02-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- ఒక్క ఈశ్వరీయ
మతమే శ్రేష్ఠ
మతము, ఈ మతముపై నడవడం ద్వారానే
మీరు సత్యమైన
బంగారముగా అవుతారు,
మిగిలిన అన్ని
మతాలు అసత్యంగా
తయారుచేసేవి’’
ప్రశ్న:-
ఏ పాత్ర ఒక్క జ్ఞాన సాగరుడైన తండ్రిలోనే నిండి ఉంది, ఏ మనుష్య ఆత్మ లోనూ లేదు?
జవాబు:-
బాబా అంటారు - ఆత్మనైన నాలో భక్తులను సంభాళించే పాత్ర, అందరికీ సుఖాన్ని ఇచ్చే పాత్ర ఉంది. జ్ఞాన సాగరుడైన తండ్రినైన నేను పిల్లలందరిపై
అవినాశీ జ్ఞాన వర్షాన్ని కురిపిస్తాను, ఆ జ్ఞాన రత్నాలను ఎవ్వరూ వెల కట్టలేరు. నేను ముక్తిదాతను, ఆత్మిక పండాగా అయి ఆత్మలైన మిమ్మల్ని తిరిగి శాంతిధామానికి తీసుకువెళ్తాను.
ఇదంతా నా పాత్ర. నేను ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వను, అందుకే అందరూ నన్ను కళ్ళపై పెట్టుకుంటారు. శత్రువైన రావణుడు దుఃఖాన్ని ఇస్తాడు, అందుకే అతని దిష్టిబొమ్మను కాలుస్తారు.
పాట:- ఎవరైతే ప్రియునితో ఉన్నారో... (జో పియా కే సాథ్ హై...)
ఓంశాంతి. తండ్రి ఓం అర్థాన్ని అయితే పిల్లలకు అర్థం చేయించారు. ఓం అనగా నేను ఆత్మను. అంతే, దీని అర్థము చాలా చిన్నదే. దీని అర్థము - నేను భగవంతుడిని అని కాదు. పండితులు మొదలైనవారిని ఓం యొక్క అర్థం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు వారు చాలా ఎక్కువ వినిపిస్తారు, అది కూడా యథార్థాన్ని వినిపించరు. యథార్థము మరియు అయథార్థము, సత్యము మరియు అసత్యము. సత్యమైతే ఒక్క తండ్రి మాత్రమే. ఇకపోతే,
ఈ సమయంలో ఉన్నదే అసత్యత యొక్క రాజ్యము. రామ రాజ్యాన్నే సత్యం యొక్క రాజ్యము అని అంటారు. రావణ రాజ్యాన్ని అసత్యతతో కూడిన రాజ్యం అని అంటారు. వారు అయథార్థాన్నే వినిపిస్తారు. తండ్రి సత్యము, వారు అంతా సత్యాన్నే వినిపించి సత్యమైన బంగారముగా తయారుచేస్తారు. మళ్ళీ మాయ అసత్యంగా చేసేస్తుంది. మాయ ప్రవేశించిన కారణముగా మనుష్యులు ఏదైతే చెప్తారో, అది అసత్యమే చెప్తారు, దానిని ఆసురీ మతము అని అంటారు. తండ్రిది ఈశ్వరీయ మతము. ఆసురీ మతమువారు అసత్యాన్నే చెప్తారు. ఆసురీ మతాలు ప్రపంచములో అనేకానేకము ఉన్నాయి. గురువులు కూడా అనేకమంది ఉన్నారు. వారిది శ్రీమతము అని అనరు. ఒక్క ఈశ్వరుని మతాన్నే శ్రీమతము అని అంటారు.
మనం శ్రీమతముపై నడుస్తూ శ్రేష్ఠముగా అవుతామని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అందరికన్నా శ్రేష్ఠమైనవారైతే పరమపిత పరమాత్మయే.
వారు ఉన్నతోన్నతముగానే ఉంటారు. భక్తులందరూ వారిని తలచుకుంటారు. భక్తులు శ్రీమతాన్ని తలచుకుంటారు, అంటే తప్పకుండా వారు ఏదో ఆసురీ మతముపై ఉన్నారు. ఇప్పుడు మీరు శ్రీమతముపై శ్రేష్ఠముగా అవుతారు, ఇక తర్వాత అక్కడ భగవంతుడా అని అంటూ తలచుకోవాల్సిన అవసరమే ఉండదు. దేవీ-దేవతలు స్మృతి చేయాల్సిన అవసరం పడేందుకు అక్కడ దుఃఖమేమీ ఉండదు. భక్తులకైతే అపారమైన దుఃఖము ఉంది. ఇప్పుడైతే ఎంతగానో దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. మహాభారీ యుద్ధము,
ఇది మనుష్యుల కొరకు దుఃఖాల పర్వతము.
పిల్లలైన మీ కోసం సుఖమయమైన పర్వతము ఉంటుంది. దుఃఖము తర్వాత సుఖము తప్పకుండా వస్తుంది.
ఈ వినాశనం తర్వాత మళ్ళీ మీ రాజ్యమే రానున్నది.
అనేక ధర్మాల వినాశనం జరుగుతుంది మరియు ఏ ధర్మమైతే ఇప్పుడు కనుమరుగైపోయిందో, దాని స్థాపన జరుగుతుంది. అనగా ఈ మహాభారీ యుద్ధము ద్వారా స్వర్గం యొక్క గేట్లు తెరుచుకుంటాయి. ఈ గేటు నుండి ఎవరు వెళ్తారు? ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటున్నారో వారు. నేర్పించేవారు తండ్రి. ఎవరైతే ప్రియునితోపాటు ఉంటారో వారి కోసమే ఈ జ్ఞాన వర్షము ఉంటుంది.
ప్రియుడు అని తండ్రిని అంటారు. ఆ వర్షమైతే నీటి సాగరము నుండి వెలువడుతుంది. ఇది అవినాశీ జ్ఞాన రత్నాల వర్షము. ఎవరైతే జ్ఞాన సాగరుడైన ప్రియునితోపాటు ఉన్నారో, వారి కొరకు అవినాశీ జ్ఞాన రత్నాల వర్షము ఉంది.
ఈ అవినాశీ జ్ఞాన రత్నాలు మీ బుద్ధి రూపీ జోలిలో ధారణ అవుతాయి. విద్యను బుద్ధిలో ధారణ చేయడం జరుగుతుంది కదా. ఆత్మ మనస్సు, బుద్ధి సహితముగా ఉంది, కావున ఆత్మ గ్రహిస్తుంది (ధారణ చేస్తుంది). ఏ విధంగా ఆత్మకు ఈ శరీరము ఉందో, అలాగే ఆత్మకు మనస్సు,
బుద్ధి ఉన్నాయి. బుద్ధి ద్వారా గ్రహిస్తారు. ఎప్పుడైతే యోగము ఉంటుందో అప్పుడు గ్రహించడం జరుగుతుంది (ధారణ జరుగుతుంది). తండ్రి కూర్చొని చాలా సహజమైన విషయాలను అర్థం చేయిస్తారు. మనుష్యులైతే చాలా కష్టమైన విషయాలను వినిపించారు.
శాస్త్రాలలో కూడా చాలా మతాలు ఉన్నాయి. గీతకు చాలా ప్రచారం ఉంది.
అధ్యాయాలకు అర్థాలు చాలామంది చెప్తారు. ఎన్ని రకాల అనేకానేక గీతలను తయారుచేసారు, ఇంకే శాస్త్రాన్ని ఫలానా వారి వేదము, ఫలానా వారి శాస్త్రము అని అనరు. గీత విషయంలో - గాంధీ గీత, ఠాగూర్ గీత,
జ్ఞానేశ్వర్ గీత, అష్టావక్ర గీత... అని అంటారు. గీతకు చాలా పేర్లు పెట్టారు, ఇంకే వేద-శాస్త్రాలకు ఇన్ని పేర్లు ఎప్పుడూ వినము.
కానీ మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. ఈ జ్ఞానమే కనుమరుగైపోతుంది. ఇప్పుడు దైవీ స్వరాజ్యం ఎక్కడి నుండి లభిస్తుంది? తప్పకుండా సత్యయుగాన్ని స్థాపించేవారు ఎవరైతే ఉన్నారో,
వారే ఇస్తారు.
ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాన్ని ఇచ్చేందుకు,
అది కూడా
21 జన్మల కోసము. కుమారి అయినవారు 21 కులాలను ఉద్ధరిస్తారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ కుమారి ఎవరు? మీరందరూ కుమారులు, కుమారీలు. మీరు ఎవరికైనా 21 జన్మల కోసం రాజ్య భాగ్యాన్ని శ్రీమతము ద్వారా లేక తండ్రి మతము ద్వారా ప్రాప్తి చేయించగలరు. పాఠశాలలో ఎవరైతే చదువుతారో వారికి మేము విద్యార్థులమని తెలుసు. ఇతర సత్సంగాలలో తమను తాము విద్యార్థులుగా భావించరు.
విద్యార్థులకు లక్ష్యము-ఉద్దేశ్యము బుద్ధిలో ఉంటుంది. మీరు ఈశ్వరీయ విద్యార్థులు. భగవానువాచ
- నేను మీకు రాజయోగం నేర్పిస్తాను, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తాను. దేవతల రాజధాని ఉండేది.
యథా రాజా రాణి దేవీ-దేవతా తథా ప్రజా... నరుని నుండి నారాయణునిగా అవుతారు.
ఈ లక్ష్యము-ఉద్దేశ్యము ఫస్ట్. రాజా రామునిగా లేక రాణి సీతగా తయారుచేస్తారని కాదు. ఇది ఉన్నదే రాజయోగము.
రాజులకే రాజులుగా తయారుచేస్తారు. కల్ప-కల్పము నేను మళ్ళీ వస్తాను పోగొట్టుకున్న రాజ్యాన్ని ఇచ్చేందుకు. మీ రాజ్యాన్ని మనుష్యులెవరూ లాక్కోలేదు.
మాయ లాక్కుంది.
ఇప్పుడు విజయాన్ని కూడా మాయపైనే పొందాలి. అక్కడ రాజుల మధ్యన యుద్ధాలు జరుగుతాయి. ఒకరిపై ఒకరు విజయం పొందేందుకు యుద్ధాలు చేసుకుంటారు.
ఇప్పుడైతే ప్రజలపై ప్రజా రాజ్యంగా అయ్యింది. హద్దు రాజుల మధ్యన అనేకానేక యుద్ధాలు జరిగాయి.
వాటి ద్వారా హద్దు రాజ్యం లభిస్తుంది మరియు ఈ యోగబలము ద్వారా మీరు విశ్వ రాజధానిని స్థాపన చేస్తారు, దీనిని అహింసక యుద్ధము అని అంటారు. యుద్ధము లేక మరణించడము, హతమార్చడము యొక్క విషయము లేదు. ఇది యోగబలము. ఎంత సహజమైనది. బాబాతో యోగం జోడించడంతో మనం వికర్మాజీతులుగా అవుతాము. అప్పుడిక మాయ యొక్క దాడి ఏమీ జరగదు. హాతిమతాయి ఆటను చూపిస్తారు. అతను నోటిలో నాణం వేసుకునేటప్పటికి మాయ మాయమైపోయేది. నాణాన్ని బయటకు తీస్తే మాయ వచ్చేది. అల్లా అవల్దీన్ నాటకము కూడా ఉంది. దీపాన్ని రుద్దగానే స్వర్గము వచ్చేది.
అది బహిష్త్ లేక స్వర్గము.
కావున తండ్రి కూర్చొని బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపనను చేస్తారు. పరమపిత పరమాత్మ ఏమైనా నరకాన్ని స్థాపన చేస్తారా.
అలా చేస్తే వారి దిష్టిబొమ్మను తయారుచేస్తారు. దొష్టిబొమ్మనైతే రావణుడిది తయారుచేయడం జరుగుతుంది, ఎందుకంటే రావణుడే అందరికీ శత్రువు.
తండ్రి, ఎవరైతే స్వర్గాన్ని స్థాపన చేస్తారో, వారిని కళ్ళపై పెట్టుకోవడం జరుగుతుంది.
తండ్రి అంటారు, భక్తులు
- మీరు వచ్చి దుఃఖము నుండి విడిపించండి అని నన్ను తలచుకుంటారు, అందుకే వచ్చి విముక్తులుగా చేస్తాను.
తండ్రి ముక్తిదాత కూడా,
ఆత్మిక పండా కూడా. మిమ్మల్ని తమ శాంతిధామానికి తీసుకువెళ్తారు. ఎవరైతే ప్రియునితోపాటు ఉన్నారో, వారి కోసం అవినాశీ జ్ఞాన రత్నాల వర్షం ఉంది, ఆ జ్ఞాన రత్నాలకు వెల కట్టలేము. బాబా జ్ఞాన సాగరుడు, కనుక తప్పకుండా ఆత్మలో పాత్ర నిండి ఉంది. పరమపిత పరమాత్మ స్వయం కూడా అంటారు,
నా ఆత్మ ఏదైతే ఉందో, దానిని మీరు పరమాత్మ అని అంటారు, నాలో కూడా పాత్ర నిండి ఉంది - భక్తులను సంబాళించడము, అందరికీ సుఖాన్ని ఇవ్వడము. దుఃఖాన్ని అయితే మాయ ఇస్తుంది. భక్తులకు అల్పకాలికముగా సుఖాన్ని ఇవ్వడము కూడా నా పాత్రనే.
నేనే సాక్షాత్కారము చేయిస్తాను మరియు దివ్య బుద్ధిని ప్రసాదిస్తాను. దానిని జ్ఞానం యొక్క మూడవ నేత్రము అని అంటారు.
దీనితో మీ బుద్ధి యొక్క గోద్రెజ్ తాళము తెరుచుకుంటుంది. నాకు కూడా పాత్ర ఉంది, ఎవరైతే తండ్రితోపాటు ఉంటారో, వారి కోసం జ్ఞాన వర్షము ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది పిల్లలు కలిసి ఎలా ఉండగలరు!
మీరు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే తండ్రితోపాటు ఉన్నట్లే. కొందరు లండన్ లో, కొందరు ఇంకెక్కడో ఉన్నారు,
మరి కలిసి ఎలా ఉన్నట్లు?
వారికి కూడా మురళి వెళ్తుంది. వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఒక్క వారం బాగా అర్థం చేసుకున్నా వారిని స్వదర్శన చక్రధారులుగా చేస్తాను.
84 జన్మల స్వదర్శన చక్రం యొక్క రహస్యాన్ని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారా మాయా రావణుని శిరస్సును ఖండించివేస్తారు మరియు అతనిపై విజయం పొందుతారు. అంతేకానీ ఇక్కడ శిరస్సును ఖండించే విషయమేదీ లేదు. వారు హింసాయుతమైన అస్త్ర, శస్త్రాలను చూపించారు. నిజానికి ఈ నోరే శంఖము.
చక్రాన్ని తిప్పడము, ఇది బుద్ధి పని. కావున ఈ అలంకారాలను భక్తి మార్గంలో ఎన్నో చూపించారు. భక్తి మార్గంలో శాస్త్రాలు మొదలైనవేవైతే కొనసాగుతున్నాయో, డ్రామానుసారంగా మళ్ళీ అవే వెలువడతాయి.
ఈ సత్యమైన గీత కూడా ఎవరో ఒకరి చేతుల్లోకి వస్తే ఇందులో నుండి కూడా ఎంతో కొంత అందులో వేస్తారు.
ఇకపోతే, ఎక్కువగా అన్నీ అవే వెలువడతాయి.
ఇక్కడివి కొన్ని-కొన్ని పదాలు అందులోకి వచ్చాయి.
భగవానువాచ - ఇది సరైనదే. రాజయోగము కూడా సరైనదే. తండ్రి అంటారు,
ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి. ఈ శరీర సహితముగా అన్నింటినీ మర్చిపోవాలి, దీనికి బదులుగా మీకు పవిత్ర శరీరము లభిస్తుంది.
ఆత్మ కూడా పవిత్రముగా అవుతుంది. ధనము కూడా మీ వద్ద అపారముగా ఉంటుంది. మీకు ఎంతో లోభము ఉంది. కానీ దీనిని శుద్ధ లోభము అని అంటారు, దీని ద్వారా మొత్తం భారత్ అంతా శుద్ధముగా అవుతుంది. రామ రాజ్యము, ఒకే ప్రభుత్వము, ఒకే దేశము ఉండాలని, ఒకే మతము, అద్వైత మతము ఉండాలని భారతవాసులు కోరుకుంటారు. అద్వైతము యొక్క అర్థమే దేవతలు.
ఇది ఆసురీ మతము. శ్రీమతము తప్ప మిగిలినవన్నీ ఆసురీ మతాలే. ఆ కారణంగా ఒకరితో ఒకరు గొడవపడుతూ-కొట్లాడుకుంటూ ఉంటారు. ఈశ్వరుని పిల్లలుగా అవ్వని కారణముగా అనాథలుగా అయిపోయారు. సత్యయుగములో దేవతలు సనాథలుగా ఉంటారు.
అక్కడ జంతువులు కూడా ఎప్పుడూ కొట్లాడుకోవు. ఇక్కడైతే అందరూ గొడవపడుతూ-కొట్లాడుకుంటూ ఉంటారు. సత్యయుగములో అందరికీ అపారమైన సుఖము ఉంటుంది.
మనం తండ్రి ద్వారా ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈశ్వరుడు సమ్ముఖముగా ఉన్నారు కదా. వారు అంటారు, నేను స్వర్గ స్థాపన చేయడానికి కల్ప-కల్పమూ వస్తాను. పిల్లలైన మీ కొరకు చాలా అద్భుతమైన కానుకను తీసుకువస్తాను. తండ్రి అంటారు, నా ప్రియమైన పిల్లలూ, చాలాకాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలూ, 5000 సంవత్సరాల తర్వాత మీరు వచ్చి నన్ను కలుసుకుంటారు. ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు.
స్వయాన్ని బ్రహ్మా, విష్ణు,
శంకరులుగా చెప్పుకున్నా కానీ,
ఎవరికీ ఇటువంటి విషయాలను చెప్పడం రానే రాదు. ఇందులో ఎవరూ కాపీ చేయలేరు.
తండ్రి అంటారు, నా మధురమైన, చాలాకాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలూ,
5000 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. కేవలం మీరు మాత్రమే అలా కలుసుకున్నారు. ఎంతోమంది పిల్లలు కలుస్తూ ఉంటారు. రాజధానిని స్థాపన చేయడంలో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. రాజు,
రాణి ఒక్కరే,
ఆ తర్వాత వారి పిల్లలు వృద్ధి చెందుతారు. భారత్ లో యువరాజులు,
యువరాణులు ఎంతమంది ఉంటారు.
వారు ఒక లక్ష, రెండు లక్షలు ఉంటే ప్రజలు 40-50 కోట్లమంది ఉంటారు. కావున గమ్యము చాలా ఉన్నతమైనది. ఇది తండ్రి కాలేజ్. కావున ఎంత బాగా పురుషార్థము చేయాలి. తండ్రి అంటారు, రాజులకే రాజులుగా అవ్వండి, అంతేకానీ ప్రజలుగా కాదు. ఎవరైతే కల్పపూర్వము అలా తయారై ఉంటారో వారే మళ్ళీ అలా తయారవుతారు. ఎవరు ఏ విధమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు అనేది నేను సాక్షిగా అయి చూస్తాను. కొందరైతే పూర్తిగా పట్టుకుంటారు. తండ్రి అతి ప్రియమైనవారు. అయస్కాంతం వైపుకు సూదులు ఆకర్షింపబడతాయి. కొన్నింటిలో తుప్పు ఎక్కువగా ఉంటుంది,
కొన్నింటిలో తక్కువగా ఉంటుంది.
సమీపముగా ఉండేవారైతే వెంటనే వచ్చి కలుసుకుంటారు, శుభ్రంగా ఉన్న సూది వెంటనే ఆకర్షితమై వస్తుంది.
తండ్రి తుప్పును తొలగించి ఎంతగా మెరిసేలా చేస్తారంటే,
దాని వలన పిల్లలైన మీరు అక్కడ తోడుగా ఉంటారు.
మీరు రుద్రమాలలో కూర్చబడాలి. గాయనం కూడా ఉంది కానీ ఈ మాల ఎవరిది అన్నది తెలియదు. తండ్రి అంటారు,
నా మాల ఏదైతే ఉంటుందో అందులోని వారు స్వర్గాధిపతులుగా ఉంటారు. భక్తి మాలను కూడా మీరు అర్థం చేసుకున్నారు. అది రావణుని మాల. రావణుని మాలలోకి మొదట ఎవరు వస్తారు?
పూజ్యుల నుండి పూజారులుగా ఎవరు అవుతారు? మీరే పూజ్య దేవతలుగా, మళ్ళీ మీరే పూజారులుగా అవుతారు. ఇవి ఎంత గుహ్యమైన, అర్థం చేసుకోవలసిన విషయాలు.
మీరు మహాదానులు. దేహ సహితంగా సర్వస్వాన్ని బాబాపై బలిహారం చేస్తారు. సన్యాసులు మహాదానులు అవ్వరు. వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవులకు వెళ్ళిపోతారు. మీరు సర్వస్వాన్ని ఈశ్వరార్పణం చేస్తారు.
మొత్తమంతా గాడ్ ఫాదర్ కోసమే. అప్పుడు తండ్రి అంటారు,
నా సర్వస్వమూ పిల్లలైన మీ కోసమే. మనుష్యులు మరణించినప్పుడు వారి సామాగ్రినంతా స్మశాన బ్రాహ్మణులకు ఇస్తారు. తండ్రి అంటారు, నేను కూడా స్మశాన బ్రాహ్మణుడినే. మీ వద్ద పనికిరాని పాత వస్తువులేవైతే ఉన్నాయో వాటినన్నింటినీ దానం చేస్తారు. తండ్రిపై బలిహారమవుతారు. అవి మళ్ళీ మీకే ఉపయోగపడతాయి. తండ్రి ఇళ్లూ మొదలైనవాటిని కూడా తమ కోసం తయారుచేసుకోరు. శివబాబా దాత.
మొత్తం స్వర్గ రాజ్యాన్ని మీకు ఇచ్చేస్తారు.
అందుకే వీరిని వ్యాపారస్థుడు అని కూడా అంటారు. ఇవి ఎంత మధురాతి-మధురమైన విషయాలు. పరీక్షలు ఇక పూర్తి కానున్నాయి. బాబా,
పరీక్షలు చివరికి ఎప్పుడు పూర్తవుతాయి? బాబా అంటారు - ఎప్పుడైతే మీరు మరణానికి చేరువవుతారో, జ్ఞానం పూర్తవుతుందో అప్పుడు ఈ వినాశనం ఆరంభమవుతుంది. అప్పుడిక మీ నోట్లో బంగారు చెంచా ఉంటుంది. జన్మ తీసుకుంటారు, వెంటనే ఆ చెంచా లభిస్తుంది. ఇక్కడైతే
30, 40 సంవత్సరాలు చదువుకుంటారు, దానితో ఇక్కడే దాని ఫలితము లభిస్తుంది. మీది భవిష్యత్తుకు సంబంధించింది. భవిష్య జన్మ మీకు లభించినప్పుడు మీరు యువరాజులుగా అవుతారు. ఎప్పుడైతే వినాశనం ప్రారంభమవుతుందో అప్పుడు పరీక్ష పూర్తవుతుంది. ఒకవైపు చదువు పూర్తవుతుంది మరియు ఇంకొకవైపు వినాశనం ప్రారంభమవుతుంది. ఇకపోతే రిహార్సల్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. మీకు ఈ చదువు ఫలితము తర్వాత కొత్త ప్రపంచములో లభించనున్నది. అక్కడ ఆత్మ, శరీరము,
రాజ్యము అన్నీ కొత్తగా ఉంటాయి. ఇవి చాలా గుహ్యమైన,
ధారణ చేయాల్సిన విషయాలు. చదువును ఎప్పుడూ వదలకూడదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు, ఇవి అద్భుతమైన విషయాలు కదా.
ఆలస్యంగా వచ్చేవారు కూడా వెంటనే జ్ఞానం మరియు యోగంలో నిమగ్నమైనట్లయితే వారు కూడా ఉన్నత పదవిని పొందగలుగుతారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
శరీరము మరియు ఆత్మ, రెండింటినీ పవిత్రముగా తయారు చేసుకునేందుకు ఈ పాత శరీరము సహితముగా అన్నింటినీ మర్చిపోవాలి.
దేహ సహితంగా తండ్రిపై పూర్తిగా బలిహారమై మహాదానులుగా అవ్వాలి.
2.
తండ్రి శ్రీమతముపై నడుస్తూ అనంతమైన సుఖాన్ని తీసుకోవాలి.
ఈ శుద్ధమైన లోభాన్ని ఉంచుకోవాలి, దీని ద్వారా మొత్తం విశ్వమంతా సుఖమయంగా అవుతుంది, అశుద్ధ లోభాన్ని త్యజించివేయాలి.
వరదానము:-
అమృతవేళ మహత్వాన్ని
తెలుసుకొని మహాన్
గా తయారయ్యే
విశేష సేవాధారి
భవ
సేవాధారి అనగా కళ్ళు తెరవగానే సదా తండ్రితో పాటు తండ్రి సమానమైన స్థితిని అనుభవం చేయాలి. ఎవరైతే విశేష వరదాన సమయాన్ని తెలుసుకుంటారో
మరియు వరదానాలను అనుభవం చేస్తారో, వారే విశేష సేవాధారి. ఒకవేళ ఈ అనుభవం లేకపోతే సాధారణ సేవాధారిగా ఉంటారు, విశేషమైనవారిగా కాదు. ఎవరికైతే అమృతవేళ పట్ల, సంకల్పాల పట్ల, సమయము పట్ల మరియు సేవ పట్ల మహత్వం ఉంటుందో, అలా సర్వ మహత్వాలను తెలుసుకునేవారు
మహానులుగా అవుతారు మరియు ఇతరులకు కూడా మహత్వాన్ని తెలియజేసి మహానులుగా తయారుచేస్తారు.
స్లోగన్:-
జీవితపు మహానత సత్యత యొక్క శక్తి, దీని ద్వారా సర్వ ఆత్మలు స్వతహాగానే తలవంచి నమస్కరిస్తారు.
0 Comments