Header Ads Widget

Header Ads

TELUGU MURLI 27.01.23

 

27-01-2023  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 



Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - పారసబుద్ధి కలవారిగా అయ్యేందుకు తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని బాగా అర్థం చేసుకోవాలి, స్వయంలో ధారణ చేసి ఇతరుల చేత చేయించాలి’’

ప్రశ్న:-

ఒక్క రహస్యము చాలా గుహ్యమైనది, గూఢమైనది మరియు అర్థం చేసుకోవలసినది?

జవాబు:-

నిరాకారుడైన తండ్రి అందరికీ మాత, పితగా ఎలా అవుతారు, వారు సృష్టి రచనను విధంగా చేస్తారు, ఇది చాలా గుహ్యమైన మరియు గూఢమైన రహస్యము. నిరాకారుడైన తండ్రి మాత లేకుండా సృష్టినైతే రచించలేరు. వారు విధముగా శరీరాన్ని ధారణ చేసి, వారిలోకి ప్రవేశించి, వారి ముఖము ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటారు, బ్రహ్మా తండ్రి కూడా, అలాగే తల్లి కూడా ఎలా అవుతారు - ఇది బాగా అర్థం చేసుకుని స్మరించవలసిన లేక స్మృతిలో ఉంచుకోవలసిన విషయము.

పాట:-  నీవే తల్లివి... (తుమ్హీ హో మాతా...) 

ఓం శాంతి. ఎవరినైతే మాత-పిత అని అంటారో, అక్కడ తప్పకుండా తండ్రియే ఆజ్ఞను ఇస్తారు. ఇక్కడైతే మాత, పిత కంబైన్డ్ గా ఉన్నారు. విషయం అర్థం చేసుకోవడం మనుష్యులకు చాలా కష్టము మరియు ఇదే అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయము. నిరాకార పరమపిత పరమాత్మ, ఎవరినైతే తండ్రి అని అంటారో, వారిని తల్లి అని కూడా అంటారు, ఇది అద్భుతమైన విషయము. పరమపిత పరమాత్మ మనుష్య సృష్టిని రచిస్తారు, కావున తల్లి తప్పకుండా కావాలి. విషయం చాలా గుహ్యమైనది, ఇంకెవరి బుద్ధిలోకీ ఇదెప్పుడూ రాదు. ఇప్పుడు వారు అందరికీ తండ్రి, తల్లి కూడా తప్పకుండా కావాలి. తండ్రి నిరాకారుడు, మరి తల్లిగా ఎవరిని ఉంచాలి? వివాహమైతే చేసుకొని ఉండరు. ఇవి చాలా గుహ్యమైన, గూఢమైన అర్థం చేసుకోవలసిన విషయాలు. కొత్త-కొత్తవారైతే అర్థం చేసుకోలేరు. పాతవారు కూడా కష్టం మీద అర్థం చేసుకుంటారు మరియు వాటి స్మృతిలో ఉంటారు. పిల్లలే తల్లి, తండ్రుల స్మృతిలో ఉంటారు కదా. భారత్ లో లక్ష్మీ-నారాయణులను కూడా నీవే తల్లివి, తండ్రివి... అని అంటారు. అలాగే రాధే-కృష్ణుల ఎదురుగా వెళ్ళి కూడా మీరే తల్లి, తండ్రి... అని అంటారు. ఇప్పుడు వారైతే యువరాజు, యువరాణి. వారిని మాత, పిత అని బుద్ధిహీనులు కూడా అనరు. మనుష్యులకైతే అలా అనడం అలవాటైపోయింది. కానీ విషయం అతీతమైనది. లక్ష్మీ-నారాయణులనైతే వారి పిల్లలే మీరు మాత, పిత... అని అంటారు. ఎవరివద్దనైతే చాలా ధనం ఉంటుందో, మహళ్ళు ఉంటాయో వారు స్వర్గములో ఉన్నారని మనుష్యులు భావిస్తారు. మా తల్లి, తండ్రుల వద్ద చాలా సుఖము ఉందని వారి పిల్లలు అంటారు. తప్పకుండా ముందు జన్మలో ఏవో మంచి కర్మలు చేసి ఉంటారు. అచ్ఛా, నీవే తల్లివి, తండ్రివి... అని ఏదైతే గానం చేస్తారు, పరమపిత పరమాత్మ అయిన రచయిత ఒక్కరే, వారికి మనం పిల్లలము. వారు కూడా నిరాకారుడే. ఆత్మలమైన మనము కూడా నిరాకారులమే. కానీ, నిరాకారుడు మరి సృష్టిని ఎలా రచిస్తారు. మాత లేకుండా సృష్టి రచింపబడదు. సృష్టిని రచించడం ఒక అద్భుతము. ఒకటేమో పరమాత్మ కొత్త ప్రపంచానికి రచయిత. వారు పాత ప్రపంచములోకి వచ్చి కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కానీ ఎలా రచిస్తారు. ఇది చాలా గుహ్యమైన విషయము - నిరాకారుడిని మనము మాత, పిత అని అంటాము. నేను పిల్లలను దత్తత తీసుకుంటాను అని స్వయంగా తండ్రియే అర్థం చేయిస్తారు. గర్భము నుండి పిల్లలకు జన్మనిచ్చే విషయమే లేదు. ఇంత లెక్కలేనంతమంది పిల్లలు గర్భము నుండి ఎలా వెలువడుతారు. కావున నేను శరీరాన్ని ధారణ చేసి వీరి ముఖము ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటాను అని అంటారు. బ్రహ్మా మనుష్య సృష్టిని రచించే తండ్రి కూడా, అలాగే తల్లి కూడా. వీరి ముఖము ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటాను. విధంగా పిల్లలను దత్తత తీసుకోవడం కేవలం తండ్రి పని మాత్రమే. సన్యాసులైతే అలా చేయలేరు. వారికి జిజ్ఞాసులు, అనుచరులు, శిష్యులు ఉంటారు. కానీ ఇక్కడ ఇది రచన యొక్క విషయము. కావున తండ్రి వీరిలోకి ప్రవేశిస్తారు, ఇది ముఖవంశావళి, నీవే తల్లివి, తండ్రివి... అని అంటారు. కావున వీరే మాత అని నిరూపించబడుతోంది. తండ్రి వీరిలోకి ప్రవేశించి రచిస్తారు. వృద్ధాప్యంలో ఉన్న వీరు ప్రజాపిత అవుతారు మరియు వీరు వృద్ధ మాత కూడా అయినట్లు. వృద్ధులే కావాలి కదా. ఇప్పుడు పిల్లలు మాత, పితలను స్మృతి చేయవలసి ఉంటుంది. వీరికైతే ఆస్తి ఏమీ లేదు. మీరు వారసులుగా అవుతారు, కావుననే వీరిని బాప్ దాదా అని అంటారు. మీరు ప్రజాపిత బ్రహ్మా నుండి ఆస్తిని తీసుకునేది లేదు. దాదా (బ్రహ్మా) కూడా వారి నుండే తీసుకుంటారు. వీరిని దాదా అని కూడా మరియు మాత అని కూడా అంటారు. లేకపోతే మాత, పితలు అని ఎలా నిరూపించబడతారు. మాత, పితలు లేకుండా పిల్లలు ఎలా ఉంటారు - ఇది చాలా గుహ్యమైన, అర్థం చేసుకోవలసిన మరియు స్మరించవలసిన విషయము. బాబా, మీరు తండ్రి, మాత ద్వారా మేము జన్మ తీసుకున్నాము. తప్పకుండా వారసత్వము కూడా గుర్తుకు వస్తుంది. తండ్రినే స్మృతి చేయాలి. తండ్రి విధముగా పతిత ప్రపంచములోకి వస్తారు అనేది మీరు జ్ఞానము ద్వారా అర్థం చేసుకోగలరు. ఎవరిలోకైతే ప్రవేశిస్తానో వారు నాకు పుత్రుడు కూడా, మీకు తండ్రి కూడా అవుతారు, అలాగే తల్లి కూడా అవుతారు. మీరు పిల్లలవుతారు. కావున తండ్రిని స్మృతి చేయడం ద్వారా వారసత్వము లభిస్తుంది. తల్లిని స్మృతి చేయడం ద్వారా వారసత్వము లభించదు. నిరంతరం తండ్రిని స్మృతి చేయాలి. ఇకపోతే శరీరాన్ని మర్చిపోవాలి. ఇవి అర్థం చేసుకోవలసిన జ్ఞానం యొక్క విషయాలు.

తండ్రి పాత ప్రపంచములోకి వచ్చి కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. పాతదానిని అంతం చేస్తారు. లేకపోతే ఎవరు అంతం చేస్తారు. శంకరుని ద్వారా పాత ప్రపంచ వినాశనం అని కూడా అంటూ ఉంటారు - ఇది డ్రామాలో రచింపబడి ఉంది, కావుననే గాయనములోకి కూడా వస్తుంది. మన కొరకు కొత్త రాజధాని తయారవుతోందని పిల్లలైన మీకు తెలుసు. వినాశనం కోసం పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరు ఇంతమంది ఉన్నారు, అందరూ రాజ్య పదవిని పొందుతున్నారు. ఏదో అంధశ్రద్ధతో నమ్మేసారని కాదు. రాముడి సీత అపహరించబడ్డారని ఎవరో అంటే సత్యము అని అనేసారు. ఏదైనా విషయం అర్థం కాకపోతే అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. లేదంటే బుద్ధిహీనులుగా ఉన్నవారు బుద్ధిహీనులుగానే మిగిలిపోతారు. భక్తి మార్గంలోనైతే అల్పకాలికమైన సుఖము లభిస్తుంది. దాని ఫలము అదే జన్మలో లేక మరుసటి జన్మలో అల్పకాలికముగా లభిస్తుంది. తీర్థ యాత్రలకు వెళ్తారు, కొంత సమయము పవిత్రముగా ఉంటారు, పాపాలు చేయరు. దాన, పుణ్యాలు కూడా చేస్తారు, దీనిని కాకిరెట్టతో సమానమైన సుఖము అని అంటారు. ఇది పిల్లలైన మీరే అర్థం చేసుకోగలరు ఎందుకంటే మీరు కోతుల నుండి మారి మందిర యోగ్యులుగా అయ్యారు. సత్యయుగములో మీరు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు ఎందుకంటే అక్కడ పారసనాథుడు మరియు పారసనాథిని యొక్క రాజ్యము ఉండేది. బంగారు మహళ్ళు ఉండేవి. ఇప్పుడైతే రాళ్ళే రాళ్ళు ఉన్నాయి. పారసబుద్ధి కలవారి నుండి రాతిబుద్ధి కలవారిగా ఎవరు తయారుచేస్తారు? పంచ వికారాల రూపీ రావణుడు. ఎప్పుడైతే అందరూ రాతిబుద్ధి కలవారిగా అవుతారో అప్పుడే మళ్ళీ పారసబుద్ధి కలవారిగా తయారుచేసే తండ్రి వస్తారు. ఎంత సహజముగా అర్థం చేసుకొని అర్థం చేయిస్తారు. ఇది బీజము మరియు వృక్షము. మిగిలిన విస్తారమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు, ఇంకా అర్థం చేయిస్తారు కూడా. క్లుప్తంగా చెప్పాలంటే, తండ్రి నుండైతే వారసత్వము లభిస్తుందో తండ్రిని స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుంది. తల్లిని స్మృతి చేయవలసిన అవసరం లేదు. తండ్రి అంటారు, పిల్లలూ, నన్ను స్మృతి చేయండి. తప్పకుండా పిల్లలు తల్లి ద్వారా జన్మ తీసుకుని ఉంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు జన్మ తీసుకున్నారు. కావున మాతను కూడా వదిలేయండి, దేహధారులందరినీ వదిలేయండి ఎందుకంటే ఇప్పుడు తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. ఆత్మలమైన మనము ఆత్మిక తండ్రికి పిల్లలమని మరియు దైహిక మాతా-పితలకు కూడా పిల్లలుగా అయ్యామని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. అనంతమైన తండ్రి కొత్త సృష్టిని రచిస్తారు. భారత్ స్వర్గముగా ఉండేది కదా. లక్ష్మీ-నారాయణులు స్వర్గాధిపతులుగా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు. అనంతమైన తండ్రి అర్థం చేయిస్తారు, మీరు ప్రతి జన్మలోనూ హద్దు వారసత్వాన్ని తీసుకుంటూ వచ్చారు. నరకములో ఉండేదే హద్దు వారసత్వము. స్వర్గములో హద్దు వారసత్వము అని అనరు. అది అనంతమైన వారసత్వము ఎందుకంటే అనంతము అనగా మొత్తం విశ్వమంతటికీ యజమానులుగా ఉంటారు. ఇంకే ధర్మమూ ఉండదు. హద్దు వారసత్వము ద్వాపరం నుండి ప్రారంభమవుతుంది. సత్యయుగములో ఉన్నది అనంతమైన వారసత్వము. మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు. అక్కడ మీకు అనంతమైన రాజ్యాధికారము ఉంటుంది. యథా రాజా రాణి తథా ప్రజా. ప్రజా కూడా మేము మొత్తం సృష్టి అంతటికీ యజమానులము అని అంటారు. ఇప్పుడు ప్రజలు, మేము మొత్తం సృష్టి అంతటికీ యజమానులము అని అనరు. ఇప్పుడైతే హద్దులు ఎన్నో ఏర్పడ్డాయి. మా నీటి హద్దులోకి మీరు రావడానికి వీల్లేదు, భాగము మాది అని ఇక్కడివారు అంటారు. అక్కడి ప్రజలు, మేమూ విశ్వానికి యజమానులము, మా మహారాజు, మహారాణులైన లక్ష్మీ-నారాయణులు కూడా విశ్వానికి యజమానులు అని అంటారు. అక్కడ ఒకే రాజ్యము ఉంటుందని ఇప్పుడు మనము అర్థం చేసుకున్నాము. అది అనంతమైన రాజ్యాధికారము. భారత్ ఎలా ఉండేది అన్నది ఎవరి బుద్ధిలోనూ లేదు. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి అని పిల్లలైన మీకు ఇప్పుడు శిక్షణ లభిస్తుంది. మనము చెప్తున్నామంటే తప్పకుండా మనము తీసుకుంటున్నాము. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. 21 తరాల రాజ్య భాగ్యము అన్న గాయనము కూడా ఉంది. తరము అని ఎందుకు అంటారు? ఎందుకంటే అక్కడ వృద్ధులుగా అయ్యాకే మరణిస్తారు. అక్కడ అకాల మృత్యువు ఉండదు. మాతలు ఎప్పుడూ విధవలుగా అవ్వరు. ఏడవడం, రోదించడం ఉండదు. ఇక్కడ ఎంతగా ఏడుస్తూ, రోదిస్తూ ఉంటారు. అక్కడ పిల్లలు కూడా ఏడవవలసిన అవసరం ఉండదు. ఇక్కడైతే నోరు పెద్దగా అవ్వాలని పిల్లలను ఏడిపిస్తూ ఉంటారు. అక్కడ అటువంటి విషయమేదీ ఉండదు. ఇప్పుడు మనం అనంతమైన తండ్రి నుండి కల్పపూర్వము వలె వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలందరూ అర్థం చేసుకున్నారు. 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడిక వెళ్ళాలి. నిరంతరం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. మన్మనాభవ అర్థము ఎంత సహజమైనది. గీత అసత్యమైనదే, కానీ అందులో ఎంతో కొంత సత్యముంది కదా. మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి, శ్రీకృష్ణుడైతే నన్ను స్మృతి చేయండి, మీరు నా వద్దకు రావాలి అని ఇలా అనరు. పరమాత్మ ఇప్పుడు సర్వాత్మలతో అంటారు, ఆత్మలైన మీరందరూ దోమల గుంపు వలె రావాలి. కావున తప్పకుండా ఆత్మ, పరమాత్మ అయిన తండ్రినే అనుసరిస్తుంది. శ్రీకృష్ణుడైతే - ఆత్మనైన నన్ను స్మృతి చేయండి అని అనరు. వారి పేరే కృష్ణుడు. ఆత్మా అలా అనలేదు, ఆత్మలందరూ సోదరులవుతారు. నేను నిరాకారుడను, పరమాత్మనైన నా పేరు శివ అని తండ్రియే అంటారు. మరి శ్రీకృష్ణుడు అలా ఎలా అనగలరు, వారికైతే శరీరముంది. శివబాబాకైతే తమ శరీరము లేదు. శివబాబా అంటారు, పిల్లలూ, మీకు కూడా మొదట మీ శరీరము ఉండేది కాదు. ఆత్మయైన మీరు నిరాకారిగా ఉండేవారు, తర్వాత శరీరం తీసుకున్నారు. ఇప్పుడు మీకు డ్రామా ఆదిమధ్యాంతాల స్మృతి కలిగింది. తండ్రి సృష్టిని విధముగా, ఎప్పుడు మరియు ఎందుకు రచిస్తారు? సృష్టి అయితే ఉంది కదా. బ్రహ్మా ద్వారా కొత్త సృష్టిని రచించారు అన్న గాయనము కూడా ఉంది. మరి తప్పకుండా పాత సృష్టి నుండే కొత్త సృష్టిని రచించి ఉండవచ్చు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసారు అని కూడా అంటారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని చదువు ద్వారా మనుష్యులనుండి దేవతలుగా తయారుచేస్తాను. పూజ్య దేవతలు ఉండేవారు, తర్వాత పూజారులుగా అయిపోయారు. 84 జన్మలు ఎలా తీసుకుంటారు అనేది మనుష్యులైతే అర్థం చేసుకోరు. అందరూ 84 జన్మలు తీసుకుంటారా? సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది. మరి అందరూ 84 జన్మలను ఎలా తీసుకుంటారు! తప్పకుండా ఎవరైతే చివర వస్తారో వారి జన్మలు తక్కువగా ఉంటాయి. 25-50 సంవత్సరాలలో 84 జన్మలు ఎలా తీసుకుంటారు? ఇది స్వదర్శన చక్రము. వారు స్వదర్శన చక్రాన్ని ఒక ఆయుధం రూపంలో తయారుచేసారు. మేము 84 జన్మలను - విధముగా అనుభవించాము అని ఆత్మలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది. ఇప్పుడు చక్రము పూర్తవుతుంది, మళ్ళీ డ్రామా పునరావృతమవ్వనున్నది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మము తప్పకుండా కావాలి, అది కనుమరుగైపోయింది.

గాడ్ ఫాదర్, దయ చూపించండి అని మనుష్యులు అంటారు. కావున తండ్రి అంటారు, అచ్ఛా, మిమ్మల్ని దుఃఖము నుండి విముక్తులను చేసి సుఖవంతులుగా తయారుచేస్తాను. అందరినీ సుఖవంతులుగా తయారుచేయడమే తండ్రి పని. అందుకే నేను కల్ప-కల్పమూ వస్తాను, వచ్చి భారత్ ను వజ్ర సమానముగా తయారుచేస్తాను. చాలా సుఖవంతముగా తయారుచేస్తాను. మిగిలిన వారందరినీ ముక్తిధామానికి పంపిస్తాను. భక్తులు భగవంతుడిని కలుసుకోవాలని కోరుకుంటారు ఎందుకంటే సుఖము కాకిరెట్టతో సమానమైనదని సన్యాసులు అంటారు మరియు ఇంకొకటి, డ్రామా ఆటలోకి మళ్ళీ అసలు రానే రాకూడదని అంటారు. మోక్షం పొందాలని అనుకుంటారు. ఇప్పుడు మోక్షమైతే లభించేది లేదు. ఇది తయారై-తయారుచేయబడిన డ్రామా. మొత్తం సృష్టి యొక్క చరిత్ర-భౌగోళికముల గురించి, ఇది ఎలా తిరుగుతుంది అన్నదానిని గురించి పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. దీనినే స్వదర్శన చక్రము అని అంటారు. స్వదర్శన చక్రము ద్వారా అందరి శిరస్సులను ఖండించినట్లుగా ఏదైతే చూపిస్తారో, కంస వధ నాటకాన్ని ఏదైతే చూపిస్తారో నిజానికి అవేవీ జరుగలేదు. ఇక్కడ హింస యొక్క మాటే లేదు. ఇది చదువు. ఇక్కడ చదవాలి, తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు ఎవరినైనా హతమారుస్తారా ఏమిటి? అది హద్దులోని వారసత్వము, ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునే విషయము. గీతలో యుద్ధాలు మొదలైనవాటి విషయాలను ఎన్ని వ్రాసేసారు. అవేవీ జరుగలేదు. నిజానికి పాండవుల యుద్ధము ఎవరితోనూ జరుగదు. ఇక్కడ యోగబలం ద్వారా పిల్లలైన మీరు అనంతమైన తండ్రి నుండి కొత్త ప్రపంచం కొరకు వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇందులో యుద్ధం యొక్క విషయమేమీ లేదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి నుండి 21 తరాల వారసత్వాన్ని తీసుకునేందుకు నిరంతరం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేసే పురుషార్థము చేయాలి. దేహధారినీ స్మృతి చేయకూడదు.

2. బుద్ధిలో స్వదర్శన చక్రము తిరుగుతూ ఉండాలి. మనం పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ పూజారులుగా అయ్యాము, 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము, మళ్ళీ డ్రామా పునరావృతమవ్వనున్నది, మనం పూజారుల నుండి పూజ్యులుగా అవ్వాలి - స్మృతియే స్వదర్శన చక్రము.

వరదానము:-

సమానత ద్వారా సమీపత యొక్క సీట్ తీసుకొని ఫస్టు డివిజన్ లోకి వచ్చే విజయీ రత్న భవ

సమయం యొక్క సమీపతతో పాటు ఇప్పుడు స్వయాన్ని తండ్రి సమానంగా చేసుకోండి. సంకల్పము, మాట, కర్మ, సంస్కారము మరియు సేవ అన్నింటిలో తండ్రి సమానంగా అవ్వడం అనగా సమీపంగా రావడము. ప్రతి సంకల్పంలో తండ్రి తోడును, సహయోగాన్ని, స్నేహాన్ని అనుభవం చేయండి. సదా తండ్రి తోడును మరియు చేతిలో చేతిని అనుభవం చేస్తూ ఉంటే ఫస్ట్ డివిజన్ లోకి వస్తారు. నిరంతర స్మృతి మరియు సంపూర్ణ స్నేహము ఒక్క తండ్రితోనే ఉంటే విజయ మాలలోని విజయీ రత్నాలుగా అవుతారు. ఇప్పటికీ అవకాశము ఉంది. టూ లేట్ అనే బోర్డు ఇంకా పెట్టబడలేదు.

స్లోగన్:-

సుఖదాతగా అయి అనేక ఆత్మలను దుఃఖము, అశాంతి నుండి ముక్తులుగా చేసే సేవ చేయడమే సుఖదేవునిగా అవ్వడము.

 Download PDF

Post a Comment

0 Comments