19-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- సాకార శరీరాన్ని
స్మృతి చేయడం
కూడా భూత అభిమానులుగా అవ్వడము,
ఎందుకంటే శరీరము
పంచ భూతాలతో
తయారుచేయబడ్డది, మీరైతే
దేహీ-అభిమానులుగా అయి ఒక్క
విదేహీ తండ్రిని
స్మృతి చేయాలి’’
ప్రశ్న:-
ఒక్క తండ్రియే చేసే అన్నింటికన్నా సర్వోత్తమమైన
కార్యము ఏది?
జవాబు:-
మొత్తం తమోప్రధాన సృష్టిని సతోప్రధానంగా, సదా సుఖవంతంగా తయారుచేయడం, ఇదే అన్నింటికన్నా సర్వోత్తమమైన కార్యము, దీనిని తండ్రియే చేస్తారు. ఈ ఉన్నతమైన కార్యము కారణంగా వారి స్మృతిచిహ్నాలను
కూడా చాలా ఉన్నతంగా తయారుచేసారు.
ప్రశ్న:-
ఏ రెండు పదాలలో మొత్తం డ్రామా రహస్యమంతా వచ్చేస్తుంది?
జవాబు:-
పూజ్యులు మరియు పూజారులు. ఎప్పుడైతే మీరు పూజ్యులుగా ఉంటారో, అప్పుడు పురుషోత్తములుగా ఉంటారు, ఆ తర్వాత మధ్యములుగా, కనిష్టులుగా
అవుతారు. మాయ పూజ్యుల నుండి పూజారులుగా చేసేస్తుంది.
పాట:- సభలో జ్యోతి వెలిగింది... (మహఫిల్ మే జల్ ఉఠీ షమా...)
ఓం శాంతి. భగవంతుడు కూర్చొని పిల్లలకు ఏమని అర్థం చేయిస్తారంటే - మనుష్యులను భగవంతుడు అని అనడానికి వీల్లేదు. బ్రహ్మా, విష్ణు,
శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి, వారిని భగవంతుడు అని అనడానికి వీల్లేదు. పరమపిత పరమాత్ముని నివాసము వారికన్నా ఉన్నతమైనది.
వారినే ప్రభూ, ఈశ్వర్, భగవాన్ అని అంటారు. మనుష్యులు భగవంతుడిని పిలిచేటప్పుడు వారికి ఏ ఆకార లేక సాకార మూర్తి కనిపించదు,
అందుకే ఏ మనుష్య ఆకారాన్ని అయినా భగవంతుడు అని అనేస్తారు. సన్యాసులను చూసినప్పుడు కూడా భగవాన్ అని అంటారు,
కానీ మనుష్యులను భగవంతుడు అని అనడానికి వీల్లేదని స్వయంగా భగవంతుడే అర్థం చేయిస్తున్నారు. నిరాకార భగవంతుడినైతే ఎంతగానో తల్చుకుంటారు. ఎవరైతే ఇంకా గురువును ఆశ్రయించలేదో, చిన్న పిల్లలుగా ఉన్నారో వారికి కూడా పరమాత్మను స్మృతి చేయండి అని నేర్పించడం జరుగుతుంది, కానీ ఏ పరమాత్మను స్మృతి చేయాలి, అది వారికి తెలియజేయబడదు. బుద్ధిలో ఏ చిత్రమూ ఉండదు. దుఃఖపు సమయంలో హే ప్రభూ అని అంటారు.
ఆ సమయంలో ఏ గురువు లేక దేవత మొదలైనవారి చిత్రము వారి ఎదురుగా రాదు. ఎంతోమంది గురువులను ఆశ్రయించి ఉంటారు కానీ హే భగవాన్ అని అన్నప్పుడు, వారికి ఎప్పుడూ గురువులు గుర్తుకు రారు.
ఒకవేళ ఎవరైనా గురువును తల్చుకుంటూ కూడా భగవాన్ అని అంటే, మరి అక్కడ ఆ వ్యక్తి జనన-మరణాలలోకి వచ్చేవారే కదా.
కావున అది పంచ తత్వాలతో తయారుచేయబడిన శరీరాన్ని స్మృతి చేయడమే,
వాటిని పంచ భూతాలు అని కూడా అంటారు. ఆత్మను భూతము అని అనరు. కావున అది భూత పూజ వంటిదే. బుద్ధియోగము శరీరము వైపుకు వెళ్ళిపోతుంది. ఒకవేళ మనుష్యులెవరినైనా భగవంతునిగా భావిస్తే, అక్కడ అతనిలో ఉన్న ఆత్మను తల్చుకుంటారని కాదు.
అలా కాదు.
ఆత్మ అయితే ఇరువురిలోనూ ఉంది. స్మృతి చేసే వారిలో కూడా ఉంది, అలాగే ఎవరినైతే స్మృతి చేస్తారో వారిలో కూడా ఉంది. పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు.
కానీ, పరమాత్మను పాపాత్మ అని అనడానికి వీల్లేదు. నిజానికి పరమాత్మ అన్న పేరు ఎప్పుడైతే వెలువడుతుందో అప్పుడు బుద్ధి నిరాకారుని వైపుకు వెళ్తుంది. నిరాకార తండ్రిని నిరాకార ఆత్మ తల్చుకుంటుంది. అటువంటివారిని దేహీ-అభిమానులు అని అంటారు. సాకార శరీరాన్ని ఎవరైతే తల్చుకుంటారో,
వారు భూత-అభిమానులు. భూతాలు, భూతాలను తల్చుకుంటారు ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించేందుకు బదులుగా పంచ భూతాల శరీరంగా భావిస్తారు. పేరు కూడా శరీరానికే ఉంటుంది. స్వయాన్ని కూడా పంచ తత్వాల భూతంగా భావిస్తారు మరియు అవతలివారిని కూడా శారీరం పరంగా తల్చుకుంటారు. అటువంటివారు దేహీ-అభిమానులుగా అయితే లేరు. స్వయాన్ని నిరాకార ఆత్మగా భావించినట్లయితే నిరాకార పరమాత్మను స్మృతి చేయాలి.
ఆత్మలందరి సంబంధము మొట్టమొదట పరమాత్మతోనే ఉంది. ఆత్మ దుఃఖములో పరమాత్మనే తల్చుకుంటుంది, వారితో సంబంధముంది.
వారు ఆత్మలను అన్ని దుఃఖాల నుండి విడిపిస్తారు. వారిని జ్యోతి అని కూడా అంటారు. ఇక్కడ దీపం మొదలైనవాటి విషయమేమీ లేదు. వారు పరమపిత, పరమ ఆత్మ. వారిని జ్యోతి రూపముగా వర్ణించేటప్పటికి మనుష్యులు జ్యోతిగా భావిస్తారు. తండ్రి స్వయం అర్థం చేయించారు - నేను పరమాత్మను, నా పేరు శివ. శివుడిని రుద్రుడు అని కూడా అంటారు.
ఆ నిరాకారునికే అనేక నామాలు ఉన్నాయి, ఇంకెవ్వరికీ ఇన్ని పేర్లు లేవు. బ్రహ్మా, విష్ణు, శంకరులకు ఒకే పేరు ఉంది. దేహధారులు ఎవరైతే ఉన్నారో వారికీ ఒకే పేరు ఉంది. ఒక్క ఈశ్వరునికే అనేక పేర్లను ఇవ్వడం జరుగుతుంది.
వారి మహిమ అపారమైనది. మనుష్యులకు ఒకే పేరు నిశ్చితమై ఉంటుంది. ఇప్పుడు మీరు మరజీవాగా అయ్యారు కావున మీకు ఇంకొక పేరు పెట్టడం జరిగింది, తద్వారా పాతవన్నింటినీ మర్చిపోవాలి. మీరు పరమపిత పరమాత్మ ముందు జీవిస్తూ మరణిస్తారు కావున ఇది మరజీవా జన్మ. మరి తప్పకుండా మాతా-పితల వద్ద జన్మ తీసుకోవడం జరుగుతుంది.
ఈ గుహ్యమైన విషయాలను తండ్రి కూర్చొని మీకు అర్థం చేయిస్తారు. ప్రపంచానికైతే శివుని గురించి తెలియదు. బ్రహ్మా,
విష్ణు, శంకరుల గురించి తెలుసు. బ్రహ్మా యొక్క పగలు, బ్రహ్మా యొక్క రాత్రి అని కూడా అంటారు.
బ్రహ్మా ద్వారా స్థాపన...
అని కూడా కేవలం విన్నారే కానీ అది ఎలా జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మరి రచయిత అయితే తప్పకుండా క్రొత్త ధర్మాన్ని, క్రొత్త ప్రపంచాన్ని రచిస్తారు. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ కులాన్నే రచిస్తారు.
బ్రాహ్మణులైన మీరు బ్రహ్మాను కాదు, పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు ఎందుకంటే బ్రహ్మా ద్వారా మీరు వారికి చెందినవారిగా అయ్యారు.
బయట ఉండే దేహాభిమానీ బ్రాహ్మణులు స్వయాన్ని ఈ విధంగా బ్రహ్మా పిల్లలుగా, శివుని మనుమలుగా చెప్పుకోరు. శివబాబా జయంతిని కూడా జరుపుకుంటారు, కానీ వారి గురించి తెలియని కారణంగా వారి పట్ల గౌరవం లేదు. వారి మందిరంలోకి వెళ్తారు, వీరు బ్రహ్మా, విష్ణు, శంకరులు లేక లక్ష్మీ-నారాయణులైతే కాదు, కావున వారు తప్పకుండా నిరాకార పరమాత్మయేనని అర్థం చేసుకుంటారు. మిగిలిన పాత్రధారులందరికీ తమ-తమ పాత్రలు ఉన్నాయి,
పునర్జన్మలు తీసుకుంటారు, అయినా తమకంటూ పేర్లను పెట్టుకుంటారు. ఈ పరమపిత పరమాత్మ ఒక్కరే, వీరికి వ్యక్తమైన నామ-రూపాలేవీ లేవు, కానీ మందబుద్ధి కల మనుష్యులు ఇది అర్థం చేసుకోరు. పరమాత్ముని స్మృతిచిహ్నము ఉందంటే తప్పకుండా వారు వచ్చి ఉంటారు, స్వర్గాన్ని రచించి ఉంటారు. లేకపోతే స్వర్గాన్ని ఎవరు రచిస్తారు.
ఇప్పుడు మళ్ళీ వచ్చి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు. దీన్ని యజ్ఞము అని అంటారు ఎందుకంటే ఇందులో స్వాహా అవ్వవలసి ఉంటుంది.
యజ్ఞాలనైతే ఎంతోమంది మనుష్యులు రచిస్తారు. అవన్నీ భక్తి మార్గపు స్థూలమైన యజ్ఞాలు.
ఇక్కడ పరమపిత పరమాత్మ స్వయంగా వచ్చి యజ్ఞాన్ని రచిస్తారు. పిల్లలను చదివిస్తారు. యజ్ఞాలను ఎప్పుడైతే రచిస్తారో అప్పుడు అక్కడ కూడా బ్రాహ్మణులు శాస్త్రాలు, కథలు మొదలైనవి వినిపిస్తారు. ఈ తండ్రి అయితే జ్ఞానసంపన్నులు. వారు అంటారు, ఈ గీత, భాగవతము మొదలైన శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి, అలాగే ఈ స్థూలమైన యజ్ఞాలు కూడా భక్తి మార్గానికి చెందినవి.
ఇది ఉన్నదే భక్తి మార్గపు సమయము.
ఎప్పుడైతే కలియుగ అంతిమం వస్తుందో, అప్పుడు భక్తి యొక్క అంతిమం కూడా వస్తుంది, అప్పుడే భగవంతుడు వచ్చి కలుస్తారు ఎందుకంటే వారే భక్తి ఫలాన్ని ఇచ్చేవారు. వారిని జ్ఞాన సూర్యుడు అని అంటారు. జ్ఞాన చంద్రుడు, జ్ఞాన సూర్యుడు మరియు జ్ఞాన అదృష్ట సితారలు.
అచ్ఛా - జ్ఞాన సూర్యుడు తండ్రి. మరి జ్ఞాన చంద్రమా అయిన తల్లి కూడా కావాలి. కావున ఏ తనువులోనైతే ప్రవేశించారో వారు జ్ఞాన చంద్రమా తల్లి అయినట్లు మరియు మిగిలిన పిల్లలందరూ అదృష్ట సితారలు. ఈ లెక్కన చూస్తే జగదాంబ కూడా అదృష్ట సితార అయినట్లు ఎందుకంటే అందరూ పిల్లలే కదా.
నక్షత్రాలలో కొన్ని అన్నింటికన్నా చురుకైనవి కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా నంబరువారుగా ఉన్నారు. అవి స్థూలమైన ఆకాశంలోని సూర్య,
చంద్ర నక్షత్రాలు మరియు ఇది జ్ఞానం యొక్క విషయము. అవి నీటి నదులు మరియు వీరు జ్ఞాన నదులు, వీరు జ్ఞాన సాగరం నుండి వెలువడ్డారు.
ఇప్పుడు శివజయంతిని జరుపుకుంటారు,
తప్పకుండా సృష్టి అంతటికీ తండ్రి అయిన వారు వస్తారు. వారు వచ్చి తప్పకుండా స్వర్గాన్ని రచిస్తూ ఉండవచ్చు. ఏదైతే ప్రాయః లోపమైపోయిందో, ఆ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపించేందుకే తండ్రి వస్తారు. గవర్నమెంటు కూడా ఏ ధర్మాన్ని అంగీకరించదు. మాకు ధర్మమేమీ లేదు అని అంటారు. వారు చెప్పేది నిజమే. తండ్రి కూడా అంటారు, భారత్ యొక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ప్రాయఃలోపమైపోయింది. ధర్మంలో శక్తి ఉంటుంది. భారతవాసులు తమ దైవీ ధర్మంలో ఉన్నప్పుడు ఎంతో సుఖంగా ఉండేవారు. విశ్వంలోకెల్లా సర్వశక్తివంతమైన రాజ్యము ఉండేది.
పురుషోత్తములు రాజ్యము చేసేవారు.
శ్రీ లక్ష్మీ-నారాయణులనే పురుషోత్తములు అని అంటారు. నంబరువారుగా ఉన్నతంగా,
నీచులుగా ఉంటారు. సర్వోత్తమ పురుషులు, ఉత్తమ పురుషులు, మధ్యములు, కనిష్ట పురుషులు తప్పకుండా ఉంటారు.
మొట్టమొదట అందరికన్నా సర్వోత్తమ పురుషులుగా ఎవరైతే అవుతారో వారే మళ్ళీ మధ్యములుగా, కనిష్టులుగా అవుతారు కావున లక్ష్మీ-నారాయణులు పురుషోత్తములు అనగా పురుషులలో అందరికన్నా ఉత్తములు.
ఆ తర్వాత క్రిందికి దిగితే దేవతల నుండి క్షత్రియులుగా, క్షత్రియుల నుండి వైశ్యులుగా, శూద్రులుగా,
కనిష్టులుగా అవుతారు. సీతా-రాములను కూడా పురుషోత్తములు అని అనరు. రాజులందరికీ రాజు,
సర్వోత్తమ సతోప్రధాన పురుషోత్తములు లక్ష్మీ-నారాయణులు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో కూర్చున్నాయి. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది. మొట్టమొదట ఉత్తములుగా ఉంటారు, ఆ తర్వాత మధ్యములుగా, కనిష్టులుగా అవుతారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా తమోప్రధానంగా ఉంది, ఇది తండ్రి అర్థం చేయిస్తారు. వారి జయంతినే ఇప్పుడు జరుపుకుంటారు.
నేటికి 5000 సంవత్సరాల క్రితం పరమపిత పరమాత్మ శివుడు అవతరించారని మీరు తెలియజేయవచ్చు. లేకపోతే శివజయంతిని ఎందుకు జరుపుకుంటారు! పరమపిత పరమాత్మ తప్పకుండా పిల్లల కొరకు కానుకను తీసుకొస్తారు మరియు తప్పకుండా సర్వోత్తమ కార్యాన్ని చేస్తారు. మొత్తం తమోప్రధాన సృష్టిని సతోప్రధానంగా, సదా సుఖవంతంగా తయారుచేస్తారు. ఎంత ఉన్నతంగా ఉన్నారో అంతే ఉన్నతంగా స్మృతిచిహ్నాలు కూడా ఉండేవి, ఆ మందిరాలను దోచుకొని వెళ్ళిపోయారు.
మనుష్యులు ధనము కొరకే యుద్ధాలు చేస్తారు.
విదేశాల నుండి కూడా ధనము కొరకే వచ్చారు, ఆ సమయంలో కూడా ఎంతో ధనము ఉండేది. కానీ మాయా రావణుడు భారత్ ను గవ్వతుల్యంగా చేసేసాడు. తండ్రి వచ్చి వజ్రతుల్యంగా తయారుచేస్తారు. ఇటువంటి శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు. వారు సర్వవ్యాపి అని అనేస్తారు, ఇలా అనడం కూడా పొరపాటే. నావను తీరానికి చేర్చే సద్గురువు ఒక్కరే. ముంచేవారు అనేకులు ఉన్నారు. అందరూ విషయ సాగరంలో మునిగి ఉన్నారు, కావుననే ఈ నిస్సార ప్రపంచం నుండి,
విషయ సాగరం నుండి అటువైపుకు అనగా క్షీరసాగరం ఉన్నచోటుకు తీసుకువెళ్ళండి అని అంటారు. విష్ణువు క్షీరసాగరంలో ఉండేవారు అని కూడా అంటూ ఉంటారు. స్వర్గాన్ని క్షీరసాగరము అని అంటారు.
అక్కడ లక్ష్మీ-నారాయణులు రాజ్యం చేస్తారు. అంతేకానీ అక్కడ విష్ణువు క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకుంటారని కాదు.
అక్కడ వారు పెద్ద కొలనును తయారుచేసి దాని మధ్యలో విష్ణువును పెడతారు. విష్ణువును కూడా చాలా పెద్దగా తయారుచేస్తారు. లక్ష్మీ-నారాయణులు అంత పెద్దగానేమీ ఉండరు. ఎక్కువలో ఎక్కువ ఆరడుగులు ఉంటారు. పాండవులవి కూడా పెద్ద-పెద్ద విగ్రహాలు తయారుచేస్తారు. రావణుడి దిష్టిబొమ్మను ఎంత పెద్దగా తయారుచేస్తారు. పెద్ద పేరు ఉంది కాబట్టి పెద్ద చిత్రాలను తయారుచేస్తారు. బాబా పేరు ఎంతో ఉన్నతమైనది కానీ వారి చిత్రము చాలా చిన్ననిది. అర్థం చేయించేందుకని ఇంత పెద్ద రూపాన్ని చూపించారు.
తండ్రి అంటారు, నాకు ఇంత పెద్ద రూపము లేదు. ఏ విధంగా ఆత్మ చిన్నదిగా ఉంటుందో అలాగే పరమాత్మ అయిన నేను కూడా నక్షత్రము వలె ఉంటాను. వారిని సుప్రీమ్ సోల్ అని అంటారు, వారు అందరికన్నా ఉన్నతమైనవారు. వారిలోనే మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. వారు మనుష్య సృష్టికి బీజరూపుడని,
జ్ఞానసాగరుడని, చైతన్య ఆత్మ అని వారి మహిమ చేయబడ్డది.
కానీ ఎప్పుడైతే ఇంద్రియాలను ధరిస్తారో అప్పుడే వినిపించగలరు. ఏ విధంగానైతే పసిపిల్లలు కూడా చిన్నని ఇంద్రియాలు ఉన్న కారణంగా మాట్లాడలేరు, పెద్దగా అయిన తర్వాత శాస్త్రాలు మొదలైనవాటిని చూడడంతో అంతకుముందు సంస్కారాలు స్మృతిలోకి వస్తాయి. కావున తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు, నేను మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మీకు తిరిగి అదే రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను.
శ్రీకృష్ణుడేమీ రాజయోగాన్ని నేర్పించలేదు.
వారు ప్రారబ్ధాన్ని అనుభవించారు. 8 జన్మలు సూర్యవంశీగా,
12 జన్మలు చంద్రవంశీగా, తర్వాత
63 జన్మలు వైశ్య, శూద్ర వంశీగా అయ్యారు.
ఇప్పుడు ఇది అందరి అంతిమ జన్మ. ఈ శ్రీకృష్ణుని ఆత్మ కూడా వింటుంది. మీరు కూడా వింటారు.
ఇది సంగమయుగ బ్రాహ్మణుల వర్ణం. తర్వాత మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. బ్రాహ్మణ ధర్మము, సూర్యవంశీ దేవతా ధర్మము మరియు చంద్రవంశీ క్షత్రియ ధర్మము
- ఈ మూడింటి స్థాపకుడు ఒక్క పరమపిత పరమాత్మయే. కావున ఈ మూడింటికీ శాస్త్రము కూడా ఒక్కటే ఉండాలి. వేర్వేరు శాస్త్రాలేమీ లేవు. బ్రహ్మా ఎంతో పెద్దవారు, అందరికీ తండ్రి,
వారు ప్రజాపిత.
వారి శాస్త్రము కూడా ఏమీ లేదు. ఒక్క గీతలోనే భగవానువాచ అని ఉంది. బ్రహ్మా భగవానువాచ అని లేదు. ఇది శివ భగవానువాచ బ్రహ్మా ద్వారా, దీని ద్వారా శూద్రులను పరివర్తన చేసి బ్రాహ్మణులుగా తయారుచేయడం జరుగుతుంది. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు మరియు ఎవరైతే పాస్ అవ్వరో వారు క్షత్రియులుగా అవుతారు. రెండు కళలు తగ్గిపోతాయి.
ఎంత బాగా అర్థం చేయిస్తారు. ఉన్నతోన్నతమైనవారు పరమపిత పరమాత్మ, ఆ తర్వాత బ్రహ్మా, విష్ణు,
శంకరులు, వారిని కూడా పురుషోత్తములు అని అనరు. ఎవరైతే పురుషోత్తములుగా అవుతారో వారే మళ్ళీ కనిష్టులుగా కూడా అవుతారు. మనుష్యులలో సర్వోత్తములు లక్ష్మీ-నారాయణులు, వారి మందిరాలు కూడా ఉన్నాయి. కానీ వారి మహిమ గురించి ఎవరికీ తెలియదు.
కేవలం పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతున్నారు.
మాయ తిరిగి పూజారిగా చేస్తుంది. డ్రామా ఈ విధంగా రచింపబడి ఉంది. ఎప్పుడైతే నాటకం పూర్తవుతుందో అప్పుడే నేను రావలసి ఉంటుంది. ఇక తర్వాత వృద్ధి జరగడం కూడా దానంతటదే ఆగిపోతుంది. మళ్ళీ పిల్లలైన మీరు వచ్చి మీ-మీ పాత్రలను రిపీట్ చేయాలి. ఇది పరమపిత పరమాత్మ స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తారు, వారి జయంతిని భక్తి మార్గంలో జరుపుకుంటారు. దానిని జరుపుకుంటూనే ఉంటారు. స్వర్గంలోనైతే ఎవరి జయంతిని జరుపుకోరు.
అక్కడ శ్రీకృష్ణుడు, రాముడు మొదలైనవారి జయంతిని కూడా జరుపుకోరు. వారిరువురూ ప్రత్యక్షంగా అక్కడ ఉంటారు. వారు ఒకప్పుడు ఉండి వెళ్ళారు కాబట్టే ఇక్కడ జరుపుకుంటున్నారు. అక్కడ సంవత్సరం- సంవత్సరం శ్రీకృష్ణుని జన్మదినాన్ని జరుపుకోరు. అక్కడైతే ఎల్లప్పుడూ సంతోషము ఉంటుంది,
ఇక జన్మదినాన్ని ఏమి జరుపుకుంటారు.
పిల్లల పేర్లను తల్లిదండ్రులే పెడుతూ ఉండవచ్చు. గురువులైతే అక్కడ ఉండరు. నిజానికి ఈ విషయాలకు జ్ఞాన-యోగాలతో సంబంధమేమీ లేదు.
ఇకపోతే అక్కడి ఆచార-వ్యవహారాలు ఏమిటి, అది అడగవలసి ఉంటుంది,
బాబా అంటారు
- అక్కడి నియమాలు ఏవుంటే అవి నడుస్తాయి,
మీరు అడగవలసిన అవసరమేముంది. మొదట కష్టపడి మీ పదవినైతే పొందండి. అర్హులుగా అయితే అవ్వండి, ఆ తర్వాత అడగండి. డ్రామాలో ఏదో ఒక నియమం ఉండి ఉంటుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
స్వయాన్ని నిరాకార ఆత్మగా భావిస్తూ నిరాకార తండ్రిని స్మృతి చేయాలి. ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు.
మరజీవాగా అయి పాత విషయాలను బుద్ధి ద్వారా మరిచిపోవాలి.
2.
తండ్రి చేత రచింపబడిన ఈ రుద్ర యజ్ఞంలో సంపూర్ణంగా స్వాహా అవ్వాలి. శూద్రులను బ్రాహ్మణ ధర్మంలోకి పరివర్తన చేసే సేవను చేయాలి.
వరదానము:-
దినచర్యను సెట్ చేసుకోవడము మరియు తండ్రిని తోడుగా చేసుకోవడము ద్వారా ప్రతి కార్యాన్ని ఏక్యురేట్ గా చేసే విశ్వ కళ్యాణకారీ భవ
ప్రపంచంలో పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి దినచర్య సెట్ అయి ఉంటుంది. ఏ కార్యమైనా దినచర్యను సెట్ చేసుకున్నప్పుడే ఏక్యురేట్ గా జరుగుతుంది. సెట్ చేసుకోవడం ద్వారా సమయము, శక్తి అన్నీ పొదుపు అవుతాయి, ఒక వ్యక్తి పది కార్యాలను చేయగలరు. మరి విశ్వకళ్యాణకారీ బాధ్యత గల ఆత్మలైన మీరు, ప్రతి కార్యములో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు దినచర్యను సెట్ చేసుకోండి మరియు తండ్రితో పాటు సదా కంబైండ్ గా ఉండండి. వేలాది భుజాలు కలిగిన తండ్రి మీతో పాటు ఉంటే, ఒక కార్యానికి బదులుగా వెయ్యి కార్యాలను ఏక్యురేట్ గా చేయగలరు.
స్లోగన్:-
సర్వ ఆత్మల పట్ల శుద్ధ సంకల్పాలు చేయడమే వరదానీ మూర్తులుగా అవ్వడము.
0 Comments