Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam
03-06-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ - ఇది
స్మశానము మరియు దేవతల ప్రపంచము యొక్క ఆట, ఈ సమయంలో స్మశానము ఉంది, తర్వాత దేవతల ప్రపంచము
తయారవుతుంది - మీరు ఈ స్మశానము పట్ల మనస్సు పెట్టుకోకూడదు’’
ప్రశ్న:-
మనుష్యులు ఏ విషయాన్ని తెలుసుకున్నట్లయితే అన్ని సంశయాలు
దూరమవుతాయి?
జవాబు:-
తండ్రి ఎవరు, వారు ఎలా వస్తారు - ఈ విషయాన్ని
తెలుసుకున్నట్లయితే అన్ని సంశయాలు దూరమవుతాయి. ఎప్పటివరకైతే తండ్రిని తెలుసుకోరో, అప్పటివరకు సంశయాలు
తొలగిపోలేవు. నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వడం ద్వారా విజయమాలలో వస్తారు కానీ
ఒక్కొక్క విషయము పట్ల క్షణంలో పూర్తి నిశ్చయం కలగాలి.
గీతము:- ఆకాశ సింహాసనాన్ని వదిలి
రా... (ఛోడ్ భీ దే ఆకాష్ సింహాసన్...)
ఓంశాంతి.
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. వీరు అనంతమైన ఆత్మిక తండ్రి.
ఆత్మలన్నీ రూపాన్ని అయితే తప్పకుండా మారుస్తాయి. ఈ కర్మక్షేత్రములో పాత్రను
అభినయించేందుకు నిరాకారము నుండి సాకారములోకి వస్తాయి. పిల్లలు అంటారు, బాబా, మీరు కూడా మా వలె రూపాన్ని మార్చుకోండి.
తప్పకుండా సాకార రూపాన్ని ధారణ చేసే జ్ఞానాన్ని ఇస్తారు కదా. మనుష్య రూపాన్నే
తీసుకుంటారు కదా! పిల్లలకు కూడా తెలుసు, మేము నిరాకారులము, తర్వాత సాకారులుగా అవుతాము. తప్పకుండా ఇలాగే
జరుగుతుంది. అది నిరాకారీ ప్రపంచము. ఈ తండ్రి కూర్చుని వినిపిస్తారు. వీరు అంటారు, మీకు మీ 84 జన్మల కథ గురించి
తెలియదు. నేను వీరిలోకి ప్రవేశించి వీరికి అర్థం చేయిస్తున్నాను, వీరికైతే తెలియదు కదా. కృష్ణుడైతే
సత్యయుగం యొక్క రాకుమారుడు. వీరికి పతిత ప్రపంచంలోకి, పతిత శరీరంలోకి రావాల్సి ఉంటుంది.
కృష్ణుడు తెల్లగా ఉండేవారు, మరి నల్లగా ఎలా అయ్యారు? ఇది ఎవ్వరికీ తెలియదు. సర్పము
కాటేసిందని అంటారు. వాస్తవానికి ఇది 5 వికారాల విషయము. కామ చితిపై కూర్చోవడంతో
నల్లగా అవుతారు. శ్యామ-సుందరుడు అని కృష్ణుడినే అంటారు. తెల్లగా లేక నల్లగా
అయ్యేందుకు నాకు శరీరమే లేదు. నేను సదా పావనుడిని. నేను కల్ప-కల్పము సంగమంలో
వస్తాను, కలియుగ అంతము, సత్యయుగ ఆది సమయములో వస్తాను. నేనే
వచ్చి స్వర్గాన్ని స్థాపన చేయాల్సి ఉంటుంది. సత్యయుగము సుఖధామము. కలియుగము
దుఃఖధామము. ఈ సమయంలో మనుష్యమాత్రులందరూ పతితులుగా ఉన్నారు. సత్యయుగ
మహారాజు-మహారాణులైన లక్ష్మీ-నారాయణుల ప్రభుత్వాన్ని భ్రష్టాచారీ అని అనరు. ఇక్కడ
అందరూ పతితులుగా ఉన్నారు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది.
ఒకే ధర్మముండేది. సంపూర్ణ పావనులుగా, శ్రేష్ఠాచారులుగా ఉండేవారు. భ్రష్టాచారులు, శ్రేష్ఠాచారులకు పూజ చేస్తారు.
సన్యాసులు పవిత్రంగా అవుతారు కనుక అపవిత్రులు వారికి తల వంచి నమస్కరిస్తారు.
సన్యాసులను గృహస్థులు ఏమీ ఫాలో చేయరు. నేను ఫలానా సన్యాసికి ఫాలోవర్ (అనుచరుడు)
అని కేవలం నామమాత్రంగా చెప్పుకుంటారు. ఫాలో చేసినప్పుడు కదా ఫాలోవర్ అవుతారు. మీరు
కూడా సన్యాసిగా అవ్వండి, అప్పుడు ఫాలోవర్ అని అంటారు.
గృహస్థులు ఫాలోవర్స్ (అనుచరులు) గా అవుతారు కానీ వారు పవిత్రంగా అయితే అవ్వరు.
వారు ఫాలో చేయడం లేదు అని సన్యాసులూ వారికి అర్థం చేయించరు, వారు స్వయమూ అర్థం చేసుకోరు.
ఇక్కడైతే తల్లి-తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. తల్లి-తండ్రిని ఫాలో చేయండి అని
అంటూ ఉంటారు, ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని
తొలగించాలి, దేహధారులందరి నుండి తొలగించి ఒక్క
తండ్రినైన నాతో జోడించినట్లయితే తండ్రి వద్దకు చేరుకుంటారు, ఆ తర్వాత సత్యయుగంలోకి వస్తారు.
మీరు ఆల్రౌండర్లు. 84 జన్మలను తీసుకుంటారు. ఆది నుండి అంతిమము వరకు, అంతిమము నుండి ఆది వరకు మా ఆల్రౌండ్
పాత్ర నడుస్తుందని మీకు తెలుసు. ఇతర ధర్మాల వారి పాత్ర ఆది నుండి అంతిమము వరకు
నడవదు. ఆది సనాతనమైనది ఒక్క దేవీ-దేవతా ధర్మమే. మొట్టమొదట సూర్యవంశీయులు ఉండేవారు.
ఇప్పుడు మీకు
తెలుసు, మనము ఆల్రౌండుగా 84 జన్మల చక్రములో
తిరుగుతాము. తర్వాత వచ్చేవారైతే ఆల్రౌండర్ అవ్వలేరు. ఇది అర్థం చేసుకోవాల్సిన
విషయము కదా. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. మొట్టమొదట ఉండేది
దేవి-దేవతా ధర్మమే. అర్ధకల్పము సూర్యవంశీయుల, చంద్రవంశీయుల రాజ్యం నడుస్తుంది. ఇప్పుడైతే ఇది
చాలా చిన్న యుగము, దీనినే సంగమమని అంటారు, కుంభమేళా అని కూడా అంటారు. ఓ పరమపిత
పరమాత్మా, మీరు వచ్చి పతితులుగా ఉన్న మమ్మల్ని
పావనులుగా చేయండి - అని వారినే తలచుకుంటారు. తండ్రిని కలుసుకునేందుకు ఎంతగా
భ్రమిస్తా ఉంటారు. యజ్ఞ-తపాదులు, దాన-పుణ్యాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. లాభమేమీ
ఉండదు. ఇప్పుడు మీరు భ్రమించడం నుండి విముక్తులయ్యారు. అది భక్తి కాండము. ఇది
జ్ఞాన కాండము. భక్తి మార్గము అర్ధకల్పము నడుస్తుంది. ఇది జ్ఞాన మార్గము. ఈ సమయంలో
మీకు పాత ప్రపంచము నుండి వైరాగ్యాన్ని కలుగజేస్తారు, అందుకే మీది అనంతమైన వైరాగ్యము ఎందుకంటే ఈ
ప్రపంచమంతా స్మశానముగా అవ్వనున్నదని మీకు తెలుసు. ఈ సమయంలో స్మశానముగా ఉంది, తర్వాత దేవతల ప్రపంచముగా అవుతుంది.
ఇది స్మశానము మరియు దేవతల ప్రపంచము యొక్క ఆట. తండ్రి దేవతల ప్రపంచాన్ని స్థాపన
చేస్తారు, వారిని అందరూ తలచుకుంటారు.
రావణుడిని ఎవ్వరూ గుర్తు చేసుకోరు. ముఖ్యంగా ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవడంతో ఇక
మిగిలిన సంశయాలన్నీ తొలగిపోతాయి. ఎప్పటివరకైతే మొదట తండ్రిని తెలుసుకోరో, అప్పటివరకు సంశయబుద్ధి కలవారిగానే
ఉంటారు. సంశయబుద్ధి వినశ్యంతి... తప్పకుండా ఆత్మలైన మనందరికీ వారు తండ్రి, వారే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు.
నిశ్చయంతోనే విజయమాలలో కూర్చబడగలరు. ఒక్కొక్క పదము పట్ల క్షణంలో నిశ్చయం కలగాలి. బాబా
చెప్తున్నారంటే పూర్తి నిశ్చయముండాలి కదా. తండ్రి అని నిరాకారుడిని అంటారు. ఆ
మాటకు వస్తే గాంధీని కూడా బాపూజీ అని అనేవారు. కానీ ఇక్కడైతే మొత్తం ప్రపంచం యొక్క
బాపూజీ కావాలి కదా. వారు మొత్తం ప్రపంచానికి గాడ్ ఫాదర్. మొత్తం ప్రపంచానికి గాడ్
ఫాదర్ అంటే వారు చాలా పెద్దవారు కదా. వారి ద్వారా విశ్వం యొక్క రాజ్యము
లభిస్తుంది. విష్ణువు యొక్క రాజ్యము బ్రహ్మా ద్వారా స్థాపనవుతుంది. మనమే
విశ్వానికి యజమానులుగా ఉండేవారమని మీకు తెలుసు. మనమే దేవీ-దేవతలుగా ఉండేవారము, ఆ తర్వాత చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా, శూద్రవంశీయులుగా అయ్యాము. ఈ
విషయాలన్నింటినీ పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు కూడా - నా ఈ
జ్ఞాన యజ్ఞంలో చాలా విఘ్నాలు కలుగుతాయి. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము, దీని నుండి వినాశ జ్వాల
ప్రజ్వలితమవుతుంది. దీనిలో మొత్తం పాత ప్రపంచమంతా సమాప్తమై, ఒక్క దేవతా ధర్మము యొక్క స్థాపన
జరుగుతుంది. మీకు అర్థం చేయించేవారు తండ్రి, వారు సత్యము తెలియజేస్తారు, నరుని నుండి నారాయణునిగా తయారయ్యే
సత్యమైన కథను వినిపిస్తారు. ఈ కథను మీరు ఇప్పుడు మాత్రమే వింటారు. ఇదేమీ పరంపరగా
కొనసాగదు.
ఇప్పుడు
తండ్రి అంటారు, మీరు 84 జన్మలను పూర్తి చేసారు.
ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపంచంలో మీ రాజ్యముంటుంది. ఇది రాజయోగము యొక్క జ్ఞానము. సహజ
రాజయోగము యొక్క జ్ఞానము ఒక్క పరమపిత పరమాత్ముని వద్ద మాత్రమే ఉంది, దీనిని ప్రాచీన భారత్ యొక్క
రాజయోగమని అంటారు. తప్పకుండా కలియుగాన్ని సత్యయుగంగా మార్చారు. వినాశనం కూడా
మొదలయ్యింది, మిసైల్స్ విషయమే.
సత్య-త్రేతాయుగాలలోనైతే ఎటువంటి యుద్ధము ఉండదు, అవి తర్వాత మొదలవుతాయి. ఈ మిసైల్స్ యుద్ధము
చివరి యుద్ధము. పూర్వము ఖడ్గాలతో కొట్లాడుకునేవారు, తర్వాత తుపాకీలను ఉపయోగించారు. ఆ తర్వాత
ఫిరంగులు వచ్చాయి, ఇప్పుడు బాంబులను తయారుచేసారు, లేదంటే మొత్తం ప్రపంచము యొక్క
వినాశనము ఎలా జరుగుతుంది. అంతేకాక, వీటితో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా ఉన్నాయి.
కుండపోత వర్షాలు, కరువు, ఇవి ప్రకృతి వైపరీత్యాలు. భూకంపము
వచ్చిందనుకోండి, దానిని ప్రకృతి వైపరీత్యమని అంటారు.
ఇప్పుడు ఇందులో ఎవరైనా ఏం చేయగలరు. ఒకవేళ ఎవరైనా ఇన్ష్యూరెన్స్ చేసుకున్నా, ఎవరిస్తారు మరియు ఎవరికిస్తారు.
అందరూ మరణిస్తారు, ఎవ్వరికీ ఏమీ లభించదు. ఇప్పుడు మీరు
మళ్ళీ తండ్రి వద్ద ఇన్ష్యూర్ చేసుకోవాలి. భక్తిలో కూడా ఇన్ష్యూర్ చేసుకుంటారు కానీ
అక్కడ అర్ధకల్పానికి రిటర్ను లభిస్తుంది. ఇక్కడైతే మీరు డైరెక్టుగా ఇన్ష్యూర్
చేసుకుంటారు. ఎవరైనా సర్వస్వాన్ని ఇన్ష్యూర్ చేస్తే, వారికి రాజ్యాధికారము లభిస్తుంది. ఏ విధంగానైతే
బాబా తమ గురించి చెప్తారు - వారు సర్వస్వాన్ని ఇచ్చేసారు. తండ్రి వద్ద
మొత్తమంతటినీ ఇన్ష్యూర్ చేస్తే, మొత్తం రాజ్యాధికారము లభిస్తుంది. ఇకపోతే, ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. ఇది
మృత్యులోకము. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది రాజులు తింటారు... ఎప్పుడైనా ఎక్కడైనా
నిప్పు అంటుకుంటే లేక ఏదైనా ఆపద సంభవిస్తే, దొంగలు దోచుకుంటారు. ఈ సమయమే అంతిమ సమయము, అందుకే ఇప్పుడు తండ్రిని స్మృతి
చేయాలి. సహాయం చేయాలి.
ఈ సమయంలో
అందరూ పతితంగా ఉన్నారు, వారు పావన ప్రపంచాన్ని స్థాపన
చేయలేరు. ఇది కేవలం తండ్రి పని మాత్రమే. నిరాకారీ ప్రపంచము నుండి రండి, వచ్చి రూపాన్ని ధరించండి అని
తండ్రినే పిలుస్తారు. కావున తండ్రి అంటారు, నేను సాకారంలోకి వచ్చాను, రూపాన్ని ధరించాను. కానీ నిత్యం
వీరిలో ఉండలేను. మొత్తం రోజంతా స్వారీ చేస్తారా ఏమిటి? ఎద్దుపై స్వారీ చేసినట్లుగా
చూపిస్తారు. భాగ్యశాలీ రథముగా మనుష్య తనువును చూపిస్తారు. ఇప్పుడిది రైటా లేక అది
రైటా? గోశాలను చూపిస్తారు కదా. గోముఖమును
కూడా చూపించారు. ఎద్దుపై స్వారీ చేస్తారు మరియు మళ్ళీ గోముఖము ద్వారా జ్ఞానాన్ని
ఇస్తారు. ఇక్కడ జ్ఞానామృతము వెలువడుతుంది. దీనికి అర్థముంది కదా. గోముఖము యొక్క
మందిరము కూడా ఉంది. చాలామంది వెళ్తారు, గోముఖము నుండి అమృతము వస్తుంది, వెళ్ళి అది తాగాలి అని భావిస్తారు.
700 మెట్లుంటాయి. అన్నింటికన్నా పెద్ద గోముఖము వీరు. అమరనాథ్ కు ఎంత కష్టపడి
వెళ్తారు. అక్కడ ఏమీ లేదు. అంతా మోసము. శంకరుడు పార్వతికి కథ వినిపించినట్లుగా
చూపిస్తారు. ఇప్పుడు పార్వతికి ఏమైనా దుర్గతి కలిగిందా, కూర్చుని వారికి కథ వినిపించడానికి? మనుష్యులు మందిరాలు మొదలైనవి
తయారుచేయడానికి ఎంత ఖర్చు చేస్తారు. తండ్రి అంటారు, ఖర్చు చేస్తూ-చేస్తూ మీరు ధనాన్ని అంతా
పోగొట్టుకున్నారు. మీరు ఎంత సంపన్నంగా ఉండేవారు, ఇప్పుడు దివాలా తీసారు, మళ్ళీ నేను వచ్చి సంపన్నంగా
చేస్తాను. మనం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చామని మీకు తెలుసు.
పిల్లలైన మీకు ఇస్తున్నారు. భారత్ పరమపిత పరమాత్ముని జన్మ స్థలము. కావున ఇది
అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము అయినట్లు కదా. ఇంకా, పతితులందరినీ పావనంగా కూడా తండ్రే
తయారుచేస్తారు. గీతలో ఒకవేళ తండ్రి పేరు ఉన్నట్లయితే, అందరూ ఇక్కడికి వచ్చి పుష్పాలు
అర్పించేవారు. తండ్రి తప్ప అందరికీ సద్గతిని ఎవరు ఇవ్వగలరు. భారత్ యే అన్నింటికన్నా
అత్యంత పెద్ద తీర్థ స్థానము, కానీ ఇది ఎవ్వరికీ తెలియదు. లేదంటే ఏ విధంగా
తండ్రికి అంతులేని మహిమ ఉందో, అలా భారత్ కు కూడా అంతులేని మహిమ ఉంది. నరకముగా
మరియు స్వర్గముగా భారత్ తయారవుతుంది. అంతులేని మహిమ స్వర్గానికి ఉంది, అంతులేని నింద నరకానికి చేస్తారు.
పిల్లలైన
మీరు సత్యఖండానికి యజమానులుగా అవుతారు. బాబా నుండి అనంతమైన వారసత్వాన్ని
తీసుకునేందుకు ఇక్కడకు వచ్చారు. తండ్రి అంటారు - మన్మనాభవ మరియు అందరి నుండి
బుద్ధియోగాన్ని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి. స్మృతితోనే పవిత్రంగా
అవుతారు. జ్ఞానంతో వారసత్వాన్ని తీసుకోవాలి. జీవన్ముక్తి యొక్క వారసత్వమైతే
అందరికీ లభిస్తుంది కానీ స్వర్గము యొక్క వారసత్వాన్ని అయితే కేవలం రాజయోగాన్ని
నేర్చుకునేవారే పొందుతారు. అందరి సద్గతి జరగనున్నది కదా, అందరినీ తిరిగి తీసుకువెళ్తారు.
తండ్రి అంటారు, నేను కాలుడికే కాలుడిని. మహాకాలుడి
మందిరము కూడా ఉంది. తండ్రి అర్థం చేయించారు, చివర్లో ప్రత్యక్షత జరుగుతుంది, అప్పుడు తప్పకుండా వీరికిదంతా
తెలియజేసేవారు అనంతమైన తండ్రేనని అర్థం చేసుకుంటారు. ఒకవేళ కథను వినిపించేవారు
గీతా భగవంతుడు కృష్ణుడు కాదు, శివుడు అని చెప్పినట్లయితే, ఇతనికి కూడా బి.కె.ల భూతము
పట్టిందని అందరూ అంటారు, అందుకే ఇప్పుడింకా వారి సమయం
రాలేదు. చివర్లో ఒప్పుకుంటారు. ఇప్పుడే ఒప్పుకుంటే, వారి సభ్యులంతా వెళ్ళిపోతారు. అచ్ఛా!
మధురాతి
మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు
ముఖ్య సారము:-
1. ఇతర
సాంగత్యాలన్నింటినీ తెంచి తల్లి-తండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. ఈ పాత ప్రపంచము
పట్ల అనంతమైన వైరాగ్యమును ఉంచి దీనిని మర్చిపోవాలి.
2. ఇది అంతిమ
సమయము, అంతా సమాప్తమయ్యేకంటే ముందే తమ వద్ద
ఏమేమి ఉందో, దానిని ఇన్ష్యూర్ చేసుకుని
భవిష్యత్తులో పూర్తి రాజ్యము యొక్క అధికారమును తీసుకోవాలి.
వరదానము:-
బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషమనే ఔషధాన్ని తినే మరియు
తినిపించే శ్రేష్ఠమైన అదృష్టవంతులుగా కండి
మేము
విశ్వ యజమానికి పిల్లలము మరియు యజమానులము - ఇదే ఈశ్వరీయ నషాలో మరియు సంతోషంలో
ఉండండి. వాహ్ నా శ్రేష్ఠమైన భాగ్యము అనగా అదృష్టము. ఇదే సంతోషము యొక్క ఊయలలో సదా
ఊగుతూ ఉండండి. మీరు అదృష్టవంతులు కూడా మరియు సదా సంతోషమనే ఔషధాన్ని తింటారు మరియు
తినిపిస్తారు కూడా. ఇతరులకు కూడా సంతోషము యొక్క మహాదానాన్ని ఇచ్చి అదృష్టవంతులుగా
తయారుచేస్తారు. మీ జీవితమే ఒక సంతోషము. సంతోషంగా ఉండడమే జీవించడము. ఇదే బ్రాహ్మణ
జీవితము యొక్క శ్రేష్ఠమైన వరదానము.
స్లోగన్:-
ప్రతి పరిస్థితిలోనూ సహనశీలిగా అయినట్లయితే ఆనందాన్ని
అనుభవం చేస్తూ ఉంటారు.
మాతేశ్వరి
గారి అమూల్యమైన మహావాక్యాలు
1. మన ఈ
ఈశ్వరీయ జ్ఞానము మన బుద్ధి నుండి వెలువడినది కాదు, ఇదేమీ మన తెలివి లేక మన ఊహ లేక మన సంకల్పము
కాదు. ఈ జ్ఞానము, మొత్తం సృష్టి యొక్క రచయిత ఎవరైతే
ఉన్నారో, వారి నుండి విన్నటువంటి జ్ఞానము.
అంతేకాక విని, అనుభవము మరియు వివేకంలోకి ఏదైతే
తీసుకురావడం జరిగిందో, దానిని ప్రాక్టికల్ గా మీకు
వినిపిస్తున్నాము. ఒకవేళ ఇది మన వివేకానికి సంబంధించిన విషయమైతే, కేవలం మన వద్ద మాత్రమే నడుస్తుంది
కానీ ఇది పరమాత్మ ద్వారా విని వివేకంతో అనుభవం చేసి ధారణ చేస్తాము. ఏ విషయాన్ని
అయితే ధారణ చేస్తారో, అది తప్పకుండా వివేకము మరియు అనుభవంలోకి
ఎప్పుడైతే వస్తుందో, అప్పుడే మనదిగా భావించడం
జరుగుతుంది. కావున పరమాత్ముని రచన ఏమిటి? పరమాత్మ అంటే ఎవరు? అనేది కూడా వీరి ద్వారా మనము
తెలుసుకున్నాము. అంతేకానీ, ఇవి మన సంకల్పాలలో వచ్చిన విషయాలు
కాదు. ఒకవేళ మన సంకల్పాలలో వచ్చిన విషయాలైతే, ఇవి నా సంకల్పాలు అని మన మనసులో ఉత్పన్నమయ్యేది.
అందుకే, మనకు స్వయంగా పరమాత్మ ద్వారా ఏవైతే
ముఖ్యమైన ధారణకు యోగ్యమైన పాయింట్లు లభించాయో, వాటిలో ముఖ్యమైనది యోగం జోడించడము. కానీ
యోగానికి ముందు జ్ఞానం కావాలి. యోగం చేసేందుకు మొదట జ్ఞానం కావాలని ఎందుకు అంటారు? మొదట ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత యోగం జోడించాలి... ఎప్పుడూ
మొదట వివేకము కావాలి అని అంటారు, లేదంటే తప్పుడు కర్మలు జరుగుతాయి, అందుకే ముందు జ్ఞానము అవసరము.
జ్ఞానము అనేది ఒక ఉన్నతమైన స్థితి, దానిని అర్థం చేసుకునేందుకు బుద్ధి కావాలి, ఎందుకంటే ఉన్నతోన్నతమైన పరమాత్మ
మనల్ని చదివిస్తున్నారు.
2. ఈ ఈశ్వరీయ
జ్ఞానము ఒక వైపు తెంచడానికి, మరో వైపు జోడించడానికి ఉంది. ఒక్క పరమాత్మతో
సాంగత్యాన్ని జోడించండి, ఆ శుద్ధమైన సంబంధంతో మన జ్ఞానము
క్రమంగా ఉన్నతి చెందుతుంది ఎందుకంటే ఈ సమయంలోనే ఆత్మ కర్మబంధనాలకు వశమై ఉంది. అది
ఆదిలో కర్మబంధన రహితంగా ఉండేది, తర్వాత కర్మ బంధనాలలోకి వచ్చింది మరియు ఇప్పుడు
మళ్ళీ అది కర్మబంధనాల నుండి విడుదల అవ్వాలి. ఇప్పుడు మన కర్మల యొక్క బంధనము కూడా
ఉండకూడదు మరియు కర్మలు చేయడము మన చేతిలో ఉండాలి అనగా కర్మలపై కంట్రోల్ ఉండాలి.
అప్పుడే మన కర్మల బంధనము ఉండదు, దీనినే జీవన్ముక్తి అని అంటారు. లేదంటే
కర్మబంధనంలోకి, చక్రములోకి వస్తే సదా కాలానికి
జీవన్ముక్తి లభించదు. ఇప్పుడు ఆత్మలోని శక్తి పోయింది మరియు దాని కంట్రోల్ లేకుండా
కర్మలు జరుగుతున్నాయి. కానీ కర్మలు ఆత్మ ద్వారా జరగాలి మరియు ఆత్మలో శక్తి రావాలి
మరియు కర్మల విషయంలో ఎటువంటి స్థితికి రావాలంటే, కర్మల బంధనము ఉండకూడదు. లేదంటే మనుష్యులు
సుఖ-దుఃఖాల ప్రభావంలోకి వచ్చేస్తారు ఎందుకంటే కర్మలు వారిని లాగుతూ ఉంటాయి. ఆత్మిక
శక్తి ఎటువంటిదంటే, అది కర్మల బంధనములోకి రానివ్వదు, ఇది రిజల్టు. ఈ విషయాలను ధారణ చేయడం
ద్వారా సహజమవుతుంది. ఈ క్లాసు యొక్క ఉద్దేశ్యమే ఇది. ఇకపోతే, మనమేమీ వేద శాస్త్రాలను చదివి
డిగ్రీ తీసుకునేది లేదు, కానీ ఈ ఈశ్వరీయ జ్ఞానం ద్వారా మనము
మన జీవితాన్ని తయారుచేసుకోవాలి, దాని కోసం ఈశ్వరుడి నుండి ఆ శక్తిని తీసుకోవాలి.
అచ్ఛా - ఓంశాంతి.
0 Comments