Header Ads Widget

Header Ads

TELUGU MURLI 21.01.23

 

21-01-2023  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 

Download PDF


Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ఆశీర్వాదాలను తీసుకోవాలంటే ప్రతి అడుగు శ్రీమతముపై నడవండి, నడవడికను మంచిగా ఉంచుకోండి’’

ప్రశ్న:-

శివబాబా హృదయం పైకి ఎవరు ఎక్కగలరు?

జవాబు:-

బిడ్డ సర్వీసబుల్ అని, వీరు అందరికీ సుఖాన్ని ఇస్తారని, మనసా-వాచా-కర్మణా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరని ఎవరి గురించైతే బ్రహ్మా బాబా గ్యారంటీ ఇస్తారో, విధంగా ఎప్పుడైతే వీరు (బ్రహ్మా బాబా) అంటారో, అప్పుడు శివబాబా హృదయం పైకి ఎక్కగలరు.

ప్రశ్న:-

సమయంలో ఆత్మిక సేవకులైన మీరు బాబాతో కలిసి సేవ చేస్తారు?

జవాబు:-

మొత్తం విశ్వాన్నే కాక 5 తత్వాలను కూడా పావనంగా తయారుచేసే సేవను ఆత్మిక సేవకులైన మీరు చేస్తారు, అందుకే మీరు సత్యాతి-సత్యమైన సమాజ సేవకులు.

పాట:-  తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి... (లే లో దువాయే మా బాప్ కీ...)

ఓంశాంతి. పిల్లలు పాటను విన్నారు. మాటకొస్తే లౌకిక తల్లిదండ్రుల ఆశీర్వాదాలనైతే అనేకులు తీసుకుంటారు. పిల్లలు కాళ్ళకు నమస్కరిస్తారు, తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు. దండోరా లౌకిక తల్లిదండ్రుల కోసం వేయడం జరగదు. దండోరా అనగా చాలామంది వింటారు. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము... మీ కృప లేక ఆశీర్వాదాలతో అపారమైన సుఖము పొందాము అనైతే అనంతమైన తండ్రి గురించే గాయనం జరుగుతుంది. భారత్ లోనే మహిమ గాయనం చేయబడుతుంది. తప్పకుండా భారత్ లోనే ఇది జరిగింది, కావుననే గాయనం చేయబడుతుంది. ఒక్కసారిగా అనంతములోకి వెళ్ళిపోవాలి. స్వర్గ రచయిత అయిన తండ్రి ఒక్కరేనని బుద్ధి చెప్తుంది. స్వర్గములోనైతే అన్ని సుఖాలు ఉన్నాయి. అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు ఉండజాలవు, అందుకే దుఃఖములో అందరూ స్మరిస్తారు, సుఖములో ఎవరూ స్మరించరు అని గానం చేస్తారు. అర్ధకల్పం దుఃఖము ఉంది, అందుకే అందరూ స్మరిస్తారు. సత్యయుగములో అపారమైన సుఖము ఉంది, కావున అక్కడ స్మరించరు. మనుష్యులు రాతిబుద్ధి కలవారిగా ఉన్న కారణముగా ఏమీ అర్థం చేసుకోరు. కలియుగములోనైతే అపారమైన దుఃఖము ఉంది. కొట్లాటలు ఎంతగా ఉన్నాయి. ఎంతగా చదువుకున్న విద్వాంసులైనా కానీ పాటల అర్థం ఏమాత్రము తెలియదు. నీవే తల్లివి, తండ్రివి... అని గానం చేస్తారు కానీ అది తల్లి-తండ్రి యొక్క మహిమ అనేది అర్థం చేసుకోరు. ఇది అనేకుల విషయం కదా. అందరూ ఈశ్వరుని సంతానమే, కానీ సమయంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. అపారమైన సుఖము ఎవ్వరికీ లేదు. కృప ద్వారానైతే సుఖము లభించాలి. అకృప ద్వారా దుఃఖము కలుగుతుంది. తండ్రి అయితే కృపాళువు అని గాయనం చేయబడ్డారు. సాధు-సన్యాసులను కూడా కృపాళువు అని అంటారు.

భక్తి మార్గములో నీవే తల్లివి, తండ్రివి... అని గానం చేస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అది పూర్తిగా యథార్థము, కానీ వివేకవంతులు ఎవరైనా ఉంటే ఇలా అడుగుతారు - పరమాత్మను గాడ్ ఫాదర్ అని అంటారు, మళ్ళీ వారినే మదర్ అని ఎలా అంటారు? కావున వారి బుద్ధి జగదాంబ వైపుకు వెళ్తుంది. ఎప్పుడైతే జగదాంబ వైపుకు బుద్ధి వెళ్తుందో అప్పుడు జగత్పిత వైపుకు కూడా బుద్ధి వెళ్ళాలి. ఇప్పుడు బ్రహ్మా-సరస్వతులు భగవంతులేమీ కాదు. మహిమ వారికి ఉండజాలదు. వారి ఎదురుగా కూడా మీరు తల్లి-తండ్రి అని అనడము పొరపాటు. మనుష్యులు పరమపిత పరమాత్మ గురించే పాడుతారు, కానీ వారు తల్లి-తండ్రిగా ఎలా అవుతారో తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు చెప్పడం జరుగుతుంది - తీసుకోండి, తల్లి-తండ్రుల ఆశీర్వాదాలను తీసుకోండి... అనగా శ్రీమతముపై నడవండి. మీ నడవడిక బాగుంటే మీ అంతట మీకే ఆశీర్వాదాలు లభిస్తాయి. ఒకవేళ నడవడిక బాగోలేకపోతే, ఎవరికైనా దుఃఖాన్నిస్తూ ఉంటే, తల్లి-తండ్రులను స్మృతి చేయకపోతే లేక ఇతరుల చేత స్మృతి చేయించకపోతే ఆశీర్వాదాలు లభించవు. ఇక తర్వాత ఇంతటి సుఖాన్ని కూడా పొందలేరు. తండ్రి హృదయము పైకి ఎక్కలేరు. తండ్రి (బ్రహ్మా) హృదయము పైకి ఎక్కారంటే శివబాబా హృదయము పైకి ఎక్కినట్లే. ఇది తల్లి-తండ్రి యొక్క గాయనమే. బుద్ధి అనంతమైన తల్లి-తండ్రి వైపుకు వెళ్ళిపోవాలి. బ్రహ్మా వైపుకు కూడా ఎవరి బుద్ధి వెళ్ళదు. అయితే జగదాంబ వైపుకు కొందరి బుద్ధి వెళ్తుంది. వారిది కూడా మేళా జరుగుతుంది, కానీ వారి కర్తవ్యము గురించి ఎవరికీ తెలియనే తెలియదు. నియమానుసారముగా మన సత్యాతి-సత్యమైన తల్లి బ్రహ్మాయే అని మీకు తెలుసు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. స్మృతి కూడా అలాగే చేస్తారు. వీరు తల్లి కూడా, అలాగే బ్రహ్మా తండ్రి కూడా అవుతారు. శివబాబా, కేరాఫ్ బ్రహ్మా అని రాస్తారు. కావున వారు తల్లి కూడా అవుతారు, అలాగే తండ్రి కూడా అవుతారు. ఇప్పుడు పిల్లలు తండ్రి హృదయము పైకి ఎక్కాలి ఎందుకంటే వీరిలోకే శివబాబా ప్రవేశిస్తారు. వీరు (బ్రహ్మాబాబా) ఎప్పుడైతే ఇలా గ్యారంటీ ఇస్తారో - అవును బాబా, బిడ్డ చాలా మంచి సర్వీసబుల్, అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు, మనసా, వాచా, కర్మణా ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు అని - అప్పుడే శివబాబా హృదయము పైకి ఎక్కగలరు. మనసా, వాచా, కర్మణా ద్వారా ఏమి చేసినా, ఏం మాట్లాడినా దాని ద్వారా అందరికీ సుఖము లభించాలి. దుఃఖము ఎవరికీ ఇవ్వకూడదు. దుఃఖాన్నిచ్చే ఆలోచన మొదట మనసులో వస్తుంది, తర్వాత కర్మణాలోకి రావడంతో పాపం తయారవుతుంది. మనసా తుఫానులైతే తప్పకుండా వస్తాయి కానీ కర్మణాలోకి ఎప్పుడూ రాకండి. ఒకవేళ ఎవరైనా అసంతుష్టంగా అయితే తండ్రిని వచ్చి అడగండి - బాబా, విషయం వలన వీరు నాతో అసంతుష్టంగా ఉంటారు అని, అప్పుడు బాబా అర్థం చేయిస్తారు. విషయమైనా మొదట మనసులోకి వస్తుంది. వాచా కూడా కర్మణాయే అవుతుంది. ఒకవేళ పిల్లలు తల్లి-తండ్రుల ఆశీర్వాదము తీసుకోవాలంటే శ్రీమతముపై నడవాలి. ఇక్కడ ఒక్కరినే తల్లి, తండ్రి అని అంటారు - ఇది చాలా గుహ్యమైన విషయము. వీరు (బ్రహ్మా) తండ్రి కూడా, అలాగే పెద్ద తల్లి కూడా. ఇప్పుడు బాబా తల్లి అని ఎవరిని అనాలి? తల్లి (బ్రహ్మా) ఇప్పుడు ఎవరిని తల్లి అనాలి? తల్లికైతే తల్లి ఎవరూ ఉండరు. ఎలాగైతే శివబాబాకు తండ్రి ఎవరూ లేరో, అలా వీరికి తమ తల్లి అంటూ ఎవరూ లేరు.

పిల్లలకు ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు - ఒకవేళ మనసా, వాచా, కర్మణా ఎవరికైనా దుఃఖాన్నిస్తే దుఃఖాన్ని పొందుతారు మరియు పదభ్రష్టులుగా అవుతారు. సత్యమైన స్వామి ముందు సత్యముగా ఉండాలి, వీరితో కూడా సత్యముగా ఉండాలి. దాదాయే సర్టిఫికేట్ ఇస్తారు - బాబా, బిడ్డ ఎంతో సుపుత్రుడు. బాబా మహిమ అయితే చేస్తారు. సర్వీసబుల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తనువు, మనస్సు, ధనములతో సేవ చేస్తారో, ఎప్పుడూ ఎవరికీ దుఃఖము ఇవ్వరో, వారే బాప్ దాదా మరియు తల్లి హృదయం పైకి ఎక్కుతారు. వీరి హృదయం పైకి ఎక్కారు అనగా వారి సింహాసనము పైకి ఎక్కినట్లు. ఎల్లప్పుడూ సుపుత్రులైన పిల్లలకు ఆలోచన ఉంటుంది, మేము సింహాసనాధికారులుగా ఎలా అవ్వాలి. ఇదే తపన ఉంటుంది. సింహాసనాలైతే నంబరువారుగా 8 ఉంటాయి. తర్వాత 108, తర్వాత 16108 కూడా ఉంటాయి, కానీ ఇప్పుడే మనం ఉన్నత పదవిని పొందాలి. రెండు కళలు తక్కువ అయ్యాక సింహాసనంపై కూర్చోవడమనేది శోభించదు. సుపుత్రులైన పిల్లలు చాలా పురుషార్థము చేస్తారు, ఒకవేళ ఇప్పుడు మనము ప్రియమైన బాబా నుండి సూర్యవంశపు పూర్తి-పూర్తి వారసత్వాన్ని తీసుకోకపోతే ఇక కల్ప-కల్పము తీసుకోము. ఇప్పుడు ఒకవేళ విజయ మాలలో కూర్చబడకపోతే కల్ప-కల్పము కూర్చబడము. ఇది కల్ప-కల్పపు రేస్. ఇప్పుడు ఒకవేళ నష్టం కలిగితే కల్ప-కల్పము కలుగుతూనే ఉంటుంది. ఎవరైతే శ్రీమతముపై తల్లి-తండ్రిని పూర్తిగా ఫాలో చేస్తారో, ఎప్పుడూ ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరో వారే పక్కా వ్యాపారులు. అందులో కూడా నంబరువన్ దుఃఖము కామ ఖడ్గాన్ని నడపడము.

తండ్రి అంటారు, అచ్ఛా, శ్రీకృష్ణ భగవానువాచ అనుకోండి, మరి వారు కూడా నంబరువన్. వారి మాటను కూడా అంగీకరించాలి, అప్పుడే స్వర్గానికి యజమానులుగా అవుతారు. శ్రీకృష్ణ భగవానుడు శ్రీమతము ద్వారా శిక్షణను ఇచ్చారని భావిస్తారు. అయితే సరే, వారి మతముపై నడవండి. వారు కూడా కామం మహాశత్రువు, దానిని జయించండి అని చెప్పారు. వికారాలను జయించినప్పుడే కృష్ణపురిలోకి రాగలరు. ఇప్పుడిది శ్రీకృష్ణుని విషయమైతే కాదు. శ్రీకృష్ణుడు బాలుడు, వారు ఎలా మతాన్ని ఇస్తారు. ఎప్పుడైతే పెద్దవానిగా అయి సింహాసనంపై కూర్చుంటారో అప్పుడే వారు మతాన్ని ఇస్తారు. మతాన్ని ఇచ్చేందుకు యోగ్యులుగా అయినప్పుడే రాజ్యము నడపగలరు కదా. ఇప్పుడు శివబాబా అంటారు, నన్ను నిరాకారీ ప్రపంచంలో స్మృతి చేయండి. శ్రీకృష్ణుడు అంటారు, నన్ను స్వర్గములో స్మృతి చేయండి. వారు కూడా కామం మహాశత్రువు, దీనిపై విజయం పొందండి అని అంటారు. అక్కడ విషం లభించదు, కావున విషాన్ని వదిలి పవిత్రముగా అవ్వండి. ఇది శ్రీకృష్ణుని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. అచ్ఛా, మనుష్యులు నా పేరు తీసి కొడుకు పేరును వేసారనుకోండి, అతను కూడా సర్వగుణ సంపన్నుడే. వారు కూడా - గీతలో కామం మహాశత్రువు అని రాయబడి ఉంది అని చెప్తారు. మరి దానిని ఏమైనా అంగీకరిస్తారా. దానిపై ఏమైనా నడుస్తారా. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు స్వయంగా వస్తారో, అప్పుడు మేము వారి మతముపై నడుస్తాము, అప్పటివరకు మునకలు వేస్తూనే ఉంటాము అని భావిస్తారు. సన్యాసులు మొదలైనవారు - నేను మీకు రాజయోగము నేర్పించేందుకు వచ్చాను అని అనలేరు. ఇదైతే తండ్రే అర్థం చేయిస్తారు మరియు ఇది సంగమము యొక్క విషయమే. శ్రీకృష్ణుడు సత్యయుగములో ఉంటారు. వారిని కూడా విధముగా యోగ్యునిగా చేసేవారు ఎవరో అయితే ఉంటారు కదా. కావున శివబాబా స్వయంగా అంటారు, శ్రీకృష్ణుడు మరియు వారి వంశమంతటినీ ఇప్పుడు నేను స్వర్గములోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తున్నాను. పిల్లలు స్వర్గములోకి వెళ్ళి ఉన్నత పదవి పొందాలని బాబా ఎంతగా శ్రమిస్తారు. లేదంటే చదువుకున్నవారి ఎదురుగా వెళ్ళి సేవలు చేస్తారు. తండ్రి నుండైతే పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. నేను ఇంతటి సుపుత్రునిగా ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. సుపుత్రులుగా కూడా నంబరువారుగా ఉంటారు. ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు ఉంటారు. ఉత్తములైతే ఎప్పుడూ దాగి ఉండరు. మేము భారత్ యొక్క సేవను చేయాలి అని వారి హృదయములో దయ కలుగుతుంది. సమాజ సేవకులు కూడా నంబరువారుగా ఉంటారు - ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు. చాలామంది చాలా దోచుకుంటారు, సామాగ్రిని అమ్ముకుని తింటారు. మరి వారిని యోగ్యులైన సమాజ సేవకులు అని ఎలా అంటారు? చాలామంది స్వయాన్ని సమాజ సేవకులుగా పిలిపించుకుంటారు ఎందుకంటే సమాజానికి సేవ చేస్తారు. సత్యమైన సేవనైతే తండ్రియే చేస్తారు.

మేము కూడా తండ్రితోపాటు సమాజ సేవకులము అని మీరు అంటారు. మొత్తం సృష్టినే కాక తత్వాలను కూడా పవిత్రంగా చేస్తారు. తత్వాలు కూడా సమయంలో తమోప్రధానంగా ఉన్నాయని సన్యాసులకు తెలియదు. ఇప్పుడు వాటిని కూడా సతోప్రధానంగా తయారుచేయాలి. సతోప్రధాన తత్వాలతో మీ శరీరము కూడా సతోప్రధానముగా అవుతుంది. బాబా ఎంతగానో అర్థం చేయిస్తారు కానీ పిల్లలు మర్చిపోతారు. ఎవరైతే ఇతరులకు వినిపిస్తూ ఉంటారో, వారికే గుర్తుంటుంది. దానం చేయకపోతే ధారణ కూడా జరుగదు. ఎవరైతే మంచి సేవ చేస్తారో, వారి పేరును బాప్ దాదా కూడా ప్రసిద్ధం చేస్తారు. సేవలో ఎవరెవరు చురుకుగా ఉన్నారు అన్నది పిల్లలకు కూడా తెలుసు. ఎవరైతే సేవలో తత్పరులై ఉన్నారో వారు హృదయము పైకి ఎక్కుతారు. ఎల్లప్పుడూ మాత, పితలను అనుసరించాలి. వారి సింహాసనాధికారులుగా అవ్వాలి. ఎవరైతే సేవలో ఉంటారో వారు ఇతరులకు సుఖము ఇస్తారు. నేను బాబాకు సుపుత్రునిగా అయ్యానా అని మీ ముఖాన్ని అద్దంలో చూసుకోండి. స్వయం కూడా విధంగా వ్రాయవచ్చు - మా సేవా చార్ట్ విధంగా ఉంది, నేను - సేవలు చేస్తున్నాను, మీరు జడ్జ్ చేయండి. అప్పుడు తండ్రికి కూడా తెలుస్తుంది. నేను ఉత్తమంగా ఉన్నానా, మధ్యమంగా ఉన్నానా లేక కనిష్ఠంగా ఉన్నానా అని స్వయం కూడా జడ్జ్ చేసుకోవచ్చు. ఎవరు మహారథులు, ఎవరు గుర్రపు స్వారీ చేసేవారు అనేది పిల్లలకు కూడా తెలుసు. ఎవ్వరూ దాగి ఉండలేరు. తండ్రికి చార్టు పంపించినట్లయితే తండ్రి అప్రమత్తం కూడా చేస్తారు. చార్టు లేకపోయినా కూడా అప్రమత్తం చేయడం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎంత వారసత్వాన్ని తీసుకోవాలంటే అంత పూర్తిగా తీసుకోండి. అప్పుడు బాప్ దాదా నుండి కూడా సర్టిఫికెట్ లభిస్తుంది. పెద్ద తల్లి కూర్చుని ఉన్నారు, వీరి నుండి సర్టిఫికెట్ లభించగలదు. అద్భుతమైన మమ్మీకు మమ్మీ ఎవరూ లేరు. విధముగా తండ్రికి తండ్రి ఎవరూ లేరో అలా. తర్వాత స్త్రీలలో మమ్మా నంబర్ వన్. డ్రామాలో జగదాంబ మహిమ చేయబడ్డారు. సేవ కూడా ఎంతో చేసారు. విధముగా బాబా వెళ్ళేవారో అలా మమ్మా కూడా వెళ్ళేవారు. చిన్న-చిన్న పల్లెటూళ్ళలో సేవ చేసేవారు. అందరికన్నా చురుకుగా ముందుకు వెళ్ళారు. బాబాతో పాటు పెద్ద బాబా ఉన్నారు, అందుకే పిల్లలు వీరిని సంభాళించవలసి ఉంటుంది. సత్యయుగములో ప్రజలు చాలా సుఖముగా ఉంటారు. వారికి తమ మహళ్ళు, గోవులు, ఎద్దులు మొదలైనవన్నీ ఉంటాయి.

అచ్ఛా - పిల్లలూ, సంతోషంగా ఉండండి, సదా సుసంపన్నముగా ఉండండి, మర్చిపోకండి, గుర్తుంచుకోకండి. ఎందుకంటే, శివబాబానే స్మృతి చేయాలి. తమ శరీరాన్ని కూడా మర్చిపోవాలి అన్నప్పుడు మరి ఇతరులను ఎలా స్మృతి చేస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరినీ అసంతుష్టపరచకూడదు. మనసా, వాచా, కర్మణా అందరికీ సుఖాన్ని ఇస్తూ తండ్రి మరియు పరివారపు ఆశీర్వాదాలను తీసుకోవాలి.

2. సుపుత్రులుగా అయి భారత్ యొక్క ఆత్మిక సేవను చేయాలి. దయార్ద్ర హృదయులుగా అయి ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి. తనువు, మనస్సు, ధనములతో సేవ చేయాలి. సత్యమైన స్వామితో సత్యముగా ఉండాలి.

వరదానము:-

మాటలపై డబల్ అండర్ లైన్ చేసి ప్రతి మాటను అమూల్యంగా చేసుకునే మాస్టర్ సద్గురువు భవ

పిల్లలైన మీ మాటలు ఎలా ఉండాలంటే, వినేవారు వీరు ఏదైనా మాట్లాడితే మేము వినాలి అనే చాతకులుగా ఉండాలి - వీటిని అమూల్యమైన మహావాక్యాలని అంటారు. మహావాక్యాలు ఎక్కువగా ఉండవు. ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుతూ ఉంటే - వాటిని మహావాక్యాలని అనరు. సద్గురువు పిల్లలైన మీరు మాస్టర్ సద్గురువులు. అందుకే మీరు మాట్లాడే ఒక్కొక్క మాట మహావాక్యంగా ఉండాలి. సమయంలో, స్థానంలో, మాట అవసరమై ఉంటుందో, యుక్తియుక్తంగా ఉంటుందో, స్వయం మరియు ఇతర ఆత్మలకు లాభదాయకంగా ఉంటుందో, మాటలే మాట్లాడండి. మాటలపై డబుల్ అండర్ లైన్ చేయండి.

స్లోగన్:-

శుభచింతక మణులుగా అయి, మీ కిరణాల ద్వారా విశ్వాన్ని ప్రకాశవంతంగా చేస్తూ వెళ్ళండి.

 Download PDF

Post a Comment

0 Comments