09-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- మరజీవాగా అయినట్లయితే అన్నింటినీ మర్చిపోండి, ఒక్క తండ్రి
ఏదైతే వినిపిస్తారో, అదే వినండి
మరియు తండ్రిని
స్మృతి చేయండి
- మీ సాంగత్యములోనే కూర్చుంటాము’’
ప్రశ్న:-
సద్గతిదాత అయిన తండ్రి పిల్లల సద్గతి కోసం ఏ శిక్షణ ఇస్తారు?
జవాబు:-
బాబా అంటారు - పిల్లలూ, సద్గతిలోకి వెళ్ళేందుకు
అశరీరిగా అయి తండ్రిని మరియు చక్రాన్ని స్మృతి చేయండి. యోగముతో మీరు సదా ఆరోగ్యవంతులుగా,
నిరోగులుగా అవుతారు. తర్వాత మీరు ఏ కర్మలకు పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండదు.
ప్రశ్న:-
ఎవరి భాగ్యములోనైతే
స్వర్గ సుఖాలు ఉండవో, వారి గుర్తులేమిటి?
జవాబు:-
వారు జ్ఞానం వినేందుకు మా వద్ద తీరికే లేదు అని అంటారు. వారెప్పుడూ బ్రాహ్మణ కులం యొక్క సభ్యులుగా అవ్వరు. భగవంతుడు కూడా ఏదో ఒక రూపములో ఏదో ఒక సమయంలో వస్తారు అన్నది వారికి తెలియనే తెలియదు.
పాట:- నిన్ను పిలవాలని మనసు కోరుకుంటోంది... (తుమ్హారే బులానే కో జీ చాహ్తా హై...)
ఓంశాంతి. భగవంతుడు కూర్చుని భక్తులకు అర్థం చేయిస్తారు. భక్తులు భగవంతుని పిల్లలు. అందరూ భక్తులు, తండ్రి ఒక్కరే.
కావున పిల్లలు ఒక్క జన్మ అయినా తండ్రితోపాటు ఉండి చూడాలని కోరుకుంటారు. దేవతలతో కూడా చాలా జన్మలు గడిచాయి. ఆసురీ సంప్రదాయంవారితో కూడా చాలా జన్మలు గడిచాయి.
ఇప్పుడు భక్తులకు - ఒక్క జన్మ అయినా భగవంతునికి చెందినవారిగా అయి భగవంతునితోపాటు ఉండి చూడాలి అని మనసుకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు భగవంతునికి చెందినవారిగా అయ్యారు, మరజీవాగా అయ్యారు కావున భగవంతునితోపాటు ఉంటారు. ఈ అమూల్యమైన అంతిమ జీవితం ఏదైతే ఉందో, ఇందులో మీరు పరమపిత పరమాత్మతోపాటు ఉంటారు.
నీతోనే తింటాను, నీతోనే కూర్చుంటాను, నీ నుండే వింటాను... అని గాయనం కూడా ఉంది. ఎవరైతే మరజీవాగా అవుతారో, వారి కోసం ఈ జన్మలో తోడుగా ఉండాల్సి ఉంటుంది. ఈ ఒక్క జన్మయే ఉన్నతోన్నతమైన జన్మ. తండ్రి కూడా ఒక్కసారే వస్తారు, మళ్ళీ ఎప్పుడూ రాలేరు. ఒక్కసారే వచ్చి పిల్లల సర్వ కామనలను పూర్తి చేస్తారు.
భక్తి మార్గంలో చాలా యాచిస్తారు. సాధు-సన్యాసులు, మహాత్ములు, దేవీ-దేవతలు మొదలైనవారి నుండి అర్ధకల్పం నుండి యాచిస్తూనే ఉంటారు మరియు ఇంకొకటి, జప తపాదులు, దాన పుణ్యాలు మొదలైనవి కూడా జన్మ-జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చారు. ఎన్ని శాస్త్రాలను చదువుతారు. అనేకానేక శాస్త్రాలు, మ్యాగజైన్లు మొదలైనవాటిని తయారుచేస్తూ అలసిపోనే అలసిపోరు.
వీటి ద్వారానే భగవంతుడు లభిస్తారని భావిస్తారు,
కానీ ఇప్పుడు తండ్రి స్వయంగా అంటారు
- మీరు జన్మ-జన్మాంతరాలుగా ఏదైతే చదివారో మరియు ఇప్పుడు ఈ శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదువుతున్నారో, వీటి ద్వారా నా ప్రాప్తి ఏమీ జరగదు. పుస్తకాలు మొదలైనవి చాలా ఉన్నాయి.
క్రిస్టియన్లు కూడా ఎంతగా నేర్చుకుంటారు. అనేక భాషలలో చాలా రాస్తూనే ఉంటారు. మనుష్యులు చదువుతూనే ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఏదైతే చదివారో అదంతా మర్చిపోండి లేక బుద్ధి ద్వారా అంతం చేయండి. చాలా పుస్తకాలు చదువుతారు. పుస్తకాలలో ఫలానా భగవంతుడు, ఫలానా అవతారము అని ఉంది. ఇప్పుడు తండ్రి అంటారు, నేను స్వయంగా వస్తాను, కావున ఎవరైతే నా వారిగా అవుతారో వారితో,
వీటన్నింటినీ మర్చిపోండి అని నేను చెప్తాను.
మొత్తం ప్రపంచం యొక్క బుద్ధిలో మరియు మీ బుద్ధిలో ఏ విషయమైతే లేదో, ఇప్పుడు దానిని నేను మీకు వినిపిస్తాను.
ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు, తప్పకుండా బాబా ఏదైతే అర్థం చేయిస్తారో అది శాస్త్రాలు మొదలైనవాటిలో ఏమీ లేదు. తండ్రి చాలా గుహ్యమైన మరియు రమణీకమైన విషయాలను అర్థం చేయిస్తారు. డ్రామా ఆది మధ్యాంతాలు,
రచయిత మరియు రచనల సమాచారమంతా మీకు వినిపిస్తారు. మళ్ళీ అంటారు, అచ్ఛా, ఎక్కువగా కాకపోతే రెండు పదాలనే గుర్తుంచుకోండి - మన్మనాభవ,
మధ్యాజీభవ. ఈ పదాలైతే భక్తి మార్గపు గీతకు సంబంధించినవి, కానీ తండ్రి వీటి అర్థాన్ని మంచి రీతిలో అర్థం చేయిస్తారు. భగవంతుడైతే సహజ రాజయోగం నేర్పించారు, కేవలం తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని అంటారు. భక్తిలో కూడా చాలా స్మృతి చేసేవారు. దుఃఖములో అందరూ స్మరిస్తారు... అని పాడుతారు కూడా. అయినా కూడా ఏమీ అర్థం చేసుకోరు. తప్పకుండా సత్య,
త్రేతాయుగాలలో సుఖం యొక్క ప్రపంచము ఉన్నప్పుడు స్మృతి ఎందుకు చేస్తారు?
ఇప్పుడు మాయ రాజ్యములో దుఃఖం కలిగినప్పుడు తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది మరియు మళ్ళీ సత్యయుగములోని అపారమైన సుఖము కూడా గుర్తుకొస్తుంది. ఆ సుఖం యొక్క ప్రపంచములో, ఎవరైతే తండ్రి ద్వారా సంగమయుగములో రాజయోగాన్ని మరియు జ్ఞానాన్ని నేర్చుకున్నారో వారే ఉండేవారు. పిల్లలలో చూడండి - ఎంతమంది చదువుకోలేనివారు ఉన్నారు. వారి కోసమైతే ఇంకా మంచిది, ఎందుకంటే బుద్ధి ఎక్కడికి వెళ్ళదు. ఇక్కడైతే కేవలం నిశ్శబ్దముగా ఉండాలి.
నోటితో కూడా ఏమీ చెప్పనవసరం లేదు.
కేవలం బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మళ్ళీ తోడుగా తీసుకువెళ్తారు. ఈ విషయాలు ఎన్నో కొన్ని గీతలో ఉన్నాయి. ప్రాచీన భారత్ యొక్క ధర్మ శాస్త్రము ఒకటే ఉంటుంది. ఇదే భారత్ కొత్తగా ఉండేది,
ఇప్పుడు పాతదిగా అయ్యింది.
శాస్త్రమైతే ఒకటే ఉంటుంది. ఎలాగైతే బైబిల్ ఒకటే ఉంటుంది,
ఎప్పటి నుండైతే క్రిస్టియన్ ధర్మం స్థాపన జరిగిందో,
అప్పటి నుండి అంతిమం వరకు వారి శాస్త్రము ఒక్కటే.
క్రైస్ట్ ను కూడా చాలా మహిమ చేస్తారు. వారు శాంతిని స్థాపన చేసారని అంటారు. ఇప్పుడు వారైతే వచ్చి క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేసారు, అందులో శాంతి విషయమైతే లేనే లేదు. ఎవరైతే వస్తారో, వారి మహిమను చేస్తూ ఉంటారు ఎందుకంటే తమ మహిమను మర్చిపోయారు. బౌద్ధులు,
క్రిస్టియన్లు మొదలైనవారు తమ ధర్మాన్ని విడిచి ఇతరుల మహిమను చేయరు. భారతవాసులకు తమ ధర్మమైతే లేనే లేదు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. ఎప్పుడైతే పూర్తి నాస్తికులుగా అవుతారో,
అప్పుడే మళ్ళీ తండ్రి వస్తారు.
తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలు, స్కూళ్ళు మొదలైనవాటిలో ఏ పుస్తకాలనైతే చదివించడము జరుగుతుందో,
అందులో కనీసం లక్ష్యము-ఉద్దేశ్యము ఉంటుంది.
వాటి వలన లాభము ఉంది, సంపాదన జరుగుతుంది, పదవి లభిస్తుంది. ఇకపోతే, శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదువుతారో, దానిని అంధ విశ్వాసము అని అంటారు. చదువును ఎప్పుడూ కూడా అంధ విశ్వాసము అని అనరు. అంధ విశ్వాసముతో చదువుతారని కాదు.
చదువు ద్వారా బారిస్టర్,
ఇంజనీర్ మొదలైనవారిగా అవుతారు,
దానిని అంధ విశ్వాసమని ఎలా అంటారు. ఇది కూడా పాఠశాల. ఇది సత్సంగమేమీ కాదు. ఈశ్వరీయ విశ్వ విద్యాలయము అని రాసి ఉంది. కావున అర్థం చేయించాలి, తప్పకుండా ఈశ్వరునిది చాలా పెద్ద విద్యాలయము అయి ఉంటుంది. అది కూడా విశ్వం కోసం ఉంటుంది. దేహ సహితంగా అన్ని ధర్మాలను విడిచి తమ స్వధర్మములో స్థితులవ్వండి మరియు తమ తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుందని అందరికీ సందేశం కూడా ఇవ్వాలి. ఎంత సమయం నేను యోగంలో ఉంటున్నానని తమ చార్టు రాయాలి. ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా చార్టును రాస్తారని కాదు.
అలా రాయరు,
అలసిపోతారు. వాస్తవానికి ఏం చేయాలి? రోజూ మీ ముఖాన్ని అద్దంలో చూసుకోవాలి, అప్పుడు తెలుస్తుంది
- నేను లక్ష్మిని లేక సీతను వరించేందుకు యోగ్యునిగా ఉన్నానా లేక ప్రజలలోకి వెళ్తానా? పురుషార్థాన్ని తీవ్రంగా చేయించేందుకే చార్టు రాయమని చెప్పడం జరుగుతుంది మరియు నేను ఎంత సమయం శివబాబాను స్మృతి చేసాను అన్నది చూసుకోగలరు కూడా. మొత్తం దినచర్య ఎదురుగా వచ్చేస్తుంది. ఎలాగైతే బాల్యం నుండి మొదలుకొని మొత్తం జీవితం యొక్క ఆయుష్షు గుర్తుంటుంది కదా!
మరి ఒక్క రోజుది గుర్తుండదా. నేను బాబాను మరియు చక్రాన్ని ఎంత సమయం స్మృతి చేసాను అన్నది చూసుకోవాలి. ఇటువంటి ప్రాక్టీస్ చేయడం ద్వారా రుద్ర మాలలో కూర్చబడేందుకు త్వరగా పరుగు తీస్తారు. ఇది యోగము యొక్క యాత్ర, దీని గురించి ఇంకెవరికీ తెలియదు,
అటువంటప్పుడు ఎలా నేర్పించగలరు. ఇప్పుడు బాబా వద్దకు తిరిగి వెళ్ళాలని మీకు తెలుసు.
రాజ్యమే బాబా యొక్క వారసత్వము, అందుకే దీనికి రాజయోగం అన్న పేరు వచ్చింది.
మీరందరూ రాజ ఋషులు. వారు హఠయోగ ఋషులు. వారు కూడా పవిత్రముగా ఉంటారు. రాజ్యములోనైతే రాజా, రాణి, ప్రజా అందరూ కావాలి. సన్యాసులలోనైతే రాజు,
రాణులు ఉండరు. వారిది హద్దు వైరాగ్యము, మీది అనంతమైన వైరాగ్యము. వారు ఇళ్ళు-వాకిళ్ళను విడిచిపెట్టినా కూడా ఈ వికారీ ప్రపంచంలోనే ఉంటారు.
మీ కోసమైతే ఈ ప్రపంచము తర్వాత మళ్ళీ స్వర్గము, దైవీ తోట ఉంటుంది. కావున అదే గుర్తుకొస్తుంది. ఈ విషయాన్ని పిల్లలైన మీరే బుద్ధిలో ఉంచుకోగలరు. చార్టు రాయలేనివారు కూడా చాలామంది ఉంటారు. నడుస్తూ-నడుస్తూ అలసిపోతారు. బాబా అంటారు - పిల్లలూ, మీ వద్ద నోట్ చేసుకోండి, ఎంత సమయం అతి మధురమైన బాబాను స్మృతి చేసాను? ఆ తండ్రి స్మృతితోనే వారసత్వము తీసుకోవాలి. ఎప్పుడైతే రాజ్య వారసత్వం తీసుకునేది ఉంటుందో,
అప్పుడు ప్రజలను కూడా తయారుచేసుకోవాలి. బాబా స్వర్గ రచయిత, మరి వారి నుండి స్వర్గ వారసత్వం ఎందుకు లభించకూడదు. స్వర్గ వారసత్వం లభించేవారు చాలామంది ఉంటారు. మిగిలినవారికి శాంతి లభిస్తుంది. తండ్రి అందరికీ చెప్తారు, పిల్లలూ, దేహ సహితంగా దేహపు అన్ని సంబంధాలను మర్చిపోండి.
మీరు అశరీరిగా వచ్చారు, 84 జన్మలు అనుభవించారు, ఇప్పుడు మళ్ళీ అశరీరిగా అవ్వండి.
క్రిస్టియన్ ధర్మానికి చెందినవారితో కూడా అంటారు,
మీరు క్రైస్టు వెనుక వచ్చారు. మీరు కూడా శరీరాలు లేకుండానే వచ్చారు, ఇక్కడ శరీరం తీసుకొని పాత్రను అభినయించారు, ఇప్పుడు మీ పాత్ర కూడా పూర్తవుతుంది. కలియుగ అంతిమం వచ్చేసింది. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయండి,
ముక్తిధామము వారు విని చాలా సంతోషిస్తారు. వారు ముక్తినే కోరుకుంటారు. జీవన్ముక్తిని (సుఖాన్ని) పొంది మళ్ళీ దుఃఖములోకైతే వస్తాము,
దీని కన్నా ముక్తి మంచిది అని భావిస్తారు. సుఖమైతే చాలా ఉంటుందని వారికి తెలియదు.
ఆత్మలమైన మనము పరంధామంలో తండ్రితోపాటు ఉండేవారము.
కానీ పరంధామాన్ని ఇప్పుడు మర్చిపోయాము. తండ్రి వచ్చి సందేశకులందరినీ పంపిస్తారని అంటారు. వాస్తవానికి ఎవరూ పంపించరు. ఇదంతా డ్రామా తయారుచేయబడి ఉంది.
మనమైతే మొత్తం డ్రామాను తెలుసుకున్నాము. పిల్లలైన మీ బుద్ధిలో తండ్రి మరియు చక్రం గుర్తున్నాయి, కావున మీరు చక్రవర్తి రాజులుగా తప్పకుండా అవుతారు.
ఇక్కడ చాలా దుఃఖం ఉందని మనుష్యులు భావిస్తారు, అందుకే ముక్తిని కోరుకుంటారు. ఈ రెండు పదాలు - గతి మరియు సద్గతి, కొనసాగుతూ ఉంటాయి.
కానీ వీటి అర్థం ఎవ్వరికీ తెలియదు.
పిల్లలైన మీకు తెలుసు, అందరి సద్గతి దాత తండ్రి ఒక్కరే, మిగిలినవారంతా పతితులు. ప్రపంచమంతా పతితంగానే ఉంది. ఈ పదాల గురించి కూడా కొందరు గొడవ చేస్తారు.
తండ్రి అంటారు, ఈ శరీరాన్ని మర్చిపోండి, మిమ్మల్ని అశరీరిగా పంపించాను, ఇప్పుడు కూడా అశరీరిగా అయి నాతో నడవాలి. దీనిని నాలెడ్జ్ లేక శిక్షణ అని అంటారు.
ఈ శిక్షణ ద్వారానే సద్గతి లభిస్తుంది.
యోగంతో మీరు సదా ఆరోగ్యవంతముగా అవుతారు.
మీరు సత్యయుగంలో చాలా సుఖీగా ఉండేవారు. ఏ వస్తువు యొక్క లోటు ఉండేది కాదు.
దుఃఖాన్ని ఇచ్చే ఏ వికారము ఉండేది కాదు. మోహజీత్ రాజు కథను వినిపిస్తారు. బాబా అంటారు, నేను మీకు ఎటువంటి కర్మలు నేర్పిస్తానంటే, దానితో మీరెప్పుడూ కర్మల గురించి పశ్చాత్తాపపడాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఇటువంటి చలి కూడా ఉండదు.
ఇప్పుడైతే 5 తత్వాలు తమోప్రధానంగా ఉన్నాయి. అప్పుడప్పుడు చాలా వేడి, అప్పుడప్పుడు చాలా చలి ఉంటుంది. అక్కడ ఇటువంటి ఆపదలు ఉండవు. సదా వసంత ఋతువు ఉంటుంది. ప్రకృతి సతోప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు ప్రకృతి తమోప్రధానంగా ఉంది. మరి మంచి వ్యక్తులు ఎలా ఉండగలరు. భారత్ యొక్క ఇంతటి గొప్ప-గొప్ప యజమానులు సన్యాసుల వెనుక తిరుగుతూ ఉంటారు. వారి వద్దకు కుమార్తెలు వెళ్తే తీరిక లేదని అంటారు. దీనితో వారి భాగ్యములో స్వర్గ సుఖాలు లేవని అర్థం చేసుకుంటారు. బ్రాహ్మణ కులం యొక్క సభ్యులుగా అవ్వనే అవ్వరు, భగవంతుడు ఎలా వస్తారు మరియు ఎప్పుడు ఇక్కడకు వస్తారు అన్నది వారికి తెలియనే తెలియదు! శివ జయంతిని జరుపుకుంటారు కానీ అందరూ శివుడిని భగవంతునిగా భావించరు. ఒకవేళ వారిని పరమపిత పరమాత్మగా భావించినట్లయితే శివ జయంతి నాడు సెలవు రోజుగా జరుపుకుంటారు.
తండ్రి అంటారు, నా జన్మ కూడా భారత్ లో జరుగుతుంది. మందిరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. తప్పకుండా ఏదో ఒక శరీరంలోకి ప్రవేశించి ఉంటారు.
దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని రచించారని చూపిస్తారు.
మరి వారిలోకి వచ్చి ఉంటారా! ఇలా కూడా అనరు.
శ్రీకృష్ణుడైతే సత్యయుగములోనే ఉంటారు.
తండ్రి స్వయంగా అంటారు,
నేను బ్రహ్మా ముఖం ద్వారా బ్రాహ్మణ వంశావళిని రచించవలసి ఉంటుంది. ఎవరికైనా మీరు ఈ విషయాన్ని కూడా అర్థం చేయించవచ్చు - కేవలం స్మృతి చేయండి అని బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. కానీ మాయ ఎంతటి శక్తిశాలి అంటే స్మృతి చేయనివ్వదు. అది అర్ధకల్పము యొక్క శత్రువు. ఈ శత్రువుపైనే విజయం పొందాలి. భక్తి మార్గంలో మనుష్యులు చలిలో స్నానాలు చేసేందుకు వెళ్తారు.
ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు,
దుఃఖం సహిస్తారు. ఇక్కడైతే పాఠశాల, చదువుకోవాలి, ఇందులో ఎదురుదెబ్బలు తినే విషయమైతే ఏమీ లేదు. పాఠశాలలో అంధ విశ్వాసము విషయమైతే ఉండదు.
మనుష్యులైతే చాలా అంధ విశ్వాసములో చిక్కుకొని ఉన్నారు. ఎంతోమంది గురువులు మొదలైనవారిని ఆశ్రయిస్తారు. కానీ మనుష్యులైతే ఎప్పుడూ మనుష్యులకు సద్గతి ఇవ్వలేరు. ఎవరైతే మనుష్యులను గురువులుగా చేసుకుంటారో,
అది అంధ విశ్వాసము అయినట్లు కదా.
ఈ రోజుల్లో చిన్నపిల్లల చేత కూడా గురువును స్వీకరింపజేయిస్తారు. నియమమైతే, వానప్రస్థములో గురువును చేయాలి అని. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
తీవ్ర పురుషార్థం కోసం స్మృతి యొక్క చార్టును తప్పకుండా పెట్టుకోవాలి.
రోజూ అద్దంలో మీ ముఖాన్ని చూసుకోవాలి. నేను అతి మధురమైన తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నాను అన్నది చెక్ చేసుకోవాలి.
2.
ఏదైతే చదివారో దానిని కూడా మర్చి నిశ్శబ్దముగా ఉండాలి. నోటితో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. తండ్రి స్మృతితో వికర్మలను వినాశనం చేసుకోవాలి.
వరదానము:-
ప్రతి విషయంలో
నోటి ద్వారా
లేక మనసు
ద్వారా బాబా-బాబా
అని అంటూ
నేను అన్నదానిని
సమాప్తం చేసే
సఫలతా మూర్త
భవ
మీరు అనేక ఆత్మల ఉల్లాస-ఉత్సాహాలను పెంచేందుకు నిమిత్తమైన పిల్లలు, ఎప్పుడూ కూడా నేను అన్నదానిలోకి రాకండి. నేను చేసాను, ఇలా కాదు. బాబా నిమిత్తంగా చేసారు. నేను కు బదులుగా నా బాబా, నేను చేసాను, నేను చెప్పాను, ఇలా కాదు. బాబా చేయించారు, బాబా చేసారు అంటే సఫలతామూర్తులుగా అవుతారు. ఎంతగా మీ నోటి నుండి బాబా-బాబా అని వస్తుందో, అంతగా అనేకమందిని బాబాకు చెందినవారిగా
చేయగలరు. వీరి సంకల్పం మరియు మాటలో కేవలం బాబాయే ఉన్నారని అందరి నోటి నుండి ఇదే రావాలి.
స్లోగన్:-
సంగమయుగములో తమ తనువు-మనసు-ధనమును సఫలం చేసుకోవడము మరియు సర్వ ఖజానాలను పెంచుకోవడమే
వివేకము.
0 Comments