాలి.
తండ్రికైతే ఏదో ఒక సాధారణ తనువులోకి రావాల్సి ఉంటుంది. శివ జయంతి లేక శివరాత్రి
అని అంటూ ఉంటారు. తప్పకుండా పరమపిత పరమాత్మ అవతరిస్తారు. దేని కోసము? కొత్త రచనను రచించేందుకు, పాత రచనను వినాశనము చేసేందుకు. బ్రహ్మా
ద్వారానే రచనను రచించాల్సి ఉంటుంది. లౌకిక తండ్రి కూడా హద్దు బ్రహ్మా. వారు తమ
స్త్రీ ద్వారా హద్దు రచనను రచిస్తారు, అప్పుడు వారి పిల్లలు మాత్రమే వారిని తల్లి, తండ్రి అని అంటారు, అంతేకానీ, మీరే తల్లి-తండ్రి, మేము మీ పిల్లలము.... అని అందరూ
అనరు ఎందుకంటే ఇక్కడైతే ఇది చాలామంది పిల్లలకు సంబంధించిన విషయము. ప్రజాపిత
బ్రహ్మాకు చాలామంది పిల్లలు ఉన్నారు. అంటే తప్పకుండా బ్రహ్మా ముఖ కమలము ద్వారా
బ్రాహ్మణ కులాన్ని అనగా బ్రాహ్మణ వర్ణాన్ని అనంతమైన తండ్రి రచించి ఉంటారు. వారిది
ముఖము ద్వారా జన్మించిన సంతానము. ఆ తల్లిదండ్రులది గర్భం ద్వారా జన్మించిన
సంతానము. వారు ఈ మహిమను చేయలేరు. ఈ మహిమ అనంతమైన తల్లిదండ్రులది మాత్రమే. మీరే
తల్లి-తండ్రి... మీరే వచ్చి మమ్మల్ని తమ వారిగా చేసుకున్నారు. ఇక మీ నుండి మాకు
స్వర్గం యొక్క 21 జన్మల అపారమైన సుఖము లభిస్తుంది. కనుక బ్రహ్మా ముఖం ద్వారా మీరు
శివబాబాకు మనవళ్ళు, మనవరాళ్ళుగా అయ్యారు. జగదంబ సరస్వతి
బ్రహ్మా ముఖ వంశావళిగా అవుతారు. మీరే తల్లి-తండ్రి... అని భారత్ లో పాడుతారు, కావున తప్పకుండా జగదంబ, జగత్పిత ఉండాలి. వారి ముఖము
ద్వారానే మీరు దత్తత తీసుకోబడిన పిల్లలుగా అయ్యారు. వారసత్వము మీకు శివబాబా నుండి
లభిస్తుంది, అంతేకానీ, ఎవరిలోనైతే ప్రవేశించారో, ఎవరినైతే తల్లి అని అంటారో, ఆ బ్రహ్మా నుండి కాదు. తల్లి నుండి
వారసత్వం లభించదు. వారసత్వం ఎల్లప్పుడూ తండ్రి నుండి లభిస్తుంది. మీకు కూడా
వారసత్వము అనంతమైన తండ్రి నుండే లభిస్తూ ఉంది. భక్తి మార్గంలో మహిమ జరుగుతూ
వచ్చింది, కావున తప్పకుండా వారికి మళ్ళీ
రావాల్సి ఉంటుంది. పిల్లలు చాలా దుఃఖితులుగా ఉన్నారు. దుఃఖధామము తర్వాత సుఖధామము
రానున్నది. సత్యయుగంలో సతోప్రధాన సుఖము ఉంటుంది, తర్వాత త్రేతాలో కొద్దిగా తక్కువగా ఉంటుంది.
రెండు కళలు తక్కువ అని అంటారు. ద్వాపర, కలియుగాలలో దాని కన్నా కూడా తక్కువ అవుతూ
వస్తుంది. ఇప్పుడు ఈ చక్రమైతే తిరగాల్సిందే. పిల్లలకు తెలుసు, అనంతమైన తండ్రే స్వర్గ రచనను
రచిస్తారు. వారికి తప్పకుండా మొదట సూక్ష్మవతనాన్ని రచించాల్సి ఉంటుంది ఎందుకంటే
బ్రహ్మా అయితే తప్పకుండా కావాలి. బ్రహ్మాను కూడా శివబాబా దత్తత తీసుకుంటారు. నీవు
నా వాడివి అని అంటారు. వీరు కూడా, బాబా, నేను మీ వాడిని అని అంటారు, కనుక బ్రహ్మా శివుని పుత్రుడు
అయినట్లు. శివబాబాకు ముగ్గురు పిల్లలు, ముగ్గురి జీవితచరిత్ర గురించి తెలియజేస్తారు. ఈ
వ్యక్త బ్రహ్మా తర్వాత అవ్యక్తముగా అవుతారు. మీరు కూడా వ్యక్త బ్రహ్మా యొక్క
సంతానము, తర్వాత అవ్యక్త సంతానంగా అవుతారు.
ఇవి చాలా గుహ్యమైన విషయాలు. పరమపిత పరమాత్మ విశ్వ రచయిత. మొట్టమొదట స్వర్గాన్ని
రచిస్తారు. తండ్రి నుండైతే స్వర్గ వారసత్వము లభించాలి కదా. ఇప్పుడు మనము నరకంలో
ఉన్నాము. ఎప్పుడైతే మనల్ని రచించి ఉంటారో, వారసత్వాన్ని తప్పకుండా అప్పుడే ఇచ్చి ఉంటారు.
తండ్రి అంటారు - ఇప్పుడు నేను రచిస్తున్నాను. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను ఈ
విధంగానే వచ్చి బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ కులాన్ని రచించాను. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం
ఏదైతే ఉందో, దానిని బ్రాహ్మణులే సంభాళించగలరు.
కావున వీరు బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులు అయినట్లు. ఆ బ్రాహ్మణులను కుఖ వంశావళి
బ్రాహ్మణులు అని అంటారు. అంతేకానీ, వారిని బ్రహ్మా యొక్క ముఖ వంశావళి బ్రాహ్మణులు
అని అనరు. కనుక ఇప్పుడు పిల్లలైన మీరు బ్రహ్మా యొక్క ముఖ వంశావళి. మొదట తప్పకుండా
బ్రాహ్మణులు కావాలి. బ్రాహ్మణులుగా ఎక్కడి నుండి కన్వర్ట్ చేసారు? శూద్ర వర్ణము ఇక్కడ ఉంది. పిల్లలైన
మిమ్మల్ని ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలోకి తీసుకువచ్చారు. పాదాల నుండి మళ్ళీ పిలక
స్థానమైన బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వాలి.
ఈ వర్ణాలు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము వారి కోసమే ఉన్నాయి, ఇతర ధర్మాల వారికి వర్ణాలు లేవు. 21
జన్మలు మీరు దేవతా వర్ణములో ఉంటారు. బ్రాహ్మణ వర్ణము అనేది ఈ ఒక్క జన్మకు లేదా
ఒకటిన్నర జన్మకు కూడా ఉండవచ్చు ఎందుకంటే ఏ పిల్లలైతే సంస్కారాలను తీసుకొని
శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తారో, వారు మళ్ళీ వచ్చి జ్ఞానాన్ని తీసుకోవచ్చు. కావున
తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలూ, ఒకవేళ స్వర్గానికి యజమానులుగా
అవ్వాలంటే పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. 63 జన్మలు మీరు మునకలు వేసారు, ఇప్పుడు మీరు మహా దుఃఖంలో ఉన్నారు.
ఇది మొత్తం భారత్ కు సంబంధించిన విషయము కదా. ఇప్పుడు మొత్తం భారత్ అంతా సుఖముగా
ఉందని కాదు. అయితే, భారత్ లో ధనవంతులు చాలామంది
ఉన్నారు. చూడండి, ఒకరు వచ్చారు, వారు కోటీశ్వరుడు అయి ఉండవచ్చు, కానీ కాళ్ళు, చేతులు పని చేయడం లేదు, కావున దుఃఖము ఉన్నట్లే కదా.
ప్రపంచంలో దుఃఖము కలవారు ఒక్కరు ఉన్నా కూడా, తప్పకుండా దుఃఖధామమనే అంటారు. సత్యయుగంలో ఒక్కరు
కూడా దుఃఖితులుగా ఉండరు. భారత్ సుఖధామముగా ఉండేది. స్వర్గాన్ని ఎవరు రచించారు? తండ్రి. పిల్లలైన మనము
హక్కుదారులము. తప్పకుండా 5000 సంవత్సరాల క్రితము కూడా మనం స్వర్గంలో ఉండేవారము.
క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితము గీతను వినిపించడానికి వచ్చారని అంటారు. కావున
5000 సంవత్సరాల సమయము అయినట్లు కదా. క్రైస్టు వచ్చి 2000 సంవత్సరాలు మరియు వారి
కన్నా ముందు 3000 సంవత్సరాలు. కనుక ఇప్పుడు గీతను వినిపించడానికి వచ్చారు కదా.
తప్పకుండా దేవతా ధర్మం కూడా కనుమరుగైపోయింది.
పిల్లలైన
మీరు పాండవులు, మీ సహాయకుడు గీతా భగవంతుడు. వారు నిరాకారుడు.
శాస్త్రాలలో కూడా రుద్ర జ్ఞాన యజ్ఞము అని ఉంది. వాస్తవానికి శివరాత్రి, శివ జయంతి అని అంటారు. రుద్ర జయంతి
లేక రుద్ర రాత్రి అని అనరు. శివ రాత్రి అని ఎందుకు అంటారు? ఇప్పుడు అనంతమైన రాత్రి, ఘోర అంధకారము ఉంది కదా. తండ్రి
అంటారు, అనంతమైన రాత్రి సమయంలోనే నేను
వస్తాను. ఇప్పుడు పగలు అవ్వబోతుంది. నా జన్మ దైహిక మనుష్యుల వలె జరగదు. కృష్ణుడైతే
తల్లి గర్భ మహల్ నుండి జన్మ తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఆ తల్లి-తండ్రి ద్వారా స్వర్గం
యొక్క అపారమైన సుఖము లభిస్తుంది. స్వర్గము మరియు నరకము అనేవి ఏ పిచ్చుక పేర్లో
ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు మీరు ఇక్కడకు చదువుకునేందుకు వచ్చారు, శ్రీమతముపై నడుస్తారు. శ్రీమతముపై
నడవడంతో మీరు స్వర్గంలోని శ్రీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. వీరు సత్యయుగానికి
యజమానులు కావున తప్పకుండా కలియుగాంతములో వారి 84వ అంతిమ జన్మ ఉంటుంది, అప్పుడు రాజయోగాన్ని నేర్చుకుని
ఉంటారు. ఇది కేవలం ఒక్కరే కాదు, సూర్యవంశీయులందరూ రాజయోగాన్ని నేర్చుకుంటారు.
వారు వచ్చి అనంతమైన తండ్రి నుండి సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్య వారసత్వాన్ని తీసుకుంటున్నారు.
తండ్రి అంటారు, ఇప్పుడు పవిత్రంగా ఉంటామని మీరు
నాకు ప్రతిజ్ఞ చేయండి ఎందుకంటే నేను పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. 63
జన్మలు మీరు పతితంగా అవుతూ వచ్చారు, అందుకే దుఃఖితులుగా అయ్యారు. స్వర్గములోనైతే
చాలా సుఖమయంగా ఉండేవారు. ఈ భారత్ ఏదైతే గవ్వతుల్యంగా ఉందో, అది మళ్ళీ వజ్రతుల్యంగా అవుతుంది. ఈ
తండ్రి ఒక్కరు మాత్రమే, నేను మీకు మళ్ళీ రాజయోగాన్ని
నేర్పించడానికి వచ్చాను అని అంటారు. అనంతమైన తండ్రి అంటారు, మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా
అవ్వండి. ఈ తల్లి, తండ్రి నుండి మీరు అమృతాన్ని తాగాలి, విషాన్ని తాగడము విడిచిపెట్టాలి.
కామ చితిపై నుండి దిగి జ్ఞాన చితిపై కూర్చోండి. మీకు శ్రీమతము లభిస్తుంది.
ఎవరికైతే వారసత్వము తీసుకునే విషయంలో నిశ్చయం లేదో, వారంటారు, బాబా, విషాన్ని విడిచిపెట్టడమైతే చాలా కష్టము. అరే, మీకు 21 జన్మల సుఖం యొక్క ప్రాప్తి
లభిస్తుంది, దాని కోసం మీరు దీనిని
విడిచిపెట్టలేరా. భక్తి, జప తపాదులు మొదలైనవి చేయడంతో హద్దు
సుఖము లభిస్తుంది. అనంతమైన సుఖము అనంతమైన తండ్రి నుండి లభిస్తుంది. తండ్రి అంటారు, నేను సాధువులను కూడా ఉద్ధరిస్తాను
ఎందుకంటే శివబాబాను తెలుసుకోని కారణంగా సద్గతిని ఎవరూ పొందరు, తిరిగి ఇంటికి ఎవరూ వెళ్ళలేరు.
ఒకవేళ తండ్రి ఇంటికి వెళ్ళే మార్గం తెలిసి ఉంటే, అక్కడికి వస్తూ వెళ్తూ ఉండాలి కదా. అందరికీ
పునర్జన్మలు తీసుకోవాల్సే ఉంటుంది. సతో, రజో, తమోలలోకి రావాల్సే ఉంటుంది. ఇప్పుడైతే అసత్యపు
మాయ, అసత్యపు శరీరము ఉన్నాయి. ఎవరైతే
ధర్మ స్థాపన చేసారో, వారి పేరు మీదనే శాస్త్రాలు
తయారవుతాయి, వాటిని ధర్మ శాస్త్రాలు అని అంటారు.
క్రైస్టు వచ్చి ఏం చేసారు? వారు స్వయంగా వచ్చారు, వారి వెనుక వారి వంశములోని ఆత్మలు
వస్తారు. వృద్ధి జరుగుతుంది. ఇప్పుడిక చూడండి, క్రిస్టియన్లను తయారుచేస్తూ ఉంటారు. చాలావరకు
హిందూ ధర్మమువారినే కన్వర్ట్ చేస్తూ ఉంటారు. వారికి తమ ధర్మం గురించి తెలియనే
తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు, మనము దేవతా వర్ణములోకి వెళ్తాము. కృష్ణుని ఆత్మ
కూడా ఇప్పుడు చదువుకుంటుంది. కానీ ఇది సంగమము అయిన కారణంగా మిక్స్ చేసేసారు. ఈ
చిత్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. జ్ఞాన సాగరుడైతే
పరమపిత పరమాత్మ, వారి ద్వారా అందరి సద్గతి జరగనున్నది.
సత్యయుగంలోనైతే తక్కువ మంది ఉంటారు. మిగిలినవారందరూ లెక్కాచారాలు సమాప్తం చేసుకొని
ముక్తిధామంలోకి వెళ్తారు. వారికి శాంతి, మీకు సుఖము లభిస్తుంది. ఇప్పుడు మీరు అపారమైన
సుఖము తీసుకునేందుకు చదువుకుంటున్నారు. ఎవరికైతే పాత్ర ఉందో, వారే కల్ప-కల్పము పురుషార్థము
చేస్తారు. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే స్వర్గానికి యజమానులుగా అవుతారు - కానీ
నంబరువారు పురుషార్థానుసారంగా అవుతారు. ఇప్పుడు దేవీ-దేవతా ధర్మం యొక్క అంటు
కట్టబడుతుంది. ఎవరైతే కల్పక్రితము వచ్చి ఉంటారో, వారే వస్తారు. డ్రామా మీ చేత పురుషార్థము కూడా
తప్పకుండా చేయిస్తుంది. ఈ సమయంలో అందరూ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. పారస బుద్ధి
కలవారు సత్యయుగంలో ఉంటారు. అక్కడ యథా రాజా రాణి తథా ప్రజ, పారసబుద్ధి కలవారిగా ఉంటారు.
ఇప్పుడు మీరు
పాండవ సైన్యము. మీరు తండ్రి సహాయంతో స్వర్గం యొక్క పునాది వేస్తున్నారు. మీరు
స్వర్గము యొక్క ప్లాన్లు తయారుచేస్తున్నారు. అమరలోకములోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు
చేసుకుంటున్నారు. మిగిలినవారు ఏవైతే ప్లాన్లు తయారుచేస్తున్నారో, అవన్నీ తమ వినాశనం కోసమే. మీరు
అహింసకులు. వారంతా హింసకులు. హింసకులు వారిలో వారే కొట్లాడుకుని అంతమైపోతారు, తర్వాత జయజయకారాలు జరుగుతాయి.
పిల్లలైన మీకు తెలుసు, డ్రామానుసారముగా ఎవరైతే కల్పక్రితము
వచ్చారో, వారే వృద్ధి చెందుతూ ఉంటారు.
కొందరైతే తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ విడాకులిచ్చేస్తారు. తండ్రి అంటారు, ఒకవేళ మీరు శ్రీమతముపై
నడుచుకున్నట్లయితే సూర్యవంశీ మహారాజ, మహారాణిగా అవుతారు. ఇక్కడ ఇది శ్రమతో కూడిన
విషయము. వారు చాలా రకాలుగా శాస్త్రాల కథలను వినిపిస్తూ ఉండవచ్చు. వాటిని అలా వింటూ
వచ్చారు. వింటూ-వింటూ నరకవాసులుగా అవుతూ వచ్చారు, కళలు తగ్గుతూ వచ్చాయి. పతియే ఈశ్వరుడు అని అనడము
అంటారు, అయినా కానీ గురువులను ఆశ్రయిస్తారు.
కళలు తగ్గుతూ ఉంటాయి కదా. సృష్టి తమోప్రధానంగా అవ్వాల్సిందే. తండ్రి ఆత్మలతోనే
మాట్లాడుతారు. తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయ్యాయి. ఇప్పుడు
దేహీ-అభిమానీ భవ. నన్నొక్కరినే స్మృతి చేయండి. అచ్ఛా!
మధురాతి-మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు
ముఖ్య సారము:-
1.
సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని సంభాళించాలి కూడా
మరియు దానితో పాటు వ్యక్త బ్రహ్మా ఏ విధంగానైతే అవ్యక్తముగా అవుతారో, అలాగే అవ్యక్తముగా అయ్యే
పురుషార్థము చేయాలి.
2. 21 జన్మల
కోసం సుఖమయంగా అయ్యేందుకు ఈ ఒక్క జన్మలో పావనంగా ఉంటామని తండ్రితో ప్రతిజ్ఞ
చేయాలి. కామ చితిని వదిలి జ్ఞాన చితిపై కూర్చోవాలి. శ్రీమతముపై తప్పకుండా నడవాలి.
వరదానము:-
సద్గురువు ద్వారా ప్రాప్తించిన మహామంత్రము యొక్క తాళం
చెవితో సర్వ ప్రాప్తి సంపన్న భవ
జన్మ
తీసుకుంటూనే సద్గురువు ద్వారా మొట్టమొదట ‘‘పవిత్రముగా అవ్వండి-యోగిగా అవ్వండి’’ అనే మహామంత్రము లభించింది.
ఈ మహామంత్రమే సర్వ ప్రాప్తులకు తాళంచెవి. ఒకవేళ పవిత్రత లేకపోతే, యోగీ జీవితం లేకపోతే
అధికారిగా ఉన్నా కూడా అధికారాన్ని అనుభూతి చేయలేరు, అందుకే ఈ మహామంత్రము సర్వ ఖజానాల అనుభూతికి
తాళంచెవి. సద్గురువు ద్వారా ఈ మహామంత్రము అనే తాళంచెవి ఏదైతే శ్రేష్ఠ భాగ్యం
రూపంలో లభించిందో,
దానిని
స్మృతిలో ఉంచుకొని సర్వ ప్రాప్తులతో సంపన్నులుగా అవ్వండి.
స్లోగన్:-
సంగఠనలోనే స్వయం యొక్క రక్షణ ఉంది, సంగఠన మహత్వాన్ని
తెలుసుకొని మహానులుగా అవ్వండి.
మాతేశ్వరిగారి
అమూల్యమైన మహావాక్యాలు
సృష్టి యొక్క
ఆది ఎలా జరిగింది అని మనుష్యులు ప్రశ్న అడుగుతారు. సృష్టి యొక్క ఆది మా ధర్మంతోనే
జరిగింది అన్నట్లు మాత్రమే వారికి తెలుసు. ఇబ్రహీంకు సంబంధించినవారు, ఇస్లామ్ మతమువారు మా ధర్మంతో సృష్టి
ఆది అయిందని అంటారు. క్రిస్టియన్లేమో తమ సమయంలో ఆది అయిందని భావిస్తారు.
బౌద్ధులేమో తమ ధర్మంతోనే ఆది అయిందని భావిస్తారు మరియు ముస్లిమ్లు మా ధర్మంతో ఆది
అయిందని అంటారు మరియు భారతవాసులేమో తమ ధర్మంతో ఆది అయిందని భావిస్తారు. ఇంకా, సృష్టి ఆదిలో మనిషి ఎలా తయారయ్యాడు
అన్నది చూపిస్తారు. ప్రారంభంలో మొట్టమొదట ఎముకలతో మనిషి తయారుచేయబడ్డాడని అంటారు, తర్వాత ఎలా చూపిస్తారంటే, మొదట గాలి ఉండేది, దానితో శ్వాస తయారుచేయబడింది, ఆ తర్వాత ఊపిరితిత్తులు తయారయ్యాయి, ఆ తర్వాత మనిషి తయారయ్యాడు. ఈ
విధంగానే మొదట మనిషి తయారయ్యాడు, తర్వాత మొత్తం సృష్టి అంతా ఉద్భవించింది అని
అంటారు. ఇప్పుడు ఇవైతే మనుష్యులు విని, వినిపించిన విషయాలు కానీ మనకైతే స్వయంగా పరమాత్మ, అసలు ఈ సృష్టి ఏ విధంగా
ఉద్భవించింది అన్నది తెలియజేస్తున్నారు. వాస్తవానికి పరమాత్మ అనాది కనుక ఈ సృష్టి
కూడా అనాది, ఈ అనాది సృష్టి యొక్క ఆది కూడా
పరమాత్మ ద్వారానే జరిగింది. చూడండి, గీతలో భగవానువాచ ఉంది - ఎప్పుడైతే నేను వస్తానో, అప్పుడు ఆసురీ ప్రపంచాన్ని వినాశనము
చేసి దైవీ ప్రపంచ స్థాపన చేస్తాను అనగా కలియుగీ తమోగుణీ అపవిత్ర ఆత్మలను పవిత్రంగా
చేస్తాను. కనుక మొట్టమొదట పరమాత్మ సృష్టి ఆదిలో బ్రహ్మా, విష్ణు, శంకరులను, మూడు రూపాలను రచించారు, ఆ తర్వాత బ్రహ్మా మరియు సరస్వతుల
ద్వారా దైవీ ప్రపంచాన్ని స్థాపన చేసారు. అంటే సృష్టి యొక్క ఆది బ్రహ్మా ద్వారా
జరిగింది, క్రిస్టియన్లు ఆ బ్రహ్మాను ఆడమ్ అని
మరియు సరస్వతిని ఈవ్ అని అంటారు. మరియు ముస్లిమ్ ధర్మంలో డాడా ఆదమ్ బీబీ అని
అంటారు. అయితే వాస్తవానికి యథార్థమైన విషయము ఇది. కానీ ఈ రహస్యం తెలియని కారణంగా
ఒక్క బ్రహ్మాకే వేర్వేరు పేర్లను పెట్టారు. ఏ విధంగానైతే పరమాత్మను కొందరు గాడ్
అని అంటారు, కొందరు అల్లాహ్ అని అంటారు కానీ
పరమాత్మ అయితే ఒక్కరే, ఇది కేవలం భాషల్లో తేడా. అచ్ఛా - ఓం
శాంతి.


0 Comments