11-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- బుద్ధి యోగాన్ని
తండ్రితో జోడిస్తూ
ఉన్నట్లయితే ఈ సుదీర్ఘ యాత్రను సహజముగానే
దాటి వేయగలుగుతారు’’
ప్రశ్న:-
తండ్రిపై బలిహారమయ్యేందుకు
ఏ విషయము యొక్క త్యాగము చాలా అవసరము?
జవాబు:-
దేహాభిమానము. దేహాభిమానం వచ్చిందంటే మరణిస్తారు, వ్యభిచారులుగా
అవుతారు, అందుకే బలిహారమవ్వడానికి పిల్లల హృదయము విదీర్ణమవుతుంది. బలిహారమయ్యారంటే ఇక వారొక్కరి స్మృతియే ఉండాలి. వారి పైనే బలిహారమవ్వాలి,
వారి శ్రీమతముపైనే
నడవాలి.
పాట:- రాత్రి ప్రయాణీకుడా... (రాత్ కే రాహీ...)
ఓం శాంతి. భగవానువాచ - భగవంతుడు తమ పిల్లలకు రాజయోగాన్ని మరియు జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. వారు మానవుడేమీ కారు. గీతలో శ్రీకృష్ణ భగవానువాచ అని రాయబడి ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు మొత్తం ప్రపంచమంతటినీ మాయ నుండి విముక్తులను చేయడము, ఇది సంభవం కాదు. ఎవరైతే తండ్రిని తమ వారిగా చేసుకున్నారో మరియు తండ్రి సమ్ముఖముగా కూర్చున్నారో,
ఆ పిల్లలకు స్వయముగా తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణుడిని తండ్రి అని అనలేము. తండ్రిని పరమపిత అని అంటారు,
వారు పరంధామంలో ఉంటారు. ఆత్మ ఈ శరీరము ద్వారా భగవంతుడిని తలచుకుంటుంది. తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు - మీ తండ్రినైన నేను పరంధామంలో ఉంటాను. నేను సర్వాత్మలకూ తండ్రిని. నేనే వచ్చి కల్పపూర్వము కూడా పిల్లలకు నేర్పించాను, బుద్ధి యోగాన్ని పరమపితనైన నాతో జోడించండి అని. ఆత్మలతో మాట్లాడడం జరుగుతుంది.
ఆత్మ ఎప్పటివరకైతే శరీరములోకి రాదో, అప్పటివరకు కనుల ద్వారా చూడలేదు, చెవుల ద్వారా వినలేదు. ఆత్మ లేకపోతే శరీరము జడమైపోతుంది.
ఆత్మ చైతన్యమైనది.
గర్భములో శిశువు ఉంటుంది కానీ ఎప్పటివరకైతే అందులోకి ఆత్మ ప్రవేశించదో అప్పటివరకు కదలికలు ఉండవు. కావున ఇటువంటి చైతన్య ఆత్మలతో తండ్రి మాట్లాడుతారు. వారు అంటారు, నేను ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నాను. నేను వచ్చి ఆత్మలందరినీ తిరిగి తీసుకువెళ్తాను. ఇంకా ఏ ఆత్మలైతే సమ్ముఖముగా ఉంటాయో వారికి రాజయోగము నేర్పిస్తాను. రాజయోగము మొత్తం ప్రపంచమంతా నేర్చుకోదు. కల్పపూర్వం వారే రాజయోగము నేర్చుకుంటున్నారు.
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, బుద్ధి యోగాన్ని తండ్రితో అంతిమం వరకు జోడిస్తూ ఉండాలి, ఇందులో ఎక్కడా ఆగిపోకూడదు. స్త్రీ,
పురుషులకు ముందు ఒకరి గురించి ఒకరికి ఏమీ తెలియదు.
తర్వాత ఎప్పుడైతే ఇరువురికీ నిశ్చితార్థము జరుగుతుందో, అప్పుడు కొందరు 60-70 సంవత్సరాలు కూడా కలిసి ఉంటారు, అలా జీవితమంతా ఒకరి దేహమును ఒకరు తలచుకుంటూ ఉంటారు. ఇతను నా పతి అని ఆమె అంటారు. ఈమె నా పత్ని అని అతను అంటారు. ఇప్పుడు మీ నిశ్చితార్థము నిరాకారునితో జరిగింది.
నిరాకారుడైన తండ్రే వచ్చి నిశ్చితార్థాన్ని చేయించారు. వారు అంటారు, కల్పపూర్వము వలె పిల్లలైన మీ నిశ్చితార్థాన్ని స్వయంతో జరిపిస్తాను.
నిరాకారుడినైన నేను ఈ మనుష్య సృష్టికి బీజరూపుడను. అందరూ అంటారు, ఈ మనుష్య సృష్టిని భగవంతుడైన తండ్రే రచించారు అని.
మీ తండ్రి సదా పరంధామంలో ఉంటారు. ఇప్పుడు వారు,
నన్ను స్మృతి చేయండి అని అంటారు.
ఈ యాత్ర చాలా సుదీర్ఘమైనదైన కారణముగా చాలా మంది పిల్లలు అలసిపోతారు.
బుద్ధి యోగాన్ని పూర్తిగా జోడించలేకపోతారు. మాయ దెబ్బలను ఎన్నో తినడం వలన అలసిపోతారు, మరణిస్తారు కూడా.
ఇక చేయి వదిలేస్తారు. కల్పపూర్వము కూడా ఇలాగే జరిగింది. ఇక్కడ ఎప్పటివరకైతే జీవించాలో అప్పటివరకు స్మృతి చేయాలి. పత్ని,
తన పతి మరణించినా కానీ అతడిని తలచుకుంటూనే ఉంటారు.
ఈ తండ్రి లేక పతి అలా వదిలివెళ్ళేవారైతే కారు. వారు అంటారు, నేను ప్రేయసులైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను. కానీ ఇందులో సమయం పడుతుంది, అలసిపోకూడదు. పాపాల భారము శిరస్సుపై ఎంతగానో ఉంది, అది యోగములో ఉండడం ద్వారానే తొలగుతుంది. యోగమనేది ఎలా ఉండాలంటే అంతిమంలో తండ్రి లేక ప్రియుడు తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు.
ఒకవేళ ఇంకెవరైనా గుర్తుకు వచ్చినట్లయితే అది వ్యభిచారీ అవుతుంది. అప్పుడిక పాపాల దండనను అనుభవించవలసి ఉంటుంది, అందుకే తండ్రి అంటారు, ఓ పరంధామం యొక్క యాత్రికులూ, అలసిపోకండి.
నేను బ్రహ్మా ద్వారా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నానని మరియు శంకరుని ద్వారా అన్ని ధర్మాల వినాశనాన్ని చేయిస్తానని మీకు తెలుసు. అన్ని ధర్మాలు కలిసి ఒక్కటిగా ఎలా అవుతాయి, అందరూ శాంతిగా ఎలా ఉంటారు, వీటికి దారిని కనుగొనాలి అని ఇప్పుడు కాన్ఫరెన్సులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అనేక ధర్మాలకు ఒకే మతము అనేది ఉండదు. ఒకే మతము ద్వారా ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. ఎప్పుడైతే అన్ని ధర్మాలు సర్వగుణ సంపన్నముగా,
సంపూర్ణ నిర్వికారిగా అవుతాయో అప్పుడు పరస్పరంలో క్షీర ఖండము వలె అవ్వగలరు. రామరాజ్యంలో అందరూ క్షీర ఖండము వలె ఉండేవారు. జంతువులు కూడా కొట్లాడుకునేవి కావు. ఇక్కడైతే ఇంటింటిలోనూ గొడవలు ఉన్నాయి. ఎప్పుడైతే వారికి నాథుడు అనేవారు ఎవరూ ఉండరో అప్పుడే కొట్లాడుకుంటూ ఉంటారు.
వారికి తమ మాత, పితలను గురించి తెలియదు. నీవే తల్లివి, తండ్రివి, మేము మీ పిల్లలము...
మీ కృప ద్వారా అపారమైన సుఖము లభిస్తుంది... అని గానం చేస్తారు కూడా.
ఆ సుఖ సంపద ఇప్పుడైతే లేదు. అందుకే మాత, పిత యొక్క కృప లేదు అని అంటారు. తండ్రి గురించి తెలియనే తెలియనప్పుడు ఇక ఆ తండ్రి ఎలా కృప చూపించగలరు? ఎప్పుడైతే శిక్షకుని డైరెక్షన్ అనుసారముగా నడుచుకుంటారో,
అప్పుడు కృప చూపించబడుతుంది. వారు సర్వవ్యాపి అని అనేస్తారు, మరి కృప ఎవరు చూపించాలి మరియు ఎవరిపై చూపించాలి? కృపను అందుకునేవారు మరియు చూపేవారు, ఇరువురూ కావాలి.
విద్యార్థులు వచ్చి మొదట టీచర్ వద్ద చదవాలి. ఈ కృపను తమపై తాము చూపించుకోవాలి. అయితే టీచర్ ఇచ్చే డైరెక్షన్స్ పై నడవాలి, అప్పుడు కృప చూపించడం జరుగుతుంది. పురుషార్థము చేయించేవారు కూడా కావాలి. వీరు తండ్రి కూడా, టీచర్ కూడా, అలాగే సద్గురువు కూడా.
వీరిని పరమపిత, పరమ శిక్షకుడు, పరమ సద్గురువు అని కూడా అంటారు. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పమూ ఈ స్థాపనా కార్యాన్ని చేయిస్తాను.
పతిత ప్రపంచాన్ని పావన ప్రపంచముగా తయారుచేస్తాను. వారు వరల్డ్ ఆల్మైటీ అథారిటీ కదా. కావున వరల్డ్ ఆల్మైటీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు. మొత్తం సృష్టి అంతటి పైనా ఒకే లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది. వారిది సర్వశక్తివంతమైన రాజ్యము. అక్కడ యుద్ధాలు-కొట్లాటలు మొదలైనవేవీ చేయరు. అక్కడ మాయ ఉండనే ఉండదు. అక్కడ ఉన్నదే స్వర్ణ యుగము,
వెండి యుగము. సత్య, త్రేతాయుగాలు రెండింటినీ స్వర్గము లేక వైకుంఠము అని అంటారు. అందరూ బృందావనానికి పదండి, రాధే-గోవిందులను భజించండి అని కూడా పాడుతారు. కానీ, అక్కడకు ఎవరూ వెళ్ళరు, కేవలం తలచుకుంటారు. ఇప్పుడు ఇది మాయా రాజ్యము.
అందరూ రావణుని మతముపై ఉన్నారు. చూడడానికి చాలా మంచి పెద్ద-పెద్ద వ్యక్తులు వస్తారు.
వారికి పెద్ద-పెద్ద టైటిల్స్ లభిస్తాయి.
ఏదో కాస్త దైహికమైన సాహసాన్ని చూపిస్తే లేక మంచి కర్మలేవైనా చేస్తే వారికి టైటిల్స్ లభిస్తాయి. కొందరికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని, కొందరికి ఇంకేవో... ఇలాంటి,
ఇలాంటి టైటిల్స్ ను ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. తప్పకుండా భారత్ యొక్క సేవలో ఉన్నారు. మీరు దైవీ రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఎప్పుడైతే స్థాపన పూర్తవుతుందో అప్పుడు మీకు సూర్యవంశీ రాజా-రాణి, చంద్రవంశీ రాజా-రాణి... అన్న టైటిల్స్ లభిస్తాయి. ఇక అప్పటి నుండి మీ రాజ్యం కొనసాగుతుంది.
అక్కడ ఎవరికీ టైటిల్స్ లభించవు. అక్కడ ఎవరి దుఃఖాన్ని అయినా దూరం చేయడానికి లేక ఏదైనా సాహసం చేసి చూపించి టైటిల్ తీసుకోవడానికి అక్కడ దుఃఖపు విషయమే ఉండదు. ఇక్కడి ఆచార,
వ్యవహారాలేవైతే ఉంటాయో అవి అక్కడ ఉండవు. లక్ష్మీ-నారాయణులు ఈ పతిత ప్రపంచములోకి రారు, ఈ సమయంలో ఎవరూ పావన దేవతలుగా లేరు.
ఇది ఉన్నదే పతిత ఆసురీ ప్రపంచము. అనేక మత-మతాంతరాలతో తికమక చెంది ఉన్నారు. ఇక్కడ ఒకే శ్రీమతము ఉంది, దీని ద్వారా రాజధాని స్థాపన జరుగుతోంది. నడుస్తూ, నడుస్తూ ఎవరికైనా మాయ ముల్లు గుచ్చుకుంటే కుంటడం మొదలుపెడతారు, అందుకే తండ్రి అంటారు, ఎల్లప్పుడూ శ్రీమతముపై నడవండి. మీ మన్మతముపై నడిచినట్లయితే మోసపోతారు.
సత్యమైన తండ్రి యొక్క మతముపై నడవడం ద్వారా సత్యమైన సంపాదన కలుగుతుంది. మీ మతముపై నడిచినట్లయితే నావ మునిగిపోతుంది. ఎంతోమంది మహావీరులు శ్రీమతముపై నడవని కారణముగా దుర్గతిని పొందారు.
ఇప్పుడు పిల్లలైన మీరు సద్గతిని పొందాలి. శ్రీమతముపై నడవకుండా దుర్గతిని పొందినట్లయితే తర్వాత ఎంతో పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. అప్పుడిక ధర్మరాజపురిలో శివబాబా ఈ తనువులో కూర్చొని ఏమని అర్థం చేయిస్తారంటే - నేను మీకు ఈ బ్రహ్మా తనువు ద్వారా ఇంతగా అర్థం చేయించాను, చదివించాను,
ఎంతగా కష్టపడ్డాను, మీరు శ్రీమతముపై నడుస్తాము అని నిశ్చయపత్రాన్ని వ్రాసారు కానీ నడవలేదు. శ్రీమతాన్ని ఎప్పుడూ వదలకూడదు. ఏమి జరిగినా తండ్రికి తెలియజేయడం ద్వారా మీకు అటెన్షన్ లభిస్తూ ఉంటుంది.
ఎప్పుడైతే తండ్రిని మర్చిపోతారో,
అప్పుడే ముల్లు గుచ్చుకుంటుంది. పిల్లలు సద్గతిని ఇచ్చే తండ్రి నుండి కూడా మూడు కోసుల దూరం పారిపోతారు. మీపై బలిహారమవుతాను అని గానం చేస్తారు కూడా.
కానీ ఎవరిపై?
సన్యాసులపై బలిహారమవుతాను లేక బ్రహ్మా, విష్ణు, శంకరులపై బలిహారమవుతాను లేక శ్రీకృష్ణునిపై బలిహారమవుతాను అని అయితే వ్రాయలేదు కదా!
పరమపిత పరమాత్మపైనే బలిహారమవ్వాలి, మనుష్యమాత్రులపై కాదు. వారసత్వము తండ్రి నుండే లభిస్తుంది. తండ్రి పిల్లలపై బలిహారమవుతారు. ఈ అనంతమైన తండ్రి కూడా అంటారు - నేను బలిహారమవ్వడానికి వచ్చాను. కానీ,
తండ్రిపై బలిహారమవ్వడానికి పిల్లల హృదయం ఎంతో విదీర్ణమవుతుంది. దేహాభిమానంలోకి వచ్చారంటే మరణిస్తారు, వ్యభిచారులుగా అవుతారు.
ఆ ఒక్కరి స్మృతియే ఉండాలి. వారిపైనే బలిహారమవ్వాలి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి. మిగిలిన మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరూ అయితే స్మశానగ్రస్తులుగా అవ్వనున్నారు.
వారినేమి స్మృతి చేస్తారు,
ఇందులో చాలా అభ్యాసం కావాలి. ఎక్కితే వైకుంఠ రసాన్ని ఆస్వాదిస్తారు... జోరుగా పడిపోతే పదవిని పోగొట్టుకుంటారు. అలాగని స్వర్గములోకి రారని కాదు కానీ రాజా-రాణులుగా అవ్వడానికి మరియు ప్రజలుగా అవ్వడానికి తేడా అయితే ఉంది కదా. ఇక్కడ ఉన్న ఆటవికులను చూడండి,
మినిస్టర్లను చూడండి - తేడా అయితే ఉంది కదా! పురుషార్థం పూర్తిగా చేయాలి. ఎవరైనా పడిపోతే పూర్తిగా పతితులుగా అయిపోతారు.
శ్రీమతముపై నడవలేకపోతే మాయ ముక్కు పట్టుకుని పూర్తిగా బురదలో పడేస్తుంది. బాప్ దాదాకు చెందినవారిగా అయి మళ్ళీ ద్రోహులుగా అవ్వడం అనగా వారిని ఎదిరించడము వంటిది, అందుకే తండ్రి అంటారు, అడుగడుగూ జాగ్రత్తగా వేయండి. ఇప్పుడు మాయ అంతం కానున్నది, కావున మాయ అనేకులను పడేస్తుంది,
అందుకే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ఈ మార్గం కాస్త సుదీర్ఘమైనది, పదవి కూడా చాలా గొప్పది. ఒకవేళ ద్రోహులుగా అయినట్లయితే శిక్ష కూడా చాలా భారీగా ఉంటుంది. ఎప్పుడైతే ధర్మరాజు అయిన బాబా శిక్షలను ఇస్తారో,
అప్పుడు చాలా ఆర్తనాదాలు చేస్తారు. అది కల్ప-కల్పానికి ఫిక్స్ అయిపోతుంది. మాయ చాలా ప్రబలమైనది.
తండ్రిని కాస్త అగౌరవపరిచినా మరణిస్తారు. సద్గురువుకు నింద తీసుకువచ్చేవారు ఉన్నత స్థానాన్ని, ఉన్నత పదవిని పొందలేరు. కామానికి వశమై, క్రోధానికి వశమై తప్పుడు పనులు చేస్తారు. అనగా తండ్రిని నిందింపజేస్తారు మరియు దండనకు నిమిత్తులుగా అవుతారు.
అడుగడుగునా పదమాల సంపాదన ఉంది అన్నప్పుడు, పదమాల నష్టము కూడా ఉంటుంది. సేవ ద్వారా జమ అవుతుంది, తప్పుడు కర్మల ద్వారా నష్టపోతారు కూడా.
బాబా వద్ద మొత్తం లెక్క అంతా ఉంటుంది. ఇప్పుడు సమ్ముఖముగా చదివిస్తున్నారు కావున మొత్తం లెక్క అంతా వారి అరచేతిలో ఉంటుంది. తండ్రి అంటారు - పిల్లలెవరూ శివబాబాను అగౌరవపరచకూడదు, అలా చేస్తే చాలా వికర్మ తయారవుతుంది. యజ్ఞ సేవలో ఎముక-ఎముకను ఇవ్వవలసి ఉంటుంది.
దధీచీ ఋషి ఉదాహరణ ఉంది కదా! ఆ విషయంలో కూడా పదవి తయారవుతుంది. లేదంటే ప్రజలలో కూడా భిన్న-భిన్న పదవులు ఉన్నాయి. ప్రజలలో కూడా నౌకర్లు మొదలైనవారందరూ కావాలి. అక్కడ దుఃఖము ఉండదు కానీ పదవులైతే నంబరువారుగా ఉంటాయి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
స్మృతి యాత్రలో అలసిపోకూడదు.
ఎటువంటి సత్యమైన స్మృతిని అభ్యాసము చేయాలంటే ఇక అంతిమ సమయంలో తండ్రి తప్ప ఇంకెవరూ గుర్తుకు రాకూడదు.
2.
సత్యమైన తండ్రి మతముపై నడుస్తూ సత్యమైన సంపాదనను చేసుకోవాలి. మీ మన్మతముపై నడవకూడదు. సద్గురువును ఎప్పుడూ నిందింపజేయకూడదు. కామానికి,
క్రోధానికి వశమై ఏ తప్పుడు పనులూ చేయకూడదు.
వరదానము:-
సంకల్ప శక్తి
ద్వారా ప్రతి
కార్యంలో సఫలతను
పొందే సిద్ధిని
ప్రాప్తి చేసుకునే
సఫలతా మూర్త్
భవ
సంకల్ప శక్తి ద్వారా చాలా కార్యాలు సహజంగా సఫలమవుతున్నాయనే సిద్ధి అనుభవమవుతుంది. ఎలాగైతే స్థూల ఆకాశంలో రకరకాల నక్షత్రాలను
చూస్తారో, అలా విశ్వ వాయుమండలం యొక్క ఆకాశంలో నలువైపులా సఫలత యొక్క ప్రకాశించే నక్షత్రాలు ఎప్పుడు కనిపిస్తాయంటే మీ సంకల్పాలు శ్రేష్ఠంగా మరియు శక్తిశాలిగా ఉన్నప్పుడు, సదా ఒక్క తండ్రి అంత్యములో స్వయాన్ని మైమరచి ఉన్నప్పుడు, మీ ఈ ఆత్మిక నేత్రాలు, ఆత్మిక మూర్తి దివ్య దర్పణంగా అయినప్పుడు. ఇటువంటి దివ్య దర్పణాలే అనేక ఆత్మలకు ఆత్మిక స్వరూపాన్ని అనుభవం చేయించే సఫలతా మూర్తులుగా అవుతారు.
స్లోగన్:-
నిరంతరం ఈశ్వరీయ సుఖాలను అనుభవం చేసేవారే చింతలేని చక్రవర్తులు.
0 Comments