14-01-2023
ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- ఇప్పుడు మీ శరీరము పూర్తిగా పాతదిగా
అయిపోయింది, తండ్రి
మీ శరీరాన్ని
కల్పవృక్ష సమానంగా
తయారుచేయడానికి వచ్చారు,
మీరు అర్ధకల్పము కోసం అమరులుగా
అవుతారు’’
ప్రశ్న:-
ఈ అద్భుతమైన నాటకంలో ఏ విషయము చాలా అర్థం చేసుకోవలసినది?
జవాబు:-
ఈ నాటకంలో యాక్టర్లు (పాత్రధారులు) ఎవరైతే ఉన్నారో, వారి చిత్రాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే చూడగలరు, మళ్ళీ అదే చిత్రాన్ని 5,000 సంవత్సరాల తర్వాత చూస్తారు. 84 జన్మలకు 84 చిత్రాలు తయారవుతాయి మరియు అన్నీ రకరకాలుగా ఉంటాయి. కర్మలు కూడా ఎవరితోనూ కలవవు. ఎవరు ఏ కర్మలు చేసారో, వారు మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత అవే కర్మలు చేస్తారు, ఇవి చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. పిల్లలైన మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంది. మీరు ఈ రహస్యాన్ని అందరికీ అర్థం చేయించవచ్చు.
పాట:- భోళానాథునికన్నా అతీతమైనవారు లేరు... (భోలేనాథ్ సే నిరాలా...)
ఓంశాంతి. భోళానాథుడు అని సదా శివబాబానే అంటారు.
శంకరుడిని అనరు. వారైతే వినాశనం చేస్తారు మరియు శివబాబా స్థాపన చేస్తారు. ఇదైతే తప్పకుండా జరుగుతుంది, స్థాపన స్వర్గానిది మరియు వినాశనం నరకానిది చేస్తారు.
కావున జ్ఞాన సాగరుడు అని భోళానాథుడైన శివుడిని మాత్రమే అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరైతే అనుభవజ్ఞులు. తప్పకుండా కల్పక్రితము కూడా శివబాబా వచ్చి ఉంటారు మరియు ఇప్పుడు తప్పకుండా వచ్చారు.
వారు తప్పకుండా రావలసి ఉంటుంది ఎందుకంటే కొత్త మనుష్య సృష్టిని రచించాలి. ఈ డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలియజేయాలి,
అందుకే వారు తప్పకుండా ఇక్కడకు రావాలి.
సూక్ష్మవతనంలోనైతే చెప్పరు. సూక్ష్మవతనపు భాష వేరు,
మూలవతనంలోనైతే భాష ఉండదు. ఇక్కడ టాకీ ఉంటుంది. శివబాబాయే పాడైనదానిని బాగు చేసేవారు. ఎప్పుడైతే సృష్టి తమోప్రధానంగా అవుతుందో, అప్పుడు అందరికీ సద్గతినిచ్చే భగవంతుడు,
నేను రావలసి ఉంటుందని అంటారు. స్మృతిచిహ్నాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ నాటకంలో మనుష్యుల చిత్రాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఒక్కసారి మాత్రమే చూడగలరు.
లక్ష్మీ-నారాయణుల చిత్రాలు
(ముఖాలు) సత్యయుగంలో కాకుండా ఎక్కడైనా ఎప్పుడైనా చూడగలరని కాదు. వారు పునర్జన్మలు తీసుకుంటే నామ రూపాలు వేరుగా ఉంటాయి.
అదే లక్ష్మీ-నారాయణుల రూపాన్ని ఒకసారి చూసాక మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాతనే చూస్తారు.
ఎలాగైతే గాంధీ యొక్క అదే చిత్రాన్ని మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత చూస్తారు.
మనుష్యులు ఎంతోమంది ఉన్నారు,
మనుష్యుల చిత్రాలను ఏవైతే ఇప్పుడు చూసారో, వాటిని మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత చూస్తారు.
84 జన్మల కోసం 84 చిత్రాలు తయారవుతాయి. మరియు అన్నీ భిన్న-భిన్నముగా ఉంటాయి. కర్మలు కూడా ఒకరివి ఒకరితో కలవవు. ఎవరు ఏ కర్మలనైతే చేసారో, అవే కర్మలను 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ చేస్తారు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. బాబా చిత్రము కూడా ఉంది. తప్పకుండా మొట్టమొదట సృష్టిని రచించేందుకు వారు వచ్చి ఉంటారని మనం అర్థం చేసుకుంటాము. మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంది, కావుననే మీరు అర్థం చేసుకుంటారు. మీరు మళ్ళీ ఇతరులది కూడా ఈ విధంగా తాళం తెరవాలి.
నిరాకారుడైన తండ్రి తప్పకుండా పరంధామంలోనే ఉండి ఉంటారు. ఎలాగైతే మీరందరూ కూడా నాతోనే ఉంటారు. మొదట నేను ఎప్పుడైతే వస్తానో,
అప్పుడు నాతోపాటు బ్రహ్మా,
విష్ణు, శంకరులు ఉంటారు.
మనుష్య సృష్టి అయితే ముందు నుండే ఉంది, అది మళ్ళీ ఎలా పరివర్తన చెందుతుంది, ఎలా రిపీట్ అవుతుంది. మొట్టమొదట తప్పకుండా సూక్ష్మవతనమును రచించవలసి ఉంటుంది, ఆ తర్వాత స్థూలవతనంలోకి రావలసి ఉంటుంది ఎందుకంటే మనుష్యులు,
ఎవరైతే దేవతలుగా ఉండేవారో,
వారు ఇప్పుడు శూద్రులుగా అయ్యారు. వారిని మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారుచేయవలసి ఉంటుంది.
కావున కల్పక్రితము నేను ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చానో దానిని మళ్ళీ రిపీట్ చేస్తాను.
ఈ సమయంలో కూర్చొని రాజయోగం నేర్పిస్తాను.
మళ్ళీ అర్ధకల్పం తర్వాత భక్తి ఆరంభమవుతుంది. తండ్రి స్వయంగా కూర్చుని, పాత సృష్టి మళ్ళీ కొత్తగా ఎలా అవుతుంది, అంతిమం నుండి మళ్ళీ ఆది ఎలా అవుతుంది అన్నది అర్థం చేయిస్తారు. పరమాత్మ వచ్చారని మనుష్యులు భావిస్తారు కానీ ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, ఆది మధ్యాంతాల రహస్యం ఎలా తెరిచారు, ఇవి తెలియవు.
తండ్రి అంటారు, అందరికీ సద్గతిని ఇచ్చేందుకు మళ్ళీ నేను సమ్ముఖంలో వచ్చాను. మాయా రావణుడు అందరి అదృష్టాన్ని పాడు చేసాడు, కావున పాడైనదానిని బాగు చేసేవారు తప్పకుండా ఎవరో ఒకరు కావాలి.
5,000 సంవత్సరాల క్రితం కూడా బ్రహ్మా తనువులోకి వచ్చానని తండ్రి అంటారు. మనుష్య సృష్టిని తప్పకుండా ఇక్కడే రచించారు. ఇక్కడకు వచ్చి సృష్టిని పరివర్తన చేసి శరీరాన్ని కల్పవృక్ష సమానంగా తయారుచేస్తారు. ఇప్పుడు మీ శరీరం పూర్తిగా పాతదిగా అయిపోయింది, దీనిని మళ్ళీ తండ్రి ఎలా తయారుచేస్తారంటే అర్ధకల్పం వరకు మీరు అమరులుగా అయిపోతారు. శరీరాలు మారుస్తారు కానీ సంతోషంగా మారుస్తారు. ఎలాగైతే పాత వస్త్రాన్ని విడిచి కొత్తదానిని తీసుకుంటారు. అక్కడ ఈ విధంగా, ఫలానావారు మరణించారు అని అనరు, దానిని మరణించడము అని అనరు.
ఎలాగైతే మీది ఇక్కడ జీవిస్తూ మరణించడము ఉంటుంది, అంటే మీరు ఏమైనా మరణించారా. మీరైతే శివబాబాకు చెందినవారిగా అయ్యారు. బాబా అంటారు, మీరు నా ప్రకాశ రత్నాలు,
చాలాకాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన ప్రియమైన పిల్లలు. శివబాబా కూడా అంటారు, అలాగే బ్రహ్మా బాబా కూడా అంటారు. వారు నిరాకారీ తండ్రి, వీరు సాకారీ తండ్రి. ఇప్పుడు మీరంటారు, బాబా, మీరు కూడా ఆ తండ్రే కదా.
మేము కూడా ఆ పిల్లలమే,
మళ్ళీ వచ్చి కలుసుకున్నాము. తండ్రి అంటారు,
నేను వచ్చి స్వర్గ స్థాపన చేస్తాను.
రాజ్యమైతే తప్పకుండా కావాలి,
అందుకే రాజయోగం నేర్పిస్తాను.
అంతిమంలోనైతే మీకు రాజ్యం లభిస్తుంది, తర్వాత ఈ జ్ఞానం అక్కడ అవసరం ఉండదు. మళ్ళీ ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తిలో ఉపయోగపడతాయి, వాటిని చదువుతూ ఉంటారు. ఏ విధముగా ఎవరైనా గొప్ప వ్యక్తి చరిత్ర-భౌగోళికాలను రాసి వెళ్తే,
తర్వాత వాటిని చదువుతూ ఉంటారు. లెక్కలేనన్ని పుస్తకాలు ఉన్నాయి. మనుష్యులు చదువుతూనే ఉంటారు. స్వర్గంలోనైతే ఏమీ ఉండవు. అక్కడైతే భాష ఒక్కటే ఉంటుంది. కావున బాబా అంటారు,
ఇప్పుడు నేను సృష్టిని కొత్తగా తయారుచేసేందుకు వచ్చాను. మొదట కొత్తగా ఉండేది, ఇప్పుడు పాతదిగా అయ్యింది. నా పుత్రులందరినీ (పిల్లలందరినీ) మాయ కాల్చి బూడిద చేసేసింది. సాగరుని పిల్లలు...
అని వారు చూపిస్తారు. జ్ఞాన సాగరుడైతే తప్పకుండా ఉన్నారు,
వారికి మీరు పిల్లలు. వాస్తవానికైతే అందరూ పిల్లలే, కానీ పిల్లలైన మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా గాయనం చేయబడతారు. మీ కారణంగానే తండ్రి వస్తారు.
పిల్లలైన మిమ్మల్ని మళ్ళీ మేల్కొల్పేందుకు నేను వచ్చానని వారు అంటారు. ఎవరైతే పూర్తిగా నల్లగా, రాతిబుద్ధి కలవారిగా అయ్యారో, వారిని వచ్చి మళ్ళీ పారసబుద్ధి కలవారిగా చేస్తాను. ఈ జ్ఞానముతో మనం పారసబుద్ధి కలవారిగా ఎలా అవుతామో మీకు తెలుసు. ఎప్పుడైతే మీరు పారసబుద్ధి కలవారిగా అవుతారో,
అప్పుడు ఈ ప్రపంచం కూడా రాతిపురి నుండి మారి పారసపురిగా అవుతుంది,
దీని కోసం బాబా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. కావున బాబా తప్పకుండా మనుష్య సృష్టిని రచించేందుకు ఇక్కడికే రావలసి ఉంటుంది కదా. ఎవరి తనువులోకైతే వస్తారో, వారి ద్వారా ముఖ వంశావళిని తయారుచేస్తారు. కావున వీరు తల్లి అయ్యారు. ఎంత గుహ్యమైన విషయము. వీరు పురుషుడు, వీరిలోకి బాబా వస్తారు కావున వీరు తల్లి ఎలా అయ్యారు అన్నదానిలో తప్పకుండా తికమకపడతారు.
మీరు నిరూపించి చెప్తారు,
తల్లిదండ్రులైన ఈ బ్రహ్మా, సరస్వతులు ఇరువురూ కల్పవృక్షం క్రింద కూర్చున్నారు,
రాజయోగం నేర్చుకుంటున్నారు, మరి తప్పకుండా వారికి గురువు కావాలి. బ్రహ్మా సరస్వతులను మరియు పిల్లలందరినీ రాజఋషులు అని అంటారు.
రాజ్యం కోసం యోగం జోడిస్తారు. తండ్రి వచ్చి రాజయోగాన్ని మరియు జ్ఞానాన్ని నేర్పిస్తారు, దీనిని ఇంకెవ్వరూ నేర్పించలేరు. ఇంకెవరిదీ రాజయోగము కాదు. వారైతే, యోగము నేర్చుకోండి అని కేవలం అంటారు. హఠయోగాలైతే అనేక రకాలుగా ఉంటాయి. రాజయోగము ఎవ్వరూ కూడా నేర్పించలేరు.
భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పించారు. ఎప్పుడైతే కొత్త మనుష్య సృష్టిని రచించవలసి ఉంటుందో, అప్పుడు మేము కల్ప కల్పము మళ్ళీ రావలసి ఉంటుందని అంటారు.
ప్రళయమైతే జరగదు. ఒకవేళ ప్రళయం జరిగినట్లయితే మరి మేము ఎవరిలోకి రావాలి? నిరాకారుడు వచ్చి ఏం చేస్తారు? తండ్రి అర్థం చేయిస్తారు, సృష్టి అయితే ముందు నుండే ఉంది, భక్తులు కూడా ఉన్నారు, భగవంతుడిని పిలుస్తూ ఉంటారు కూడా, దీనితో భక్తులు ఉన్నారని నిరూపించబడుతుంది. ఎప్పుడైతే భక్తులు చాలా దుఃఖితులుగా ఉంటారో, అప్పుడు భగవంతుడు రావలసే ఉంటుంది, ఇది కలియుగం యొక్క అంతిమము. రావణ రాజ్యం సమాప్తమవ్వనున్నది, అప్పుడే నేను రావలసి ఉంటుంది. తప్పకుండా ఈ సమయంలో అందరూ దుఃఖితులుగా ఉన్నారు. మహా భారీ యుద్ధము ఎదురుగా నిలబడి ఉంది.
ఇది పాఠశాల. ఇక్కడ లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది.
మీకు తెలుసు,
సత్యయుగంలో లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, తర్వాత ఏక కిరీటధారుల రాజ్యము వచ్చింది,
ఆ తర్వాత వేరే-వేరే ధర్మాలు వృద్ధి చెందాయి,
మళ్ళీ రాజ్యము మొదలైనవాటిని పెంచేందుకు యుద్ధాలు మొదలైనవి జరిగాయి. మీకు తెలుసు, ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది.
మళ్ళీ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఆరంభమవుతుంది. బాబా ప్రపంచ చరిత్ర-భౌగోళికాల రహస్యాన్ని పూర్తిగా అర్థం చేయిస్తారు. విస్తారంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు, మనం సూర్యవంశీయులము కావున తప్పకుండా పునర్జన్మలు కూడా సూర్యవంశములోనే తీసుకొని ఉండవచ్చు.
నామ రూపాలైతే మారిపోతూ ఉంటాయి. తల్లిదండ్రులు కూడా వేరేవారు లభిస్తారు,
ఈ డ్రామా అంతా బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి ఏ విధంగా వస్తారు అన్నది కూడా అర్థం చేసుకున్నారు. మనుష్యుల బుద్ధిలో అదే గీతా జ్ఞానం ఉంది. ఇంతకుముందు మన బుద్ధిలో కూడా అదే పాత గీతా జ్ఞానం ఉండేది.
ఇప్పుడు తండ్రి గుహ్యమైన విషయాలను వినిపిస్తారు, వాటిని వింటూ-వింటూ రహస్యాలన్నింటినీ అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు మీ జ్ఞానం వేరుగా ఉండేదని,
ఇప్పుడు చాలా బాగుందని మనుష్యులు కూడా అంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా ఎలా అవ్వాలి అన్నది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇది అందరి అంతిమ జన్మ. మరణించడమైతే అందరూ మరణించాలి. స్వయంగా అనంతమైన తండ్రి అంటారు, మీరు పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞ చేసినట్లయితే 21 జన్మల కోసం స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇక్కడైతే ఎవరైనా పదమపతులుగా ఉన్నా కూడా దుఃఖితులుగానే ఉన్నారు. శరీరం కల్పవృక్ష సమానంగా ఉండదు.
మీ శరీరం కల్పవృక్ష సమానంగా అవుతుంది.
మీరు 21 జన్మలు మరణించరు. తండ్రి అంటారు,
సూర్యవంశీ, చంద్రవంశీయులు ఎవరైతే కామ చితిపై కూర్చొని నల్లగా అయ్యారో,
వారే ఇక్కడకు వస్తారు, అందుకే రాధే-కృష్ణులను, శ్రీనారాయణుడిని అందరినీ నల్లగా చూపిస్తారు. ఇప్పుడైతే అందరూ నల్లగా ఉన్నారు.
కామ చితిపై కూర్చోవడం వలన నల్లగా అయ్యారు. ఇప్పుడు మీరు కామ చితి నుండి దిగి జ్ఞాన చితిపై కూర్చోవాలి. విషం యొక్క కంకణాన్ని క్యాన్సల్ చేసి జ్ఞానామృతపు కంకణాన్ని కట్టుకోవాలి. ఎలా అర్థం చేయించాలంటే, దానితో వారు, మీరైతే శుభ కార్యము చేస్తున్నారు అని అనాలి. ఎప్పటివరకైతే కుమారులు,
కుమారీలుగా ఉంటారో అప్పటివరకు వారిని మురికిపట్టినవారు అని అనరు. తండ్రి అంటారు, మీరు ఎప్పుడూ అశుద్ధంగా అవ్వకూడదు.
మున్ముందు చాలామంది వస్తారు,
ఇది చాలా బాగుందని అంటారు - జ్ఞాన చితిపై కూర్చోవడము వలన అయితే మనం స్వర్గానికి యజమానులుగా అవుతాము.
తరచుగా బ్రాహ్మణులే నిశ్చితార్థం చేయిస్తారు. రాజుల వద్ద కూడా బ్రాహ్మణులు ఉంటారు, వారిని రాజ గురువులు అని అంటారు.
ఈ రోజుల్లోనైతే సన్యాసులు కూడా కంకణం కడతారు. ఎప్పుడైతే మీరు ఈ జ్ఞానం యొక్క విషయాలను వినిపిస్తారో, అప్పుడు మనుష్యులు చాలా సంతోషిస్తారు. వెంటనే రాఖీ కూడా కట్టించుకుంటారు. అప్పుడు ఇంట్లో గొడవ కూడా జరుగుతుంది.
కొంచెం సహనమైతే తప్పకుండా చేయవలసి ఉంటుంది.
మీరు గుప్త శివ శక్తి సైన్యము. మీ వద్ద ఆయుధాలేవీ లేవు,
దేవీలకు చాలా ఆయుధాలను చూపిస్తారు. ఇవన్నీ జ్ఞానం యొక్క విషయాలు. ఇక్కడ ఉన్నవే యోగబలానికి సంబంధించిన విషయాలు. మీరు యోగబలంతో విశ్వ రాజ్యం తీసుకుంటారు. బాహుబలంతో హద్దు రాజ్యము లభిస్తుంది.
అనంతమైన రాజ్యాన్ని అయితే అనంతమైన యజమానియే ఇస్తారు.
యుద్ధం విషయమేమీ లేదు.
తండ్రి అంటారు, నేను ఎలా యుద్ధం చేయిస్తాను. నేనైతే యుద్ధాలను,
పోట్లాటలను అంతం చేసేందుకే వచ్చాను, తర్వాత వీటి నామ-రూపాలు కూడా ఉండవు, అందుకే పరమాత్మను అందరూ స్మృతి చేస్తారు.
నా గౌరవం నిలబెట్టండి అని అంటారు, అయినా ఒక్కరిపై నిశ్చయం లేకపోతే ఇతరులను పట్టుకుంటూ ఉంటారు.
మాలో కూడా ఈశ్వరుడు ఉన్నారని అంటారు,
అయినా స్వయముపై కూడా విశ్వాసము ఉంచరు, గురువులను ఆశ్రయిస్తారు. మీలో భగవంతుడు ఉన్నప్పుడు మరి గురువులను ఎందుకు ఆశ్రయిస్తారు.
ఇక్కడైతే విషయమే అతీతమైనది.
తండ్రి అంటారు, ఇప్పుడు ఎలా వచ్చానో కల్పక్రితము కూడా నేను ఇలాగే వచ్చాను. రచయిత అయిన తండ్రి ఏ విధంగా కూర్చుని రచిస్తారు అన్నది ఇప్పుడు మీకు తెలుసు, ఇది కూడా డ్రామా. ఎప్పటివరకైతే ఈ చక్రాన్ని తెలుసుకోరో, అప్పటివరకు మున్ముందు ఏం జరగనున్నదో ఎలా తెలుస్తుంది.
ఇది కర్మక్షేత్రము అని అంటారు. మనం నిరాకారీ ప్రపంచం నుండి పాత్రను అభినయించేందుకు వచ్చాము.
కావున మీకు మొత్తం డ్రామా యొక్క రచయిత, డైరెక్టర్ గురించి తెలిసి ఉండాలి. పాత్రధారులైన మనమందరము తెలుసుకున్నాము - ఈ డ్రామా ఎలా తయారుచేయబడింది, ఈ సృష్టి ఎలా వృద్ధి చెందుతుంది, ఇప్పుడు కలియుగాంతము కావున తప్పకుండా సత్యయుగ స్థాపన జరగాలి. ఈ చక్రము యొక్క వివరణ పూర్తిగా సరైనది,
బ్రాహ్మణ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారు అర్థం చేసుకుంటారు. అయినా వీరు ప్రజాపిత,
కావున మన కులము వృద్ధి చెందుతూనే ఉంటుంది. వృద్ధి చెందాల్సిందే.
కల్పక్రితము వలె అందరూ పురుషార్థం చేస్తూనే ఉంటారు. మేము సాక్షిగా అయి చూస్తాము. ప్రతి ఒక్కరు తమ ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ ఉండాలి - సత్యయుగంలో రాజధానిని తీసుకునేందుకు మేము ఎంతవరకు యోగ్యులుగా అయ్యాము అని. ఇది కల్ప-కల్పము యొక్క ఆట, ఎవరు ఎంత సేవ చేస్తే అంత,
మీరు అనంతమైన ఆత్మిక సమాజ సేవకులు. మీరు పరమ ఆత్మ మతముపై నడుస్తున్నారు. ఇటువంటి మంచి-మంచి పాయింట్లను ధారణ చేయాలి. తండ్రి వచ్చి కాలుడి పంజా నుండి విడిపిస్తారు. అక్కడ మృత్యువు పేరే ఉండదు, ఇది మృత్యులోకము, అది అమరలోకము. ఇక్కడ ఆది మధ్యాంతాలు దుఃఖం ఉంది, అక్కడ దుఃఖం యొక్క నామ రూపాలు ఉండవు.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
మనం నిరాకారీ మరియు సాకారీ ఇరువురి తండ్రులకు చాలాకాలం తర్వాత కలిసిన ప్రకాశ రత్నాలము,
మనం శివబాబాకు జీవిస్తూనే వారసులుగా అయ్యాము,
ఈ నషాలోనే ఉండాలి.
2.
యోగబలంతో విశ్వ రాజ్యం తీసుకోవాలి, పవిత్రత యొక్క రాఖీని కట్టుకున్నారంటే సహనం కూడా చేయాలి. పతితులుగా ఎప్పుడూ అవ్వకూడదు.
వరదానము:-
సుఖ సాగరుడైన
తండ్రి స్మృతి
ద్వారా దుఃఖపు
ప్రపంచంలో ఉంటూ
కూడా సుఖ
స్వరూప భవ
సదా సుఖ సాగరుడైన తండ్రి స్మృతిలో ఉంటే సుఖ స్వరూపులుగా
అయిపోతారు. ప్రపంచంలో ఎంతగానైనా దుఃఖము, అశాంతి ప్రభావము ఉండవచ్చు, కానీ మీరు అతీతంగా మరియు ప్రియంగా ఉన్నారు, సుఖ సాగరునితో ఉన్నారు, అందుకే సదా సుఖీగా, సదా సుఖాల ఊయలలో ఊగేవారిగా ఉన్నారు. మాస్టర్ సుఖ సాగరులైన పిల్లలకు దుఃఖం యొక్క సంకల్పం కూడా రాజాలదు ఎందుకంటే దుఃఖపు ప్రపంచం నుండి దూరంగా సంగమానికి చేరుకున్నారు. అన్ని తాళ్ళు తెగిపోయాయి కనుక సుఖ సాగరంలో తేలియాడుతూ ఉండండి.
స్లోగన్:-
మనస్సు మరియు బుద్ధిని ఒకే శక్తిశాలి స్థితిలో స్థితి చేయడమే ఏకాంతవాసులుగా అవ్వడము.
0 Comments