17-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురవైున పిల్లలూ
- మీరు ఈ పాఠశాలలోకి మీ ఉన్నతవైున భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు వచ్చారు, మీరు
నిరాకారుడైన తండ్రి
ద్వారా చదువుకుని
రాజులకే రాజులుగా
అవ్వాలి’’ ‘‘మధురవైున
పిల్లలూ - మీరు
ఈ పాఠశాలలోకి మీ ఉన్నతవైున
భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు వచ్చారు, మీరు
నిరాకారుడైన తండ్రి
ద్వారా చదువుకుని
రాజులకే రాజులుగా
అవ్వాలి’’
ప్రశ్న:-
చాలా మంది పిల్లలు భాగ్యశాలులే, కానీ తర్వాత దుర్భాగ్యశాలులుగా అవుతారు, అది ఎలా?
జవాబు:-
ఎవరికైతే ఏ కర్మబంధనాలూ లేవో అనగా కర్మబంధన ముక్తులుగా ఉన్నారో ఆ పిల్లలు భాగ్యశాలులు.
కానీ, ఒకవేళ చదువు పట్ల అటెన్షన్ పెట్టకపోతే, బుద్ధి అటూ-ఇటూ భ్రమిస్తూ ఉంటే, ఏ తండ్రి నుండైతే ఇంతటి భారీ వారసత్వం లభిస్తుందో వారిని స్మృతి చేయకపోతే, ఇక భాగ్యశాలులు
అయ్యుండి కూడా వారిని దుర్భాగ్యశాలులు అనే అంటారు.
ప్రశ్న:-
శ్రీమతములో ఏయే రసాలు నిండి ఉన్నాయి?
జవాబు:-
ఎందులోనైతే మాత-పిత, టీచర్, గురువు అందరి మతము కలిసి ఉందో అదే శ్రీమతము. శ్రీమతము సాక్కిరిన్ (మధుర రసం) వంటిది, అందులో ఈ అన్ని రసాలూ నిండి ఉన్నాయి.
పాట:- భాగ్యాన్ని మేల్కొలుపుకొని వచ్చాను... (తక్దీర్ జగాకర్ ఆయీ హూ...)
ఓం శాంతి. శివ భగవానువాచ,
మనుష్యులు ఎప్పుడైతే గీతను వినిపిస్తారో,
అప్పుడు శ్రీకృష్ణుని పేరు తీసుకుని వినిపిస్తారు.
ఇక్కడ ఏదైతే వినిపిస్తారో దానిని శివ భగవానువాచ అని అంటారు.
శివ భగవానువాచ అని స్వయముగా శివబాబా కూడా అనవచ్చు,
ఎందుకంటే స్వయంగా శివబాబాయే మాట్లాడుతారు.
ఇరువురూ కలిసి కూడా మాట్లాడగలరు.
పిల్లలు వారిరువురికీ చెందినవారు.
కుమారులు మరియు కుమార్తెలు ఇరువురూ కూర్చుని ఉన్నారు.
కావున వారు అంటారు
- పిల్లలూ,
ఎవరు చదివిస్తున్నారో అర్థం చేసుకున్నారా?
బాప్ దాదా చదివిస్తున్నారు అని అంటారు.
బాప్ అని పెద్దవారిని,
దాదా అని చిన్నవారిని అనగా ఈ సోదరుడిని అంటారు.
కావున ఇరువురినీ కలిపి బాప్ దాదా అని అంటారు.
మనం విద్యార్థులమని ఇప్పుడు పిల్లలకు కూడా తెలుసు.
మేము చదువుకుని ఫలానా పరీక్షను పాసవుతాము,
తద్వారా భాగ్యాన్ని తయారుచేసుకుంటాము అన్న భావనతోనే విద్యార్థులు స్కూల్లో కూర్చుంటారు.
ఆ భౌతికవైున పరీక్షలైతే ఎన్నో ఉంటాయి.
మమ్మల్ని అనంతవైున తండ్రి,
పరమపిత పరమాత్మ చదివిస్తున్నారని ఇక్కడ పిల్లలైన మీ మనస్సులో ఉంది. తండ్రి అని వీరిని
(బ్రహ్మాను)
అనరు.
నిరాకారుడైన తండ్రి అర్థం చేయిస్తారు
- మేము తండ్రి నుండి రాజయోగము నేర్చుకుని రాజులకే రాజులుగా అవుతాము అని మీకు తెలుసు.
రాజులు కూడా ఉంటారు మరియు రాజులకే రాజులు కూడా ఉంటారు.
రాజులకే రాజులు ఎవరైతే ఉంటారో,
వారిని రాజులు కూడా పూజిస్తారు.
ఈ ఆచారము భారత ఖండములోనే ఉంది. పతిత రాజులు పావన రాజులను పూజిస్తారు.
మహారాజు అని ఎంతో ఆస్తి ఉన్నవారిని అంటారు.
రాజులు చిన్నగా ఉంటారు.
ఈ రోజుల్లోనైతే కొందరు రాజులకు మహారాజులకన్నా ఎక్కువ ఆస్తి ఉంటుంది.
కొందరు షావుకార్లకు రాజులకన్నా ఎక్కువ ఆస్తి ఉంటుంది.
అక్కడ స్వర్గములో ఈ విధముగా నియమవిరుద్ధంగా ఉండదు.
అక్కడైతే అన్నీ నియమానుసారముగానే ఉంటాయి.
పెద్ద మహారాజు వద్ద పెద్ద ఆస్తి ఉంటుంది.
కావున మనల్ని అనంతవైున తండ్రి కూర్చుని చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు.
పరమాత్మ తప్ప రాజులకే రాజులుగా,
స్వర్గాధిపతులుగా ఎవ్వరూ తయారుచేయలేరు.
స్వర్గ రచయిత ఒక్క నిరాకారుడైన తండ్రే.
హెవెన్లీ గాడ్ ఫాదర్
(స్వర్గస్థాపకుడైన తండ్రి)
అని అంటూ వారి మహిమను గానం చేస్తారు.
తండ్రి స్పష్టంగా అర్థం చేయిస్తారు,
నేను పిల్లలైన మీకు మళ్ళీ స్వరాజ్యాన్ని ఇచ్చి రాజులకే రాజులుగా తయారుచేస్తాను.
మనము భాగ్యాన్ని తయారుచేసుకుని అనంతవైున తండ్రి ద్వారా రాజులకే రాజులుగా తయారయ్యేందుకు వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు.
ఇది ఎంత సంతోషకరమైన విషయము.
ఇది చాలా భారీ పరీక్ష.
బాబా అంటారు,
శ్రీమతముపై నడవండి,
ఇందులో మాత-పిత, టీచర్,
గురువు మొదలైనవారందరి మతము కలిసి ఉంది. శ్రీమతము వీరందరి మతముల సాక్కిరిన్
(మధుర రసం) వంటిది.
ఈ అందరి మతముల రసము ఒక్క శ్రీమతములో నిండి ఉంది. అందరి ప్రియుడు ఒక్కరే.
పతితుల నుండి పావనులుగా తయారుచేసేవారు ఆ ఒక్క తండ్రియే.
గురునానక్ కూడా వారి మహిమను చేసారు కావున తప్పకుండా వారిని స్మృతి చేయవలసి ఉంటుంది.
మొదట వారు తమ వద్దకు తీసుకువెళ్తారు,
తర్వాత పావన ప్రపంచములోకి పంపిస్తారు.
ఎవరైనా వస్తే వారికి ఇది గాడ్లీ కాలేజ్ అని అర్థం చేయించాలి.
భగవానువాచ,
ఇతర స్కూళ్ళలో ఎప్పుడూ భగవానువాచ అని అనరు. భగవంతుడు ఒక్క నిరాకారుడు,
జ్ఞానసాగరుడు,
మనుష్య సృష్టికి బీజరూపుడు...
పిల్లలైన మిమ్మల్ని కూర్చుని చదివిస్తాను.
ఇది గాడ్లీ నాలెడ్జ్.
సరస్వతిని గాడెస్ ఆఫ్ నాలెడ్జ్
(జ్ఞాన దేవి) అని అంటారు.
కావున తప్పకుండా గాడ్లీ నాలెడ్జ్ తో గాడ్, గాడెస్
(దేవీ-దేవతలు)
గానే అవుతూ ఉండవచ్చు.
బ్యారిస్టర్ నాలెడ్జ్ ద్వారా బ్యారిస్టర్ గానే అవుతారు.
ఇది గాడ్లీ నాలెడ్జ్.
సరస్వతికి భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చారు.
కావున ఏ విధముగా సరస్వతి జ్ఞాన దేవినో,
అలాగే పిల్లలైన మీరు కూడా ఉన్నారు.
సరస్వతికి ఎందరో పిల్లలు ఉన్నారు కదా. కానీ ప్రతి ఒక్కరూ గాడెస్ ఆఫ్ నాలెడ్జ్
(జ్ఞాన దేవీలు)
గా పిలువబడడమనేది జరగదు.
ఈ సమయంలో స్వయాన్ని దేవీలుగా చెప్పుకోలేరు.
అక్కడ కూడా దేవీ-దేవతలు అనే అంటారు.
భగవంతుడు జ్ఞానాన్ని తప్పకుండా ఇస్తారు.
పాఠాలను ఆ విధంగా ధారణ చేయిస్తారు.
వీరు గొప్ప పదవిని ఇస్తారు.
అంతేకానీ దేవతలు భగవతీ,
భగవానులు కారు. ఈ మాత-పితలు దేవీ-దేవత వలె ఉన్నారు.
కానీ నిజానికి ప్రస్తుతం అలా లేరు కదా. నిరాకార తండ్రిని గాడ్ ఫాదర్ అని అంటారు.
వీరిని
(సాకారుడిని)
గాడ్ అని ఏమైనా అంటారా.
ఇవి చాలా గుహ్యమైన విషయాలు.
ఆత్మ మరియు పరమాత్మల రూపము మరియు సంబంధము,
ఇవి ఎంత గుహ్యమైన విషయాలు.
ఆ దైహికమైన సంబంధాలు
- పెదనాన్న,
చిన్నాన్న,
మామయ్య మొదలైనవన్నీ సామాన్యమైనవే.
ఇది ఆత్మిక సంబంధము.
అర్థం చేయించే యుక్తి కూడా బాగా కావాలి.
మాత-పిత అన్న పదాలను ఉపయోగిస్తున్నారంటే తప్పకుండా ఏదో ఒక అర్థం ఉంది కదా. ఈ పదాలు అవినాశీగా అవుతాయి.
భక్తి మార్గంలో కూడా ఇవి కొనసాగుతాయి.
మనం స్కూల్లో కూర్చున్నామని పిల్లలైన మీకు తెలుసు.
చదివించేవారు జ్ఞానసాగరుడు.
వీరి ఆత్మ కూడా చదువుకుంటుంది.
ఈ ఆత్మకు తండ్రి ఆ పరమాత్మయే,
వారు సర్వులకూ తండ్రి,
వారు చదివిస్తారు.
వారు గర్భములోకైతే వచ్చేది లేదు, మరి జ్ఞానాన్ని ఎలా చదివించాలి.
వారు బ్రహ్మా తనువులోకి వస్తారు.
కానీ వాళ్ళేమో బ్రహ్మాకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వ్రాసేసారు.
ఇది కూడా డ్రామాలో ఉంది. ఏదో ఒక పొరపాటు జరిగితేనే తండ్రి వచ్చి ఆ పొరపాటును సరిదిద్ది పొరపాట్లు చేయనివారిగా తయారుచేస్తారు.
నిరాకారుని గురించి తెలియని కారణముగానే తికమక చెందారు.
తండ్రి అర్థం చేయిస్తారు
- నేను మీ అనంతవైున తండ్రిని,
అనంతవైున వారసత్వాన్ని ఇచ్చేవాడిని.
లక్ష్మీ-నారాయణులు స్వర్గాధిపతులుగా ఎలా అయ్యారు,
ఇది ఎవరికీ తెలియదు.
తప్పకుండా ఎవరో ఒకరు కర్మలు నేర్పించి ఉంటారు కదా మరియు వారు ఇంతటి ఉన్నత పదవిని ప్రాప్తింపజేసారంటే తప్పకుండా పెద్దవారై ఉంటారు.
మనుష్యులకు ఏమీ తెలియదు.
తండ్రి ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు,
వారు ఎంత పెద్ద అథారిటీ.
వారు మొత్తం ప్రపంచమంతటినీ పతితుల నుండి పావనులుగా తయారుచేసే యజమాని.
వారు అర్థం చేయిస్తారు,
ఇది తయారై-తయారవుతున్న డ్రామా.
మీరు చక్రాన్ని చుట్టవలసి ఉంటుంది.
ఈ తయారైన డ్రామా గురించి ఎవరికీ తెలియదు.
డ్రామాలో మనం పాత్రధారులుగా ఎలా ఉన్నాము,
ఈ చక్రము ఎలా తిరుగుతుంది,
దుఃఖధామం నుండి సుఖధామంగా ఎవరు తయారుచేస్తారు,
ఇది మీకే తెలుసు.
మిమ్మల్ని సుఖధామం కొరకు చదివిస్తాను.
మీరే
21 జన్మల కొరకు సదా సుఖవంతముగా అవుతారు,
ఇతరులెవ్వరూ అక్కడికి వెళ్ళలేరు.
సుఖధామంలో తప్పకుండా కొద్దిమంది మనుష్యులే ఉంటారు.
అర్థం చేయించేందుకు చాలా మంచి పాయింట్లు ఉండాలి.
బాబా,
మేము మీ వారము అని అనడం అంటారు,
కానీ పూర్తిగా అలా అవ్వడంలో సమయం పడుతుంది.
కొందరి కర్మబంధనాలు వెంటనే తెగిపోతాయి,
కొందరికి సమయం పడుతుంది.
భాగ్యశాలులలో కూడా కొందరు ఎలాంటివారు ఉన్నారంటే,
వారి కర్మబంధనాలు తెగి ఉన్నాయి కానీ చదువు పట్ల అటెన్షన్ పెట్టరు,
కావున అటువంటివారిని దుర్భాగ్యశాలులు అని అంటారు.
పుత్రులు,
మనమలు,
మునిమనుమలు మొదలైనవారిలోకి బుద్ధి వెళ్ళిపోతుంది.
ఇక్కడైతే ఒక్కరినే స్మృతి చేయాలి.
చాలా భారీ వారసత్వము లభిస్తుంది.
మనం రాజులకే రాజులుగా అవుతామని మీకు తెలుసు.
పతిత రాజులు ఎలా తయారవుతారు మరియు పావన రాజాధిరాజులు ఎలా తయారవుతారు,
అది కూడా తండ్రి మీకు అర్థం చేయిస్తారు.
నేను స్వయంగా వచ్చి రాజులకే రాజులుగా,
స్వర్గానికి అధిపతులుగా ఈ రాజయోగము ద్వారా తయారుచేస్తాను.
ఆ పతిత రాజులైతే దానం చేయడం ద్వారా అలా తయారవుతారు.
వారిని ఆ విధంగా నేను ఏమైనా వచ్చి తయారుచేస్తానా.
వారు చాలా దానీలుగా ఉంటారు.
దానం చేయడం ద్వారా రాజ్యకులములో జన్మ తీసుకుంటారు.
నేనైతే
21 జన్మల కొరకు మీకు సుఖాన్నిస్తాను.
వారు ఒక్క జన్మ కొరకే అలా అవుతారు,
అందులోనూ పతితులుగా,
దుఃఖితులుగా ఉంటారు.
నేను వచ్చి పిల్లలను పావనంగా తయారుచేస్తాను.
కేవలం గంగా స్నానాలు చేయడం ద్వారా పావనంగా అవుతారు అని మనుష్యులు భావిస్తారు,
ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు.
గంగ,
యమున మొదలైనవాటిని ఎంత మహిమ చేస్తారు.
కానీ,
ఇందులో మహిమ యొక్క విషయమేమీ లేదు. నీరు సాగరము నుండి వస్తుంది.
ఆ మాటకొస్తే నదులు ఎన్నో ఉన్నాయి.
విదేశాలలో కూడా భూమిని తవ్వి పెద్ద-పెద్ద నదులను తయారుచేస్తారు,
ఇందులో పెద్ద విషయమేముంది.
జ్ఞానసాగరుడు మరియు జ్ఞాన గంగలు ఎవరు అన్నదే తెలియదు.
శక్తులు ఏమి చేసారు,
అది ఏమీ తెలియదు.
వాస్తవానికి జ్ఞాన గంగ లేక జ్ఞాన సరస్వతి ఈ జగదాంబయే.
మనుష్యులకు ఇవి ఏమీ తెలియవు,
వారు ఆటవికుల్లా ఉన్నారు.
పూర్తిగా బుద్ధిహీనులుగా,
అవివేకులుగా ఉన్నారు.
తండ్రి వచ్చి అవివేకులను ఎంతటి వివేకవంతులుగా తయారుచేస్తారు.
వీరిని రాజులకే రాజులుగా ఎవరు తయారుచేసారు అన్నది మీరు తెలియజేయవచ్చు.
నేను రాజులకే రాజులుగా తయారుచేస్తాను అని గీతలో కూడా ఉంది. మనుష్యులకు ఇది తెలియదు.
మనకు కూడా ఇంతకుముందు ఇది తెలియదు.
ఎవరైతే స్వయం అలా తయారయ్యారు కానీ ప్రస్తుతం అలా లేరో, వారికే తెలియనప్పుడు ఇక ఇతరులు ఎలా తెలుసుకోగలరు?
సర్వవ్యాపి జ్ఞానంలో అసలేమీ లేదు, యోగము ఎవరితో జోడించాలి,
పిలవడం ఎవరిని పిలవాలి?
ఒకవేళ స్వయమే ఖుదా అయితే,
మరి ప్రార్థన ఎవరికి చేస్తారు!
ఇది చాలా ఆశ్చర్యము.
ఎవరైతే చాలా భక్తి చేస్తారో,
వారికి గౌరవము ఉంటుంది.
భక్తుల మాల కూడా ఉంది కదా. రుద్ర మాల జ్ఞానపు మాల. అది భక్తి మాల. అక్కడున్నది నిరాకారీ మాల. ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి.
అందులోనూ మొదటి నంబర్ ఆత్మ ఎవరిది?
ఎవరైతే నంబర్ వన్ లోకి వెళ్తారో వారిది.
సరస్వతి ఆత్మ మరియు బ్రహ్మా ఆత్మ నంబర్ వన్ గా చదువుకుంటారు.
ఇది ఆత్మ విషయము.
భక్తి మార్గంలో అన్నీ దైహికమైన విషయాలే ఉంటాయి
- ఫలానా భక్తుడు ఇలా ఉన్నారు అని వారి శరీరము పేరునే తీసుకుంటారు.
మీరు మనుష్యుల గురించి అనరు. బ్రహ్మా ఆత్మ ఏమవుతుందో మీకు తెలుసు.
వారు వెళ్ళి శరీరాన్ని ధారణ చేసి రాజులకే రాజుగా అవుతారు.
ఆత్మ శరీరములోకి ప్రవేశించి రాజ్యం చేస్తుంది.
ఇప్పుడైతే రాజుగా లేదు. రాజ్యం చేసేది ఆత్మయే కదా. నేను రాజును,
నేను ఆత్మను,
ఈ శరీరానికి యజమానిని.
ఆత్మనైన నేను శ్రీనారాయణ అనే పేరు కల శరీరాన్ని ధరించి అప్పుడు రాజ్యం చేస్తాను.
ఆత్మయే వింటుంది మరియు ధారణ చేస్తుంది.
ఆత్మలో సంస్కారాలు ఉంటాయి.
మనం శ్రీమతముపై నడవడం ద్వారా తండ్రి నుండి రాజ్యం తీసుకుంటామని ఇప్పుడు మీకు తెలుసు.
బాప్ దాదా, ఇరువురూ కలిసి పిల్లలూ అని అంటారు,
ఇరువురికీ పిల్లలూ అని అనే హక్కు ఉంది. నిరాకారీ పిల్లలూ,
తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని ఆత్మకు చెప్తారు.
హే నిరాకారీ పిల్లలూ,
హే ఆత్మలూ,
తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని ఇంకెవ్వరూ అనలేరు.
తండ్రే ఆత్మలతో మాట్లాడుతారు.
హే పరమాత్మా,
పరమాత్మనైన నన్ను స్మృతి చేయండి అని అయితే అనరు. వారు అంటారు
- హే ఆత్మలూ,
తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్ని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి.
ఇకపోతే,
గంగా స్నానాల ద్వారా ఎప్పుడూ ఎవరూ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవ్వలేరు.
గంగా స్నానం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి పాపాలు చేస్తారు.
ఈ వికారాల కారణంగానే పాపాత్ములుగా అవుతారు.
ఇది ఎవరూ అర్థం చేసుకోరు.
తండ్రి అర్థం చేయిస్తారు,
ఇప్పుడు మీపై రాహువు యొక్క కఠినమైన గ్రహణం పట్టి ఉంది. మొదట్లో గ్రహణం తేలికగా పడుతుంది.
ఇప్పుడు దానమిస్తే గ్రహణం వదులుతుంది.
ఇక్కడ ప్రాప్తి చాలా గొప్పగా ఉంటుంది.
కావున పురుషార్థం కూడా ఆ విధంగా చేయాలి కదా. తండ్రి అంటారు,
నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను,
అందుకే నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి.
మీ
84 జన్మలను కూడా స్మృతి చేయండి.
అందుకే తండ్రి
‘‘స్వదర్శన చక్రధారీ పిల్లలు’’
- అన్న పేరును పెట్టారు.
కావున స్వదర్శన యొక్క జ్ఞానం కూడా కావాలి కదా.
తండ్రి అర్థం చేయిస్తారు
- ఈ పాత ప్రపంచము అంతమవ్వనున్నది.
నేను మిమ్మల్ని కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్తాను.
సన్యాసులు కేవలం ఇళ్ళు,
వాకిళ్ళను మర్చిపోతారు,
మీరు మొత్తం ప్రపంచమంతటినీ మర్చిపోతారు.
తండ్రియే అంటారు
- అశరీరులుగా అవ్వండి.
నేను మిమ్మల్ని కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్తాను కావున పాత ప్రపంచము నుండి,
పాత శరీరము నుండి మమకారాన్ని తొలగించండి.
తర్వాత కొత్త ప్రపంచములో మీకు కొత్త శరీరము లభిస్తుంది.
చూడండి,
శ్రీకృష్ణుడిని శ్యామసుందరుడు అని అంటారు.
సత్యయుగములో వారు తెల్లగా ఉండేవారు,
ఇప్పుడు అంతిమ జన్మలో నల్లగా అయిపోయారు.
అందుకే అంటారు కదా - నల్లగా ఉన్నవారే సుందరముగా అవుతారు,
మళ్ళీ సుందరము నుండి నల్లగా అవుతారు అని. అందుకే శ్యామసుందరుడు అన్న పేరును పెట్టారు.
పంచ వికారాల రూపీ రావణుడు నల్లగా చేస్తాడు మరియు పరమపిత పరమాత్మ తెల్లగా చేస్తారు.
నేను పాత ప్రపంచాన్ని కాలదన్ని తెల్లగా అవుతున్నాను అన్నట్లుగా చిత్రములో కూడా చూపించారు.
తెల్లగా ఉన్న ఆత్మ స్వర్గాధిపతిగా అవుతుంది.
నల్లగా ఉన్న ఆత్మ నరకాధిపతిగా అవుతుంది.
ఆత్మయే తెల్లగా మరియు నల్లగా అవుతుంది.
ఇప్పుడు తండ్రి అంటారు,
మీరు పవిత్రముగా అవ్వాలి.
ఆ హఠయోగులు పవిత్రముగా అయ్యేందుకు ఎంతో హఠం చేస్తారు కానీ యోగం లేకుండానైతే పవిత్రముగా అవ్వలేరు లేకపోతే శిక్షలు అనుభవించి పవిత్రముగా అవ్వవలసి ఉంటుంది,
మరి అటువంటప్పుడు తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు.
మరియు
5 వికారాలను కూడా జయించాలి.
తండ్రి అంటారు,
ఈ కామ వికారమే ఆదిమధ్యాంతాలు దుఃఖమిచ్చేది.
ఎవరైతే వికారాలను జయించలేరో,
వారు వైకుంఠానికి రాజులుగా అవ్వగలరా,
అందుకే తండ్రి అంటారు,
చూడండి,
నేను మీకు తండ్రి,
శిక్షకుడు,
సద్గురువు రూపంలో ఎంత మంచి కర్మలను నేర్పిస్తాను.
యోగబలముతో వికర్మలను వినాశనం చేయించి వికర్మాజీత రాజులుగా తయారుచేస్తాను.
వాస్తవానికి సత్యయుగ దేవీ-దేవతలనే వికర్మాజీతులు అని అంటారు.
అక్కడ వికర్మలైతే జరగవు.
వికర్మాజీతుల కాలము మరియు వికర్మలు చేసేవారి కాలము వేర్వేరు.
రాజు విక్రముడు ఒకప్పుడు ఉండి వెళ్ళారు మరియు వికర్మాజీత రాజు కూడా ఒకప్పుడు ఉండి వెళ్ళారు.
మనం ఇప్పుడు వికర్మలపై విజయం పొందుతున్నాము.
తర్వాత ద్వాపరము నుండి కొత్తగా వికర్మలు ప్రారంభమవుతాయి.
కావున రాజా విక్రముడు అన్న పేరును పెట్టారు.
దేవతలు వికర్మాజీతులు.
ఇప్పుడు మనం ఆ విధంగా అవుతాము,
మళ్ళీ ఎప్పుడైతే వామ మార్గంలోకి వస్తామో అప్పుడు వికర్మల ఖాతా ప్రారంభమవుతుంది.
ఇక్కడ వికర్మల ఖాతాను సమాప్తం చేసుకుని మళ్ళీ మనము వికర్మాజీతులుగా అవుతాము.
అక్కడ వికర్మలేవీ జరగవు.
కావున పిల్లలకు ఈ నషా ఉండాలి
- ఇక్కడ మేము ఉన్నతవైున భాగ్యాన్ని తయారుచేసుకుంటాము అని. ఇది అన్నింటికన్నా గొప్ప భాగ్యాన్ని తయారుచేసుకునే పాఠశాల.
సత్సంగములో భాగ్యము తయారయ్యే విషయమే ఉండదు.
పాఠశాలలోనే ఎల్లప్పుడూ భాగ్యము తయారవుతుంది.
మనం నరుని నుండి నారాయణునిగా మరియు రాజులకే రాజులుగా అవుతామని మీకు తెలుసు.
తప్పకుండా పతిత రాజులు పావన రాజులను పూజిస్తారు.
నేను మిమ్మల్ని పావనంగా తయారుచేస్తాను.
పతిత ప్రపంచములో రాజ్యం చేయరు.
అచ్ఛా!
మధురాతి-మధురవైున సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
బుద్ధిలో స్వదర్శన చక్రపు జ్ఞానాన్ని ఉంచుకొని రాహు గ్రహణము నుండి ముక్తులవ్వాలి.
శ్రేష్ఠ కర్మలు మరియు యోగబలము ద్వారా వికర్మల ఖాతాను సమాప్తం చేసుకుని వికర్మాజీతులుగా అవ్వాలి.
2.
మీ ఉన్నతవైున భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు చదువుపై పూర్తి అటెన్షన్ ఉంచాలి.
వరదానము:-
బాహ్యముఖత రసాల
ఆకర్షణ యొక్క
బంధనాల నుండి
ముక్తులుగా ఉండే
జీవన్ముక్త భవ
బాహ్యముఖత అనగా వ్యక్తి యొక్క భావ-స్వభావాలు మరియు వ్యక్త భావం యొక్క వైబ్రేషన్లు,
సంకల్పాలు, మాటలు మరియు సంబంధ, సంపర్కాల ద్వారా ఒకరికొకరు వ్యర్థం వైపుకు ఆకర్షించేవారు, సదా ఏదో ఒక రకమైన వ్యర్థ చింతనలో ఉండేవారు, ఆంతరిక సుఖము, శాంతి మరియు శక్తుల నుండి దూరంగా ఉంటారు... ఈ బాహ్యముఖతా రసాలు కూడా బయట నుండి చాలా ఆకర్షిస్తాయి, అందుకే మొదట వాటిని కత్తిరించండి. ఈ రసాలే సూక్ష్మ బంధనాలుగా అయ్యి సఫలతా గమ్యం నుండి దూరం చేస్తాయి, ఎప్పుడైతే ఈ బంధనాల నుండి ముక్తులుగా అవుతారో, అప్పుడు జీవన్ముక్తులు అని అంటారు.
స్లోగన్:-
ఎవరైతే మంచి-చెడు
కర్మలు చేసేవారి
ప్రభావం యొక్క
బంధనము నుండి
ముక్తులై సాక్షీగా
మరియు దయాహృదయులుగా
ఉన్నారో, వారే
తపస్వీలు.
0 Comments