25-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- తండ్రిని స్మృతి
చేసేందుకు బాగా
శ్రమ చేయండి,
ఎందుకంటే మీరు
స్వచ్ఛమైన బంగారముగా
తయారవ్వాలి’’
ప్రశ్న:-
మంచి పురుషార్థుల
లక్షణాలు ఏమిటి?
జవాబు:-
ఎవరైతే మంచి పురుషార్థులుగా ఉంటారో వారు అడుగడుగునా శ్రీమతాన్ని అనుసరిస్తారు.
సదా శ్రీమతాన్ని
అనుసరించేవారే ఉన్నత పదవిని పొందుతారు. బాబా పిల్లలను సదా శ్రీమతాన్ని
అనుసరించమని ఎందుకు అంటారు? ఎందుకంటే వారొక్కరే సత్యాతి-సత్యమైన ప్రియుడు. మిగిలిన వారంతా వారి ప్రేయసులు.
ఓంశాంతి. ఓంశాంతి అర్థాన్ని అయితే కొత్త పిల్లలు, పాత పిల్లలు అందరూ అర్థం చేసుకున్నారు. ఆత్మలమైన మనమంతా పరమాత్ముని సంతానమని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. పరమాత్మ అత్యంత ఉన్నతులు మరియు సర్వులకు అత్యంత ప్రియమైన ప్రియతముడు. పిల్లలకు జ్ఞానం మరియు భక్తి యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. జ్ఞానం అనగా పగలు - సత్య,
త్రేతా యుగాలు. భక్తి అనగా రాత్రి
- ద్వాపరము మరియు కలియుగము. ఇది భారత్ విషయమే. ఇతర ధర్మాలతో మీకు ఎక్కువగా సంబంధము లేదు.
84 జన్మలు కూడా మీరే అనుభవిస్తారు. మొట్టమొదట కూడా భారతవాసులైన మీరే వచ్చారు.
84 జన్మల చక్రము భారతవాసులైన మీ కొరకే.
ఇస్లాం మతము వారు, బౌద్ధులు మొదలైనవారు
84 జన్మలు తీసుకుంటారని ఎవ్వరూ అనరు. అలా కాదు, భారతవాసులే తీసుకుంటారు. భారత్ యే అవినాశీ ఖండము,
ఇది ఎప్పుడూ వినాశనము అవ్వదు, ఇతర ఖండాలన్నింటి వినాశనము జరుగుతుంది.
భారత్ యే అన్నింటికన్నా ఉన్నతోన్నతమైనది, అవినాశీ ఖండము. భారత్ ఖండమే స్వర్గంగా తయారవుతుంది,
ఇతర ఏ ఖండమూ స్వర్గంగా అవ్వదు.
కొత్త ప్రపంచమైన సత్యయుగములో భారత్ యే ఉంటుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. భారత్ యే స్వర్గముగా పిలువబడ్తుంది. వారే మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు.
చివరికి నరకవాసులుగా అవుతారు,
మళ్ళీ ఆ భారతవాసులే స్వర్గవాసులుగా అవుతారు.
ఈ సమయములో అందరూ నరకవాసులుగానే ఉన్నారు.
తర్వాత మిగిలిన ఖండాలన్నీ వినాశనమవుతాయి, ఒక్క భారత్ మాత్రమే మిగులుతుంది.
భారత్ ఖండం యొక్క మహిమ అపారమైనది. అలాగే పరమపిత పరమాత్ముని మహిమ మరియు గీతా మహిమ కూడా అపారమైనది, కానీ ఆ మహిమ సత్యమైన గీతదే. ఇప్పుడు తండ్రి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది గీత యొక్క పురుషోత్తమ సంగమయుగము. భారత్ యే మళ్ళీ పురుషోత్తమంగా అవ్వనున్నది. ఇప్పుడు ఆ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము లేదు,
ఆ రాజ్యము కూడా లేదు,
కనుక ఆ యుగము కూడా లేదు. బాబా అర్థం చేయించారు - ఈ తప్పు కూడా డ్రామాలో ఉంది, గీతలో మళ్ళీ కృష్ణుని పేరు వేస్తారు. ఎప్పుడైతే భక్తి మార్గం ప్రారంభమవుతుందో, అప్పుడు మొట్టమొదట గీతయే ఉంటుంది. ఇప్పుడు ఈ గీత మొదలైన శాస్త్రాలన్నీ సమాప్తమవ్వనున్నాయి. కేవలం దేవీ-దేవతా ధర్మం మాత్రమే ఉంటుంది.
అలాగని దానితో పాటు గీత, భాగవతము మొదలైనవి కూడా ఉంటాయని కాదు. అలా కాదు. ప్రారబ్ధము లభించింది, సద్గతి కలిగింది అంటే ఇక ఏ శాస్త్రాలు మొదలైనవాటి అవసరమే ఉండదు. సత్యయుగములో ఏ గురువులూ, శాస్త్రాలు మొదలైనవి ఉండవు. ఈ సమయములోనైతే భక్తిని నేర్పించే గురువులు అనేకమంది ఉన్నారు.
సద్గతినిచ్చేది ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే,
వారి మహిమ అపారమైనది. వారిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివంతుడు) అని అంటారు. వారు అంతర్యామి అని, వారికి అందరి మనసులలో ఏముందో తెలుసని అనుకుంటూ భారతవాసులు చాలా వరకు ఈ పొరపాటు చేస్తారు. తండ్రి అంటారు, పిల్లలూ, నాకు ఎవరి మనసులో ఏముందో తెలియదు. నా కర్తవ్యమే పతితులను పావనంగా చేయడము. అంతేకానీ నేను అంతర్యామిని కాదు. ఇది భక్తి మార్గంలోని తప్పుడు మహిమ.
నన్ను పిలవడమే పతిత ప్రపంచములోకి పిలుస్తారు. మరియు నేను పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసినప్పుడు ఒక్కసారి మాత్రమే వస్తాను.
ఇప్పుడున్న ఈ ప్రపంచము కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా ఎప్పుడు అవుతుందో మనుష్యులకు తెలియనే తెలియదు. ప్రతి వస్తువు తప్పనిసరిగా సతో,
రజో, తమోలలోకి వస్తుంది. మనుష్యులు కూడా ఒకేలా ఉంటారు. బాలకులు మొదట సతోప్రధానంగా ఉంటారు, తర్వాత యువకులుగా,
వృద్ధులుగా అవుతారు అనగా రజో, తమోలలోకి వస్తారు. శరీరము వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు దానిని వదిలి వెళ్ళి చిన్న పిల్లలుగా అవుతారు. ప్రపంచము కూడా కొత్తది నుండి పాతదిగా అవుతుంది.
కొత్త ప్రపంచములో భారత్ ఎంత ఉన్నతంగా ఉండేదో పిల్లలకు తెలుసు.
భారత్ మహిమ అపారమైనది. ఇంత ధనవంతంగా, సుఖంగా, పవిత్రంగా ఇతర ఏ ఖండమూ లేదు. ఇప్పుడు సతోప్రధాన ప్రపంచము స్థాపన అవుతుంది. త్రిమూర్తులలో కూడా బ్రహ్మా, విష్ణు,
శంకరులను చూపించారు. కానీ దాని అర్థము ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి త్రిమూర్తి శివ అని చెప్పాలి, అంతేకానీ త్రిమూర్తి బ్రహ్మా అని కాదు. బ్రహ్మా,
విష్ణు, శంకరులను సృష్టించిన వారెవరు... ఉన్నతోన్నతమైనవారు శివబాబా.
బ్రహ్మా దేవతాయ నమః,
విష్ణు దేవతాయ నమః,
శంకర దేవతాయ నమః, శివ పరమాత్మాయ నమః అని అంటారు. కనుక వారు ఉన్నతమైనవారు అయ్యారు కదా. వారు రచయిత. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల యొక్క స్థాపన చేస్తారని అంటూ ఉంటారు కూడా. తర్వాత పరమాత్మ అయిన తండ్రి నుండి వారసత్వము కూడా లభిస్తుంది. మళ్ళీ వారు స్వయంగా కూర్చొని బ్రాహ్మణులను చదివిస్తారు ఎందుకంటే వారు తండ్రి కూడా, సుప్రీమ్ టీచరు కూడా. ప్రపంచ చరిత్ర, భౌగోళికాలు ఎలా రిపీట్ అవుతాయి అనేది వారు కూర్చొని అర్థం చేయిస్తారు. వారే జ్ఞాన సంపన్నులు. ఇకపోతే వారు సర్వము తెలిసినవారు అని కాదు. ఇది కూడా పొరపాటే. భక్తి మార్గంలో ఎవరికీ వారి జీవిత చరిత్ర గురించి,
కర్తవ్యము గురించి తెలియదు.
కనుక ఇది బొమ్మల పూజ వలె అవుతుంది. కలకత్తాలో బొమ్మల పూజ ఎంత ఎక్కువగా జరుగుతుంది,
తర్వాత వారికి పూజ చేసి తినిపించి-త్రాగించి సముద్రములో ముంచేస్తారు.
శివబాబా అత్యంత ప్రియమైనవారు.
తండ్రి అంటారు, నా లింగాన్ని కూడా మట్టితో తయారుచేసి, పూజ చేసి తర్వాత పగులగొడ్తారు. ఉదయము తయారుచేస్తారు, సాయంకాలము కూల్చేస్తారు.
ఇదంతా భక్తి మార్గము, అంధ విశ్వాసముతో చేసే పూజ. మీరే పూజ్యులు, మీరే పూజారులని మనుష్యులు గాయనము చేస్తారు కూడా. తండ్రి అంటారు, నేనైతే సదా పూజ్యుడను.
నేను వచ్చి కేవలం పతితులను పావనంగా చేస్తాను. 21 జన్మలకు రాజ్య భాగ్యాన్ని ఇస్తాను. భక్తిలో అల్పకాలికమైన సుఖముంటుంది, దానిని సన్యాసులు కాకిరెట్టతో సమానమైన సుఖమని అంటారు. సన్యాసులు ఇల్లు-వాకిళ్ళను వదిలేస్తారు,
అది హద్దులోని సన్యాసము. హఠయోగులు కదా.
భగవంతుని గురించి తెలియనే తెలియదు, బ్రహ్మ తత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మా తత్వమైతే భగవంతుడు కాదు.
భగవంతుడైతే ఒకే ఒక నిరాకార శివుడు,
వారు సర్వాత్మలకు తండ్రి. బ్రహ్మా తత్వము ఆత్మలమైన మన నివాస స్థానము. అది బ్రహ్మాండము, మధురమైన ఇల్లు.
అక్కడ నుండి ఆత్మలమైన మనము ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము. నేను ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటానని ఆత్మ చెప్తుంది. భారతవాసులకే 84 జన్మలు ఉంటాయి. ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో, వారే మళ్ళీ జ్ఞానం కూడా ఎక్కువగా తీసుకుంటారు. తండ్రి అంటారు, పిల్లలూ, గృహస్థ వ్యవహారములో ఉండండి, కానీ శ్రీమతాన్ని అనుసరించండి. ఆత్మలైన మీరంతా ప్రియతముడైన ఒక్క పరమాత్ముని ప్రేయసులు. ద్వాపరము నుండి మొదలుకుని మీరు స్మృతి చేస్తూ వచ్చారు.
దుఃఖములో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది.
ఇది అయితే దుఃఖధామము. ఆత్మలు వాస్తవానికి శాంతిధామ నివాసులు. తర్వాత సుఖధామములోకి వచ్చారు. ఆ తర్వాత మనము 84 జన్మలు తీసుకున్నాము. ‘‘హమ్ సో, సో హమ్’’ అర్థాన్ని కూడా అర్థం చేయించారు. వారు ఆత్మయే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, ఆత్మయే పరమాత్మ ఎలా అవ్వగలదు. పరమాత్మ అయితే ఒక్కరే. మిగిలిన వారందరూ వారి పిల్లలు.
సాధు-సత్పురుషులు మొదలైనవారు కూడా హమ్ సో యొక్క అర్థాన్ని తప్పుగా చెప్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ‘‘హమ్ సో’’ అర్థము
- నేను ఆత్మ సత్యయుగములో దేవీ-దేవతగా ఉండేవాడిని, తర్వాత నేనే క్షత్రియునిగా, నేనే వైశ్యునిగా, నేనే శూద్రునిగా అయ్యాను. ఇప్పుడు మళ్ళీ నేనే బ్రాహ్మణునిగా అయ్యాను, దేవతగా అయ్యేందుకు. ఇదే యథార్థమైన అర్థము. అది పూర్తిగా తప్పు. తండ్రి అంటారు, మనుష్యులు రావణుని మతాన్ని అనుసరిస్తూ ఎంత అసత్యంగా అయిపోయారు, అందుకే అసత్యపు మాయ, అసత్యపు కాయ... అనే సామెత ఉంది. సత్యయుగములో ఇలా అనరు. అది సత్య ఖండము. అక్కడ అసత్యం యొక్క నామ-రూపాలు ఉండవు. ఇక్కడేమో సత్యం యొక్క నామ-రూపాలు లేవు. అయినా పిండిలో ఉప్పు ఉన్నంత సత్యమని అంటారు.
సత్యయుగములో ఉన్నదే దైవీ గుణాలు కలిగిన మనుష్యులు.
వారిది దేవతా ధర్మము. తర్వాత వేరే-వేరే ధర్మాలు వచ్చాయి. కనుక ద్వైతము ఏర్పడింది. ద్వాపరము నుండి ఆసురీ రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. సత్యయుగములో రావణ రాజ్యం కూడా ఉండదు, అలాగే 5 వికారాలు కూడా ఉండవు. వారు సంపూర్ణ నిర్వికారులు. సీతా-రాములను 14 కళల సంపూర్ణులని అంటారు. రామునికి బాణాలను ఎందుకు ఇచ్చారు?
ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. అక్కడ హింస యొక్క మాటే లేదు.
మీరు ఈశ్వరీయ విద్యార్థులు. వారు తండ్రి కూడా అయ్యారు. మీరు విద్యార్థులు కావున వారు టీచరు కూడా అయ్యారు. అంతేకాక పిల్లలైన మీకు సద్గతినిచ్చి స్వర్గానికి తీసుకువెళ్తారు కనుక సద్గురువు అయ్యారు.
తండ్రి, టీచరు, గురువు ముగ్గురూ వారే అయ్యారు. వారికి మీరు సంతానంగా అయ్యారు కావున మీకు ఎంత సంతోషం ఉండాలి. ఇప్పుడిది రావణ రాజ్యమని పిల్లలైన మీకు తెలుసు. రావణుడు భారత్ కు అత్యంత పెద్ద శత్రువు. ఈ జ్ఞానం కూడా పిల్లలైన మీకు జ్ఞానసాగరుడైన తండ్రి ద్వారా లభించింది. ఆ తండ్రే జ్ఞాన సాగరుడు, ఆనంద సాగరుడు. జ్ఞాన సాగరుడి నుండి మేఘాలైన మీరు నింపుకొని వెళ్ళి వర్షిస్తారు.
జ్ఞాన గంగలు మీరే, మీకే మహిమ ఉంది. అంతేకానీ నీటి గంగలో స్నానము చేయడం వలన ఎవ్వరూ పావనంగా అవ్వనే అవ్వరు.
మలినమైన మురికి నీటిలో స్నానము చేసి కూడా మేము పావనమైపోతామని భావిస్తారు. జలపాతాల నీటికి కూడా చాలా మహత్వాన్ని ఇస్తారు.
ఇదంతా భక్తి మార్గము. సత్య-త్రేతా యుగాలలో భక్తి ఉండదు. అది సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము.
తండ్రి అంటారు, పిల్లలూ,
నేను మిమ్మల్ని ఇప్పుడు పావనంగా చేయడానికి వచ్చాను. ఈ ఒక్క జన్మ నన్ను స్మృతి చేయండి మరియు పావనంగా అవ్వండి,
అప్పుడు మీరు సతోప్రధానంగా అవుతారు. నేనే పతితపావనుడను. ఎంత వీలైతే అంత స్మృతియాత్రను పెంచండి. నోటి ద్వారా శివబాబా, శివబాబా అని అనకూడదు.
ఏ విధంగా ప్రేయసి ప్రియతముడిని స్మృతి చేస్తుందో, ఒక్కసారి చూస్తే చాలు ఇక బుద్ధిలో అతని స్మృతి ఉండిపోతుంది. భక్తిలో ఎవరు ఎవరిని స్మృతి చేస్తారో, ఎవరిని పూజిస్తారో వారి సాక్షాత్కారము జరుగుతుంది. కానీ అదంతా అల్పకాలము కొరకు.
భక్తి ద్వారా క్రిందికే దిగుతూ వచ్చారు. ఇప్పుడైతే మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. హాహాకారాల తర్వాతనే జయజయ ధ్వనులు వినిపించనున్నాయి. భారత్ లోనే రక్తపు నదులు ప్రవహించనున్నాయి. ఇప్పుడు అందరూ తమోప్రధానంగా అయిపోయారు,
మళ్ళీ అందరూ సతోప్రధానంగా అవ్వాలి. కానీ ఎవరైతే కల్పక్రితము దేవతలుగా అయ్యారో, వారే ఇప్పుడు కూడా అవుతారు. వారే వచ్చి తండ్రి నుండి పూర్తి-పూర్తి వారసత్వాన్ని తీసుకుంటారు. ఒకవేళ భక్తి తక్కువ చేసి ఉంటే జ్ఞానం కూడా పూర్తిగా తీసుకోరు. తర్వాత మళ్ళీ ప్రజలలో నంబరువారు పదవిని పొందుతారు. మంచి పురుషార్థులు అడుగడుగునా శ్రీమతాన్ని అనుసరించి మంచి పదవిని పొందుతారు. మ్యానర్స్ కూడా మంచిగా ఉండాలి. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. అవి మళ్ళీ 21 జన్మలు కొనసాగుతాయి.
ఇప్పుడు అందరిలో ఆసురీ గుణాలున్నాయి ఎందుకంటే ఇది పతిత ప్రపంచము కదా. పిల్లలైన మీకు ప్రపంచ చరిత్ర-భౌగోళికాల గురించి కూడా అర్థం చేయించబడింది. ఈ సమయములో తండ్రి అంటారు,
పిల్లలూ, స్మృతి చేయడానికి బాగా శ్రమ చేసినట్లయితే మీరు సత్యమైన బంగారముగా తయారవుతారు.
సత్యయుగము స్వర్ణిమ యుగము,
సత్యమైన బంగారము. తర్వాత త్రేతాలో వెండి అనే కల్తీ చేరుతుంది కనుక కళలు తగ్గుతూ వస్తాయి.
ఇప్పుడు ఒక్క కళా లేదు. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వస్తుందో అప్పుడు తండ్రి వస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మీరు పాత్రధారులు కదా. మేము ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చామని మీకు తెలుసు. పాత్రధారి ఒకవేళ డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకోకపోతే వారిని అవివేకులని అంటారు.
అనంతమైన తండ్రి అంటారు,
అందరూ ఎంత అవివేకులుగా అయిపోయారు. ఇప్పుడు నేను మిమ్మల్ని బుద్ధివంతులుగా, వజ్రసమానంగా తయారుచేస్తాను. తర్వాత రావణుడు వచ్చి గవ్వ సమానంగా తయారుచేస్తాడు. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వినాశనము జరుగనున్నది. అందరినీ దోమల వలె తీసుకువెళ్తాను. మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలిచి ఉంది. ఇలా తయారవ్వాలి, అప్పుడే మీరు స్వర్గవాసులుగా అవుతారు. బి.కె.లైన మీరు ఈ పురుషార్థము చేస్తున్నారు. కానీ మనుష్యుల బుద్ధి తమోప్రధానంగా ఉన్నందుకు ఇంతమంది బి.కె.లు ఉన్నారు కనుక తప్పకుండా ప్రజాపిత బ్రహ్మా కూడా ఉంటారని అర్థం చేసుకోరు. బ్రాహ్మణులు పిలక సమానమైనవారు.
బ్రాహ్మణులు, ఆ తర్వాత దేవతలు, వారు చిత్రాలలో బ్రాహ్మణులను, శివుడిని మాయం చేసేసారు.
బ్రాహ్మణులు ఇప్పుడు భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారంగా మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
జ్ఞాన సాగరుడి నుండి మేఘాలను నింపుకొని జ్ఞాన వర్షాన్ని కురిపించాలి. ఎంత వీలైతే అంత స్మృతి యాత్రను కూడా పెంచాలి. స్మృతి ద్వారానే సత్యమైన బంగారముగా తయారవ్వాలి.
2.
శ్రీమతాన్ని అనుసరించి మంచి మ్యానర్స్ ను మరియు దైవీ గుణాలను ధారణ చేయాలి. సత్య ఖండములోకి వెళ్ళేందుకు చాలా-చాలా సత్యంగా తయారవ్వాలి.
వరదానము:-
విశేషతలను చూసే
కళ్ళజోడును ధరించి
సంబంధ-సంపర్కములోకి
వచ్చే విశ్వపరివర్తక
భవ
పరస్పరము ఒకరికొకరు సంబంధ-సంపర్కంలోకి వస్తూ ప్రతి ఒక్కరి విశేషతలను చూడండి. విశేషతలను చూసే దృష్టినే ధారణ చేయండి. ఎలాగైతే ఈ రోజుల్లో కళ్ళజోడు అనేది ఫ్యాషన్ గా మరియు తప్పనిసరి అవసరం వలె ఉంది. అలా విశేషతలను చూసే కళ్ళజోడును ధరించండి. వేరే ఏమీ కనిపించకూడదు. ఎలాగైతే ఎర్ర కళ్ళజోడును ధరిస్తే ఆకుపచ్చ రంగు కూడా ఎర్రగానే కనిపిస్తుంది, అలా విశేషతల కళ్ళజోడు ద్వారా బురదను చూడకుండా కమల పుష్పాన్ని చూసినట్లయితే విశ్వ పరివర్తన యొక్క విశేష కార్యానికి నిమిత్తంగా అవుతారు.
స్లోగన్:-
పరచింతన మరియు పరదర్శన అనే ధూళి నుండి సదా దూరంగా ఉంటే మచ్చలేని అమూల్యమైన వజ్రంగా అవుతారు.
0 Comments