28-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- ఒక్క మన్మనాభవ
మహామంత్రము ద్వారా
మీరు వివేకవంతులుగా అవుతారు, ఈ మంత్రమే అన్ని పాపాల
నుండి విముక్తులుగా చేసేటువంటిది’’
ప్రశ్న:-
మొత్తం జ్ఞానమంతటి సారమేమిటి, మన్మనాభవగా ఉండేవారి గుర్తులు ఏమిటి?
జవాబు:-
మొత్తం జ్ఞానమంతటి సారమేమిటంటే, ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇది ఛీ-ఛీ ప్రపంచము, దీనిని వదిలి మనం మన ఇంటికి వెళ్ళాలి. ఒకవేళ ఇది గుర్తున్నా కూడా మన్మనాభవగా ఉన్నట్లే. మన్మనాభవగా ఉండే పిల్లలు సదా జ్ఞానాన్ని విచార సాగర మథనం చేస్తూ ఉంటారు. వారు తండ్రితో మధురాతి-మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తారు.
ప్రశ్న:-
ఏ అలవాటుకు వశీభూతమై ఉన్న ఆత్మ తండ్రి స్మృతిలో ఉండలేదు?
జవాబు:-
ఒకవేళ అశుద్ధమైన చిత్రాలను చూసే అలవాటు, అశుద్ధమైన సమాచారాన్ని చదివే అలవాటు ఉన్నట్లయితే తండ్రి స్మృతి ఉండజాలదు. సినిమా నరకానికి ద్వారము, అది మనోవృత్తులను పాడు చేస్తుంది.
ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎవరిలోనైతే కాస్త తక్కువ తెలివి ఉంటుందో,
వారికే అర్థం చేయించవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా తెలివైనవారిగా అయ్యారు, వీరు మన అనంతమైన తండ్రి కూడా మరియు అనంతమైన శిక్షణ కూడా ఇస్తారని అర్థం చేసుకున్నారు. వారు సృష్టి ఆదిమధ్యాంత రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. విద్యార్థి బుద్ధిలో జ్ఞానముండాలి కదా మరియు తండ్రి తోడుగా కూడా తీసుకువెళ్తారు ఎందుకంటే ఇది పురాతనమైన ఛీ-ఛీ ప్రపంచమని తండ్రికి తెలుసు. ఈ పాత ప్రపంచం నుండి నేను పిల్లలను ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చాను.
తండ్రి అర్థం చేయించారు, ఇక్కడ కూర్చుని-కూర్చునే పిల్లలకు ఇది బుద్ధిలోకి తప్పకుండా వస్తూ ఉండవచ్చు - ఓహో! వీరు మన అనంతమైన తండ్రి కూడా మరియు శిక్షణ కూడా చాలా ఉన్నతమైనది ఇస్తారు. మొత్తం రచన యొక్క ఆదిమధ్యాంత రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఇదంతా స్మృతి చేయడం కూడా మన్మనాభవయే. ఇది కూడా మీ చార్టులో కలుపుకోవచ్చు. ఇది చాలా సహజము.
వేరే ఏమీ చేయకపోయినా లేస్తూ-కూర్చొంటూ,
నడుస్తూ-తిరుగుతూ బుద్ధిలో ఇది గుర్తుండాలి.
అద్భుతమైన వస్తువును స్మృతి చేయవలసి ఉంటుంది కదా.
బాబాను స్మృతి చేయడం ద్వారా, చదువును చదవడం ద్వారా మనం మళ్ళీ విశ్వాధిపతులుగా అవుతామని మీరు అర్థం చేసుకున్నారు. ఇది బుద్ధిలో నడుస్తూ ఉండాలి.
ఎక్కడ కూర్చున్నా కానీ,
బస్, రైల్ మొదలైనవాటిలో కూర్చున్నా కానీ బుద్ధిలో ఇది గుర్తుండాలి. మొట్టమొదటైతే పిల్లలకు తండ్రి కావాలి. ఆత్మలైన మనకు వారు అనంతమైన ఆత్మిక తండ్రి అని మీకు తెలుసు. సహజంగా స్మృతి కలిగేందుకు బాబా యుక్తిని తెలియజేస్తారు. నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే అర్ధ కల్పపు మీ వికర్మలేవైతే ఉన్నాయో, అవన్నీ యోగాగ్నితో భస్మమైపోతాయి. జన్మజన్మాంతరాలు ఎన్నో యజ్ఞ, జప, తపాదులు చేసారు.
ఇవన్నీ ఎందుకు చేస్తారు,
వీటి ద్వారా ఏం ప్రాప్తి కలుగుతుంది అనేది భక్తి మార్గంలోని వారికి తెలియదు. మందిరాలలోకి వెళ్తారు,
ఎంతో భక్తి చేస్తారు, ఇవన్నీ పరంపరగా నడుస్తూ వచ్చాయని భావిస్తారు.
ఇవి పరంపరగా నడుస్తూ వస్తున్నాయి అని శాస్త్రాలను గురించి కూడా అంటారు. కానీ స్వర్గంలో శాస్త్రాలే ఉండవని మనుష్యులకు తెలియనే తెలియదు.
వారు సృష్టి ఆరంభం నుండే ఇవన్నీ నడుస్తూ వస్తున్నాయని భావిస్తారు. అనంతమైన తండ్రి ఎవరు అనేది వారు తెలియజేయలేరు.
ఇక్కడ హద్దు తండ్రి లేక హద్దు టీచర్ లేరు. హద్దు టీచర్ నుండైతే మీరందరూ చదువుకున్నారు. అలా చదువుకునే ఉద్యోగము మొదలైనవి చేస్తారు, సంపాదన చేసుకుంటారు.
మన ఈ అనంతమైన తండ్రి ఎవరైతే ఉన్నారో వారికి తండ్రి ఎవరూ లేరని,
వీరు అనంతమైన టీచర్ కూడా అని పిల్లలైన మీకు తెలుసు. వీరికి టీచర్ ఎవరూ లేరు.
ఈ దేవతలను ఎవరు చదివించారు,
ఇదైతే తప్పకుండా గుర్తుకు రావాలి కదా! ఇది కూడా మన్మనాభవయే. వీరు చదువును ఎక్కడి నుండీ చదవలేదు. తండ్రి స్వయం జ్ఞాన సంపన్నులు. వారిని ఎవరైనా చదివించారా? వారు మనుష్య సృష్టికి బీజరూపుడు మరియు చైతన్యుడు, వారు జ్ఞాన సాగరుడు. వారు చైతన్యమైనవారు కావున మనుష్య సృష్టి రూపీ వృక్షం యొక్క రహస్యాన్ని ఆది నుండి అంతిమం వరకు వినిపిస్తారు. అంతిమంలో వచ్చి ఆది యొక్క జ్ఞానాన్ని వినిపిస్తారు మరియు ఇలా అంటారు
- హే పిల్లలూ,
ఏ తనువులోనైతే నేను విరాజమానమై ఉన్నానో వీరి ద్వారా నేను ఆది నుండి మొదలుకుని ఈ సమయం వరకు మొత్తమంతా వినిపిస్తాను. అంతిమం గురించైతే తర్వాత అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఇది అంతిమం అని మీరు ముందు-ముందు అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఆ సమయంలో మీరు కర్మాతీత స్థితికి చేరుకుంటారు మరియు ఈ పాత ఛీ-ఛీ ప్రపంచం వినాశనమవ్వాల్సిందే అన్న గుర్తులను కూడా చూస్తూ ఉంటారు. ఇదేమీ కొత్త విషయము కాదు.
అనేక సార్లు చూసారు మరియు చూస్తూనే ఉంటారు. కల్ప పూర్వము రాజ్యం తీసుకున్నారు,
మళ్ళీ పోగొట్టుకున్నారు, ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు. బాబా మనల్ని చదివిస్తారు. మనమే విశ్వాధిపతులుగా ఉండేవారమని, మళ్ళీ
84 జన్మలు తీసుకున్నామని, మళ్ళీ తండ్రి విశ్వాధిపతులుగా తయారుచేయడానికి అదే జ్ఞానాన్ని ఇస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు. బాబా శిక్షకుడు కూడా అని మీరు లోలోపల అర్థం చేసుకున్నారు. అచ్ఛా, ఒకవేళ తండ్రి గుర్తుకు రాకపోతే టీచర్ ను గుర్తు చేయండి.
టీచర్ ను ఎప్పుడైనా మర్చిపోతారా? టీచర్ నుండైతే చదువుకుంటూ ఉంటారు.
మాయ పొరపాట్లు చేయిస్తుంది, అది మీకు తెలియదు. మాయ కళ్ళలో ఒక్కసారిగా దుమ్ము వేసేస్తుంది. దాని వల్ల భగవంతుడు మనల్ని చదివిస్తారు అన్నది పూర్తిగా మర్చిపోతారు. తండ్రి ప్రతి విషయము యొక్క వివరణ ఇస్తారు. ఇది అనంతమైన వివరణ. అది హద్దులోనిది. ఈ అనంతమైన జ్ఞానాన్ని బాబా కల్ప-కల్పము పిల్లలైన మీకు ఇస్తారు. అచ్ఛా, ఎక్కువగా చదవలేకపోతే వారిని తండ్రి రూపంలో స్మృతి చేయండి. వారికి తండ్రి ఎవ్వరూ లేరు, వారు అందరికీ తండ్రి.
కానీ అందరూ వారి పిల్లలే.
శివబాబా ఎవరి సంతానమో ఎవరైనా చెప్పగలరా?
వారు అనంతమైన తండ్రి. మేము అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యాము అని పిల్లలు అర్థం చేసుకుంటారు. మన ఈ చదువు కూడా అద్భుతమైనది మరియు బ్రాహ్మణులైన మనమే చదువుకుంటాము. దేవతలు లేక క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఈ చదువును చదవలేరు. తండ్రి ఇచ్చే ఈ జ్ఞానమే పూర్తిగా అతీతమైనది. మీరు తప్ప ఇంకెవ్వరూ దీనిని అర్థం చేసుకోలేరు. మేము తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవుతామని మీకు సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. ఇప్పుడు ఉన్నత పదవిని పొందేందుకు బాగా పురుషార్థం చేయాలి. స్వర్గంలోకైతే అందరూ వెళ్తారు అని కాదు. ఒకవేళ జ్ఞానం మరియు యోగము యొక్క ధారణ లేకపోతే ఉన్నత పదవి లభించదు.
బాబా అంటారు, 16 కళల సంపూర్ణులుగా అవ్వడంలో స్మృతి యొక్క శ్రమ ఎంతో ఉంది. నేను ఎవ్వరికీ దుఃఖాన్ని అయితే ఇవ్వడం లేదు కదా అని చూసుకోవాలి. మనం సుఖదాత పిల్లలము. అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. మనసా,
వాచా, కర్మణా ఎవ్వరికీ దుఃఖము ఇవ్వకూడదు.
ఈ సమయంలో మీరు ఏదైతే చదువుతారో, దీని ద్వారా పుష్పాలుగా అవుతారు.
ఈ సంపాదనే మీతో పాటు వస్తుంది, ఇందులో ఎటువంటి పుస్తకాలు మొదలైనవి చదవాల్సిన అవసరమే లేదు. ఆ చదువులో ఎన్ని పుస్తకాలు మొదలైనవి చదవాల్సి ఉంటుంది. తండ్రి ఇచ్చే ఈ జ్ఞానం అన్నింటికన్నా అతీతమైనది మరియు చాలా సహజమైనది కూడా. కానీ ఇదంతా గుప్తము. మీరు ఏం చదువుతున్నారు అనేది మీరు తప్ప ఇంకెవరూ అర్థం చేసుకోలేరు. ఇది అద్భుతమైన చదువు. తండ్రి అంటారు, ఇందులో ఎప్పుడూ ఆబ్సెంట్ అవ్వద్దు.
చదువును ఎప్పుడూ వదలకండి.
తండ్రి వద్దకు అందరి రిజిస్టరూ వస్తుంది. దాని ద్వారానే ఫలానావారు 10 మాసాలు ఆబ్సెంట్ అయ్యారని, ఫలానావారు
6 మాసాలు ఆబ్సెంట్ అయ్యారని బాబా అర్థం చేసుకుంటారు. కొందరైతే నడుస్తూ-నడుస్తూ చదువును కూడా వదిలేస్తారు. ఈ చదువు చాలా అద్భుతమైనది. ఇటువంటి అద్భుతమైనది ఇంకేదీ ఉండనే ఉండదు. కల్ప-కల్పమూ పిల్లలైన మిమ్మల్ని ఇటువంటి తండ్రి వచ్చి కలుస్తారు. ఈ సాకార బాబా పునర్జన్మలలోకి వస్తారని, వీరు
84 జన్మల చక్రంలో తిరుగుతారని,
అలాగే మీరూ తిరుగుతారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు.
ఇది ఆట కదా. ఆటను ఎప్పుడూ మర్చిపోరు. ఆట ఎల్లప్పుడూ గుర్తుంటుంది.
బాబా అర్థం చేయిస్తారు, ఒకటేమో, ఈ ప్రపంచము నరకము మరియు అందులోనూ విశేషంగా ఈ సినిమాలు నరకతుల్యమైనవి. అక్కడకు వెళ్ళడం వలన మనోవృత్తులు బాగా పాడైపోతాయి.
వార్తాపత్రికలలో కూడా ఏవైనా సుందరమైన చిత్రాలను చూస్తే వాటిలోకి కూడా బుద్ధి వెళ్తుంది - ఫలానావారు అందంగా ఉన్నారు, ఆమెకు ప్రైజ్ లభించాలి అని ఆలోచన నడుస్తుంది. అసలు అటువంటివి ఎందుకు చూడాలి!
ఈ ప్రపంచమంతా అంతమవ్వనున్నది అని బుద్ధి ద్వారా అర్థం చేసుకున్నారు. మీరు కేవలం నన్నే స్మృతి చేయండి. ఇటువంటి వాటిని చూడకండి, వాటి గురించి ఆలోచించకండి. ఇవి పాత ప్రపంచపు ఛీ-ఛీ అశుద్ధమైన శరీరాలు, వీటి వైపు చూడడానికి ఏముంది. ఒక్క తండ్రినే చూడాలి. బాబా అంటారు, మధురాతి-మధురమైన పిల్లలూ, లక్ష్యము చాలా ఉన్నతమైనది. మాయ తక్కువైనదేమీ కాదు. మాయ ఆర్భాటము ఎంతగా ఉందో చూడండి.
అటు వైపు సైన్సు ఉంది మరియు ఇక్కడ మీ సైలెన్స్ ఉంది.
వారు ముక్తిని పొందాలని కోరుకుంటారు. ఇక్కడ మీ లక్ష్యము-ఉద్దేశ్యము జీవన్ముక్తిని పొందడము.
జీవన్ముక్తిని పొందే దారిని ఎవరూ తెలియజేయలేరు. సన్యాసులు మొదలైనవారెవరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు.
వారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి అని ఎవరికీ అర్థం చేయించలేరు. దీనిని ఒక్క తండ్రే అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో సమయం వృథా అవుతూనే వచ్చింది.
ఎన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. పొరపాట్లు చేస్తూ-చేస్తూ అమాయకులుగా అయిపోయారు.
ఈ చివరి జన్మ 100 శాతమూ పొరపాట్లతో కూడుకున్నదే. కొద్దిగా కూడా బుద్ధి పని చేయదు.
ఇప్పుడు బాబా మీకు అర్థం చేయిస్తారు కాబట్టే మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు అంతా అర్థం చేసుకున్నారు కావున ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. సంతోషపు పాదరసం కూడా మీకే పైకెక్కుతుంది. ఇది అద్భుతం కదా - ఈ తండ్రికి తమ తండ్రి ఎవరూ లేరు, శిక్షకులు ఎవరూ లేరు. మరి ఎక్కడి నుండి నేర్చుకున్నారు! మనుష్యులు ఆశ్చర్యపోతారు. వీరికి తప్పకుండా ఎవరో గురువు ఉండి ఉంటారని చాలామంది భావిస్తారు.
ఒకవేళ వీరు కూడా గురువు నుండే నేర్చుకొని ఉంటే మరి ఆ గురువుకు వేరే శిష్యులు కూడా ఉండాలి. కేవలం ఈ ఒక్క శిష్యుడే ఏమైనా ఉంటారా. గురువులకైతే ఎంతోమంది శిష్యులు ఉంటారు. ఆగాఖాన్ కు చూడండి,
ఎంతమంది శిష్యులు ఉన్నారు.
వారికి తమ గురువు పట్ల ఎంత గౌరవము ఉంటుందో చూడండి. వారిని వజ్రాలతో తూకం వేస్తారు.
మీరు దేనితో తూకం వేస్తారు?
వీరు అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు. వీరి బరువు ఎంత ఉంటుంది? మీరేమి చేస్తారు!
బరువు తూకం వేస్తే ఎంత ఉంటారు? ఏ వస్తువుతోనైనా తూకం వేయగలరా? శివబాబా అయితే బిందువు కదా. ఈ రోజుల్లో అలా ఎంతగానో తూకం వేస్తూ ఉంటారు. కొందరు బంగారంతో, కొందరు వెండితో,
కొందరు ప్లాటినంతో కూడా తూకం వేస్తారు.
అది బంగారం కన్నా ఖరీదైనది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, ఆ దైహికమైన గురువులు మీకు సద్గతిని ఇవ్వరు. సద్గతిలోకి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమే, వారిని దేనితో తూకం వేస్తారు? మనుష్యులైతే కేవలం భగవాన్, భగవాన్ అనే అంటూ ఉంటారు.
కానీ వారు తండ్రి, టీచర్ కూడా అని వారికి తెలియదు. వారు ఎంత సాధారణంగా కూర్చొన్నారు. పిల్లల ముఖాలను చూసేందుకే కాస్త పైన కూర్చుంటారు. సహాయకులైన పిల్లలు లేకుండా నేను స్థాపనను ఎలా చేయగలను. ఎవరైతే ఎక్కువ సహాయం చేస్తారో వారిని తప్పకుండా తండ్రి ప్రేమిస్తారు.
లౌకికంలో కూడా ఒక కొడుకు 2000 సంపాదిస్తారు, ఇంకొకరు
1000 సంపాదిస్తూ ఉండవచ్చు. మరి ఆ తండ్రికి ఎవరిపై ప్రేమ ఉంటుంది? కానీ ఈ రోజుల్లోనైతే అసలు పిల్లలు తండ్రిని ఎక్కడ అడుగుతారు? అనంతమైన తండ్రి కూడా చూస్తారు,
ఫలానా-ఫలానా పిల్లలు చాలా మంచి సహాయకులు అని.
పిల్లలను చూస్తూ-చూస్తూ తండ్రి హర్షిస్తారు. ఆత్మ సంతోషిస్తుంది. కల్ప-కల్పము నేను వస్తాను మరియు పిల్లలను చూసి చాలా సంతోషిస్తాను. వీరు కల్ప-కల్పము నా సహాయకులుగా అవుతారని నాకు తెలుసు. తండ్రి యొక్క ఈ ప్రేమ కల్ప-కల్పానికి చెందినదిగా అవుతుంది. ఎక్కడ కూర్చున్నా కానీ బుద్ధిలో ఇలా ఆలోచించండి - బాబా మన తండ్రి కూడా,
టీచర్ కూడా, గురువు కూడా. వారు స్వయమే మనకు సర్వస్వము. అందుకే అందరూ వారినే స్మృతి చేస్తారు.
సత్యయుగంలో ఎవరూ స్మృతి చేయరు ఎందుకంటే 21 జన్మల కొరకు తండ్రి నావను తీరానికి చేరుస్తారు. ఈ విధంగా స్మరిస్తూ పిల్లలు హర్షితంగా ఉండాలి. మేము ఇటువంటి తండ్రి సేవను చేయాలి అని సంతోషం కలగాలి. తండ్రి పరిచయాన్ని అందరికీ ఇవ్వండి.
వీరు అందరికీ తండ్రి. తండ్రే స్వర్గ స్థాపన చేస్తారు. తండ్రే మనందరినీ తోడుగా కూడా తీసుకువెళ్తారు. ఈ విధంగా అర్థం చేయించడం ద్వారా వారు సర్వవ్యాపి అని అనలేరు. వినాశకాలంలో విపరీత బుద్ధి కలవారు వినాశనమవుతారని తండ్రి చెప్పారు. వారంతా అంతమైపోతారు, ఇకపోతే మీరు విజయం పొందుతారు. మీరు రాజధానిని స్థాపన చేస్తున్నారు.
ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. కావున ఇలాంటి-ఇలాంటి అద్భుతమైన విషయాలను అందరికీ వినిపించాలి.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
మనము సుఖదాత పిల్లలము, మనమందరికీ సుఖాన్ని ఇవ్వాలి. మనసా, వాచా, కర్మణా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు.
2.
చదువు మరియు చదివించేవారు - ఇరువురూ అద్భుతమైనవారే. ఇటువంటి అద్భుతమైన చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు. ఆబ్సెంట్ అవ్వకూడదు.
వరదానము:-
సదా ప్రతి
రోజు స్వయం
ఉత్సాహంలో ఉండే
మరియు సర్వులకూ
ఉత్సాహాన్ని అందించే
ఆత్మిక సేవాధారీ
భవ
బాప్ దాదా ఆత్మిక సేవాధారి పిల్లలందరికీ
ఏ బహుమతిని ఇస్తారంటే ‘‘పిల్లలూ, ప్రతి రోజు స్వయం ఉత్సాహంలో ఉండండి మరియు సర్వులకు ఉత్సాహాన్ని అందించే ఉత్సవాన్ని జరుపుకోండి.’’ దీని ద్వారా సంస్కారాన్ని కలుపుకునేందుకు, సంస్కారాన్ని
తొలగించుకునేందుకు ఏ శ్రమ అయితే చేయాల్సి ఉంటుందో అది దూరమైపోతుంది.
ఈ ఉత్సవాన్ని సదా జరుపుకుంటే అన్ని సమస్యలు సమాప్తమైపోతాయి. అప్పుడిక సమయం కూడా ఇవ్వాల్సిన పని ఉండదు, శక్తులు కూడా ఉపయోగించాల్సిన అవసరముండదు. సంతోషంగా నాట్యము చేసే, ఎగిరే ఫరిశ్తాలుగా అవుతారు.
స్లోగన్:-
డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకుని నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అనే పాఠాన్ని పక్కాగా చేసుకునేవారే చింతలేని చక్రవర్తులు.
0 Comments