18-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
పితాశ్రీ
గారి పుణ్య
స్మృతి దినమున
వినిపించేందుకు బాప్
దాదా మధుర
మహావాక్యాలు ‘‘మధురమైన
పిల్లలూ, నిజాయితీపరులుగా అయి, సత్యతతో
స్వయాన్ని చెక్
చేసుకోండి, నేను
ఎంతవరకు పర్ఫెక్టుగా అయ్యాను, పర్ఫెక్టుగా అయ్యేందుకు దేహాభిమానమనే లోపాన్ని తొలగించుకుంటూ వెళ్ళండి’’
ప్రశ్న:-
భవిష్యత్తు కోసం పిల్లలు తండ్రితో ఏ వ్యాపారము చేసారు? ఆ వ్యాపారముతో సంగమములో ఏం లాభముంది?
జవాబు:-
దేహ సహితంగా, వ్యర్థమైనవి ఏవేవి ఉన్నాయో, అవన్నీ తండ్రికి అర్పణ చేసి, బాబాతో అంటారు - బాబా, మేము మీ నుండి మళ్ళీ అక్కడ (భవిష్యత్తులో) అన్నీ తీసుకుంటాము,
ఇది అన్నింటికన్నా
మంచి వ్యాపారము. దీనితో మీది బాబా యొక్క లాకర్ లో అంతా సురక్షితంగా ఉంటుంది మరియు అపారమైన సంతోషముంటుంది
- ఇప్పుడు ఇక్కడ మేము కొంత సమయమే ఉంటాము, తర్వాత మన రాజధానిలో ఉంటాము. మిమ్మల్ని ఎవరైనా అడిగితే చెప్పండి, వాహ్! మేమైతే అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వాన్ని
తీసుకుంటున్నాము. ఇప్పుడు మేము సదా ఆరోగ్యవంతులుగా,
సదా ఐశ్వర్యవంతులుగా
అవుతాము.
ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు
- మధురమైన పిల్లలూ,
ఎప్పుడైతే ఇక్కడకు వచ్చి కూర్చుంటారో అప్పుడు ఆత్మాభిమానిగా అయి తండ్రి స్మృతిలో కూర్చోండి.
ఈ అటెన్షన్ మీకు ఎప్పటికీ ఉండాలి.
జీవించి ఉన్నంతవరకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి.
స్మృతి చేయకపోతే జన్మ-జన్మాంతరాల పాపాలు కూడా నశించవు.
రచయిత మరియు రచన యొక్క ఆది-మధ్య-అంతాల స్వదర్శన చక్రమంతా మీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి.
మీరు లైట్ హౌస్ లు కదా. ఒక కంటిలో శాంతిధామము,
రెండవ కంటిలో సుఖధామము ఉన్నాయి.
లేస్తూ-కూర్చుంటూ,
నడుస్తూ-తిరుగుతూ స్వయాన్ని లైట్ హౌస్ గా భావించండి.
స్వయాన్ని లైట్ హౌస్ గా భావించడముతో స్వయానికి కూడా కళ్యాణము చేసుకుంటారు మరియు ఇతరులకు కూడా కళ్యాణము చేస్తారు.
బాబా భిన్న-భిన్న యుక్తులను తెలియజేస్తారు.
ఎవరైనా మార్గంలో కలిసినప్పుడు వారికి చెప్పాలి,
ఇది దుఃఖధామము.
శాంతిధామానికి,
సుఖధామానికి వెళ్ళాలని కోరుకుంటున్నారా!
సూచననివ్వాలి.
లైట్ హౌస్ కూడా సూచన ఇస్తుంది కదా, మార్గం చూపిస్తుంది.
మీరు కూడా సుఖధామానికి,
శాంతిధామానికి మార్గం తెలియజేయాలి.
రాత్రింబవళ్ళు ఇదే చింత ఉండాలి.
యోగ శక్తితో మీరు ఎవరికైనా కొద్దిగా అర్థం చేయించినా కూడా, వారికి వెంటనే బాణము తగులుతుంది.
ఎవరికైతే బాణము తగులుతుందో వారు ఒక్కసారిగా గాయపడతారు.
మొదట గాయపడతారు,
తర్వాత బాబాకు చెందినవారిగా అవుతారు.
తండ్రిని పిల్లలైన మీరు ప్రేమతో స్మృతి చేసినప్పుడు తండ్రికి కూడా ఆకర్షణ కలుగుతుంది.
చాలామంది అస్సలు స్మృతే చేయరు అప్పుడు తండ్రికి దయ కలుగుతుంది.
అయినా కూడా అంటారు,
మధురమైన పిల్లలూ,
ఉన్నతి చెందుతూ ఉండండి.
పురుషార్థము చేసి ముందు నంబరులోకి వెళ్ళండి.
పతిత-పావనుడు,
సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే,
ఆ ఒక్క తండ్రినే స్మృతి చేయాలి.
కేవలం తండ్రిని మాత్రమే కాదు, వారితో పాటు మధురమైన ఇంటిని కూడా స్మృతి చేయాలి.
కేవలం మధురమైన ఇల్లు మాత్రమే కాదు, ఆస్తి కూడా కావాలి,
అందుకే స్వర్గ ధామాన్ని కూడా స్మృతి చేయాలి.
మధురాతి-మధురమైన పిల్లలను పర్ఫెక్టుగా తయారుచేసేందుకు తండ్రి వచ్చారు.
కనుక నిజాయితీపరులుగా అయి, సత్యతతో స్వయాన్ని చెక్ చేసుకోవాలి,
మేము ఎంతవరకు పర్ఫెక్టుగా అయ్యాము?
ఫర్ఫెక్టుగా అయ్యేందుకు యుక్తులు కూడా తండ్రి తెలియజేస్తూ ఉంటారు.
ముఖ్యమైన లోపమే
- దేహాభిమానానికి సంబంధించినది.
దేహాభిమానమే అవస్థను ముందుకు వెళ్ళనివ్వదు,
అందుకే దేహాన్ని కూడా మర్చిపోవాలి.
తండ్రికి పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుంది.
తండ్రి పిల్లలను చూసి హర్షిస్తారు.
కనుక పిల్లలు కూడా ఇంతటి సంతోషంలో ఉండాలి.
తండ్రిని స్మృతి చేస్తూ లోపల ఆనందంతో పులకరించిపోవాలి.
రోజు రోజుకు సంతోషమనే పాదరసం ఎక్కి ఉండాలి.
స్మృతి యాత్రతో పాదరసం ఎక్కుతుంది.
అది నెమ్మది-నెమ్మదిగా ఎక్కుతుంది.
గెలుపు-ఓటములు జరుగుతూ-జరుగుతూ తర్వాత నంబరువారు పురుషార్థానుసారముగా కల్పక్రితము వలె తమ-తమ పదవులను పొందుతారు.
బాప్ దాదా పిల్లల అవస్థను సాక్షీగా అయి చూస్తూ ఉంటారు మరియు వివరణ కూడా ఇస్తూ ఉంటారు.
బాప్ దాదా ఇరువురికీ పిల్లలపై చాలా ప్రేమ ఉంది ఎందుకంటే కల్ప-కల్పము ప్రియమైన సేవ చేస్తారు మరియు చాలా ప్రేమతో చేస్తారు.
కానీ పిల్లలు ఒకవేళ శ్రీమతముపై నడవకపోతే తండ్రి ఏం చేయగలరు.
తండ్రికి దయ అయితే చాలా కలుగుతుంది.
మాయ ఓడిస్తుంది,
తండ్రి మళ్ళీ నిలబెడతారు.
అందరికన్నా అతి మధురమైనవారు ఆ తండ్రి ఒక్కరే.
ఎంత మధురమైనవారు,
ఎంత ప్రియమైనవారు,
శివ భోళా భగవానుడు!
శివ భోళా అని అయితే ఒక్కరికి మాత్రమే పేరు ఉంది.
మధురమైన పిల్లలూ,
ఇప్పుడు మీరు చాలా-చాలా విలువైన వజ్రము వలె అవుతారు.
విలువైన వజ్రా-వైఢూర్యాలు ఏవైతే ఉంటాయో,
రక్షణ కోసం వాటిని ఎల్లప్పుడూ బ్యాంకులో ఉంచుతారు.
బ్రాహ్మణ పిల్లలైన మీరు కూడా విలువైనవారు,
మీరు శివబాబా బ్యాంకులో సురక్షితంగా కూర్చుని ఉన్నారు.
ఇప్పుడు మీరు బాబా రక్షణలో ఉంటూ అమరులుగా అవుతారు.
మీరు కాలుడిపై కూడా విజయము పొందుతున్నారు.
శివబాబాకు చెందినవారిగా అయ్యారంటే సురక్షితమైనట్లు.
ఇకపోతే,
ఉన్నత పదవి పొందేందుకు పురుషార్థం చేయాలి.
ప్రపంచంలో మనుష్యుల వద్ద ఎంత ధన-సంపదలు ఉన్నా కానీ, అవన్నీ సమాప్తమవ్వనున్నాయి.
ఏవీ మిగలవు.
పిల్లలైన మీ వద్దనైతే ఇప్పుడు ఏమీ లేదు. ఈ దేహము కూడా లేదు. ఇది కూడా తండ్రికి ఇచ్చేయండి.
కనుక ఎవరి వద్దనైతే ఏమీ లేదో, వారి వద్ద అన్నీ ఉన్నట్లే.
మీరు అనంతమైన తండ్రితో వ్యాపారము చేసిందే భవిష్య కొత్త ప్రపంచము కోసము.
బాబా,
దేహ సహితంగా వ్యర్థమైనది ఏదైతే ఉందో, అదంతా మీకిచ్చేస్తాము మరియు మీ నుండి మళ్ళీ అక్కడ అన్నీ తీసుకుంటాము అని అంటారు.
కనుక మీరు సురక్షితంగా అయినట్లే.
అన్నీ బాబా యొక్క లాకర్ లో సురక్షితమయ్యాయి.
పిల్లలైన మీ లోపల ఎంత సంతోషముండాలి,
ఇంకా కొద్ది సమయమే ఉంది, తర్వాత మనం మన రాజధానిలో ఉంటాము.
మిమ్మల్ని ఎవరైనా అడిగితే చెప్పండి,
వాహ్!
మేమైతే అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం యొక్క వారసత్వము తీసుకుంటున్నాము.
సదా ఆరోగ్యవంతులుగా,
ఐశ్వర్యవంతులుగా అవుతాము.
మన అన్ని మనోకామనలు పూర్తి అవుతున్నాయి.
ఈ తండ్రి ఎంత ప్రియమైనవారు,
పవిత్రమైనవారు.
వారు ఆత్మలను కూడా తమ సమానంగా పవిత్రంగా తయారుచేస్తారు.
మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో,
అంత ఎక్కువ ప్రియంగా అవుతారు,
దేవతలు ఎంత ప్రియమైనవారు.
ఇప్పటికీ వారి జడ చిత్రాలను పూజిస్తూ ఉంటారు.
కనుక పిల్లలైన మీరిప్పుడు ఇంతటి ప్రియంగా అవ్వాలి.
ఏ దేహధారి కానీ, ఏ వస్తువు కానీ చివర్లో గుర్తు రాకూడదు.
బాబా,
మీ ద్వారానైతే మాకు అన్నీ లభించాయి.
మధురమైన పిల్లలు స్వయంతో ప్రతిజ్ఞ చేసుకోవాలి,
మనసు లోపల తింటూ ఉండేటువంటి వికర్మలేవీ మన ద్వారా జరగకూడదు,
అందుకే ఎంత వీలైతే అంత స్వయాన్ని సరిదిద్దుకోవాలి,
ఉన్నత పదవిని పొందే పురుషార్థము చేయాలి.
నంబరువారుగా అయితే ఉండనే ఉన్నారు.
రత్నాలలో కూడా నంబరువారుగా ఉంటాయి కదా. కొన్నింటిలో చాలా లోపాలు ఉంటాయి,
కొన్ని పూర్తి స్వచ్ఛంగా ఉంటాయి.
తండ్రి కూడా రత్నాల వ్యాపారి కదా. కనుక తండ్రి ఒక్కొక్క రత్నాన్ని చూడాల్సి ఉంటుంది
- ఇది ఎటువంటి రత్నము,
ఇందులో ఏ లోపముంది అని. మంచి-మంచి స్వచ్ఛమైన రత్నాలను తండ్రి కూడా చాలా ప్రేమతో చూస్తారు.
మంచి-మంచి స్వచ్ఛమైన రత్నాలను బంగారు డిబ్బీలలో పెట్టాల్సి ఉంటుంది.
పిల్లలు కూడా స్వయము అర్థము చేసుకుంటారు,
నేను ఏ రకమైన రత్నాన్ని.
నాలో ఏ లోపముంది అని.
ఇప్పుడు మీరు అంటారు,
వాహ్ సద్గురు వాహ్! వారు మనకు ఈ మార్గాన్ని తెలియజేసారు.
వాహ్ భాగ్యము వాహ్! వాహ్ డ్రామా వాహ్! మీ హృదయం నుండి వెలువడుతుంది
- ధన్యవాదాలు బాబా, మా రెండు పిడికెళ్ళ బియ్యాన్ని తీసుకుని మాకు సురక్షితంగా భవిష్యత్తులో వంద రెట్లు రిటర్ను ఇస్తారు.
కానీ ఇందులో కూడా పిల్లలకు చాలా విశాల బుద్ధి ఉండాలి.
పిల్లలకు అపారమైన జ్ఞాన ధనం యొక్క ఖజానా లభిస్తూ ఉంటుంది కనుక అపారమైన సంతోషముండాలి కదా. హృదయం ఎంతగా శుద్ధంగా ఉంటుందో ఇతరులను కూడా అంతగా శుద్ధంగా తయారుచేస్తారు.
యోగ స్థితి ద్వారానే హృదయము శుద్ధంగా అవుతుంది.
పిల్లలైన మీకు యోగీగా తయారయ్యే,
తయారుచేసే అభిరుచి ఉండాలి.
ఒకవేళ దేహం పట్ల మోహముంటే,
దేహాభిమానం ఉంటే మా అవస్థ చాలా కచ్చాగా ఉందని భావించండి.
దేహీ-అభిమాని పిల్లలే సత్యమైన వజ్రాలుగా అవుతారు,
అందుకే ఎంత వీలైతే అంత దేహీ-అభిమానిగా అయ్యే అభ్యాసము చేయండి.
తండ్రిని స్మృతి చేయండి.
బాబా అన్న పదము అన్నింటికన్నా చాలా మధురమైనది.
తండ్రి చాలా ప్రేమతో పిల్లలను కనురెప్పలపై కూర్చోబెట్టుకుని తోడుగా తీసుకువెళ్తారు.
ఇటువంటి తండ్రి స్మృతి యొక్క నషాలో పూర్తిగా నిమగ్నమైపోవాలి.
తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ సంతోషంలో శీతలంగా అయిపోవాలి.
ఎలాగైతే తండ్రి అపకారులకు ఉపకారము చేస్తారో
- మీరు కూడా ఫాలో ఫాదర్ చేయండి.
సుఖాన్ని ఇచ్చేవారిగా అవ్వండి.
పిల్లలైన మీకిప్పుడు డ్రామా రహస్యము గురించి కూడా తెలుసు
- తండ్రి మీకు నిరాకారీ,
ఆకారీ మరియు సాకారీ ప్రపంచాల సమాచారమంతా వినిపిస్తారు.
ఆత్మ అంటుంది,
ఇప్పుడు మేము కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నాము,
మేము స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తప్పకుండా అవుతాము.
స్వయానికి మరియు ఇతరులకు కళ్యాణము చేస్తాము.
అచ్ఛా
- తండ్రి మధురమైన పిల్లలకు అర్థము చేయిస్తారు,
తండ్రి దుఃఖహర్త-సుఖకర్త కనుక పిల్లలు కూడా అందరికీ సుఖమివ్వాలి.
తండ్రికి కుడి భుజాలుగా అవ్వాలి.
ఇటువంటి పిల్లలే తండ్రికి ప్రియమనిపిస్తారు.
శుభ కార్యంలో కుడి చేతినే ఉపయోగిస్తారు.
కనుక తండ్రి అంటారు,
ప్రతి విషయంలో ధర్మ బద్ధంగా అవ్వండి,
ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే,
తర్వాత అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది.
ఈ పాత ప్రపంచంపై మమకారాన్ని తొలగించండి.
ఇదైతే శ్మశానవాటిక.
వ్యాపార-వ్యవహారాలు,
పిల్లలు మొదలైనవారి చింతనలో మరణిస్తే అనవసరంగా స్వయాన్ని నాశనం చేసుకుంటారు.
శివబాబాను స్మృతి చేయడముతో మీరు చాలా సంపన్నంగా అవుతారు.
దేహాభిమానంలోకి రావడముతో నష్టం వాటిల్లుతుంది.
దేహీ-అభిమానులుగా అవ్వడముతో సంపన్నత కలుగుతుంది.
ధనముపై కూడా చాలా లోభం ఉంచుకోకూడదు.
ఆ చింతలో శివబాబాను కూడా మర్చిపోతారు.
బాబా చూస్తారు,
అంతా తండ్రికి అర్పించి నా శ్రీమతముపై ఎంతవరకు నడుస్తున్నారు.
ప్రారంభంలో తండ్రి కూడా ట్రస్టీగా ఉండి చూపించారు కదా. అంతా ఈశ్వరార్పణం చేసి స్వయం ట్రస్టీగా అయిపోయారు.
కేవలం ఈశ్వరుని కార్యంలోనే ఉపయోగించాలి.
విఘ్నాలకు ఎప్పుడూ భయపడకూడదు.
ఎంత వీలైతే అంత సేవలో తమదంతా సఫలం చేసుకోవాలి.
ఈశ్వరార్పణం చేసి ట్రస్టీగా అయి ఉండాలి.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
అవ్యక్త-మహావాక్యాలు - 1977
అందరూ శబ్దానికి అతీతంగా తమ శాంత స్వరూప స్థితిలో స్థితులయ్యే అనుభవం చాలా సమయం చేయగలరా?
శబ్దంలోకి వచ్చే అనుభవం ఎక్కువగా చేయగలరా లేక శబ్దానికి అతీతంగా ఉండే అనుభవం ఎక్కువ సమయం చేయగలరా?
ఎంతగా లాస్ట్ స్థితి అనగా కర్మాతీత స్థితి సమీపానికి వస్తూ ఉంటుందో అంతగా శబ్దానికి అతీతంగా శాంత స్వరూప స్థితి అధికంగా ప్రియమనిపిస్తుంది,
ఈ స్థితిలో సదా అతీంద్రియ సుఖము యొక్క అనుభూతి అవ్వాలి.
ఈ అతీంద్రియ సుఖమయ స్థితి ద్వారానే అనేక ఆత్మలను సహజంగానే ఆహ్వానించగలరు.
ఈ శక్తిశాలి స్థితిని విశ్వకళ్యాణకారీ స్థితి అని అంటారు.
ఎలాగైతే ఈ రోజుల్లో సైన్సు సాధనాల ద్వారా అన్ని వస్తువులు సమీపంగా అనుభవమవుతూ ఉంటాయి,
దూరపు శబ్దాలు టెలిఫోన్ సాధనం ద్వారా సమీపంగా వినిపిస్తాయి,
టీ.వి. (దూర-దర్శన్)
ద్వారా దూరంగా ఉన్న దృశ్యము సమీపంగా కనిపిస్తుంది.
అదే విధంగా సైలెన్స్ స్థితి ద్వారా ఎంత దూరంలో ఉన్న ఆత్మకైనా సరే సందేశం చేర్చగలరు!
వారు ఎలా అనుభవం చేస్తారంటే,
సాకారంలో సమ్ముఖంలో ఎవరో సందేశమిచ్చినట్లుగా అనుభవం చేస్తారు.
దూరంగా కూర్చుని ఉన్నా కూడా శ్రేష్ఠ ఆత్మలైన మీ దర్శనము మరియు ప్రభు చరిత్రల యొక్క దృశ్యాలు సమ్ముఖంలో చూస్తున్నట్లుగా అనుభవం చేస్తారు.
సంకల్పం ద్వారా కనిపిస్తుంది అనగా శబ్దానికి అతీతంగా సంకల్ప సిద్ధి యొక్క పాత్రను అభినయిస్తారు.
కానీ ఈ సిద్ధి యొక్క విధి - ఎక్కువలో ఎక్కువ తమ శాంతి స్వరూపంలో స్థితులవ్వాలి,
అందుకే సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని అంటారు,
దీనినే బంగారు యుగపు స్థితి అని అంటారు.
ఈ స్థితిలో స్థితులవ్వడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖ్యాతిని తీసుకొచ్చేవారిగా అవుతారు.
సమయము రూపీ ఖజానా,
శక్తుల ఖజానా మరియు స్థూల ఖజానా అన్నింటిలో
‘తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖ్యాతిని’
తీసుకొచ్చేవారిగా అవుతారు,
దీని కోసం ఒక్క పదాన్ని గుర్తుంచుకోండి,
అదేమిటి?
బ్యాలెన్స్.
ప్రతి కర్మలో,
ప్రతి సంకల్పము మరియు మాటలో,
సంబంధం లేక సంపర్కంలో బ్యాలెన్స్ ఉండాలి.
అప్పుడు మాట, కర్మ, సంకల్పం,
సంబంధం లేక సంపర్కం సాధారణతకు బదులుగా అలౌకికంగా కనిపిస్తాయి అనగా చమత్కారికంగా కనిపిస్తాయి.
ప్రతి ఒక్కరి నోటి నుండి,
మనసు నుండి ఇదే శబ్దము వెలువడుతుంది
- ఇదైతే చమత్కారము.
సమయానుసారముగా స్వయం యొక్క పురుషార్థం యొక్క వేగము మరియు విశ్వ సేవ యొక్క వేగము తీవ్రగతితో ఉండాలి,
అప్పుడే విశ్వకళ్యాణకారిగా అవ్వగలరు.
విశ్వంలోని చాలామంది ఆత్మలు తండ్రిని మరియు ఇష్ట దేవతలైన మీ ప్రత్యక్షతను ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు మరియు ఇష్ట దేవులు వారిని తక్కువగా ఆహ్వానిస్తున్నారు.
దీనికి కారణమేమిటి?
మీ హద్దు స్వభావము,
సంస్కారాల ప్రవృత్తిలో చాలా సమయం వెచ్చిస్తున్నారు.
ఎలాగైతే అజ్ఞానీ ఆత్మలకు జ్ఞానము వినేందుకు తీరిక ఉండదు,
అలా చాలామంది బ్రాహ్మణులకు కూడా ఈ శక్తిశాలి స్థితిలో స్థితులయ్యేందుకు తీరిక లభించదు,
అందుకే ఇప్పుడు జ్వాలా రూపంగా అయ్యే అవసరం ఉంది.
బాప్ దాదా ప్రతి ఒక్కరి ప్రవృత్తిని చూసి నవ్వుకుంటూ ఉంటారు,
ఎలా టూ మచ్ బిజీగా అయిపోయారు.
చాలా బిజీగా ఉంటారు కదా! వాస్తవిక స్థితిలో సదా ఫ్రీగా ఉంటారు.
సిద్ధి కూడా జరుగుతుంది మరియు ఫ్రీగా కూడా ఉంటారు.
సైన్సు సాధనాలు భూమిపై కూర్చుని ఉంటూనే అంతరిక్షంలోకి వెళ్ళిన యంత్రాలను కంట్రోల్ చేయగలవు అన్నప్పుడు,
ఎలా కావాలనుకుంటే అలా, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తిప్పగలిగినప్పుడు,
మరి సైలెన్స్ యొక్క శక్తి స్వరూపులు,
ఈ సాకార సృష్టిలో శ్రేష్ఠ సంకల్పాల ఆధారంతో ఏ సేవ కావాలనుకుంటే దానిని,
ఏ ఆత్మ సేవ చేయాలనుకుంటే వారి సేవను చేయలేరా!
కానీ ముందు తమ-తమ ప్రవృత్తి నుండి అతీతంగా అనగా ఉపరామముగా ఉండండి.
ఖజానాలు అన్నింటినీ ఏవైతే వినిపించారో వాటిని స్వయం కోసం కాకుండా,
విశ్వ-కళ్యాణం కోసం ఉపయోగించండి.
అర్థమయిందా,
ఇప్పుడేం చేయాలి?
శబ్దం ద్వారా సేవ, స్థూల సాధనాల ద్వారా సేవ మరియు శబ్దానికి అతీతంగా సూక్ష్మ సాధనమైన సంకల్పం యొక్క శ్రేష్ఠత,
సంకల్ప శక్తి ద్వారా సేవలో బ్యాలెన్సు ను ప్రత్యక్ష రూపంలో చూపించండి,
అప్పుడే వినాశనం యొక్క ఢంకా మ్రోగుతుంది.
అర్థమయిందా.
ప్లాన్లు అయితే చాలా తయారుచేస్తున్నారు,
బాప్ దాదా కూడా ప్లాను తెలియజేస్తున్నారు.
బ్యాలెన్స్ సరిగ్గా లేని కారణంగా శ్రమ అధికంగా చేయాల్సి వస్తోంది.
విశేష కార్యము తర్వాత విశేషంగా రెస్ట్ కూడా తీసుకుంటారు కదా. ఫైనల్ ప్లాన్ లో అలసటలేనితనాన్ని అనుభవం చేస్తారు.
అచ్ఛా.
ఇటువంటి సర్వ శక్తులను విశ్వకళ్యాణము కోసం కార్యంలో ఉపయోగించేవారు,
సంకల్పాల సిద్ధి స్వరూపులు,
స్వయం యొక్క ప్రవృత్తి నుండి స్వతంత్రులు,
సదా శాంతి మరియు శక్తి స్వరూప స్థితిలో స్థితులై ఉండే సర్వ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
వరదానము:-
సైలెన్స్ శక్తి
ద్వారా కొత్త
సృష్టి స్థాపనకు
నిమిత్తంగా అయ్యే
మాస్టర్ శాంతి
దేవా భవ
సైలెన్స్ శక్తిని జమ చేసుకునేందుకు ఈ శరీరము నుండి అతీతంగా అశరీరిగా అవ్వండి. ఈ సైలెన్స్ శక్తి చాలా మహాన్ శక్తి, దీని ద్వారా కొత్త సృష్టి స్థాపన అవుతుంది. కనుక ఎవరైతే శబ్దానికి అతీతంగా సైలెన్స్ రూపంలో స్థితులవుతారో
వారే స్థాపనా కార్యాన్ని చేయగలరు, అందుకే శాంతి దేవా అనగా శాంతి స్వరూపంగా అయి అశాంతి ఆత్మలకు శాంతి కిరణాలను ఇవ్వండి. విశేషంగా శాంతి శక్తిని పెంచుకోండి. ఇదే అన్నింటికన్నా అతి పెద్ద మహాదానము, ఇదే అన్నింటికన్నా ప్రియమైన మరియు శక్తిశాలి వస్తువు.
స్లోగన్:-
ప్రతి ఆత్మ మరియు ప్రకృతి పట్ల శుభ భావన ఉంచుకోవడమే విశ్వ కళ్యాణకారిగా అవ్వడము.
0 Comments