Header Ads Widget

Header Ads

TELUGU MURLI 26.01.23

 

26-01-2023  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 

Download PDF


Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - అమృతవేళ యొక్క శాంతమయమైన మరియు శుద్ధమైన వాయుమండలంలో మీరు దేహ సహితంగా అన్నింటినీ మరచి నన్ను స్మృతి చేయండి, సమయంలో స్మృతి చాలా బాగుంటుంది’’

ప్రశ్న:-

తండ్రి యొక్క శక్తిని పొందేందుకు పిల్లలైన మీరు అన్నింటికన్నా ఉత్తమమైన కర్మను చేస్తారు?

జవాబు:-

అన్నింటికన్నా ఉత్తమ కర్మ - తండ్రిపై తమ సర్వస్వాన్ని (తనువు, మనస్సు, ధనము సహితముగా) అర్పణ చేయడము. ఎప్పుడైతే మీరు సర్వస్వాన్ని అర్పణ చేస్తారో అప్పుడు తండ్రి మీకు రిటర్న్ లో ఎంతటి శక్తిని ఇస్తారంటే, దాని ద్వారా మీరు మొత్తం విశ్వమంతటిపై సుఖ-శాంతులతో కూడిన స్థిరమైన, అఖండ రాజ్యాన్ని పరిపాలించగలుగుతారు.

ప్రశ్న:-

తండ్రి మనుష్యమాత్రులెవ్వరూ నేర్పించలేని సేవను పిల్లలైన మీకు నేర్పించారు?

జవాబు:-

ఆత్మిక సేవ. మీరు ఆత్మలను వికారాల రోగము నుండి విడిపించేందుకు జ్ఞానమనే ఇంజెక్షన్ ను ఇస్తారు. మీరు ఆత్మిక సమాజ సేవకులు. మనుష్యులు భౌతికమైన సేవ చేస్తారు కానీ, జ్ఞానమనే ఇంజెక్షన్ ను ఇచ్చి ఆత్మను జాగృతీ జ్యోతిగా తయారుచేయలేరు. సేవను తండ్రియే పిల్లలకు నేర్పిస్తారు.

ఓం శాంతి. భగవానువాచ - మనుష్యులను ఎప్పుడూ కూడా భగవంతునిగా సంబోధించడానికి వీల్లేదని అర్థం చేయించడం జరిగింది. ఇది మనుష్య సృష్టి మరియు బ్రహ్మా, విష్ణు, శంకరులు సూక్ష్మవతనంలో ఉంటారు. శివబాబా ఆత్మలకు అవినాశీ తండ్రి. వినాశీ శరీరపు తండ్రి అయితే వినాశీయే. ఇది అందరికీ తెలిసినదే. మీ వినాశీ శరీరానికి తండ్రి ఎవరు అని, ఆత్మకు తండ్రి ఎవరు అని అడగడం జరుగుతుంది. వారు పరంధామంలో ఉంటారని ఆత్మకు తెలుసు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని దేహాభిమానులుగా ఎవరు తయారుచేసారు? దేహాన్ని రచించినవారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా ఎవరు తయారుచేస్తారు? ఆత్మల యొక్క అవినాశీ తండ్రి ఎవరైతే ఉన్నారో వారు. అవినాశీ అనగా ఆదిమధ్యాంతాలు లేనివారు. ఒకవేళ ఆత్మ మరియు పరమాత్మల విషయంలో ఆదిమధ్యాంతాలు అని అన్నట్లయితే మరి రచన యొక్క ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. వారిని అవినాశీ ఆత్మ, అవినాశీ పరమాత్మ అని పిలవడం జరుగుతుంది. ఆత్మ పేరు ఆత్మ. తప్పకుండా ఆత్మకు - నేను ఆత్మ అని తన గురించి తెలుసు. నా ఆత్మను దుఃఖపరచకండి అని, నేను పాపాత్మను అని - ఆత్మ అంటుంది. స్వర్గంలో ఎప్పుడూ ఆత్మలు పదాలను వాడరు. సమయంలోనే ఆత్మ పతితముగా ఉంది, అదే మళ్ళీ పావనంగా అవుతుంది. పతిత ఆత్మయే పావన ఆత్మను మహిమ చేస్తుంది. మనుష్య ఆత్మలెవరైతే ఉన్నారో వారందరూ పునర్జన్మలు తప్పకుండా తీసుకోవలసిందే. విషయాలన్నీ కొత్తవి. తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు - లేస్తూ, కూర్చుంటూ నన్ను స్మృతి చేయండి. ఇంతకుముందు మీరు పూజారులుగా ఉండేవారు. శివాయ నమః అని అనేవారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పూజారులైన మీరు ఎన్నో సార్లు నమస్కరించారు. ఇప్పుడు మిమ్మల్ని యజమానులుగా, పూజ్యులుగా తయారుచేస్తాను. పూజ్యులు ఎప్పుడూ నమః అని అనవలసిన అవసరం ఉండదు. పూజారులే నమః అనగా నమస్తే అని అంటారు. నమస్తే అంటే అర్థమే నమః చేయడము. తలను తప్పకుండా కొద్దిగా కిందకు వంచుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు నమః అని అనవలసిన అవసరం లేదు. లక్ష్మీ-నారాయణ నమః అని, లేక విష్ణు దేవతాయ నమః అని, లేక శంకర దేవతాయ నమః అని అనవలసిన అవసరం లేదు. పదాలు పూజారీ స్థితికి సంబంధించినవి. ఇప్పుడైతే మీరు మొత్తం సృష్టికి యజమానులుగా అవ్వాలి. తండ్రినే స్మృతి చేయాలి. వారు సర్వ సమర్థుడు అని కూడా అంటారు. వారు కాలుడికే కాలుడు, అకాలమూర్తి. వారు సృష్టి రచయిత. వారు జ్యోతిర్బిందు స్వరూపుడు. ఇంతకుముందు వారిని ఎంతో మహిమ చేసేవారు, మళ్ళీ సర్వవ్యాపి అని, కుక్క, పిల్లిలో కూడా ఉన్నారని అనడంతో మహిమ అంతా సమాప్తమైపోతుంది. సమయంలోని మనుష్యులే పాపాత్ములు అయినప్పుడు ఇక జంతువులకు ఏం మహిమ ఉంటుంది. విషయమంతా మనుష్యులదే. ఆత్మ అంటుంది - నేను ఆత్మను, ఇది నా శరీరము. విధంగా ఆత్మ ఒక బిందువో అలాగే పరమపిత పరమాత్మ కూడా బిందువే. వారు కూడా ఏమంటారంటే, నేను పతితులను పావనంగా తయారుచేయడానికి సాధారణ తనువులోకి వస్తాను. నేను వచ్చి పిల్లలకు వినమ్రుడైన సేవకునిగా అయి సేవ చేస్తాను. నేను ఆత్మిక సమాజ సేవకుడను. పిల్లలైన మీకు కూడా ఆత్మిక సేవను చేయడం నేర్పిస్తాను. మిగిలినవారంతా భౌతికమైన హద్దులోని సేవ చేయడం నేర్పిస్తారు. మీది ఆత్మిక సేవ, కావుననే జ్ఞాన అంజనాన్ని సద్గురువు ఇచ్చారు... అని అంటారు. సత్యమైన సద్గురువు వారు ఒక్కరే. వారే అథారిటీ. వారు వచ్చి సర్వాత్మలకు ఇంజెక్షన్ ను ఇస్తారు. ఆత్మలలోనే వికారాల వ్యాధి ఉంది. జ్ఞానపు ఇంజెక్షన్ ఇంకెవ్వరి వద్దా ఉండదు. పతితముగా అయ్యింది ఆత్మ, అంతేకానీ శరీరము కాదు, ఆత్మకు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది పంచ వికారాల కఠినమైన వ్యాధి. దీని కొరకు కావలసిన ఇంజెక్షన్ జ్ఞాన సాగరుడైన తండ్రి వద్ద తప్ప ఇంకెవ్వరి వద్దా లేదు. తండ్రి వచ్చి ఆత్మలతో మాట్లాడుతారు, హే ఆత్మలూ, మీరు జాగృతీ జ్యోతులుగా ఉండేవారు, తర్వాత మాయ మీపై నీడను వేసింది. అలా వేస్తూ-వేస్తూ మిమ్మల్ని అంధకార బుద్ధి కలవారిగా చేసేసింది. అంతేకానీ యుధిష్ఠరుడు, ధృతరాష్ట్రుల విషయమేమీ లేదు. ఇది రావణుని విషయము.

తండ్రి అంటారు, నేను సాధారణ రీతిలోనే వస్తాను. నన్ను ఒక్కరో మాత్రమే తెలుసుకోగలరు. శివ జయంతి వేరు, కృష్ణ జయంతి వేరు. పరమపిత పరమాత్మ శివుడిని శ్రీకృష్ణుడితో కలపలేరు. వారు నిరాకారుడు, వీరు సాకారుడు. తండ్రి అంటారు, నేను నిరాకారుడను, నా మహిమను ఏమని గానం చేస్తారంటే - హే పతితపావనా, వచ్చి భారత్ ను మళ్ళీ సత్యయుగ దైవీ రాజ్య స్థానముగా తయారుచేయండి. ఏదో ఒక సమయంలో దైవీ రాజ్య స్థానము ఉండేది. అది ఇప్పుడు లేదు. మళ్ళీ దానిని ఎవరు స్థాపన చేస్తారు? పరమపిత పరమాత్మయే బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. ఇప్పుడు పతిత ప్రజల రాజ్యం ప్రజలపై ఉంది, దీని పేరే స్మశానవాటిక. మాయ అంతం చేసేసింది. ఇప్పుడు మీరు దేహ సహితంగా, దేహపు సర్వ సంబంధాలను మరచి తండ్రినైన నన్ను స్మృతి చేయాలి. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయండి. కాస్త సమయం దొరికినా నన్ను స్మృతి చేసే పురుషార్థం చేయండి. ఒక్క యుక్తినే మీకు చెప్తాను. అన్ని వేళల కన్నా ఎక్కువగా మీకు నా స్మృతి అమృతవేళ సమయంలో కలుగుతుంది ఎందుకంటే అది శాంతమయమైన, శుద్ధమైన సమయము. సమయంలో దొంగలు దొంగతనాలు చేయరు, అలాగే ఎవరూ పాపాలు చేయరు, ఎవరూ వికారాలలోకి వెళ్ళరు. నిదురించే సమయంలోనే ఇవన్నీ మొదలుపెడతారు. దానిని ఘోర తమోప్రధాన రాత్రి అని అంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పిల్లలూ, గతించిందేదో గతించిపోయింది. భక్తి మార్గపు ఆట పూర్తయింది, ఇది మీ అంతిమ జన్మ అని ఇప్పుడు మీకు అర్ధం చేయించడం జరుగుతుంది. సృష్టి యొక్క వృద్ధి ఎలా జరుగుతుంది అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశం లేదు. వృద్ధి జరుగుతూనే ఉంటుంది. ఆత్మలైతే పైన ఉన్నారో వారు కిందకు రావాల్సిందే. ఎప్పుడైతే అందరూ వచ్చేస్తారో అప్పుడు వినాశనం ప్రారంభమవుతుంది. తర్వాత నంబరువారుగా అందరూ వెళ్ళాల్సిందే. గైడ్ అందరికన్నా ముందు ఉంటారు కదా.

తండ్రిని ముక్తిప్రదాత, పతితపావనుడు అని అంటారు. స్వర్గమే పావన ప్రపంచము. దానిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారుచేయలేరు. ఇప్పుడు మీరు తండ్రి శ్రీమతముపై భారత్ కు తనువు, మనస్సు, ధనములతో సేవ చేస్తారు. గాంధీజీ కూడా చేయాలనుకున్నారు కానీ చేయలేకపోయారు. డ్రామా రచనయే విధంగా ఉంది. అదే జరిగింది. పతిత రాజుల రాజ్యం అంతమవ్వవలసి ఉంది కావున వారి నామ-రూపాలే అంతమైపోయాయి. వారి ఆస్తుల యొక్క నామ-రూపాలు కూడా లేవు. లక్ష్మీ-నారాయణులే స్వర్గాధిపతులు అని స్వయమూ భావించేవారు. కానీ వారిని విధంగా ఎవరు తయారుచేసారు అన్నది ఎవరికీ తెలియదు. తప్పకుండా స్వర్గ రచయిత అయిన తండ్రి నుండే వారసత్వం లభించి ఉంటుంది, ఇంకెవ్వరూ ఇంతటి భారీ వారసత్వాన్ని ఇవ్వలేరు. విషయాలు శాస్త్రాల్లోనూ లేవు. గీతలో ఉన్నాయి కానీ పేరును మార్చేసారు. కౌరవులు మరియు పాండవులు ఇరువురికీ రాజ్యాన్ని చూపిస్తారు. కానీ, ఇక్కడ ఇరువురికీ రాజ్యం లేదు. ఇప్పుడు తండ్రి మళ్ళీ స్థాపన చేస్తారు. పిల్లలైన మీకు సంతోషమనే పాదరసం పైకి ఎక్కాలి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాము. మనం మధురమైన ఇంట్లో ఉండేవారము. ఫలానావారు నిర్వాణులయ్యారు లేక జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది లేక మోక్షాన్ని పొందారు అని వారు అంటారు. భారతవాసులకు స్వర్గము ఎంతో మధురముగా అనిపిస్తుంది, వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. మోక్షాన్ని అయితే ఎవరూ పొందరు అని తండ్రి అర్థం చేయిస్తారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే, వారు తప్పకుండా అందరికీ సుఖాన్నే ఇస్తారు. ఒకరు నిర్వాణధామంలో కూర్చొని మరియు ఇంకొకరు దుఃఖాన్ని అనుభవిస్తుంటే దానిని తండ్రి సహించలేరు. తండ్రి పతిత-పావనుడు. ఒకటి ముక్తిధామము పావనమైనది, రెండు జీవన్ముక్తిధామము పావనమైనది. మళ్ళీ ద్వాపరం తర్వాత అందరూ పతితులుగా అయిపోతారు. పంచ తత్వాలు మొదలైనవన్నీ తమోప్రధానంగా అయిపోతాయి, అప్పుడు తండ్రి వచ్చి పావనంగా తయారుచేస్తారు, మళ్ళీ అక్కడ పవిత్ర తత్వాలతో మీ శరీరము తెల్లగా అవుతుంది. ప్రకృతి సిద్ధమైన సౌందర్యము ఉంటుంది. అందులో ఆకర్షణ ఉంటుంది. శ్రీకృష్ణుడిలో ఎంతటి ఆకర్షణ ఉంటుంది. దాని పేరే స్వర్గమయినప్పుడు ఇంకేమిటి? పరమాత్ముని మహిమను ఎంతో చేస్తారు, అకాలమూర్తి... అని అంటారు, మళ్ళీ వారిని రాయిరప్పలలో తోసేసారు. తండ్రి గురించి ఎవరికీ తెలియదు, ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడే వచ్చి అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రి కూడా ఎప్పుడైతే పిల్లలను రచిస్తారో అప్పుడే పిల్లలకు తండ్రి జీవిత చరిత్రను గురించి తెలుస్తుంది. తండ్రి లేకుండా పిల్లలకు తండ్రి జీవిత చరిత్ర గురించి ఎలా తెలుస్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు, లక్ష్మీ-నారాయణులను వరించాలంటే కష్టపడవలసి ఉంటుంది. ఇది చాలా గొప్ప గమ్యము, ఇందులో చాలా భారీ సంపాదన ఉంది. సత్యయుగంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. పవిత్ర రాజ్య స్థానము ఉండేది, అది ఇప్పుడు అపవిత్రంగా అయిపోయింది. అందరూ వికారులుగా అయిపోయారు. ప్రపంచమే ఆసురీ ప్రపంచము. ఎంతో అవినీతి ఉంది. రాజ్యానికైతే శక్తి కావాలి. ఈశ్వరీయ శక్తి అయితే లేదు. ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది. ఎవరైతే దాన-పుణ్యాలు, మంచి కర్మలు చేస్తారో వారికి రాజ్య కుటుంబంలో జన్మ లభిస్తుంది. కర్మల యొక్క శక్తి ఉంటుంది. ఇప్పుడు మీరైతే చాలా ఉన్నతమైన కర్మలు చేస్తారు. మీరు మీ సర్వస్వాన్ని (తనువు-మనసు-ధనము) శివబాబాకు అర్పణ చేస్తారు, కావున శివబాబా కూడా సర్వస్వాన్ని పిల్లల ముందు అర్పణ చేయవలసి ఉంటుంది. మీరు వారి నుండి శక్తిని ధారణ చేసి సుఖ-శాంతుల అఖండమైన, స్థిరమైన రాజ్యాన్ని పరిపాలిస్తారు. ప్రజలలోనైతే శక్తీ లేదు. ధనం దానం చేసారు కావున ఎమ్మెల్యేలు మొదలైనవారిగా అయ్యారు అని అనరు. ధనం దానం చేయడం ద్వారా ధనవంతుల ఇంట్లో జన్మ లభిస్తుంది. ఇప్పుడైతే రాజరికమంటూ ఏదీ లేదు. ఇప్పుడు బాబా మీకు ఎంతటి శక్తిని ఇస్తున్నారు. మేము నారాయణుడిని వరిస్తాము, మేము మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నాము అని మీరు అంటారు. ఇవన్నీ కొత్త-కొత్త విషయాలు. నారదుని విషయం సమయానిదే. రామాయణము మొదలైనవి కూడా ఇప్పటివే. సత్య, త్రేతా యుగాలలో శాస్త్రాలూ ఉండవు. అన్ని శాస్త్రాలకూ సమయంతోటే సంబంధముంది. వృక్షంలో చూసినట్లయితే మఠాలు-మార్గాలు అన్నీ తర్వాత వస్తాయి. ముఖ్యమైనవి బ్రాహ్మణ వర్ణము, దేవతా వర్ణము, క్షత్రియ వర్ణము... బ్రాహ్మణుల పిలక ఎంతో ప్రసిద్ధమైనది. బ్రాహ్మణ వర్ణము అన్నింటికన్నా ఉన్నతమైనది, దీని గురించిన వర్ణన శాస్త్రాలలో లేదు. విరాట రూపంలో కూడా బ్రాహ్మణులను తొలగించివేసారు. డ్రామాలో విధంగా రచింపబడి ఉంది. ప్రపంచంలోని వారు భక్తి ద్వారా క్రిందికి దిగుతారని భావించరు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని అంటారు. ఎంతగానో పిలుస్తారు, దుఃఖంలో స్మరిస్తారు. అందులో మీరు అనుభవజ్ఞులే. అక్కడ దుఃఖం అన్న మాటే ఉండదు, ఇక్కడ అందరిలో క్రోధం ఉంది, ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు.

ఇప్పుడు మీరు శివాయ నమః అని అనరు. శివుడు మీ తండ్రి కదా. తండ్రిని సర్వవ్యాపి అని అనడంతో అందరూ సోదరులు అన్న విషయం దూరమైపోతుంది. భారత్ లో హిందూ, చైనీయులు భాయీ, భాయీ - చైనీయులు, ముస్లింలు భాయీ, భాయీ అని ఎంత బాగా అంటారు. అందరూ పరస్పరం సోదరులే కదా. ఒకే తండ్రికి పిల్లలు. మనం ఒకే తండ్రి పిల్లలమని సమయంలో మీకు తెలుసు. బ్రాహ్మణుల యొక్క వంశవృక్షము తిరిగి స్థాపనవుతుంది. బ్రాహ్మణ ధర్మం నుండి దేవీ-దేవతా ధర్మం వెలువడుతుంది. దేవీ-దేవతా ధర్మం నుండి క్షత్రియ ధర్మం వెలువడుతుంది. క్షత్రియ నుండి మళ్ళీ ఇస్లాం ధర్మం వెలువడుతుంది... వృక్షము ఇలా ఉంది కదా. తర్వాత బౌద్ధులు, క్రిస్టియన్లు వెలువడుతారు. అలా వృద్ధి చెందుతూ, చెందుతూ ఇంత పెద్ద వృక్షముగా అయిపోయింది. ఇది అనంతమైన వంశవృక్షము, అవి హద్దులోని వంశవృక్షాలు. ఎవరికైతే విస్తారమైన విషయాలు ధారణ అవ్వవో, వారికి తండ్రి సహజమైన యుక్తిని తెలియజేస్తారు - తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి, తద్వారా స్వర్గములోకి తప్పకుండా వస్తారు అని. కానీ ఉన్నత పదవిని పొందాలంటే దాని కొరకు పురుషార్థం చేయాలి. మీకు శివబాబా కూడా అర్థం చేయిస్తారని, అలాగే బాబా కూడా అర్థం చేయిస్తారని పిల్లలైన మీకు తెలుసు. అదే నా బుద్ధిలోనూ, మీ బుద్ధిలోనూ ఉంది. మనం శాస్త్రాలు మొదలైనవి చదివి ఉన్నా కానీ వాటన్నింటి వల్ల భగవంతుడేమీ లభించరని మనకు తెలుసు. తండ్రి అర్థం చేయిస్తారు - మధురాతి మధురమైన పిల్లలూ, శివబాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. బాబా, మీరు చాలా మధురమైనవారు, అద్భుతమంతా మీదే అని అంటూ విధంగా బాబా మహిమను చేయాలి. పిల్లలైన మీకు ఈశ్వరీయ లాటరీ లభించింది. ఇప్పుడు జ్ఞాన-యోగాలలో కృషి చేయాలి. ఇందులో అద్భుతమైన ప్రైజు లభిస్తుంది కావున పురుషార్థం చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, మనం మన మధురమైన ఇంటికి వెళ్తున్నాము, స్మృతితో సంతోషపు పాదరసం సదా ఎక్కి ఉండాలి.

2. గతించిందేదో గతించిపోయింది అని ఇక అంతిమ జన్మలో తండ్రికి పవిత్రతా సహాయాన్ని అందించాలి. తనువు, మనస్సు, ధనములతో భారత్ ను స్వర్గముగా తయారుచేసే సేవలో తత్పరులవ్వాలి.

వరదానము:-

సర్వ పాత ఖాతాలను సంకల్పము మరియు సంస్కార రూపములో కూడా సమాప్తము చేసే అంతర్ముఖీ భవ

బాప్ దాదా పిల్లలందరి ఖాతా పుస్తకాలను శుభ్రంగా చూడాలనుకుంటున్నారు. కొద్దిగా కూడా పాత ఖాతా అనగా బాహ్యముఖతతో కూడిన ఖాతా సంకల్పము లేక సంస్కార రూపంలో కూడా ఉండకూడదు. సదా సర్వ బంధనముక్తులుగా మరియు యోగయుక్తులుగా ఉండాలి - వీరినే అంతర్ముఖీ అని అంటారు. అందుకే సేవ బాగా చేయండి కానీ బాహ్యముఖత నుండి అంతర్ముఖులుగా అయి చేయండి. అంతర్ముఖత యొక్క స్వరూపం ద్వారా తండ్రి పేరును ప్రఖ్యాతం చేయండి, ఆత్మలు తండ్రికి చెందినవారిగా అవ్వాలి - ఇటువంటి ప్రసన్నచిత్తులుగా తయారుచేయండి.

స్లోగన్:-

మీ పరివర్తన ద్వారా సంకల్పాలు, మాటలు, సంబంధ-సంపర్కాలలో సఫలతను ప్రాప్తి చేసుకోవడమే సఫలతామూర్తులుగా అవ్వడము.

 Download PDF

 

Post a Comment

0 Comments