24-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- ఆత్మ-పరమాత్మల
మిలనము జరిగే
సంగమయుగము ఇదే. సద్గురువు ఈ ఒక్కసారి
మాత్రమే వచ్చి
పిల్లలకు సత్యమైన
జ్ఞానాన్నిచ్చి సత్యాన్ని
చెప్పడం నేర్పిస్తారు’’
ప్రశ్న:-
ఏ పిల్లల అవస్థ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది?
జవాబు:-
ఏ పిల్లల బుద్ధిలో అయితే ఈ సర్వస్వము తండ్రిదే అని ఉంటుందో, ప్రతి అడుగులో శ్రీమతమును తీసుకుంటారో, పూర్తిగా త్యాగము చేస్తారో, వారి అవస్థ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ఈ యాత్ర చాలా సుదీర్ఘమైనది. అందుకే శ్రేష్ఠమైన తండ్రి నుండి ఉన్నతమైన మతము తీసుకుంటూ ఉండాలి.
ప్రశ్న:-
మురళి వినే సమయంలో అపారమైన సుఖము ఏ పిల్లలకు అనుభవమవుతుంది?
జవాబు:-
ఎవరైతే - మేము శివబాబా మురళి వింటున్నాము
అని భావిస్తారో, ఈ మురళి శివబాబా, బ్రహ్మా శరీరము ద్వారా వినిపిస్తున్నారు, అత్యంత ప్రియమైన బాబా మమ్మల్ని సదా సుఖీలుగా, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి ఈ మురళీ వినిపిస్తున్నారు . మురళి వినేటప్పుడు ఈ స్మృతి ఉన్నట్లయితే సుఖము అనుభవమవుతుంది.
పాట:- ప్రియతమా! వచ్చి కలుసుకో... (ప్రీతమ్ ఆన్ మిలో...)
ఓంశాంతి. ఈ దుఃఖభరిత మనసు దుఃఖధామములో మాత్రమే ఉంటుంది. సుఖమయమైన జీవాత్మలు సుఖధామంలో ఉంటారు.
భక్తులందరి ప్రియతముడు ఒక్కరే,
వారినే స్మృతి చేయడం జరుగుతుంది. వారిని ప్రియతముడని అంటారు. దుఃఖము కలిగినప్పుడు స్మృతి చేస్తారు. ఈ విధంగా కూర్చొని ఎవరు అర్థం చేయిస్తారు? సత్యాతి-సత్యమైన ప్రియతముడు, సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు,
సత్యమైన సద్గురువు... అందరి ప్రియతముడు వారొక్కరే. కానీ ఆ ప్రియతముడు ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ తెలియదు. ఆ ప్రియతముడే స్వయంగా వచ్చి తన భక్తులకు,
తన పిల్లలకు ఈ విధంగా చెప్తారు - నేను కేవలం సంగమయుగములో ఒక్కసారి మాత్రమే వస్తాను. నేను వచ్చేందుకు, వెళ్ళేందుకు మధ్య గల సమయాన్ని సంగమమని అంటారు. మిగిలిన ఆత్మలన్నీ అనేక సార్లు జనన-మరణాలలోకి వస్తారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను.
సద్గురువుని కూడా నేనొక్కరిని మాత్రమే. మిగిలిన గురువులైతే అనేకమంది ఉన్నారు.
వారిని సద్గురువు అని అనరు ఎందుకంటే వారెవ్వరూ సత్యాన్ని చెప్పరు,
వారికి సత్యమైన పరమాత్ముని గురించి తెలియనే తెలియదు.
ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో వారు ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడ్తారు. ఆ సద్గురువు సత్యాన్నే మాట్లాడు సత్యమైన సద్గురువు. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు స్వయంగా వచ్చి - నేను సంగమయుగములో వస్తానని తెలియజేస్తారు. ఎంత సమయము నేనుంటానో అదే నా ఆయువు.
పతితులను పావనంగా తయారుచేసే వెళ్తాను. నా జన్మ జరిగినప్పటి నుండి నేను సహజ రాజయోగము నేర్పించడం ప్రారంభిస్తాను, మళ్ళీ ఎప్పుడైతే నేర్పించి పూర్తి చేస్తానో అప్పుడు పతిత ప్రపంచము వినాశనమవుతుంది మరియు నేను వెళ్ళిపోతాను. నేను ఇంత సమయము కోసం మాత్రమే వస్తాను. శాస్త్రాలలో అయితే నా సమయము గురించి ఏమీ లేదు. శివబాబా ఎప్పుడు జన్మ తీసుకుంటారో,
ఎన్ని రోజులు భారత్ లో ఉంటారో
- ఈ విషయాలను తండ్రే స్వయంగా కూర్చొని తెలియజేస్తున్నారు - నేను సంగమయుగములోనే వస్తాను. సంగమయుగము యొక్క ఆది, సంగమయుగము యొక్క అంతిమము అనగా నేను వచ్చే ఆది సమయము, వెళ్ళిపోయే అంతిమ సమయము. ఇకపోతే మధ్యలో కూర్చొని నేను రాజయోగము నేర్పిస్తాను. తండ్రి స్వయంగా కూర్చొని తెలియజేస్తారు, నేను వీరి వానప్రస్థ అవస్థలోనే వస్తాను
- పరాయి దేశములోకి మరియు పరాయి తనువులోకి వస్తాను,
కనుక అతిథి అయినట్లు కదా. నేను ఈ రావణ ప్రపంచములో అతిథిని.
ఈ సంగమయుగపు మహిమ చాలా గొప్పది. తండ్రి రావణ రాజ్యాన్ని వినాశము చేసి రామ రాజ్య స్థాపన చేసేందుకే వస్తారు.
శాస్త్రాలలో కట్టుకథలు చాలా రాసేసారు. రావణుడిని కాలుస్తూ వస్తారు. ఈ సమయములో ఈ మొత్తము సృష్టి అంతా లంక వలె ఉంది. కేవలం శ్రీలంకను మాత్రమే లంక అని అనరు.
ఈ మొత్తము సృష్టి అంతా రావణుడు ఉండే స్థానము లేక శోకవాటిక. అందరూ దుఃఖితులుగా ఉన్నారు. తండ్రి అంటారు, నేను దీనిని అశోకవాటికగా లేక స్వర్గంగా తయారుచేయడానికి వస్తాను.
స్వర్గములో అన్ని ధర్మాలైతే ఉండవు. అక్కడ ఒకే ధర్మముండేది, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు మళ్ళీ దేవతలుగా తయారుచేయడానికి రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. అందరూ అయితే ఇది నేర్చుకోరు. నేను భారత్ లో మాత్రమే వస్తాను. భారత్ లోనే స్వర్గముంటుంది. క్రిస్టియన్లు కూడా స్వర్గాన్ని అంగీకరిస్తారు. స్వర్గస్థులయ్యారని అంటారు. గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళారని అంటారు. కానీ స్వర్గము గురించి ఏమైనా అర్థం చేసుకుంటారా. స్వర్గము అనేది వేరే వస్తువు. కావున తండ్రి అర్థం చేయిస్తారు - నేను ఎప్పుడు మరియు ఎలా వస్తాను, వచ్చి త్రికాలదర్శులుగా తయారుచేస్తాను. త్రికాలదర్శులుగా ఇతరులెవ్వరూ ఉండరు. సృష్టి ఆదిమధ్యాంతాలను గురించి నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కలియుగము వినాశనము అవ్వనున్నది. లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయము అదే సంగమ సమయము. ఖచ్చితమైన సమయము ఇది అని చెప్పలేము. కానీ రాజధాని అయితే పూర్తిగా స్థాపనవుతుంది. పిల్లలు కర్మాతీత అవస్థను పొందితే జ్ఞానం సమాప్తమైపోతుంది. యుద్ధము ప్రారంభమవుతుంది. నేను కూడా పావనంగా తయారుచేసే నా పాత్రను పూర్తి చేసి వెళ్ళిపోతాను. దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయడం నా పాత్రయే. భారతవాసులకు ఇది ఏమాత్రం కూడా తెలియదు. ఇప్పుడు శివరాత్రిని జరుపుకుంటున్నారంటే తప్పకుండా శివబాబా ఏదో ఒక కార్యము చేసి ఉంటారు. కానీ వారు కృష్ణుని పేరును వేసేశారు. ఈ సాధారణ పొరపాటు కనిపిస్తుంది.
శివపురాణము మొదలైన ఏ శాస్త్రములోనూ శివబాబా వచ్చి రాజయోగము నేర్పిస్తారని లేదు.
వాస్తవానికి ప్రతి ధర్మానికి ఒక్కొక్క శాస్త్రముంది.
దేవతా ధర్మానికి కూడా ఒక శాస్త్రముండాలి. కానీ దాని రచయిత ఎవరు, ఇందులోనే తికమక పడ్డారు.
తండ్రి అర్థం చేయిస్తారు, నేను తప్పకుండా బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని రచించవలసి ఉంటుంది. బ్రహ్మా ముఖవంశావళి బ్రహ్మాకుమార-కుమారీలు. చాలా మంది పేర్లను మార్చారు, అందులో చాలా మంది పారిపోయారు.
వారి స్థానంలో వేరేవారు వస్తారు కూడా.
అయితే పేరును మార్చడం వలన ఎలాంటి లాభము లేదని గమనించడం జరిగింది. వారు ఆ పేరును మర్చిపోతారు కూడా. వాస్తవానికి మీరు తండ్రితో యోగము జోడించాలి. శరీరానికి పేరు లభిస్తుంది. ఆత్మకైతే పేరే లేదు. ఆత్మ
84 జన్మలు తీసుకుంటుంది. ప్రతి జన్మలో నామ, రూప, దేశ, కాలాలన్నీ మారిపోతాయి. డ్రామాలో ఎవరైనా ఒకసారి లభించిన పాత్రను మళ్ళీ అదే రూపములో అభినయించరు.
అదే పాత్రను మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత అభినయిస్తారు.
కృష్ణుడు మళ్ళీ అవే నామ-రూపాలతో రాగలరని కాదు.
అలా కాదు.
ఇదైతే తెలుసు - ఆత్మ ఒక శరీరాన్ని వదలి మరొకటి తీసుకుంటుంది, అప్పుడు రూపు-రేఖలు మొదలైనవి ఒకదానితో మరొకటి కలవవు. 5 తత్వాల అనుసారంగా రూపు-రేఖలు మారిపోతూ ఉంటాయి.
ఎన్ని రూపు-రేఖలున్నాయి. కానీ ఇవన్నీ మొదటి నుండే డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉన్నాయి. కొత్తగా ఏమీ తయారవ్వదు.
ఇప్పుడు శివరాత్రి జరుపబడుతుంది.
తప్పకుండా శివుడు వచ్చారు.
వారే మొత్తం ప్రపంచానికి ప్రియతముడు. లక్ష్మీ-నారాయణులను గాని, రాధే-కృష్ణులను గాని లేక బ్రహ్మా-విష్ణువు మొదలైనవారిని గాని ప్రియతముడని అనరు. గాడ్ ఫాదర్ మాత్రమే ప్రియతముడు. తండ్రి అయితే తప్పకుండా వారసత్వాన్ని ఇస్తారు, అందుకే తండ్రి ప్రియమనిపిస్తారు. తండ్రి అంటారు,
నన్ను స్మృతి చేయండి ఎందుకంటే నా ద్వారా మీరు వారసత్వాన్ని పొందాలి. ఈ చదువు అనుసారంగా వెళ్ళి మేము సూర్యవంశీ దేవతలు లేక చంద్రవంశీ క్షత్రియులుగా అవుతామని పిల్లలకు తెలుసు. వాస్తవానికి భారతవాసులందరి ధర్మం ఒకటే ఉండాలి. కానీ దేవతా ధర్మం పేరును మార్చి హిందూ ధర్మమని పేరు పెట్టారు ఎందుకంటే ఆ దైవీ గుణాలు లేవు. ఇప్పుడు తండ్రి కూర్చొని ధారణ చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరిగా అవ్వండి అని అంటారు.
మీరెవ్వరూ పరమాత్మ కారు,
పరమాత్మ అయితే ఒక్క శివుడు మాత్రమే.
అందరికీ ప్రియతములైన వారు ఒక్కసారి మాత్రమే సంగమయుగములో వస్తారు. ఈ సంగమయుగము చాలా చిన్నది. అన్ని ధర్మాల వినాశనం జరుగుతుంది.
బ్రాహ్మణ కులము వారు కూడా తిరిగి వెళ్తారు ఎందుకంటే వారు మళ్ళీ దైవీ కులములోకి బదిలీ అవ్వాలి. వాస్తవానికి ఇది ఒక చదువు. కేవలం పోల్చడం జరుగుతుంది. ఆ విషయ వికారాలు విషము. ఈ జ్ఞానము అమృతము. ఇది మనుష్యులను దేవతలుగా తయారుచేసే పాఠశాల. ఆత్మలో మలినాలు ఏర్పడ్డాయి, అందుకే ఆత్మ పూర్తిగా మిశ్రమ లోహం వలె అయిపోయింది.
దానిని తండ్రి వచ్చి వజ్ర సమానంగా తయారుచేస్తారు. శివరాత్రి అని అంటారు, శివుడు రాత్రిలో వచ్చారు. కానీ ఎలా వచ్చారు, ఎవరి గర్భములో వచ్చారు? లేక ఎవరి శరీరములో ప్రవేశించారు? వారు గర్భములో అయితే రారు. వారు శరీరాన్ని అప్పుగా తీసుకోవలసి ఉంటుంది. వారు తప్పకుండా వచ్చి నరకాన్ని స్వర్గంగా తయారుచేస్తారు. కానీ ఎప్పుడు, ఎలా వస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలైతే చాలా చదువుతారు కానీ ముక్తి-జీవన్ముక్తి అయితే ఎవ్వరికీ లభించదు, ఇంకా తమోప్రధానంగా అయిపోయారు. అందరూ ఆ విధంగా అవ్వాల్సిందే. మనుష్యులందరూ స్టేజిపై తప్పకుండా హాజరయ్యే తీరాలి.
తండ్రి వచ్చేదే చివరి సమయములో. అందరూ వారి మహిమనే గానము చేస్తారు - మీ గతి-మతి మీకే తెలుసు, మీలో ఏ జ్ఞానముంది,
మీరు ఎలా సద్గతినిస్తారు, అది మీకు మాత్రమే తెలుసు అని. కావున వారు శ్రీమతాన్ని ఇచ్చేందుకు తప్పకుండా వస్తారు కదా. కానీ ఎలా వస్తారు,
ఏ శరీరములో వస్తారు, ఇది ఎవరికీ తెలియదు. నేను సాధారణ తనువులో రావాల్సి ఉంటుందని స్వయంగా అంటారు.
నేను తప్పకుండా బ్రహ్మా అన్న పేరు కూడా పెట్టవలసి ఉంటుంది. లేకుంటే బ్రాహ్మణులు ఎలా జన్మిస్తారు. బ్రహ్మా ఎక్కడ నుండి వస్తారు? పై నుండి అయితే రారు! వారు సూక్ష్మవతనవాసి అవ్యక్త సంపూర్ణ బ్రహ్మా. ఇక్కడైతే తప్పకుండా వ్యక్తములోకి వచ్చి రచనను రచించవలసి ఉంటుంది.
ఇంత సమయము వస్తారు, వెళ్తారు అని మనము అనుభవముతో చెప్పగలము. తండ్రి అంటారు,
నేను కూడా డ్రామాలో బంధింపబడ్డాను మరియు నేను రావలసిన పాత్ర కూడా ఒక్కసారి మాత్రమే ఉంది.
ప్రపంచములో ఉపద్రవాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఆ సమయములో ఈశ్వరుని ఎంతగా పిలుస్తారు. కానీ నేనైతే నా సమయములోనే రావాలి మరియు అది కూడా వానప్రస్థ అవస్థలోనే వస్తాను.
ఈ జ్ఞానమైతే చాలా సహజము.
కానీ అవస్థను తయారుచేసుకోవడంలో శ్రమ ఉంది, అందుకే గమ్యము చాలా ఉన్నతమైనదని అంటారు. తండ్రి జ్ఞానసంపన్నులు కావున వారు తప్పకుండా పిల్లలకు జ్ఞానాన్ని ఇచ్చారు, అందుకే మీ గతి-మతి మీకే తెలుసు అనే గాయనముంది.
తండ్రి అంటారు, నా వద్ద సుఖ-శాంతుల ఖజానా ఏదైతే ఉందో అది నేను వచ్చి పిల్లలకే ఇస్తాను.
మాతలపై జరిగే అత్యాచారాలు మొదలైనవన్నీ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి, అప్పుడే కదా పాప భాండము నిండుతుంది. కల్ప-కల్పము ఇదే విధంగా రిపీట్ అవుతుంది.
ఈ విషయాలు కూడా మీకు ఇప్పుడు మాత్రమే తెలుసు,
తర్వాత మర్చిపోతారు. ఈ జ్ఞానం సత్యయుగములో ఉండదు.
ఒకవేళ ఉండి ఉంటే పరంపరగా కొనసాగేది.
అక్కడుండేది ప్రారబ్ధము, దానిని ఇప్పటి పురుషార్థము ద్వారా పొందుతారు. ఇక్కడ పురుషార్థము చేసే ఆత్మలే అక్కడ ఉంటారు, ఇతర ఆత్మలు అక్కడ ఉండరు, అక్కడ వారికి జ్ఞానం అవసరముండదు.
ఎవరో ఒక్కరు మాత్రమే వెలువడుతారని కూడా తెలుసు. చాలామంది బాగుంది,
బాగుంది అని కూడా అంటారు. విదేశాల నుండి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వెలువడితే ఈ జ్ఞానం అర్థము చేసుకున్నా భట్టీలో ఎక్కడుంటారు, ఏమి అర్థము చేసుకుంటారు! ఈ విషయమైతే బాగుంది కానీ పవిత్రంగా ఉండలేమని అంటారు.
అరే, ఇంతమంది పవిత్రంగా ఉంటున్నారు. వివాహము చేసుకొని కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటే వారికి బహుమానము కూడా చాలా లభిస్తుంది.
ఇది కూడా ఒక రేస్.
ఆ రేస్ లో మొదటి నంబరులో వస్తే 4-5 లక్షలు లభిస్తాయి. ఇక్కడైతే
21 జన్మల కొరకు పూర్తి రాజ్యము లభిస్తుంది.
ఇదేమైనా తక్కువ విషయమా!
ఈ మురళి అయితే పిల్లలందరి వద్దకు వెళ్తుంది. టేప్ లో కూడా వింటారు. శివబాబా బ్రహ్మా తనువు ద్వారా మురళి వినిపిస్తున్నారని అంటారు లేక పిల్లలు వినిపిస్తే శివబాబా మురళీని వినిపిస్తున్నారని అంటారు,
అప్పుడు బుద్ధి పూర్తిగా అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ సుఖము లోలోపల అనుభవమవ్వాలి.
అత్యంత ప్రియమైన బాబా మనల్ని సదా సుఖీలుగా, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు కావున వారి స్మృతి చాలా ఎక్కువగా ఉండాలి. కానీ మాయ స్మృతిని నిలువనివ్వదు.
త్యాగము కూడా పూర్తిగా చేయాలి. ఇదంతా బాబాదే - ఈ అవస్థ ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. చాలామంది పిల్లలు శ్రీమతము తీసుకుంటూ ఉంటారు.
శ్రీమతములో తప్పకుండా కళ్యాణమే ఉంటుంది. మతము కూడా ఉన్నతమైనది, యాత్ర కూడా సుదీర్ఘమైనది,
మళ్ళీ మీరు ఈ మృత్యులోకములోకి రారు.
సత్యయుగము అమరలోకము.
ఆ రోజు బాబా చాలా మంచి రీతిలో అర్థం చేయించారు - అక్కడ మీరు మరణించరు. సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు.
సర్పము ఉదాహరణ మీ కొరకే. భ్రమరము ఉదాహరణ కూడా మీదే.
తాబేలు ఉదాహరణ కూడా మీదే. సన్యాసులైతే వాటిని కాపీ చేసారు. భ్రమరము ఉదాహరణ చాలా బాగుంది.
అశుద్ధములో ఉండే పురుగులకు జ్ఞాన భూ-భూ చేసి వారిని పరిస్తాన్ లోని ఫరిశ్తాలుగా తయారుచేస్తారు. ఇప్పుడు పురుషార్థము చాలా మంచి రీతిలో చేయాలి. ఉన్నత పదవిని లేక మంచి నంబరును తీసుకోవాలంటే శ్రమ కూడా చేయాలి. వ్యాపార-వ్యవహారాలు చేసుకోండి, ఆ సమయానికి అనుమతి ఉంది.
అయినా మీకు చాలా సమయము లభిస్తుంది. మీ యోగం చార్టును చూసుకోవాలి ఎందుకంటే మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది.
బాబా పిల్లలకు పదే-పదే అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ,
పొరపాటున కూడా ఇటువంటి అత్యంత ప్రియమైన తండ్రి లేక ప్రియునికి విడాకులు ఎప్పుడూ,
ఎవ్వరూ ఇవ్వకండి, అలాంటి మహామూర్ఖులుగా ఎవ్వరూ అవ్వకండి.
కానీ మాయ అలా చేసేస్తుంది.
ఇప్పుడు మున్ముందు మీరు చూస్తారు - ఎవరు బలిహారమయ్యేవారో, చాలా మంచి సేవ చేసేవారో వారిని కూడా మాయ ఎటువంటి స్థితికి చేరుస్తుంది. ఎందుకంటే శ్రీమతాన్ని వదిలేస్తారు, అందుకే తండ్రి అంటారు, అటువంటి అతి గొప్ప మహామూర్ఖులుగా అవ్వకండి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
తండ్రి ద్వారా ఏదైతే సుఖ-శాంతుల ఖజానా లభించిందో, దానిని అందరికీ ఇవ్వాలి. జ్ఞానం ద్వారా మీ అవస్థను జమ చేసుకునే శ్రమ చేయాలి.
2.
దైవీ గుణాలను ధారణ చేయడానికి దేహ-భానాన్ని మరచి స్వయాన్ని ఆత్మగా భావించి అశరీరిగా అయి ఒక్క ప్రియతముడినే స్మృతి చేయాలి.
వరదానము:-
విశేషత అనే
బీజం ద్వారా
సంతుష్టత రూపీ
ఫలాన్ని ప్రాప్తి
చేసుకునే విశేష
ఆత్మా భవ
ఈ విశేష యుగంలో విశేషత అనే బీజానికి అన్నిటికంటే మంచి ఫలము సంతుష్టత. సంతుష్టంగా ఉండడం మరియు అందరినీ సంతుష్ట పరచడము - ఇదే విశేష ఆత్మల గుర్తు. అందుకే విశేషతల బీజానికి మరియు వరదానానికి సర్వ శక్తుల జలాన్ని అందించినట్లయితే
బీజము ఫలదాయకమవుతుంది.
లేకుంటే విస్తరించిన
వృక్షము కూడా ఎప్పటికప్పుడు వచ్చే తుఫానులలో కదులుతూ-కదులుతూ విరిగిపోతుంది
అనగా ముందుకు వెళ్ళాలనే ఉల్లాస-ఉత్సాహాలు, సంతోషము మరియు ఆత్మిక నషా ఉండవు. కనుక విధి పూర్వకంగా శక్తిశాలి బీజాన్ని ఫలదాయకంగా చేయండి.
స్లోగన్:-
అనుభూతుల ప్రసాదాన్ని
పంచుతూ అసమర్థులను సమర్థులుగా చేయడము - ఇదే అన్నిటికంటే పెద్ద పుణ్యము.
0 Comments