Header Ads Widget

Header Ads

TELUGU MURLI 16.01.23

 

16-01-2023  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 



Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - ఎంతెంతగా ఇతరులకు జ్ఞానం వినిపిస్తారో అంతగా మీ బుద్ధిలో జ్ఞానం రిఫైన్ అవుతూ ఉంటుంది, అందుకే సేవ తప్పకుండా చేయాలి’’

ప్రశ్న:-

తండ్రి వద్ద రెండు రకాల పిల్లలు ఎవరు ఉన్నారు, వారిరువురిలోనూ తేడా ఏమిటి?

జవాబు:-

తండ్రి వద్ద ఒకరేమో సవతి పిల్లలు, రెండవవారు సొంత పిల్లలు ఉన్నారు. సవతి పిల్లలు నోటి ద్వారా కేవలం బాబా మమ్మా అంటారు కానీ శ్రీమతముపై పూర్తిగా నడవలేరు. పూర్తి-పూర్తిగా బలిహారమవ్వరు. సొంత పిల్లలైతే తనువు, మనస్సు, ధనముతో పూర్తిగా సమర్పితము అనగా ట్రస్టీలుగా ఉంటారు. అడుగడుగునా శ్రీమతముపై నడుస్తారు. సవతి పిల్లలు సేవ చేయని కారణంగా నడుస్తూ-నడుస్తూ పడిపోతారు. సంశయం వచ్చేస్తుంది. సొంత పిల్లలు పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారు.

పాట:-  బాల్యపు రోజులను మరచిపోకూడదు... (బచ్పన్ కె దిన్ భులా దేనా...)

ఓంశాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. తండ్రి? వాస్తవానికి ఇరువురూ తండ్రులే. ఒకరు ఆత్మికమైనవారు, వారిని బాబా అని అంటారు, రెండవవారు దైహికమైనవారు, వారిని దాదా అని అంటారు. మేము బాప్ దాదాకు పిల్లలము అన్నది అన్ని సెంటర్లలోని పిల్లలకు తెలుసు. ఆత్మిక తండ్రి శివుడు. వారు ఆత్మలందరికీ తండ్రి మరియు దాదా అయిన బ్రహ్మా మొత్తం మనుష్య వంశానికి హెడ్. మీరు వచ్చి వారికి పిల్లలుగా అయ్యారు. అందులో కూడా కొందరైతే పక్కా సొంత పిల్లలు, కొందరు మళ్ళీ సవతి పిల్లలు కూడా ఉన్నారు. మమ్మా, బాబా అనైతే ఇరువురూ అంటారు కానీ సవతి పిల్లలు బలిహారమవ్వలేరు. బలిహారమవ్వలేనివారికి అంతటి శక్తి లభించదు అనగా తమ తండ్రిని తనువు, మనసు, ధనములకు ట్రస్టీగా చేయలేరు. శ్రేష్ఠముగా అయ్యేందుకు వారు శ్రీమతముపై నడవలేరు. సొంత పిల్లలకు సూక్ష్మంగా సహాయం లభిస్తుంది. కానీ వారు కూడా చాలా తక్కువమంది ఉన్నారు. సొంత పిల్లలు కూడా ఉన్నారు కానీ ఎప్పటి వరకైతే రిజల్టు వెలువడదో, అప్పటివరకు వారిని కూడా ఇప్పుడు పక్కా అని అనరు. ఇక్కడే ఉంటారు కూడా, చాలా మంచిగా ఉంటారు, సేవ కూడా చేస్తారు, అయినా కూడా పడిపోతారు. ఇది మొత్తం బుద్ధి యోగానికి సంబంధించిన విషయము. బాబాను మర్చిపోకూడదు. బాబా భారత్ ను పిల్లల సహాయంతో స్వర్గంగా తయారుచేస్తారు. శివశక్తి సైన్యము అని గాయనము కూడా చేయబడింది. ప్రతి ఒక్కరు స్వయంతో మాట్లాడుకోవాలి - తప్పకుండా మేము శివబాబా చేత దత్తత తీసుకోబడిన పిల్లలము, తండ్రి నుండి మేము స్వర్గ వారసత్వము పొందుతున్నాము. ద్వాపరము నుండి మొదలుకొని మనం లౌకిక తండ్రి వారసత్వమునైతే పొందామో, అది నరకానికి సంబంధించినదే పొందాము. దుఃఖితులుగా అవుతూ వచ్చాము. భక్తి మార్గంలో ఉన్నదే అంధ విశ్వాసము. ఎప్పటి నుండైతే భక్తి ప్రారంభమయ్యిందో, అప్పటి నుండి - సంవత్సరాలైతే గడిచాయో మనం కిందకు దిగుతూనే వచ్చాము. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉండేది. ఒక్కరి పూజనే చేసేవారు. దానికి బదులుగా ఇప్పుడు అనేకుల పూజను చేస్తూ వచ్చారు. భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడు విషయాలన్నీ ఋషులు, మునులు, సాధు సన్యాసులు మొదలైనవారికి తెలియవు. శాస్త్రాలలో కూడా బ్రహ్మా యొక్క పగలు మరియు బ్రహ్మా యొక్క రాత్రి అని ఉంది. బ్రహ్మా సరస్వతులే లక్ష్మీ-నారాయణులుగా అవుతారు కానీ బ్రహ్మా పేరును చూపించారు. బ్రహ్మాతోపాటు పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. లక్ష్మీ-నారాయణులకు పిల్లలైతే చాలామంది ఉండరు. ప్రజాపిత అని కూడా వారిని అనరు. ఇప్పుడు కొత్త ప్రజలు తయారవుతున్నారు. కొత్త ప్రజలు బ్రాహ్మణులకు చెందినవారే. బ్రాహ్మణులే స్వయాన్ని ఈశ్వరీయ సంతానంగా భావిస్తారు. దేవతలైతే ఇలా భావించరు. వారికి చక్రం గురించి తెలియనే తెలియదు.

ఇప్పుడు మీకు తెలుసు, మనం శివబాబాకు పిల్లలుగా అయ్యాము, వారే మనకు 84 జన్మల చక్రాన్ని అర్థం చేయించారు. వారి సహాయంతో మనం భారత్ ను మళ్ళీ దైవీ పావన రాజస్థాన్ గా తయారుచేస్తున్నాము. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము. ఎవరికైనా అర్థం చేయించడానికి కూడా ధైర్యం కావాలి. మీరు శివశక్తి పాండవ సైన్యము. పండాలు కూడా, అందరికీ మార్గం తెలియజేస్తారు. మీరు తప్ప ఎవ్వరూ ఆత్మిక మధురమైన ఇంటికి మార్గం తెలియజేయలేరు. పండాలైతే అమర్ నాథ్ కు, ఏదైనా తీర్థ యాత్రలకు తీసుకువెళ్తారు. బి.కె.లైన మీరైతే ఒక్కసారిగా అందరి నుండి దూరంగా పరంధామానికి తీసుకువెళ్తారు. దైహిక గైడ్ లు - ఎదురుదెబ్బలు తినిపించేవారు. మీరు అందరినీ తండ్రి వద్దకు శాంతిధామానికి తీసుకువెళ్తారు. కావున సదా ఇది గుర్తుంచుకోవలసి ఉంటుంది - మేము భారత్ ను మళ్ళీ దైవీ రాజస్థాన్ గా తయారుచేస్తున్నాము. దీనిని ఎవరైనా నమ్ముతారు. భారత్ యొక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది. భారత్ సత్యయుగంలో అనంతమైన దైవీ పావన రాజస్థాన్ గా ఉండేది, తర్వాత పావన క్షత్రియ రాజస్థాన్ గా అయ్యింది, తర్వాత మాయ ప్రవేశించడంతో ఆసురీ రాజస్థాన్ గా అవుతుంది. ఇక్కడ కూడా మొదట రాజు, రాణులు రాజ్యం చేసేవారు, కానీ ప్రకాశ కిరీటము లేకుండా రాజ్యం కొనసాగుతూ వస్తుంది. దైవీ రాజస్థాన్ తర్వాత ఆసురీ పతిత రాజస్థాన్ ఉంటుంది, ఇప్పుడైతే పతిత ప్రజల స్థానము, పంచాయతీ రాజస్థాన్. వాస్తవానికి దీనిని రాజస్థాన్ అని అనలేరు, కానీ పేరును పెట్టేసారు. రాజ్యమైతే లేదు. ఇది కూడా డ్రామా తయారుచేయబడి ఉంది. లక్ష్మీ-నారాయణుల చిత్రాలు మీకు చాలా ఉపయోగపడతాయి. వీటిపై అర్థం చేయించాలి, భారత్ విధంగా ద్వికిరీటధారిగా ఉండేది. లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది, బాల్యంలో రాధే-కృష్ణులుగా ఉండేవారు, తర్వాత త్రేతాలో రామరాజ్యంగా అయ్యింది, తర్వాత ద్వాపరములో మాయ వచ్చేసింది. ఇది పూర్తిగా సహజమైనది కదా. భారత్ యొక్క చరిత్ర-భౌగోళికాలను క్లుప్తముగా అర్థం చేయిస్తారు. ద్వాపరములోనే పావన రాజా-రాణులైన లక్ష్మీ-నారాయణుల మందిరాలు తయారయ్యాయి. దేవతలు స్వయం వామ మార్గంలోకి వెళ్ళిపోయారు. పతితులుగా అవ్వడము మొదలుపెట్టారు. తర్వాత పావన దేవతలు ఎవరైతే ఉండి వెళ్ళారో, వారి మందిరాలను నిర్మించి పూజను ప్రారంభించారు. పతితులే పావనులకు తల వంచి నమస్కరిస్తారు. ఎప్పటివరకైతే బ్రిటీష్ గవర్నమెంట్ యొక్క రాజ్యం ఉండేదో, అప్పటివరకు రాజా-రాణి ఉండేవారు. జమీందార్లు కూడా రాజా-రాణి యొక్క బిరుదును తీసుకునేవారు, దానితో వారికి దర్బారులో గౌరవం లభించేది. ఇప్పుడైతే రాజులు ఎవ్వరూ లేరు. చివర్లో ఎప్పుడైతే పరస్పరంలో పోట్లాడుకున్నారో అప్పుడు ముసల్మానులు మొదలైనవారు వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మళ్ళీ కలియుగం యొక్క అంతిమము వచ్చేసింది. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి మళ్ళీ రాజయోగం నేర్పిస్తున్నారు. ఎలా స్థాపన జరుగుతుంది అన్నదైతే మీకు తెలుసు, మళ్ళీ చరిత్ర-భౌగోళికాలు అంతమవుతాయి. మళ్ళీ భక్తిలో వారు తమ గీతను తయారుచేస్తారు, అందులో చాలా తేడా వస్తుంది. భక్తి కోసం వారికి దేవీ-దేవతా ధర్మం యొక్క పుస్తకం తప్పకుండా కావాలి. డ్రామానుసారంగా గీతను తయారుచేసారు. అలాగని భక్తి మార్గంలోని గీత ద్వారా ఎవరైనా రాజ్యం స్థాపిస్తారని కాదు లేక నరుడి నుండి నారాయణునిగా అవుతారని కాదు. మాత్రము కాదు.

మీరు గుప్తమైన సైన్యమని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. బాబా కూడా గుప్తము. మీకు కూడా గుప్తమైన యోగబలము ద్వారా రాజ్యం ప్రాప్తి చేయిస్తున్నారు. బాహుబలం ద్వారా హద్దు రాజ్యం లభిస్తుంది. యోగబలం ద్వారా అనంతమైన రాజ్యం లభిస్తుంది. పిల్లలైన మీకు హృదయంలో నిశ్చయం ఉంది - మేము ఇప్పుడు భారత్ ను అదే దైవీ రాజస్థాన్ గా చేస్తున్నాము. ఎవరైతే శ్రమ చేస్తారో, వారి శ్రమ దాగి ఉండలేదు. వినాశనమైతే జరగాల్సిందే. గీతలో కూడా విషయం ఉంది. సమయపు శ్రమ అనుసారంగా మాకు భవిష్యత్తులో ఏం పదవి లభిస్తుందని అడుగుతారు. ఇక్కడ కూడా ఎవరైనా శరీరం విడిచిపెడితే వీరు పదవిని పొందుతారు అన్న సంకల్పం నడుస్తుంది. వీరు విధంగా తనువు, మనసు, ధనముల ద్వారా సేవ చేసారు అన్నది కూడా తండ్రికే తెలుసు! దానిని పిల్లలు తెలుసుకోలేరు, బాప్ దాదాకు తెలుసు. రకమైన సేవను మీరు చేసారని చెప్పడం కూడా జరగగలదు. జ్ఞానం తీసుకున్నా లేక తీసుకోకపోయినా కానీ సహాయమైతే చాలా చేసారు. ఎలాగైతే మనుష్యులు దానం చేసినప్పుడు - సంస్థ చాలా బాగుంది, మంచి కార్యము చేస్తుంది కానీ నాలో పావనంగా ఉండే శక్తి లేదు, నేను యజ్ఞానికి సహాయం చేస్తానని భావిస్తారు. కావున దానికి కూడా రిటర్న్ వారికి లభిస్తుంది. ఎలాగైతే మనుష్యులు ఇతరుల కోసము కాలేజీలు నిర్మిస్తారు, హాస్పిటళ్ళు నిర్మిస్తారు. నేను ఆనారోగ్యం పాలైతే హాస్పిటల్ కు వెళ్తాను అని అనరు. ఏవైతే నిర్మిస్తారో అవి ఇతరుల కోసము. కావున దాని ఫలము కూడా లభిస్తుంది, దానిని దానము అని అంటారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది. మీరు ఇహ, పరలోకాలలో సంతోషంగా ఉండాలి, సుఖీగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు. లోకము మరియు పరలోకము, ఇదైతే సంగమయుగానికి సంబంధించిన విషయము. మృత్యులోకం యొక్క జన్మ మరియు అమరలోకము యొక్క జన్మ, రెండూ సఫలమవ్వాలి. తప్పకుండా ఇప్పుడు మీ జన్మ సఫలమవుతుంది, మళ్ళీ కొందరు తనువు ద్వారా, కొందరు మనసు ద్వారా, కొందరు ధనం ద్వారా సేవ చేస్తారు. జ్ఞానం తీసుకోలేనివారు చాలామంది ఉంటారు. వారంటారు, బాబా, మాలో ధైర్యము లేదు కానీ సహాయం చేయగలము. అప్పుడు తండ్రి అంటారు, మీరు ఇంతటి ధనవంతులుగా అవ్వగలరు. ఏదైనా విషయం ఉంటే అడగవచ్చు. ఫాలో ఫాదర్ చేయాలి కావున పరిస్థితిలో మేం ఏం చేయాలి అని అడగడము కూడా వారినే అడగాలి. శ్రీమతాన్ని ఇచ్చే తండ్రి కూర్చున్నారు. వారిని అడగాలి, దాచిపెట్టకూడదు. లేదంటే వ్యాధి పెరిగిపోతుంది. అడుగడుగునా శ్రీమతంపై నడవకపోతే విఘ్నాలు కలుగుతాయి. బాబా దూరంగా ఏమైనా ఉన్నారా. సమ్ముఖంలోకి వచ్చి అడగాలి. ఇటువంటి బాప్ దాదా వద్దకు ఘడియ-ఘడియ రావాలి. వాస్తవానికి ఇటువంటి అతి ప్రియమైన తండ్రితో కలిసే ఉండాలి. ప్రియుడిని అంటిపెట్టుకుని ఉండాలి, వారు దైహికమైనవారు, వీరు ఆత్మికమైనవారు. ఇందులో అంటిపెట్టుకుని ఉండే విషయం లేదు, ఇక్కడ అందరినీ కూర్చోబెట్టరు. ఇది ఎటువంటి విషయమంటే, కేవలం ఎదురుగా కూర్చునే ఉండాలి, వింటూనే ఉండాలి, వారి మతముపై నడుస్తూనే ఉండాలి. కానీ బాబా అంటారు - ఇక్కడ కూర్చుండిపోకూడదు. గంగా నదిగా అవ్వండి, సేవకు వెళ్ళండి. పిల్లల ప్రేమ ఎలా ఉండాలంటే - మస్తానా వలె (ప్రేమలో లీనమైనవారి వలె) ఉండాలి. కానీ మళ్ళీ సేవను కూడా చేయాలి. నిశ్చయబుద్ధి కలవారైతే పూర్తిగా అంటిపెట్టుకుని ఉంటారు. ఫలానావారు చాలా మంచి నిశ్చయబుద్ధి కలవారు అని పిల్లలు రాస్తారు, కానీ వారేమీ అర్థం చేసుకోలేదని నేను రాస్తాను. ఒకవేళ నిశ్చయబుద్ధి కలవారు అయినట్లయితే స్వర్గానికి యజమానులుగా తయారుచేసే తండ్రి వచ్చారు అన్నప్పుడు కలవకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. తపించే కుమార్తెలు చాలామందే ఉన్నారు. తర్వాత వారికి ఇంట్లో కూర్చుని ఉండగానే బ్రహ్మా మరియు కృష్ణుని సాక్షాత్కారము కలుగుతుంది. తండ్రి పరంధామం నుండి మనకు రాజధానిని ఇవ్వడానికి వచ్చారు అన్న నిశ్చయం ఉన్నట్లయితే మరి వచ్చి బాబాను కలవాలి. ఇలాంటివారు కూడా వస్తారు, అప్పుడు జ్ఞాన గంగలుగా అవ్వండి అని అర్థం చేయించడము జరుగుతుంది. ప్రజలైతే చాలామంది కావాలి. రాజధాని స్థాపించబడుతుంది. చిత్రాలు అర్థం చేయించేందుకు చాలా బాగున్నాయి. మీరు ఎవరికైనా చెప్పవచ్చు, మేము మళ్ళీ రాజధానిని స్థాపన చేస్తున్నాము. వినాశనం కూడా ఎదురుగా నిలబడి ఉంది. మరణించేందుకు ముందే తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. ఒక్క ఆల్మైటీ గవర్నమెంట్ ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇప్పుడు అందరూ కలిసి ఒక్కటిగా ఏమైనా అవ్వగలరా. ఒకే రాజ్యం తప్పకుండా ఉండేది, దానికి గాయనం కూడా ఉంది. సత్యయుగం పేరు చాలా ప్రసిద్ధమైనది. మళ్ళీ దాని స్థాపన జరుగుతోంది. కొందరు విషయాలను వెంటనే అంగీకరిస్తారు, కొందరు అంగీకరించరు. 5,000 సంవత్సరాల క్రితం లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది, మళ్ళీ రాజుల రాజ్యం వచ్చేసింది. రాజులు కూడా ఇప్పుడు పతితులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పావన లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉంటుంది. మీకైతే అర్థం చేయించడము చాలా సహజము. శివబాబా యొక్క శ్రీమతముతో మరియు వారి సహాయంతో మేము దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నాము. శివబాబా నుండి శక్తి కూడా లభిస్తుంది. నషా ఉండాలి. మీరు యోధులు. స్వర్గ స్థాపన తప్పకుండా రచయిత ద్వారానే జరుగుతుంది కదా అని మందిరాలలో కూడా మీరు వెళ్ళి అర్థం చేయించవచ్చు. అనంతమైన తండ్రి ఒక్కరేనని మీకు తెలుసు. మీ సమ్ముఖంలో మీకు జ్ఞాన అలంకరణ చేస్తున్నారు, రాజయోగం నేర్పిస్తున్నారు. గీతను వినిపించేవారు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో నషా ఎక్కించడము జరుగుతుంది. స్వర్గ స్థాపన చేయడానికి బాబా వచ్చారు. స్వర్గంలో ఉన్నదే పావన రాజస్థాన్. మనుష్యులైతే లక్ష్మీ-నారాయణుల రాజ్యాన్నే మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి సమ్ముఖములో కూర్చుని అర్థం చేయిస్తారు, మీరు గీతా పాఠశాల మొదలైనవాటిలోకైనా వెళ్ళండి. మొత్తం చరిత్ర, భౌగోళికాలను లేక 84 జన్మల సమాచారాన్ని ఎవ్వరూ వినిపించలేరు. లక్ష్మీ-నారాయణుల చిత్రముతోపాటు రాధే-కృష్ణులది కూడా ఉన్నట్లయితే అర్థం చేయించడము సహజమవుతుంది. ఇది సరైన చిత్రము. దాని గురించి వివరణ కూడా బాగుండాలి. మీ బుద్ధిలో మొత్తం చక్రము గుర్తుంది. దానితోపాటు చక్రాన్ని అర్థం చేయించేవారు కూడా గుర్తున్నారు. ఇకపోతే, నిరంతర స్మృతి యొక్క అభ్యాసములో శ్రమ చాలా ఉంది. నిరంతర స్మృతి ఎంత పక్కాగా ఉండాలంటే, అంతిమంలో పనికిరాని చెత్త ఏదీ గుర్తుకు రాకూడదు. తండ్రిని ఎప్పుడూ మర్చిపోకూడదు. చిన్న పిల్లలు తండ్రిని చాలా గుర్తు చేస్తారు, తర్వాత కొడుకు పెద్దవాడైతే ధనాన్ని గుర్తు చేస్తాడు. మీకు కూడా ధనం లభిస్తుంది. మంచి రీతిలో ధారణ చేసి మళ్ళీ దానం చేయాలి. పూర్తి మహాదానిగా అవ్వాలి. నేను సమ్ముఖంలో వచ్చి రాజయోగం నేర్పిస్తాను. గీతనైతే జన్మ-జన్మాంతరాలుగా చదివారు, ఏమీ ప్రాప్తించలేదు. ఇక్కడైతే మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా తయారుచేయడానికి శిక్షణ ఇస్తున్నాను. అది భక్తి మార్గము. ఇక్కడ కూడా మీ దైవీ వంశానికి చెందినవారు కోట్లలో ఒక్కరో వెలువడుతారు. మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యేందుకు తప్పకుండా వస్తారు, తర్వాత రాజా-రాణిగా అయినా అవ్వవచ్చు, ప్రజలుగా అయినా అవ్వవచ్చు. అందులో కూడా కొందరైతే వింటారు, కథాగానం చేస్తారు, పారిపోతారు. ఎవరైతే పిల్లలుగా అయి మళ్ళీ పారిపోతారో, వారిపై చాలా పెద్ద దండన పడుతుంది. కఠిన శిక్షలు ఉంటాయి. సమయంలో, మేము నిరంతరము స్మృతి చేస్తాము అని ఎవ్వరూ అనలేరు. ఒకవేళ ఎవరైనా అంటే చార్టు రాసి పంపిస్తే బాబా అంతా అర్థం చేసుకుంటారు. భారత్ యొక్క సేవలోనే తనువు, మనసు, ధనమును వినియోగిస్తున్నారు. లక్ష్మీ-నారాయణుల చిత్రము ఎల్లప్పుడూ జేబులో ఉండాలి. పిల్లలకు చాలా నషా ఉండాలి.

సమాజ సేవకులు మిమ్మల్ని అడుగుతారు, మీరు భారత్ కు ఏం సేవ చేస్తున్నారు? చెప్పండి, మేము మా తనువు, మనస్సు, ధనముతో భారత్ ను దైవీ రాజస్థాన్ గా తయారుచేస్తున్నాము, ఇటువంటి సేవను ఇంకెవ్వరూ చేయలేరు. మీరు ఎంతగా సేవ చేస్తారో, అంతగా బుద్ధి రిఫైన్ అవుతూ ఉంటుంది. సరైన రీతిలో అర్థం చేయించలేని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు, అప్పుడు పేరు అప్రతిష్టపాలు అవుతుంది. కొందరిలో క్రోధమనే భూతము కూడా ఉంది, మరి ఇది కూడా వినాశకారి పని చేసినట్లు కదా. వారితో అంటారు, మీరు మీ ముఖాన్ని చూసుకోండి, మీరు లక్ష్మిని లేక నారాయణుడిని వరించేందుకు యోగ్యులుగా అయ్యారా? ఇలా పరువును పోగొట్టే పిల్లలు ఉన్నారు, వారు ఏం పదవిని పొందుతారు. వారు పాదచారుల లైన్ లోకి వచ్చేస్తారు. మీరు కూడా సైన్యము కదా. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అవినాశీ జ్ఞాన రత్నాల మహాదానిగా అవ్వాలి. తనువు-మనస్సు-ధనముతో భారత్ ను స్వర్గంగా తయారుచేసే సేవను చేయాలి.

2. ఎటువంటి వినాశకారి కార్యాన్ని చేయకూడదు. నిరంతర స్మృతి యొక్క అభ్యాసంలో ఉండాలి.

వరదానము:-

ఏకరస మరియు నిరంతర సంతోషం యొక్క అనుభూతి ద్వారా నంబరువన్ తీసుకునే తరగని ఖజానాలతో సంపన్న భవ


నంబరువన్ లోకి వచ్చేందుకు ఏకరస మరియు నిరంతర సంతోషం యొక్క అనుభూతి చేస్తూ ఉండండి, ఎటువంటి జంజాటాలలోకి వెళ్ళకండి. జంజాటాలలోకి వెళ్ళడముతో సంతోషమనే ఊయల ఢీలా అయిపోతుంది, ఇక వేగంగా ఊగలేరు, అందుకే సదా మరియు ఏకరస సంతోషం అనే ఊయలలో ఊగుతూ ఉండండి. బాప్ దాదా ద్వారా పిల్లలందరికీ అవినాశీ, తరగని మరియు అనంతమైన ఖజానా లభిస్తుంది. కనుక సదా ఖజానాల ప్రాప్తిలో ఏకరసంగా మరియు సంపన్నంగా ఉండండి. సంగమయుగం యొక్క విశేషత అనుభవము, యుగానికి ఉన్న విశేషత యొక్క లాభాన్ని తీసుకోండి.

స్లోగన్:-

మనసా మహాదానిగా అవ్వాలంటే ఆత్మిక స్థితిలో సదా స్థితులై ఉండండి.

 Download PDF

 

Post a Comment

0 Comments