Header Ads Widget

Header Ads

TELUGU MURLI 31.02.23

 

31-01-2023  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 

Download PDF


Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - మీరు అతి అదృష్టవంతులైన పిల్లలు ఎందుకంటే మీ సమ్ముఖముగా స్వయము తండ్రి ఉన్నారు, వారు మీకు వినిపిస్తున్నారు’’

ప్రశ్న:-

భక్తి మార్గపు సంస్కారము ఇప్పుడు పిల్లలైన మీలో ఉండకూడదు? ఎందుకు?

జవాబు:-

భక్తి మార్గంలో దేవీ లేక దేవత వద్దకు వెళ్ళినా, వారిని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. కొందరిని ధనం కోసం యాచిస్తారు, కొందరిని పుత్రుడి కోసం యాచిస్తారు. యాచించే సంస్కారాలు ఇప్పుడు పిల్లలైన మీలో ఉండకూడదు ఎందుకంటే తండ్రి సంగమములో మిమ్మల్ని కామధేనువుగా తయారుచేసారు. మీరు తండ్రి సమానముగా అందరి మనోకామనలను పూర్తి చేసేవారు. మీరు స్వయం కోసం ఆశను పెట్టుకోలేరు. ఫలాన్ని ఇచ్చేవారు ఒక్క దాత అయిన తండ్రి మాత్రమే అని, వారిని స్మృతి చేయడం ద్వారా అన్ని ప్రాప్తులు లభిస్తాయని మీకు తెలుసు. అందుకే యాచించే సంస్కారాలు సమాప్తమైపోతాయి.

పాట:- ఓం నమః శివాయ...

ఓంశాంతి. భగవానువాచ. ఇప్పుడు మంచి రీతిలో అర్థం చేసుకొని మళ్ళీ అర్థం చేయించేందుకు ఒక్క గీతా శాస్త్రమే ఉంది. శాస్త్రాలను మనుష్యులే తయారుచేసారు. కానీ రాజయోగాన్ని మనుష్యులు నేర్పించరు. తండ్రి అంటారు, నేనే 5000 సంవత్సరాల క్రితం కూడా భారతవాసులైన మీకు, చాలాకాలం క్రితం విడిపోయి తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలైన మీకు రాజయోగం నేర్పించాను. సికీలధే యొక్క అర్థాన్ని ఏమని అర్థం చేయించారంటే, మీరే పూర్తి 84 జన్మలను తీసుకొని మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మీరు కలిశారు మరియు మీరు వచ్చి బ్రహ్మా ముఖ వంశావళిగా అనగా బ్రాహ్మణ, బ్రాహ్మణీలుగా అయ్యారు. తండ్రి డైరెక్టుగా మాట్లాడుతారు. గీతా పాఠకులు మొదలైనవారు విషయాలను మాట్లాడరు. తండ్రి డైరెక్టుగా అర్థం చేయించి వెళ్ళారు, మళ్ళీ భక్తి మార్గం నుండి శాస్త్రాలను తయారుచేస్తారు. ఇప్పుడు డ్రామా పూర్తవుతుంది. మళ్ళీ తండ్రి వచ్చారు, వారు పిల్లలతో మాట్లాడుతారు, పిల్లలతో? విశేషముగా మీతో మరియు మామూలుగా మొత్తం ప్రపంచముతో అని అంటారు. ఇప్పుడు మీరు సమ్ముఖములో ఉన్నారు. మీకు బాబా కూర్చొని తమ పరిచయాన్ని ఇచ్చారు. రాజయోగాన్ని మీకు ఇంకెవ్వరూ నేర్పించలేరు. తండ్రియే ఇంతకుముందు యోగాన్ని నేర్పించారు, ఇప్పుడూ నేర్పిస్తున్నారు, దీని ద్వారా మీరు మళ్ళీ రాజులకే రాజులుగా అవుతారు, ఇంకెవ్వరూ స్వర్గానికి యజమానులుగా తయారుచేయలేరు. మీ తండ్రినైన నేను వచ్చాను మీకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పించేందుకు. అచ్ఛా, ఇప్పుడు బాబా మీకు వృక్షము గురించి అర్థం చేయిస్తారు. వివరణ కూడా చాలా అవసరము. దీనిని కల్ప-వృక్షం అని అంటారు. తండ్రి అంటారు, మనుష్య సృష్టి రూపీ వృక్షము కల్ప-వృక్షము. గీతను వినిపించేవారు - భగవంతుడు విధంగా ఇంతకుముందు చెప్పారు అని అంటారు మరియు మీరు - భగవంతుడు విధముగా ఇప్పుడు చెప్తూ ఉన్నారు అని అంటారు. ఇది మనుష్య సృష్టి యొక్క వృక్షము. దీనికి ఫలాలు, మామిడి పండ్లు మొదలైనవేమీ లేవు. ఫలాలతో కూడిన వృక్షము ఏదైతే ఉంటుందో, దానికి బీజము కింద, వృక్షము పైన ఉంటుంది. దీనికి బీజము పైన మరియు వృక్షము కింద ఉంటుంది. వారు ఇలా అంటారు కూడా, ఈశ్వరుడు మమ్మల్ని సృష్టించారు అనగా తండ్రి పిల్లలను ఇచ్చారు, తండ్రి ధనాన్ని ఇచ్చారు అని. బాబా, మీరు మా దుఃఖాలన్నింటినీ దూరం చేయండి. బాబా, బాబా అని అంటూ ఉంటారు. లక్ష్మీ-నారాయణుల ఎదురుగా వెళ్తారు, వారి నుండి కూడా యాచిస్తారు, మహాలక్ష్మీ, మాకు ధనము ఇవ్వండి అని. ఇవన్నీ యాచించే సంస్కారాలు. జగదాంబ నుండి కొందరు పుత్రుడిని యాచిస్తారు, మరికొందరు మా అనారోగ్యాన్ని దూరం చేయండి అని అంటారు. లక్ష్మి ఎదురుగా ఇటువంటి ఆశలను పెట్టుకోరు, వారి నుండి కేవలం ధనము యాచిస్తారు. జగదాంబయే లక్ష్మి అని, వారు తర్వాత 84 జన్మల చక్రములో తిరిగి మళ్ళీ జగదాంబగా అవుతారని మీకు తెలుసు. వృక్షములో చూడండి, జగదాంబ కూర్చొని ఉన్నారు. వీరే మళ్ళీ మహారాణిగా తప్పకుండా అవుతారు, పిల్లలైన మీరు కూడా రాజధానిలోకి వస్తారు. మీరు కల్ప-వృక్షము కింద కూర్చున్నారు. సంగమములో పునాది వేస్తున్నారు. కామధేనువు యొక్క పిల్లలైన మీరే అందరి మనోకామనలను పూర్తి చేసేవారు. భారత మాతలైన మీరు శక్తి సైన్యము, ఇందులో పాండవులు కూడా ఉన్నారు.

స్మృతి అనేది ఒక్క తండ్రినే చేయాలని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు ఎవరిని భక్తి చేసినా, ఎవరిని స్మృతి చేసినా కానీ ఫలాన్ని ఇచ్చేవారు ఎంతైనా ఒక్క దాత మాత్రమే. వారే అన్నీ ఇస్తారు. భక్తి మార్గంలో మీరు శ్రీనారాయణుడిని, శ్రీకృష్ణుడిని పూజిస్తారు, కృష్ణుడిని ఊయలలో ఊపుతారు కూడా, ప్రేమిస్తారు. వారి నుండి మీరు ఏం యాచిస్తారు. మేము వారి రాజధానిలోకి వెళ్ళాలని లేక మాకు శ్రీకృష్ణుని వంటి కొడుకు లభించాలని మీరు కోరుకుంటారు. రాధే గోవిందులను భజించండి, బృందావనానికి పదండి అని గానం చేస్తారు. వైకుంఠములో ఎక్కడైతే రాజ్యం చేసేవారో, సమయంలో ఎటువంటి అప్రాప్తి ఉండదు. శ్రీకృష్ణుని రాజ్యాన్ని అయితే ఎంతగానో తలచుకుంటారు. భారత్ లో శ్రీకృష్ణుని రాజ్యం ఉన్నప్పుడు ఇంకే రాజ్యమూ ఉండేది కాదు. ఇప్పుడు తండ్రి వచ్చారు, వారు అంటారు, ఇక కృష్ణపురికి పదండి, అక్కడకు వెళ్ళి శ్రీకృష్ణునికి పత్నిగా అవ్వండి లేక రాధేకు పతిగా అవ్వండి. విషయం ఒక్కటే. అక్కడ విషం లభించదు. అది ఉన్నదే సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. ఇప్పుడు మీరు విద్యార్థులు, నరుని నుండి నారాయణునిగా, బికారి నుండి యువరాజుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. ఇక్కడ ఎవరైనా కోటీశ్వరులుగా ఉన్నా కానీ, 50 కోట్లు ఉన్నా కానీ మీతో పోలిస్తే వారు పేదవారే ఎందుకంటే వారి ధనమంతా మట్టిలో కలిసిపోనున్నది. ఏదీ వారితోపాటు వెళ్ళదు. ఖాళీ చేతులతో వెళ్తారు. మీరైతే 21 జన్మల కొరకు నిండు చేతులతో వెళ్తారు. ఇప్పుడు మీరు రాజయోగము నేర్చుకుంటున్నారు. తర్వాత సత్యయుగములోకి వచ్చి రాజ్యం చేస్తారు. మీరు పునర్జన్మలు తీసుకుంటూ వర్ణాలలోకి వస్తూ ఉంటారు. సత్యయుగములో 16 కళలు, త్రేతాలో 14 కళలు ఉంటాయి. తర్వాత భక్తి మార్గం ప్రారంభమవుతుంది, అప్పుడు ఇబ్రహీం, బుద్ధుడు వస్తారు. క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితం దేవీ-దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు మొత్తం వృక్షమంతా సిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మీరు కల్ప-వృక్షము కింద సంగమములో కూర్చున్నారు, దీనిని కల్పం యొక్క సంగమము లేక కలియుగము మరియు సత్యయుగము యొక్క సంగమము అని అంటారు. సత్యయుగము తర్వాత త్రేతా, మళ్ళీ త్రేతా తర్వాత ద్వాపరం మరియు కలియుగం యొక్క సంగమము. కలియుగం తర్వాత సత్యయుగం తప్పకుండా వస్తుంది. మధ్యలో సంగమం తప్పకుండా కావాలి. కల్పం యొక్క సంగమయుగములో తండ్రి వస్తారు. వారు కల్పము అన్న పదాన్ని మార్చి కేవలం యుగే-యుగే అని వ్రాసేసారు. తండ్రి అంటారు, నిరాకార పరమపిత పరమాత్మనైన నేను జ్ఞానసాగరుడను. భారత్ లోనే శివజయంతి మహిమ చేయబడుతుంది. శ్రీకృష్ణుడైతే జ్ఞానాన్ని ఇవ్వలేరు. మేము స్వర్గములో శ్రీకృష్ణుడిని కలుస్తాము అని మీరు అంటారు. తండ్రి అంటారు, భక్తిలో శ్రీకృష్ణుని సాక్షాత్కారాన్ని నేను మీకు చేయిస్తాను. కృష్ణ జయంతి నాడు ఎంతో ప్రేమగా వారిని ఊయలలో ఊపుతారు, పూజ చేస్తారు. వారికి నిజముగానే శ్రీకృష్ణుడు కనిపిస్తున్నట్లుగా ఉంటుంది. సాక్షాత్కారము కలుగుతుంది. కృష్ణుని చిత్రము వారి ముందు ఉంటే దానిని కూడా తీసుకొని ఆలింగనం చేసుకుంటారు. భక్తి మార్గంలో నేనే సహాయం చేస్తాను. నేనే దాతను. లక్ష్మిని పూజిస్తారు, ఇప్పుడు అది కేవలం రాత్రి విగ్రహము మాత్రమే. వారేమి ఇస్తారు? నేనే ఇవ్వాల్సి ఉంటుంది. సాక్షాత్కారము కూడా నేనే చేయిస్తాను. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పరమపిత పరమాత్ముని ఆజ్ఞానుసారముగా ప్రతి ఆకు కదులుతుంది అని అంటారు ఎందుకంటే వారు ఆకు, ఆకులోనూ పరమాత్మ ఉన్నారని భావిస్తారు. పరమాత్మ ఏమైనా కూర్చొని ఆకు, ఆకుకూ ఆజ్ఞను ఇస్తారా! ఇది డ్రామాగా రచింపబడి ఉంది. ఇప్పుడు మీరు విధమైన పాత్రను అభినయిస్తున్నారో, కల్పం తర్వాత కూడా మీరు అదే విధముగా చేస్తారు. ఏదైతే షూటింగ్ లో షూట్ చేయబడిందో అదే నడుస్తుంది. అందులో ఎటువంటి మార్పు రాదు. డ్రామాను కూడా బాగా అర్థం చేసుకోవాలి. తండ్రి అర్థం చేయిస్తారు, అనంతమైన సుఖము కల్ప-కల్పము భారత్ కే లభిస్తుంది. కానీ ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే వర్ణాలలోకి వస్తారు, 84 జన్మలు తీసుకుంటారు. ఇతరుల జన్మలు నంబరువారుగా తగ్గిపోతూ ఉంటాయి. ఎన్ని చిన్న-చిన్న మఠాలు, మార్గాలు ఉన్నాయి. వారికి కూడా మహిమ ఉంది ఎందుకంటే పవిత్రంగా ఉంటారు. స్వర్గ రచయిత తండ్రి, ఇతర మనుష్యులు ఏమైనా స్వర్గాన్ని రచిస్తారా. రాజయోగాన్ని కూడా ఎవరైనా నేర్పించగలరా.

ఇప్పుడు మీరు శ్రీకృష్ణపురిలోకి వెళ్ళేందుకు రాజయోగము నేర్చుకుంటున్నారు. పురుషార్థము ఎల్లప్పుడూ ఉన్నతముగా చేయాలి. శ్రీకృష్ణుని వంటి కొడుకు లభించాలి, శ్రీకృష్ణుని వంటి పతి లభించాలి అని మీరు అంటారు. శ్రీకృష్ణుడే శ్రీనారాయణునిగా అవుతారు, మరి మళ్ళీ శ్రీకృష్ణుని వంటి వారు కావాలి అని ఎందుకు అంటారు! మీరు నారాయణుని వంటి పతి లభించాలి అని అనాలి. నారదుడు కూడా నేను లక్ష్మిని వరిస్తాను అని అన్నారు. రాధేను వరిస్తాను అని అనలేదు. తండ్రి అర్థం చేయిస్తారు, మీరు కృష్ణపురిలోకి వెళ్ళాలంటే బాగా పురుషార్థం చేయండి, అది శ్రీకృష్ణుని దైవీ కులము. కంసునిది ఆసురీ కులము. మీరు ఇప్పుడు సంగమములో ఉన్నారు. శూద్ర సాంప్రదాయము వారు బ్రాహ్మణ, బ్రాహ్మణీలుగా చెప్పుకోలేరు. ఎవరైతే బ్రాహ్మణులుగా చెప్పుకోరో వారు శూద్ర వర్ణానికి చెందినవారు. ఇది భారత్ యొక్క విషయమే. భారత్ యే స్వర్గముగా అవుతుంది, మళ్ళీ భారత్ యే నరకముగా అవుతుంది. లక్ష్మీ-నారాయణులు కూడా 84 జన్మలు తీసుకొని రజో, తమోలలోకి రావాల్సిందే. వారు కూడా చక్రములోకి వస్తారన్నప్పుడు, ఇక బుద్ధుడు మొదలైనవారు నిర్వాణధామానికి తిరిగి ఎలా వెళ్ళగలరు. కొందరు కృష్ణుడు సర్వవ్యాపి అని, ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. రాముని భక్తులు రాముడు సర్వవ్యాపి అని అంటారు. వారు కృష్ణుడిని నమ్మరు. బాబా వద్దకు ఒక రాధా భక్తుడు వచ్చారు, ఎక్కడ చూసినా రాధయే రాధ... రాధ అంతటా హాజరై ఉన్నారు, నీలోనూ, నాలోనూ రాధయే రాధ అని అనేవారు. గణేశుని పూజారి నీలోనూ, నాలోనూ గణేశుడే గణేశుడు అని అంటారు. క్రిస్టియన్లు క్రైస్టు భగవంతుని కుమారుడు అని అంటారు. అరే, క్రైస్టు వారి కుమారుడైనప్పుడు మరి మీరు ఎవరి కుమారులు? అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి. మార్గం ఎవరికీ లభించదు. కేవలం తల వంచి నమస్కరిస్తూ భ్రమిస్తూ ఉంటారు. ముక్తి మరియు జీవన్ముక్తులను భగవంతుడే ఇస్తారు కదా! వారి నుండి మనం ఏమి యాచించాలి! కొందరికి తెలియనే తెలియదు. తండ్రి గురించి తెలియని కారణముగా అనాథలుగా అయిపోయారు. మళ్ళీ నాథుడు వచ్చి సనాథలుగా తయారుచేస్తారు. మనుష్యులు ఎన్ని ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు, భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని భావిస్తారు. తండ్రి అంటారు, నేను నా సమయంలోనే వస్తాను. ఎవరు ఎంతగా పిలిచినా కానీ నేను సంగమములోనే వస్తాను. ఒకేసారి వచ్చి భారత్ ను స్వర్గముగా తయారుచేసి అందరినీ శాంతిధామానికి పంపించివేస్తాను. మళ్ళీ నంబరువారుగా తమ-తమ సమయమనుసారంగా వస్తారు. ఎవరైతే దేవీ-దేవతలుగా ఉండేవారో ఆత్మలందరూ కూడా ఇప్పుడు కూర్చొని ఉన్నారు. మళ్ళీ తమ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడైతే దేవీ-దేవతా ధర్మమే లేదు. అందరూ స్వయాన్ని హిందువులుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. డ్రామానుసారంగా మళ్ళీ ఇలానే జరుగుతుంది. ఏదైతే జరిగిపోయిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇదే విధముగా మనం చక్రములోకి వస్తాము, ఇన్ని జన్మలు తీసుకుంటాము. లెక్క తీయండి. ప్రతి ధర్మం వారు తర్వాత ఎన్ని జన్మలు తీసుకుంటారు? వృక్షము గురించి అర్థం చేయించడం చాలా సహజము. ఎవరిదో ప్రేరణ ద్వారా వినాశ జ్వాల తయారవుతోంది అని మనుష్యులకు దానంతట అదే టచ్ అవుతుంది. యూరోప్ వాసులైన యాదవులు బాంబులు తయారుచేస్తారు. వారు కూడా అంటారు, మాకు ప్రేరణ ఇచ్చేవారు ఎవరో ఉన్నారు, దీని ద్వారా మేము మా కులాన్నే వినాశనం చేసుకుంటామని మాకు తెలుసు. వద్దనుకున్నా కానీ మృత్యు సామాగ్రిని తయారుచేస్తారు. మెల్ల-మెల్లగా ప్రభావం పడుతుంది. మెల్ల-మెల్లగా వృక్షం పెరుగుతుంది కదా. కొందరు ముళ్ళ నుండి మొగ్గలుగా, కొందరు పుష్పాలుగా అవుతారు. కొన్ని-కొన్ని పుష్పాలు కూడా తుఫానులు వచ్చినప్పుడు వాడిపోతాయి. బాబా కల్ప-కల్పమూ చెప్పారు - ఆశ్చర్యవంతులై వింటారు, అందరికీ వినిపిస్తారు... అని. ఇప్పుడు మళ్ళీ బాబా స్వయంగా అంటున్నారు, నా వద్దకు వస్తారు, బ్రహ్మాకుమార-కుమారీలుగా అవుతారు, ఇతరులకు వినిపిస్తారు, మళ్ళీ అహో మాయ, మంచి-మంచి పిల్లలను కూడా తినేస్తుంది. మున్ముందు చూడండి, మంచి-మంచి పిల్లలు కూడా ఎలా అంతమైపోతారో.

ఏదైతే గతించిపోయిందో దానిని మళ్ళీ ఇప్పుడు వర్తమానంలో తండ్రి అర్థం చేయిస్తారు. మళ్ళీ భక్తి మార్గంలో శాస్త్రాలను తయారుచేస్తారు. డ్రామా విధంగా రచింపబడి ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చి బ్రహ్మా ద్వారా సర్వ వేద-శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే ధర్మ స్థాపన చేస్తారో, వారి పేర్లతో శాస్త్రాలను తయారుచేస్తారు. దానిని ధర్మశాస్త్రము అని అంటారు. దేవీ-దేవతా ధర్మ శాస్త్రము ఒక్క గీతయే. ప్రతి ధర్మానికి ఒక శాస్త్రము ఉండాలి. శ్రీమత్ భగవద్గీత సరైనది. అందులో భగవానువాచ ఉంది. భగవంతుడు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపించారు. ఇది అన్నింటికన్నా ప్రాచీనమైన ధర్మము. ప్రతి ధర్మానికి తమ-తమ శాస్త్రముంది మరియు దానిని చదువుతూ ఉంటారు. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతారు. కానీ మీకు శాస్త్రాలు చదవాల్సిన అవసరం ఉండదు, అక్కడ శాస్త్రాలు ఉండనే ఉండవు, ఇవన్నీ అంతమైపోతాయి. మరి గీత ఎక్కడి నుండి వచ్చింది? ద్వాపరములో మనుష్యులు కూర్చొని తయారుచేసారు, గీత అయితే ఇప్పుడు ఉందో మళ్ళీ అదే గీతను వెలికి తీస్తారు. విధముగా కల్పపూర్వము తయారుచేసారో అలాగే మళ్ళీ శాస్త్రాలు తయారవుతాయి. భక్తి మార్గపు సామాగ్రి తయారవుతూనే ఉంటుంది.

తండ్రి అర్థం చేయిస్తారు, చాలా కాలం క్రితం విడిపోయి మళ్ళీ కలిసిన ప్రియమైన పిల్లలూ , తండ్రినైన నా శ్రీమతముపై నడుస్తూ శ్రేష్ఠంగా అవ్వండి. మీరు ఇప్పుడు సంగమయుగములో రాజయోగము నేర్చుకుంటున్నారు, ఇప్పుడు కలియుగాన్ని సత్యయుగముగా తయారుచేయాలి. వారు కల్పం ఆయువును ఎంతో పెద్దగా చూపించి అందరినీ ఘోర అంధకారములో పడేసారు. మనుష్యులు తికమక చెంది ఉన్నారు, డ్రామానుసారంగా పిల్లలైన మీరే అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా ఎన్నో యుక్తులను తెలియజేసారు. కేవలం బాబాను స్మృతి చేయండి, చార్టు పెట్టండి. భోజనం తయారుచేసే సమయంలో కూడా స్మృతి చేయండి. భోజనం తయారుచేసే సమయంలో పతి, కొడుకు గుర్తుకొస్తున్నప్పుడు మరి శివబాబా ఎందుకు గుర్తుకు రారు! ఇది మీ పని. తండ్రి బుద్ధి యొక్క మెట్లు ఇస్తారు, ఇక ఎక్కండి, ఎక్కకపోండి, అది మీ పని. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మెట్లు ఎక్కుతూ ఉంటారు. లేకపోతే అంతటి సుఖము లభించదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన చాలాకాలం క్రితం విడిపోయి తర్వాత కలిసిన అనగా 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి కలిసిన పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారముగా మాత-పితల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కృష్ణపురిలోకి వెళ్ళేందుకు పురుషార్థం చాలా బాగా చేయాలి. శూద్రత్వపు సంస్కారాలను పరివర్తన చేసి పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి.

2. బుద్ధిబలముతో స్మృతి మెట్లను ఎక్కాలి. మెట్లు ఎక్కడం ద్వారానే అపారమైన సుఖము అనుభవమవుతుంది.

వరదానము:-

అటెన్షన్ మరియు చెకింగ్ యొక్క విధి ద్వారా వ్యర్థ ఖాతాను సమాప్తం చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ

బ్రాహ్మణ జీవితంలో వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మలు చాలా సమయాన్ని వ్యర్థం చేస్తాయి. ఎంత సంపాదించాలనుకుంటారో అంత చేయలేకపోతారు. వ్యర్థ ఖాతా సమర్థంగా అవ్వనివ్వదు. అందుకే సదా స్మృతిలో ఉండండి, నేను మాస్టర్ సర్వశక్తివాన్. శక్తి ఉంటే ఏది చేయాలనుకుంటే అది చేయగలరు. కేవలం పదే-పదే అటెన్షన్ ఇవ్వండి. ఎలాగైతే క్లాస్ సమయంలో లేక అమృతవేళ స్మృతి చేసే సమయంలో అటెన్షన్ ఇస్తారో, అలా మధ్య-మధ్యలో కూడా అటెన్షన్ మరియు చెకింగ్ యొక్క విధిని పాటించండి, అప్పుడు వ్యర్థ ఖాతా సమాప్తమైపోతుంది.

స్లోగన్:-

రాజఋషిగా అవ్వాలంటే బ్రాహ్మణ ఆత్మల ఆశీర్వాదాలతో మీ స్థితిని నిర్విఘ్నంగా చేసుకోండి.

 Download PDF

Post a Comment

0 Comments