Header Ads Widget

Header Ads

TELUGU MURLI 12.01.23

 

12-01-2023  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 


Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - గురువు అయిన తండ్రి మీకు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే కళను నేర్పించారు, మీరు మళ్ళీ శ్రీమతముపై ఇతరులను కూడా దేవతలుగా తయారుచేసే సేవను చేయండి’’

ప్రశ్న:-

ఇప్పుడు పిల్లలైన మీరు శ్రేష్ఠ కర్మను చేస్తారు, ఆచారము భక్తిలో కూడా కొనసాగుతూ వస్తుంది?

జవాబు:-

ఇప్పుడు మీరు శ్రీమతముపై తమ తనువు-మనస్సు-ధనమును కేవలం భారత్ యే కాక విశ్వ కళ్యాణార్థము అర్పిస్తారు, ఆచారము వలనే భక్తిలో మనుష్యులు ఈశ్వరార్థము దానం చేస్తారు. తర్వాత వారికి దానికి బదులుగా మరుసటి జన్మలో రాజు ఇంట్లో జన్మ లభిస్తుంది. మరియు పిల్లలైన మీరు సంగమములో తండ్రికి సహాయకులుగా అవుతారు కాబట్టి మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు.

పాట:- నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు... (తూనే రాత్ గవాయీ...)

ఓంశాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు, ఎప్పుడైతే పిల్లలు అర్థం చేసుకుంటారో, అప్పుడు మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తారు. అర్థం చేసుకోకపోతే ఇతరులకు అర్థం చేయించలేరు. ఒకవేళ స్వయం అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించలేకపోతున్నారు అంటే ఏమీ అర్థం చేసుకోనట్లు. ఎవరైనా ఒక కళ నేర్చుకుంటే దానిని వ్యాపింపజేస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా ఎలా తయారుచేయాలి అన్న కళనైతే ఉస్తాదు అయిన తండ్రి నుండి నేర్చుకోవడము జరుగుతుంది. దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి, మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు అంటే దేవతలు ఇప్పుడు లేరు. సర్వగుణ సంపన్నులు... అని దేవతల గుణాలు గాయనం చేయబడతాయి. ఇక్కడ మనుష్యులు ఎవ్వరికీ విధంగా గుణాలు గాయనం చేయబడవు. మనుష్యులు మందిరాలలోకి వెళ్ళి దేవతల గుణాలను గానం చేస్తారు. పవిత్రంగా అయితే సన్యాసులు కూడా ఉన్నారు, కానీ మనుష్యులు వారి గుణాలను విధంగా గానం చేయరు. సన్యాసులైతే శాస్త్రాలు మొదలైనవి కూడా వినిపిస్తారు. దేవతలైతే ఏమీ వినిపించలేదు. వారు ప్రారబ్ధం అనుభవిస్తారు. ముందు జన్మలో పురుషార్థం చేసి మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారు. ఇప్పుడు ఎవ్వరిలోనూ దేవతల వంటి గుణాలు లేవు, ఎక్కడైతే గుణం ఉండదో అక్కడ తప్పకుండా అవగుణాలు ఉంటాయి. సత్యయుగములో ఇదే భారత్ లో యథా రాజా రాణి తథా ప్రజా సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. వారిలో అన్ని గుణాలు ఉండేవి. దేవతల గుణాలే గాయనం చేయబడతాయి. సమయంలో ఇతర ధర్మాలు ఉండేవి కావు. గుణాలు కల దేవతలు సత్యయుగములో ఉండేవారు మరియు అవగుణాలు కల మనుష్యులు కలియుగములో ఉంటారు. ఇప్పుడు అటువంటి అవగుణాలు కల మనుష్యులను దేవతలుగా ఎవరు తయారుచేస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా... అని అంటూ ఉంటారు కూడా. మహిమైతే పరమపిత పరమాత్మది. దేవతలు కూడా మనుష్యులే, కానీ వారిలో గుణాలు ఉన్నాయి, వీరిలో అవగుణాలు ఉన్నాయి. గుణాలు తండ్రి నుండి ప్రాప్తిస్తాయి, వారిని సద్గురువు అని కూడా అంటారు. అవగుణాలు మాయా రావణుడి నుండి ప్రాప్తిస్తాయి. ఇంతటి గుణవంతులు మళ్ళీ అవగుణాలు కలవారిగా ఎలా అవుతారు. సర్వగుణ సంపన్నులుగా మరియు సర్వ అవగుణ సంపన్నులుగా ఎవరు తయారుచేస్తారు! ఇది పిల్లలైన మీకు తెలుసు. నిర్గుణుడినైన నాలో గుణము లేదు అని గానం చేస్తారు కూడా. దేవతల గుణాలను ఎంతగా గానం చేస్తారు. సమయంలోనైతే గుణాలు ఎవరిలోనూ లేవు. అన్న-పానీయాలు మొదలైనవి ఎంత అశుద్ధముగా ఉన్నాయి. దేవతలు వైష్ణవ సాంప్రదాయులు మరియు సమయంలోని మనుష్యులు రావణ సంప్రదాయం కలవారు. అన్న-పానీయాలు ఎంతగా మారిపోయాయి. కేవలం డ్రెస్ ను చూడకూడదు. అన్న-పానీయాలను మరియు వికారీతనమును చూడడము జరుగుతుంది. తండ్రి స్వయంగా అంటారు, నేను భారత్ లోకే రావలసి వస్తుంది. బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణ బ్రాహ్మణీల ద్వారా స్థాపన చేయిస్తాను. ఇది బ్రాహ్మణుల యజ్ఞము కదా. వికారీ బ్రాహ్మణులు కుఖ వంశావళి, వీరు ముఖ వంశావళి. చాలా తేడా ఉంది. షావుకార్లు యజ్ఞాలనైతే రచిస్తారో, అందులో దైహిక బ్రాహ్మణులు ఉంటారు. వీరు అనంతమైన తండ్రి, షావుకార్లకు షావుకారు, రాజులకే రాజు. షావుకార్లకు షావుకారు అని ఎందుకు అంటారు? ఎందుకంటే షావుకార్లు కూడా, మాకు ఈశ్వరుడే ధనము ఇచ్చారని అంటారు, ఈశ్వరార్థము దానం చేస్తారు కావున మరుసటి జన్మలో ధనవంతులుగా అవుతారు. సమయంలో మీరు శివబాబాకు తనువు-మనస్సు-ధనము అన్నీ అర్పణ చేస్తారు. కావున ఎంత ఉన్నత పదవిని పొందుతారు.

మీరు శ్రీమతముపై ఇంతటి ఉన్నతమైన కర్మలను నేర్చుకుంటారు కావున మీకు తప్పకుండా ఫలము లభించాలి. తనువు, మనస్సు, ధనములను అర్పణ చేస్తారు. వారు కూడా ఎవరో ఒకరి ద్వారా ఈశ్వరార్థము చేస్తారు. ఆచారము భారత్ లోనే ఉంది. కావున తండ్రి మీకు చాలా మంచి కర్మలు నేర్పిస్తారు. మీరు కర్తవ్యాన్ని కేవలం భారత్ కే కాదు, కానీ మొత్తం ప్రపంచము యొక్క కళ్యాణార్థము చేస్తారు, మరి దానికి మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే ప్రతిఫలము లభిస్తుంది. శ్రీమతముపై ఎవరు ఎటువంటి కర్మలను చేస్తారో, అటువంటి ఫలం లభిస్తుంది. మేము సాక్షిగా అయి చూస్తూ ఉంటాము - ఎవరు శ్రీమతముపై నడుస్తూ మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసే సేవను చేస్తున్నారు, ఎంతగా జీవితం పరివర్తన చెందుతుంది అని. శ్రీమతముపై నడిచేవారు బ్రాహ్మణులైనట్లు. తండ్రి అంటారు, బ్రాహ్మణుల ద్వారా కూర్చుని శూద్రులకు రాజయోగం నేర్పిస్తాను - ఇది 5,000 సంవత్సరాల విషయము. భారత్ లోనే దేవీ-దేవతల రాజ్యం ఉండేది. చిత్రాలను చూపించాలి. చిత్రాలు లేకపోతే ఇదేం కొత్త ధర్మమో తెలియదు, ఇది బహుశా విదేశాల నుండి వస్తుందేమో అని భావిస్తారు. చిత్రాలు చూపించడముతో వీరు దేవతలను నమ్ముతారని భావిస్తారు. కావున అర్థం చేయించాలి, శ్రీనారాయణుడి అంతిమ 84 జన్మలో పరమపిత పరమాత్మ ప్రవేశించారు మరియు రాజయోగం నేర్పిస్తున్నారు. ఇది వారి 84 జన్మ యొక్క అంతిమ సమయము. ఎవరైతే సూర్యవంశీ దేవతలుగా ఉండేవారో, వారందరూ వచ్చి మళ్ళీ రాజయోగం నేర్చుకోవాలి. డ్రామానుసారముగా పురుషార్థం కూడా తప్పకుండా చేస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు సమ్ముఖములో వింటున్నారు, మిగిలిన పిల్లలు తర్వాత టేప్ ద్వారా విన్నప్పుడు, మేము కూడా తల్లిదండ్రులతోపాటు మళ్ళీ దేవతలుగా అవుతున్నామని భావిస్తారు. సమయంలో 84 జన్మలో పూర్తి బెగ్గరుగా తప్పకుండా అవ్వాలి. ఆత్మ తండ్రికి తనదంతా సమర్పిస్తుంది. శరీరమే అశ్వం వంటిది, అది స్వాహా అవుతుంది. ఆత్మ స్వయంగా అంటుంది, నేను తండ్రికి చెందినవానిగా అయ్యాను, ఇంకెవ్వరూ లేరు. ఆత్మనైన నేను శరీరం ద్వారా పరమపిత పరమాత్మ డైరెక్షన్ అనుసారంగా సేవ చేస్తున్నాను.

తండ్రి అంటారు, యోగం కూడా నేర్పించండి మరియు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, అది కూడా అర్థం చేయించండి. ఎవరైతే మొత్తం చక్రము తిరిగి ఉంటారో - వారు విషయాలను వెంటనే అర్థం చేసుకుంటారు. ఎవరైతే చక్రంలోకి రానివారు ఉంటారో వారు నిలవరు. మొత్తం సృష్టి వస్తుందని కాదు! అందులో కూడా ప్రజలు చాలామంది వస్తారు. రాజా రాణి అయితే ఒక్కరే ఉంటారు కదా. ఎలాగైతే లక్ష్మీ-నారాయణులు ఒక్కరేనని అంటూ ఉంటారు, రామ సీత ఒక్కరేనని అంటూ ఉంటారు. రాకుమారులు, రాకుమారీలైతే ఇంకా ఉంటారు. ముఖ్యమైనవారైతే ఒక్కరే ఉంటారు కదా. మరి విధముగా రాజా, రాణిగా అయ్యేందుకు చాలా శ్రమ చేయాలి. సాక్షిగా అయి చూడడము ద్వారా - వీరు షావుకారు రాజ్య కులానికి చెందినవారా లేక పేద కులానికి చెందినవారా అన్నది తెలిసిపోతుంది. కొందరు మాయతో ఎలా ఓడిపోతారంటే, పారిపోతారు కూడా. మాయ ఒక్కసారిగా కచ్చాగా తినేస్తుంది, అందుకే బాబా అడుగుతారు, క్షేమంగా-సంతోషంగా ఉన్నారా? మాయ దెబ్బలతో అచేతనంగా లేక వ్యాధిగ్రస్థులుగా అయితే అవ్వడము లేదు కదా! ఇలా కొందరు వ్యాధిగ్రస్థులుగా అవుతారు, తర్వాత పిల్లలు వారి వద్దకు వెళ్తారు, జ్ఞాన-యోగాల సంజీవని మూలికను ఇచ్చి మేల్కొలుపుతారు. జ్ఞానము మరియు యోగములో ఉండని కారణముగా మాయ ఒక్కసారిగా శరీరాన్ని మరియు దాని విశేషతలను అంతము చేసేస్తుంది. శ్రీమతాన్ని విడిచి మన్మతముపై నడవడము మొదలుపెడతారు. మాయ ఒక్కసారిగా అచేతనంగా చేసేస్తుంది. వాస్తవానికి సంజీవని మూలిక జ్ఞానమే, దీని ద్వారా మాయ యొక్క అచేతనము తొలగిపోతుంది. విషయాలన్నీ సమయానికి చెందినవే. సీతలు కూడా మీరే. రాముడు వచ్చి మాయా రావణుడి నుండి మిమ్మల్ని విడిపిస్తారు. ఎలాగైతే సింధ్ లో పిల్లలను విడిపించారు. రావణుడికి చెందినవారు మళ్ళీ తీసుకువెళ్ళిపోయేవారు. ఇప్పుడు మీరు మళ్ళీ మాయ పంజా నుండి అందరినీ విడిపించాలి. బాబాకైతే దయ కలుగుతుంది, మాయ చెంప దెబ్బ వేసి పిల్లల బుద్ధినే ఒక్కసారిగా విధంగా తిప్పేస్తుందో చూస్తారు. రాముడి నుండి బుద్ధిని తిప్పి రావణుడి వైపుకు వెళ్ళేలా చేస్తుంది. ఎలాగైతే ఒక బొమ్మ ఉంటుంది - ఒకవైపు రాముడు, ఇంకొకవైపు రావణుడు ఉంటారు. దీనినే అంటారు, ఆశ్చర్యవంతులై తండ్రికి చెందినవారిగా అవుతారు, మళ్ళీ రావణుడికి చెందినవారిగా అవుతారు. మాయ చాలా శక్తివంతమైనది. ఎలుక వలె కొరికి స్వయాన్ని నాశనం చేసుకునేలా చేస్తుంది, అందుకే శ్రీమతాన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఇవి కఠినమైన మెట్లు కదా. తమ మతము అనగా రావణుడి మతము. దానిపై నడిచినట్లయితే చాలా గుటకలు మింగుతారు. చాలా అప్రతిష్టపాలు చేయిస్తారు. ఇటువంటివారు అన్ని సెంటర్లలోనూ ఉన్నారు. అయినా స్వయానికే నష్టపరుచుకుంటారు. సేవ చేసేటువంటి రూప్-బసంత్ దాగి ఉండరు. దైవీ రాజధాని యొక్క స్థాపన జరుగుతోంది, ఇందులో అందరూ తమ-తమ పాత్రను తప్పకుండా అభినయిస్తారు. పరుగు తీసినట్లయితే తమ కళ్యాణం చేసుకుంటారు. కళ్యాణము కూడా ఒక్కసారిగా స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఎలాగైతే తల్లిదండ్రులు సింహాసనాధికారులుగా ఉంటారో, అలా పిల్లలు కూడా అవ్వాలి. తండ్రిని ఫాలో చేయాలి. లేదంటే తమ పదవిని తగ్గించుకుంటారు. బాబా చిత్రాలను దాచి పెట్టుకునేందుకు ఏమీ తయారుచేయలేదు. వీటితో చాలా సేవ చేయాలి. పెద్ద-పెద్ద షావుకార్లు లక్ష్మీ-నారాయణుల మందిరాలను తయారుచేయిస్తారు కానీ, వారు ఎప్పుడు వచ్చారు, అందరూ వారిని స్మృతి చేసేలా వారు భారత్ ను విధంగా సుఖీగా తయారుచేసారు అన్నది ఎవరికీ తెలియదు.

మీకు తెలుసు, ఒక్క మనసున్నవారి మందిరమే ఉండాలి. ఇదొక్కటే చాలు. లక్ష్మీ-నారాయణుల మందిరము ద్వారా కూడా ఏం జరుగుతుంది! వారేమీ కళ్యాణకారి కాదు. శివుని మందిరాలను తయారుచేస్తారు, అది కూడా అర్థ రహితముగా. వారి కర్తవ్యము గురించైతే తెలియనే తెలియదు. మందిరాలు తయారుచేసి, కర్తవ్యం గురించి తెలుసుకోకపోతే ఏమంటారు? స్వర్గంలో దేవతలు ఉన్నప్పుడు మందిరాలు ఉండవు. ఎవరైతే మందిరాలు తయారుచేస్తారో, వారిని అడగాలి, లక్ష్మీ-నారాయణులు ఎప్పుడు వచ్చారు? వారు సుఖాన్ని ఇచ్చారు? ఏమీ అర్థం చేయించలేరు. దీనితో, ఎవరిలోనైతే అవగుణాలు ఉన్నాయో వారు గుణవంతుల మందిరాలను నిర్మిస్తారని ఋజువు అయ్యింది. కావున పిల్లలకు సేవ పట్ల చాలా అభిరుచి ఉండాలి. బాబాకు సేవ పట్ల చాలా అభిరుచి ఉంది, అందుకే ఇలాంటి-ఇలాంటి చిత్రాలను తయారుచేయిస్తారు. చిత్రాలను శివబాబా తయారుచేయిస్తారు కానీ బుద్ధి ఇరువురిది నడుస్తుంది. అచ్ఛా -

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాస్ - 28-6-68

ఇక్కడ అందరూ కూర్చున్నారు, మేము ఆత్మలము, తండ్రి కూర్చుని ఉన్నారని భావిస్తారు. దీనినే ఆత్మాభిమానిగా అయ్యి కూర్చోవడము అని అంటారు. మేము ఆత్మలము, బాబా ఎదురుగా కూర్చున్నాము అని అందరూ విధంగా కూర్చోలేదు. ఇప్పుడు బాబా స్మృతినిప్పించారు కావున స్మృతి వచ్చింది, అటెన్షన్ పెడతారు. బుద్ధి బయటకు పరిగెడుతూ ఉండేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ కూర్చుని ఉన్నా కూడా చెవులు మూసుకుని ఉన్నాయి. బుద్ధి బయట ఎక్కడికో పరిగెడుతూ ఉంటుంది. పిల్లలైతే తండ్రి స్మృతిలో కూర్చున్నారో, వారు సంపాదన చేసుకుంటున్నారు. చాలామంది బుద్ధి యోగం బయట ఉంటుంది, వారు యాత్రలో లేనట్లే. సమయము వ్యర్థము అవుతుంది. తండ్రిని చూసినా కూడా బాబా గుర్తుకొస్తారు. నంబరువారు పురుషార్థము అనుసారంగా అయితే ఉండనే ఉన్నారు. కొంతమందికైతే పక్కా అలవాటు అయిపోతుంది - మేము ఆత్మలము, శరీరం కాదు. తండ్రి నాలెడ్జ్ ఫుల్ కావున పిల్లలకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. చక్రం పూర్తవుతుంది, ఇప్పుడు పురుషార్థం చేయాలి. చాలా గడిచిపోయింది, కొంచమే మిగిలింది... పరీక్ష రోజులలో మళ్ళీ చాలా పురుషార్థం చేయడము మొదలుపెడతారు. మేము పురుషార్థం చేయకపోతే ఫెయిల్ అవుతామని భావిస్తారు. పదవి కూడా చాలా తగ్గిపోతుంది. పిల్లల పురుషార్థమైతే నడుస్తూనే ఉంటుంది. దేహాభిమానం కారణంగా వికర్మలు జరుగుతాయి. దీనికి వంద రెట్ల శిక్ష అవుతుంది ఎందుకంటే మా నిందను చేయిస్తారు. తండ్రి పేరు అప్రతిష్ఠపాలు అయ్యే కర్మలు చేయకూడదు, అందుకే సద్గురువుకు నింద తీసుకువచ్చేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరని పాడుతారు. స్థానము అంటే రాజ్యము. చదివించేవారు కూడా తండ్రి. ఇంకెక్కడా కూడా సత్సంగాలలో లక్ష్యము-ఉద్దేశ్యము ఉండదు. ఇది మన రాజయోగము. ఇంకెవ్వరూ విధంగా నోటి ద్వారా, మేము రాజయోగము నేర్పిస్తామని ఏమీ చెప్పలేరు. వారైతే శాంతిలోనే సుఖముందని భావిస్తారు. అక్కడైతే దుఃఖము లేదా సుఖము యొక్క విషయము ఉండదు. శాంతే శాంతి ఉంటుంది. అప్పుడు వీరి భాగ్యంలో తక్కువగా ఉందని భావించడము జరుగుతుంది. ఎవరైతే మొదటి నుండి పాత్రను అభినయిస్తారో, వారిదే అందరికన్నా ఉన్నతమైన భాగ్యము. అక్కడ వారికి జ్ఞానము ఉండదు. అక్కడ సంకల్పమే నడవదు. పిల్లలకు తెలుసు, మనమందరము అవతారము తీసుకుంటాము, భిన్న-భిన్న నామ రూపాలలోకి వస్తాము. ఇది డ్రామా కదా. మేము ఆత్మలము, శరీరం ధారణ చేసి ఇందులో పాత్రను అభినయిస్తాము. రహస్యాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకు లోపల అతీంద్రియ సుఖం ఉంటుంది, లోపల సంతోషం ఉంటుంది. అటువంటివారిని, వీరు దేహీ-అభిమాని అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు కూడా - మీరు విద్యార్థులు. మనం దేవతలుగా, స్వర్గానికి యజమానులుగా అయ్యేవారమని తెలుసు. కేవలం దేవతగా కూడా కాదు. మనం విశ్వానికి యజమానులుగా అయ్యేవారము. ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఉంటుందో, అప్పుడే అవస్థ స్థిరంగా ఉంటుంది. డ్రామా ప్లాను అనుసారంగా తప్పకుండా జరగనున్నది. మేము ఈశ్వరీయ పరివారంలో ఉన్నామని మీరు అర్థం చేసుకుంటారు. స్వర్గ రాజ్యము తప్పకుండా లభించనున్నది. ఎవరైతే ఎక్కువ సేవ చేస్తారో, అనేకుల కళ్యాణం చేస్తారో, వారికి తప్పకుండా ఉన్నత పదవి లభిస్తుంది. బాబా అర్థం చేయించారు, యోగం కోసం కూర్చోవడము ఇక్కడే అవ్వగలదు. బయట సెంటర్లలో ఇలా అవ్వదు. నాలుగు గంటలకు రావడము, యోగంలో కూర్చోవడము, అక్కడ ఎలా అవ్వగలదు. అవ్వదు. సెంటరులో ఉండేవారు కూర్చోవచ్చు. బయటివారికి పొరపాటున కూడా చెప్పకూడదు. సమయం అటువంటిది కాదు. ఇది ఇక్కడ సరైనది. ఇంట్లోనే కూర్చున్నారు. అక్కడైతే బయట నుండి రావలసి ఉంటుంది. ఇది కేవలం ఇక్కడి కోసమే. బుద్ధిలో జ్ఞానం ధారణ అవ్వాలి. మనం ఆత్మలము. ఇది ఆత్మల అకాల సింహాసనము. అలవాటైపోవాలి. మనం సోదరులము, సోదరునితో నేను మాట్లాడుతున్నాను. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు, గుడ్ నైట్ మరియు నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన-యోగాలనే సంజీవని మూలిక ద్వారా మాయ యొక్క అచేతనము నుండి స్వయాన్ని రక్షించుకుంటూ ఉండాలి. మన్మతముపై ఎప్పుడూ నడవకూడదు.

2. రూప్-బసంత్ గా అయి సేవ చేయాలి. తల్లిదండ్రులను ఫాలో చేసి సింహాసనాధికారిగా అవ్వాలి.

వరదానము:-

తమ శక్తిశాలి స్థితి ద్వారా దానము మరియు పుణ్యము చేసే పూజ్యనీయ మరియు గాయన యోగ్య భవ


అంతిమ సమయంలో ఎప్పుడైతే బలహీన ఆత్మలు, సంపూర్ణ ఆత్మలైన మీ ద్వారా ప్రాప్తిని కొద్దిగా అనుభవం చేసినా కూడా అంతిమ అనుభవం యొక్క సంస్కారాన్ని తీసుకువెళ్ళి అర్ధకల్పము కోసం తమ ఇంట్లో విశ్రాంతిగా ఉంటారు, తర్వాత మళ్ళీ ద్వాపరములో భక్తులుగా అయి మీకు పూజలు మరియు గాయనం చేస్తారు, అందుకే చివర్లో వచ్చే బలహీన ఆత్మల పట్ల మహాదానిగా, వరదానిగా అయి అనుభవాల దానాన్ని మరియు పుణ్యాన్ని చేయండి. క్షణం యొక్క శక్తిశాలి స్థితి ద్వారా చేసినటువంటి దానము మరియు పుణ్యము అర్ధకల్పము కోసం పూజ్యనీయంగా మరియు గాయన యోగ్యంగా చేస్తాయి.

స్లోగన్:-

పరిస్థితులలో గాభరా పడేందుకు బదులుగా సాక్షిగా అయినట్లయితే విజయులుగా అవుతారు.

 Download PDF

Post a Comment

0 Comments