Header Ads Widget

Header Ads

TELUGU MURLI 10.01.23

 

10-01-2023  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 


Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - ఇది మీ మరజీవా జన్మ, మీరు ఈశ్వరుడైన తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు, మీకు చాలా పెద్ద లాటరీ లభించింది, అందుకే అపారమైన సంతోషంలో ఉండాలి’’

ప్రశ్న:-

మీకు మీరు విషయాన్ని అర్థం చేయించుకున్నట్లయితే చింత సమాప్తమైపోతుంది, కోపము తొలగిపోతుంది?

జవాబు:-

మేము ఈశ్వరుని సంతానము, మేమైతే తండ్రి సమానంగా మధురంగా అవ్వాలి. బాబా విధంగా మధురమైన రూపంలో వివరిస్తారో, కోపం చేయరో, అలాగే మనం కూడా పరస్పరంలో మధురంగా ఉండాలి. ఉప్పు నీరులా అవ్వకూడదు ఎందుకంటే క్షణమైతే గతించిందో, అది డ్రామాలో పాత్ర. ఇక విషయం గురించి చింతించాలి. ఇలా-ఇలా మీకు మీరు అర్థం చేయించుకున్నట్లయితే చింత సమాప్తమైపోతుంది. కోపం పారిపోతుంది.

పాట:-  ఇదే వసంతము...(యహీ బహార్ హై...)

ఓంశాంతి. ఇది ఈశ్వరీయ సంతానము యొక్క సంతోషాల గురించిన గాయనము. మీరు ఇంతటి సంతోషం యొక్క గాయనమును సత్యయుగంలో చేయలేరు. ఇప్పుడు మీకు ఖజానా లభిస్తుంది. ఇది అన్నింటికన్నా పెద్ద లాటరీ. ఎప్పుడైతే లాటరీ లభిస్తుందో, అప్పుడు సంతోషం కలుగుతుంది. మీరు మళ్ళీ లాటరీ ద్వారా జన్మ-జన్మాంతరాలు స్వర్గంలో సుఖం అనుభవిస్తూ ఉంటారు. ఇది మీ మరజీవా జన్మ. ఎవరైతే జీవిస్తూనే మరణించరో, వారిది మరజీవా జన్మ అని అనరు. వారికైతే సంతోషపు పాదరసం కూడా ఎక్కదు. ఎప్పటివరకైతే మరజీవాగా అవ్వరో అనగా తండ్రిని తమవారిగా చేసుకోలేదో, అప్పటివరకు పూర్తి వారసత్వము కూడా లభించదు. ఎవరైతే తండ్రికి చెందినవారిగా అవుతారో, ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తారో, వారిని తండ్రి కూడా స్మృతి చేస్తారు. మీరు ఈశ్వరీయ సంతానము. మీకు నషా ఉంది, మేము తండ్రి అయిన ఈశ్వరుడి నుండి వారసత్వం లేక వరం తీసుకుంటున్నాము, దాని కోసమే భక్తులు భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. తండ్రిని కలుసుకునేందుకు అనేకానేక ఉపాయాలు చేస్తూ ఉంటారు. ఎన్ని వేదాలు, శాస్త్రాలు, మ్యాగజీన్ మొదలైనవి లెక్కలేనన్ని చదువుతూ ఉంటారు. కానీ ప్రపంచమైతే రోజు రోజుకు దుఃఖితముగానే అవుతూ ఉంటుంది, ఇది తమోప్రధానంగా అవ్వాల్సిందే. ఇది ముళ్ళ వృక్షం కదా. బబుల్ నాథుడు మళ్ళీ వచ్చి ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తారు. ముళ్ళు చాలా పెద్ద-పెద్దవిగా అయ్యాయి. చాలా గట్టిగా గుచ్చుకుంటాయి. వాటికి అనేక రకాల పేర్లు ఇవ్వబడి ఉన్నాయి. సత్యయుగంలోనైతే ఉండవు. తండ్రి అర్థం చేయిస్తారు - ఇది ముళ్ళ ప్రపంచము. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. ఇంట్లో కొడుకులు కూడా ఎటువంటి కుపుత్రులుగా అవుతారు అంటే ఇక అడగకండి. తల్లిదండ్రులను చాలా దుఃఖితులుగా చేస్తారు. అందరూ ఒకే విధంగా కూడా ఉండరు. అందరికన్నా ఎక్కువగా దుఃఖాన్ని ఇచ్చేవారు ఎవరు? ఇది మనుష్యులకు తెలియదు. తండ్రి అంటారు, గురువులు పరమాత్మ మహిమను మాయం చేసేసారు. మనమైతే వారికి చాలా మహిమ చేస్తాము. వారు పరమ పూజ్యులైన పరమపిత పరమాత్మ. శివుని చిత్రము కూడా చాలా బాగుంది. కానీ చాలామంది ఎలా ఉంటారంటే వారు, శివుడు విధంగా జ్యోతిర్బిందువు అని అంగీకరించరు ఎందుకంటే వారైతే ఆత్మే పరమాత్మ అని అంటారు. ఆత్మ అతి సూక్ష్మమైనది, అది భృకుటి మధ్యలో కూర్చుని ఉంది, మరి పరమాత్మ ఇంత పెద్ద ఆకారము కలవారిగా ఎలా అవ్వగలరు? చాలామంది విద్వాంసులు, ఆచార్యులు - పరమాత్మకైతే ఇటువంటి రూపము ఉండదని బి.కె.లను పరిహాసం చేస్తారు. వారైతే అఖండ జ్యోతిర్మయ తత్వము, వేల సూర్యుల కన్నా కూడా తేజోమయుడు అని అంటారు. వాస్తవానికి ఇది తప్పు. వారి సరైన మహిమనైతే తండ్రే స్వయంగా తెలియజేస్తారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు. సృష్టి తలక్రిందులుగా ఉండే ఒక వృక్షము వంటిది. సత్య, త్రేతాయుగాలలో వారిని ఎవరూ స్మృతి చేయరు. మనుష్యులకు ఎప్పుడైతే దుఃఖం కలుగుతుందో, అప్పుడు - భగవంతుడా, పరమపిత పరమాత్మ, దయ చూపించండి అని వారిని స్మృతి చేస్తారు. సత్య, త్రేతాయుగాలలోనైతే దయను కోరుకునేవారు ఎవరూ ఉండరు. అది రచయిత అయిన తండ్రి యొక్క కొత్త రచన. తండ్రి మహిమయే అపరిమితమైనది. వారు జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు. జ్ఞాన సాగరుడు కావున తప్పకుండా జ్ఞానము ఇచ్చి ఉంటారు. వారు సత్, చిత్, ఆనంద స్వరూపుడు, చైతన్యమైనవారు. జ్ఞానాన్ని అయితే చైతన్యమైన ఆత్మే ధారణ చేస్తుంది. మనం శరీరం విడిచిపెట్టి వెళ్ళామనుకోండి, ఆత్మలో జ్ఞానం యొక్క సంస్కారాలైతే ఉండనే ఉంటాయి. కొడుకుగా అయినా కూడా సంస్కారాలే ఉంటాయి, కానీ ఇంద్రియాలు చిన్నవిగా ఉంటాయి కావున మాట్లాడలేరు. ఇంద్రియాలు పెద్దవిగా అయినప్పుడు స్మృతి చేయించడము జరుగుతుంది, అప్పుడు స్మృతిలోకి వస్తుంది. చిన్న పిల్లలు కూడా శాస్త్రాలు మొదలైనవి కంఠస్థం చేస్తారు. ఇవన్నీ గత జన్మ సంస్కారాలు. ఇప్పుడు తండ్రి మనకు తమ జ్ఞానం యొక్క వారసత్వం ఇస్తారు. మొత్తం సృష్టి యొక్క జ్ఞానం వీరి వద్ద ఉంది ఎందుకంటే వీరు బీజరూపుడు. మనం స్వయాన్ని బీజరూపులము అని అనము. బీజములో తప్పకుండా వృక్షం యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం ఉంటుంది కదా. కావున తండ్రి స్వయంగా అంటారు, నేను సృష్టికి బీజరూపుడిని. వృక్షానికి బీజము పైన ఉంది. తండ్రి సత్, చిత్, ఆనంద స్వరూపుడు, జ్ఞాన సాగరుడు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమే వారిలో ఉంటుంది. లేదంటే ఏముంటుంది! శాస్త్రాల జ్ఞానం ఏమైనా ఉంటుందా? అదైతే చాలామందిలో ఉంది. పరమాత్మదైతే తప్పకుండా ఏదో కొత్త విషయమే ఉంటుంది కదా. అది విద్వాంసులు మొదలైనవారికి తెలియదు. ఎవరినైనా అడగండి - సృష్టి రూపీ వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన, అంతము ఎలా జరుగుతుంది, దీని ఆయువు ఎంత ఉంటుంది, ఇది ఎలా వృద్ధి చెందుతుంది... ఇది ఎవ్వరూ మాత్రమూ అర్థం చేయించలేరు.

ఒక్క గీతయే సర్వ శాస్త్రమయీ శిరోమణి, మిగిలినవన్నీ దాని పిల్లలు. మరి గీతను చదవడం ద్వారానే ఏమీ అర్థం చేసుకోనప్పుడు ఇక మిగిలిన శాస్త్రాలను చదవడం వలన లాభమేముంటుంది? వారసత్వమైతే గీత నుండే లభించనున్నది. ఇప్పుడు తండ్రి మొత్తం డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు. తండ్రి రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా చేసి పారసనాథులుగా తయారుచేస్తారు. ఇప్పుడైతే అందరూ రాతిబుద్ధి కలవారిగా, రాతినాథులుగా ఉన్నారు. కానీ వారు స్వయానికి గొప్ప-గొప్ప టైటిళ్ళను ఇచ్చుకొని స్వయాన్ని పారసబుద్ధి కలవారిగా భావిస్తూ కూర్చున్నారు. తండ్రి అర్థం చేయిస్తారు, నా మహిమ అందరికన్నా అతీతమైనది. నేను జ్ఞాన సాగరుడిని, ఆనంద సాగరుడిని, సుఖ సాగరుడిని. ఇటువంటి మహిమను మీరు దేవతలకు చేయలేరు. భక్తులు దేవతల ఎదురుగా వెళ్ళి మీరు సర్వ గుణ సంపన్నులు... అని అంటారు. తండ్రికైతే మహిమ ఒక్కటే. అది కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనం మందిరంలోకి వెళ్తే, వీరైతే పూర్తి 84 జన్మలు తీసుకొని ఉంటారని బుద్ధిలో పూర్తి జ్ఞానము ఉంటుంది. ఇప్పుడు మనకు ఎంత సంతోషము ఉంది. ఇంతకుముందు ఆలోచన ఏమైనా వచ్చేదా. మేము విధంగా తయారవ్వాలని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బుద్ధిలో చాలా పరివర్తన వచ్చేస్తుంది.

తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు - పరస్పరంలో చాలా మధురంగా అవ్వండి, ఉప్పు నీరులా అవ్వకండి. బాబా ఎప్పుడైనా, ఎవరిపైన అయినా కోపం చేస్తారా? చాలా మధురమైన రూపంలో వివరిస్తారు. ఒక్క క్షణం గడిచిపోయింది అంటే ఇది కూడా డ్రామాలో పాత్ర అని అంటారు. దాని గురించి ఏం చింతించాలి. ఇలా-ఇలా స్వయానికి అర్థం చేయించుకోవాలి. మీరు ఈశ్వరీయ సంతానము, మీరు ఏమైనా తక్కువా. ఇదైతే అర్థం చేసుకోగలరు, ఈశ్వరీయ సంతానం తప్పకుండా ఈశ్వరుని వద్ద ఉండి ఉండవచ్చు. ఈశ్వరుడు నిరాకారుడైతే వారి సంతానము కూడా నిరాకారులే. సంతానమే ఇక్కడ వస్త్రం తీసుకొని పాత్రను అభినయిస్తారు. స్వర్గంలో మనుష్యులు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. ఒకవేళ కూర్చొని అందరి లెక్కను తీసినట్లయితే ఎంతగా కష్టపడవలసి ఉంటుంది. కానీ నంబరువారుగా సమయానుసారంగా కొన్ని-కొన్ని జన్మలు లభిస్తూ ఉండవచ్చునని అర్థం చేసుకోగలరు. ఇంతకుముందు అయితే మనుష్యులు కుక్క, పిల్లిగా అవుతారని భావించేవారు. ఇప్పుడైతే బుద్ధిలో రాత్రికి, పగలుకి ఉన్నంత తేడా వచ్చేసింది. ఇవన్నీ ధారణ చేయాల్సిన విషయాలు. ఇప్పుడు మన 84 జన్మల చక్రం పూర్తయిందని క్లుప్తంగా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఛీ-ఛీ శరీరాన్ని విడిచిపెట్టాలి. ఇది అందరి పాత, శిథిలావస్థకు చెందిన, తమోప్రధాన శరీరము, దీనిపై మమకారం తొలగించాలి. పాత శరీరాన్ని ఏం స్మృతి చేస్తాము. ఇప్పుడైతే తమ కొత్త శరీరాన్ని స్మృతి చేయాలి, అది సత్యయుగంలో లభించనున్నది. ముక్తిధామం ద్వారా సత్యయుగంలోకి వస్తాము. మనం జీవన్ముక్తిలోకి వెళ్తాము మరియు అందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. దీనిని జయ-జయకారాలు అని అంటారు, హాహాకారాల తర్వాత జయ-జయకారాలు జరగనున్నాయి. ఇంతమంది మరణిస్తారు, ఎవరో అయితే నిమిత్తంగా కారణము అవుతారు. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. కేవలం సాగరమే అన్ని ఖండాలను ఏమైనా సమాప్తం చేసేస్తుందా. అంతా సమాప్తమైతే అవ్వాల్సిందే. ఇకపోతే, అవినాశీ ఖండమైన భారత్ మిగులుతుంది ఎందుకంటే ఇది శివబాబా జన్మస్థానము. కావున ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థ స్థానము అయ్యింది. తండ్రి అందరికీ సద్గతినిస్తారు, ఇది మనుష్యులెవ్వరికీ తెలియదు. వారు తెలుసుకోకపోవడమే డ్రామాలో రచించబడి ఉంది. అందుకే తండ్రి అంటారు, పిల్లలూ, మీకు ఏమీ తెలిసేది కాదు, నేనే మీకు రచయిత మరియు రచన లేక మనుష్య సృష్టి ఆది మధ్యాంతాల భేదమంతటినీ అర్థం చేయిస్తాను. దానిని ఋషులు, మునులు కూడా అంతము లేనిది, అంతము లేనిది అంటూ వెళ్ళారు. మొత్తం ప్రపంచానికి 5 వికారాలు చాలా పెద్ద శత్రువులని ఏమైనా అర్థం చేసుకుంటారా. రావణుడినైతే భారతవాసులు ప్రతి సంవత్సరం కాలుస్తూనే వస్తారు, అతడిని గురించి ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే అతడు దైహికమైనవారు కాదు, ఆత్మికమైనవారు కాదు. వికారాలకైతే రూపము ఉండనే ఉండదు. మనుష్యులు పాత్రలోకి వచ్చినప్పుడే వీరిలో కామము యొక్క, క్రోధము యొక్క భూతము వచ్చిందని తెలుస్తుంది. వికారాల స్థితులలో కూడా ఉత్తమము, మధ్యమము, కనిష్ఠము ఉంటాయి. కొందరిలో కామం యొక్క నషా పూర్తిగా తమోప్రధానంగా అయిపోతుంది, కొందరిలో రజో నషా, కొందరిలో సతో నషా ఉంటుంది. కొందరైతే బాల బ్రహ్మచారులుగా కూడా ఉంటారు. సంభాళించడాన్ని కూడా ఒక జంజాటము అని భావిస్తారు. అందరికన్నా మంచివారని వారినే అంటారు. సన్యాసులలో కూడా బాల బ్రహ్మచారులు మంచివారిగా లెక్కించబడతారు. గవర్నమెంటు కోసం కూడా ఇది మంచిది, పిల్లల వృద్ధి జరగదు. పవిత్రత యొక్క శక్తి లభిస్తుంది. ఇది గుప్తమైనది. సన్యాసులు కూడా పవిత్రంగా ఉంటారు, చిన్న పిల్లలు కూడా పవిత్రంగా ఉంటారు, వానప్రస్థులు కూడా పవిత్రంగా ఉంటారు. కావున పవిత్రత యొక్క బలం లభిస్తూనే ఉంటుంది. పిల్లలు ఇంత ఆయువు వరకు పవిత్రంగా ఉండాలి అన్న వారి నియమం కూడా కొనసాగుతూ ఉంటుంది. కావున బలం కూడా లభిస్తుంది. మీరు సతోప్రధానమైన పవిత్రులు. అంతిమ జన్మ మీరు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు. మీరు సత్యయుగాన్ని స్థాపన చేసేవారు. ఎవరైతే చేస్తారో వారు నంబరువారు పురుషార్థానుసారంగా పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు.

ఇది ఈశ్వరీయ కుటుంబము. ఈశ్వరునితో మనం కల్పంలో ఒకసారే ఉంటాము. మళ్ళీ దైవీ వంశంలోనైతే అనేక జన్మలు ఉంటాము. ఒక్క జన్మయే దుర్లభమైనది. ఈశ్వరీయ కులము ఉత్తమోత్తమమైనది. బ్రాహ్మణ కులము అన్నింటికన్నా ఉన్నతమైన పిలక వంటిది. నీచాతి నీచమైన కులం నుండి మనం ఉన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందినవారిగా అయ్యాము. శివబాబా ఎప్పుడైతే బ్రహ్మాను రచించారో, అప్పుడే బ్రాహ్మణులను రచించారు. ఎవరైతే బాబా సేవలో ఉంటారో వారికి ఎంత సంతోషముంటుంది - మేము ఈశ్వరీయ సంతానంగా అయ్యాము మరియు ఈశ్వరుని శ్రీమతంపై నడుస్తున్నాము. తమ నడవడిక ద్వారా వారి పేరును ప్రఖ్యాతం చేస్తారు. బాబా అంటారు, వారైతే ఆసురీ గుణాలు కలవారు, మీరు దైవీ గుణాలు కలవారిగా అవుతున్నారు. ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా అవుతారో, అప్పుడు మీ నడవడిక చాలా మంచిగా అవుతుంది. బాబా అంటారు, వీరు నంబరువారు పురుషార్థానుసారంగా దైవీ గుణాలు కలవారు. ఆసురీ గుణాలు కలవారు కూడా నంబరువారుగా ఉన్నారు. బాల బ్రహ్మచారులు కూడా ఉన్నారు. సన్యాసులు పవిత్రంగా ఉంటారు, అదైతే చాలా మంచిది. ఇకపోతే, వారు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. ఒకవేళ గురువులు ఎవరైనా సద్గతిని ఇచ్చేవారైనట్లయితే తోడుగా తీసుకువెళ్తారు, కానీ స్వయమే విడిచి వెళ్ళిపోతారు. ఇక్కడ తండ్రి అంటారు, నేను మిమ్మల్ని తోడుగా తీసుకువెళ్తాను. మిమ్మల్ని తోడుగా తీసుకువెళ్ళేందుకే నేను వచ్చాను. వారైతే తీసుకువెళ్ళరు. స్వయమే గృహస్థుల వద్ద జన్మ తీసుకుంటూ ఉంటారు. సంస్కారాల కారణంగా మళ్ళీ సన్యాసుల గుంపులోకి వెళ్ళిపోతారు. నామ రూపాలైతే ప్రతి జన్మలోనూ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, సత్యయుగంలో ఇక్కడి పురుషార్థం అనుసారంగా పదవి ఉంటుంది. మనం పదవిని ఎలా పొందామో అక్కడ తెలియదు. అది ఇప్పుడే తెలుస్తుంది, కల్పక్రితము ఎవరు విధంగా పురుషార్థము చేసారో, అలాగే ఇప్పుడు చేస్తారు. అక్కడ వివాహము మొదలైనవి ఎలా జరుగుతాయి అన్నది పిల్లలకు సాక్షాత్కారం కూడా చేయించడము జరిగింది. పెద్ద-పెద్ద మైదానాలు, తోటలు మొదలైనవి ఉంటాయి. ఇప్పుడైతే భారత్ లోనే కోట్ల జనాభా ఉంది. అక్కడైతే కొన్ని లక్షల మంది మాత్రమే ఉంటారు. అక్కడ ఇన్ని అంతస్తులు కల ఇళ్ళు ఏమైనా ఉంటాయా. అవి ఇప్పుడు ఉంటాయి ఎందుకంటే స్థలం లేదు. అక్కడ ఇంతటి చలి ఉండదు. అక్కడ దుఃఖం గుర్తులు కూడా ఉండవు. పర్వతాల దగ్గరకు వెళ్ళాల్సి వచ్చేలా చాలా వేడి ఉండదు. పేరే ఉంది స్వర్గము. సమయంలో మనుష్యులు ముళ్ళ అడవిలో ఉన్నారు. ఎంతగా సుఖాన్ని కోరుకుంటూ ఉంటారో, అంతగా దుఃఖం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు చాలా దుఃఖం ఉంటుంది. యుద్ధం జరిగితే రక్తపు నదులు ప్రవహిస్తాయి. అచ్ఛా.

మురళీని పిల్లలందరి ఎదురుగా వినిపించారు. సమ్ముఖంలో వినడము నంబరువన్, టేపు ద్వారా వినడము నంబరు టూ, మురళీ ద్వారా చదవడము నంబరు త్రీ. సతోప్రధానము, సతో మరియు రజో. తమో అని అయితే అనరు. టేపులో అలాగే వస్తుంది, అచ్ఛా.

బాప్ దాదా మరియు మధురమైన తల్లి యొక్క సికీలధే పిల్లలకు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీ నడవడిక ద్వారా లేక దైవీ గుణాల ద్వారా తండ్రి పేరును ప్రఖ్యాతి చేయాలి. ఆసురీ అవగుణాలను తొలగించాలి.

2. పాత శిథిలావస్థకు చెందిన శరీరముపై మమకారము పెట్టుకోకూడదు. కొత్త సత్యయుగీ శరీరాన్ని స్మృతి చేయాలి. పవిత్రత యొక్క గుప్త సహాయం చేయాలి.

వరదానము:-

ఆత్మికత యొక్క శక్తి ద్వారా దూరంగా ఉండే ఆత్మలకు సమీపత యొక్క అనుభవం చేయించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ


ఎలాగైతే సైన్స్ సాధనాల ద్వారా దూరంగా ఉండే ప్రతి వస్తువు సమీపంగా అనుభవమవుతుంది, అలాగే దివ్య బుద్ధి ద్వారా దూరంగా ఉన్న వస్తువును సమీపంగా అనుభవం చేయవచ్చు. ఎలాగైతే తమతో పాటు ఉండే ఆత్మలను స్పష్టంగా చూస్తారో, మాట్లాడుతారో, సహయోగమిస్తారో మరియు తీసుకుంటారో, అలాగే ఆత్మికత యొక్క శక్తి ద్వారా దూరంగా ఉండే ఆత్మలకు సమీపతను అనుభవం చేయించగలరు. కేవలం దీని కోసం మాస్టర్ సర్వశక్తివాన్, సంపన్న మరియు సంపూర్ణ స్థితిలో స్థితులై ఉండండి మరియు సంకల్ప శక్తిని స్వచ్ఛంగా చేసుకోండి.

స్లోగన్:-

తమ ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ ద్వారా ఇతరులకు ప్రేరణనిచ్చేవారే ప్రేరణామూర్తులు.

 Download PDF

Post a Comment

0 Comments