Header Ads Widget

Header Ads

TELUGU MURLI 23.01.23

 

23-01-2023  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 


Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - పవిత్రత లేకుండా భారత్ స్వర్గముగా అవ్వలేదు, మీకు శ్రీమతాన్ని ఇవ్వడం జరిగింది - మీరు గృహస్థములో ఉంటూ పవిత్రముగా అవ్వండి, రెండు వైపులా తోడును నిర్వర్తించండి అని’’

ప్రశ్న:-

ఇతర సత్సంగాలు లేక ఆశ్రమాలతో పోలిస్తే ఇక్కడి విధానము పూర్తిగా అతీతమైనది?

జవాబు:-

ఆశ్రమాలకు మనుష్యులు వెళ్ళి ఉంటారు. వారేమని భావిస్తారంటే - మంచి సాంగత్యము లభిస్తుంది, ఇళ్ళూ మొదలైనవాటి గొడవ ఉండదు అని. అక్కడ లక్ష్యము, ఉద్దేశ్యము ఏమీ లేదు. కానీ, ఇక్కడైతే మీరు మరజీవులుగా అవుతారు. మీ చేత ఇల్లూ, వాకిళ్ళను వదిలింపజేయడం జరుగదు. ఇంట్లో ఉంటూ మీరు జ్ఞానామృతాన్ని త్రాగాలి, ఆత్మిక సేవను చేయాలి. విధానము సత్సంగాలలో లేదు.

ఓం శాంతి. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు ఎందుకంటే పిల్లలకు తెలుసు, ఇక్కడ స్వయంగా తండ్రియే అర్థం చేయిస్తున్నారని కావుననే పదే-పదే శివ భగవానువాచ అని అనడం కూడా బాగా అనిపించదు. గీతను వినిపించేవారు - కృష్ణ భగవానువాచ అని అంటారు. వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు. శ్రీకృష్ణుడు గీతను వినిపించారని, రాజయోగాన్ని నేర్పించారని అంటారు. ఇక్కడైతే పిల్లలైన మీకు తెలుసు - శివబాబా మనకు రాజయోగాన్ని నేర్పుతున్నారని, రాజయోగాన్ని నేర్పించే సత్సంగాలు ఇంకేవీ లేవని. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. వారు కేవలం కృష్ణ భగవానువాచ, మన్మనాభవ అని అంటారు. అలా ఎప్పుడు అన్నారు? 5000 సంవత్సరాల క్రితం అని లేక కొందరు క్రైస్టుకు 3000 సంవత్సరాల క్రితం అని అంటారు. 2000 సంవత్సరాల క్రితం అని అనరు ఎందుకంటే మధ్యలో ఉన్న 1000 సంవత్సరాలలో ఇస్లాములు, బౌద్ధులు వచ్చారు. కావున క్రైస్టుకు 3000 సంవత్సరాల పూర్వం సత్యయుగము ఉందని నిరూపించబడుతోంది. మనం అంటాము - నేటికి 5000 సంవత్సరాల పూర్వము గీతను వినిపించే భగవంతుడు వచ్చారు మరియు వచ్చి దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపించారు. ఇప్పుడు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వారు రావాల్సి ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల చక్రము. తండ్రి వీరి ద్వారా అర్థం చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు. ప్రపంచములో మనుష్యులు వెళ్ళే సత్సంగాలు అనేక రకాలవి ఉంటాయి. కొందరు ఆశ్రమాలలోకి వెళ్ళి ఉంటారు కూడా, అప్పుడు వారిని మాత, పితల వద్దకు వెళ్ళి జన్మ తీసుకున్నారని లేక వారి నుండి ఏదో వారసత్వం లభిస్తుందని అనరు, అలా అనరు. కేవలం అక్కడ మంచి సాంగత్యం లభిస్తుందని భావిస్తారు. అక్కడ ఇల్లు మొదలైనవాటి హంగామా ఏదీ ఉండదు. ఇకపోతే లక్ష్యము, ఉద్దేశ్యము అంటూ ఏమీ లేదు. ఇక్కడైతే మేము మాత, పితల వద్దకు వచ్చాము అని మీరు అంటారు. ఇది మీ మరజీవా జన్మ. వారు పిల్లలను దత్తత తీసుకుంటారు, అప్పుడు బిడ్డ వెళ్ళి వారి ఇంట్లో నివసిస్తాడు. ఇక్కడ పుట్టింటిని, అత్తవారింటిని వదిలి ఇక్కడకు వచ్చి కూర్చునే ఆచారం లేదు. ఇక్కడ అలా జరుగదు. ఇక్కడైతే గృహస్థములో ఉంటూ కమలపుష్ప సమానముగా ఉండాలి. కుమారి అయినా లేక ఇంకెవరైనా సరే వారికి ఇంట్లో ఉంటూ రోజూ జ్ఞానామృతాన్ని త్రాగేందుకు రమ్మని చెప్పడం జరుగుతుంది. జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆపై ఇతరులకు అర్థం చేయించండి. రెండు వైపులా తోడును నిర్వర్తించండి. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. అంతిమం వరకు రెండు వైపులా తోడును నిర్వర్తించాలి. అంతిమంలో ఇక్కడ ఉన్నా లేక అక్కడ ఉన్నా మృత్యువైతే అందరికీ రావలసిందే. రాముడూ వెళ్ళిపోయాడు, రావణుడూ వెళ్ళిపోయాడు అని అంటారు. అంతేకానీ, అందరూ ఇక్కడకు వచ్చి ఉండాలని కాదు. ఎప్పుడైతే విషం కొరకు వారిని విసిగించడం జరుగుతుందో అప్పుడే అక్కడి నుండి బయటకు వస్తారు. కన్యలు కూడా తమ ఇళ్ళలో ఉండాలి. మిత్ర-సంబంధీకుల సేవను చేయాలి. సమాజ సేవకులైతే ఎందరో ఉన్నారు. ప్రభుత్వము ఇంతమందినైతే తమ వద్ద ఉంచుకోలేదు. వారు తమ గృహస్థ వ్యవహారములో ఉంటారు. అంతేకాక ఏదో ఒక సేవ కూడా చేస్తారు. ఇక్కడ మీరు ఆత్మిక సేవను చేయాలి, గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. అయితే, ఎప్పుడైతే వికారాల కోసం చాలా విసిగిస్తారో అప్పుడు వచ్చి ఈశ్వరీయ శరణును తీసుకుంటారు. ఇక్కడ విషం కారణంగా పిల్లలు ఎన్నో దెబ్బలను తింటారు, ఇంకెక్కడా ఇటువంటి విషయం ఉండదు. ఇక్కడైతే పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. ప్రభుత్వం కూడా పవిత్రతను కోరుకుంటుంది. కానీ గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా తయారుచేసే శక్తి ఈశ్వరునిలోనే ఉంటుంది. సమయం ఎలా ఉందంటే ప్రభుత్వం కూడా కోరుకుంటుంది - పిల్లలు ఎక్కువగా జన్మించకూడదు ఎందుకంటే పేదరికం ఎంతగానో ఉంది అని. కావున భారత్ లో పవిత్రత ఉండాలని, పిల్లలు తక్కువ అవ్వాలని కోరుకుంటారు.

తండ్రి అంటారు, పిల్లలూ, పవిత్రముగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. విషయం వారి బుద్ధిలో లేదు. భారత్ పవిత్రముగా ఉండేది, ఇప్పుడు అపవిత్రముగా ఉంది. పవిత్రముగా అవ్వాలి అని ఆత్మలందరూ స్వయము కూడా కోరుకుంటారు. ఇక్కడ దుఃఖం ఎంతో ఉంది. పవిత్రత లేకుండా భారత్ స్వర్గముగా అవ్వలేదని పిల్లలైన మీకు తెలుసు. నరకములో ఉన్నదే దుఃఖము. ఇప్పుడు నరకమంటూ ఏమీ లేదు. విధముగా గరుడ పురాణములో వైతరణి నది ఉందని, అందులో మనుష్యులు మునకలు వేస్తూ ఉంటారని చూపిస్తారు. విధముగా శిక్షలను అనుభవించే నది అంటూ ఏదీ లేదు. శిక్షలు గర్భ జెలులో లభిస్తాయి. సత్యయుగములోనైతే శిక్షలు లభించేందుకు గర్భ జైలు ఉండదు. అక్కడ గర్భ మహలు ఉంటుంది. సమయంలో మొత్తం ప్రపంచమంతా చైతన్యమైన నరకము. ఇక్కడ మనుష్యులు దుఃఖితులుగా, రోగగ్రస్తులుగా ఉన్నారు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇస్తూ ఉంటారు. స్వర్గములో ఇదేమీ ఉండదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, నేను మీ అనంతమైన తండ్రిని, నేను రచయితను కావున తప్పకుండా కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తాను. స్వర్గం కొరకు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని రచిస్తాను. నీవే తల్లివి, తండ్రివి... అని అంటారు. కల్ప-కల్పము రాజయోగాన్ని నేర్పించారు. బ్రహ్మా ద్వారా కూర్చొని సర్వ వేద-శాస్త్రాల ఆదిమధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తారు. పూర్తిగా నిరక్షరాస్యులుగా ఉన్నవారిని కూర్చొని చదివిస్తారు. హే భగవంతుడా, రండి అని మీరు పిలిచేవారు కదా. పతితులైతే అక్కడకు వెళ్ళలేరు. కావున పావనంగా తయారుచేయడానికి వారు తప్పకుండా ఇక్కడకు రావలసి ఉంటుంది. కల్ప పూర్వము కూడా మీకు రాజయోగాన్ని నేర్పించాను అని పిల్లలైన మీకు స్మృతిని కలిగిస్తారు. ఇంతకుముందు ఎప్పుడైనా జ్ఞానాన్ని తీసుకున్నారా? అని అడగడం జరుగుతుంది. అప్పుడు అవును, 5000 సంవత్సరాల క్రితం కూడా జ్ఞానాన్ని తీసుకున్నాము అని అంటారు. విషయాలు కొత్తవి. కొత్త యుగము, కొత్త ధర్మము మళ్ళీ స్థాపన అవుతున్నాయి. ఈశ్వరుడు తప్ప దైవీ ధర్మాన్ని ఎవరూ స్థాపించలేరు. బ్రహ్మా, విష్ణు, శంకరులు కూడా దీనిని స్థాపించలేరు ఎందుకంటే దేవతలు స్వయమే రచన. స్వర్గ రచయిత, మాత, పిత కావాలి. మీకు అపారమైన సుఖము కూడా ఇక్కడే కావాలి. నేను కూడా రచయితనే. మిమ్మల్ని కూడా బ్రహ్మా ముఖము ద్వారా నేను రచించాను. నేను మనుష్య సృష్టికి బీజరూపుడను. ఎవరైనా ఎంత పెద్ద సాధు-సన్యాసి అయినా కానీ ఎవరి నోటి నుండి కూడా ఇటువంటి మాటలు వెలువడవు. ఇవి గీతలోని పదాలు. కానీ ఎవరైతే వీటిని చెప్పారో వారే మళ్ళీ చెప్పగలరు. ఇంకెవ్వరూ ఇవి చెప్పలేరు. కేవలం తేడా ఏం జరిగిందంటే నిరాకారునికి బదులుగా శ్రీకృష్ణుడిని భగవంతుడు అని అనేస్తారు. తండ్రి అంటారు, నేను మనుష్య సృష్టికి బీజరూపుడను, పరంధామంలో ఉండేటువంటి నేను నిరాకార పరమాత్మను. మీరు కూడా అర్థం చేసుకోగలరు. సాకార మనుష్యులు స్వయాన్ని బీజరూపముగా చెప్పుకోలేరు. బ్రహ్మా, విష్ణు, శంకరులు కూడా అలా చెప్పుకోలేరు. అందరినీ రచించేవారు శివబాబాయేనని మీకు తెలుసు. నేను దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తున్నాను. విధముగా అనే శక్తి కూడా ఎవ్వరిలోనూ లేదు. స్వయాన్ని శ్రీకృష్ణుడిగా చెప్పుకున్నా, బ్రహ్మాగా చెప్పుకున్నా, శంకరునిగా చెప్పుకున్నా... అనేకమంది స్వయాన్ని అవతారముగా కూడా చెప్పుకుంటారు కానీ అవన్నీ అసత్యాలే. ఇక్కడకు వచ్చి ఎప్పుడైతే వింటారో అప్పుడు తప్పకుండా తండ్రి ఒక్కరేనని, అవతారం కూడా ఒక్కటేనని అర్థం చేసుకుంటారు. వారు అంటారు, నేను మిమ్మల్ని నాతోపాటు తీసుకువెళ్తాను. విధముగా అనే శక్తి కూడా ఎవరిలోనూ లేదు. 5000 సంవత్సరాల క్రితం కూడా గీతా భగవానుడైన శివబాబా చెప్పారు, వారే ఆది సనాతన ధర్మాన్ని స్థాపన చేసారు. వారే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. దోమల గుంపులా ఆత్మలు వెళ్ళాయి అని కూడా అంటూ ఉంటారు. కావున తండ్రి మార్గదర్శకునిగా అయి వచ్చి అందరినీ విముక్తులను చేస్తారు. ఇప్పుడు ఇది కలియుగాంతము, దీని తర్వాత సత్యయుగము రానున్నది. మరి తప్పకుండా వారు వచ్చి పవిత్రంగా తయారుచేసి పవిత్ర ప్రపంచంలోకి తీసుకువెళ్తారు. గీతలో ఏవో కొన్ని పదాలు ఉన్నాయి. ధర్మం కొరకు శాస్త్రాలైతే కావాలి కదా అని భావిస్తారు. కావున కూర్చొని గీతా శాస్త్రాన్ని తయారుచేసారు. సర్వ శాస్త్రమయి శిరోమణి నంబర్ వన్ మాత గీతయే కానీ పేరు మార్చేసారు. సమయంలో కర్తవ్యము చేసే తండ్రి ద్వాపరములో కూర్చొని వ్రాయరు కదా. మళ్ళీ అదే గీత వెలువడుతుంది. డ్రామాలో ఇదే గీత రచింపబడి ఉంది. విధముగా తండ్రి మళ్ళీ మనుష్యులను దేవతలుగా తయారుచేస్తారో అలాగే శాస్త్రాలను కూడా తర్వాత ఎవరో ఒకరు కూర్చొని రాస్తారు. సత్యయుగములో శాస్త్రాలేవీ ఉండవు. తండ్రి మొత్తం చక్రమంతటి రహస్యాన్ని కూర్చొని అర్థం చేయిస్తారు. మేము 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము అని మీరు భావిస్తారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం వారే ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు తీసుకుంటారు. మిగిలిన మనుష్యులు తర్వాత వృద్ధి చెందుతారు. వారు ఇన్ని జన్మలను ఏమైనా తీసుకుంటారా? తండ్రి బ్రహ్మా ముఖము ద్వారా కూర్చొని అర్థం చేయిస్తారు. దాదా శరీరాన్ని నేను అద్దెకు తీసుకున్నాను, వీరికి కూడా ఇంతకుముందు తమ జన్మల గురించి తెలియదు. వీరు వ్యక్తమైనవారు - ప్రజాపిత బ్రహ్మా. వారు అవ్యక్తమైనవారు. కానీ వాస్తవానికి ఇరువురూ ఒక్కటే. మీరు కూడా జ్ఞానం ద్వారా సూక్ష్మవతనవాసి ఫరిశ్తాలుగా అవుతున్నారు. సూక్ష్మవతనవాసులను ఫరిశ్తాలు అని అంటారు ఎందుకంటే అక్కడ రక్తమాంసాలు ఉండవు. బ్రహ్మా, విష్ణు, శంకరులకు కూడా రక్తమాంసాలు లేవు, మరి వారి చిత్రాలను ఎలా తయారుచేస్తారు. శివుని చిత్రాన్ని కూడా తయారుచేస్తారు. నిజానికి వారు ఒక నక్షత్రమువంటివారు. వారి రూపాన్ని కూడా తయారుచేస్తారు. బ్రహ్మా, విష్ణు, శంకరులు సూక్ష్మమైనవారు. మనుష్యుల రూపాన్ని విధముగా తయారుచేస్తారో అలా శంకరుని రూపాన్ని తయారుచేయలేరు ఎందుకంటే వారికి రక్తమాంసాల శరీరమైతే లేదు. మనం అర్థం చేయించేందుకు ఇలా స్థూలంగా తయారుచేస్తాము కానీ వారు సూక్ష్మమైనవారని మీరు కూడా గమనిస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాస్ 13-7-68

మనుష్యులు రెండు విషయాలను తప్పకుండా కోరుకుంటారు. ఒకటి శాంతి, మరొకటి సుఖము. విశ్వం కొరకు శాంతి మరియు స్వయం కొరకు శాంతి, విశ్వం కొరకు సుఖము మరియు స్వయం కొరకు సుఖాన్ని మనుష్యులు కోరుకుంటారు. కావున ఇలా అడగాలి - ఇప్పుడు అశాంతి ఉందంటే తప్పకుండా ఎప్పుడో శాంతి ఉండి ఉండాలి కదా. కానీ అది ఎప్పుడు ఎలా ఉండేది, అశాంతి ఎందుకు వచ్చింది, ఇది ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ఘోర అంధకారంలో ఉన్నారు. మీరు శాంతి మరియు సుఖం కోసం అందరికీ ఎంతో మంచి మార్గాన్ని తెలియజేస్తారు. అది విని వారికి సంతోషం కలుగుతుంది, కానీ పావనంగా కూడా అవ్వాలి అని విన్నప్పుడు మళ్ళీ చల్లబడిపోతారు. వికారాలు అందరికీ శత్రువు కానీ అదంటే అందరికీ ప్రేమ. దీనిని వదలాలంటే హృదయం విదీర్ణమవుతుంది. దీని పేరే విషము. అయినా కూడా విడిచిపెట్టరు. మీరు ఎంత తల బాదుకున్నా కానీ వారు మళ్ళీ ఓడిపోతూనే ఉంటారు. అంతా పవిత్రత యొక్క విషయమే. ఇందులో చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఎవరైనా కన్యను చూస్తే ఆకర్షణ కలుగుతుంది. క్రోధములో లేక లోభములో లేక మోహములో ఆకర్షణ ఉండదు. కామము మహాశత్రువు. దీనిపై విజయము పొందడము మహావీరుల పని. దేహ-అభిమానము తర్వాత ముందుగా కామమే వస్తుంది. దీనిపై విజయము పొందాలి. ఎవరైతే పవిత్రంగా ఉంటారో, వారి ఎదుట అపవిత్రమైన, కాముకులైన మనుష్యులు నమస్కారం చేస్తారు. మేము వికారులము, మీరు నిర్వికారులు అని అంటారు. మేము క్రోధులము, లోభులము... అని అనరు. అంతా వికారాల విషయమే. వివాహం చేసుకునేదే వికారాల కోసము, తల్లిదండ్రులకు ఇదే చింత ఉంటుంది. పిల్లలు పెద్దవారైతే ధనం కూడా ఇస్తారు, వికారాలలోకి కూడా వెళ్తారు. వికారాలలోకి వెళ్ళకపోతే గొడవలు జరిగిపోతాయి. వీరు (దేవతలు) సంపూర్ణ నిర్వికారులు అని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. మీ వద్ద లక్ష్యం-ఉద్దేశ్యం ఎదురుగా ఉంది. నరుని నుండి నారాయణునిగా, రాజులకే రాజుగా అవ్వాలి. చిత్రం ఎదురుగా ఉంది. దీనిని సత్సంగము అని అనరు. ఇది పాఠశాల. ఎప్పుడైతే సమ్ముఖంగా వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారో, అప్పుడే సత్యమైన సత్సంగము, సత్యమైన తండ్రి యొక్క తోడు ఉంటాయి. సత్యమైనవారి సాంగత్యము కావాలి. వారే గీత జ్ఞానాన్ని ఇస్తారు అనగా రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి ఏమీ గీతను వినిపించరు. గీతా పాఠశాల అన్న పేరును విని మనుష్యులు గీతను విందాము అని అనుకుంటారు. అంతగా ఆకర్షణ ఉంటుంది. ఇది సత్యమైన గీతా పాఠశాల, ఇక్కడ ఒకే సెకండులో సద్గతి, ఆరోగ్యము, ధనము మరియు సంతోషము లభిస్తాయి. మరి సత్యమైన గీతా పాఠశాల అని ఎందుకు వ్రాశారు? అని అడగాలి. కేవలం గీతా పాఠశాల అని వ్రాస్తే కామన్ అయిపోతుంది. సత్యమైన అన్న పదాన్ని చదివినప్పుడు బహుశా అసత్యమైనది కూడా ఉంటుందేమో అని ఆలోచన కలగడానికి ఆస్కారముంటుంది. కావున ‘‘సత్యమైన’’ అన్న పదాన్ని తప్పకుండా వ్రాయవలసి ఉంటుంది. పావన ప్రపంచము అని సత్యయుగాన్ని, పతిత ప్రపంచము అని కలియుగాన్ని అనడం జరుగుతుంది. సత్యయుగములో వీరు పావనంగా ఉండేవారు. వారు అలా ఎలా అయ్యారు అన్నదానిని నేర్పిస్తారు. తండ్రి బ్రహ్మా ద్వారా చదివిస్తారు. లేదంటే ఎలా చదివిస్తారు. ఎవరైతే కల్ప పూర్వం అర్థం చేసుకున్నారో వారే యాత్రను అర్థం చేసుకుంటారు. భక్తి మార్గపు ఊబిలో ఇరుక్కుని ఉన్నారు. భక్తి ఆడంబరము చాలా ఉంటుంది. ఇక్కడైతే ఏమీ ఉండదు. కేవలము ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అన్న స్మృతిని ఉంచుకోండి. పవిత్రంగా అయ్యి వెళ్ళాలి. ఇందుకొరకు స్మృతిలో ఉండాలి. తండ్రి అయితే స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారో, వారిని స్మృతి చెయ్యలేరా! ముఖ్యమైన విషయము ఇది. ఇందులోనే శ్రమ ఉంది అని అందరూ అంటారు. పిల్లలు చాలా మంచిగా భాషణను ఇస్తారు కానీ యోగములో ఉండి అర్థం చేయించినట్లయితే దాని ప్రభావము కూడా చాలా మంచిగా ఉంటుంది. స్మృతిలో మీకు శక్తి లభిస్తుంది. సతోప్రధానంగా అవ్వటం ద్వారా సతోప్రధాన విశ్వానికి యజమానులుగా అవుతారు. స్మృతిని నిష్ఠ (యోగము) అని అంటారా! మేము అర్ధగంట నిష్ఠలో కూర్చున్నాము అని అంటారు, కానీ ఇది తప్పు. తండ్రి కేవలం స్మృతిలో ఉండండి అని అంటారు. ఎదురుగా కూర్చొని నేర్పించవలసిన అవసరము లేదు. అనంతమైన తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చెయ్యాలి ఎందుకంటే వారు చాలా ఖజానాలను ఇస్తారు. స్మృతి ద్వారా సంతోషపు పాదరసము పైకెక్కాలి. అతీంద్రియ సుఖము అనుభవమవుతుంది. మీ జీవితము చాలా విలువైనది, దీనిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఎంత ఎక్కువ సమయము జీవిస్తారో అంతగా ఖజానాలను తీసుకుంటారు. ఎప్పుడైతే మనము సతోప్రధానంగా అవుతామో, అప్పుడు పూర్తి ఖజానాలు లభిస్తాయి. మురళిలో కూడా బలము ఉంటుంది. ఖడ్గములో పదును ఉంటుంది కదా. మీలో కూడా స్మృతి అనే పదును ఉన్నట్లయితే ఖడ్గము బాగా పదునుగా ఉంటుంది. జ్ఞానంలో అంతటి పదును లేదు, అందుకే ఎవరికీ దాని ప్రభావము అంతగా ఉండదు. మళ్ళీ వారి కల్యాణము కొరకు తండ్రి రావలసి ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్మృతిలో పదునును నింపుకుంటారో, అప్పుడు విద్వాంసులు, ఆచార్యులు మొదలైనవారందరికీ మంచి గురి తగులుతుంది. అందుకే చార్టు పెట్టుకోండి అని తండ్రి అంటారు. మేము బాబాను చాలా బాగా స్మృతి చేస్తాము, కానీ చెప్పటానికి నోరు పెగలటం లేదు అని అంటారు. మీరు స్మృతిలో ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. అచ్ఛా - పిల్లలకు గుడ్ నైట్.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇంట్లో ఉంటూ కూడా ఆత్మిక సేవను చేయాలి. పవిత్రముగా అవ్వాలి మరియు తయారుచేయాలి.

2. చైతన్యమైన నరకములో ఉంటూ కూడా అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు.

వరదానము:-

మీ సర్వ విశేషతలను కార్యములో ఉపయోగించి వాటిని విస్తరింపజేసే సిద్ధి స్వరూప భవ

ఎంతెంత మీ విశేషతలను మనసా సేవ లేక వాచా మరియు కర్మణా సేవలో ఉపయోగిస్తారో అంతగా విశేషతలు విస్తారాన్ని పొందుతూ ఉంటాయి. సేవలో ఉపయోగించడం అనగా ఒక బీజము నుండి అనేక ఫలాలు ప్రత్యక్షమవ్వడము. శ్రేష్ఠ జీవితంలో విశేషతలైతే జన్మ సిద్ధ అధికారం రూపంలో లభించాయో వాటిని కేవలం బీజ రూపంలో అలాగే ఉంచకండి, సేవ అనే భూమిలో నాటితే ఫల స్వరూపం అనగా సిద్ధి స్వరూపాన్ని అనుభవం చేస్తారు.

స్లోగన్:-

విస్తారాన్ని చూడకుండా సారాన్ని చూడండి మరియు స్వయంలో ఇముడ్చుకోండి - ఇదే తీవ్ర పురుషార్థము.

 Download PDF

Post a Comment

0 Comments