Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam
04-06-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ - మీరు
కామధేనువైన జగదంబకు కుమారులు మరియు కుమార్తెలు, మీరు అందరి మనోకామనలను పూర్తి
చేయాలి,
తమ
సోదరీ-సోదరులకు సత్యమైన మార్గాన్ని తెలియజేయాలి’’
ప్రశ్న:-
పిల్లలైన మీకు తండ్రి ద్వారా ఏ బాధ్యత లభించింది?
జవాబు:-
పిల్లలూ,
అనంతమైన
తండ్రి అనంతమైన సుఖాన్ని ఇచ్చేందుకు వచ్చారు, కావున మీ కర్తవ్యం ఏమిటంటే - ఇంటింటికీ ఈ
సందేశాన్ని ఇవ్వడము. తండ్రికి సహాయకులుగా అయి ఇంటింటినీ స్వర్గంగా తయారుచేయండి.
ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే సేవ చేయండి. తండ్రి సమానంగా నిరహంకారిగా, నిరాకారిగా అయి అందరికీ సేవ
చేయండి. మొత్తం ప్రపంచాన్ని శత్రువైన రావణుడి పంజా నుండి విడిపించడము - ఇది
పిల్లలైన మీ యొక్క అన్నింటికన్నా పెద్ద బాధ్యత.
గీతము:- మాతా ఓ మాతా...
ఓంశాంతి. ఈ విధంగా మాత యొక్క మహిమ భారత్ లోనే
గాయనం చేయబడుతుంది. జగదంబ తప్పకుండా భాగ్య విధాత. వీరి పేరే కామధేనువు అని పెట్టడం
జరిగింది అనగా అన్ని కామనలను పూర్తి చేసేవారు. ఈ వారసత్వం వారికి ఎక్కడి నుండి
లభిస్తుంది? శివబాబా ద్వారా జగదంబకు మరియు
జగత్పితకు వారసత్వం లభిస్తుంది. పిల్లలకు, మేము ఆత్మలము అన్న ఈ నిశ్చయం కలిగింది. ఆత్మను
చూడలేరు, తెలుసుకోగలరు. జీవము మరియు ఆత్మ.
ఆత్మ అవినాశీ, శరీరమైతే వినాశీ, దానిని ఈ కనులతో చూడడం జరుగుతుంది.
ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. వివేకానందునికి ఆత్మ సాక్షాత్కారం జరిగింది అని
అంటారు, కానీ వారు అర్థం చేసుకోలేకపోయారు.
పిల్లలు అర్థం చేసుకుంటారు, మేము మా ఆత్మ యొక్క సాక్షాత్కారం
చేసుకుంటే తండ్రి సాక్షాత్కారం కూడా చేసుకున్నట్లే. ఎలాగైతే ఆత్మ ఉంటుందో అలాగే
ఆత్మల తండ్రి ఉంటారు. ఎటువంటి తేడా లేదు. బుద్ధితో తెలుసుకోవడం జరుగుతుంది, వీరు తండ్రి, వీరు కుమారుడు అని. ఆత్మలందరూ ఆ
తండ్రిని స్మృతి చేస్తారు. ఈ కళ్ళతోనైతే తమ ఆత్మను కానీ, తండ్రి ఆత్మను కానీ చూడలేరు. వారు
పరమ ఆత్మ, పరంధామంలో నివసించే సుప్రీమ్
పరమాత్మ. భక్తి మార్గంలో కూడా నవవిధ భక్తి చేసినట్లయితే వారికి సాక్షాత్కారం
జరుగుతుంది. అంతేకానీ వారి ఆత్మ ఈ సమయంలో ఈ శరీరంలో ఉందని కాదు. అలా కాదు, వారి ఆత్మ పునర్జన్మలోకి
వెళ్ళిపోయింది. భక్తి మార్గంలో ఎవరెవరు, ఏ-ఏ భావనతో ఎవరినైతే పూజిస్తారో, వారి సాక్షాత్కారం జరుగుతుంది. అనేక
చిత్రాలు కూర్చుని తయారుచేసారు, దీనిని బొమ్మల పూజ అని అంటారు. భావన పెట్టడం వలన
అల్పకాలిక సుఖం యొక్క ప్రతిఫలం కాస్త లభిస్తుంది. మీ అనంతమైన సుఖం యొక్క విషయమే
అతీతమైనది. మీకు తెలుసు, మనం స్వర్గం యొక్క రాజ్యాధికారం
తీసుకుంటాము. భక్తి ద్వారా ఎవరూ స్వర్గంలోకి వెళ్ళలేరు. ఎప్పుడైతే భక్తి మార్గం
పూర్తవుతుందో అనగా ప్రపంచం పాతదిగా అవుతుందో, అప్పుడే మళ్ళీ కలియుగం తర్వాత సత్యయుగ కొత్త
ప్రపంచము వస్తుంది. ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. సన్యాసులు కూడా అంటారు, ఫలానా జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది
అని, కానీ అలా జరగదు. ఇప్పుడు మీకు
ఈశ్వరీయ బుద్ధి లభించింది, దీనిని శ్రీమతము అని అంటారు. పదాలు
ఎంత బాగున్నాయి. శ్రీ శ్రీ భగవానువాచ. వారే స్వర్గానికి యజమానులుగా అనగా నరుని
నుండి నారాయణునిగా తయారుచేస్తారు. మీరు శ్రీమతం ద్వారా విశ్వ రాజ్యాన్ని
పొందుతారు. శ్రీ శ్రీ 108 మాలకు చాలా మహిమ ఉంది. 8 రత్నాల మాల ఉంటుంది. సన్యాసులు కూడా
జపిస్తారు. ఒక వస్త్రాన్ని తయారుచేస్తారు, దానిని గోముఖము అని అంటారు. లోపల చేతిని పెట్టి
మాల తిప్పుతారు. బాబా అంటారు, నిరంతరం స్మృతి చేయండి అని, కానీ వారేమో మాల తిప్పడము అనే
అర్థాన్ని తీసుకున్నారు. పిల్లలకు తెలుసు, ఇప్పుడు పారలౌకిక తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా
మనల్ని తమవారిగా చేసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారంటే, ప్రజా మాత కూడా ఉన్నారు. జగదంబను
జగత్తుకు మాత అని మరియు లక్ష్మిని విశ్వ మాహారాణి అని అంటారు. విశ్వ అంబ అనండి లేక
జగదంబ అనండి విషయము ఒక్కటే. మీరు పిల్లలు కావున ఇది కుటుంబం అయినట్లు. పిల్లలైన
మీరు కూడా అందరి మనోకామనలను పూర్తి చేసేవారు. జగదంబకు మీరు కుమారులు మరియు
కుమార్తెలు. బుద్ధిలో ఈ నషా ఉంటుంది - మేము మా సోదరీ-సోదరులకు మార్గాన్ని
చూపించాలి. ఇది చాలా సహజము. భక్తి మార్గంలోనైతే చాలా కష్టముంది. ఎన్ని హఠయోగాలు, ప్రాణాయామాలు మొదలైనవి చేస్తారు.
నదులకు వెళ్ళి స్నానం చేస్తారు. చాలా కష్టాన్ని తీసుకుంటారు. ఇప్పుడు తండ్రి
అంటారు, మీరు అలసిపోయారు. బ్రాహ్మణులకే
అర్థం చేయించడం జరుగుతుంది, వారే నిరాకార పరమపిత పరమాత్మతో
మనకేమి సంబంధముంది అనేది అర్థం చేసుకుంటారు. శివబాబా అనే పదం శోభిస్తుంది, రుద్ర బాబా అని కూడా అనరు. శివబాబా
అనే అంటారు. ఇది చాలా సులభము. పేర్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి. కానీ ‘‘శివబాబా’’ అనేది ఏక్యురేట్ గా ఉంది. శివ అనగా
బిందువు. రుద్రుడు అనగా బిందువు కాదు. అయితే శివబాబా అని అంటారు కూడా కానీ ఏమీ
అర్థం చేసుకోరు. శివబాబా మరియు సాలిగ్రామాలైన మీరు, ఇప్పుడు పిల్లలైన మీ తలపై బాధ్యత ఉంది. గాంధీ
మొదలైనవారు భారత్ ను ఈ విదేశీయుల నుండి ముక్తి చేయాలని భావించేవారు. అవైతే హద్దు
యొక్క విషయాలు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని బాధ్యులుగా చేస్తారు. ముఖ్యంగా భారత్
మరియు మొత్తం ప్రపంచాన్ని శత్రువైన మాయా రావణుడి నుండి విడిపించాలి. ఈ శత్రువులు
అందరికీ చాలా దుఃఖాన్ని ఇచ్చారు. వాటిపై విజయం పొందాలి. ఎలాగైతే గాంధీ విదేశీయులను
పారద్రోలారో, ఈ రావణుడు కూడా పెద్ద విదేశీయుడు.
ద్వాపరంలో ఈ రావణుడు ప్రవేశిస్తాడు. ఎవరికీ తెలియను కూడా తెలియదు, రావణుడు వచ్చి మొత్తం రాజ్యాన్ని
లాక్కుంటాడు. ఇతడు అందరికన్నా పాత విదేశీయుడు, ఇతడు భారత్ ను ఇలా నిరుపేదగా చేసాడు. వారి మతం
ద్వారా భారత్ ఈ విధంగా భ్రష్టాచారిగా అయిపోయింది. ఈ శత్రువును పారద్రోలాలి. వీరు
ఎలా పారిపోతారు అని శ్రీమతము లభిస్తుంది. మీరు తండ్రికి సహాయకులుగా అవ్వాలి. నాకు
చెందినవారిగా అయిన తర్వాత మళ్ళీ పరమతంపై నడుచుకున్నట్లయితే పడిపోతారు. ఉన్నత పదవిని
పొందలేరు. పిల్లలు ధైర్యము చేస్తే... అని పాడుతారు. మీరు ఈశ్వరీయ సేవాధారులు.
ఈశ్వరుడు వచ్చి మీ సేవ చేస్తారు. ఓ పతితపావనా రండి అని వారిని స్మృతి చేస్తారు.
సేవ చేసేవారిని సేవకుడు అని అంటారు. బాబా ఎంత నిరహంకారి, నిరాకారి. నిరహంకారిగా, నిర్వికారిగా అవ్వడం నేర్పిస్తారు.
తమ సమానంగా తయారుచేసి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. మేము వికారాలలోకి వెళ్ళము అని
గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. ఇతడు అందరికన్నా పాత శత్రువు. ఇతడిపైనే విజయం
పొందాలి. బాబా మేము ఓడిపోయామని కొంతమందైతే రాస్తారు. కొంతమంది చెప్పరు కూడా.
ఒకటేమో పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు, సద్గురువుకు నిందను తీసుకొస్తారు, అప్పుడు వారు తమకు తామే
నష్టపర్చుకుంటారు.
పిల్లలైన మీకు తెలుసు, ఇప్పుడు మనం శివబాబా యొక్క మనవలము, మనవరాళ్ళము. ప్రజాపిత బ్రహ్మాకు
పిల్లలము. బ్రహ్మా కూడా శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మీరు కూడా వారి
నుండి తీసుకుంటారు. పిల్లలకు తెలుసు, బాబా నుండి కల్పక్రితం వారసత్వాన్ని
తీసుకున్నాము. ఆత్మే అర్థం చేసుకుంటుంది. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొకటి
తీసుకుంటుంది. శరీరానికి పేరు పెడతారు. శివబాబా అయితే కేవలం జ్ఞానమివ్వడం కోసమే
లోన్ గా తీసుకుంటారు. శివ భగవానువాచ - బ్రహ్మా తనువు ద్వారా. ఇకపోతే, ఎక్కువ విషయాలలోకి వెళ్ళే అవసరం
లేదు. ఆత్మ వెళ్ళిపోతుంది, తర్వాత ఏమి జరుగుతుంది? ఎలా వస్తుంది, ఈ విషయాలలోకి వెళ్ళడం వలన లాభమేమీ
లేదు. ఇదైతే సాక్షాత్కారము. ఏమి జరిగినా కూడా అది సాక్షాత్కారమే. సూక్ష్మవతనం
యొక్క మార్గం ఇప్పుడు తెరిచి ఉంది. చాలామంది వెళ్తూ-వస్తూ ఉంటారు. ఇందులో
జ్ఞాన-యోగాలకు సంబంధించిన విషయమేమీ లేదు. భోగ్ పెడతారు, ఆత్మ వస్తుంది, తినిపిస్తారు-తాగిస్తారు - ఇదంతా
చిట్-చాట్. తండ్రికి పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంది. పిల్లలైన మీరంటారు, బాప్ దాదా, మేము వచ్చాము, శివ మరియు ప్రజాపిత బ్రహ్మా
ఉన్నారు. బ్రహ్మాను గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఎంత పెద్ద వంశము, వీరిని శివబాబా అనైతే అనరు. ఇక్కడ
ఇది మనుష్యుల వంశము. ఇది సాకారానికి సంబంధించిన విషయము. అన్ని వంశాలలోనూ ఇది మొదటి
నంబరు ముఖ్యమైన వంశమని గాయనం చేయబడుతుంది. పెద్ద నాటకము కదా. ఇప్పుడు పిల్లలు మంచి
రీతిలో అర్థం చేసుకుంటారు. కొందరు అర్థం చేసుకోరు కూడా. వాస్తవానికి శివబాబా
అందరికీ తండ్రి అని ఇంత అయితే అర్థం చేసుకుని ఉండవచ్చు. వారసత్వం తాతగారి నుండి
లభించాలి, వీరికి కూడా వారి నుండే లభిస్తుంది.
అచ్ఛా, బ్రహ్మాను కూడా మర్చిపోండి.
నిశ్చితార్థం జరిగిపోయింది, ఇంకేముంది? ఇక మధ్యవర్తిని గుర్తు చేయడం జరగదు.
వీరు మధ్యవర్తి, నిశ్చితార్థం చేయిస్తారు. ఓ
పిల్లలూ... అని అంటారు, ఆత్మలతో మాట్లాడుతారు. ఆత్మ స్మృతి
చేస్తుంది, బాబా, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి. బాబా అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు
పావనంగా అవుతూ ఉంటారు, ఇంకే ఉపాయమూ లేదు. శాంతిధామము నుండి
మళ్ళీ మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తారు. ఇది పుట్టినిల్లు, అది అత్తగారిల్లు. పుట్టినింట్లో
ఆభరణాలు మొదలైనవి ధరించరు, నియమము లేదు. ఇదైతే ఈ రోజుల్లో
ఫ్యాషన్ అయిపోయింది. ఈ సమయంలో మీకు తెలుసు, మనం అత్తగారింటికి వెళ్ళి ఇవన్నీ ధరిస్తాము.
వివాహ సమయంలో కన్యకు ఇంతకుముందున్న ఆభరణాలన్నీ తీసేస్తారు. పాత దుస్తులు
ధరిస్తారు. మీకు తెలుసు, బాబా అత్తగారింటికి
తీసుకువెళ్ళేందుకు మనల్ని అలంకరిస్తున్నారు. అత్తగారింట్లో 21 జన్మలు మనం సదా కోసం ఉంటాము. అయితే, దాని కోసం పురుషార్థం చేయాల్సి
ఉంటుంది, పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. గృహస్థ
వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఉండాలి. ఇది అంతిమ జన్మ. తండ్రి అర్థం
చేయిస్తారు, మొదట అవ్యభిచారీ సతోప్రధాన భక్తి
ఉండేది, ఇప్పుడు తమోప్రధానంగా అయ్యింది.
బొంబాయిలో గణేశుని పూజ జరుగుతుంది, లక్షలు ఖర్చు చేస్తారు. దేవతలను తయారుచేసి, వాటికి పాలన చేసి, తర్వాత ముంచేస్తారు, వినాశనం చేస్తారు. ఇప్పుడు పిల్లలైన
మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మీరు అర్థం చేయించవచ్చు, ఇదేం ఆచారం-వ్యవహారము. దేవతలకు
జన్మనిచ్చి, పూజించి, తినిపించి, తాగించి, ఆడంబరంగా ఉత్సవం జరిపి, తర్వాత ముంచేస్తారు. ఆశ్చర్యము.
తులసి యొక్క వివాహం కృష్ణునితో చూపిస్తారు. చాలా వైభవంగా వివాహం చేస్తారు.
విదేశీయులు ఇటువంటి విషయాలు విన్నప్పుడు, ఇలా కూడా జరుగుతూ ఉండవచ్చు అని భావిస్తారు.
ఎలాంటి-ఎలాంటి విషయాలను కూర్చుని తయారుచేసారు. ఇక్కడైతే జూదము మొదలైనవాటి విషయమేమీ
లేదు. పాండవులు జూదమాడారు, ద్రౌపదిని పణంగా పెట్టారు అని
వారైతే అంటారు. ఎలాంటి-ఎలాంటి విషయాలను తయారుచేసారు, దీనితో రాజయోగం యొక్క విషయమైతే పూర్తిగా
మాయమైపోతుంది. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి, ఇదైతే చాలా సహజము. మనం 21 జన్మల కోసం స్వర్గములోకి, క్షీరసాగరములోకి వెళ్తామని
బుద్ధిలోకి రావాలి. ఇప్పుడిది విషయ సాగరము. విషయ సాగరము నుండి బయటకు వచ్చి మళ్ళీ
క్షీరసాగరములోకి మీరు వెళ్తున్నారు. మీవి కొత్త విషయాలు. మనుష్యులు విని
ఆశ్చర్యపోతారు. పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు, వాస్తవానికి స్వర్గంలో మేము చాలా సుఖమయంగా
ఉంటాము. మేము విశ్వానికి యజమానులుగా అవుతాము. అక్కడ మా రాజధానిని ఎవ్వరూ లాక్కోలేరు.
ఇప్పుడైతే ఎన్ని విభజనలు ఉన్నాయి, కొట్లాడుకుంటూ ఉంటారు. పిల్లలైన మీరు అర్థం
చేయించాలి - మీ అసలైన శత్రువు రావణుడు, ఇతనిపై మీరు కల్ప-కల్పము విజయాన్ని పొందుతారు.
మాయను జయించినవారే జగత్ జీతులుగా అవుతారు. ఇది గెలుపు-ఓటముల ఆట. మీకు తెలుసు, మనం తప్పకుండా విజయం పొందుతాము.
ఫెయిల్ అవ్వలేము, వినాశనం ఎదురుగా నిలబడి ఉంది.
రక్తపు నదులు ప్రవహిస్తాయి. అనవసరంగా ఎంతమంది మరణిస్తారు. దీనిని నరకము అనగా
భ్రష్టాచారీ పతిత ప్రపంచము అని అంటారు. పతితపావనా రండి, అనైతే పాడుతారు.
తండ్రి అంటారు, ఏ విధంగా ఆత్మలైన మీరు నక్షత్రాలో, అదే విధంగా నేను కూడా నక్షత్రాన్ని.
నేను కూడా డ్రామా బంధనంలో బంధించబడి ఉన్నాను, దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. లేదంటే, నాకు ఈ పతిత ప్రపంచంలోకి రావాల్సిన
అవసరం ఏముంది? నేనైతే పరంధామంలో నివసించేవాడిని
కదా! ఈ డ్రామాలో ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయిస్తారు. చింత యొక్క విషయమేమీ
లేదు. ఇక్కడ మీరు నషాలో నిశ్చింతగా ఉంటారు, పూర్తిగా సింపుల్ గా ఉంటారు. తండ్రి ఎటువంటి
కష్టాన్ని ఇవ్వరు. కేవలం స్మృతి చేయాలి మరియు చేయించాలి. అనంతమైన తండ్రి అనంతమైన
సుఖాన్ని ఇచ్చేందుకు వచ్చారు. ఇంటింటిలో మీరు ఆహ్వానం ఇవ్వాలి, ఇంత పని చేయాలి. పిల్లలైన మీపై
గొప్ప బాధ్యత ఉంది. మాయ కూడా చూడండి, పూర్తిగా సర్వనాశనం చేస్తుంది. భారత్ ఎంత
దుఃఖితముగా అయ్యింది. మాయ దుఃఖాన్ని ఇచ్చింది. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రికి
సహాయం చేసి ముళ్ళను పుష్పాలుగా చేయాలి. మన ఈ బ్రాహ్మణ కులములో ఏ రకాల పుష్పాలు
ఉన్నాయి అన్నది మీకు తెలుసు. సేవ చేసినట్లయితే పదవిని కూడా పొందుతారు, లేదంటే ప్రజలలోకి వెళ్ళిపోతారు.
శ్రమ ఉంది కదా. చాలా మంది పిల్లలు, సేవలో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది పిల్లలకు
అనుమతి లభించదు, చాలా దెబ్బలు తింటారు, ఇందులో ధైర్యం కావాలి. భయపడకూడదు.
సాహసం కావాలి. నష్టోమోహులుగా కూడా ఉండాలి. మోహము కూడా తక్కువ కాదు, చాలా శక్తివంతమైనది. షావుకార్ల
ఇంటికి చెందినవారైతే బాబా మొదట దేహాభిమానాన్ని తెంచడం కోసం - ఊడవండి, పాత్రలు తోమండి అని అంటారు.
పరీక్షనైతే తీసుకుంటారు కదా. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు
గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శ్రీమతముపై తండ్రికి పూర్తి-పూర్తి సహాయకులుగా
అవ్వాలి, పరమతముపై లేక మన్మతముపై నడవకూడదు.
నష్టోమోహులుగా అయి, ధైర్యముంచి సేవలో నిమగ్నమవ్వాలి.
2. ఇప్పుడు మనం పుట్టినింట్లో ఉన్నాము, ఇక్కడ ఏ విధమైన ఫ్యాషన్లు
చేసుకోకూడదు. స్వయాన్ని జ్ఞాన రత్నాలతో అలంకరించుకోవాలి. పవిత్రంగా ఉండాలి.
వరదానము:-
దుఃఖాన్ని సుఖంలోకి,
నిందను
ప్రశంసలోకి పరివర్తన చేసే పుణ్యాత్మ భవ
ఎవరైతే
ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరో మరియు దుఃఖాన్ని తీసుకోరో, అంతేకాక దుఃఖాన్ని కూడా సుఖం
రూపంలో స్వీకరిస్తారో,
వారే
పుణ్యాత్మ. నిందను ప్రశంసగా భావించాలి, అప్పుడే పుణ్యాత్మ అని అంటారు. ఈ పాఠం సదా
పక్కాగా ఉండాలి - నిందించే ఆత్మను లేక దుఃఖమిచ్చేటువంటి ఆత్మను కూడా తమ దయాహృదయ
స్వరూపంతో,
దయా
దృష్టితో చూడాలి,
నింద
యొక్క దృష్టితో కాదు. వారు నిందిస్తారు మరియు మీరు పుష్పాలను అర్పించండి, అప్పుడు పుణ్యాత్మ అని అంటారు.
స్లోగన్:-
బాప్ దాదాను నయనాలలో ఇముడ్చుకునేవారే ప్రపంచానికి కనుపాపలు, విశ్వానికి ప్రకాశం వంటివారు.
0 Comments