01-02-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- మీ దృష్టి
ఏ దేహధారి
వైపుకూ వెళ్ళకూడదు, ఎందుకంటే మిమ్మల్ని
చదివించేవారు స్వయంగా
నిరాకారుడైన జ్ఞానసాగరుడైన తండ్రి’’
ప్రశ్న:-
ఉన్నత పదవిని పొందేందుకు ఏ ఒక్క పురుషార్థాన్ని పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారములో ఉంటూ కూడా చేయవచ్చు?
జవాబు:-
గృహస్థ వ్యవహారములో
ఉంటూ కేవలం జ్ఞాన ఖడ్గాన్ని ఉపయోగించండి.
స్వదర్శన చక్రధారిగా అవ్వండి మరియు శంఖ ధ్వనిని చేస్తూ ఉండండి. నడుస్తూ-తిరుగుతూ అనంతమైన తండ్రిని స్మృతి చేయండి మరియు అదే సుఖములో ఉండండి, అప్పుడు ఉన్నత పదవి లభిస్తుంది. ఈ శ్రమనే చేయాలి.
ప్రశ్న:-
యోగములో మీకు ఏ డబుల్ లాభము కలుగుతుంది?
జవాబు:-
ఒకటేమో ఆ సమయంలో వికర్మలేవీ జరగవు, రెండవది గతంలో చేసిన వికర్మలు వినాశనమవుతాయి.
పాట:- మాతా, నీవే సర్వుల భాగ్యవిధాత... (మాత, తూ హై సబ్ కీ భాగ్య విధాత...)
ఓంశాంతి. సత్సంగాలు లేక కాలేజీలు మొదలైనవేవైతే ఉంటాయో,
అక్కడ చదివించేవారు ఎవరు అన్నది కనిపిస్తుంది. దృష్టి దేహము వైపుకు వెళ్తుంది.
కాలేజ్ లో ఫలానా ప్రొఫెసర్ చదివిస్తారు అని అంటారు.
సత్సంగంలో ఫలానా విద్వాంసులు వినిపిస్తారు అని అంటారు. మనుష్యుల వైపుకే దృష్టి వెళ్తుంది. ఇక్కడ మీ దృష్టి ఏ దేహధారి వైపుకూ వెళ్ళదు. నిరాకార పరమపిత పరమాత్మ ఈ తనువు ద్వారా వినిపిస్తున్నారని మీ బుద్ధిలో ఉంది.
బుద్ధి మాత-పితల వైపుకు మరియు బాప్ దాదాల వైపుకు వెళ్తుంది. పిల్లలు వినిపించేటప్పుడు, మేము జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా విన్నది వినిపిస్తున్నాము అని అంటారు. తేడా ఉంది కదా. సత్సంగాలలో ఏది విన్నా ఫలానావారు ఈ వేదాన్ని వినిపిస్తున్నారు అని భావిస్తారు. మనుష్యుల యొక్క పదవి వైపుకు,
జాతి వైపుకు దృష్టి వెళ్తుంది. వీరు హిందువు, వీరు ముస్లిం, దృష్టి అటువైపుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ దృష్టి శివబాబా వైపుకు వెళ్తుంది. శివబాబా చదివిస్తారు. ఇప్పుడు తండ్రి భవిష్య కొత్త ప్రపంచం కోసం వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు.
ఇంకెవ్వరూ ఇలా అనలేరు, ఓ పిల్లలూ - నేను మీకు స్వర్గము కోసం రాజయోగం నేర్పిస్తున్నాను అని.
ఇప్పుడు ఈ పాటను కూడా విన్నారు. ఈ పాట పాతది. జగదాంబ ఆ విధంగా ఉండేవారు. తప్పకుండా వారు సౌభాగ్యాన్ని తయారుచేసుకున్నారు, వారి మందిరాలు కూడా ఉన్నాయి. కానీ వారు ఎవరు, ఎలా వచ్చారు, ఏ భాగ్యాన్ని తయారుచేసుకున్నారు, ఏమీ తెలియదు. కావున ఈ చదువుకు మరియు ఆ చదువుకు రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది.
జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ బ్రహ్మా ముఖము ద్వారా చదివిస్తున్నారని ఇక్కడ మీరు భావిస్తారు.
తండ్రి వచ్చి ఉన్నారు. భక్తుల వద్దకు భగవంతుడు రావాల్సిందే. లేకపోతే భక్తులు భగవంతుడిని ఎందుకు తలచుకుంటారు? అందరూ భగవంతులే అంటే - ఇది తప్పు అవుతుంది. ఆ సర్వవ్యాపి జ్ఞానాన్ని చెప్పేవారు కూడా తమ విషయాన్ని నిరూపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీరు అర్థం చేయించేది వేరుగా ఉంటుంది. అనంతమైన తండ్రి నుండి పిల్లలకే వారసత్వము లభిస్తుంది. సన్యాసులది వైరాగ్య మార్గము, నివృత్తి మార్గము.
వారి నుండి ఎప్పుడూ ఆస్తి హక్కు లభించదు. అసలు వారు ఆస్తిని కోరుకోనే కోరుకోరు. మీరైతే సదా సుఖం యొక్క ఆస్తిని కోరుకుంటారు.
నరకం యొక్క ధనము-సంపదలో దుఃఖము ఉంది. ధనవంతులుగా ఉన్నా కానీ నడవడిక ఎంతో అశుద్ధముగా ఉంటుంది, ధనాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు,
ఇక పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు.
తద్వారా స్వయాన్ని కూడా దుఃఖితులుగా, పిల్లలను కూడా దుఃఖితులుగా చేస్తారు. వీరు అనంతమైన తండ్రి, వీరు కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. అక్కడ రకరకాల అనేకమంది తండ్రులు ఉన్నారు, వారి ద్వారా అల్పకాలికంగా వారసత్వం లభిస్తుంది. ఎవరైనా రాజులుగా ఉన్నా కానీ వారు కూడా హద్దులోని వారే. అక్కడ హద్దులోని అల్పకాలికమైన సుఖము ఉంది. ఈ అనంతమైన తండ్రి అవినాశీ సుఖాన్ని ఇచ్చేందుకు వస్తారు. వారు అర్థం చేయిస్తారు, భారతవాసులు ఎవరైతే డబుల్ కిరీటధారులుగా ఉండేవారో, స్వర్గానికి యజమానులుగా ఉండేవారో, వారు ఇప్పుడు నరకానికి యజమానులుగా అయ్యారు. నరకములో దుఃఖము ఉంది, అంతేకానీ గరుడ పురాణములో చూపించినటువంటి రౌరవ నరకము, విషయ వైతరణి నది మొదలైన నదులేవీ లేవు.
ఆ విధంగా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది.
దానిని వారు ఆసక్తికరమైన విషయాలుగా వ్రాసేసారు.
పూర్వము ఎవరు ఏ శరీర అంగముతో తప్పుడు పనులు చేసేవారో వారి ఆ అంగాన్ని ఖండించేసేవారు. చాలా కఠినమైన శిక్షలు లభించేవి. ఇప్పుడు అంతటి కఠినమైన శిక్షలు లభించడం లేదు. ఉరిశిక్ష ఏమంత కఠినమైన శిక్ష కాదు. అది చాలా సహజమైనది. మనుష్యులు ఆత్మహత్యను కూడా ఎంతో సంతోషముగా చేసుకుంటారు. శివునిపై,
దేవతలపై వెంటనే బలి అవుతారు. ఆత్మ దుఃఖితమైనప్పుడు ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకోవాలని కోరుకుంటుందని మీకు తెలుసు. ఆత్మహత్య చేసుకునేవారు ఇలా భావించరు. వారు ఇక్కడే ఒక శరీరాన్ని వదిలి, మళ్ళీ ఇక్కడే అశుద్ధమైన జన్మను తీసుకుంటారు. జ్ఞానమైతే లేదు, కానీ దుఃఖము కారణముగా శరీరాన్ని అంతం చేసుకుంటారు.
మళ్ళీ దుఃఖితమైన జన్మనే పొందుతారు. మనమైతే కొత్త ప్రపంచం కోసం అర్హులుగా అవుతున్నామని మీకు తెలుసు. ఆత్మహత్య చేసుకునేవారిలో కూడా ఎన్నో వెరైటీలు ఉంటారు. ఏ విధంగా కొందరు స్త్రీలు తమ పతి మరణం వెనుక తమ శరీరాన్ని హోమం చేసుకుంటారు,
(సతీ సహగమనం)
అది వేరు.
నేను పతి వెళ్ళే లోకములోకి వెళ్తాను అని భావిస్తారు ఎందుకంటే అలా ఎంతోమంది చేసారని విని ఉన్నారు. శాస్త్రాలలో కూడా,
అలా చేయడం ద్వారా పతి వెళ్ళే లోకములోకి వెళ్తారు అని ఉంది.
కానీ ఆ పతి అయితే కాముకుడు కదా. కావున మళ్ళీ ఈ మృత్యులోకములోకే రావాల్సి ఉంటుంది. ఇక్కడైతే జ్ఞాన చితిపై కూర్చోవడంతో స్వర్గములోకి వెళ్ళిపోతారు.
ఈ జగదాంబ, జగత్పిత ఎవరైతే స్థాపన కొరకు నిమిత్తులుగా అయ్యారో, వీరే మళ్ళీ స్వర్గములో పాలనకర్తలుగా అవుతారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు.
విష్ణు కులము అని దేనిని అంటారో మనుష్యులకు తెలియదు. విష్ణువు సూక్ష్మవతనవాసి, వారికి కులము ఎలా ఉండగలదు?
విష్ణువు యొక్క రెండు రూపాలు, లక్ష్మీ-నారాయణులుగా అయి పాలన చేస్తారని, రాజ్యము చేస్తారని ఇప్పుడు మీకు తెలుసు. ఇది జ్ఞాన చితి. పతులకే పతి అయిన ఆ ఒక్కరితో మీరు యోగం జోడిస్తారు. వారు శివబాబా, వారే పతులకు పతి, తండ్రులకు తండ్రి. సర్వస్వము వారొక్కరే. వారిలో సర్వ సంబంధాలూ వచ్చేస్తాయి. తండ్రి అంటారు, ఈ సమయంలోని మీ పెదనాన్నలు, చిన్నాన్నలు మొదలైనవారెవరైతే ఉన్నారో, వారందరూ మీకు దుఃఖము కలిగించే సలహానే ఇస్తారు. తప్పుడు మార్గం యొక్క ఆసురీ మతాన్నే ఇస్తారు. అనంతమైన తండ్రి వచ్చి పిల్లలకు సరైన మతాన్ని ఇస్తారు. కాలేజీలో చదివి బారిస్టర్ మొదలైనవారిగా అవ్వండి అని లౌకిక తండ్రి చెప్తారు.
అది ఏమైనా తప్పుడు సలహానా. శరీర నిర్వహణార్థము అది సరైనదే. ఆ పురుషార్థము చేయాల్సిందే. దానితోపాటు మళ్ళీ భవిష్య 21 జన్మల శరీర నిర్వహణార్థము కూడా పురుషార్థం చేయాలి.
చదువు అనేది శరీర నిర్వహణార్థమే ఉంటుంది.
శాస్త్రాల చదువు కూడా నివృత్తి మార్గం వారి శరీర నిర్వహణార్థమే ఉంది. వారు తమ శరీర నిర్వహణార్థమే చదువుకుంటారు.
సన్యాసులు కూడా శరీర నిర్వహణ కోసం కొందరు 50, కొందరు 100, కొందరు 1000 కూడా సంపాదిస్తూ ఉంటారు. ఒక్క కాశ్మీర్ రాజు మరణించడంతో ఆర్య సమాజము మొదలైనవారికి ఎంత ధనము లభించింది.
కావున ఇవన్నీ పొట్ట కూటి కోసమే చేస్తారు. సంపద లేకుండా సుఖము ఉండదు. ధనము ఉంటే మోటార్లు మొదలైనవాటిలో తిరుగుతూ ఉంటారు. పూర్వము సన్యాసులు ధనం కోసం సన్యాసం చేసేవారు కాదు, వారు అడవులకు వెళ్ళిపోయేవారు. ఈ ప్రపంచముతో విసుగు చెంది స్వయాన్ని విడిపించుకుంటారు. కానీ విముక్తులవ్వలేరు. ఇకపోతే పవిత్రంగా ఉంటారు. పవిత్రతా బలంతో భారత్ ను నిలబెడతారు. వారు కూడా భారత్ కు సుఖాన్ని ఇస్తారు.
వారు పవిత్రముగా అవ్వకపోతే భారత్ టూ మచ్ వేశ్యాలయంగా అయ్యేది. పవిత్రతను నేర్పించేది ఒకరేమో ఆ నివృత్తి మార్గం వారు,
ఇంకొకరు తండ్రి. అది నివృత్తి మార్గం యొక్క పవిత్రత, ఇది ప్రవృత్తి మార్గం యొక్క పవిత్రత. భారత్ లో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. దేవీ-దేవతలమైన మనం పవిత్రముగా ఉండేవారము. ఇప్పుడు అపవిత్రముగా అయిపోయాము. పూర్తి అర్ధకల్పం పంచ వికారాల ద్వారా మనం అపవిత్రముగా అవుతాము. మాయ కొద్ది-కొద్దిగా చేస్తూ పూర్తిగా అపవిత్రముగా, పతితులుగా చేసేసింది. తాము పావనుల నుండి పతితులుగా ఎలా అవుతాము అనేది ప్రపంచంలోని మనుష్యులెవ్వరికీ తెలియదు.
ఇది పతిత ప్రపంచమని భావిస్తారు కూడా.
ఏదైనా ఇంటికి 100 సంవత్సరాల ఆయుష్షు ఉంటే దానిని 50 సంవత్సరాలు కొత్తదిగా,
50 సంవత్సరాలు పాతదిగా వర్ణిస్తారు,
మెల్లమెల్లగా పాతగా అవుతూ ఉంటుంది. ఈ సృష్టి విషయం కూడా అంతే. కొత్త ప్రపంచములో పూర్తి సుఖము ఉంటుంది, మళ్ళీ సగం సమయం తర్వాత పాతబడుతుంది. సత్యయుగములో అపారమైన సుఖము ఉంది అని మహిమ కూడా చేస్తారు. మళ్ళీ పాత ప్రపంచంగా మారడంతో దుఃఖం ప్రారంభమవుతుంది. రావణుడు దుఃఖాన్ని ఇస్తాడు. పతితులుగా రావణుడే చేసాడు, అతడి దిష్టిబొమ్మను కాలుస్తారు. అతను చాలా పెద్ద శత్రువు. రావణుడిని కాల్చవద్దు అని, దాని వల్ల ఎంతోమందికి దుఃఖము కలుగుతుందని ఎవరో గవర్నమెంట్ కు అప్లై చేసారు. రావణుడిని విద్వాంసునిగా చూపిస్తారు. మినిస్టర్లు మొదలైనవారెవరూ అర్థం చేసుకోరు. రావణ రాజ్యము ద్వాపరం నుండి ప్రారంభమవుతుందని ఇప్పుడు మీకు తెలుసు. భారత్ లోనే రావణుడిని కాలుస్తారు.
తండ్రి అర్థం చేయిస్తారు, ద్వాపరం నుండి ఈ భక్తి,
అజ్ఞాన మార్గము ప్రారంభమవుతుంది. జ్ఞానం ద్వారా పగలు,
భక్తి ద్వారా రాత్రి.
ఇప్పుడు చూడండి, జగదాంబ పాటలను పాడుతూ ఉంటారు కానీ ఆమె సౌభాగ్య విధాతగా ఎలా అవుతారు అనేది అర్థం చేసుకోరు. ఎంత పెద్ద మేళా జరుగుతుంది. కానీ జగదాంబ ఎవరు, ఇది కూడా తెలియదు. బెంగాల్ లో కాళిని కూడా ఎంతగానో నమ్ముతారు, కానీ కాళి మరియు జగదాంబకు ఉన్న తేడా ఏమిటో తెలియదు. జగదాంబను తెల్లగా చూపిస్తారు, కాళిని నల్లగా చేసేసారు. జగదాంబయే లక్ష్మిగా అవుతారు, అప్పుడు తెల్లగా ఉంటారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ నల్లగా అయిపోతారు. కావున మానవులు ఎంతగా తికమక చెంది ఉన్నారు. నిజానికి కాళి లేక అంబ ఒక్కరే. వారికి ఏమీ తెలియదు - దీనినే అంధశ్రద్ధ అని అంటారు.
ఎవరైతే గతంలో జగదాంబగా ఉండేవారో, వారే భారత్ యొక్క భాగ్యాన్ని తయారుచేసారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీరు కూడా భారత్ యొక్క సౌభాగ్యాన్ని తయారుచేస్తున్నారు. మాతలదే ముఖ్యమైన పేరు.
సన్యాసులను కూడా మాతలే ఉద్ధరించవలసి ఉంటుంది.
ఇది కూడా రచింపబడి ఉంది. వీరిపై జ్ఞాన బాణాలను వేయండి అని పరమపిత పరమాత్మ డైరెక్షన్ ఇచ్చారు. పిల్లలైన మీరు కూడా సన్యాసులు మొదలైనవారిని కలిసినప్పుడు ఇలా అర్థం చేయిస్తారు - మమ్మల్ని జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ చదివిస్తున్నారు, మీరు హద్దులోని సన్యాసులు, మేము అనంతమైన సన్యాసులము. ఎప్పుడైతే మీ హఠయోగము పూర్తి అయ్యేది ఉంటుందో,
అప్పుడు మాకు తండ్రి రాజయోగాన్ని నేర్పుతారు.
హఠయోగము మరియు రాజయోగము, రెండూ కలిసి ఉండలేవు. ఇప్పుడు అంత ఎక్కువ సమయం లేదు,
చాలా కొద్ది సమయమే ఉంది. తండ్రి అంటారు, పిల్లలూ,
గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వండి.
బ్రాహ్మణులే కమలపుష్ప సమానంగా ఉండాలి. కుమారీలైతే ఉన్నదే పవిత్రముగా, కమలపుష్ప సమానముగా.
ఇకపోతే ఎవరైతే వికారాలలోకి వెళ్తారో వారికి పవిత్రముగా అవ్వండి అని చెప్పడం జరుగుతుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వండి.
ప్రతి ఒక్కరూ స్వదర్శన చక్రధారిగా అవ్వండి. శంఖ ధ్వనిని చేయండి. జ్ఞాన ఖడ్గాన్ని ఉపయోగించినట్లయితే నావ తీరాన్ని చేరుకుంటుంది. ఇందులో శ్రమ ఉంది.
కష్టపడకుండా ఇంతటి ఉన్నతమైన పదవిని పొందలేరు.
నడుస్తూ-తిరుగుతూ అదే సుఖములో ఉండండి. తండ్రిని స్మృతి చేయండి. ఎవరైతే చాలా సుఖాన్ని ఇస్తారో వారి స్మృతి ఉంటుంది కదా.
ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని స్మృతి చేయాలి. వారి పరిచయాన్నే ఇవ్వాలి. ఇలా అర్థం చేయించాలి - మీరు ఈ జన్మలో లౌకిక విద్యను చదువుకొని బ్యారిస్టర్ మొదలైనవారిగా అవుతారు.
అచ్ఛా, ఒకవేళ చదువుకుంటూ, చదువుకుంటూ లేక పరీక్ష పాసవుతూ మీ ఆయుష్షు పూర్తయినట్లయితే, శరీరము వదిలేస్తే ఆ చదువు ఇక్కడే సమాప్తమైపోతుంది. ఎవరైనా పరీక్ష పాస్ అయి లండన్ కు వెళ్తే,
అక్కడ మరణిస్తే ఆ చదువు అంతమైపోతుంది. అది వినాశీ చదువు. ఇది అవినాశీ చదువు.
ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు. కొత్త ప్రపంచములోకి వచ్చి మనం రాజ్యం చేయాలి అని మీకు తెలుసు. అది అల్పకాలికమైన సుఖము. అది కూడా ఎప్పుడైతే భాగ్యములో ఉంటుందో అప్పుడే లభిస్తుంది. అది ఎంతసేపు ఉంటుందో తెలియదు.
ఇక్కడైతే ఖచ్చితముగా ఉంటుంది.
పరీక్ష పాసవ్వగానే మీరు వెళ్ళి 21 జన్మల రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు.
హద్దులోని తండ్రి, టీచర్,
గురువు నుండి హద్దు వారసత్వమే లభిస్తుంది.
గురువు ద్వారా శాంతి లభించింది అని భావిస్తారు. అరే, ఇక్కడ ఏమైనా శాంతి ఉండగలదా. ఇంద్రియాలతో పని చేస్తూ,
చేస్తూ అలసిపోతే ఆత్మ శరీరము నుండి అతీతముగా అవుతుంది. తండ్రి అంటారు, శాంతి అయితే మీ స్వధర్మము. ఇవి మీ ఇంద్రియాలు, మీకు పని చేయాలని లేకపోతే మౌనంగా కూర్చోండి.
మనం అశరీరి,
తండ్రితో యోగము జోడించినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఒకవేళ ఎవరైనా సన్యాసి ద్వారా మీకు శాంతి లభించినా కానీ దాని వల్ల వికర్మలేవీ వినాశనమవ్వవు. ఇక్కడ తండ్రిని స్మృతి చేయడంతో వికర్మాజీతులుగా అవుతూ ఉంటారు. అచ్ఛా! శాంతిలో కూర్చుంటారు, దాని వల్ల వికర్మలు కూడా వినాశనమవ్వవచ్చు. ఇందులో డబుల్ లాభముంది. పాత వికర్మలు కూడా వినాశనమవుతాయి. ఈ యోగబలము లేకుండా పాత వికర్మలు ఎట్టి పరిస్థితిలోనూ ఎవ్వరివీ వినాశనమవ్వవు.
భారత్ యొక్క ప్రాచీన యోగమే మహిమ చేయబడింది. దీని ద్వారానే జన్మ-జన్మాంతరాల వికర్మలు వినాశనమవుతాయి, ఇంకే ఉపాయమూ లేదు.
ఇప్పుడిక ఈ వృద్ధి ఆగిపోనున్నది. ప్రభుత్వం కూడా జనాభా ఎక్కువగా వృద్ధి చెందకూడదు అనే కోరుకుంటుంది.
మనం ఎంతగా వృద్ధిని తగ్గిస్తామంటే, ఇక అక్కడ చాలా కొద్దిమందే ఉంటారు, మిగిలినవారంతా వెళ్ళిపోతారు. వినాశనం జరుగుతుందని మనుష్యులు భావిస్తారు కూడా కానీ యుద్ధం ఆగిపోవడం చూసి ఇది జరుగుతుందో, జరగదోనని భావిస్తారు, చల్లబడిపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ,
చాలా కొద్ది సమయమే ఉంది, అందుకే పొరపాట్లు చేయకండి
.అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
శరీరము నుండి అతీతముగా అయి, అశరీరి అయి సత్యమైన శాంతిని అనుభవం చేయాలి. తండ్రి స్మృతితో స్వయాన్ని వికర్మాజీతులుగా చేసుకోవాలి.
2.
అవినాశీ ప్రారబ్ధాన్ని తయారుచేసుకునేందుకు అవినాశీ చదువుపై పూర్తి ధ్యానము ఉంచాలి. తప్పుడు మతాలన్నింటినీ వదిలి ఒక్క తండ్రి ఇచ్చే సత్యమైన మతముపై నడవాలి.
వరదానము:-
ఉన్నతమైన స్థితిలో
ఉంటూ ప్రకృతి
అలజడి యొక్క
ప్రభావం నుండి
దూరంగా ఉండే
ప్రకృతీజీత్ భవ
మాయాజీతులుగా అయితే అవుతున్నారు కానీ ఇప్పుడు ప్రకృతీజీతులుగా కూడా అవ్వండి ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి యొక్క అలజడి ఎంతగానో జరగనున్నది. ఒక్కోసారి సముద్రంలోని
నీరు తన ప్రభావాన్ని చూపిస్తుంది, ఒక్కోసారి భూమి తన ప్రభావాన్ని
చూపిస్తుంది. ఒకవేళ ప్రకృతీజీతులుగా అయినట్లయితే ప్రకృతి యొక్క ఏ అలజడి కదిలించలేదు. సదా సాక్షీగా అయి అన్ని ఆటలను చూస్తారు. ఏ విధంగా ఫరిశ్తాలను సదా ఎత్తైన పర్వతంపై చూపిస్తారో, అలా ఫరిశ్తాలైన మీరు సదా ఉన్నతమైన స్థితిలో ఉంటే, ఎంతగా ఉన్నతంగా ఉంటారో, అంతగా అలజడి నుండి స్వతహాగా దూరంగా ఉంటారు.
స్లోగన్:-
తమ శ్రేష్ఠ వైబ్రేషన్స్ ద్వారా సర్వాత్మలకు
సహయోగం యొక్క అనుభూతిని చేయించడము కూడా తపస్యనే.
0 Comments