Header Ads Widget

Header Ads

TELUGU MURLI 04.01.23

 

04-01-2023 ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 



Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - మీరు ముత్యాలను గ్రోలే హంసలు, మీది హంసమండలి, మీరు అదృష్ట సితారలు, ఎందుకంటే స్వయం జ్ఞానసూర్యుడైన తండ్రి మిమ్మల్ని సమ్ముఖముగా చదివిస్తున్నారు’’

ప్రశ్న:-

తండ్రి పిల్లలందరికీ ప్రకాశాన్ని ఇచ్చిన కారణముగా వారి పురుషార్థం తీవ్రం అయ్యింది?

జవాబు:-

తండ్రి ప్రకాశాన్ని ఇచ్చారంటే, పిల్లలూ - ఇప్పుడు ఇది డ్రామా అంతిమము, మీరు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. ఏది లభించాలని ఉంటే అదే లభిస్తుందిలే అని భావించడం కాదు. పురుషార్థము ఫస్ట్. పవిత్రముగా అయి ఇతరులను పవిత్రముగా తయారుచేయడము, ఇది చాలా పెద్ద సేవ. ప్రకాశము వచ్చీ రావడంతోనే పిల్లలైన మీ పురుషార్థము తీవ్రం అయ్యింది.

పాట:-  నీవు ప్రేమసాగరుడవు... (తూ ప్యార్ కా సాగర్ హై...) 

ఓంశాంతి. ప్రేమ సాగరుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు అయిన అనంతమైన తండ్రి సమ్ముఖముగా కూర్చొని మనకు శిక్షణను ఇస్తున్నారని పిల్లలకు తెలుసు. ఎవరినైతే జ్ఞానసూర్యుడైన తండ్రి సమ్ముఖముగా చదివిస్తున్నారో, వారు ఎంత అదృష్ట సితారలు. కొంగల మండలి ఏదైతే ఉండేదో అది ఇప్పుడు హంస మండలిగా అయ్యింది. ముత్యాలను గ్రోలడం మొదలుపెట్టారు. సోదరీ-సోదరులందరూ హంసలు, దీనిని హంసమండలి అని కూడా అంటారు. కల్పపూర్వము వారే సమయంలో జన్మలో ఒకరినొకరు గుర్తిస్తారు. ఆత్మిక పారలౌకిక మాత, పితలు మరియు సోదరీ, సోదరులు పరస్పరం ఒకరినొకరు గుర్తిస్తారు. 5000 సంవత్సరాల క్రితం కూడా మనం పరస్పరం ఇవే నామరూపాలతో కలుసుకున్నామని గుర్తుందా? ఇలా మీరు ఇప్పుడే అనగలరు, మళ్ళీ ఇంకెప్పుడూ జన్మలోనూ ఇలా అనలేరు. ఎవరైతే బ్రహ్మాకుమార-కుమారీలుగా అవుతారో వారే ఒకరినొకరు గుర్తిస్తారు. బాబా, మీరు కూడా వారే, మీ పిల్లలమైన మేము కూడా వారమే, సోదరీ-సోదరులమైన మేము మళ్ళీ మా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము. ఇప్పుడు తండ్రి మరియు పిల్లలు సమ్ముఖముగా కూర్చున్నారు, తర్వాత నామ-రూపాలూ మొదలైనవన్నీ మారిపోతాయి. సత్యయుగములో - మేము అదే కల్పపూర్వం యొక్క లక్ష్మీ-నారాయణులము అని లక్ష్మీ-నారాయణులు ఏమైనా అంటారా, అలాగే ప్రజలు కూడా వీరు అదే కల్పపూర్వం యొక్క లక్ష్మీ-నారాయణులు అని ఏమైనా అంటారా. లేదు. ఇది కేవలం సమయంలోనే పిల్లలైన మీకే తెలుసు. సమయంలో మీరు ఎన్నో తెలుసుకుంటారు. ఇంతకుముందైతే మీకు ఏమీ తెలిసేది కాదు. నేనే కల్పం యొక్క సంగమయుగములో వచ్చి నా పరిచయాన్ని ఇస్తాను. విధంగా కేవలం అనంతమైన తండ్రే అనగలరు. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచపు వినాశనము కూడా తప్పకుండా జరగాలి. ఇది రెండింటి సంగమయుగము. ఇది చాలా కళ్యాణకారీ యుగము. సత్యయుగాన్ని లేక కలియుగాన్ని కళ్యాణకారి అని అనరు. ఇప్పటి మీ జీవితము అమూల్యమైనదిగా మహిమ చేయబడింది. జీవితములోనే గవ్వ నుండి వజ్రము వలె తయారవ్వాలి. పిల్లలైన మీరు సత్యాతి-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులు. మీరు ఈశ్వరీయ ముక్తి దళము. ఈశ్వరుడు వచ్చి మాయ నుండి మిమ్మల్ని విముక్తులను చేస్తారు. విశేషముగా మనల్ని మరియు మామూలుగా ప్రపంచమంతటినీ మాయ సంకెళ్ళ నుండి విడిపిస్తారని మీకు తెలుసు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. ఇప్పుడు మహిమను ఎవరికి ఇవ్వాలి? ఎవరి నటన అయితే బాగుంటుందో, వారి పేరే ప్రఖ్యాతమవుతుంది. కావున మహిమ కూడా పరమపిత పరమాత్మకే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు భూమిపై పాపాత్ముల భారము ఎంతో ఉంది. ఆవగింజల వలె ఎంతమంది మనుష్యులు ఉన్నారు. తండ్రి వచ్చి భారాన్ని దింపుతారు. అక్కడైతే కొన్ని లక్షల మంది మాత్రమే ఉంటారు, మరి 25 శాతం కూడా అవ్వలేనట్లు కదా. కావున డ్రామాను కూడా బాగా అర్థం చేసుకోవాలి. పరమాత్మను సర్వశక్తివంతుడు అని అంటారు. పాత్ర కూడా వారికి డ్రామాలో ఉంది. తండ్రి అంటారు, నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నాను. యదా యదాహి ధర్మస్య... అని రాయబడి ఉంది. ఇప్పుడు అదే ధర్మ గ్లాని భారత్ లో ఖచ్చితముగా ఉంది. నా గ్లానిని కూడా చేస్తారు, అలాగే దేవతలను కూడా గ్లాని చేస్తారు, కావుననే చాలా పాపాత్ములుగా అయిపోయారు. వారు కూడా అలా అవ్వాల్సిందే. సతో, రజో, తమోలలోకి రావాల్సిందే. మీరు డ్రామాను అర్థం చేసుకున్నారు. బుద్ధిలో చక్రం తిరుగుతూ ఉంటుంది. తండ్రి వచ్చి ప్రకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఇది డ్రామా అంతిమము. ఇప్పుడు మీరు మళ్ళీ కొత్త ప్రపంచం కోసం పురుషార్థం చేయండి. ఏది లభించాలని ఉంటే అదే లభిస్తుందిలే అని భావించడం కాదు. అలా కాదు. పురుషార్థము ఫస్ట్. మొత్తం శక్తి అంతా పవిత్రతలో ఉంది. ఇది పవిత్రత యొక్క బలిహారమే. దేవతలు పవిత్రముగా ఉంటారు కావుననే అపవిత్ర మనుష్యులు వారి ముందుకు వెళ్ళి శిరస్సు వంచుతారు. సన్యాసుల ముందు కూడా శిరస్సు వంచుతారు. వారు మరణించిన తర్వాత వారి స్మృతిచిహ్నాలను తయారుచేస్తారు ఎందుకంటే వారు పవిత్రంగా ఉన్నారు. కొందరు భౌతికమైన సేవలు కూడా ఎన్నో చేస్తారు. హాస్పిటళ్ళు తెరిచినా లేక కాలేజీలు నిర్మించినా, వారి పేరు కూడా వెలువడుతుంది. ఎవరైతే అందరినీ పవిత్రంగా తయారుచేస్తారో మరియు ఎవరైతే వారికి సహాయకులుగా అవుతారో వారిదే అందరికన్నా ఎక్కువ పేరు. సదా పవిత్రంగా ఉండేవారితో యోగాన్ని జోడించడం ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. ఎంతగా మీరు యోగం జోడిస్తూ ఉంటారో అంతగా మీరు పవిత్రముగా అవుతూ ఉంటారు, ఇక అంత మతిని బట్టి గతి ఏర్పడుతుంది. తండ్రి వద్దకు వెళ్ళిపోతారు. వారు యాత్రలలో వెళ్ళినప్పుడు తాము తండ్రి వద్దకు వెళ్ళాలి అని భావించరు. కానీ పవిత్రంగా ఉంటారు. ఇక్కడైతే తండ్రి అందరినీ పవిత్రముగా తయారుచేస్తారు. డ్రామాను అర్థం చేసుకోవడం కూడా ఎంత సహజము. ఎన్నో పాయింట్లు అర్థం చేయిస్తూ ఉంటారు. మళ్ళీ కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని అంటారు. మరణించే సమయంలో అందరూ భగవంతుడిని గుర్తు చేస్తారు. అచ్ఛా, భగవంతుడు ఏం చేస్తారు? మళ్ళీ ఎవరైనా శరీరం వదిలితే స్వర్గస్థులయ్యారు అని అంటారు. అనగా పరమాత్మ స్మృతిలో శరీరం వదలడంతో వైకుంఠానికి వెళ్ళిపోతారు. వారికి తండ్రి గురించి తెలియదు. తాము తండ్రిని స్మృతి చేయడంతో వైకుంఠానికి చేరుకుంటాము అని కూడా ఎవరి బుద్ధిలోనూ లేదు. వారు కేవలం పరమాత్మను స్మృతి చేయండి అని అంటారు. ఆంగ్లంలో గాడ్ ఫాదర్ అని అంటారు. ఇక్కడ మీరు పరమపిత పరమాత్మ అని అంటారు. వారు మొదట గాడ్ అని అంటారు, తర్వాత ఫాదర్ అని అంటారు. మనం మొదట పరమపిత అని అంటాము, తర్వాత పరమాత్మ అని అంటాము. వారు అందరికీ తండ్రి. ఒకవేళ అందరూ తండ్రులైనట్లయితే ఇక గాడ్ ఫాదర్ అని అనలేరు. చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరు. తండ్రి మీకు సహజతరం చేసి అర్థం చేయించారు. మనుష్యులు దుఃఖితులుగా అయినప్పుడు పరమాత్మను తలచుకుంటారు. మనుష్యులు దేహాభిమానులుగా ఉన్నారు మరియు స్మృతి చేసేది దేహీ (ఆత్మ). ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే మరి ఆత్మ (దేహీ) ఎందుకు స్మృతి చేయాలి? ఒకవేళ ఆత్మ నిర్లేపి అయితే, దేహీ లేక ఆత్మ ఏమి స్మృతి చేస్తుంది? భక్తి మార్గంలో ఆత్మయే పరమాత్మను స్మృతి చేస్తుంది ఎందుకంటే దుఃఖితముగా ఉంది. ఎంతగా సుఖము లభించిందో అంతగా స్మృతి చేయవలసి ఉంటుంది.

ఇది చదువు, ఇక్కడ లక్ష్యము-ఉద్దేశ్యము కూడా స్పష్టంగా ఉంది. ఇందులో అంధ శ్రద్ధ విషయమేమీ లేదు. మీకు అన్ని ధర్మాలవారి గురించి తెలుసు - సమయంలో అందరూ ఇక్కడ హాజరై ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ దేవీ-దేవతా ధర్మం యొక్క చరిత్ర రిపీట్ అవ్వనున్నది. ఇదేమీ కొత్త విషయం కాదు. కల్ప-కల్పమూ మనం రాజ్యం తీసుకుంటాము. విధముగా హద్దులోని ఆట రిపీట్ అవుతుందో అలా ఇది అనంతమైన ఆట. మన అర్ధ కల్పపు శత్రువు ఎవరు? రావణుడు. మనమేమీ యుద్ధము చేసి రాజ్యము తీసుకోము. మనం హింసాయుతమైన యుద్ధము కూడా చేయము, అలాగే విజయం పొందేందుకు సైన్యము తీసుకుని కూడా పోరాడము. ఇది ఓటమి, గెలుపుల ఆట. కానీ, ఇక్కడ ఓటమి కూడా సూక్ష్మమైనది, విజయము కూడా సూక్ష్మమైనది. మాయతో ఓడిపోతే అది ఓటమి, మాయతో విజయం పొందితే అది విజయము. మనుష్యులు మాయకు బదులుగా మనసు అన్న పదాన్ని ఉపయోగించారు, కావున అది తలక్రిందులుగా అయిపోయింది. డ్రామాలో ఆట కూడా ముందే రచింపబడి ఉంది. తండ్రి స్వయముగా కూర్చొని పరిచయము ఇస్తారు. రచయిత గురించి మానవమాత్రులెవ్వరికీ తెలియనే తెలియదు, మరి వారు పరిచయము ఎలా ఇవ్వగలరు. రచయిత ఒక్క తండ్రే, మిగిలిన మనమంతా రచన. కావున తప్పకుండా మనకు రాజ్యభాగ్యము లభించాలి. మనుష్యులు పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు, అటువంటప్పుడు అందరూ రచయితలు అవుతారు. ఇక రచనను మాయం చేసినట్లు, ఎంత రాతిబుద్ధి కలవారిగా, దుఃఖితులుగా అయ్యారు. కేవలం మేము వైష్ణవులము అనగా మేము సగం దేవతలము అని తమ మహిమను చేసుకుంటారు. దేవతలు వైష్ణవులని భావిస్తారు. నిజానికి వెజిటేరియన్ కు ముఖ్య అర్థము - అహింసయే పరమధర్మము. దేవతలను పక్కా వైష్ణవులు అని అంటారు. మాటకొస్తే తమను తాము వైష్ణవులుగా పిలుచుకునేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ లక్ష్మీ-నారాయణుల రాజ్యంలో వైష్ణవ సాంప్రదాయులు పవిత్రముగా కూడా ఉండేవారు. ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయుల రాజ్యం ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, మీరు బ్రహ్మాకుమార-కుమారీలు కావున తప్పకుండా బ్రహ్మా కూడా ఉంటారు, కావుననే శివవంశీ ప్రజాపిత బ్రహ్మా సంతానము అన్న పేరును పెట్టారు. శివబాబా వచ్చారని, వారు బ్రాహ్మణ సాంప్రదాయాన్ని రచించారని, బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అయ్యారని మహిమను కూడా చేస్తారు. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు, కావుననే బ్రహ్మాకుమార-కుమారీలుగా పిలువబడతారు. విరాట రూపము చిత్రముపై కూడా అర్థం చేయించడం మంచిది. విష్ణువుకే విరాట రూపము చూపించారు. విష్ణువు మరియు వారి రాజధానియే (సంతానమే) విరాట చక్రములోకి వస్తారు. బాబాకు ఆలోచనలన్నీ నడుస్తాయి. మీరు కూడా విచార సాగర మథనము యొక్క అభ్యాసము చేస్తే రాత్రికి నిద్ర రాదు. ఇదే చింతన నడుస్తూ ఉంటుంది. ఉదయం లేచి వ్యాపార-వ్యవహారాలలో నిమగ్నమైపోతారు. ఉదయపు సాయీ.... అని అంటారు. మీరు కూడా ఎవరికైనా కూర్చొని అర్థం చేయిస్తే - ఓహో! వీరు మమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా, నిరుపేదల నుండి యువరాజులుగా తయారుచేయడానికి వచ్చారు అని అంటారు. మొదట అలౌకిక సేవ చేయాలి, స్థూలమైన సేవ తర్వాత. అభిరుచి ఉండాలి. విశేషముగా మాతలు చాలా బాగా సేవ చేయవచ్చు. మాతలను ఎవరూ తిరస్కరించరు. కూరగాయలు అమ్మేవారికి, ధాన్యం అమ్యేవారికి, నౌకర్లకు మొదలైనవారందరికీ అర్థం చేయించాలి. ఇక తర్వాత ఫిర్యాదు చేయడానికి ఎవరూ మిగిలి ఉండకూడదు. సేవలో హృదయము యొక్క సత్యత కావాలి. తండ్రితో పూర్తి యోగము కావాలి, అప్పుడే ధారణ జరగగలదు. నౌకలలోకి సామాగ్రిని నింపుకొని డెలివరీ చేయడానికి ఓడరేవుకు వెళ్తారు. అటువంటివారికి ఇంట్లో సుఖముగా ఉండదు, పరిగెడుతూ ఉంటారు. చిత్రాలు కూడా ఎంతో సహాయం చేస్తాయి. శివబాబా బ్రహ్మా ద్వారా విష్ణుపురిని స్థాపన చేయిస్తున్నారని ఎంత స్పష్టముగా ఉంది. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము, కృష్ణ జ్ఞాన యజ్ఞము కాదు. రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమైంది. శ్రీకృష్ణుడు యజ్ఞము రచించలేరు. వారు 84 జన్మలు తీసుకుంటారు కావున నామ-రూపాలు మారిపోతాయి, ఇంకే రూపములోనూ శ్రీకృష్ణుడు ఉండలేరు. ఎప్పుడైతే అదే రూపములో వస్తారో, అప్పుడే శ్రీకృష్ణుని పాత్ర రిపీట్ అవుతుంది. అచ్ఛా -

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సత్యాతి-సత్యమైన ఈశ్వరీయ సేవకులుగా లేక ఈశ్వరీయ ముక్తి దళముగా అయి అందరినీ మాయ నుండి విముక్తులను చేయాలి. జీవితములో గవ్వ నుండి వజ్ర సమానముగా అవ్వాలి మరియు తయారుచేయాలి.

2. విధముగా బాబా విచార సాగర మథనము చేస్తారో, అలా జ్ఞానాన్ని విచార సాగర మథనము చేయాలి. కళ్యాణకారులుగా అయి అలౌకిక సేవలో తత్పరులై ఉండాలి. హృదయం యొక్క సత్యతతో సేవ చేయాలి.

వరదానము:-

చిన్న-చిన్న ఆజ్ఞల ఉల్లంఘన యొక్క భారాన్ని సమాప్తం చేసి సదా సమర్థంగా ఉండే శ్రేష్ఠ చరిత్రవాన్ భవ
విధముగా అమృతవేళ లేవాలి అన్న ఆజ్ఞ ఉన్నందుకు లేచి కూర్చుంటారు కానీ విధితో సిద్ధిని ప్రాప్తి చేసుకోరు, స్వీట్ సైలెన్స్ తో పాటు నిద్ర యొక్క సైలెన్స్ కలిసిపోతుంది. 2- ఆత్మకూ దఃఖమునివ్వకండి, దుఃఖము తీసుకోకండి అన్నది తండ్రి ఆజ్ఞ, ఇందులో దుఃఖమునివ్వరు కానీ దుఃఖము తీసుకుంటారు. 3- క్రోధము చేయరు కానీ ఆవేశములోకి వచ్చేస్తారు, ఇటువంటి చిన్న-చిన్న ఆజ్ఞల ఉల్లంఘన మనసును భారంగా చేస్తుంది. ఇప్పుడు వీటిని సమాప్తం చేసి ఆజ్ఞాకారీ చరిత్ర యొక్క చిత్రాన్ని తయారుచేయండి, అప్పుడు సదా సమర్థ చరిత్రవాన్ ఆత్మ అని అంటారు.

స్లోగన్:-

గౌరవాన్ని యాచించేందుకు బదులుగా అందరికీ గౌరవం ఇచ్చినట్లయితే అందరి గౌరవం లభిస్తూ ఉంటుంది.

 Download PDF

Post a Comment

0 Comments