07-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- మీకు తండ్రి
ద్వారా తండ్రి
యొక్క లీల అనగా డ్రామా ఆది మధ్యాంతాల జ్ఞానం లభించింది,
ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుందని, మనం ఇంటికి వెళ్తామని మీకు
తెలుసు’’
ప్రశ్న:-
స్వయాన్ని తండ్రి వద్ద రిజిస్టర్ చేయించుకోవాలంటే
దాని కోసం నియమాలేమిటి?
జవాబు:-
తండ్రి వద్ద రిజిస్టర్ అయ్యేందుకు 1 - తండ్రిపై పూర్తి-పూర్తిగా బలిహారమవ్వాల్సి
ఉంటుంది. 2 - తమదంతా భారత్ ను స్వర్గంగా తయారుచేసే సేవలో సఫలం చేసుకోవాల్సి ఉంటుంది 3 - సంపూర్ణ నిర్వికారిగా అయ్యే ప్రతిజ్ఞను చేయవలసి ఉంటుంది, అంతేకాక అలా ఉండి చూపించవలసి ఉంటుంది కూడా. ఇటువంటి పిల్లల పేరు ఆల్మైటీ గవర్నమెంట్ రిజిస్టరులోకి వస్తుంది. వారికి ఏ నషా ఉంటుందంటే - మేము భారత్ ను స్వర్గముగా లేక రాజ్యస్థానముగా తయారుచేస్తున్నాము, మేము భారత్ యొక్క సేవ కోసం తండ్రిపై బలిహారమవుతాము.
పాట:- ఓం నమః శివాయ... (ఓం నమో శివాయ...)
ఓం శాంతి. ఎవరి మహిమలోనైతే ఈ పాట ఉందో, వారే కూర్చుని తమ రచన యొక్క మహిమను వినిపిస్తారు. దానిని లీల అని కూడా అంటారు.
లీల అని నాటకాన్ని అనడం జరుగుతుంది మరియు మహిమ అనేది గుణవంతులకు జరుగుతుంది. కావున వారి మహిమ అందరికన్నా అతీతమైనది. మనుష్యులకైతే తెలియదు. పిల్లలకు తెలుసు,
ఆ పరమపిత పరమాత్మకే ఇంతటి గాయనముంది, వారి శివ జయంతి కూడా ఇప్పుడు సమీపంగా ఉంది. శివ జయంతి కోసం ఈ పాట కూడా బాగుంది. పిల్లలైన మీకు వారి లీల గురించి మరియు వారి మహిమ గురించి తెలుసు,
తప్పకుండా ఇది లీలయే. దీనిని నాటకము
(డ్రామా) అని కూడా అంటారు. తండ్రి అంటారు, దేవతల కన్నా కూడా నా లీల అతీతమైనది. ప్రతి ఒక్కరి లీల వేర్వేరుగా ఉంటుంది. ఏ విధంగానైతే గవర్నమెంట్ లో ప్రెసిడెంట్ కు, మినిస్టర్ కు పదవులు వేర్వేరుగా ఉంటాయి కదా. ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే అందరిదీ ఒకటే పాత్ర ఉంటుంది. సర్వవ్యాపి అని అనడము వల్లనే ఆకలితో మరణించారు.
మనుష్యులెవ్వరికీ తండ్రి గురించి మరియు తండ్రి యొక్క అపారమైన మహిమ గురించి తెలియదు. ఎప్పటివరకైతే తండ్రి గురించి తెలుసుకోరో,
అప్పటివరకు రచనను గురించి కూడా తెలుసుకోలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు రచనను కూడా తెలుసుకున్నారు. బ్రహ్మాండము, సూక్ష్మవతనము మరియు మనుష్య సృష్టి చక్రము బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది.
ఇది లీల లేక రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము.
ఈ సమయంలో ప్రపంచంలోని మనుష్యులు నాస్తికులు.
వారికి ఏమీ తెలియదు కానీ ప్రగల్భాలు ఎన్ని పలుకుతారు. సాధువులు కూడా కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తూ ఉంటారు, పాపం వారికి ఇప్పుడు నాటకం పూర్తవుతుంది అన్నది తెలియనే తెలియదు. ఇప్పుడు నాటకం పూర్తి అయ్యే సమయం వచ్చింది కావున ప్రస్తుతం కొంత టచ్ అవుతుంది. ఇప్పుడు అందరూ రామరాజ్యం కావాలి అని అంటారు.
క్రిస్టియన్ల రాజ్యంలో కొత్త భారత్ ఉండాలి అని అనరు. ఇప్పుడు చాలా దుఃఖం ఉంది. కావున అందరూ ఓ ప్రభూ, దుఃఖము నుండి విడిపించండి అని పిలుస్తూ ఉంటారు. కలియుగాంతంలో తప్పకుండా ఎక్కువ దుఃఖము ఉంటుంది. రోజురోజుకు దుఃఖము వృద్ధి చెందుతూ ఉంటుంది.
ఇక అందరూ తమ-తమ రాజ్యాలను ఏలడం మొదలుపెడతారు అని వారు భావిస్తారు. కానీ ఈ వినాశనము జరగాల్సిందే. ఇది ఎవ్వరికీ తెలియదు.
పిల్లలైన మీరు ఎంత సంతోషంలో ఉండాలి.
మీరు ఎవరికైనా చెప్పవచ్చు, అనంతమైన తండ్రి స్వర్గాన్ని రచిస్తారు కావున పిల్లలకు కూడా స్వర్గ రాజ్యము ఉండాలి.
భారతవాసులు విశేషంగా ఇందుకోసమే తలచుకుంటారు. భక్తి చేస్తారు, భగవంతుడిని కలుసుకోవాలనుకుంటారు. శ్రీకృష్ణపురిలోకి వెళ్ళాలనుకుంటారు, దానినే స్వర్గము అని అంటారు. కానీ సత్యయుగంలోనే శ్రీకృష్ణుని రాజ్యం ఉండేదని వారికి తెలియదు.
ఇప్పుడు ఈ కలియుగం పూర్తవుతుంది, సత్యయుగం వస్తుంది, అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుని రాజ్యం ఉంటుంది.
శివ పరమాత్మకు అందరూ సంతానమని అందరికీ తెలుసు. పరమాత్మ కొత్త సృష్టిని రచించి ఉంటారు.
కావున తప్పకుండా బ్రహ్మా ముఖం ద్వారా రచించి ఉంటారు. బ్రహ్మా ముఖ వంశావళి అయితే తప్పకుండా బ్రాహ్మణ కుల భూషణులే అవుతారు, ఆ సమయం కూడా సంగమానిదే అవుతుంది. సంగమము కళ్యాణకారీ యుగము. ఈ సమయంలోనే పరమాత్మ కూర్చుని రాజయోగము నేర్పించి ఉంటారు. ఇప్పుడు మనం బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులము. ఇకపోతే,
మీరు అంటారు
- మేము ఎలా నమ్మాలి బ్రహ్మా తనువులోకి పరమాత్మ వచ్చి రాజయోగము నేర్పిస్తారు అని.
మీరు కూడా బ్రహ్మా ముఖ వంశావళిగా అయి రాజయోగము నేర్చుకున్నట్లయితే మీ అంతట మీకు కూడా అనుభవమవుతుంది. ఇందులో కల్పితాలు లేక అంధ విశ్వాసం యొక్క విషయమేమీ లేదు.
అంధ విశ్వామైతే మొత్తం ప్రపంచంలో ఉంది,
అందులోనూ విశేషంగా భారత్ లో బొమ్మల పూజ చాలా జరుగుతుంది. విగ్రహాల ధరణి అని భారత్ నే అంటారు.
బ్రహ్మాకు ఎన్ని భుజాలను చూపించారు. ఇప్పుడు అది ఎలా సాధ్యము. అవును, బ్రహ్మాకు చాలామంది పిల్లలు ఉన్నారు. ఏ విధంగానైతే విష్ణువుకు 4 భుజాలను చూపిస్తారు, రెండు లక్ష్మివి, రెండు నారాయణుడివి, అదే విధంగా బ్రహ్మాకు కూడా ఇంతమంది పిల్లలు ఉంటారు.
4 కోట్ల మంది పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు బ్రహ్మాకు 8 కోట్ల భుజాలు అవుతాయి. కానీ అలా కాదు.
ఇకపోతే, ప్రజలైతే తప్పకుండా ఉంటారు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. తండ్రి వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు. చివరికి ఏం జరగనున్నది అనేది వాళ్ళు అయితే అర్థం చేసుకోలేరు. ఎన్ని ప్లాన్లు తయారుచేస్తారు. రకరకాల ప్లాన్లు తయారుచేస్తారు. ఇక్కడ పిల్లలైన మీ కోసం బాబా ప్లాన్ ఒక్కటే, మరియు ఈ రాజధాని స్థాపన అవుతుంది. ఎవరు ఎంతగా కృషి చేసి తమ సమానంగా తయారుచేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు.
తండ్రిని జ్ఞాన సంపన్నులు, ఆనంద స్వరూపులు, దయార్ద్ర హృదయులు అని అంటారు.
నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది అని తండ్రి అంటారు. మాయ అందరి పట్ల నిర్దయ చూపిస్తుంది. నేను వచ్చి దయ చూపించవలసి ఉంటుంది. పిల్లలైన మీకు రాజయోగం కూడా నేర్పిస్తాను.
సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తాను. జ్ఞాన సంపన్నుడినే జ్ఞాన సాగరుడు అని అంటారు. ఇది పిల్లలైన మీకు తెలుసు, ఎవరికైనా అర్థం చేయించగలరు కూడా. ఇక్కడ అంధ విశ్వాసం యొక్క విషయమైతే ఏమీ లేదు. మనము నిరాకార పరమపిత పరమాత్మను నమ్ముతాము. మొట్టమొదట వారి మహిమను చేయాలి. వారు వచ్చి రాజయోగము ద్వారా స్వర్గాన్ని రచిస్తారు. ఆ తర్వాత స్వర్గవాసుల మహిమను చేయాలి. భారత్ స్వర్గముగా ఉండేది, అప్పుడు అందరూ సర్వగుణ సంపన్నులుగా,
16 కళల సంపూర్ణులుగా... ఉండేవారు.
ఇది 5000 సంవత్సరాల విషయము.
కావున పరమాత్మ మహిమ అన్నింటికన్నా అతీతమైనది. ఆ తర్వాత దేవతల మహిమ. ఇందులో అంధ విశ్వాసం యొక్క విషయమేమీ లేదు. ఇక్కడైతే అందరూ పిల్లలే. ఫాలోవర్స్ కారు.
ఇది ఫ్యామిలీ.
మనము ఈశ్వరుని ఫ్యామిలీకి చెందినవారము. వాస్తవానికి ఆత్మలమైన మనమందరము పరమపిత పరమాత్ముని సంతానము కావున ఫ్యామిలీ అయినట్లు కదా.
ఆ నిరాకారుడే తర్వాత సాకారునిలోకి వస్తారు.
ఈ సమయంలో ఇది అద్భుతమైన ఫ్యామిలీ, ఇందులో సంశయము యొక్క విషయమేమీ లేదు.
శివునికి అందరూ సంతానమే. ప్రజాపిత బ్రహ్మా సంతానము అని కూడా అంటూ ఉంటారు. మనం బ్రహ్మాకుమార-కుమారీలము. కొత్త సృష్టి స్థాపన జరుగుతుంది.
పాత సృష్టి ఎదురుగా ఉంది. మొదట అయితే తండ్రి పరిచయము ఇవ్వాలి.
బ్రహ్మా వంశీయులుగా అవ్వకుండా తండ్రి వారసత్వము లభించజాలదు.
బ్రహ్మా వద్ద ఈ జ్ఞానం ఉండదు.
జ్ఞాన సాగరుడు శివబాబా.
వారి నుండే మనము వారసత్వం పొందుతాము. మనం ముఖ వంశావళి. అందరూ రాజయోగం నేర్చుకుంటున్నారు. మనందరినీ చదివించేవారు శివబాబా, వారు ఈ బ్రహ్మా తనువులోకి వచ్చి చదివిస్తారు. ఈ ప్రజాపిత బ్రహ్మా, ఎవరైతే వ్యక్తంగా ఉన్నారో, వారు ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతారో,
అప్పుడు ఫరిశ్తాగా అవుతారు.
సూక్ష్మవతనవాసులను ఫరిశ్తా అని అంటారు, అక్కడ రక్త-మాంసాలు ఉండవు.
కుమార్తెలు సాక్షాత్కారంలో కూడా చూస్తారు. తండ్రి అంటారు,
భక్తి మార్గం యొక్క అల్పకాలిక సుఖము కూడా నా ద్వారానే మీకు లభిస్తుంది. దాతను నేనొక్కడినే, అందుకే ఈశ్వరార్పణం చేస్తారు. ఈశ్వరుడే ఫలము ఇస్తారని భావిస్తారు. సాధు-సన్యాసులు మొదలైనవారి పేరు ఎప్పుడూ తీసుకోరు. ఇచ్చేవారు తండ్రి ఒక్కరే. అయితే ఎవరిదైనా మహిమను పెంచేందుకు,
నిమిత్తముగా ఎవరో ఒకరి ద్వారా ఇప్పిస్తారు.
అదంతా అల్పకాలికమైన సుఖము.
ఇది అనంతమైన సుఖము. కొత్త-కొత్త పిల్లలు వస్తారు,
వారేమని భావిస్తారంటే - ఇంతకుముందు వరకు మేము ఎవరి మతముపై ఉండేవారమో వారికి ఇప్పుడు మేము ఈ జ్ఞానాన్ని అర్థం చేయించాలి అని. ఈ సమయంలో అందరూ మాయ మతముపై ఉన్నారు. ఇక్కడైతే మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది. ఈ మతము అర్ధకల్పము నడుస్తుంది ఎందుకంటే సత్య, త్రేతాయుగాలలో మనం దీని ప్రారబ్ధాన్ని అనుభవిస్తాము.
అక్కడ తప్పుడు మతము ఉండదు ఎందుకంటే మాయ ఉండనే ఉండదు. తప్పుడు మతమైతే తర్వాతనే ప్రారంభమవుతుంది. ఇప్పుడు బాబా మనల్ని తమ సమానంగా త్రికాలదర్శులుగా, త్రిలోకనాథులుగా తయారుచేస్తారు. బ్రహ్మాండానికి కూడా యజమానులుగా అవుతారు, అలాగే మనం సృష్టికి కూడా యజమానులుగా అవుతాము. తండ్రి పిల్లల మహిమను తమ కన్నా కూడా ఉన్నతంగా చేసారు. మొత్తం సృష్టిలో, పిల్లల కోసం ఇంతగా శ్రమించి వారిని తమ కన్నా కూడా చురుకుగా తయారుచేసే ఇటువంటి తండ్రిని ఎప్పుడైనా చూసారా! వారంటారు,
పిల్లలైన మీకు విశ్వ రాజ్యాన్ని ఇస్తాను,
నేను అనుభవించను.
ఇకపోతే, దివ్యదృష్టి యొక్క తాళం చెవిని నేను నా చేతిలోనే ఉంచుకుంటాను. అది భక్తి మార్గంలో కూడా నాకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూడా బ్రహ్మా యొక్క సాక్షాత్కారము చేయిస్తాను, ఈ బ్రహ్మా వద్దకు వెళ్ళి రాజయోగం నేర్చుకుని భవిష్య రాకుమారునిగా అవ్వండి అని.
ఇలా చాలామందికి సాక్షాత్కారం జరుగుతుంది. రాకుమారులు అందరూ కిరీటం సహితంగా ఉంటారు. ఇకపోతే, సూర్యవంశీ రాకుమారుల సాక్షాత్కారము జరిగిందా లేక చంద్రవంశీ రాకుమారులది జరిగిందా అన్నది పిల్లలకు తెలియదు. ఎవరైతే తండ్రికి పిల్లలుగా అవుతారో,
వారు రాకుమార-రాకుమారీలుగా అయితే తప్పకుండా అవుతారు, కాకపోతే అది ముందైనా కావచ్చు లేక తర్వాతనైనా కావచ్చు. మంచి పురుషార్థమున్నట్లయితే సూర్యవంశీయులుగా అవుతారు లేదంటే చంద్రవంశీయులుగా అవుతారు.
కావున కేవలం రాకుమారుడిని చూసి సంతోషపడిపోకూడదు. ఇదంతా పురుషార్థంపై ఆధారపడుతుంది. బాబా అయితే ప్రతి విషయాన్ని స్పష్టం చేసి అర్థం చేయిస్తారు, ఇందులో అంధ విశ్వాసం యొక్క విషయమేమీ లేదు.
ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ. ఈ లెక్కనైతే వారు కూడా ఈశ్వరీయ సంతానమే.
కానీ వారు కలియుగంలో ఉన్నారు, మీరు సంగమంలో ఉన్నారు. ఎవరి వద్దకైనా వెళ్ళి ఇలా చెప్పండి, శివ వంశీ, బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులైన మేమే స్వర్గ వారసత్వాన్ని పొందగలము.
ఎవరికైనా మంచి రీతిలో అర్థం చేయించే శ్రమ చేయవలసి ఉంటుంది. 100-50 మందికి అర్థం చేయించినప్పుడు వారి నుండి ఏ ఒక్కరో వెలువడుతారు. ఎవరి భాగ్యములోనైతే ఉంటుందో వారు కోట్లలో కొందరిగా వెలువడుతారు.
తమ సమానంగా తయారుచేయడంలో సమయము పడుతుంది. ఇకపోతే, షావుకారుల చేసే శబ్దము పెద్దగా వ్యాపిస్తుంది. మినిస్టర్ల వద్దకు వెళ్ళినప్పుడు మొదట వారు, మీ వద్దకు మినిస్టరు ఎవరైనా వస్తారా అని అడుగుతారు. అవును వస్తారు అని చెప్పినప్పుడు, అచ్ఛా, మేము కూడా వస్తాము అని అంటారు.
తండ్రి అంటారు, నేను పూర్తిగా సాధారణంగా ఉన్నాను.
కావున షావుకార్లలో ఎవరో అరుదుగా వస్తారు. తప్పకుండా వస్తారు కానీ అంతిమంలో. పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి. మేము భారత్ కు తనువు, మనస్సు, ధనముతో సేవ చేస్తాము అని వారికి అర్థం చేయించాలి. మీరు భారత్ యొక్క సేవ కోసమే బలిహారమయ్యారు కదా. ఇటువంటి పరోపకారి ఎవరూ ఉండరు. వారైతే ధనం పోగుచేసుకుని ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు.
చివరికి ఇవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయి. మీరైతే అంతా బాబాపై బలిహారం చేయాలి.
భారత్ ను స్వర్గంగా తయారుచేసే సేవలోనే అంతటినీ వినియోగించాలి. అప్పుడిక వారసత్వము కూడా మీరే పొందుతారు. మీకు నషా ఎక్కి ఉంది - మేము ఆల్మైటీ అథారిటీ సంతానము.
మేము వారి వద్ద రిజిస్టర్ అయ్యాము. బాబా వద్ద రిజిస్టర్ అవ్వడంలో చాలా శ్రమ ఉంటుంది. ఎప్పుడైతే సంపూర్ణ నిర్వికారీతనం యొక్క ప్రతిజ్ఞను చేస్తారో మరియు అలా ఉండి కూడా చూపిస్తారో అప్పుడు బాబా వారిని రిజిస్టర్ చేస్తారు.
పిల్లలకు చాలా నషా ఉండాలి, మేము భారత్ ను స్వర్గముగా లేక రాజ్య స్థానముగా తయారుచేస్తున్నాము, తర్వాత దానిపై రాజ్యం చేస్తాము అని. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
మనం ఈశ్వరీయ సంతానము, ఒక్క ఈశ్వరుని ఫ్యామిలీకి చెందినవారము.
ఇప్పుడు మనకు ఈశ్వరీయ మతము లభిస్తుంది, ఈ ఆత్మిక నషాలో ఉండాలి. తప్పుడు మతాలపై నడవకూడదు.
2.
భారత్ యొక్క సేవ కోసం బ్రహ్మా తండ్రి సమానముగా పూర్తి-పూర్తిగా బలిహారమవ్వాలి. తనువు, మనసు, ధనాన్ని భారత్ ను స్వర్గముగా తయారుచేయడంలో సఫలం చేసుకోవాలి.
పూర్తి-పూర్తిగా పరోపకారిగా అవ్వాలి.
వరదానము:-
పరమాత్మ ప్రేమ
యొక్క ఛత్రచాయలో
సదా సురక్షితంగా
ఉండే దుఃఖాల
అలల నుండి
ముక్తులుగా కండి
ఏ విధంగానైతే కమల పుష్పం మురికి నీటిలో ఉంటూ కూడా అతీతంగా ఉంటుంది. మరియు ఎంతగా అతీతమో, అంతగా అందరికీ ప్రియము. ఇలా పిల్లలైన మీరు దుఃఖం యొక్క ప్రపంచం నుండి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అయ్యారు, ఈ పరమాత్మ ప్రేమ ఛత్రచాయగా అవుతుంది. మరియు ఎవరిపైనైతే పరమాత్మ ఛత్రఛాయ ఉంటుందో, వారిని ఎవరైనా ఏం చేయగలరు! అందుకే నషాలో ఉండండి - మేము పరమాత్మ ఛత్రఛాయలో ఉండేవారము, దుఃఖం యొక్క అల మమ్మల్ని స్పర్శించలేదు కూడా.
స్లోగన్:-
ఎవరైతే తమ శ్రేష్ఠ చరిత్ర ద్వారా బాప్ దాదా మరియు బ్రాహ్మణ కులం యొక్క పేరును ప్రఖ్యాతి చేస్తారో వారే కుల దీపకులు.
0 Comments