Header Ads Widget

Header Ads

TELUGU MURLI 13.01.23

 

13-01-2023  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం


Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - ఇక్కడ మీరు సుఖ-దుఃఖాలు, మాన-అవమానాలు... అన్నింటినీ సహనం చేయాలి, పాత ప్రపంచపు సుఖాల నుండి బుద్ధిని తొలగించివేయాలి, మీ మతముపై నడవకూడదు’’

ప్రశ్న:-

దేవతల జన్మ కన్నా జన్మ చాలా మంచిది, అది ఎలా?

జవాబు:-

జన్మలో పిల్లలైన మీరు శివబాబా భండారా నుండి తింటారు. ఇక్కడ మీరు అపారమైన సంపాదన చేసుకుంటారు, మీరు తండ్రి శరణు తీసుకున్నారు. జన్మలోనే మీరు మీ లోక-పరలోకములను సుఖమయంగా చేసుకుంటారు. సుధాముని వలె రెండు పిడికెళ్ళను ఇచ్చి 21 జన్మల రాజ్యాధికారాన్ని తీసుకుంటారు.

పాట:-  సమీపముగా ఉన్నా లేక దూరముగా ఉన్నా... (చాహే పాస్ హో, చాహే దూర్ హో...) 

ఓం శాంతి. పాటకు ఎంత మంచి అర్థం ఉంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు - మనం తనువు ద్వారా సమీపముగా ఉన్నా లేక దూరముగా ఉన్నా కానీ, వారు సమ్ముఖముగా యోగ శిక్షణను ఇస్తున్నారు. ప్రేరణ ద్వారానైతే ఇవ్వరు కదా. నేను సమీపముగా ఉన్నా లేక దూరముగా ఉన్నా - స్మృతి అయితే నన్నే చేయాలి. భగవంతుని వద్దకు వెళ్ళేందుకే భక్తి చేస్తారు. హే జీవాత్మల్లారా, శరీరములో నివాసం చేసే ఆత్మల్లారా అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, ఆత్మలతో పరమపిత పరమాత్మ కూర్చుని మాట్లాడుతారు. పరమాత్మను ఆత్మలు తప్పకుండా కలుసుకోవాలి, అందుకే జీవాత్మలు భగవంతుడిని స్మృతి చేస్తారు ఎందుకంటే దుఃఖితముగా ఉన్నారు. సత్యయుగములోనైతే ఎవరూ స్మృతి చేయరు. మనం చాలా పురాతనమైన భక్తులమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఎప్పటి నుండైతే మాయ మనల్ని పట్టుకుందో అప్పటి నుండి భగవంతుని, శివుని స్మృతి ప్రారంభమైంది ఎందుకంటే శివబాబా మనల్ని స్వర్గాధిపతులుగా తయారుచేసారు, కావున వారి స్మృతిచిహ్నాలను తయారుచేసి భక్తి చేస్తారు. తండ్రి మనల్ని తీసుకువెళ్ళేందుకు సమ్ముఖముగా వచ్చారని మీకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళాలి. ఎప్పటివరకైతే ఇక్కడ ఉన్నారో, అప్పటివరకూ పాత శరీరాన్ని, పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి మరియు యోగములో ఉండాలి. తద్వారా యోగాగ్ని ద్వారా పాపాలు భస్మమవుతాయి. ఇందులో కష్టపడవలసి ఉంటుంది. పదవి కూడా అద్భుతముగా ఉంది. విశ్వానికి అధిపతులుగా అవ్వాలి. విశ్వాధిపతి శివబాబాయేనని మనుష్యులు అంటారు. కానీ అలా కాదు, విశ్వాధిపతులుగా మనుష్యులే అవుతారు. తండ్రి కూర్చుని పిల్లలను విశ్వాధిపతులుగా తయారుచేస్తారు. వారు అంటారు, మీరే విశ్వాధిపతులుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ ఇప్పుడు గవ్వలకు కూడా అధిపతులుగా లేరు. మొదటి నెంబర్ జన్మకు మరియు ఇప్పటి అంతిమ జన్మకు ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉందో చూడండి. ఎప్పటివరకైతే తండ్రి వచ్చి సాక్షాత్కారం చేయించరో, అప్పటివరకూ ఎవరికీ స్మృతి కలగదు. జ్ఞాన బుద్ధి ద్వారా కూడా సాక్షాత్కారమవుతుంది. తెలివైన పిల్లలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే నిత్యమూ తండ్రిని స్మృతి చేస్తారో, వారికెంతో ఆనందము కలుగుతుంది. ఇక్కడ మీరు అన్నీ కొత్త విషయాలనే వింటారు. మనుష్యులకు ఏమీ తెలియదు. వారు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు మరియు ప్రతి ద్వారం వద్ద ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. మిమ్మల్ని ఇలా భ్రమించడం నుండి విడిపించడం జరుగుతుంది. తండ్రి అంటారు, మీరు ఆత్మ, తండ్రినైన నన్ను స్మృతి చేస్తూ ఉండండి. ఆత్మలమైన మనం తండ్రి వద్దకు వెళ్ళాలి, సృష్టి మనకొరకు లేనట్లే అన్న ఆలోచనయే బుద్ధిలో ఉండాలి. పాత సృష్టి అయితే అంతమైపోతుంది. మళ్ళీ మనం స్వర్గములోకి వచ్చి కొత్త మహళ్ళను తయారుచేస్తాము. రాత్రింబవళ్ళు బుద్ధిలో ఇది ఉండాలి. తండ్రి తమ అనుభవాన్ని వినిపిస్తారు. రాత్రి పడుకునేటప్పుడు ఇవే ఆలోచనలు నడుస్తాయి. నాటకం ఇప్పుడు పూర్తవుతుంది, పాత వస్త్రాన్ని వదిలివేయాలి. అవును, వికర్మల భారం ఎంతగానో ఉంది, అందుకే నిరంతరమూ తండ్రిని స్మృతి చేయాలి. మీ అవస్థను దర్పణములో చూసుకోవాలి - మా బుద్ధి అన్నింటి నుండీ తొలగిపోయి ఉందా? వ్యాపార, వ్యవహారాలలో ఉంటూ కూడా బుద్ధి ద్వారా పని చేయవచ్చు. తండ్రికి ఎంత చింత ఉంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారి గురించి ఆలోచించవలసి ఉంటుంది. పిల్లలకు శరణును ఇవ్వాలి. దుఃఖితులుగానైతే ఎందరో ఉన్నారు కదా! హంగామాలలో ఎంతమంది దుఃఖితులుగా అయి మరణిస్తారు. సమయం చాలా అశుద్ధమైనది. కావున పిల్లలకు శరణును ఇచ్చేందుకే ఇళ్ళు తయారవుతున్నాయి. ఇక్కడ అంతా మన పిల్లలే ఉంటారు. భయమూ లేదు మరియు యోగబలము కూడా ఉంటుంది. పిల్లలు సాక్షాత్కారం కూడా చూసారు, ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేస్తారో వారిని తండ్రి రక్షిస్తారు కూడా. శత్రువుకు భయంకర రూపాన్ని చూపించి పారద్రోలుతారు. మీకు ఎప్పటివరకైతే శరీరము ఉంటుందో, అప్పటివరకు యోగములో ఉండాలి. లేకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఎవరైనా గొప్ప వ్యక్తి కొడుకు శిక్షలు అనుభవిస్తే అతని తల కిందకు దిగిపోతుంది. అలా మీరు కూడా తల దించుకోవలసి వస్తుంది. పిల్లల కొరకైతే ఇంకా కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇప్పుడు మాయ సుఖాలను పొందుదాము, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాములే అని అనేవారు కూడా కొందరు ఉంటారు. చాలామందికి పాత ప్రపంచపు సుఖాలు మధురముగా అనిపిస్తాయి. ఇక్కడైతే సుఖ-దుఃఖాలు, మాన-అవమానాలు... అన్నింటినీ సహనం చేయవలసి ఉంటుంది. ఉన్నతమైన ప్రాప్తిని కోరుకున్నట్లయితే ఫాలో చేయవలసి ఉంటుంది, మాత-పితల ఆజ్ఞానుసారముగా నడుచుకోవలసి ఉంటుంది. స్వయం యొక్క మతము అనగా రావణుని మతము. అది భాగ్యానికి అడ్డుగీత గీసే విధముగానే ఉంటుంది. తండ్రిని అడిగితే తండ్రి వెంటనే చెప్తారు - ఇది ఆసురీ మతము, శ్రీమతము కాదు అని. అడుగడుగులోనూ శ్రీమతము కావాలి. ఎక్కడా తప్పుడు పనులు చేసి తండ్రిని నిందింపజేయడం లేదు కదా అని చూసుకోవాలి. ఎప్పుడైతే ఇటువంటి లక్షణాలు వస్తాయో అప్పుడు దేవీ-దేవతలుగా అవుతారు. అక్కడ దానంతట అదే లక్షణాలు వచ్చేస్తాయని కాదు. ఇక్కడ చాలా మధురమైన నడవడిక కావాలి. ఒకవేళ శివబాబా కాకుండా బ్రహ్మాబాబా చెప్పినా కానీ బాధ్యత వీరిదే ఉంటుంది కదా! ఒకవేళ ఏదైనా నష్టం వాటిల్లినా కానీ ఫరవాలేదు. అది డ్రామాలో ఉంది కావున మీపై దోషమేమీ లేదు. అవస్థ చాలా మంచిగా ఉండాలి. మీరు ఇక్కడ కూర్చున్నా కానీ బుద్ధిలో - మేము బ్రహ్మాండానికి అధిపతులము, అక్కడ ఉండేవారము అని ఉండాలి. విధముగా ఇంట్లో ఉంటూ, వ్యాపారం చేస్తూ, అతీతంగా అవుతూ ఉంటారు. విధముగా సన్యాసులు గృహస్థము నుండి అతీతముగా అవుతారో, అలా మీరు మొత్తం పాత ప్రపంచం నుండే అతీతముగా అవుతారు. హఠయోగ సన్యాసము మరియు సన్యాసములో రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. రాజయోగాన్ని తండ్రి నేర్పిస్తారు. దీనిని సన్యాసులు నేర్పించలేరు, ఎందుకంటే ముక్తి-జీవన్ముక్తుల దాత ఒక్కరే. అందరి ముక్తి ఇప్పుడు జరుగనున్నది ఎందుకంటే అందరూ తిరిగి వెళ్ళనున్నారు. సాధువులు కూడా తాము తిరిగి వెళ్ళాలనే సాధన చేస్తారు. ఇక్కడ దుఃఖితులుగా ఉన్నారు. కొందరు జ్యోతి అయిన మేము జ్యోతిలో కలిసిపోవాలి అని అంటారు. అనేక మతాలు ఉన్నాయి.

బాబా అర్థం చేయించారు, కొందరు పిల్లలు ఎలా ఉన్నారంటే వారికి పాత సంబంధీకులు కూడా గుర్తుకు వస్తారు. ప్రపంచం యొక్క సుఖాల ఆశ కలగగానే మరణిస్తారు. ఇక వారి పాదాలు ఇక్కడ నిలువలేవు. మాయ చాలా ప్రలోభపెడుతుంది. ఒక నానుడి ఉంది ‘‘భగవంతుడిని స్మృతి చేయండి లేకపోతే గ్రద్ద వచ్చేస్తుంది’’ అని. మాయ కూడా గ్రద్ద వలె దాడి చేస్తుంది. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున - ఒకవేళ ఇప్పుడు కూడా పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందకపోతే ఇక కల్ప-కల్పాంతరాలు కూడా పొందరు. ఇక్కడ తండ్రి వద్దనైతే మీకు దుఃఖమూ లేదు, కావున పాత దుఃఖ ప్రపంచాన్ని మర్చిపోవాలి కదా. మొత్తం రోజంతటి లెక్కను చూసుకోవాలి. ఎంత సమయం తండ్రిని స్మృతి చేసాను? ఎవరికైనా ప్రాణదానము ఇచ్చానా? తండ్రి మీకు కూడా ప్రాణదానం ఇచ్చారు కదా. సత్య, త్రేతాయుగాల వరకు మీరు అమరులుగా ఉంటారు. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఎంతగా ఏడుస్తారు, రోదిస్తారు. స్వర్గములో దుఃఖము అన్న మాటే ఉండదు. పాత శరీరాన్ని వదిలి కొత్త దానిని తీసుకుంటాము అని భావిస్తారు. ఉదాహరణ కూడా మీకు సరిపోతుంది. ఇంకెవ్వరూ ఉదాహరణను ఇవ్వలేరు. వాళ్ళు ఏమైనా పాత శరీరాన్ని మర్చిపోతారా. వారు ధనం పోగు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు ఏదైతే తండ్రికి ఇస్తారో దానిని తండ్రి ఏమైనా స్వయము తింటారా లేక తన వద్ద ఉంచుకుంటారా. దాని ద్వారా పిల్లల పాలనయే జరుగుతుంది, అందుకే ఇది సత్యాతి-సత్యమైన శివబాబా భండారా, భండారా నుండి తినేవారు ఇక్కడ కూడా సుఖముగా ఉంటారు మరియు జన్మ-జన్మాంతరాలూ సుఖముగా ఉంటారు.

మీ జన్మ చాలా దుర్లభమైనది. దేవతల జన్మ కన్నా మీరు ఇక్కడ సుఖముగా ఉన్నారు ఎందుకంటే తండ్రి శరణులో ఉన్నారు. ఇక్కడి నుండే మీరు అపారమైన సంపాదనను చేసుకుంటారు, దానిని తర్వాత జన్మ-జన్మాంతరాలూ అనుభవిస్తారు. సుధామునికి కూడా రెండు పిడికెళ్ళు ఇచ్చినదానికి బదులుగా 21 జన్మల కొరకు మహళ్ళు లభించాయి. లోకములోనూ సుఖముగా, పరలోకములోనూ సుఖముగా, జన్మ-జన్మాంతరాల వరకు సుఖముగా ఉంటారు, అందుకే జన్మ చాలా మంచిది. త్వరగా వినాశనమైతే మేము స్వర్గములోకి వెళ్ళవచ్చు అని కొందరు భావిస్తారు. కానీ, ఇప్పుడు ఇంకా ఎంతో ఖజానాను తండ్రి నుండి తీసుకోవాలి. ఇప్పుడింకా రాజధాని ఎక్కడ తయారయ్యింది. కావున త్వరగా వినాశనం ఎలా చేయిస్తారు! పిల్లలు ఇప్పుడింకా అర్హులుగా ఎక్కడ అయ్యారు! ఇప్పుడింకా తండ్రి చదివించేందుకు వస్తూ ఉంటారు. బాబా సేవ అపారమైనది. బాబా మహిమ కూడా అపారమైనదే. నేను ఎంత ఉన్నతమైనవాడినో సేవ కూడా అంతే ఉన్నతముగా చేస్తాను, కావుననే నా స్మృతిచిహ్నము ఉంది. ఉన్నతోన్నతమైనది బాబా ఆసనము, ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా తమ భాగ్యాన్ని తయారుచేసుకుంటారు. ఇది అవినాశీ జ్ఞాన రత్నాల సంపాదన, ఇది అక్కడ అపారమైన ధనముగా అవుతుంది. కావున పిల్లలు పురుషార్థము చాలా బాగా చేయాలి. తండ్రిని ఇక్కడ కూడా స్మృతి చేయండి, అలాగే అక్కడ కూడా స్మృతి చేయండి. మెట్లు అయితే ఉన్నాయి కదా. నేను తండ్రికి ఎంత సుపుత్రుడను, అంధులకు దారి చూపిస్తున్నానా అని హృదయం రూపీ దర్పణములో చూసుకోవాలి. తమతో తాము మాట్లాడుకోవడంలో సంతోషం కలుగుతుంది. విధముగా తండ్రి తమ అనుభవాన్ని వినిపిస్తారు - నిదురించినప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాను, బాబా! మీదైతే అద్భుతము, భక్తి మార్గములో మళ్ళీ మేము మిమ్మల్ని మర్చిపోతాము, ఇంతటి వారసత్వాన్ని మీ నుండి పొందుతాము, మళ్ళీ సత్యయుగములో దీనిని మర్చిపోతాము, తిరిగి భక్తి మార్గములో మీ స్మృతిచిహ్నాలను తయారుచేస్తాము, కానీ మీ కర్తవ్యాన్ని పూర్తిగా మర్చిపోతాము, బుద్ధిహీనులుగా, అజ్ఞానులుగా అయిపోతాము. ఇప్పుడు తండ్రి ఎంత జ్ఞానవంతులుగా తయారుచేసారు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఈశ్వరుడు సర్వవ్యాపి, ఇదేమైనా జ్ఞానమా. సృష్టి చక్రము యొక్క జ్ఞానము కావాలి. ఇప్పుడు మనం 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి తిరిగి వెళ్తాము, తిరిగి మనం జీవన్ముక్తిలోకి రావాలి. డ్రామా నుండి బయట పడగలమా. మనము ఉన్నదే జీవన్ముక్తి యాత్రికులము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాస్ 16-12-68

ఒకరిని బాబా బచ్చీ (కుమార్తె) అని అంటారు, మరొకరిని తల్లి అని అంటారు, తప్పకుండా ఏదో తేడా ఉంటుంది. కొందరి సేవ నుండి సుగంధం వస్తుంది, కొందరైతే జిల్లేడు పూలలా ఉన్నారు. మీరూ నాతో పాటు వచ్చినట్లుగా ఉంది అని తండ్రి అర్థం చేయించారు. విశ్వాన్ని పావనంగా చెయ్యడానికి తండ్రీ పై నుండి వచ్చారు. మీ కర్తవ్యం కూడా ఇదే. అక్కడి నుండి మొదటగా ఎవరైతే వస్తారో వారు పవిత్రులు. క్రొత్తగా వచ్చినవారు తప్పకుండా సుగంధాన్ని ఇస్తూ ఉండవచ్చు. పూదోటతో కూడా పోలుస్తారు. ఎలాంటి సేవనో అలాంటి సుగంధభరితమైన పుష్పము. శివబాబాకు బిడ్డ అని అనిపించుకున్న వెంటనే హక్కుదారులుగా అయ్యాము అని వివేకము చెప్తుంది. కావున సుగంధము రావాలి. హక్కుదారులు కావుననే అందరికీ నమస్తే చేస్తారు. మీరు నిస్సందేహంగా విశ్వానికి యజమానులుగా అవుతారు, కానీ చదువులో తేడా మాత్రం చాలా ఉంటుంది. ఇది తప్పకుండా జరిగేదే ఉంది. వీరు బాబా అని పిల్లలకు నిశ్చయం ఏర్పడుతుంది మరియు చక్రము కూడా బుద్ధిలో ఉంటుంది. కావున తండ్రి అంటారు, ఇక ఎక్కువ ఎందుకు చెప్పాలి. తండ్రి తప్ప మరెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా చెయ్యలేరు. సూచనలతో అలా అవుతారు. ఎవరైతే కల్పక్రితం అయ్యారో, వారే అవుతారు. అనేకానేక మంది పిల్లలు వస్తారు. పవిత్రత విషయంలో ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి! ఎవరి ద్వారా తండ్రి గీతను వినిపిస్తున్నారో వారిని ఎంతగా నిందిస్తారు. శివబాబాను కూడా నిందిస్తారు. కూర్మావతారము, మత్స్యావతారము అని అనడం కూడా నిందయే కదా! తెలియని కారణంగా తండ్రిపై, మీపై ఎన్ని నిందలు వేస్తారు! పిల్లలు ఎంతగా కష్టపడతారు. చదువుతో కొందరు చాలా షావుకారులుగా అవుతారు, ఎంత సంపాదిస్తారు! ఒక్కొక్క ఆపరేషన్ కు 2 వేలు, 4 వేలు లభిస్తాయి. మరికొందరైతే కుటుంబాన్ని కూడా పోషించలేరు. తేడా ఉంది కదా. కొందరు జన్మ-జన్మాంతరాలకు రాజ్యము తీసుకుంటారు. మరికొందరు జన్మ-జన్మాంతరాలకు పేదవారిగా అవుతారు. తండ్రి అంటారు, మిమ్మల్ని తెలివైనవారిగా చేస్తాను. ఇప్పుడు మీరు అన్ని విషయాలలోనూ డ్రామా అని అంటారు. అందరి పాత్ర ఉంది. ఏదైతే గతించిందో, అది డ్రామా. ఏదైతే డ్రామాలో ఉందో, అదే జరుగుతుంది. డ్రామా అనుసారంగా ఏది జరిగినా అది సరైనదే. మీరు ఎంత అర్థం చేయించినా, వారు అర్థం చేసుకోరు. ఇందులో మేనర్స్ కూడా మంచిగా ఉండాలి. నాలో బలహీనత లేదు కదా? అని ప్రతి ఒక్కరూ తమ లోపల చూసుకోవాలి. మాయ చాలా కఠినమైనది. దానిని ఎలాగైనా తొలగించాలి. అన్ని లోపాలను తొలగించాలి. తండ్రి అంటారు, బంధనంలో ఉన్నవారు అందరికన్నా ఎక్కువగా స్మృతిలో ఉంటారు. వారే మంచి పదవిని పొందుతారు. ఎంత ఎక్కువ దెబ్బలు తింటారో అంత ఎక్కువ స్మృతిలో ఉంటారు. శివబాబా అని అంటారు. జ్ఞానంతో శివబాబాను స్మృతి చేస్తారు. వారి చార్టు బాగుంటుంది. ఇలా ఎవరైతే దెబ్బలు తిని వస్తారో వారు సేవలో కూడా బాగా ఉంటారు. తమ జీవితాన్ని మంచిగా చేసుకోవడానికి సేవను బాగా చేస్తారు. సేవ చెయ్యకపోతే మనసు తింటుంది. నేను సేవకు వెళ్ళాలి అని మనసు కోరుకుంటూ ఉంటుంది. సెంటరు వదిలి వెళ్ళాల్సి వస్తుంది అని అర్థమవుతుంది, కానీ ప్రదర్శనీలో సేవ చాలా ఉంటే సెంటరు గురించి కూడా ఆలోచించకుండా సేవకు పరుగెత్తాలి. ఎంతగా మనం దానం చేస్తామో, అంతగా బలం కూడా నిండుతూ ఉంటుంది. దానం కూడా తప్పకుండా చెయ్యాలి కదా. ఇవి అవినాశీ జ్ఞాన రత్నాలు, ఎవరి వద్ద ఉంటాయో వారే దానం చేస్తారు. పిల్లలకు ఇప్పుడు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము గుర్తుకు రావాలి. మొత్తము చక్రము తిరగాలి. తండ్రి కూడా సృష్టి ఆదిమధ్యాంతాలు తెలిసినవారు. తప్పకుండా వారు జ్ఞాన సాగరుడు. సృష్టి చక్రము తెలిసినవారు. ఇది ప్రపంచానికి పూర్తిగా క్రొత్త జ్ఞానము, ఇది ఎప్పుడూ పాతగా అవ్వనే అవ్వదు. ఇది అద్భుతమైన జ్ఞానము కదా, దీనిని తండ్రి మాత్రమే తెలియజేస్తారు. ఎవరు ఎంతటి సాధువులు, మహాత్ములు అయినా కానీ, మెట్లు ఎక్కి పైకి వెళ్ళలేరు కదా. తండ్రి తప్ప మనుష్యులెవ్వరూ గతి-సద్గతిని ఇవ్వలేరు. మనుష్యులు కానీ, దేవతలు కానీ ఎవ్వరూ ఇవ్వలేరు. కేవలం ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. రోజురోజుకూ వృద్ధి తప్పకుండా జరగనున్నది. బాబా చెప్పారు, ప్రభాత యాత్రలో లక్ష్మీ-నారాయణ చిత్రము, మెట్ల చిత్రము ట్రాన్స్ లైట్ వి కూడా ఉండాలి. విద్యుత్తుతో మెరిసేటువంటి వస్తువేదైనా ఉండాలి. స్లోగన్ లు కూడా వినిపిస్తూ ఉండండి. రాజయోగము పరమపిత పరమాత్మయే భగీరథుని ద్వారా నేర్పిస్తున్నారు. ఇంకెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు, ఇటువంటి ధ్వనిని ఎంతో వింటారు. అచ్ఛా! మధురాతి-మధురమైన పిల్లలకు గుడ్ నైట్.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నాటకము ఇప్పుడు పూర్తవుతుంది, అందుకే పాత ప్రపంచము నుండి అతీతముగా ఉండాలి. శ్రీమతముపై మీ భాగ్యాన్ని ఉన్నతముగా తయారుచేసుకోవాలి. ఎప్పుడూ తప్పుడు కర్మలనూ చేయకూడదు.

2. అవినాశీ జ్ఞాన రత్నాల సంపాదనను చేసుకోవాలి మరియు చేయించాలి. ఒక్క తండ్రి స్మృతిలో ఉంటూ సుపుత్రులుగా అయి అనేకులకు దారి చూపించాలి.

వరదానము:-

త్యాగము మరియు తపస్య యొక్క వాతావరణము ద్వారా విఘ్న-వినాశకులుగా అయ్యే సత్యమైన సేవాధారీ భవ


విధంగానైతే తండ్రికివరల్డ్ సర్వెంట్అనే అన్నిటికంటే గొప్ప టైటిల్ ఉందో, అలా పిల్లలు కూడావరల్డ్ సర్వెంట్అనగా సేవాధారీ. సేవాధారీ అనగా త్యాగీ మరియు తపస్వీ. ఎక్కడైతే త్యాగము మరియు తపస్య ఉంటాయో అక్కడ భాగ్యము వారి ముందుకు దాసీ సమానంగా తప్పకుండా వస్తుంది. సేవాధారీ ఇచ్చేవారిగా ఉంటారు, తీసుకునేవారిగా ఉండరు, అందుకే సదా నిర్విఘ్నంగా ఉంటారు. కనుక సేవాధారిగా భావిస్తూ త్యాగము మరియు తపస్య యొక్క వాతావరణాన్ని తయారుచేస్తే సదా విఘ్న-వినాశకులుగా ఉంటారు.

స్లోగన్:-

పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సాధనము - స్వ స్థితి యొక్క శక్తి.

 Download PDF

Post a Comment

0 Comments