03-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- నరుని నుండి
నారాయణునిగా అయ్యేందుకు పర్ఫెక్ట్ బ్రాహ్మణులుగా అవ్వండి, ఎవరిలోనైతే ఏ విధమైన
వికారాల రూపీ
శత్రువులు ఉండవో,
వారే సత్యమైన
బ్రాహ్మణులు’’
ప్రశ్న:-
తండ్రి గౌరవము ఏ పిల్లలకు ప్రాప్తిస్తుంది?
వివేకవంతులు ఎవరు?
జవాబు:-
తండ్రి గౌరవము ఎవరికి లభిస్తుందంటే - ఎవరైతే యజ్ఞం యొక్క ప్రతి కార్యాన్ని బాధ్యతతో చేస్తారో, ఎవరైతే ఎప్పుడూ పొరపాట్లు చేయరో, పావనంగా తయారుచేసే బాధ్యతను తమదిగా భావిస్తూ ఇదే సేవలో తత్పరులై ఉంటారో, ఎవరి నడవడిక అయితే చాలా రాయల్ (హుందా)గా ఉంటుందో, ఎప్పుడూ పేరును అప్రతిష్ఠపాలు
చేయరో, ఆల్ రౌండర్ గా ఉంటారో, వారికి తండ్రి గౌరవము లభిస్తుంది. ఎవరైతే పూర్తిగా పాసయ్యేందుకు ప్రయత్నిస్తారో, ఎప్పుడూ దుఃఖాన్ని ఇచ్చేవారిగా అవ్వరో, ఏ విధమైన తప్పుడు పనులూ చేయరో, వారే వివేకవంతులు.
పాట:-ఈ రోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తప్పుకుంటాయి...
(ఆజ్ నహీ తో కల్ బిఖరేంగే యహ బాదల్...)
ఓం శాంతి. పిల్లలకు ఈ డైరెక్షన్ ను ఎవరు ఇస్తారు? అనంతమైన తండ్రి. వారిని పిల్లలు అంతగా పితావ్రతులై స్మృతి చేయరు. తండ్రి అంటారు,
పిల్లలూ, ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. పిల్లలు అని ఎవరిని అంటారు? ఎవరైతే బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులుగా ఉన్నారో వారిని తండ్రి పిల్లలూ అని అంటారు ఎందుకంటే వారికి సంతానముగా అయ్యారు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, ఎప్పుడైతే కొత్త సృష్టి రచించవలసి ఉంటుందో అప్పుడు పాత సృష్టిలోని ఆత్మలు ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి మరియు తండ్రి ఇంటి గురించి తెలుసు. ఒకటైతే నిజము - కొందరు తండ్రిని బాగా స్మృతి చేస్తారు, శ్రీమతముపై నడుస్తారు.
కొందరు దేహాభిమానము కారణముగా స్మృతి చేయరు, పావనంగా ఉండరు. బ్రాహ్మణులు ఈశ్వరీయ సంతానము,
బ్రహ్మా ముఖవంశావళి. రచయిత అయిన తండ్రి మహిమ చేయబడతారు కదా. బ్రహ్మా ముఖ కమలము ద్వారా సంతానాన్ని రచిస్తారు.
తప్పకుండా మనం ఈశ్వరీయ సంతానముగా, బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లలైన మీకు తెలుసు. ఎవరైతే పావనంగా ఉంటారో, వారినే బ్రాహ్మణులు అని అనడం జరుగుతుంది. మొత్తం ఆధారమంతా పవిత్రత పైనే ఉంది. దీనిని అపవిత్ర పతిత ప్రపంచము అని అంటారు.
మనుష్యమాత్రులు ఎవరైతే పతితంగా ఉన్నారో, వారు పావనము యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. కలియుగము పతిత ప్రపంచము, సత్యయుగము పావన ప్రపంచము - ఇది ఎవరికీ తెలియదు. చాలా మంది - సత్య,
త్రేతాయుగాలలో కూడా పతిత మనుష్యులు ఉన్నారని,
సీత అపహరించబడ్డారని.... అంటారు. ఇది పావన ప్రపంచాన్ని గ్లాని చేయడమే. ఎటువంటి దృష్టి ఉంటుందో, సృష్టి అటువంటిదిగా కనిపిస్తుంది. పావన ప్రపంచములో కూడా పతితులు ఉన్నట్లయితే మరి తండ్రి పతిత ప్రపంచాన్ని రచించినట్లా? తండ్రి పావన ప్రపంచాన్నే స్థాపన చేస్తారు. పతిత పావనా రండి, వచ్చి ఈ సృష్టిని, అందులోనూ విశేషముగా భారత్ ను పావనముగా చేయండి అని అంటూ ఉంటారు.
ఎవరైతే పావనముగా ఉంటారో వారికే బ్రహ్మాకుమార-కుమారీ అన్న పేరు లభిస్తుంది. పతితులను బ్రాహ్మణ-బ్రాహ్మణీలు అని లేక బి.కె.లు అని అనలేము. వారు ఉన్నదే కుఖవంశావళి. బ్రాహ్మణులైన మీరు బ్రహ్మా ముఖవంశావళి. బ్రహ్మా కుఖవంశావళి అని అయితే అనరు. వారు ఉన్నదే పతితులుగా. ఇప్పుడు మీరు పావన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకే ఈశ్వరీయ సంతానముగా అయ్యారు.
బ్రాహ్మణ, బ్రాహ్మణీలుగా లేక బ్రహ్మాకుమార-కుమారీలుగా పిలువబడుతూ ఒకవేళ పతితులుగా అయితే లేక వికారాల్లోకి వెళ్తే వారు బి.కె.లు కానట్లే. బ్రాహ్మణులు ఎప్పుడూ వికారాల్లోకి వెళ్ళరు.
వికారాల్లోకి వెళ్ళేవారిని శూద్రులు అని అంటారు.
ఈశ్వరుడి నుండి తాము రాజ్య భాగ్యాన్ని తీసుకోవడానికే ఈశ్వరుని సంతానముగా అవుతారు. రాజ్య వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థము చేయాలి. మేము నరుని నుండి నారాయణునిగా అవ్వాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి.
నంబర్ వన్ కామమని, రెండవ నంబర్ క్రోధమని పిల్లలైన మీకు తెలుసు.
క్రోధం మొదలైనవాటికి సంబంధించిన భూతాలు ఉండిపోతే వారు పూర్తి వారసత్వానికి యోగ్యులుగా అవ్వరు. వీరు కామము లేక క్రోధం యొక్క భూతాలకు వశమై పరవశులు అయ్యారని అంటారు.
తండ్రిని స్మృతి చేయని కారణముగా రావణునికి వశమైపోతారు.
ఇటువంటి క్రోధులు లేక కామ వికారం కలవారు నరుని నుండి నారాయణునిగా అయ్యే పదవిని పొందలేరు. ఇక్కడ కావాల్సింది పర్ఫెక్ట్ బ్రాహ్మణులు.
తండ్రి అర్థం చేయిస్తారు, మొదటి నంబరులో దేహాభిమానమనే భూతము వస్తుంది. ఒకవేళ దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే తండ్రి సహాయం కూడా చేస్తారు.
ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వారికి సహాయం లభిస్తుంది. ఎవరిలోనైతే ఈ వికారాల రూపీ శత్రువులు ఉండవో, వారే సత్యమైన బ్రాహ్మణులు.
ముఖ్యముగా దేహాభిమానము కారణముగానే వేరే-వేరే శత్రువులు వస్తాయి. ఈ భారత్ శివాలయముగా ఉండేది,
అప్పుడు దుఃఖపు విషయమేదీ ఉండేది కాదు. ఇది మనుష్యులకు తెలియదు.
వారు అంటారు,
మాయ కూడా ఉంది, ఈశ్వరుడు కూడా ఉన్నారు అని. అరే,
ఈశ్వరుడు తమ సమయమనుసారంగా వస్తారు, మాయ తన సమయమనుసారంగా వస్తుంది. అర్ధకల్పం ఈశ్వరీయ రాజ్యము, అర్ధకల్పం మాయ రాజ్యము. ఈ వివరణ శాస్త్రాలలో లేదు.
అది కేవలం భక్తి మార్గమే. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రి మాత్రమే, వారిని పతిత-పావనుడు అని అంటారు. ఎవరైతే తండ్రిని స్మృతి చేయరో వారి ద్వారా పతిత కర్మలు తప్పకుండా జరుగుతూనే ఉంటాయి. వారిని బ్రాహ్మణ-బ్రాహ్మణీలు అని పిలవలేము. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు.
శివబాబాను (తాతగారిని) స్మృతి చేయకపోతే వారసత్వము ఎక్కడ నిండి లభిస్తుంది. ఇక అటువంటివారికి ఈ పాత ప్రపంచపు మిత్ర-సంబంధీకులు మొదలైనవారు గుర్తుకొస్తారు. తండ్రిని బాగా స్మృతి చేసినట్లయితే తండ్రి కూడా సహాయం చేస్తారు. మీరు ఎక్కడైనా మురళి వినిపించడంలో తికమకపడితే శివబాబా ప్రవేశించి మురళిని వినిపిస్తారు.
అప్పుడు శివబాబా వచ్చి సహాయం చేస్తున్నారని పిల్లలకు అర్థం కాదు. మేము ఈ రోజు మురళిని బాగా వినిపించాము అని భావిస్తారు. అరే, ఈ రోజు బాగా వినిపించారు, మరి నిన్న ఎందుకు వినిపించలేకపోయారు. శివబాబా మాట్లాడుతున్నారా లేక బ్రహ్మా మాట్లాడుతున్నారా అన్నది కూడా మీకు తెలియదు. శివబాబా అంటారు
- పిల్లలూ, మీరు నా ఈశ్వరీయ సంతానము,
నన్ను స్మృతి చేయండి.
ఈ విధంగా ఇంకెవరూ చెప్పలేరు. నేనే వీరిలోకి ప్రవేశించి ఇలా చెప్పగలను. నేను జ్ఞానసాగరుడిని కదా. మీరు జ్ఞానీ ఆత్మలుగా అవుతున్నారు. కావున ఎవరైతే తండ్రితో యోగాన్ని జోడిస్తారో వారికి తండ్రి కూడా వచ్చి సహాయం చేస్తారు. దేహాభిమానులు ఏమైనా స్మృతి చేస్తారా.
తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. నేను మురళి బాగా వినిపించాను అన్న అహంకారము రాకూడదు. అలా కాదు, శివబాబా వచ్చి వినిపించారు అని భావించాలి. ఘడియ-ఘడియ శివబాబాను స్మృతి చేయాలి. పూర్తిగా స్మృతి చేయని పిల్లలు చాలామంది ఉన్నారు, కావున కర్మభోగము తొలగదు. వ్యాధులు వస్తాయి. వికర్మలు వినాశనమవ్వవు.
పిల్లలు తండ్రితో యోగం జోడించాలి. మనము రాజయోగులము. తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకోవాలి. మనం నరుని నుండి నారాయణునిగా అవుతాము. నేను సూర్యవంశములోకి వచ్చేంతగా చదువుతున్నానా? అని హృదయంలో అర్థం చేసుకోవాలి. మొదట దాస-దాసీలుగా అయి ఆ తర్వాత రాజ్యాన్ని పొందడం కాదు.
తండ్రిని స్మృతి చేయడంతో తండ్రి సహాయం లభిస్తుంది. లేదంటే ఏదో ఒక పాపము,
నష్టము మొదలైనవి జరుగుతాయి.
అలాంటివారు ఎంతో దుఃఖాన్ని ఇచ్చేవారిగా అవుతారు.
లక్ష్మీ-నారాయణులైతే సుఖాన్ని ఇచ్చేవారు కదా. వివేకవంతులైన పిల్లలు పూర్తిగా పాసయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఏది లభిస్తే అది సరిపోతుందిలే అని భావించడం కాదు. ప్రతి విషయములో ఆల్రౌండ్ పురుషార్థము చేయాలి. ఈ పని వీరిది,
నేనెందుకు చేయాలి అని భావించడం కూడా కాదు. బాబా ఆల్రౌండ్ పని చేస్తారు కదా. పిల్లల నడవడిక సరిగ్గా లేకపోతే పేరును అప్రతిష్ఠపాలు చేస్తారు. తండ్రి అంటారు,
నాకు చెందినవారిగా అయి మళ్ళీ తప్పుడు పనులు చేస్తే పదభ్రష్టులుగా అవుతారు.
ఈ బ్రహ్మాబాబా డైరెక్షన్ ఇస్తున్నారు అని భావించకండి, శివబాబాయే గుర్తుండాలి.
ప్రపంచాన్ని పావనంగా తయారుచేసే భారము తలపై ఉంది, దానికి మేము బాధ్యులము అని పిల్లలు భావించాలి. భారత్ ను పావనముగా తయారుచేసే చాలా పెద్ద బాధ్యత ఉంది.
యజ్ఞం యొక్క ప్రతి కార్యాన్ని బాధ్యతతో చేయాలి, ఏ పొరపాట్లూ జరగకూడదు, అప్పుడు బాబా కూడా గౌరవము ఇస్తారు. లేదంటే ధర్మరాజు ఎటువంటి శిక్షలు ఇస్తారంటే ఎప్పుడూ జైలులో కూడా అటువంటి శిక్షలను అనుభవించి ఉండకపోవచ్చు,
అందుకే తండ్రి అంటారు,
వినాశనం జరిగేకన్నా ముందే అన్ని వికర్మలను యోగము ద్వారా భస్మం చేసుకోండి. లేదంటే జన్మ-జన్మాంతరాల వికర్మల శిక్షలు ధర్మరాజపురిలో ఎంతగానో అనుభవించవలసి ఉంటుంది, అందుకే పొరపాట్లు చేయకండి. ఇది అంతిమ జన్మ. ఇక తర్వాత స్వర్గములోకే వెళ్తారు. శిక్షలు అనుభవించి,
ఆ తర్వాత ప్రజా పదవిని పొందడమంటే,
దానిని పురుషార్థము అని అనరు. ఆ సమయంలో ఆర్తనాదాలు చేయవలసి వస్తుంది. నేను మీకు పదే, పదే అర్థం చేయించాను అని కూడా తండ్రి సాక్షాత్కారము చేయిస్తారు, బ్రాహ్మణులుగా అవ్వడమనేది అంత సులువైన విషయమేమీ కాదు. ఈశ్వరునికి పిల్లలుగా అవుతారు కావున ఇక ఏ వికారము ఉండకూడదు.
అందులోనూ కామము మహాశత్రువు. ఎవరైతే కామానికి వశమవుతారో వారిని బ్రాహ్మణులు అని అనలేరు.
మాయ ఎంతగానో కింద పడేస్తుంది కానీ కర్మేంద్రియాలతో ఏ పని చేయకూడదు. ఫెమిలియారిటీ (అతి చనువు) యొక్క తేలికపాటి నషా కూడా మాయ నషాయే. బాబా అర్థం చేయించారు, దీని ద్వారా కూడా భారము పెరిగిపోతుంది. మీరు వ్యభిచారులుగా అయ్యారు. ఈశ్వరీయ సంతానములో ఈ కామం, క్రోధం మొదలైన భూతాలు ఏమైనా ఉంటాయా. ఈ భూతాలు ఆసురీ గుణాలు. ఈశ్వరునికి చెందినవారిగా అయి మళ్ళీ మాయకు చెందినవారిగా అయ్యేవారు చాలామంది ఉన్నారు. వారు దేహాభిమానంలోకి వచ్చేస్తారు. తండ్రి శ్రీమతముపై నడవాలి, అప్పుడు తండ్రి బాధ్యులవుతారు. బ్రహ్మా మతము అని కూడా అంటూ ఉంటారు. వీరి మతముపై నడిచినా కూడా దానికి బాధ్యులు తండ్రే అవుతారు. కావున స్వయంపై నుండి బాధ్యతను ఎందుకు దించుకోకూడదు.
బాప్-దాదా,
ఇరువురి మతము ప్రసిద్ధమైనది. మాత మతముపై కూడా నడవాలి ఎందుకంటే మాత గురువుగా అవుతారు. ఆ మాత, పితలు వేరు. ఈ సమయంలో మాతను గురువుగా చేసే పద్ధతి నడుస్తుంది.
మీరు శివాలయం కొరకు పురుషార్థము చేస్తున్నారు. సత్యయుగాన్ని శివాలయము అని అంటారు. పరమాత్మ యొక్క ఖచ్చితమైన పేరు శివ. శివజయంతియే మహిమ చేయబడుతుంది. శివుడిని కళ్యాణకారి అని అంటారు,
వారు బిందువు.
పరమపిత పరమాత్మ రూపము నక్షత్రము వలె ఉంటుంది. బంగారము లేక వెండితో చిన్న నక్షత్రాన్ని తయారుచేసి తిలకముగా పెడతారు. వాస్తవానికి అది ఖచ్చితముగా సరైనదే మరియు నక్షత్రము భృకుటిలో ఉంటుంది.
కానీ మనుష్యులకు జ్ఞానం లేదు. కొందరు త్రిశూలాన్ని చూపిస్తారు.
త్రినేత్రి, త్రికాలదర్శికి గుర్తుగా అనగా దివ్య దృష్టి, దివ్య బుద్ధికి గుర్తుగా అది చూపిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాల జ్ఞానం ఉంది.
మీరు కావాలనుకుంటే ఆ నక్షత్రాన్ని పెట్టుకోవచ్చు. మన గుర్తు తెల్లని నక్షత్రము.
ఆత్మ రూపము కూడా ఇలా నక్షత్రము వలె ఉంటుంది. తండ్రి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తారు. అప్రమత్తం కూడా చేస్తారు. ఎవరైతే - మేము ఎప్పుడూ పాపపు పనులను చేయము అని ప్రతిజ్ఞ చేస్తారో వారే బి.కె.లు.
ఇది గుర్తుంచుకోవాలి. ఎవరి హృదయాన్ని దుఃఖపరచకూడదు.
ఒకవేళ దుఃఖపరిస్తే శివబాబా పిల్లలు కానట్లు. శివబాబా సుఖాన్ని ఇచ్చేందుకే వస్తారు.
అక్కడ యథా రాజా రాణి తథా ప్రజా - అందరూ ఒకరికొకరు సుఖాన్ని ఇస్తారు. ఇక్కడ అందరూ నల్లగా అయిపోయారు,
కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఉన్నదే ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చే ప్రపంచము. సత్యయుగము ఒకరికొకరు సుఖాన్ని ఇచ్చే ప్రపంచము. మనము ఈశ్వరీయ సంతానముగా అయ్యామని,
మనము ఏ పాపములనూ చేయమని లేకపోతే పుణ్యాత్ముల ప్రపంచములో అంతటి పదవిని పొందలేమని అర్థం చేయించాలి. ప్రతి ఒక్కరి నాడి ద్వారా - వారు మన కులానికి చెందినవారా కాదా అన్నది తెలుస్తుంది.
మనము అంటాము - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అని భగవానువాచ ఉంది. భగవంతుడు అని ఒక్క నిరాకారుడినే అంటారు.
మరి వారు ఎప్పుడు వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు? తప్పకుండా ఎప్పుడైతే కొత్త ప్రపంచం స్థాపనవుతుందో అప్పుడు.
కొత్త ప్రపంచము కొరకు తప్పకుండా పాత ప్రపంచములోకి రావలసి ఉంటుంది.
భగవానువాచ - నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను.
ఎక్కడి కోసము? నరకము కోసమా? పావన ప్రపంచము కోసము.
భగవానువాచ - నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. వారు ఎప్పుడు వచ్చారు, వారెవరు,
మళ్ళీ ఎప్పుడు వస్తారు
- ఇది చెప్పండి.
తప్పకుండా సత్యయుగము కోసమే నేర్పిస్తారు. ఇది చాలా సహజము. కానీ ఎవరి భాగ్యములోనైనా లేకపోతే బుద్ధిలో కూర్చోవు. వేడిగా ఉన్న పెనంపై వేసినట్లు ఉంటుంది.
అప్పుడిక, వీరు మన సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యానికి చెందినవారు కారు అని అర్థం చేసుకోవాలి, ఇకపోతే ప్రజలుగా అయితే ఎంతోమంది అవ్వనున్నారు.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే,
5000 సంవత్సరాల తర్వాత తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చి కలుసుకున్న ఇటువంటి పిల్లలకు మాత, పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
ఎవరి హృదయాన్నీ ఎప్పుడూ దుఃఖపరచకూడదు. ఎప్పుడూ ఏ పాపపు పనులూ చేయము, సదా సుఖాన్ని ఇచ్చేవారిగా అవుతాము అని ప్రతిజ్ఞ చేయాలి.
2.
కర్మేంద్రియాలతో ఏ తప్పుడు పనులూ చేయకూడదు. తండ్రి మరియు దాదాల మతముపై నడుస్తూ తమపై ఉన్న భారాన్ని దించుకోవాలి.
వరదానము:-
అమృతవేళ నుండి
మొదలుకొని రాత్రి
వరకు మర్యాదాపూర్వకంగా
నడుచుకునే మర్యాదా
పురుషోత్తమ భవ
సంగమయుగం యొక్క మర్యాదలే పురుషోత్తములుగా తయారుచేస్తాయి,
అందుకే మర్యాదా పురుషోత్తములు అని అంటారు. తమోగుణీ వాయుమండలం, వైబ్రేషన్స్
నుండి రక్షించుకునేందుకు సహజ సాధనము ఈ మర్యాదలు. మర్యాదలలో ఉండేవారు శ్రమ నుండి రక్షింపబడతారు. ప్రతి అడుగు కోసం బాప్ దాదా నుండి మర్యాదలు లభించి ఉన్నాయి, వాటి అనుసారంగా అడుగులు వేయడము ద్వారా స్వతహాగానే మర్యాదా పురుషోత్తములుగా
అవుతారు. కావున అమృతవేళ నుండి రాత్రి వరకు మర్యాద పూర్వకమైన జీవితం ఉండాలి, అప్పుడు పురుషోత్తములు అని అంటారు అనగా సాధారణ పురుషులు కన్నా ఉత్తమమైన ఆత్మలు.
స్లోగన్:-
ఎవరైతే ఏ విషయంలోనైనా స్వయాన్ని మలచుకుంటారో
వారే సర్వుల ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు.
0 Comments