Header Ads Widget

Header Ads

TELUGU MURLI 22.01.23

 

22-01-2023  ప్రాత:మురళి  ఓంశాంతి  ‘‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 25-11-93 మధువనం


Listen to the Murli audio file



‘‘సహజ సిద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞాన స్వరూప ప్రయోగీ ఆత్మలుగా అవ్వండి’’

రోజు జ్ఞానదాత, వరదాత తమ జ్ఞాన స్వరూప ఆత్మలు, యోగ స్వరూప ఆత్మలైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ జ్ఞాన స్వరూపులుగా మరియు యోగయుక్తులుగా ఎంతవరకు అయ్యారు? జ్ఞానాన్ని వినడానికి మరియు వినిపించడానికి నిమిత్తులుగా అయ్యారా లేక జ్ఞాన స్వరూపులుగా అయ్యారా? సమయమనుసారంగా యోగాన్ని జోడించేవారిగా అయ్యారా లేక సదా యోగీ జీవితము కలవారిగా అనగా ప్రతి కర్మలోనూ యోగయుక్తమైన, యుక్తియుక్తమైన, స్వతహా మరియు సదా యోగిగా అయ్యారా? బ్రాహ్మణ ఆత్మనైనా మీరు జ్ఞానీలు మరియు యోగీలా అని ఎవరైనా అడిగితే ఏమని చెప్తారు? అందరూ జ్ఞానీలు మరియు యోగీలే కదా? జ్ఞాన స్వరూపులుగా అవ్వటము అనగా ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ సమర్థంగా ఉంటాయి. వ్యర్థం సమాప్తమైపోతుంది ఎందుకంటే ఎక్కడైతే సమర్థం ఉంటుందో అక్కడ వ్యర్థం ఉండలేదు. విధంగా ప్రకాశము మరియు అంధకారము రెండూ కలిసి ఉండవు. కావునజ్ఞానముప్రకాశము, ‘వ్యర్థముఅంధకారము. వర్తమాన సమయంలో వ్యర్థాన్ని సమాప్తం చెయ్యటంపై అటెన్షన్ పెట్టాలి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయము, సంకల్పం రూపీ బీజాన్ని సమర్థంగా తయారుచేసుకోవాలి. ఒకవేళ సంకల్పం రూపీ బీజము సమర్థంగా ఉంటే మాటలు, కర్మలు, సంబంధాలు సహజంగానే సమర్థంగా అవుతాయి. కనుక జ్ఞాన స్వరూపులు అనగా ప్రతి సమయము, ప్రతి సంకల్పము, ప్రతి క్షణము సమర్థము.

యోగ స్వరూప ఆత్మలుగా అందరూ అయ్యారు కానీ ప్రతి సంకల్పము స్వతహాగా, యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉండాలి, ఇందులో నంబరువారుగా ఉన్నారు. ఎందుకని నంబరు తయారైంది? విధాత కూడా ఒక్కరే, విధి కూడా ఒక్కటే అయినప్పుడు ఇక నంబరువారుగా ఎందుకున్నారు? యోగీలుగా అయితే అయ్యారు కానీ ప్రయోగీలుగా తక్కువమంది అవుతారు అన్నదానిని బాప్ దాదా చూసారు. యోగము చెయ్యటము మరియు చేయించటము, రెండింటిలో అందరూ తెలివైనవారు. యోగము చేయించటము రాదు అని అనేవారు ఎవరైనా ఉన్నారా? విధంగా యోగము చెయ్యటము మరియు చేయించటములో యోగ్యులుగా ఉన్నారో, అలాగే ప్రయోగము చెయ్యటంలో యోగ్యులుగా అవ్వాలి మరియు యోగ్యులుగా తయారుచెయ్యాలి - దీనినే యోగీ జీవితము అనగా యోగయుక్త జీవితమని అంటారు. ఇప్పుడు ప్రయోగీ జీవితము యొక్క అవసరముంది. యోగము యొక్క నిర్వచనము ఏదైతే తెలుసో, దేనినైతే వర్ణిస్తారో, విశేషతలన్నీ ప్రయోగంలోకి వస్తాయా? అన్నింటికన్నా ముందు మీలో మీరు ఇది చెక్ చేసుకోండి - నా సంస్కార పరివర్తనలో ఎంతవరకు ప్రయోగీగా అయ్యాను. ఎందుకంటే మీ అందరి శ్రేష్ఠ సంస్కారాలే శ్రేష్ఠ ప్రపంచ రచనకు పునాది. ఒకవేళ పునాది దృఢంగా ఉన్నట్లయితే ఇతర విషయాలన్నీ స్వతహాగా దృఢంగా ఉండనే ఉంటాయి. కనుక సమయానికి సంస్కారాలు ఎక్కడా మోసం చేయడం లేదు కదా అని చూసుకోండి. శ్రేష్ఠ సంస్కారాలను పరివర్తన చేసే ఎటువంటి వ్యక్తి అయినా, వస్తువైనా, పరిస్థితి అయినా, యోగ ప్రయోగము చేసే ఆత్మను శ్రేష్ఠత నుండి సాధారణతలోకి కదిలించలేరు. విషయమే అటువంటిది, వ్యక్తియే అలా ఉన్నారు, వాయుమండలము అలా ఉంది, అందుకే శ్రేష్ఠ సంస్కారాలను పరివర్తన చేసి సాధారణంగా లేక వ్యర్థంగా చేసుకున్నాము అని అనటం కాదు, ఇలా అనేవారిని ప్రయోగీ ఆత్మ అని అంటారా? ఒకవేళ సమయానికి యోగ శక్తుల ప్రయోగం జరగకపోతే వారిని ఏమంటారు? కనుక ముందుగా పునాదిని చూసుకోండి - ఎంతవరకు సమయానికి ప్రయోగీగా అయ్యాను? ఒకవేళ స్వయం యొక్క సంస్కారాల పరివర్తకులుగా అవ్వనట్లయితే కొత్త ప్రపంచ పరివర్తకులుగా ఎలా అవుతారు?

ప్రయోగీ ఆత్మ యొక్క మొదటి గుర్తు - సంస్కారాలపై ప్రయోగంలో సదా విజయీ. రెండవ గుర్తు - ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితులపై యోగ ప్రయోగం ద్వారా విజయీ. ఎప్పటికప్పుడు ప్రకృతి అలజడి కూడా యోగీ ఆత్మలను తన వైపుకు ఆకర్షితం చేస్తుంది. అటువంటి సమయములో యోగం అనే విధి ప్రయోగములోకి వస్తుందా? ఎప్పుడైనా యోగీ పురుషులను లేక పురుషోత్తమ ఆత్మలను ప్రకృతి ప్రభావితమైతే చెయ్యటం లేదు కదా? ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలైన మీరు పురుషోత్తమ ఆత్మలు. ప్రకృతి పురుషోత్తమ ఆత్మలకు దాసి. యజమాని దాసి ప్రభావంలోకి వస్తే, వారినేమంటారు? రోజుల్లో పురుషోత్తమ ఆత్మలను ప్రకృతి సాధనాలు లేక సౌకర్యాల రూపంలో ప్రభావితం చేస్తుంది, సాధనాలు లేక సౌకర్యాల ఆధారంపై యోగీ జీవితముంటుంది. సాధనాలు లేక సౌకర్యాలు తక్కువైతే యోగయుక్తంగా ఉండటము కూడా తక్కువైపోతుంది - దీనినే ప్రభావితమవ్వటము అని అంటారు. యోగీ లేక ప్రయోగీ ఆత్మ యొక్క సాధన ఎదురుగా సాధనాలు స్వతహాగా వాటంతటవే వస్తాయి. సాధనాలు సాధనకు ఆధారంగా ఉండకూడదు కానీ సాధన సాధనాలను స్వతహాగా ఆధారంగా చేసుకుంటుంది, ఇటువంటివారిని ప్రయోగీ ఆత్మ అని అంటారు. కనుక చెక్ చేసుకోండి - సంస్కార పరివర్తనలో విజయీగా మరియు ప్రకృతి ప్రభావముపై విజయీగా ఎంతవరకు అయ్యారు? మూడవ గుర్తు - వికారాలపై విజయీ. యోగీ-ప్రయోగీ ఆత్మల ముందు పంచ వికారాలు, ఇవి ఇతరుల కొరకు విష సర్పాలు కానీ యోగీ-ప్రయోగీ ఆత్మలైన మీ కొరకు సర్పాలు మెడలోని మాలగా అవుతాయి. బ్రాహ్మణులైన మీ యొక్క మరియు బ్రహ్మాబాబా యొక్క అశరీరి తపస్వీ శంకర స్వరూపం యొక్క స్మృతిచిహ్నాన్ని ఇప్పుడు కూడా భక్తులు పూజిస్తూ మరియు గాయనం చేస్తూ ఉంటారు. రెండవ స్మృతిచిహ్నము - సర్పాలు మీకు ఎంతగా అధీనమైపోతాయంటే మీరు సంతోషంతో నాట్యము చేసేందుకు స్టేజ్ వలె అవుతాయి. విజయులుగా అయినప్పుడు ఏమి అనుభవము చేస్తారు? స్థితి ఉంటుంది? సంతోషంలో నాట్యము చేస్తూ ఉంటారు కదా. కనుక స్థితిని స్టేజ్ రూపంలో చూపించారు. స్థితిని కూడా స్టేజ్ అని అంటారు. విధంగా వికారాలపై విజయీగా అవ్వాలి - ఇటువంటివారిని ప్రయోగీ అని అంటారు. కనుక ఎంతవరకు ప్రయోగీగా అయ్యాము అన్నదానిని చెక్ చేసుకోండి. ఒకవేళ యోగాన్ని సమయానికి ప్రయోగించకపోతే, యోగ విధి ద్వారా సమయానికి సిద్ధి లభించకపోతే దానిని యథార్థ విధి అని అంటారా? సమయము తన తీవ్ర గతిని ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంది. అనేకత, అధర్మము, తమోప్రధానత ప్రతి క్షేత్రములో తీవ్రగతితో పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సమయములో మీ యోగ విధి యొక్క వృద్ధి మరియు విధి ద్వారా సిద్ధిలో వృద్ధి తీవ్రగతితో ఉండటము అవసరము. నంబరు ముందుకు వెళ్ళడానికి ఆధారము ప్రయోగీగా అయ్యే సహజ విధి. కానీ బాప్ దాదా ఏం చూసారంటే - సమయానికి ప్రయోగము చెయ్యటంలో తీవ్ర గతికి బదులుగా సాధారణ గతి ఉంది. ఇప్పుడు దీనిని పెంచండి. అప్పుడేమి జరుగుతుందంటే, సిద్ధి స్వరూపాన్ని అనుభవము చేస్తూ ఉంటారు. మీ జడ చిత్రాల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే అనుభవాన్ని చేస్తూ ఉంటారు. చైతన్యములో సిద్ధి స్వరూపులుగా అయ్యారు, అందుకే స్మృతిచిహ్నము కొనసాగుతూ వస్తుంది. రిద్ధి-సిద్ధి కలవారు కాదు, విధి ద్వారా సిద్ధి. కనుక ఏం చెయ్యాలో అర్థమైందా? అన్నీ ఉన్నాయి కానీ సమయానికి ప్రయోగించటము మరియు ప్రయోగము సఫలమవ్వటము, ఇటువంటివారినే జ్ఞాన స్వరూప ఆత్మ అని అంటారు. ఇటువంటి జ్ఞాన స్వరూప ఆత్మలు అతి సమీపమైనవారు మరియు అతి ప్రియమైనవారు. అచ్ఛా!

సదా యోగ విధి ద్వారా శ్రేష్ఠ సిద్ధిని అనుభవము చేసేవారికి, సదా సాధారణ సంస్కారాలను శ్రేష్ఠ సంస్కారాలలోకి పరివర్తన చేసేవారికి, సంస్కార పరివర్తక ఆత్మలకు, సదా ప్రకృతీజీతులకు, వికారాలపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే విజయీ ఆత్మలకు, సదా ప్రయోగం యొక్క గతిని తీవ్రంగా ఉన్నట్లు అనుభవము చేసే జ్ఞాన స్వరూపులకు, యోగయుక్త యోగీ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

(నవంబరు 24 ఇద్దరు కుమారీల సమర్పణ సమారోహము తర్వాత రాత్రి 10 గంటలకు ఆల్రౌండర్ దాదీగారు తమ పాత శరీరాన్ని వదిలి బాప్ దాదా ఒడిలోకి చేరుకున్నారు, 25 తారీఖు మధ్యాహ్నం వారి అంతిమ సంస్కారాలను చెయ్యటం జరిగింది, సాయంకాలము మురళి తరువాత దాదీలతో మిలనము చేసే సమయంలో బాప్ దాదా ఉచ్చరించిన మహావాక్యాలు విధంగా ఉన్నాయి)

ఆటల్లో రకరకాల ఆటలను చూస్తుంటారు. సాక్షీగా అయ్యి ఆటను చూడటంలో ఆనందం కలుగుతుంది కదా. అది ఉత్సవమైనా లేక ఎవరైనా శరీరము వదిలినా గానీ ఏమనిపిస్తుంది? ఆటలో ఆటగా అనిపిస్తుంది. అంతేకాక ఎలాగైతే ఆట జరుగుతుందో మరియు సమయమనుసారంగా సమాప్తమైపోతుందో, ఇది కూడా అలానే అనిపిస్తుంది కదా. అలాగే ఏదైతే జరిగిందో అది సహజంగా సమాప్తమయ్యింది కావున ఆటలానే అనిపిస్తుంది. ప్రతి ఆత్మకు తమ-తమ పాత్ర ఉంటుంది. సర్వాత్మల శుభ భావన, అనేక ఆత్మల శుభ భావన ప్రాప్తించటము, ఇది కూడా ప్రతి ఆత్మ యొక్క భాగ్యానికి లభించిన సిద్ధి. కావున ఏదైతే జరిగిందో, అక్కడ ఏం చూసారు? ఆటను చూసారా లేక మృత్యువును చూసారా? ఒక వైపు అలౌకిక స్వయంవరాన్ని చూసారు మరియు రెండో వైపు శరీరాన్ని మార్చుకునే ఆటను చూసారు. కానీ రెండూ ఎలా అనిపించాలి? ఆటలో ఆట. ఏమైనా తేడా ఉంటుందా? స్థితిలో తేడా వస్తుందా? అలౌకిక స్వయంవరాన్ని చూడటంలో మరియు శరీరము మారటాన్ని చూడటంలో ఏమైనా తేడా వచ్చిందా? ఆలోచన ఏమైనా కాస్త మారిందా లేక మారలేదా? సాక్షీగా అయ్యి ఆటను చూసినట్లయితే దేని విధి దానిదే. సహజంగా నష్టోమోహులుగా అవ్వటము, ఇది బహుకాలపు యోగ విధి ద్వారా కలిగిన సిద్ధి. కనుక నష్టోమోహులు, సహజ మృత్యువు యొక్క ఆటను చూసారు. ఆటలో రహస్యాన్ని చూసారు? దేహపు స్మృతి నుండి కూడా ఉపరామము. వ్యాధి ద్వారా గానీ, విధి ద్వారా గానీ మరే ఇతర ఆకర్షణా అంతిమ సమయములో ఆకర్షితము చెయ్యకూడదు. దీనినే సహజంగా శరీరాన్ని మార్చటము అని అంటారు. మరి ఏం చెయ్యాలి? నష్టోమోహా, సెంటరు కూడా గుర్తు రాకూడదు. (టీచర్లను చూస్తూ) ఎవరైనా జిజ్ఞాసువులు గుర్తు రావటము, సెంటరులోని వస్తువైనా గుర్తు రావటము, పక్కకు పెట్టినవి గుర్తు రావటము... ఇలా ఉండకూడదు. అన్నింటి నుండి అతీతము మరియు తండ్రికి ప్రియము. మొదటి నుండే అంచులను వదిలేసారు. అంచునూ ఆధారంగా చేసుకోకూడదు. గమ్యముపై తప్ప మరి దేనిపైనా ఆకర్షణ ఉండకూడదు. అచ్ఛా!

నిర్మలశాంతా దాదీతో మిలనము:- సంగఠన బాగా అనిపిస్తుందా? సంగఠనకు విశేషమైన శోభ ఉంటుంది. అందరి దృష్టి ఎంత ప్రేమగా మీ అందరివైపుకు వెళ్తుంది! ఎంతవరకైనా ఎంత సేవ ఉంటే, అంత సేవ శరీరము ద్వారా జరగాల్సిందే. ఎలాగైనా సరే శరీరం నడుస్తూనే ఉంటుంది. శరీరాన్ని నడిపించే పద్ధతి వచ్చింది కదా. మంచిగా నడుస్తుంది ఎందుకంటే తండ్రి మరియు అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి. సంతోషంగా ఉండాలి మరియు సంతోషాన్ని పంచాలి, ఇక వేరే పనేముంది. అందరూ మిమ్మల్ని చూస్తూ-చూస్తూ ఎంత సంతోషిస్తారు, కావున సంతోషాన్ని పంచుతున్నారు కదా. తింటున్నారు కూడా, పంచుతున్నారు కూడా. మీరు ప్రతి ఒక్కరూ దర్శనీయ మూర్తులు. అందరి దృష్టి నిమిత్త ఆత్మల వైపుకు వెళ్తుంది కనుక దర్శనీయ మూర్తులుగా అయినట్లు కదా. అచ్ఛా!

అవ్యక్త బాప్ దాదా యొక్క వ్యక్తిగత మిలనము

1. బ్రాహ్మణ జీవితానికి ఆధారము - స్మృతి మరియు సేవ:- డ్రామా అనుసారంగా బ్రాహ్మణ జీవితములో అందరికీ సేవ యొక్క ఛాన్స్ లభించింది కదా ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి ఆధారమే స్మృతి మరియు సేవ. ఒకవేళ స్మృతి మరియు సేవ బలహీనమైతే, విధంగా శరీర ఆధారము బలహీనమైనప్పుడు శరీరము మందులతో నడుస్తుంది కదా, అలా బ్రాహ్మణ జీవితములో ఒకవేళ స్మృతి మరియు సేవ యొక్క ఆధారము దృఢంగా లేకుండా బలహీనంగా ఉన్నట్లయితే బ్రాహ్మణ జీవితము కూడా ఒక్కోసారి వేగంగా నడుస్తుంది, ఒక్కోసారి ఢీలాగా నడుస్తుంది, ఏదైనా నెడితే నడుస్తుంది. ఏదైనా సహయోగము లభిస్తే, ఏదైనా తోడు లభిస్తే, ఏవైనా పరిస్థితులు అనుకూలిస్తే నడుస్తారు, లేదంటే ఢీలా అయిపోతారు కనుక స్మృతి మరియు సేవ అనే విశేష ఆధారము సదా శక్తిశాలిగా ఉండాలి. రెండూ శక్తిశాలిగా ఉండాలి. సేవ చాలా ఉంది, స్మృతి తక్కువగా ఉంది లేక స్మృతి చాలా బాగుంది సేవ తక్కువగా ఉంది అంటే తీవ్ర గతి ఉండజాలదు. స్మృతి మరియు సేవ, రెండింటిలో తీవ్ర గతి ఉండాలి. శక్తిశాలిగా ఉండాలి. మరి రెండూ శక్తిశాలిగా ఉన్నాయా లేక తేడా వస్తుందా? ఒక్కోసారి సేవ ఎక్కువవుతుంది, ఒక్కోసారి స్మృతి ఎక్కువవుతుందా? రెండూ కలిపి-కలిపి ఉండాలి. స్మృతి మరియు నిస్వార్థ సేవ. స్వార్థముతో కూడిన సేవ కాదు, నిస్వార్థ సేవ ఉన్నట్లయితే మాయాజీతులుగా అవ్వటము చాలా సహజము. ప్రతి కర్మలో, కర్మ సమాప్తి కన్నా ముందు సదా విజయము కనిపిస్తుంది, విజయము లభించే ఉంది అన్న ఇంతటి స్థిరమైన నిశ్చయము అనుభవమవుతుంది. ఒకవేళ బ్రాహ్మణ ఆత్మలకు విజయము లభించకపోతే ఇంకెవరికి లభిస్తుంది? క్షత్రియులకు లభిస్తుందా? బ్రాహ్మణులకు విజయము లభిస్తుంది కదా. ప్రశ్నార్థకము ఉండదు. చెయడమైతే చేస్తున్నాములే, నడవటమైతే నడుస్తున్నాములే, చూద్దాములే, అయిపోతుందిలే, అవ్వడం అవ్వాలి కదా... ఇక మాటలు రావు. ఏమవుతుందో తెలియదు, అవుతుందో లేదో తెలియదు... ఇవి నిశ్చయముతో కూడుకున్న మాటలా? నిశ్చయబుద్ధి కలవారే విజయులు అన్న గాయనము ఉంది కదా? ప్రాక్టికల్ గా జరిగింది కాబట్టే గాయనము ఉంది. నిశ్చయబుద్ధి యొక్క గుర్తు విజయము నిశ్చితము. ఎవరికైనా ఏదైనా శక్తి ఉంటే, ధన శక్తి గానీ, బుద్ధి శక్తి గానీ, సంబంధ-సంపర్కాల శక్తి గానీ ఉంటే వారికి ఇదేమంత పెద్ద విషయము, ఇదసలు విషయమే కాదు అన్న నిశ్చయము ఉంటుంది. మీవద్దనైతే అన్ని శక్తులు ఉన్నాయి. ధనం యొక్క శక్తి ఉందా లేక ధన శక్తి కోటీశ్వరుల వద్ద ఉందా? అన్నింటికంటే పెద్ద ధనము అవినాశీ ధనము, అది సదా తోడుగా ఉంటుంది. కనుక ధనం యొక్క శక్తి కూడా ఉంది, బుద్ధి యొక్క శక్తి కూడా ఉంది, పొజిషన్ యొక్క శక్తి కూడా ఉంది. ఏయే శక్తులైతే గాయనము చెయ్యబడ్డాయో, శక్తులన్నీ మీలో ఉన్నాయి. ఉన్నాయా లేక ఎప్పుడైనా ప్రాయః లోపమైపోతాయా? వీటిని ఇమర్జ్ రూపంలో అనుభవము చెయ్యండి. ఉన్నదైతే సర్వశక్తివంతుని సంతానంగా కానీ అనుభవము అవ్వదు అని ఇలా అనుకోవటము కాదు. మరి అందరూ నిండుగా ఉన్నారా లేక కొద్ది-కొద్దిగా ఖాళీగా ఉన్నారా? సమయానికి విధి ద్వారా సిద్ధి ప్రాప్తించాలి. అవసరమైన సమయానికి ఉండవు కానీ చాలా శక్తులు ఉన్నాయి అని నషా ఉండటము కాదు. ఎప్పుడూ మీ శక్తులను మర్చిపోవద్దు, ఉపయోగిస్తూ వెళ్ళండి. ఒకవేళ స్వయము కొరకు కార్యములో ఉపయోగించడము వచ్చినట్లయితే ఇతరుల కార్యములో కూడా ఉపయోగించగలుగుతారు. పాండవులలో శక్తి వచ్చిందా లేక ఎప్పుడైనా క్రోధము వస్తుందా? కొద్ది-కొద్దిగా క్రోధము వస్తుందా? ఎవరైనా క్రోధం చేస్తే క్రోధం వస్తుందా, ఎవరైనా అవమానపరిస్తే క్రోధం వస్తుందా? శత్రువు వస్తే ఓటమి కలుగుతుంది అన్నట్లుంది ఇది. మాతలకు కొద్ది-కొద్దిగా మోహం కలుగుతుందా? పాండవులకు ప్రతి కల్పములోని తమ విజయము యొక్క సంతోషము సదా ఇమర్జ్ అయ్యి ఉండాలి. ఎప్పుడైనా ఎవరైనా పాండవులను గుర్తు చేసుకుంటే పాండవులు అన్న పదంతో విజయము ఎదురుగా వస్తుంది కదా. పాండవులు అనగా విజయీ. పాండవుల కథలో ఉన్న రహస్యమే ఏమిటి? విజయము కదా. కనుక ప్రతి కల్పములోని విజయులు. ఇమర్జ్ రూపంలో నషా ఉండాలి. మర్జ్ అయ్యి ఉండకూడదు. అచ్ఛా!

2. సర్వుల ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు నిర్మానులుగా అవ్వండి:- అందరూ స్వయాన్ని సదా కోట్లలో కొద్దిమందిగా మరియు కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవము చేస్తారా? లేక కోట్లలో కొద్దిమంది అని ఏదైతే గాయనము చెయ్యబడిందో అది వేరే ఎవరోనా? లేక మీరేనా? కనుక ప్రతి ఒక్క ఆత్మకూ ఎంతటి మహత్వము ఉంది అనగా ప్రతి ఆత్మా మహానాత్మ. కనుక ఎవరు ఎంత మహానులుగా ఉంటారో, మహానతకు గుర్తు ఏమిటంటే ఎంతటి మహానులో అంతే నిర్మానులు ఎందుకంటే సదా నిండుగా ఉన్న ఆత్మలు. వృక్షం ఎంత నిండుగా ఉంటుందో అంత ఒంగి ఉంటుంది అని వృక్షం గురించి అంటారు కదా. అలా నిర్మానతయే సేవ చేస్తుంది. వృక్షం ఒంగి ఉండటమనేది సేవ చేస్తుంది, ఒకవేళ ఒంగి ఉండకపోతే సేవ చెయ్యదు. కనుక ఒక వైపు మహానత ఉంది మరియు రెండో వైపు నిర్మానత ఉంది. మరియు ఎవరైతే నిర్మానులుగా ఉంటారో వారు సర్వుల ద్వారా గౌరవాన్ని పొందుతారు. స్వయము నిర్మానులుగా అయినట్లయితే ఇతరులు గౌరవం ఇస్తారు. ఎవరైతే అభిమానములో ఉంటారో వారికి ఎవ్వరూ గౌరవం ఇవ్వరు. వారి నుండి దూరంగా పారిపోతారు. కనుక మహానులుగా మరియు నిర్మానులుగా ఉన్నారా లేదా అన్నదానికి గుర్తు ఏమిటంటే - నిర్మానులు అందరికీ సుఖాన్ని ఇస్తారు. ఎక్కడకు వెళ్ళినా, ఏది చేసినా అది సుఖదాయకముగా ఉంటుంది. కనుక దీని ద్వారా చెక్ చేసుకోండి, మేము ఎంత మహానులుగా ఉన్నాము? సంబంధ-సంపర్కములోకి ఎవరు వచ్చినా వారు సుఖాన్ని అనుభూతి చెయ్యాలి. ఇలాగే ఉంటుందా లేక ఎప్పుడైనా దుఃఖం కూడా లభిస్తుందా? నిర్మానత తక్కువగా ఉన్నట్లయితే సుఖాన్ని కూడా సదా ఇవ్వలేరు. మరి సదా సుఖాన్ని ఇస్తూ, సుఖాన్ని తీసుకుంటారా లేక ఎప్పుడైనా దుఃఖాన్ని ఇస్తూ, దుఃఖాన్ని తీసుకుంటారా? సరే, ఇవ్వరు, కానీ తీసుకోవటమైతే తీసుకుంటారా? కాస్త ఫీల్ అవుతున్నారంటే తీసుకున్నట్లే కదా. ఒకవేళ విషయంలోనైనా ఎవరైనా ఫీల్ అయితే దానిని దుఃఖము తీసుకోవటము అని అంటారు. కానీ ఎవరైనా ఇచ్చినా, మీరు తీసుకోకండి, ఇదైతే మీపై ఆధారపడి ఉంది కదా. ఎవరివద్దనైనా ఉన్నదే దుఃఖమన్నప్పుడు వారేమి ఇస్తారు? దుఃఖాన్నే ఇస్తారు కదా. కానీ మీ పని - సుఖాన్ని తీసుకోవటము మరియు సుఖాన్ని ఇవ్వటము.

ఎవరైనా దుఃఖాన్ని ఇస్తుంటే, నేనేం చెయ్యాలి, నేను దుఃఖాన్ని ఇవ్వలేదు కానీ వారు ఇచ్చారు అని ఇలా అనటము కాదు. మీకు మీరు చెక్ చేసుకోవాలి - ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అని. తీసుకోవటములో కూడా తెలివి కావాలి కదా, కనుకనే బ్రాహ్మణ ఆత్మల గాయనము ఉంది - సుఖ సాగరుని పిల్లలు, సుఖ స్వరూప సుఖదేవులు అని. కనుక సుఖ స్వరూప సుఖదేవ ఆత్మలు. దుఃఖ ప్రపంచాన్ని వదిలేసారా, పక్కకు వచ్చేసారా లేక ఇప్పటివరకు కూడా ఒక కాలు దుఃఖధామంలోనూ, ఒక కాలు సంగమయుగములోనూ ఉందా? కొద్ది-కొద్దిగా అక్కడ బుద్ధి ఉండిపోయింది అని ఇలా అయితే కాదు కదా? కాలు లేకపోయినా గానీ వ్రేలు కొద్దిగా ఉండిపోయిందా? దుఃఖధామాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు ఇక దుఃఖాన్ని తీసుకోకూడదు, దుఃఖాన్ని ఇవ్వకూడదు. అచ్ఛా!

వరదానము:-

ఎగిరే కళ ద్వారా తండ్రి సమానంగా ఆల్రౌండ్ పాత్రను అభినయించే చక్రవర్తి భవ

విధంగా తండ్రి ఆల్రౌండ్ పాత్రధారియో, వారు సఖునిగా కూడా అవ్వగలరు, అలాగే తండ్రిగా కూడా అవ్వగలరు, అదే విధంగా ఎగిరే కళ కలవారు సమయంలో సేవ యొక్క అవసరం ఉంటుందో, అందులో సంపన్నమైన పాత్రను అభినయించగలరు. వారినే ఆల్రౌండ్ ఎగిరే పక్షులు అని అంటారు. వారు విధంగా నిర్బంధనులుగా ఉంటారంటే, ఎక్కడ సేవ ఉన్నా అక్కడకు చేరుకుంటారు. అన్ని రకాల సేవలలో సఫలతామూర్తులుగా అవుతారు. వారినే చక్రవర్తి, ఆల్రౌండ్ పాత్రధారి అని అంటారు.

స్లోగన్:-

ఒకరికొకరు విశేషతలను స్మృతిలో ఉంచుకొని విశ్వాసపాత్రులుగా అయినట్లయితే సంగఠన ఏకమతంగా అవుతుంది.

 Download PDF

Post a Comment

0 Comments