07-04-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- మీరు డబుల్
అహింసకులుగా అవ్వాలి,
మనసా-వాచా-కర్మణా మీరు ఎప్పుడూ
ఎవరికీ దుఃఖాన్ని
ఇవ్వకూడదు’’
ప్రశ్న:-
కల్ప-కల్పము ఏ పిల్లలైతే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని
తీసుకున్నారో, వారి గుర్తులు ఎలా ఉంటాయి?
జవాబు:-
వారు పతితుల సాంగత్యాన్ని వదిలి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు
శ్రీమతముపై నడవడం మొదలుపెడతారు. గృహస్థ వ్యవహారములో
ఉంటూ పవిత్రముగా అవ్వండి అని తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ ఏదైతే ఉందో, ఆ ఆజ్ఞపై పూర్తి-పూర్తిగా నడుస్తారు. వారికి ఎప్పుడూ కూడా - అలా అయితే ప్రపంచము ఎలా కొనసాగుతుంది
అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వదు. వారి ద్వారా ఎప్పుడూ పరస్పరంలో వికారాల దాడి జరగదు. వారు తమను తాము శివబాబాకు మనుమలుగా, బ్రహ్మాకు పిల్లలుగా, పరస్పరంలో సోదరీ-సోదరులుగా భావిస్తూ నడుచుకుంటారు.
పాట:- మాతా ఓ మాతా...
ఓంశాంతి. పిల్లలు ఇప్పుడు ఎవరి మహిమను చేయకూడదు. భక్తులు మహిమ చేస్తారు,
ఈ పాటను భక్తి మార్గము వారు మమ్మాను మహిమ చేస్తూ పాడారు. కానీ పాపం వారికి
- మమ్మా అటువంటి సేవ ఏమి చేసారు!
అన్నది తెలియదు. వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు, వారి మహిమను పాడుతారు. కానీ నిజానికి మహిమ ఒక్కరిదే గాయనం చేయబడుతుంది. వారొక్కరూ కూర్చొని పిల్లలను చదివిస్తారు మరియు ఆ విధంగా తయారుచేస్తారు. మీరు కూడా వారి పిల్లలు, మీరు భారత్ లేక విశ్వానికి సేవ చేస్తారు. మహిమ భారత్ కు చేస్తారు. చిత్రాలు కూడా భారత్ లోనే ఉన్నాయి. జగదాంబ పూజ కూడా ఇక్కడ ఎంతగానో జరుగుతుంది. బయట అలా జరుగదు.
అక్కడక్కడా శివుని చిత్రాలు ఉన్నాయి కానీ నిజానికి మహిమ అనేది శివునిదే అని వారు అర్థం చేసుకోరు. ఆ శివబాబా మళ్ళీ జగదాంబ మరియు జగత్పిత యొక్క మహిమ వెలువడేలా చేస్తారు.
బాబా ద్వారానే అందరికీ శ్రీమతము లభిస్తుంది.
దిల్వాడా మందిరములో అందరి చిత్రాలు లేవు. పిల్లలైతే లెక్కలేనంతమంది ఉన్నారు.
పిల్లలైన మీరందరూ రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. చిత్రాలైతే కొందరివే తయారుచేస్తారు.
బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారని మీకు తెలుసు. శివబాబా వీరిలో కూర్చున్నారు. కల్పక్రితం కూడా ఇదే విధముగా పరమపిత పరమాత్మ మనకు రాజయోగము నేర్పించారు. ఇప్పుడు ప్రాక్టికల్ గా బుద్ధిలో అనిపిస్తుంది. ఇతరులు ఎవరైనా విన్నప్పుడు, కొందరేమో ఇది పూర్తిగా సరైన విషయము అని అంటారు,
కొందరేమో మేమెలా నమ్మాలి అని అంటారు.
అందరూ ఒకేలా ఉండరు, ఎప్పుడైనా ఎవరైనా కొత్తవారు వస్తే, వారిని ఈ విధంగా ప్రశ్నించడం జరుగుతుంది
- గాడ్ ఫాదర్ పేరును ఎప్పుడైనా విన్నారా?
ఎప్పుడైనా భగవంతుని పేరును విన్నారా? మేము గాడ్ ఫాదర్ ను తలచుకోము అని అనే మనుష్యులు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే ఇప్పుడు అందరూ దుఃఖితులుగా ఉన్నారు, అందుకే పరమాత్మను తప్పకుండా తలచుకుంటారు.
సత్యయుగములో ఎవరూ - పతిత-పావనా రండి అని అనరు. దుఃఖములో అందరూ తలచుకుంటారు, సుఖములో ఎవ్వరూ తలచుకోరు. దుఃఖములో ఎవరిని తలచుకుంటారు? ఆ ఒక్కరినే. అయితే తలచుకుంటారు కానీ వారి గురించి తెలియదు.
కేవలం మహిమ చేస్తారు.
ఇక్కడ ఇదంతా ధర్మానికి సంబంధించిన విషయము.
రిలీజియన్ ఈజ్ మైట్ (ధర్మము శక్తి)
అని అంటూ అంటారు. ఏ ధర్మములో అంత శక్తి ఉంది? అన్ని ధర్మాలలోనైతే అంతటి శక్తి లేదు. తండ్రి వచ్చి ఒక్క దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. బాబాను ఆల్మైటీ
(సర్వశక్తివంతుడు) అని అంటారు. కావున ఏ ధర్మాన్ని అయితే స్థాపన చేస్తారో, అందులో కూడా శక్తి ఉంటుంది. మనము దేవతా ధర్మానికి చెందినవారిగా అయినట్లయితే మనలో ఎంతో శక్తి వస్తుంది అని మీకు తెలుసు. మనం తండ్రి నుండి రాజ్యం తీసుకుంటాము. మనమేమీ హింస చేయము.
సత్యయుగములో రెండు హింసలు ఉండవు. ఒకటి కామ ఖడ్గాన్ని ఉపయోగించే హింస,
రెండవది ఎవరిపైనైనా క్రోధం చేయడము, ఏవైనా తప్పుడు మాటలు అనడము, ఇది కూడా బాణం వేయడము వంటిదే. దీనిని వయలెన్స్ (హింస) అని అంటారు. మీరు ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు.
బాబా ఎంత బాగా నేర్పిస్తారు.
అందరినీ సుఖవంతులుగా చేయండి.
ముఖ్యమైన విషయం కామ ఖడ్గాన్ని ఉపయోగించడం
- ఇది అన్నింటికన్నా పెద్ద హింస. తుపాకీలు మొదలైనవి ఉపయోగించడం,
హత్య చేయడం,
అది కూడా హింసే. ఏ విధముగానైనా, ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడమనేది హింస అవుతుంది, అందుకే - కామం మహాశత్రువు అని తండ్రి అన్నారు. అహింసా పరమో దేవీ-దేవతా ధర్మము అని అంటూ ఉంటారు.
అందులో రెండు హింసలూ ఉండవు. వారు ఎప్పుడూ ఎవరికీ మనసా-వాచా-కర్మణా దుఃఖాన్ని ఇచ్చేవారు కాదు. తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. కల్పక్రితము చేసారు,
ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఎవరినైనా హత్య చేయడం, కొట్టడము, క్రోధము చేయడము, వీటన్నింటి నుండి విడిపిస్తారు. ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించినది, అందుకే రాఖీ బంధనము గురించి గాయనం ఉంది. కామ ఖడ్గాన్ని ఉపయోగించవద్దు అని సోదరి కూర్చుని సోదరులకు రాఖీ కడుతుంది.
కానీ మనుష్యులు దీని అర్థాన్ని అర్థం చేసుకోరు. మీరు బ్రహ్మాకు పిల్లలు, శివునికి మనుమలు. కావున మీరు సోదరీ-సోదరులు అయినట్లు. పరస్పరంలో ఎప్పుడూ వికారాల దాడి చేయకూడదు. ఇది పవిత్రముగా అయ్యేందుకు యుక్తి.
సోదరీ-సోదరులు పరస్పరంలో ఎప్పుడూ వివాహం చేసుకోరు.
తండ్రి అర్థం చేయిస్తారు, కల్ప-కల్పము ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో, వారే శ్రీమతముపై నడుస్తారు. అదర్ కుమారీ, కుమారీ కన్యల మందిరాలు కూడా ఉన్నాయి. గృహస్థము నుండి బయటకొచ్చి మళ్ళీ తండ్రికి పిల్లలుగా అయ్యారు కాబట్టి వారిని అదర్ అని అంటారు.
తప్పకుండా ఒకప్పుడు ఉండి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ ప్రాక్టికల్ గా ఉన్నారు. మేము పవిత్రముగా అయితే సృష్టి ఎలా నడుస్తుంది అని భావించకండి. ఇప్పుడిది పతిత ప్రపంచముగా అయ్యింది. ఇప్పుడు పావన ప్రపంచము కావాలి. పతిత ప్రపంచమైతే నడుస్తూనే ఉంటుంది,
అది ఆగదు.
కావున మీరు పతితుల సాంగత్యాన్ని వదలాల్సి ఉంటుంది. బాబా వచ్చి వికారీ ప్రపంచపు రచనను ఆపు చేయిస్తారు. సత్యయుగము నుండి నిర్వికారీ ప్రపంచము మొదలవుతుంది.
తండ్రి వచ్చి పిల్లలను ఆజ్ఞాపిస్తారు, ఇక అది స్వీకరించండి,
స్వీకరించకపోండి... శ్రీమత్ భగవానువాచ.
భగవంతుడు కూర్చొని పిల్లలను చదివిస్తారు. ఏ విధముగా తయారుచేస్తారు? తప్పకుండా భగవాన్, భగవతిగా తయారుచేస్తారు. ఎవరు ఎలా ఉంటారో వారు అలాగే తయారుచేస్తారు. నిరాకారుడైన భగవంతుడు కూర్చొని నిరాకార ఆత్మలను ఈ శరీరం ద్వారా చదివిస్తారు.
వీరు బాబా యొక్క లాంగ్ బూట్. బాబాకు శరీరమైతే కావాలి కదా. వీరి శరీరం రూపీ చెప్పు పాతబడిపోయింది. ఎప్పుడైతే కొత్తగా ఉండేదో అప్పుడు తెల్లగా ఉండేది,
ఇప్పుడు నల్లగా అయిపోయింది.
బాబా అర్థం చేయించారు - మీరు ఈ సమయంలో నల్లగా ఉన్నారు, తర్వాత సుందరముగా అవుతారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ నల్లగా అయిపోయారు.
వారికి 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీకృష్ణుడు మొదట సుందరముగా ఉండేవారు. నెమ్మది-నెమ్మదిగా సౌందర్యము తగ్గిపోతూ వచ్చింది. శ్రీకృష్ణుని చిత్రము కూడా ఉంది,
నరకాన్ని కాలదన్నుతున్నారు మరియు చేతిలో స్వర్గము ఉంది.
వారంటారు - నేను స్వర్గములో సుందరముగా ఉండేవాడిని మరియు నరకములో నల్లగా ఉన్నాను, అందుకే కాలదన్నుతాను.
సూర్యవంశానికి చెందినవారు ఎవరైతే ఉన్నారో వారందరూ సుందరముగా ఉండేవారు. మొత్తం వంశమంతా రాజ్యము చేసేది. ఇప్పుడు అందరూ నల్లగా అయిపోయారు,
అందుకే శ్యామసుందరుడు అన్న పేరు కొనసాగుతూ వస్తుంది. శ్రీకృష్ణుని ఆత్మనే మొదటి జన్మ తీసుకుంటుంది. శ్రీకృష్ణునితోపాటు మొత్తం రాజధాని కూడా ఉంటుంది. అందరూ తిరిగి తెల్లగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. కాళిందిలో సర్పము కాటేసింది అని అంటారు. అది కూడా ఈ సమయానికి సంబంధించిన విషయమే,
మాయ అందరినీ కాటు వేస్తూ ఉంటుంది. మాయ అందరినీ నల్లగా చేసేసింది.
తండ్రి తిరిగి తెల్లగా తయారుచేస్తారు. స్వర్గములో ఇలా ఉండదు. అక్కడ 21 జన్మలు సదా సుఖమయంగా ఉంటారు. అకాల మృత్యువు ఎప్పుడూ జరుగదు.
ఇప్పుడు దైవీ రాజధాని స్థాపనవుతుంది. తండ్రి వచ్చి అందరికీ రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. వేరే ధర్మాలు స్థాపన చేసేవారెవరూ రాజ్య భాగ్యాన్ని ఇవ్వలేరు.
ఇబ్రహీం, బుద్ధుడు మొదలైనవారు రాజ్య స్థాపన చేయరు.
వారు కేవలం ధర్మ స్థాపన చేస్తారు, ఆ తర్వాత ధర్మము వృద్ధి చెందుతుంది. నిజానికి వారిని గురువు అని కూడా అనలేము ఎందుకంటే సద్గతి కోసం గురువులను ఆశ్రయిస్తారు. వారు వచ్చేదే ధర్మ స్థాపన చేయడానికి, అంతేకానీ సద్గతిని ఇవ్వడానికి కాదు.
వారి వెనుక వారి ధర్మానికి చెందిన ఆత్మలు కిందకు దిగుతాయి. కావున నిజానికి గురువు అని కూడా ఎవరినీ అనలేము. అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క శివబాబా. వారి విషయంలో - వారు జన్మ తీసుకుంటారు అని అనరు, అది రాంగ్ అవుతుంది. వారు అవతరిస్తారు. జన్మ తీసుకోవడం అంటే గర్భంలోకి రావడము. నేను గర్భం ద్వారా జన్మ తీసుకోను. నేను అవతరిస్తాను. కానీ ఎలా వస్తారు, ఇది ఎవరూ అర్థం చేసుకోరు. నేను పరంధామం నుండి వచ్చి ఈ తనువులోకి ప్రవేశిస్తాను. నాకు శరీరమైతే కావాలి కదా.
అది కూడా పెద్ద శరీరం కావాలి. చిన్న శరీరం ద్వారా అయితే మాట్లాడలేను. నేను అనుభవీ రథంలోకి, అనేక జన్మల అంతిమ జన్మలో వానప్రస్థావస్థలో వస్తాను.
గీతలో కూడా - నాకు వీరి జన్మల గురించి తెలుసు అని ఉంది.
వీరికి ఇంతకుముందు తమ జన్మల గురించి తెలియదు.
ఇప్పుడు తెలుసు. ఒకసారి చెప్తాను - మొదట వీరు దేవతగా ఉండేవారు,
84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు అంతిమ జన్మలో ఉన్నారు, అప్పుడు నేను వీరిలోకి ప్రవేశించాను. ఇది కళ్యాణకారి జన్మ. బాబా వచ్చి వీరి ద్వారా చదివిస్తారు కావున వీరు తల్లి కూడా అయినట్లు. నిజానికి వీరు తల్లి కానీ సేవను తండ్రి రూపంలో చేస్తారు, అందుకే మమ్మాను నిమిత్తం చేసారు. పిల్లలైన మీరు కూడా వారితోపాటు నిమిత్తం అవుతారు.
అందరికీ స్వర్గవాసులుగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు.
మనుష్యులు మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. వారు పురుషార్థం చేయరు. మనమైతే స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము. సత్యయుగములో లక్ష్మీ-నారాయణులు ఉండేవారు,
వారిని స్వర్గానికి యజమానులుగా చేసేవారు ఎవరు? తప్పకుండా వారు అలా ఉండేవారు కాదు కాబట్టే వారిని అలా తయారుచేసారు. ఇందులో శ్రమ యొక్క విషయమేమీ లేదు.
బాబా కేవలం సలహాను ఇస్తారు - గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి అని. ఇప్పుడు పాత ప్రపంచం యొక్క వినాశనం జరగనున్నది.
సత్యయుగములో రావణుడిని కాల్చరు.
ఈ ఆచారం అనాదిగా కొనసాగుతూ వస్తుంది అని మనుష్యులు అంటారు, కానీ ఎప్పటి నుండి కొనసాగుతుంది, ఇది వారికి తెలియదు. ద్వాపరం నుండి రావణుడిని కాల్చడం మొదలుపెట్టారు. రావణుడు నివసించే స్థానమంటూ ఏదీ లేదు. శివబాబా నివసించే స్థానం పరంధామము. రావణుడి ధామము ఎక్కడ ఉంది? అతను అందరిలోకి ప్రవేశిస్తాడు. అతనికి ఒక స్థానమంటూ ఏదీ లేదు.
ఎప్పుడైతే రావణ రాజ్యము పూర్తవుతుందో, అందరూ పావనముగా అవుతారో, అప్పుడిక రావణుడి నామ-రూపాలు కూడా ఉండవు. రాముడు మరియు రావణుడు ఇద్దరు వేర్వేరు.
రాముడు స్వర్గాన్ని స్థాపన చేస్తారు, రావణుడు దుఃఖితులుగా చేస్తాడు. నేనేమి సర్వవ్యాపిని కాను. రావణుడు సర్వవ్యాపి, కావున నేను వచ్చి ఈ భూతాలను తొలగిస్తాను.
ఈ భూతాలే అందరికీ దుఃఖాన్ని ఇస్తాయి.
ఈ భూతాలపై విజయాన్ని ప్రాప్తింపజేసి స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాను. పిల్లలైన మీరందరూ స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. వారు
- స్వర్గస్థులయ్యారు అని అంటారు. మరి అటువంటప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అక్కడైతే వైభవాలే వైభవాలు ఉంటాయి. మనుష్యులకు స్వర్గమే గుర్తుకొస్తుంది. కానీ పునర్జన్మలు మళ్ళీ నరకంలోనే తీసుకుంటారు. మీరు సత్యయుగంలో ఉన్నప్పుడు పునర్జన్మ సత్యయుగంలోనే లభిస్తుంది. ఇప్పుడు నరకం మారి స్వర్గం రానున్నది. దుఃఖపు ప్రపంచం మారి సుఖపు ప్రపంచం రానున్నది.
ఇప్పుడు సర్వుల సద్గతిదాత,
అందరినీ సుఖమయంగా తయారుచేసేందుకు వచ్చారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
డబుల్ అహింసకులుగా అయి మనసా, వాచా,
కర్మణా ఎవరికీ దుఃఖమివ్వకూడదు. పవిత్రత యొక్క సత్యమైన రాఖీని కట్టుకోవాలి.
2.
పతితుల సాంగత్యాన్ని వదిలి ఒక్క తండ్రి ఆజ్ఞపైనే నడుచుకోవాలి. స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు భూతాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకోవాలి.
వరదానము:-
ప్రతి కర్మ
యొక్క భారాన్ని
తండ్రిపై వదిలి
స్వయం ట్రస్టీగా
ఉండే డబల్
లైట్ ఫరిశ్తా
భవ
ధైర్యము ఉంచే పిల్లలకు బాప్ దాదా ఎల్లప్పుడూ సహాయం చేస్తారు. పిల్లలు శ్రేష్ఠ సంకల్పాలు చేస్తారు మరియు తండ్రి హాజరవుతారు. కేవలం తండ్రిపై మొత్తం కార్యాన్ని వదిలి వేయండి, అప్పుడిక తండ్రి చూసుకుంటారు, కార్యం చూసుకుంటుంది.
స్వయం తమపైకి తాము బాధ్యతల భారాన్ని తీసుకోకండి, ట్రస్టీగా అయి ఉండండి, అప్పుడు సదా తేలికగా, డబుల్ లైట్ ఫరిశ్తాగా అయి ఎగురుతూ ఉంటారు. హృదయం స్వచ్ఛంగా ఉంటే సర్వ మనోకామనలు నెరవేరుతాయి.
స్లోగన్:-
ఉల్లాస-ఉత్సాహాలనే రెక్కలు తోడుగా ఉన్నట్లయితే
ఎగిరే కళలో ఎగురుతూ ఉంటారు.


0 Comments