05-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- భక్తులకు ఎప్పుడైతే
కష్టాలు వచ్చాయో,
విపత్తులు వచ్చాయో,
అప్పుడు తండ్రి
వచ్చారు జ్ఞానం
ద్వారా గతి, సద్గతులను ఇచ్చేందుకు’’
ప్రశ్న:-
వికర్మాజీతులుగా ఎవరు అవుతారు? వికర్మాజీతులుగా అయ్యేవారి లక్షణాలు ఏమిటి?
జవాబు:-
ఎవరైతే కర్మ, అకర్మ, వికర్మల గతులను తెలుసుకుని శ్రేష్ఠ కర్మలను చేస్తారో వారే వికర్మాజీతులుగా
అవుతారు. వికర్మాజీతులుగా
అయ్యేవారు ఎప్పుడూ తమ కర్మలకు పశ్చాత్తాపపడరు.
వారి కర్మలు వికర్మలుగా అవ్వవు.
ప్రశ్న:-
ఈ సమయంలో తండ్రి ఏ డబుల్ సేవను చేస్తారు?
జవాబు:-
ఆత్మ మరియు శరీరము, రెండింటినీ పావనంగా కూడా చేస్తారు మరియు తమతోపాటు తిరిగి ఇంటికి కూడా తీసుకువెళ్తారు. చరిత్ర అనేది ఒక్క తండ్రిదే. మనుష్యులది కాజాలదు.
పాట:- ఓం నమఃశివాయ...
ఓం శాంతి. ఈ పాటను పిల్లలు విన్నారు.
భక్తి మార్గం వారు ఎవరైతే ఉంటారో,
వారు ఇటువంటి పాటలను పాడుతారు.
ఘోర అంధకారం నుండి ప్రకాశాన్ని కోరుకుంటారు మరియు దుఃఖము నుండి విడుదలయ్యేందుకు పిలుస్తూ ఉంటారు.
మీరు శివ వంశీ బ్రహ్మాకుమార-కుమారీలు.
ఇది అర్థం చేసుకోవలసిన విషయము.
ఇంతమంది పిల్లలు కుఖవంశావళి కాలేరు.
తప్పకుండా ముఖవంశావళియే అవుతారు.
శ్రీకృష్ణునికి ఇంతమంది రాణులు లేక పిల్లలు లేరు. గీతా భగవంతుడు రాజయోగము నేర్పుతారు,
కావున తప్పకుండా ముఖవంశావళియే అవుతారు.
ప్రజాపిత అన్న పదమైతే ప్రసిద్ధమైనది.
తండ్రి వచ్చి వీరి ముఖము ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని రచిస్తారు.
ప్రజాపిత అన్న పేరు తండ్రికే శోభిస్తుంది.
ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఆ తండ్రికి చెందినవారిగా అయ్యారు.
వారు శ్రీకృష్ణుడు కూడా భగవంతుడే,
శివుడు కూడా భగవంతుడే అని అనేస్తారు.
రుద్ర భగవానుడికి బదులుగా శ్రీకృష్ణుని పేరు వ్రాసేసారు.
శంకర-పార్వతి అని అంటారు కానీ రుద్ర-పార్వతి అని అనరు. శివశంకర మహాదేవా అని అంటారు.
ఇప్పుడు శ్రీకృష్ణుడిని రుద్రుడు లేక శంకరుడు అని అనరు. భక్తులు గానం చేస్తారు కానీ భగవంతుని గురించి తెలియదు.
భారత్ లో ఎవరైతే ఒకప్పుడు పూజ్యులుగా ఉండి ఇప్పుడు పూజారులుగా అయ్యారో వారే సత్యాతి-సత్యమైన భక్తులు.
వారిలోనూ నంబరువారుగా ఉన్నారు.
మీలో కూడా నంబరువారుగా ఉన్నారు.
మీరు బ్రాహ్మణులు,
వారు శూద్రులు.
దేవతా ధర్మం వారే చాలా దుఃఖితులవుతారు ఎందుకంటే వారు చాలా సుఖాన్ని కూడా చూసారు.
ఇప్పుడు మీరు ప్రతి ద్వారం వద్ద భ్రమించటమనేది అర్ధకల్పం కోసం ఆగిపోయింది.
ఈ రహస్యం కూడా బ్రాహ్మణులైన మీకే తెలుసు,
అది కూడా నంబరువారుగా.
ఎవరెవరు కల్పపూర్వము ఎంతెంత పురుషార్థం చేసారో అంతే ఇప్పుడూ చేస్తారు.
అలాగని డ్రామాలో ఏదుంటే అది అవుతుందని కాదు, పురుషార్థము యొక్క ప్రస్తావన కూడా వస్తుంది.
డ్రామా పిల్లల చేత పురుషార్థము చేయించవలసిందే.
ఎటువంటి పురుషార్థమో అటువంటి పదవి లభిస్తుంది.
కల్పపూర్వము కూడా ఈ విధంగా పురుషార్థం చేసామని మనకు తెలుసు.
ఇటువంటి అత్యాచారాలు జరిగాయి,
యజ్ఞంలో విఘ్నాలు కలిగాయి.
తండ్రి మళ్ళీ వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు.
కల్పపూర్వము కూడా ఇదే సమయంలో ఆంగ్లేయుల రాజ్యం ఉన్నప్పుడు వచ్చారు.
వారి నుండి కాంగ్రెస్ వారు రాజ్యం తీసుకున్నారు,
ఆ తర్వాత పాకిస్తాన్ ఏర్పడింది.
ఇది కల్పపూర్వము కూడా జరిగింది.
గీతలో ఈ విషయాలు లేవు. ఇది తప్పకుండా అదే సమయమని చివరికి అర్థం చేసుకుంటారు.
ఈశ్వరుడు వచ్చేసారు అని కొందరు భావిస్తారు.
మహాభారీ యుద్ధము జరిగినప్పుడు భగవంతుడు వచ్చారు అని అంటారు.
వారు చెప్పేది నిజమే కానీ పేరు మార్చేసారు.
రుద్రుడు అన్న పేరు తీసుకున్నా వారు చెప్పేది నిజమేనని భావించవచ్చు.
రుద్రుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించారు,
దాని ద్వారా ప్రపంచ విపత్తు తొలగింది.
ఇది కూడా మెల్లమెల్లగా మీ ద్వారా తెలుస్తుంది.
అందుకు ఇంకా కొద్దిగా సమయం ఉంది. లేదంటే ఇప్పుడు ఇక్కడ ఎంతటి గుంపు ఏర్పడుతుందంటే,
ఇక మీరు ఇక్కడ చదువుకోలేరు కూడా. ఆ గుంపులు ఏర్పడడమనేది నియమం పరంగా ఇక్కడ లేదు. గుప్త వేషంలో పని నడుస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఎవరైనా గొప్ప వ్యక్తి ఇక్కడకు వస్తే వీరి తల తిరిగిపోయింది అని భావిస్తారు.
ఇక్కడ తండ్రి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు.
దేవతా ధర్మాన్ని అయితే భగవంతుడు వచ్చి రచిస్తారు కదా. వారు కొత్త ప్రపంచాన్ని రచించేందుకు,
భక్తుల విపత్తులను తొలగించేందుకు ఇప్పుడు వచ్చారు.
వినాశనం తర్వాత ఏ దుఃఖము ఉండదు.
అక్కడ సత్యయుగంలో భక్తులు ఉండరు.
అలాగే దుఃఖితులుగా అయ్యే కర్మలు కూడా ఏవీ చేయరు.
(బొంబాయి నుండి రమేష్ భాయ్ ఫోన్ వచ్చింది).
బాప్ దాదా వచ్చేస్తే పిల్లలు ఉదాసీనులవుతారు.
ఏ విధంగానైతే పతి విదేశాలకు వెళ్తే,
ఆ స్త్రీ తలంపులో ఏడుస్తుంది.
అది దైహికమైన సంబంధము.
ఇక్కడ బాబాతో ఆత్మిక సంబంధముంది.
బాబా నుండి విడిపోతే ప్రేమాశ్రువులు వస్తాయి.
సేవాధారీ పిల్లలు ఎవరైతే ఉన్నారో,
తండ్రికి వారి పట్ల గౌరవం ఉంది. సుపుత్రులకు మళ్ళీ తండ్రి పట్ల గౌరవం ఉంటుంది.
శివబాబాతో ఉన్నది చాలా ఉన్నతోన్నతమైన సంబంధము.
వారికన్నా ఉన్నతమైన సంబంధము ఇంకేదీ ఉండదు.
శివబాబా అయితే పిల్లలను తమకన్నా ఉన్నతంగా తయారుచేస్తారు.
మీరు పావనులుగా అవుతారు కానీ, తండ్రి సమానంగా సదా పావనులుగా అవ్వలేరు.
పావన దేవతలుగా అయితే అవుతారు.
తండ్రి జ్ఞానసాగరుడు.
మనం ఎంత విన్నా కానీ జ్ఞానసాగరునిగా అవ్వలేము.
వారు జ్ఞానసాగరుడు,
ఆనందసాగరుడు,
పిల్లలను ఆనందమయంగా తయారుచేస్తారు.
మిగిలినవారు కేవలం పేరు పెట్టించుకుంటారు.
ఈ సమయంలో ప్రపంచంలో భక్త మాల చాలా పెద్దదిగా ఉంది. మీది 16108 మాల. భక్తులైతే కోట్లాదిమంది ఉన్నారు.
ఇక్కడ భక్తి విషయం లేదు. జ్ఞానం ద్వారానే సద్గతి లభిస్తుంది.
ఇప్పుడు మిమ్మల్ని భక్తి సంకెళ్ళ నుండి విడిపించడం జరుగుతుంది.
బాబా అంటారు,
భక్తులందరిపై ఎప్పుడైతే విపత్తు కలుగుతుందో అప్పుడు నేను అందరికీ గతి, సద్గతులను ఇచ్చేందుకు రావలసి ఉంటుంది.
స్వర్గంలోని దేవతలు తప్పకుండా ఇటువంటి కర్మలు చేసి ఉంటారు,
అందుకే ఇంతటి ఉన్నత పదవిని పొందారు.
మనుష్యుల కర్మలైతే జరుగుతూనే ఉంటాయి.
కానీ అక్కడ కర్మలకు పశ్చాత్తాపపడరు.
ఇక్కడ కర్మలు వికర్మలుగా అవుతాయి ఎందుకంటే మాయ ఉంది. అక్కడ మాయ ఉండదు.
మీరు వికర్మాజీతులుగా అవుతారు,
ఏ పిల్లలకైతే ఇప్పుడు కర్మ, అకర్మ,
వికర్మల గతిని అర్థం చేయిస్తానో,
వారే వికర్మాజీతులుగా అవుతారు.
కల్పపూర్వం కూడా పిల్లలైన మీకు రాజయోగం నేర్పించాను,
దానినే ఇప్పుడు కూడా నేర్పిస్తున్నాను.
కాంగ్రెస్ వారు ఆంగ్లేయులను పంపించివేసి రాజుల నుండి రాజ్యాలను తీసేసుకున్నారు మరియు రాజు అన్న పేరునే మాయం చేసేసారు.
5000 సంవత్సరాల క్రితం భారత్ రాజ్యస్థానముగా ఉండేది,
లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది.
దేవతల రాజ్యం ఉన్నప్పుడు పరిస్తాన్ గా ఉండేది.
తప్పకుండా వారికి భగవంతుడే రాజయోగం నేర్పించి ఉంటారు,
అందుకే వారికి భగవతీ,
భగవాన్ అన్న పేరు వచ్చింది.
కానీ,
ఇప్పుడు స్వయములో జ్ఞానముంది కావున మనము భగవతీ,
భగవాన్ అని అనలేము.
లేదంటే యథా రాజా-రాణి తథా ప్రజా కూడా భగవతీ,
భగవాన్ గా ఉండాలి.
కానీ అలా జరగజాలదు.
లక్ష్మీ-నారాయణుల పేరును కూడా ప్రజల్లో ఎవ్వరూ తమకు పెట్టుకోలేరు,
ఆ నియమము లేదు. విదేశాలలో కూడా రాజు పేరును ఎవ్వరూ తమపై పెట్టుకోరు.
వారిపై ఎంతో గౌరవము ఉంచుతారు.
కావున
5000 సంవత్సరాల క్రితం తండ్రి వచ్చారని పిల్లలు అర్థం చేసుకుంటారు.
ఇప్పుడు కూడా తండ్రి దైవీ రాజ్యస్థానాన్ని స్థాపన చేయడానికి వచ్చారు.
శివబాబా రావడం కూడా ఇప్పుడే జరిగింది.
వారే పాండవుల పతి, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు. తండ్రి తిరిగి తీసుకువెళ్ళేందుకు మరియు కొత్త సత్యయుగ ప్రపంచాన్ని రచించేందుకు పండాగా అయి వచ్చారు.
కావున తప్పకుండా బ్రహ్మా ద్వారానే బ్రాహ్మణులను రచిస్తారు.
ముఖ్యమైన గీతనే ఖండితం చేసేసారు.
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు,
నేను శ్రీకృష్ణుడిని కాను. నన్ను రుద్రుడు అని, సోమనాథుడు అని అనవచ్చు.
మీకు జ్ఞానమనే సోమ రసాన్ని తాగిస్తున్నాను.
అంతేకానీ యుద్ధాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. మీకు యోగబలంతో రాజ్యం యొక్క వెన్న లభిస్తుంది.
శ్రీకృష్ణుడికి వెన్న తప్పకుండా లభిస్తుంది.
వీరు శ్రీకృష్ణుని అంతిమ జన్మలోని ఆత్మ. వీరికి
(బ్రహ్మా,
సరస్వతులకు)
తండ్రి ఎటువంటి కర్మలను నేర్పిస్తున్నారంటే వాటి ద్వారా వీరు భవిష్యత్తులో లక్ష్మీ-నారాయణులుగా అవుతారు.
ఈ లక్ష్మీ-నారాయణులే బాల్యంలో రాధే-కృష్ణులు,
కావుననే లక్ష్మీ-నారాయణులతోపాటు రాధే-కృష్ణుల చిత్రాన్ని కూడా చూపించారు.
అంతేకానీ వీరి మహిమ ఏమీ లేదు. చరిత్ర అనేది ఒక్క గీతా భగవానుడిదే.
ఆ శివబాబా పిల్లలకు భిన్న-భిన్న సాక్షాత్కారాలను కలిగిస్తారు.
అంతేకానీ మనుష్యులకు చరిత్ర ఏమీ లేదు. క్రైస్ట్ మొదలైనవారు కూడా వచ్చి ధర్మస్థాపన చేసారు,
ఆ విధంగా అందరూ తమ పాత్రను అభినయించవలసిందే,
ఇందులో చరిత్ర యొక్క విషయమేమీ లేదు. వారు ఎవ్వరికీ గతిని ఇవ్వలేరు.
ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు,
నేను పిల్లలైన మీకు డబల్ సేవ చేయడానికి వచ్చాను,
దీని ద్వారా మీ ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రంగా అవుతాయి.
అందరినీ తిరిగి ఇల్లు అయిన ముక్తిధామానికి తీసుకువెళ్తాను.
మళ్ళీ అక్కడి నుండి మీ-మీ పాత్రలను అభినయించేందుకు వస్తారు.
పిల్లలకు ఎంత బాగా అర్థం చేయిస్తారు.
ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రంపై అర్థం చేయించడం చాలా సహజము.
త్రిమూర్తి మరియు శివబాబా చిత్రాలు కూడా ఉన్నాయి.
కొందరు త్రిమూర్తి ఉండకూడదు అని అంటారు,
అలాగే కొందరు శ్రీకృష్ణుని చిత్రంలో
84 జన్మల కథ ఉండకూడదు అని అంటారు.
కానీ మనం నిరూపించి చెప్తాము,
తప్పకుండా మొదటి నంబరు వారైన శ్రీకృష్ణుడు అందరికన్నా ఎక్కువ జన్మలు తీసుకోవలసి ఉంటుంది అని. కొత్త-కొత్త పాయింట్లు అయితే రోజూ వస్తాయి,
కానీ ధారణ కూడా జరగాలి.
లక్ష్మీ-నారాయణుల చిత్రంపై అర్థం చేయించడం అన్నింటికన్నా సహజము.
మనుష్యులు తమకు తాముగా ఏ చిత్రాన్ని అర్థం చేసుకోరు.
తప్పుడు చిత్రాలను తయారుచేస్తారు.
నారాయణుడికి రెండు భుజాలు ఉంటే, లక్ష్మికి నాలుగు భుజాలను చూపిస్తారు.
సత్యయుగంలో ఇన్ని భుజాలు ఉండవు.
సూక్ష్మవతనంలోనైతే బ్రహ్మా,
విష్ణు,
శంకరులే ఉంటారు.
వారికి కూడా ఇన్ని భుజాలు ఉండవు.
మూలవతనంలో ఉన్నదే నిరాకారీ ఆత్మలు.
మరి ఈ 8-10 భుజాలవారు ఎక్కడ ఉంటారు.
మనుష్య సృష్టిలో ఉండే మొట్టమొదటివారు లక్ష్మీ-నారాయణులు,
వారు రెండు భుజాలు కలవారు.
కానీ వారికి నాలుగు భుజాలను చూపించారు.
నారాయణుడిని నల్లగా,
లక్ష్మిని తెల్లగా చూపిస్తారు.
మరి వారికి జన్మించే పిల్లలు ఎలా ఉంటారు మరియు ఎన్ని భుజాలు కలవారిగా ఉంటారు?
కొడుకుకు నాలుగు భుజాలు,
కూతురుకు రెండు భుజాలు ఉంటాయా?
ఇటువంటి ప్రశ్నలను మీరు అడగవచ్చు.
మాకు శివబాబాయే మురళి వినిపిస్తున్నారు అని ఎల్లప్పుడూ భావించండి అని పిల్లలకు అర్థం చేయించారు.
ఒక్కోసారి వీరు (బ్రహ్మా)
కూడా వినిపిస్తారు.
శివబాబా అంటారు,
నేను మార్గదర్శకునిగా అయి వచ్చాను.
ఈ బ్రహ్మా నాకు పెద్ద కొడుకు.
త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు.
త్రిమూర్తీ శంకర లేక విష్ణువు అని అనరు. మహాదేవ్ అని శంకరుడినే అంటారు.
మరి త్రిమూర్తి బ్రహ్మా అని ఎందుకంటారు?
వీరు ప్రజలను రచించారు కావున వీరు శివబాబాకు యుగళ్ గా అవుతారు.
శంకరుడిని లేక విష్ణువును యుగళ్ అని అనరు. ఇవి అర్థం చేసుకోవలసిన చాలా అద్భుతమైన విషయాలు.
ఇక్కడ కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి.
కేవలం ఇందులోనే శ్రమ ఉంది. ఇప్పుడు మీరు ఎంత తెలివైనవారిగా అయ్యారు.
అనంతమైన తండ్రి ద్వారా మీరు అనంతమైన యజమానులుగా అవుతారు.
ఈ భూమి, ఆకాశము అన్నీ మీవైపోతాయి.
బ్రహ్మాండము కూడా మీదైపోతుంది.
ఆల్మైటీ అథారిటీ రాజ్యం ఉంటుంది.
ఒకే గవర్నమెంట్ ఉంటుంది.
సూర్యవంశమువారి గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రవంశీయులు లేరు. మళ్ళీ చంద్రవంశీయులు ఉన్నప్పుడు సూర్యవంశీయులు ఉండరు.
అది గతించిపోయింది.
డ్రామా మారిపోయింది.
ఇవి చాలా అద్భుతమైన విషయాలు.
పిల్లలకు సంతోషపు పాదరసం ఎంతగా పైకెక్కాలి.
అనంతమైన తండ్రి నుండి మనం అనంతమైన వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము.
ఆ పతిని ఎంతగా తల్చుకుంటారు.
వీరు అనంతమైన రాజ్యాధికారాన్ని ఇచ్చేవారు.
ఇటువంటి పతులకే పతి అయినవారిని ఎంతగా స్మృతి చేయాలి.
ఎంత భారీ ప్రాప్తి లభిస్తుంది.
అక్కడ మీరు ఎవరి నుండి ఎప్పుడూ యాచించరు.
అక్కడ పేదవారు ఉండరు.
అనంతమైన తండ్రి భారత్ యొక్క జోలిని నింపుతారు.
లక్ష్మీ-నారాయణుల రాజ్యాన్ని స్వర్ణయుగము అని అంటారు.
ఇప్పుడు ఇది ఇనుపయుగము,
ఎంత తేడా ఉందో చూడండి.
తండ్రి అంటారు,
నేను పిల్లలకు రాజయోగం నేర్పిస్తున్నాను.
మీరే దేవీ-దేవతలుగా ఉండేవారు,
తర్వాత క్షత్రియులుగా,
వైశ్యులుగా,
శూద్రులుగా అయ్యారు.
ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు,
తిరిగి మళ్ళీ దేవతలుగా అవుతారు.
ఈ
84 జన్మల చక్రాన్ని మీరు స్మృతి చేయండి.
చిత్రాలపై అర్థం చేయించడం చాలా సహజము.
దేవీ-దేవతల రాజ్యం ఉన్నప్పుడు ఇంకే రాజ్యమూ ఉండేది కాదు. ఒకే రాజ్యం ఉండేది,
చాలా కొద్దిమంది ఉండేవారు.
దానిని స్వర్గము అని అంటారు,
అక్కడ పవిత్రత కూడా ఉండేది,
సుఖ-శాంతులు కూడా ఉండేవి.
పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ కిందకు వచ్చారు.
84 జన్మలను కూడా వీరే తీసుకున్నారు,
వీరే తమోప్రధానంగా అవుతారు.
మళ్ళీ వారే సతోప్రధానంగా అవ్వాలి.
సతోప్రధానంగా ఎలా అవుతారు,
తప్పకుండా నేర్పించేవారు కావాలి.
తండ్రి తప్ప ఇంకెవ్వరూ నేర్పించలేరు.
శివబాబా వీరి అనేక జన్మల అంతిమంలో వీరిలోకి ప్రవేశిస్తారని మీకు తెలుసు.
ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
ఒక్క తండ్రితోనే సర్వ ఆత్మిక సంబంధాలనూ ఉంచుకోవాలి.
సేవాధారులైన పిల్లలపై గౌరవము ఉంచాలి.
తమ సమానంగా తయారుచేసే సేవను చేయాలి.
2.
అనంతమైన తండ్రి ద్వారా మనకు అనంతమైన విశ్వ రాజ్యభాగ్యము లభిస్తుంది.
భూమి,
ఆకాశము అన్నింటిపై మన అధికారము ఉంటుంది
- ఈ నషా మరియు సంతోషంలో ఉండాలి.
తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి.
వరదానము:-
బాలకుడు మరియు
యజమాని యొక్క
బ్యాలెన్స్ ద్వారా
పురుషార్థము మరియు
సేవలలో సదా
సఫలతా మూర్త్
భవ
సదా ఈ నషా ఉంచుకోండి - నేను అనంతమైన తండ్రి మరియు అనంతమైన వారసత్వానికి బాలకుడిని మరియు యజమానిని. కానీ ఎప్పుడైనా ఏదైనా సలహా ఇవ్వాలి, ప్లాన్ ఆలోచించాలి, కార్యము చేయాలి అంటే అక్కడ యజమానిగా అయి చేయండి మరియు ఎప్పుడైతే మెజారిటీ ద్వారా లేక నిమిత్తంగా ఉన్న ఆత్మల ద్వారా ఏ విషయమైనా ఫైనల్ చేయబడితే, ఆ సమయంలో బాలకునిగా అవ్వండి. ఏ సమయంలో సలహాను ఇచ్చేవారిగా అవ్వాలో, ఏ సమయంలో సలహాను స్వీకరించేవారిగా
అవ్వాలో - ఈ విధిని నేర్చుకుంటే పురుషార్థము
మరియు సేవ, రెండింటిలో సఫలురుగా ఉంటారు.
స్లోగన్:-
నిమిత్తులుగా మరియు నిర్మానచిత్తులుగా అయ్యేందుకు మనసు మరియు బుద్ధిని ప్రభువుకు అర్పించండి.
0 Comments