30-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- మీరు ఈశ్వరీయ
సంతానము, ఇది మీ అమూల్యమైన జీవితము,
మీ ఈశ్వరీయ
కులము చాలా
శ్రేష్ఠమైనది. స్వయంగా
భగవంతుడు మిమ్మల్ని
దత్తత తీసుకున్నారు, ఇదే నషాలో
ఉండండి’’
ప్రశ్న:-
శరీర భానము తొలగిపోవాలి - దాని కొరకు ఏ అభ్యాసము యొక్క అవసరము ఉంది?
జవాబు:-
నడుస్తూ-తిరుగుతూ ఈ అభ్యాసం చేయండి - శరీరములో నేను కొద్ది సమయం కొరకే నిమిత్తమాత్రంగా
ఉన్నాను. ఏ విధంగా తండ్రి కొద్ది సమయం కొరకు శరీరములోకి వచ్చారో, అదే విధంగా ఆత్మలైన మనం కూడా శ్రీమతముపై భారత్ ను స్వర్గముగా తయారుచేయడానికి ఈ శరీరాన్ని ధారణ చేసాము. తండ్రి మరియు వారసత్వము గుర్తున్నట్లయితే శరీర భానము తొలగిపోతుంది, దీనినే క్షణములో జీవన్ముక్తి అని అంటారు. 2) అమృతవేళలో లేచి తండ్రితో మధురాతి-మధురమైన మాటలను మాట్లాడినట్లయితే శరీర భానము సమాప్తమవుతూ ఉంటుంది.
పాట:- ఓం నమః శివాయ...
ఓం శాంతి. భగవంతుడు ఒక్కరే, వారు తండ్రి కూడా అవుతారు. ఆత్మ రూపము పెద్ద లింగము వలె ఏమీ ఉండదని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది.
ఆత్మ చాలా చిన్నని నక్షత్రము వలె భృకుటి మధ్యలో ఉంటుంది.
అది మందిరాలలో పెట్టినట్లుగా అంత పెద్ద జ్యోతిర్లింగమేమీ కాదు.
అలా కాదు.
ఆత్మ ఏ విధంగా ఉంటుందో, పరమాత్మైన తండ్రి కూడా అదే విధంగా ఉంటారు.
ఆత్మ రూపము మనుష్యుల వలె ఉండదు. ఆత్మ మనుష్య తనువును ఆధారము తీసుకునేటువంటిది. ఆత్మయే అన్నీ చేస్తుంది. సంస్కారాలన్నీ ఆత్మలో ఉంటాయి. ఆత్మ నక్షత్రము వంటిది. ఆత్మయే మంచి లేక చెడు సంస్కారాల అనుసారంగా జన్మ తీసుకుంటుంది. కావున ఈ విషయాలను బాగా అర్థం చేసుకోవాలి. మందిరాలలో లింగం పెట్టి ఉంటుంది,
అందుకే అర్థం చేయించేందుకు మనం కూడా శివలింగాన్ని చూపిస్తాము.
వీరి పేరు శివ, పేరు లేకుండా ఏదీ ఉండదు. ఏదో ఒక ఆకారము ఉంటుంది.
తండ్రి పరంధామంలో ఉంటారు.
పరమాత్మైన తండ్రి అంటారు,
ఏ విధంగా ఆత్మ శరీరంలోకి వస్తుందో, అదే విధముగా నరకాన్ని స్వర్గముగా తయారుచేయడానికి నేను కూడా రావాల్సి ఉంటుంది.
తండ్రి మహిమ అందరికన్నా అతీతమైనది. ఆత్మలైన మీరు ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇది అనంతమైన, అనాది, అవినాశీ డ్రామా, ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. ఇది తిరుగుతూనే ఉంటుంది. రచయిత అయిన తండ్రి కూడా ఒక్కరే,
వారి రచన కూడా ఒక్కటే.
ఇది అనంతమైన సృష్టి చక్రము. నాలుగు యుగాలు ఉన్నాయి. ఇంకొకటి కల్పం యొక్క సంగమయుగము, అందులోనే తండ్రి వచ్చి పతిత ప్రపంచాన్ని పావనంగా తయారుచేస్తారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది - ఆత్మలైన మనమందరము పరంధామంలో ఉండేవారము,
ఈ కర్మక్షేత్రములోకి పాత్రను అభినయించేందుకు వచ్చాము.
ఈ అనంతమైన డ్రామా రిపీట్ అవ్వనున్నది.
తండ్రి అనంతమైన యజమాని.
ఆ తండ్రికి అపారమైన మహిమ ఉంది. ఇటువంటి మహిమ ఇంకెవ్వరికీ లేదు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు. అందరికీ తండ్రి.
తండ్రి అంటారు, నేను పరాయి రావణ ప్రపంచములోకి వస్తాను. ఒక వైపు ఆసురీ గుణాలు కల సాంప్రదాయము ఉంటుంది, ఇంకొక వైపు దైవీ గుణాలు కల సంప్రదాయము ఉంటుంది. దీనిని కంసపురి అని కూడా అంటారు. కంసుడు అని అసురుడిని అంటారు. శ్రీకృష్ణుడిని దేవత అని అంటారు.
ఇప్పుడు దేవతలుగా తయారుచేయడానికి మరియు అందరినీ తిరిగి తీసుకువెళ్ళడానికి తండ్రి వచ్చారు,
ఇంకెవ్వరికీ అంతటి శక్తి లేదు. తండ్రియే కూర్చుని పిల్లలకు శిక్షణను ఇచ్చి దైవీ గుణాలను ధారణ చేయిస్తారు. అది తండ్రి కర్తవ్యమే. తండ్రి అంటారు, ఎప్పుడైతే అందరూ తమోప్రధానులుగా అవుతారో, అప్పుడు నన్ను మర్చిపోతారు, కేవలం మర్చిపోవడమే కాదు, నన్ను రాళ్ళు, రప్పలలోకి తోసేస్తారు, అంత గ్లాని చేస్తారు, కావుననే నేను వస్తాను.
నన్ను గ్లాని చేసినంతగా ఇంకెవరినీ చేయరు, కావుననే నేను వచ్చి మీ ముక్తిప్రదాతగా అవుతాను. అందరినీ దోమల గుంపు వలె తీసుకువెళ్తాను. మన్మనాభవ, మీ తండ్రినైన పరమపిత పరమాత్మనైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని ఇంకెవ్వరూ ఇలా అనలేరు. శ్రీకృష్ణుడు ఇలా అనలేరు. పరమాత్ముని మహిమ గురించి పిల్లలకు తెలుసు.
వారు జ్ఞానసాగరుడు,
సుఖసాగరుడు. తర్వాత రెండవ నంబరులో బ్రహ్మా, విష్ణు,
శంకరులు ఉన్నారు. బ్రహ్మా ద్వారా స్థాపన ఎవరు చేస్తారు? శ్రీకృష్ణుడు చేస్తారా?
పరమపిత పరమాత్మ కూర్చొని అర్థం చేయిస్తారు - మొట్టమొదట నాకు కావాల్సింది బ్రాహ్మణులు. కావున బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ ముఖవంశావళిని రచిస్తాను. వారిది కుఖ వంశావళి.
ఇప్పుడు మీరు సంగమములో బ్రహ్మా సంతానముగా ఉన్నారు. తండ్రి వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ కులానికి చెందినవారు. ఈశ్వరుడు నిరాకారుడు, బ్రహ్మా సాకారుడు.
తండ్రి మొట్టమొదట బ్రాహ్మణులను,
ఆ తర్వాత దేవతలను తయారుచేస్తారు. దేవతల తర్వాత క్షత్రియులు... ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది.
మళ్ళీ దీని నుండి ఇతర ధర్మాలు వెలువడ్డాయి. ముఖ్యమైనది భారత్, ఈ భారత్ అవినాశీ ఖండము,
ఇక్కడకు తండ్రి వచ్చి స్వర్గాన్ని తయారుచేస్తారు. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, మీ సద్గురువు కూడా.
మరి వారిని సర్వవ్యాపి అని ఎలా అనగలరు. వారు మీ తండ్రి.
ఈ ప్రపంచములో బ్రాహ్మణులైన మీరు తప్ప ఇంకెవ్వరూ త్రికాలదర్శులు కాలేరు. పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు - పరమపిత పరమాత్మతోపాటు మనము పరంధామంలో ఉండేవారము, తర్వాత నంబరువారుగా కర్మక్షేత్రములోకి వస్తాము.
మళ్ళీ చివరిలో మనమే వెళ్తాము. 84 జన్మలు పూర్తిగా తీసుకోవాలి.
మీరు ఎన్ని జన్మలు తీసుకున్నారు మరియు ఏ విధముగా వర్ణాలలోకి వచ్చారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయులు, మీరు ఈశ్వరీయ సంతానముగా అయిన కారణముగా ఇది మీ అమూల్యమైన జీవితము.
బ్రహ్మా ద్వారా తండ్రి వచ్చి దత్తత తీసుకుంటారు. తండ్రి స్వర్గ రచయిత కావున వారు స్వయమే వచ్చి స్వర్గానికి యజమానులుగా కూడా తయారుచేస్తారు. ఇప్పుడు మొత్తం విశ్వమంతటిలో శాంతిని స్థాపన చేయడము - ఇది తండ్రి పని మాత్రమే. తండ్రి అంటారు,
ఇది నా పాత్ర, నేను మీకు మళ్ళీ రాజయోగాన్ని నేర్పిస్తాను, దాని ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు.
ఏ విధముగా దేవతలుగా అయ్యారో, అది ఇప్పుడు మళ్ళీ పునరావృతమవుతుంది. ఈ అంటు కట్టబడుతోంది. తండ్రి తోట యజమాని,
వీరి ద్వారా అంటు కడుతున్నారు.
తండ్రి సమ్ముఖంలో కూర్చుని అర్థం చేయిస్తారు - చాలా కాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన నా ప్రియమైన పిల్లలూ, చాలా కాలం నుండి విడిపోయిన పిల్లలు - నేను మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను,
మీకు గుర్తుంది కదా. తర్వాత మీరు 84 జన్మల చక్రములో తిరిగి ఇప్పుడు వచ్చి కలుసుకున్నారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. మిమ్మల్ని తప్పకుండా తిరిగి తీసుకువెళ్ళాలి. మీరు కోరుకున్నా, కోరుకోకపోయినా తప్పకుండా తీసుకువెళ్ళాలి. మొదట ఆది సనాతన దైవీ రాజ్యం నడిచింది, ఆ తర్వాత ఆసురీ రాజ్యం నడిచింది. దైవీ రాజ్యం తర్వాత పవిత్రత దూరమైపోయింది, అప్పుడిక ఏక కిరీటము మిగిలింది, ఇప్పుడైతే ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది, మళ్ళీ దైవీ రాజ్య స్థాపన జరుగుతుంది.
ఆసురీ రాజ్యం యొక్క వినాశనం కొరకు ఈ రుద్ర యజ్ఞము నుండి ఈ వినాశ జ్వాల ప్రజ్వలితమయ్యింది. మీరు పతిత సృష్టిపై ఏమైనా రాజ్యం చేస్తారా.
ఇప్పుడు ఇది సంగమము. సత్యయుగములో ఇలా అనరు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు. చేయించేవారు ఎవరు? శ్రీమతాన్ని ఇచ్చే సమర్థులు, శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు ఒక్క తండ్రే. వారే బ్రహ్మా ద్వారా స్థాపన చేయిస్తున్నారు. తండ్రి అంటారు,
నేను భారత్ కు అతి వినమ్రుడినైన సేవకుడను. భారత్ ను స్వర్గముగా తయారుచేస్తాను. అక్కడ యథా రాజా రాణి తథా ప్రజా అందరూ సుఖముగా ఉంటారు. ప్రకృతి సిద్ధమైన సౌందర్యము ఉంటుంది.
లక్ష్మీ-నారాయణులను చూడండి,
ఎంత సుందరముగా ఉన్నారు. స్వర్గాన్ని స్థాపించేవారు ఆ స్వర్గ స్థాపకుడైన తండ్రి. మొత్తం ప్రపంచము గీత విషయంలో శ్రీకృష్ణ భగవానువాచ అని అంటుంది. కానీ శ్రీకృష్ణుడు - మన్మనాభవ, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని అనలేరు. ఇంకే ఉపాయమూ లేదు కూడా. గంగ అయితే పతిత పావని కాదు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని గంగ ఏమైనా అంటుందా. ఈ విధముగా ఒక్క తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రి ఆత్మలతో మాట్లాడుతారు. తండ్రే సర్వుల సద్గతిదాత. వారి మందిరాలు కూడా ఉన్నాయి. ద్వాపరం నుండి అన్ని స్మృతిచిహ్నాలు తయారవ్వడం మొదలవుతాయి. సోమనాథ మందిరము ఉంది, కానీ వారు ఏం చేసి వెళ్ళారు
- అది ఎవరికీ తెలియదు. వారు శివ శంకరులను కలిపేస్తారు.
ఇప్పుడు పరంధామ నివాసి అయిన శివుడు ఎక్కడ మరియు సూక్ష్మవతనవాసియైన శంకరుడు ఎక్కడ.
ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి అంటారు,
వేద శాస్త్రాలు మొదలైనవాటిని ఎవరెన్ని చదివినా,
జప-తపాదులు చేసినా నన్ను ఎవరూ కలుసుకోలేరు. నేను భావనకు తగ్గ ఫలాన్ని అందరికీ ఇచ్చినా కానీ, వారు అఖండ జ్యోతి తత్వమైన బ్రహ్మమునే పరమాత్మగా భావిస్తారు. బ్రహ్మ తత్వము యొక్క సాక్షాత్కారము కలిగినా దాని వల్ల ఏమీ లభించదు.
కొందరికి హనుమంతునిది, కొందరికి గణేశునిది సాక్షాత్కారం చేయిస్తాను,
అలా నేను అల్పకాలికముగా మనోకామనను పూర్తి చేస్తాను. అల్పకాలం కొరకు సంతోషమైతే ఉంటుంది. కానీ మళ్ళీ అందరూ తమోప్రధానులుగా అవ్వాల్సిందే. రోజంతా గంగలో మునిగి కూర్చున్నా కానీ అందరూ తమోప్రధానముగా అవ్వాల్సిందే.
తండ్రి అంటారు, పిల్లలూ
- పవిత్రముగా అయినట్లయితే పవిత్ర ప్రపంచములో 21 జన్మల కొరకు యజమానులుగా అవుతారు.
ఇంతటి ప్రాప్తి ఉన్న సత్సంగము ఇంకేదీ లేదు.
తండ్రే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు, కావున ఎంతగా శ్రీమతముపై నడవాలి.
చదువుపై ధ్యానము ఉంచాలి.
తండ్రి శ్రేష్ఠాతి-శ్రేష్ఠమైన మతాన్ని ఇస్తారు. శ్రీమతము ద్వారా భారత్ ను స్వర్గముగా తయారుచేయాలి.
మీరు డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి మరియు పురుషార్థం చేయాలి. పురుషార్థము చేసి ఈ విధంగా యోగ్యులుగా అవ్వాలి.
మేము తండ్రితో పాటు స్వర్గ స్థాపన చేయడానికి వచ్చామని పిల్లలైన మీకు నషా ఉండాలి. మనం అక్కడి నివాసులము. ఈ శరీరములో మనం నిమిత్తమాత్రముగా, కొద్ది సమయం కొరకే ఉంటాము. బాబా కూడా కొద్ది సమయం కొరకే వచ్చారు, ఈ శరీర భానము తొలగిపోవాలి. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి,
దీనినే క్షణములో జీవన్ముక్తి అని అంటారు.
తండ్రి అంటారు, నేను అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఉదయమే లేచి బాబాను స్మృతి చేయండి.
వారితో మాట్లాడండి. మన
84 జన్మలు పూర్తయ్యాయని, ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానముగా అయ్యామని, మళ్ళీ దైవీ సంతానముగా,
ఆ తర్వాత క్షత్రియ సంతానముగా అవుతామని మీకు తెలుసు.
బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తారు. కూర్చొని తండ్రి మహిమను చేయండి.
బాబా, మీరైతే అద్భుతం చేసారు. కల్ప-కల్పమూ వచ్చి మమ్మల్ని చదివిస్తారు. బాబా,
మీ జ్ఞానం చాలా అద్భుతమైనది.
స్వర్గము ఎంత అద్భుతమైనది. అవన్నీ భౌతికమైన అద్భుతాలు, ఇది ఆత్మిక తండ్రి ద్వారా స్థాపించబడిన అద్భుతము. శ్రీకృష్ణపురిని స్థాపన చేయడానికి తండ్రి వచ్చారు. ఈ లక్ష్మీ-నారాయణులు ఈ ప్రారబ్ధాన్ని ఎక్కడి నుండి పొందారు? తండ్రి ద్వారా.
జగదాంబ మరియు జగత్ పితలతో పాటు పిల్లలు కూడా ఉంటారు, వారు బ్రాహ్మణులు. జగదాంబ బ్రాహ్మణి.
వారు కామధేనువు.
సర్వుల మనోకామనలను పూర్తి చేస్తారు. ఈ జగదాంబయే తిరిగి స్వర్గ మహారాణిగా అవుతారు. ఇది ఎంత అద్భుతమైన రహస్యము. ఈ తండ్రి అవస్థను తయారుచేసుకునేందుకు రకరకాల యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. రాత్రివేళ మేల్కొనండి.
తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. ఒకవేళ పూర్తి పురుషార్థం చేసినట్లయితే స్మృతి నిలుస్తుంది. పాస్ విత్ హానర్ గా అవ్వాలి.
8 మందికే స్కాలర్షిప్ లభిస్తుంది.
మేము లక్ష్మీ-నారాయణులను వరించాలి అని అందరూ అంటారు, మరి పాస్ అయ్యి చూపించాలి. నాలో కోతి వంటి చంచలత్వము ఏదీ లేదు కదా అని స్వయాన్ని చూసుకోవాలి.
ఏమైనా ఉంటే దానిని తొలగించుకుంటూ వెళ్ళండి.
మొత్తం రోజంతటిలో ఎవ్వరికీ దుఃఖము ఇవ్వలేదు కదా అని చూసుకోండి.
తండ్రి అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. పిల్లలు కూడా ఆ విధముగా తయారవ్వాలి. వాచా, కర్మణా ద్వారా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. సత్యాతి-సత్యమైన మార్గాన్ని చూపించాలి.
అది హద్దులోని తండ్రి వారసత్వము. ఇది అనంతమైన తండ్రి వారసత్వము,
ఇది ఎవరికైతే లభిస్తుందో వారే తెలియజేయగలరు. ఎవరైతే మన ధర్మానికి చెందినవారు ఉంటారో,
వారికి వెంటనే ఇది టచ్ అవుతుంది.
తండ్రి అంటారు, మళ్ళీ దైవీ ధర్మాన్ని స్థాపన చేయడానికి నేను బ్రహ్మా తనువులోకి వస్తాను.
ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నామని, తర్వాత దేవతలుగా అవ్వాలని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మొదట సూక్ష్మవతనములోకి వెళ్ళి, ఆ తర్వాత శాంతిధామంలోకి వెళ్తాము.
అక్కడి నుండి మళ్ళీ కొత్త ప్రపంచములో గర్భ మహలులోకి వస్తాము. ఇక్కడ గర్భ జైలులోకి వస్తారు. దీనిని అసత్యమైన మాయ, అసత్యమైన కాయము... అని అంటారు. తండ్రి అంటారు,
ఎంతగా ధర్మగ్లాని చేసారు,
శివజయంతిని జరుపుకుంటారు కానీ శివుడు ఎప్పుడు వచ్చారు,
ఎవరిలోకి ప్రవేశించారు, ఇది ఎవ్వరికీ తెలియదు. తప్పకుండా ఎవరి శరీరములోకో వచ్చి నరకాన్ని స్వర్గముగా తయారుచేసి ఉంటారు కదా.
తండ్రి పిల్లలకు చాలా బాగా అర్థం చేయిస్తారు మరియు సలహాను ఇస్తారు - రోజంతటిలో ఎంత సమయం తండ్రిని స్మృతి చేసాను అని మీ చార్టును తయారుచేయండి. ఉదయమే లేచి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మనం అనంతమైన తండ్రితోపాటు వచ్చాము,
గుప్త వేషములో భారత్ ను స్వర్గముగా తయారుచేయడానికి. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి. వెళ్ళే కన్నా ముందు మన రాజధానిని తప్పకుండా స్థాపన చేసుకోవాలి. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. మిగిలిన ప్రపంచమంతా కలియుగములో ఉంది. మీరు సంగమయుగీ బ్రాహ్మణులు.
తండ్రి పిల్లల కొరకు ముక్తి మరియు జీవన్ముక్తులనే కానుకను తీసుకువస్తారు. సత్యయుగములో భారత్ జీవన్ముక్తిలో ఉండేది, మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో ఉండేవారు.
తండ్రి అరచేతిలో వైకుంఠాన్ని తీసుకువస్తారు కావున తప్పకుండా దానికి యోగ్యంగా కూడా స్వయమే తయారుచేస్తారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
సదా ఇదే నషాలో ఉండాలి - మేము తండ్రితోపాటు స్వర్గ స్థాపనకు నిమిత్తులుగా ఉన్నాము, తండ్రి మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు అని.
2.
తండ్రి సమానముగా సుఖాన్ని ఇచ్చేవారిగా అవ్వాలి. ఎప్పుడూ ఎవరినీ దుఃఖితులుగా చేయకూడదు.
అందరికీ సత్యమైన మార్గాన్ని చూపించాలి. మీ ఉన్నతి కొరకు మీ చార్టు పెట్టుకోవాలి.
వరదానము:-
నిమిత్తము మరియు
నమ్రచిత్తము యొక్క
విశేషత ద్వారా
సేవలో ఫాస్ట్
మరియు ఫస్ట్
నంబరు తీసుకునేటువంటి
సఫలతా మూర్త్
భవ
సేవలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ నిమిత్తము మరియు నమ్రచిత్తము
యొక్క విశేషత స్మృతిలో ఉన్నట్లయితే సఫలతా స్వరూపులుగా అవుతారు. ఏ విధంగా సేవకు పరుగులు తీయడంలో తెలివైనవారో, అలా ఈ రెండు విశేషతలలో కూడా తెలివైనవారిగా అవ్వండి, దీని వలన సేవలో ఫాస్ట్ మరియు ఫస్ట్ గా అవుతారు. బ్రాహ్మణ జీవితం యొక్క మర్యాదల రేఖ లోపల ఉంటూ స్వయాన్ని ఆత్మిక సేవాధారిగా భావిస్తూ సేవ చేసినట్లయితే
సఫలతా మూర్తులుగా అవుతారు. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు.
స్లోగన్:-
ఎవరైతే బుద్ధి ద్వారా సదా జ్ఞాన రత్నాలను ధారణ చేస్తారో, వారే సత్యమైన హోలీ హంసలు.
0 Comments