Header Ads Widget

Header Ads

TELUGU MURLI 03.01.23

 

03-01-2023  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా"  మధువనం

 




Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - సృష్టి లేక ప్రపంచం దుఃఖమయమైనది, దీని నుండి నష్టోమోహులుగా అవ్వండి, కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయండి, బుద్ధియోగాన్ని ప్రపంచం నుండి తొలగించి కొత్త ప్రపంచంతో జోడించండి’’

ప్రశ్న:-

కృష్ణపురిలోకి వెళ్ళేందుకు పిల్లలైన మీరు ఏర్పాట్లు చేస్తారు మరియు చేయిస్తారు?

జవాబు:-

కృష్ణపురిలోకి వెళ్ళేందుకు కేవలం అంతిమ జన్మలో అన్ని వికారాలను విడిచిపెట్టి పావనంగా అవ్వాలి మరియు ఇతరులను తయారుచేయాలి. పావనంగా అవ్వడమే దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్ళేందుకు చేసే ఏర్పాటు. మీరు అందరికీ ఇదే సందేశాన్ని ఇవ్వండి, ఇది అశుద్ధ ప్రపంచము, దీని నుండి బుద్ధియోగం తొలగించినట్లయితే కొత్త సత్యయుగీ ప్రపంచములోకి వెళ్ళిపోతారు.

పాట:-నాకు ఆధారాన్ని అందించేవారు...(ముఝ్ కో సహారా దేనేవాలా...) 

ఓంశాంతి.  పాటలో పిల్లలు బాబా అని అంటారు. పిల్లల బుద్ధి అనంతమైన తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. పిల్లలకు ఇప్పుడు సుఖము లభిస్తూ ఉంది లేక సుఖధామానికి మార్గము లభిస్తూ ఉంది. తప్పకుండా తండ్రి స్వర్గం యొక్క 21 జన్మల సుఖాన్ని ఇవ్వడానికి వచ్చారని అర్థం చేసుకుంటారు. సుఖం యొక్క ప్రాప్తి కోసం స్వయంగా తండ్రి వచ్చి శిక్షణ ఇస్తున్నారు. వారు అర్థం చేయిస్తున్నారు, ప్రపంచము ఏదైతే ఉందో అనగా ఇంతమంది మనుష్యులెవరైతే ఉన్నారో, వారేమీ ఇవ్వలేరు. ఇదైతే అంతా రచన కదా. పరస్పరంలో సోదరీ, సోదరులు. కావున రచన ఒకరికొకరు సుఖం యొక్క వారసత్వాన్ని ఎలా ఇవ్వగలరు! సుఖం యొక్క వారసత్వం ఇచ్చేవారు తప్పకుండా రచయిత అయిన తండ్రి ఒక్కరే అవుతారు. ప్రపంచంలో ఎవరికైనా సుఖం ఇవ్వగలిగేటువంటి మనుష్యులు ఎవ్వరూ లేరు. సుఖ దాత, సద్గతి దాత ఒక్క సద్గురువు మాత్రమే. ఇప్పుడు సుఖాన్ని అడుగుతారు? స్వర్గంలో చాలా సుఖము ఉండేది మరియు ఇప్పుడు నరకంలో దుఃఖము ఉంది అని అందరూ మరిచిపోయారు. కావున తప్పకుండా పిల్లలందరిపైన యజమానికే దయ కలుగుతుంది. సృష్టి యజమానిని అంగీకరించేవారు చాలామంది ఉన్నారు. కానీ వారు ఎవరు, వారి నుండి ఏం లభిస్తుంది, అదేమీ తెలియదు. యజమాని నుండి మాకు దుఃఖం లభించింది అనైతే కాదు. సుఖ-శాంతుల కోసమే వారిని స్మృతి చేస్తారు. భక్తులు భగవంతుడిని తప్పకుండా ప్రాప్తి కోసమే స్మృతి చేస్తారు. దుఃఖితులుగా ఉన్నారు, కావుననే సుఖ-శాంతుల కోసం స్మృతి చేస్తారు. అనంతమైన సుఖం ఇచ్చేవారు ఒక్కరే, మిగిలినవారు హద్దులోని అల్పకాలికమైన సుఖాన్ని ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు. అదేమీ పెద్ద విషయం కాదు. భక్తులందరూ ఒక్క భగవంతుడిని పిలుస్తారు, తప్పకుండా భగవంతుడు అందరికన్నా గొప్పవారు, వారి మహిమ చాలా గొప్పది. మరి తప్పకుండా చాలా సుఖం ఇచ్చేవారై ఉంటారు. తండ్రి ఎప్పుడూ పిల్లలకు లేక ప్రపంచానికి దుఃఖం ఇవ్వలేరు. తండ్రి అర్థం చేయిస్తారు, మీరు ఆలోచించండి - నేను ఏదైతే సృష్టిని లేక ప్రపంచాన్ని రచిస్తానో దుఃఖాన్ని ఇచ్చేందుకు రచిస్తానా ఏమిటి? నేను అయితే సుఖాన్ని ఇచ్చేందుకు రచిస్తాను. కానీ సుఖ-దుఃఖాల డ్రామా రచించబడి ఉంది. మనుష్యులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తారు, ఎప్పుడైతే కొత్త ప్రపంచము, కొత్త సృష్టి ఉంటుందో, అప్పుడు అందులో సుఖం ఉంటుంది. దుఃఖం పాత సృష్టిలో ఉంటుంది. అన్నీ పాతవిగా, శిథిలావస్థగా అవుతాయి. మొదట నేను సృష్టినైతే రచిస్తానో, దానిని సతోప్రధానమైనది అని అంటారు. సమయంలో మనుష్యులందరూ ఎంత సుఖీగా ఉంటారు. ధర్మము ఇప్పుడు కనుమరుగైన కారణంగా ఎవరి బుద్ధిలోనూ లేదు.

కొత్త ప్రపంచము సత్యయుగంగా ఉండేదని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు పాతదిగా ఉంది కావున తండ్రి తప్పకుండా కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తారని ఆశ పెట్టుకుంటారు. మొదట కొత్త సృష్టిలో, కొత్త ప్రపంచములో చాలా కొద్దిమందే ఉండేవారు మరియు చాలా సుఖీగా ఉండేవారు, సుఖాలకు అవధులే ఉండేవి కావు. పేరే స్వర్గము, వైకుంఠము, కొత్త ప్రపంచము అని అంటారు. మరి తప్పకుండా అందులో కొత్త మనుష్యులే ఉంటారు. తప్పకుండా దేవీ-దేవతల రాజధానిని నేను స్థాపించి ఉంటాను కదా. లేదంటే కలియుగంలో ఒక్క రాజు కూడా లేరు, అందరూ నిరుపేదలుగా ఉన్నారు, తర్వాత ఒక్కసారిగా సత్యయుగంలో దేవీ-దేవతల రాజ్యం ఎక్కడి నుండి వచ్చింది? ప్రపంచం ఎలా మారింది? కానీ అందరి బుద్ధి ఎంతగా హతమార్చబడి ఉంది అంటే ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. వారే సుఖ-దుఃఖాలను ఇస్తారని మనుష్యులు యజమానిపై దోషము మోపుతారు, కానీ ఈశ్వరుడిని అయితే - వచ్చి మాకు సుఖ-శాంతులను ఇవ్వండి, మధురమైన ఇంటికి తీసుకువెళ్ళండి అనే స్మృతి చేస్తారు. మళ్ళీ పాత్రలోకైతే తప్పకుండా పంపిస్తారు కదా! కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం తప్పకుండా రానున్నది. మనుష్యులైతే రావణుడి మతంపై ఉన్నారు. శ్రీమతం మాత్రమే శ్రేష్ఠ మతము. తండ్రి అంటారు, నేను సహజ రాజయోగం నేర్పిస్తాను, నేను గీతా శ్లోకాలు మొదలైనవేవీ మీరు పాడినట్లుగా పాడను. తండ్రి కూర్చుని గీతను నేర్పిస్తారా ఏమిటి? నేనైతే సహజ రాజయోగం నేర్పిస్తాను. స్కూలులో పాటలు, కవితలు వినిపించడము జరుగుతుందా ఏమిటి? స్కూల్లోనైతే చదివించడము జరుగుతుంది. తండ్రి కూడా అంటారు, పిల్లలైన మిమ్మల్ని నేను చదివిస్తున్నాను, రాజయోగం నేర్పిస్తున్నాను. నాతో ఇంకెవ్వరి యోగము లేదు. అందరూ నన్ను మర్చిపోయారు. ఇలా మరిచిపోవడము కూడా డ్రామాలో రచించబడి ఉంది. నేను వచ్చి మళ్ళీ స్మృతినిప్పిస్తాను. నేనైతే మీకు తండ్రిని. భగవంతుడు నిరాకారుడు అని అంగీకరిస్తారు కూడా, మరి మీరు కూడా వారి నిరాకార సంతానము. నిరాకార ఆత్మలైన మీరు మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తారు. నిరాకార ఆత్మలందరి నివాస స్థానము నిరాకారీ ప్రపంచము, అది ఉన్నతోన్నతమైనది. ఇది సాకారి ప్రపంచము, అది ఆకారి ప్రపంచము మరియు అది నిరాకారి ప్రపంచము, అది అన్నింటికన్నా పైన మూడవ అంతస్తులో ఉంది. తండ్రి సమ్ముఖములో కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు, మనం కూడా అక్కడి నివాసులమే. ఎప్పుడైతే కొత్త ప్రపంచం ఉండేదో, అక్కడ ఒకే ధర్మం ఉండేది, దానిని హెవెన్ అని అంటారు. తండ్రినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. కలియుగము కంసపురి. సత్యయుగము కృష్ణపురి. కావున ఇప్పుడు మీరు కృష్ణపురికి వెళ్తారా అని అడగాలి. ఒకవేళ మీరు కృష్ణపురికి వెళ్ళాలనుకుంటే పవిత్రంగా అవ్వండి. ఎలాగైతే మేము దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామో, అలాగే మీరు కూడా చేసుకోండి. దాని కోసం వికారాలను తప్పకుండా విడిచిపెట్టవలసి ఉంటుంది. ఇది అందరి అంతిమ జన్మ. అందరూ తిరిగి వెళ్ళాలి. మీరు మర్చిపోయారా - 5,000 సంవత్సరాల క్రితం మహాభారీ యుద్ధం జరగలేదా? అందులో అన్ని ధర్మాలు వినాశనమయ్యాయి మరియు ఏక ధర్మ స్థాపన జరిగింది. సత్యయుగంలో దేవీ-దేవతలు ఉండేవారు కదా. కలియుగంలో లేరు. ఇప్పుడైతే రావణ రాజ్యము. ఆసురీ మనుష్యులు ఉన్నారు. వారిని మళ్ళీ దేవతలుగా తయారుచేయవలసి ఉంటుంది. కావున దాని కోసం తండ్రి ఆసురీ ప్రపంచంలోకి రావలసి ఉంటుందా లేక దైవీ ప్రపంచంలోకి వస్తారా? లేక రెండింటి సంగమములో వస్తారా? కల్ప కల్పము, కల్పము యొక్క ప్రతి సంగమయుగంలో వస్తానని అంటూ ఉంటారు కూడా. తండ్రి మనకు విధంగా అర్థం చేయిస్తారు, మనం వారి శ్రీమతంపై నడుస్తున్నాము. వారంటారు, నేను మార్గదర్శకుడిగా అయి పిల్లలైన మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చాను, అందుకే నన్ను కాలుడికే కాలుడు అని కూడా అంటారు. కల్ప క్రితము కూడా మహాభారీ యుద్ధం జరిగింది, దానితో స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి. కానీ దేవీ-దేవతలు తప్ప అందరూ అయితే అక్కడకు వెళ్ళలేదు. మిగిలినవారందరూ శాంతిధామంలో ఉండేవారు. కావున నిర్వాణధామానికి యజమాని అయిన నేను అందరినీ నిర్వాణధామానికి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. మీరు రావణుడి సంకెళ్ళలో చిక్కుకొని వికారులుగా, మురికిపట్టిన వస్త్రాలుగా, ఆసురీ గుణాలు కలవారిగా ఉన్నారు. కామము నంబరువన్ అశుద్ధత. తర్వాత క్రోధము, లోభము నంబరువారు అశుద్ధతలు. కావున మొత్తం ప్రపంచం నుండి నష్టోమోహులుగా కూడా అవ్వాలి, అప్పుడే స్వర్గంలోకి వెళ్తారు. ఎలాగైతే తండ్రి హద్దు ఇంటిని నిర్మించినప్పుడు బుద్ధి అందులో నిమగ్నమవుతుంది. పిల్లలు అంటారు, బాబా, ఇందులో ఇది తయారుచేయాలి, మంచి ఇల్లు తయారుచేయాలి. అలాగే అనంతమైన తండ్రి అంటారు, నేను మీ కోసం కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని ఎంత మంచిగా తయారుచేస్తాను. కావున మీ బుద్ధియోగము పాత ప్రపంచం నుండి తెగిపోవాలి. ఇక్కడ ఉన్నదేమిటి? దేహం కూడా పాతది, ఆత్మలో కూడా మాలిన్యం చేరుకుంది. ఎప్పుడైతే మీరు యోగములో ఉంటారో, అప్పుడే అవి తొలగుతాయి. జ్ఞానం కూడా ధారణ అవుతుంది. బాబా భాషణ చేస్తున్నారు కదా. పిల్లలూ, ఆత్మలైన మీరందరూ నా రచన. ఆత్మ స్వరూపంలో సోదరులు. ఇప్పుడు మీరందరూ నా వద్దకు తిరిగి రావాలి. ఇప్పుడు అందరూ తమోప్రధానంగా అయ్యారు. ఇది రావణ రాజ్యము కదా. రావణరాజ్యము ఎప్పటి నుండి ఆరంభమవుతుందో ఇంతకుముందు మీకు తెలియదు. సత్యయుగంలో 16 కళలు ఉంటాయి, తర్వాత 14 కళలు అవుతాయి. అంతేకానీ, ఒక్కసారిగా రెండు కళలు తగ్గిపోతాయని కాదు. మెల్ల-మెల్లగా దిగుతారు. ఇప్పుడైతే కళ లేదు. పూర్తిగా గ్రహణం పట్టింది. ఇప్పుడు తండ్రి అంటారు, దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగుతుంది. 5 వికారాలను దానమివ్వండి, ఇంకే పాపము చేయకండి. భారతవాసులు రావణుడిని కాలుస్తారు, తప్పకుండా ఇది రావణ రాజ్యము. కానీ రావణ రాజ్యము అని దేనినంటారు, రామ రాజ్యము అని దేనినంటారో కూడా తెలియదు. రామరాజ్యము ఉండాలి, కొత్త భారత్ ఉండాలి అని అంటారు కానీ కొత్త ప్రపంచము,కొత్త భారత్ ఎప్పుడు ఉంటుందో ఒక్కరికి కూడా తెలియదు. అందరూ సమాధిలో నిదురించి ఉన్నారు.

ఇప్పుడు పిల్లలైన మీకైతే సత్యయుగీ వృక్షము కనిపిస్తుంది. ఇక్కడైతే దేవతలు ఎవరూ లేరు. కావున తండ్రి వచ్చి ఇవన్నీ అర్థం చేయిస్తారు. మీ తల్లి-తండ్రి వారే, స్థూలంగా మళ్ళీ వీరు తల్లిదండ్రులు. మీరే తల్లి-తండ్రి అని వారి కోసమే గానం చేస్తారు. సత్యయుగంలోనైతే అలా గానం చేయరు. అక్కడ కృప విషయం ఉండదు, ఇక్కడ తల్లిదండ్రులకు చెందినవారిగా అయి మళ్ళీ యోగ్యులుగా కూడా అవ్వవలసి ఉంటుంది. తండ్రి స్మృతినిప్పిస్తారు, భారతవాసులారా, మీరు మర్చిపోయారు, దేవతలైన మీరు ఎంత ధనవంతులుగా ఉండేవారు, ఎంత వివేకవంతులుగా ఉండేవారు. ఇప్పుడు వివేకహీనులుగా అయి దివాలా తీసేసారు. ఇలా వివేకహీనులుగా మాయా రావణుడే మిమ్మల్ని తయారుచేసాడు, అందుకే రావణుడిని కాలుస్తారు. శత్రువు దిష్టిబొమ్మను తయారుచేసి దానిని కాలుస్తారు కదా. పిల్లలైన మీకు ఎంతటి జ్ఞానం లభిస్తుంది. కానీ విచార సాగర మథనం చేయరు, బుద్ధి భ్రమిస్తూ ఉంటుంది, అప్పుడు ఇలాంటి-ఇలాంటి పాయింట్లను భాషణలో వినిపించడము మర్చిపోతారు, పూర్తిగా అర్థం చేయించరు. బాబా వచ్చి ఉన్నారని మీరైతే తండ్రి సందేశం ఇవ్వాలి. మహాభారీ యుద్ధము ఎదురుగా నిలబడి ఉంది. అందరూ తిరిగి వెళ్ళాలి. స్వర్గ స్థాపన జరుగుతుంది. తండ్రి అంటారు, దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలను మరిచి నన్ను స్మృతి చేయండి. అంతేకానీ, కేవలం ఇలా అనకండి, ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారందరూ సోదరులు అని. ఇవన్నీ అయితే దేహ ధర్మాలు కదా. అందరివి ఆత్మలు ఏవైతే ఉన్నాయో, అవి తండ్రి సంతానము. తండ్రి అంటారు, దేహ ధర్మాలన్నింటినీ వదలి నన్నొక్కరినే స్మృతి చేయండి. తండ్రి యొక్క సందేశాన్ని ఇవ్వడానికి మనం శివ జయంతిని జరుపుకుంటున్నాము. బ్రహ్మాకుమారులు, కుమారీలమైన మనం శివుని మనవలము. మనకు వారి నుండి స్వర్గ రాజధాని యొక్క వారసత్వం లభిస్తుంది. తండ్రి మనకు సందేశం ఇస్తున్నారు - మన్మనాభవ. యోగాగ్నితో మీ వికర్మలు వినాశనమవుతాయి. అశరీరిగా అవ్వండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

రాత్రి క్లాసు

ఇప్పుడు పిల్లలైన మీరు స్థూలవతనము, సూక్ష్మవతనము మరియు మూలవతనాలను మంచి రీతిలో అర్థం చేసుకున్నారు. కేవలం బ్రాహ్మణులైన మీరే జ్ఞానం పొందుతారు. దేవతలకైతే దీని అవసరమే లేదు. మొత్తం విశ్వం యొక్క జ్ఞానం ఇప్పుడు మీకు ఉంది. మీరు మొదట శూద్ర వర్ణానికి చెందినవారిగా ఉండేవారు. మళ్ళీ బ్రహ్మాకుమారులుగా అయినప్పుడు జ్ఞానం ఇస్తారు, దీని ద్వారా మీ దైవీ రాజ్యం స్థాపన అవుతూ ఉంది. తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని, సూర్యవంశీ, చంద్రవంశీ రాజ్యాలను స్థాపన చేస్తారు. వారు కూడా సంగమములో స్థాపన చేస్తారు. ఇతర ధర్మాలవారు వెంటనే రాజ్యాన్ని స్థాపన చేయరు. వారిని గురువులు అని అనరు. తండ్రే వచ్చి ధర్మాన్ని స్థాపన చేస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు శిరస్సుపై తండ్రి స్మృతి యొక్క చింత ఉంది, దీనిని ఘడియ-ఘడియ మర్చిపోతారు. పురుషార్థం చేసి వ్యాపారం మొదలైనవి కూడా చేస్తూ ఉండాలి మరియు ఆరోగ్యంగా అయ్యేందుకు స్మృతి కూడా చేస్తూ ఉండాలి. తండ్రి చాలా తీవ్రంగా సంపాదన చేయిస్తారు, ఇందులో అన్నింటినీ మర్చిపోవలసి ఉంటుంది. ఆత్మలమైన మేము వెళ్తున్నాము అని ప్రాక్టీసు చేయించడము జరుగుతుంది. తింటున్నప్పుడు తండ్రిని స్మృతి చేయలేరా ఏమిటి? వస్త్రాలు కుట్టేటప్పుడు బుద్ధియోగము తండ్రి స్మృతిలో ఉండాలి. చెత్తనైతే తొలగించుకోవాలి. బాబా అంటారు, శరీర నిర్వహణ కోసం పనైనా చేయండి. ఇది చాలా సహజము. 84 జన్మల చక్రము పూర్తయింది అని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి రాజయోగం నేర్పించేందుకు వచ్చారు. ప్రపంచపు చరిత్ర-భౌగోళికము సమయంలో రిపీట్ అవుతుంది. కల్పము క్రితం వలె రిపీట్ అవుతుంది. రిపిటీషన్ యొక్క రహస్యాన్ని కూడా తండ్రే అర్థం చేయిస్తారు. వన్ గాడ్, వన్ రిలిజియన్ అని కూడా అంటారు కదా. అక్కడే శాంతి ఉంటుంది. అది అద్వైత రాజ్యము, ద్వైతము అనగా ఆసురీ రావణ రాజ్యము. వారు దేవతలు, వీరు దైత్యులు. ఆసురీ రాజ్యము మరియు దైవీ రాజ్యము యొక్క ఆట భారత్ లోనే తయారుచేయబడి ఉంది. భారత్ యొక్క ఆది సనాతన ధర్మం ఉండేది, పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. మళ్ళీ తండ్రి వచ్చి పవిత్ర ప్రవృత్తి మార్గాన్ని తయారుచేస్తారు. మనమే దేవతలుగా ఉండేవారము, తర్వాత కళలు తగ్గుతూ వచ్చాయి. మనమే శూద్ర వంశములోకి వచ్చాము. తండ్రి ఎలా చదివిస్తారంటే, టీచర్లు చదివించినట్లుగా చదివిస్తారు, విద్యార్థులు వింటారు. మంచి విద్యార్థులు పూర్తి ధ్యాస పెడతారు, మిస్ చేయరు. చదువు రెగ్యులర్ గా ఉండాలి. ఇటువంటి ఈశ్వరీయ విశ్వవిద్యాలయములో ఆబ్సెంట్ అవ్వకూడదు. బాబా గుహ్యాతి-గుహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. అచ్ఛా, గుడ్ నైట్. ఆత్మిక పిల్లలకు నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహం యొక్క అన్ని ధర్మాలను విడిచి, అశరీరి ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. యోగం మరియు జ్ఞానం యొక్క ధారణ ద్వారా ఆత్మను పావనంగా తయారుచేసుకోవాలి.

2. తండ్రి జ్ఞానాన్ని అయితే ఇస్తారో, దానిపై విచార సాగర మంథనం చేసి అందరికీ తండ్రి సందేశం ఇవ్వాలి. బుద్ధిని భ్రమింపచేయకూడదు.

వరదానము:-

తండ్రి అడుగులో అడుగు వేస్తూ పరమాత్మ ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే ఆజ్ఞాకారి భవ


ఆజ్ఞాకారి అనగా బాప్ దాదా ఆజ్ఞ రూపీ అడుగులో అడుగు వేసేవారు. ఇటువంటి ఆజ్ఞాకారులకే సర్వ సంబంధాల ద్వారా పరమాత్మ ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇది కూడా నియమము. సాధారణ రీతిలో కూడా ఎవరైనా ఎవరి డైరెక్షన్ అనుసారంగానైనా హా జీ అంటూ కార్యం చేస్తే, అప్పుడు ఎవరి కార్యమైతే చేస్తారో వారి ఆశీర్వాదాలు వారికి తప్పకుండా లభిస్తాయి. ఇవైతే పరమాత్మ ఆశీర్వాదాలు, ఇవి ఆజ్ఞాకారీ ఆత్మలను సదా డబల్ లైట్ గా చేస్తాయి.

స్లోగన్:-

దివ్యతను మరియు అలౌకికతను తమ జీవితం యొక్క అలంకరణగా చేసుకున్నట్లయితే సాధారణత సమాప్తమైపోతుంది.

 Download PDF

Post a Comment

0 Comments