06-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- క్రోధము ఎంతో
దుఃఖాన్ని ఇస్తుంది,
అది స్వయాన్ని
కూడా దుఃఖపరుస్తుంది, అలాగే ఇతరులను
కూడా దుఃఖపరుస్తుంది, అందుకే శ్రీమతం
ఆధారంగా ఈ భూతాలపై విజయం పొందండి’’
ప్రశ్న:-
ఏ పిల్లలపై కల్ప-కల్పము యొక్క మచ్చ పడుతుంది? వారి గతి ఏమవుతుంది?
జవాబు:-
ఎవరైతే తమను తాము చాలా తెలివైనవారిగా
భావిస్తారో, శ్రీమతంపై పూర్తిగా నడవరో, ఎవరైతే లోపల గుప్త రూపంలో లేక ప్రత్యక్ష రూపంలో ఉన్న ఏదైనా వికారాన్ని తొలగించుకోరో, ఎవరినైతే మాయ చుట్టుముడుతూ ఉంటుందో, అటువంటి పిల్లలపై కల్ప-కల్పపు మచ్చ పడుతుంది. వారు ఇక అంతిమంలో ఎంతగానో పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. వారు తమను తాము నష్టపర్చుకుంటారు.
పాట:- ఈనాడు మానవుడు అంధకారంలో ఉన్నాడు... (ఆజ్ అంధేరే మే హై ఇంసాన్...)
ఓం శాంతి. అనంతమైన తండ్రి,
ఎవరినైతే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారో వారు సర్వులకూ తండ్రి అని పిల్లలకు తెలుసు.
వారు పిల్లలకు సమ్ముఖంగా కూర్చుని అర్థం చేయిస్తారు.
తండ్రి అయితే పిల్లలందరినీ ఈ నయనాల ద్వారా చూస్తారు.
వారికి పిల్లలను చూసేందుకు దివ్యదృష్టి అవసరం లేదు. పరంధామం నుండి పిల్లల వద్దకు వచ్చాను
- అని తండ్రికి తెలుసు.
ఈ పిల్లలు కూడా ఇక్కడ దేహధారులుగా అయి పాత్రను అభినయిస్తున్నారు,
ఈ పిల్లలకు సమ్ముఖంగా కూర్చుని చదివిస్తాను.
స్వర్గ స్థాపన చేసే అనంతమైన తండ్రి మళ్ళీ మనల్ని భక్తి మార్గపు ఇబ్బందుల నుండి విడిపించి మన జ్యోతిని వెలిగిస్తున్నారని పిల్లలకు కూడా తెలుసు.
ఇప్పుడు మేము ఈశ్వరీయ కులానికి లేక బ్రాహ్మణ కులానికి చెందినవారమని అన్ని సెంటర్లలో ఉండే పిల్లలు అర్థం చేసుకుంటారు.
పరమపిత పరమాత్మను సృష్టికి రచయిత అని అంటారు.
సృష్టి ఏ విధంగా రచింపబడుతుంది,
అది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు.
మాతా-పితలు లేకుండా ఎప్పుడూ మనుష్య సృష్టి రచింపబడదని పిల్లలకు తెలుసు.
కేవలం తండ్రి ద్వారానే సృష్టి రచింపబడుతుంది అని కూడా అనరు, అలా కాదు. గాయనమే నీవే తల్లివి-తండ్రివి...
అని అంటూ చేయబడుతుంది.
ఈ మాతా-పితలు సృష్టిని రచించి,
తర్వాత వారిని యోగ్యులుగా తయారుచేస్తారు.
ఇది చాలా గొప్ప విశేషత.
పై నుండి దేవతలు వచ్చి ధర్మ స్థాపన చేస్తారనేమీ కాదు. ఏ విధంగానైతే క్రైస్ట్ క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేస్తారు కావున క్రైస్ట్ ను కూడా క్రిస్టియన్లు ఫాదర్ అని అంటారు,
ఒకవేళ ఫాదర్ ఉంటే మదర్ కూడా తప్పకుండా కావాలి.
వారు ‘‘మేరీ’’ని మదర్ గా ఉంచారు.
మరి మేరీ ఎవరు? క్రైస్ట్ అనే కొత్త ఆత్మ వచ్చి తనువులో ప్రవేశించారు,
అప్పుడు ఎవరిలోనైతే ప్రవేశించారో అతని ముఖము ద్వారా ప్రజలను రచించారు.
వారు క్రిస్టియన్లు అయ్యారు.
ఇది కూడా అర్థం చేయించడం జరుగుతుంది
- కొత్త ఆత్మ ఏదైతే పై నుండి వస్తుందో ఆ ఆత్మకు దుఃఖం అనుభవించవలసి వచ్చే కర్మలేవీ లేవు. పవిత్ర ఆత్మ వస్తుంది.
ఏ విధంగానైతే పరమపిత పరమాత్మ ఎప్పుడూ దుఃఖం అనుభవించరు.
దుఃఖము లేక నిందలు మొదలైనవన్నీ ఈ సాకారునికే ఇస్తారు.
అలాగే క్రైస్ట్ ను కూడా శిలువపైకి ఎక్కించినప్పుడు,
తప్పకుండా ఏ తనువులోకైతే క్రైస్ట్ ఆత్మ ప్రవేశించిందో అతనే ఈ దుఃఖాన్ని సహించారు.
క్రైస్ట్ అనే పవిత్ర ఆత్మ దుఃఖం సహించరు.
కావున క్రైస్ట్ తండ్రి అయినట్లు.
మరి తల్లిని ఎక్కడి నుండి తేవాలి!
అప్పుడిక మేరీని తల్లిగా చూపించారు.
మేరీ కుమారి అని, ఆమె నుండి క్రైస్ట్ జన్మించారని చూపిస్తారు.
వీటన్నింటినీ శాస్త్రాల నుండి తీసుకున్నారు.
కుంతి కన్యగా ఉన్నప్పుడు ఆమె నుండి కర్ణుడు జన్మించినట్లుగా చూపిస్తారు కదా. ఇప్పుడు ఇది దివ్యదృష్టి విషయము.
కానీ వారు దానిని కాపీ చేసారు.
ఏ విధంగానైతే ఈ బ్రహ్మా తల్లి అవుతారు,
ముఖము ద్వారా పిల్లలకు జన్మనిచ్చి ఆ తర్వాత సంభాళించేందుకు మమ్మాకు ఇచ్చారు,
అదే విధంగా క్రైస్ట్ విషయంలో కూడా జరుగుతుంది.
క్రైస్ట్ ప్రవేశించి ధర్మ స్థాపన చేసారు.
వారిని క్రైస్ట్ ముఖ వంశావళి,
సోదరీ-సోదరులు అని అంటారు.
క్రిస్టియన్ల ప్రజాపిత క్రైస్ట్.
ఎవరిలోకైతే ప్రవేశించి పిల్లలకు జన్మనిచ్చారో,
వారు తల్లి అవుతారు.
ఆ తర్వాత సంభాళించేందుకు వారిని మేరీకి ఇచ్చారు,
కానీ వాళ్ళు మేరీని తల్లిగా భావించారు.
ఇక్కడైతే తండ్రి అంటారు,
నేను వీరిలోకి ప్రవేశించి ముఖ సంతానాన్ని రచిస్తాను.
కావున అందులో ఈ మమ్మా కూడా ముఖ సంతానమే.
ఇవి విస్తారముగా అర్థం చేసుకోవలసిన విషయాలు.
రెండవ విషయము
- తండ్రి అర్థం చేయిస్తారు,
ఈ రోజు ఒక పార్టీ ఆబూకు రాబోతోంది
- శాకాహారం గురించి ప్రచారం చేయడానికి.
వారికి ఏమి అర్థం చేయించాలంటే
- అనంతమైన తండ్రి ఇప్పుడు దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు,
వారు పక్కా శాకాహారులుగా ఉండేవారు.
ఇంకే ధర్మమూ ఇంతటి శాకాహారులుగా ఉండరు.
ఇప్పుడు వాళ్ళు వైష్ణవులుగా అవ్వడంలో ఎంత లాభముందో వినిపిస్తారు.
కానీ,
అందరూ అయితే అలా అవ్వలేరు ఎందుకంటే చాలా అలవాటైపోయింది.
వదలడం చాలా కష్టము.
కానీ దీని గురించి ఇలా అర్థం చేయించాలి
- అనంతమైన తండ్రి ఏ స్వర్గాన్ని అయితే స్థాపన చేసారో,
అందులో అందరూ వైష్ణవులుగా అనగా విష్ణువంశావళిగా ఉండేవారు.
దేవతలు పూర్తిగా నిర్వికారులుగా ఉండేవారు.
ఈ రోజుల్లోని శాకాహారులు వికారులుగా ఉన్నారు.
క్రైస్ట్ కు 3000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది.
కావున ఈ ఈ విధంగా అర్థం చేయించాలి.
పిల్లలైన మీకు తప్ప ఇంకే మానవమాత్రులకు స్వర్గము అంటే ఏమిటో,
అది ఎప్పుడు స్థాపన అయ్యిందో,
అక్కడ ఎవరు రాజ్యం చేస్తారో తెలియదు.
లక్ష్మీ-నారాయణుల మందిరములోకి వెళ్తూ ఉంటారు.
బాబా కూడా వెళ్ళేవారు,
కానీ స్వర్గంలో వీరి రాజధాని ఉంటుందని వారికి తెలియదు.
కేవలం మహిమను గానం చేస్తారు,
కానీ వారికి ఎవరు రాజ్యము ఇచ్చారు,
ఇదేమీ తెలియదు.
ఇప్పటికీ ఎన్నో మందిరాలను నిర్మిస్తూ ఉంటారు ఎందుకంటే లక్ష్మి ధనాన్ని ఇచ్చారు అని భావిస్తారు,
అందుకే దీపావళి నాడు వ్యాపారులు లక్ష్మిని పూజిస్తారు.
ఈ మందిరాలను నిర్మించేవారికి కూడా అర్థం చేయించాలి.
విదేశీయులు వచ్చినప్పుడు వారికి భారత్ మహిమను ఏమని వినిపించాలంటే
- క్రైస్ట్ కు 3000 సంవత్సరాల పూర్వము భారత్ ఈ విధంగా శాకాహారిగా ఉండేది,
అలా ఇంకెవ్వరూ ఉండలేరు.
వారిలో ఎంతో శక్తి ఉండేది,
దానిని దేవీ-దేవతల రాజ్యం అని పిలిచేవారు.
ఇప్పుడు అదే రాజ్యం మళ్ళీ స్థాపించబడుతుంది.
ఇది అదే సమయము.
శంకరుని ద్వారా వినాశనము అని కూడా గానం చేయబడింది,
ఆ తర్వాత విష్ణు రాజ్యం ఉంటుంది.
తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలంటే వచ్చి తీసుకోవచ్చు.
రమేష్,
ఉష ఇరువురికీ సేవ అభిరుచి ఎంతగానో ఉంది. వీరిది అద్భుతమైన జోడి, వీరు ఎంతో సేవాధారులుగా ఉన్నారు.
చూడండి,
కొత్త-కొత్తవారు వచ్చినప్పుడు,
వారు పాతవారికన్నా చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు.
బాబా ఎన్నో యుక్తులను తెలియజేస్తారు,
కానీ,
ఏదో ఒక వికారం యొక్క నషా ఉంటే, మాయ సంతోషంగా ఉప్పొంగుతూ ఉండనివ్వదు.
కొందరిలో కామము యొక్క అంశము కొద్దిగా ఉంది, క్రోధము అయితే అనేకులలో ఉంది. పరిపూర్ణులుగా ఎవ్వరూ అవ్వలేదు.
అవుతూ ఉన్నారు.
మాయ కూడా లోపల కరుస్తూ ఉంటుంది.
ఎప్పటి నుండైతే రావణ రాజ్యం ప్రారంభమైందో అప్పటి నుండి ఈ ఎలుకలు కొరకడం మొదలుపెట్టాయి.
ఇప్పుడైతే భారత్ పూర్తిగా నిరుపేదగా అయిపోయింది.
మాయ అందరినీ రాతిబుద్ధి కలవారిగా చేసేసింది.
మంచి-మంచి పిల్లలను కూడా మాయ ఎలా చుట్టుముట్టుతుంది అంటే, తమ అడుగులు ఎలా వెనుకకు వెళ్తున్నాయో కూడా వారికి తెలియదు.
అప్పుడు సంజీవనీ మూలికను వాసన చూపించి స్పృహలోకి తీసుకువస్తారు.
క్రోధము కూడా దుఃఖము ఇస్తుంది.
వారు స్వయాన్నీ దుఃఖితులుగా చేసుకుంటారు,
ఇతరులను కూడా దుఃఖితులుగా చేస్తారు.
కొందరిలో గుప్తముగా ఉంది, కొందరిలో ప్రత్యక్షంగా ఉంది. ఎంత అర్థం చేయించినా అర్థం చేసుకోరు.
ఇప్పుడు తమను తాము చాలా తెలివైనవారిగా భావిస్తారు.
తర్వాత ఎంతో పశ్చాత్తాపపడవలసి ఉంటుంది.
కల్ప-కల్పము యొక్క మచ్చ పడుతుంది.
శ్రీమతంపై నడుస్తే లాభం కూడా ఎంతో ఉంటుంది.
లేకపోతే నష్టం కూడా ఎంతో ఉంటుంది.
ఇరువురి మతము చాలా ప్రసిద్ధమైనది.
శ్రీమతము మరియు బ్రహ్మా మతము. బ్రహ్మా దిగి వచ్చినా కూడా ఇతను మారడు...
అని అంటారు.
శ్రీకృష్ణుడి పేరు అలా తీసుకోరు.
ఇప్పుడైతే స్వయంగా పరమపిత పరమాత్మయే మతాన్ని ఇస్తారు.
బ్రహ్మాకు కూడా వారి నుండే మతము లభిస్తుంది.
తండ్రికి పిల్లలపై ఎంతో ప్రేమ ఉంటుంది.
పిల్లలను భుజాలపై కూర్చోబెట్టుకుంటారు.
కొడుకు ఉన్నతంగా వెళ్తే కులము పేరు ప్రసిద్ధమవుతుందని తండ్రికి లక్ష్యం ఉంటుంది.
కానీ ఒకవేళ కొడుకు తండ్రి మాటను వినకపోతే,
తాతగారిదీ వినకపోతే,
ఇక పెద్ద తల్లిది కూడా విననట్లు.
అతని పరిస్థితి ఏమవుతుంది!
ఇక అడగకండి.
ఇకపోతే,
సర్వీసబుల్ పిల్లలైతే బాప్ దాదా హృదయం పైకి ఎక్కుతారు.
కావున వారిని బాబా స్వయంగా మహిమ చేస్తారు.
అయితే వారికి అర్థం చేయించాలి,
ఇదే భారత్ లో విష్ణు వంశం యొక్క రాజ్యము ఉండేది,
అది మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. ఇప్పుడు బాబా మళ్ళీ అదే భారత్ ను విష్ణుపురిగా తయారుచేస్తున్నారు.
మీకు చాలా నషా ఉండాలి.
వాళ్ళు అయితే ఊరికే తమ పేరును ప్రసిద్ధి చేసుకునేందుకు కష్టపడుతూ ఉంటారు.
ఖర్చు అయితే గవర్నమెంటు నుండి లభిస్తుంది.
సన్యాసులకైతే చాలా ధనము లభిస్తుంది.
ఇప్పుడు కూడా అంటారు,
భారత్ యొక్క ప్రాచీన యోగము నేర్పించేందుకు వెళ్తే వెంటనే ధనం ఇస్తారు అని. బాబాకైతే ఎవరి ధనము అవసరం లేదు. వారు స్వయం మొత్తం ప్రపంచానికి సహాయం చేసేవారు,
భోళా భండారీ,
పిల్లల సహాయం లభిస్తుంది.
పిల్లలు ధైర్యము ఉంచితే తండ్రి సహాయం చేస్తారు.
ఎవరైనా బయట నుండి వచ్చినప్పుడు అలవాటుపడి ఉన్నారు కావున ఆశ్రమము,
ఏదైనా ఇవ్వాలి అని భావిస్తారు.
కానీ మీరు అడగాలి,
ఎందుకు ఇస్తున్నారు?
జ్ఞానమునైతే ఏమీ వినలేదు.
ఏమీ తెలియదు.
మనం బీజము నాటుతాము,
స్వర్గంలో ఫలం లభించనున్నది,
ఎప్పుడైతే జ్ఞానము వింటారో అప్పుడే తెలుస్తుంది.
ఇలా వచ్చేవారు కోట్లమంది వస్తారు.
బాబా గుప్త రూపంలో వచ్చారు,
ఇది మంచిదే.
శ్రీకృష్ణుని రూపంలో వస్తే ఇసుక వలె పోగవుతారు,
ఒక్కసారిగా అతుక్కుపోతారు,
ఇక ఎవరూ ఇంట్లో కూర్చోలేరు.
మీరు ఈశ్వరీయ సంతానము.
ఇది మర్చిపోకండి.
పిల్లలు పూర్తి వారసత్వం తీసుకోవాలని తండ్రికైతే హృదయంలో ఉంటుంది.
స్వర్గంలోకైతే చాలామంది వస్తారు కానీ ధైర్యము చేసి ఉన్నత పదవిని పొందాలి,
అలా కోట్లలో ఏ ఒక్కరో వెలువడుతారు.
అచ్ఛా!
మాత-పిత బాప్ దాదాల మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
రాత్రి క్లాసు 15-6-68
ఏదైతే గతించిపోయిందో,
దానిని రివైజ్ చేసుకోవడం ద్వారా,
ఎవరికైతే బలహీన మనసు ఉంటుందో వారి మనసులోని బలహీనత కూడా రివైజ్ అవుతుంది,
అందుకే పిల్లలను డ్రామా పట్టాలపై నిలబెట్టడం జరిగింది.
స్మృతితోనే ముఖ్యమైన లాభము ఉంది. స్మృతితోనే ఆయుష్షు పెరగనున్నది.
డ్రామాను పిల్లలు అర్థం చేసుకున్నట్లయితే ఇక ఎప్పుడూ వేరే ఆలోచనలు ఉండవు.
డ్రామాలో ఈ సమయములో జ్ఞానము నేర్చుకోవడము మరియు నేర్పించడము జరుగుతుంది.
ఇక తర్వాత పాత్ర ఆగిపోతుంది.
తండ్రి పాత్ర ఉండదు,
మన పాత్ర ఉండదు.
వారిది ఇచ్చే పాత్ర ఉండదు,
మనది తీసుకునే పాత్ర ఉండదు.
మరి అంతా ఒక్కటైపోతుంది కదా! మన పాత్ర కొత్త ప్రపంచములో ఉంటుంది.
బాబా పాత్ర శాంతిధామములో ఉంటుంది.
పాత్ర యొక్క రీలు నిండి ఉంది కదా - మనది ప్రారబ్ధం యొక్క పాత్ర,
బాబాది శాంతిధామం యొక్క పాత్ర.
ఇచ్చే మరియు తీసుకునే పాత్ర పూర్తి అవుతుంది,
డ్రామాయే పూర్తి అయిపోతుంది.
మళ్ళీ మనం రాజ్యము చేసేందుకు వస్తాము,
ఆ పాత్ర మారిపోతుంది.
జ్ఞానము ఆగిపోతుంది.
మనం అలా తయారైపోతాము.
పాత్రనే పూర్తయి పోతే ఇక వ్యత్యాసం ఉండదు.
పిల్లలతో పాటు తండ్రి యొక్క పాత్ర కూడా ఉండదు.
పిల్లలు జ్ఞానాన్ని పూర్తిగా తీసేసుకుంటారు.
కావున వారి వద్ద ఇక ఏమీ ఉండనే ఉండదు.
ఇచ్చేవారి వద్ద ఉండదు,
తీసుకునేవారి వద్ద లోటు ఉండదు,
కనుక ఇరువురు ఒకరికొకరు సమానమైపోయారు.
ఇందులో విచార సాగర మథనము చేసే బుద్ధి కావాలి.
విశేషమైన పురుషార్థము స్మృతి యాత్రకు సంబంధించినది.
తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు.
వినిపించడానికైతే స్థూల విషయం అవుతుంది కానీ బుద్ధిలోనైతే సూక్ష్మముగా ఉంది కదా. శివబాబా రూపము ఏమిటి అన్నది లోపల తెలుసు.
అర్థం చేయించడానికి స్థూల రూపాన్ని చూపిస్తారు.
భక్తి మార్గములో పెద్ద లింగాన్ని తయారుచేస్తారు.
ఆత్మ అయితే చిన్నదే కదా. ఇది ప్రాకృతికము.
ఎంతకని అంతాన్ని పొందగలరు?
ఇక చివర్లో అనంతము అని అనేస్తారు.
బాబా అర్థం చేయించారు,
మొత్తం పాత్ర అంతా ఆత్మలో నిండి ఉంది. ఇది ప్రాకృతికము.
అంతాన్ని పొందలేరు.
సృష్టి చక్రము యొక్క అంతాన్ని అయితే పొందుతారు.
రచయిత మరియు రచనల ఆది-మధ్య-అంతాలు మీకే తెలుసు.
బాబా నాలెడ్జ్ ఫుల్. అయినా మనము ఫుల్ గా అవుతాము,
పొందేందుకు ఇక ఏమీ మిగలదు.
తండ్రి వీరిలో ప్రవేశించి చదివిస్తారు.
వారు బిందువు.
ఆత్మ లేక పరమాత్మ యొక్క సాక్షాత్కారము జరగడం వలన సంతోషము ఏమైనా కలుగుతుందా.
కృషి చేసి తండ్రిని స్మృతి చేయాలి,
అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి.
తండ్రి అంటారు,
నాలో జ్ఞానము ఆగిపోతే నీలో కూడా ఆగిపోతుంది.
జ్ఞానము తీసుకుని ఉన్నతముగా అవుతారు.
అందరూ ఎంతోకొంత తీసుకుంటారు,
అయినా తండ్రి అయితే తండ్రే కదా. ఆత్మలైన మీరు ఆత్మలుగానే ఉంటారు,
తండ్రిగా అయితే అవ్వరు.
ఇది జ్ఞానము.
తండ్రి తండ్రే,
పిల్లలు పిల్లలే.
ఇవన్నీ విచార సాగర మథనము చేసి లోతుగా వెళ్ళవలసిన విషయాలు.
అందరూ తిరిగి వెళ్ళేదే ఉందని కూడా తెలుసు.
అందరూ వెళ్ళిపోనున్నారు.
ఇకపోతే ఆత్మయే మిగులుతుంది.
మొత్తము ప్రపంచమే సమాప్తమవ్వనున్నది,
ఇందులో నిర్భయులుగా ఉండాల్సి ఉంటుంది.
నిర్భయులుగా ఉండేందుకు పురుషార్థము చేయాలి.
శరీరము మొదలైనవాటి భానం ఏమీ రాకూడదు,
ఆ అవస్థలోకి వెళ్ళాలి.
తండ్రి తమ సమానంగా తయారుచేస్తారు,
పిల్లలైన మీరు కూడా తమ సమానంగా తయారుచేస్తూ ఉంటారు.
ఒక్క తండ్రి స్మృతే ఉండాలి,
అటువంటి పురుషార్థము చేయాలి.
ఇప్పుడింకా సమయము ఉంది. ఈ రిహార్సల్ ను వేగవంతం చేయాల్సి ఉంటుంది.
ప్రాక్టీస్ లేకపోతే ఆగిపోతారు.
కాళ్ళు వణకడం మొదలవుతాయి మరియు హార్ట్ ఫెయిల్ అకస్మాత్తుగా అవుతూ ఉంటుంది.
తమోప్రధాన శరీరము హార్ట్ ఫెయిల్ అవ్వడానికి ఆలస్యము ఏమైనా అవుతుందా.
ఎంతగా అశరీరిగా అవుతూ ఉంటారో,
తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో,
అంతగా సమీపంగా వస్తూ ఉంటారు.
యోగం చేసేవారే నిర్భయులుగా ఉంటారు.
యోగముతో శక్తి లభిస్తుంది.
జ్ఞానముతో ధనము లభిస్తుంది.
పిల్లలకు కావాల్సింది శక్తి.
కనుక శక్తిని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి.
బాబా అవినాశీ సర్జన్.
వారెప్పుడూ పేషెంట్ గా అవ్వరు.
ఇప్పుడు తండ్రి అంటారు,
మీరు స్వయం కోసం అవినాశీ ఔషధం తీసుకుంటూ ఉండండి.
ఎప్పుడూ ఎవరూ అనారోగ్యంపాలు అవ్వని సంజీవని మూలికను నేను ఇస్తాను.
కేవలము పతితపావనుడైన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పావనంగా అవుతారు.
దేవతలు సదా నిరోగులు,
పావనులు కదా. పిల్లలకైతే నిశ్చయం ఏర్పడింది,
మేము కల్ప-కల్పము వారసత్వము తీసుకుంటాము.
లెక్కలేనన్నిసార్లు తండ్రి వచ్చారు,
ఎలాగైతే ఇప్పుడు వచ్చారో అలాగే వచ్చారు.
బాబా ఏదైతే నేర్పిస్తారో,
అర్థం చేయిస్తారో అదే రాజయోగము.
ఆ గీత మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి.
ఈ జ్ఞాన మార్గాన్ని తండ్రే తెలియజేస్తారు.
తండ్రే వచ్చి క్రింద నుండి పైకి లేపుతారు.
ఎవరైతే పక్కా నిశ్చయబుద్ధి కలవారు ఉంటారో,
వారు మాలలోని మణులుగా అవుతారు.
భక్తి చేస్తూ-చేస్తూ మేము క్రిందకు పడిపోతూ వచ్చాము
- అని పిల్లలు అర్థం చేసుకుంటారు.
ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమైన సంపాదనను చేయిస్తారు.
పారలౌకిక తండ్రి ఎంత అయితే సంపాదన చేయిస్తారో అంతగా లౌకిక తండ్రి చేయించరు.
అచ్ఛా
- పిల్లలకు గుడ్ నైట్ మరియు నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
సర్వీసబుల్ గా అయ్యేందుకు వికారాల అంశాన్ని కూడా సమాప్తం చేయాలి.
సేవ కోసం సంతోషంతో ఉప్పొంగుతూ ఉండాలి.
2.
మేము ఈశ్వరీయ సంతానము,
శ్రీమతముపై భారత్ ను విష్ణుపురిగా తయారుచేస్తున్నాము,
అక్కడ అందరూ పక్కా వైష్ణవులుగా ఉంటారు...
ఈ నషాలో ఉండాలి.
వరదానము:-
దుఃఖం యొక్క
చక్రాల నుండి
సదా ముక్తులుగా
ఉండే మరియు
అందరినీ ముక్తులుగా
చేసే స్వదర్శన
చక్రధారి భవ
ఏ పిల్లలైతే కర్మేంద్రియాలకు వశమై - ఈ రోజు కళ్ళు, నోరు లేక దృష్టి మోసం చేసాయి అని అంటారో, అలా మోసపోవడము అనగా దుఃఖం యొక్క అనుభూతి కలగడము. ప్రపంచంవారు అంటారు - కోరుకోలేదు కానీ చక్రంలోకి వచ్చేసాము అని. కానీ స్వదర్శన చక్రధారి పిల్లలు ఎవరైతే ఉంటారో, వారెప్పుడూ మోసం యొక్క ఏ చక్రంలోకి రాలేరు. వారు దుఃఖం యొక్క చక్రాల నుండి ముక్తులుగా ఉండేవారు మరియు అందరినీ ముక్తులుగా చేసేవారు, యజమానిగా అయి సర్వ కర్మేంద్రియాలతో కర్మలు చేయించేవారు.
స్లోగన్:-
అకాల సింహాసనాధికారిగా
అయి తమ శ్రేష్ఠ గౌరవంలో ఉన్నట్లయితే
ఎప్పుడూ వ్యాకులత చెందరు.
0 Comments