Header Ads Widget

Header Ads

TELUGU MURLI 31.12.22

 

31-12-2022  ప్రాత:మురళి  ఓంశాంతి  "బాప్ దాదా" మధువనం

 



Listen to the Murli audio file



‘‘మధురమైన పిల్లలూ - మీరు శివ జయంతి పండగను చాలా వైభవంగా జరుపుకోవాలి. ఇది మీ కోసం చాలా గొప్ప సంతోషకరమైన రోజు, అందరికీ తండ్రి పరిచయము ఇవ్వాలి’’

ప్రశ్న:-

పిల్లలు స్వయానికి చాలా ఎక్కువగా నష్టపర్చుకుంటారు? నష్టం ఎప్పుడు కలుగుతుంది?

జవాబు:-

పిల్లలైతే నడుస్తూ-నడుస్తూ చదువును వదిలేస్తారో, వారు స్వయాన్ని చాలా ఎక్కువగా నష్టపర్చుకుంటారు. బాబా రోజు ఇన్ని వజ్రాలు, రత్నాలు ఇస్తారు, గుహ్యమైన పాయింట్లు వినిపిస్తారు, ఒకవేళ ఎవరైనా రెగ్యులర్ గా వినకపోతే నష్టం కలుగుతుంది. ఫెయిల్ అవుతారు, స్వర్గం యొక్క ఉన్నతమైన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. పదవి భ్రష్టమవుతుంది.

పాట:-  రాత్రి ప్రయాణీకుడా, అలసిపోకు... (రాత్ కే రాహీ థక్ మత్ జానా...) 

ఓంశాంతి.  రాత్రి మరియు పగలు మనుష్యుల కోసము. శివబాబా కోసం రాత్రి మరియు పగలు ఉండవు. ఇవి పిల్లలైన మీ కోసము, మనుష్యుల కోసము. బ్రహ్మా రాత్రి, బ్రహ్మా పగలు అని అంటూ ఉంటారు. శివుని పగలు, శివుని రాత్రి, ఇలా ఎప్పుడూ అనడం జరగదు. కేవలం ఒక్క బ్రహ్మాను మాత్రమే అనడం జరగదు. ఒక్కరి రాత్రి అనేది ఉండదు. బ్రాహ్మణుల రాత్రి అని అంటూ ఉంటారు. మీకు తెలుసు, ఇప్పుడు ఇది భక్తి మార్గం యొక్క అంతిమము, దానితో పాటు ఘోర అంధకారం యొక్క అంతిమం కూడా. తండ్రి అంటారు - ఎప్పుడైతే బ్రహ్మా రాత్రి ఉంటుందో, అప్పుడే నేను వస్తాను. ఇప్పుడు మీరు పగలు కోసం నడవడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే మీరు వచ్చి బ్రహ్మా సంతానముగా అవుతారో, అప్పుడు మిమ్మల్ని బ్రాహ్మణులు అని అనడం జరుగుతుంది. బ్రాహ్మణుల రాత్రి పూర్తయి మళ్ళీ దేవతల పగలు ప్రారంభమవుతుంది. బ్రాహ్మణులు వెళ్ళి దేవతలుగా అవుతారు. యజ్ఞముతో చాలా పెద్ద మార్పు జరుగుతుంది. పాత ప్రపంచం మారి కొత్తదిగా అవుతుంది, కలియుగం పాత యుగము, సత్యయుగము కొత్త యుగము. మళ్ళీ త్రేతాలో 25 శాతం పాతదిగా అవుతుంది, ద్వాపరములో 50 శాతం పాతదిగా అవుతుంది. యుగం పేరే మారిపోతుంది. కలియుగాన్ని అందరూ పాత ప్రపంచమని అంటారు. ఈశ్వరుడు అని తండ్రినే అంటారు, వారు ఈశ్వరీయ రాజ్య స్థాపన చేస్తారు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము సంగమయుగములో వస్తాను. సమయమైతే పడుతుంది కదా. నిజానికి ఒక్క క్షణం యొక్క విషయము, కానీ వికర్మలు వినాశనమవ్వడంలో సమయం పడుతుంది ఎందుకంటే అర్ధకల్పము యొక్క పాపాలు శిరస్సుపై ఉన్నాయి. తండ్రి స్వర్గాన్ని రచిస్తారు కావున పిల్లలైన మీరు కూడా స్వర్గానికి యజమానులుగా అయితే అవుతారు. కానీ శిరస్సుపై పాపాల భారం ఏదైతే ఉందో, దానిని దించడంలో సమయం పడుతుంది. యోగం జోడించవలసి ఉంటుంది. స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి. ఇంతకుముందు బాబా అని అన్నప్పుడు దైహిక తండ్రి గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు బాబా అని అనడంతో బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. మేము ఆత్మలము, ఆత్మిక తండ్రి సంతానము అని ప్రపంచంలో ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మన తండ్రి, టీచరు, గురువు - ముగ్గురూ ఆత్మికమైనవారు. స్మృతి కూడా వారినే చేస్తారు. ఇది పాత శరీరము, దీనిని ఎందుకు అలంకరించాలి. కానీ లోపల, ఇప్పుడు మేము వనవాహంలో ఉన్నామని భావిస్తారు. అత్తగారిల్లు అయిన కొత్త ప్రపంచంలోకి వెళ్ళనున్నారు. చివర్లో ఏమీ మిగలదు. మనం వెళ్ళి మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతాము. సమయంలో మొత్తం ప్రపంచం వనవాహంలో ఉన్నట్లుగా ఉంది, ఇందులో ఉన్నదేమిటి, ఏమీ లేదు. అత్తగారిల్లు ఉన్నప్పుడు వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఎంతో సంపద ఉండేది. ఇప్పుడు మళ్ళీ పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఎవరి వద్దకు వచ్చారు? బాప్ దాదా వద్దకు వచ్చామని అంటారు. తండ్రి దాదాలోకి ప్రవేశించారు, దాదా అయితే ఇక్కడి నివాసులే. కావున బాప్ దాదా ఇరువురూ కంబైండ్ గా ఉన్నారు. పరమపిత పరమాత్మ పతిత-పావనుడు. వారి ఆత్మ ఒకవేళ శ్రీకృష్ణునిలో ఉన్నట్లయితే, వారు జ్ఞానము వినిపించినట్లయితే శ్రీకృష్ణుడిని కూడా బాప్ దాదా అని అంటారు. కానీ శ్రీకృష్ణుడిని బాప్ దాదా అనడము అసలు శోభించదు. బ్రహ్మాయే ప్రజాపిత అని అంటూ ఉంటారు. ఇది 5,000 సంవత్సరాల చక్రమని తండ్రి అర్థం చేయించారు. పిల్లలైన మీరు ప్రదర్శనీని చూపించినప్పుడు అందులో ఇది కూడా రాయండి - నేటికి 5,000 సంవత్సరాల క్రితం కూడా మేము ప్రదర్శనీని చూపించాము మరియు అర్థం చేయించాము - అనంతమైన తండ్రి నుండి స్వర్గం యొక్క వారసత్వము ఎలా తీసుకోవచ్చు. నేటికి 5,000 సంవత్సరాల క్రితం వలె మనం మళ్ళీ త్రిమూర్తి శివ జయంతిని జరుపుకుంటాము. పదాన్ని తప్పకుండా రాయవలసి ఉంటుంది. బాబా డైరెక్షన్లు ఇస్తున్నారు, దీనిపై నడవాలి. శివ జయంతికి ఏర్పాట్లు చేయాలి. కొత్త-కొత్త విషయాలను చూసి మనుష్యులు ఆశ్చర్యపోతారు. మంచి ఆర్భాటం చేయాలి. మనం త్రిమూర్తి శివ జయంతిని జరుపుకుంటాము. శెలవు తీసుకుంటాము. శివ జయంతికి అఫీషియల్ సెలవు ఉంటుంది. కొందరు తీసుకుంటారు, కొందరు తీసుకోరు. మీకు ఇది చాలా గొప్ప రోజు. విధంగా క్రిస్టియన్లు క్రిస్మస్ జరుపుకుంటారు. చాలా సంతోషాలు జరుపుకుంటారు. ఇప్పుడు మీరు సంతోషాన్ని జరుపుకోవాలి. మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామని అందరికీ తెలియజేయాలి. ఎవరికైతే తెలుసో వారే సంతోషాలు జరుపుకుంటారు, సెంటర్లలో పరస్పరంలో కలుసుకుంటారు. ఇక్కడికైతే అందరూ రాలేరు. మనం జన్మదినం జరుపుకుంటాము. శివబాబాకు మృత్యువైతే కలగదు. శివబాబా ఎలా వచ్చారో, అలాగే వెళ్ళిపోతారు. జ్ఞానం పూర్తయి యుద్ధం మొదలయ్యింది అంటే ఇక అంతే. వీరికి తమ శరీరమైతే లేదు. పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పూర్తి దేహీ-అభిమానులుగా అవ్వాలి, ఇందులో శ్రమ అనిపిస్తుంది. సత్యయుగములోనైతే ఆత్మాభిమానులుగా ఉంటారు. అక్కడ అకాల మృత్యువు ఉండదు. ఇక్కడ కూర్చుని-కూర్చుని ఉన్నప్పుడే మృత్యువు వచ్చేస్తుంది, హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఈశ్వరుని విధి అని అంటారు. కానీ ఈశ్వరుని విధి కాదు. మీరు డ్రామా విధి అని అంటారు. డ్రామాలో వీరి పాత్ర అలా ఉండేది. ఇప్పుడు ఉన్నదే ఇనుప యుగము, కొత్త ప్రపంచము స్వర్ణిమ యుగముగా ఉండేది. సత్యయుగపు మహళ్ళు ఎన్ని వజ్రాలతో అలంకరింపబడి ఉంటాయి. లెక్కలేనంత ధనం ఉంటుంది. కానీ దాని పూర్తి వివరణ లేదు. ఏదైనా భూకంపం మొదలైనది జరిగితే కూలిపోతాయి, కిందకు వెళ్ళిపోతాయి కావున విషయాలను అర్థం చేసుకోవడానికి బుద్ధిని ఉపయోగించాలి. ఇవి బుద్ధి కోసం ఆహారము. మీ బుద్ధి పైకి వెళ్ళింది. రచయితను తెలుసుకోవడంతో రచనను కూడా తెలుసుకుంటారు. మొత్తం సృష్టి రహస్యం బుద్ధిలో ఉంది. డ్రామాలో ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. తర్వాత బ్రహ్మా, విష్ణు, శంకరులు. మనం ముగ్గురి కర్తవ్యాల గురించి చెప్పగలము. - పాత్ర ఉందో చెప్పగలము. జగదంబకు ఎంత పెద్ద మేళా జరుగుతుంది. జగదంబ, జగత్పితలకు పరస్పరంలో ఏం సంబంధం ఉంది? ఇది ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ఇది గుప్త విషయము. తల్లి అయితే వీరు కూర్చుని ఉన్నారు, వారు దత్తత తీసుకోబడినవారు, అందుకే వారి చిత్రాలు తయారయ్యాయి. వారిని జగదంబ అని అనడము జరుగుతుంది. బ్రహ్మాకు పుత్రిక సరస్వతి. తల్లి అన్న బిరుదునైతే ఇచ్చారు కానీ వారు కూడా పుత్రిక. బ్రహ్మాకుమారి సరస్వతి అని సంతకం పెట్టేవారు. మీరు వారిని మమ్మా అని అనేవారు. బ్రహ్మాను తల్లి అనడం శోభించదు. ఇది అర్థం చేసుకునేందుకు మరియు అర్థం చేయించేందుకు చాలా రిఫైన్ బుద్ధి కావాలి. ఇవి గుహ్యమైన విషయాలు. మీరు ఎవరి మందిరంలోకి వెళ్ళినా వెంటనే వారి కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. గురునానక్ మందిరంలోకి వెళ్తే, వారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్నది వెంటనే చెప్పగలరు. మనుష్యులకైతే ఏమీ తెలియదు ఎందుకంటే కల్పం ఆయువును పెద్దదిగా చేసేసారు. మీరు వర్ణించగలరు. తండ్రి అంటారు, చూడండి, నేను మిమ్మల్ని ఎలా చదివిస్తున్నాను? ఎలా వస్తాను? శ్రీకృష్ణుని విషయమైతే కానే కాదు. గీతా పఠనం చేస్తూ ఉంటారు, కొందరు 18 అధ్యాయాలు గుర్తు పెట్టుకుంటారు, అప్పుడు వారికి ఎంత మహిమ జరుగుతుంది. ఒక శ్లోకాన్ని వినిపిస్తే వారంటారు - వాహ్! వాహ్! వీరి వంటి మహాత్ములైతే ఎవ్వరూ లేరు. రోజుల్లోనైతే రిద్ధి-సిద్ధి కూడా చాలా ఉంది. ఇంద్రజాలం యొక్క ఆటలను చాలా చూపిస్తారు. ప్రపంచంలో మోసం చాలా ఉంది. తండ్రి మీకు ఎంత సహజంగా అర్థం చేయిస్తారు కానీ చదివేవారిపై ఆధారపడి ఉంది. టీచర్ అయితే ఒకే విధంగా అర్థం చేయిస్తారు కానీ ఎవరైనా చదవకపోతే ఫెయిల్ అయిపోతారు. ఇది కూడా తప్పకుండా జరగాల్సిందే. మొత్తం రాజధాని స్థాపన అవ్వనున్నది. మీరు జ్ఞాన-స్నానం చేసి, జ్ఞాన మునకలు వేస్తూ పరిస్తాన్ యొక్క దేవకన్యలుగా అనగా స్వర్గం యొక్క యజమానులుగా అవుతారు. రాత్రి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. అక్కడ తత్వాలు కూడా సతోప్రధానంగా ఉండడంతో శరీరం కూడా ఏక్యురేట్ గా తయారవుతుంది. ప్రాకృతిక సౌందర్యము ఉంటుంది. అది ఈశ్వరుని చేత స్థాపించబడిన భూమి. ఇప్పుడు ఇది ఆసురీ భూమి. స్వర్గానికి, నరకానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీ బుద్ధిలో డ్రామా ఆది మధ్యాంతాల రహస్యం నంబరువారు పురుషార్థానుసారముగా కూర్చొని ఉంది.

తండ్రి అంటారు - మంచి రీతిలో పురుషార్థం చేయండి. కుమార్తెలు కొత్త-కొత్త స్థానాలకు వెళ్తారు. ఒకవేళ మంచి మాతలు మొదలైనవారు ఉంటే సేవను పెంచవలసి ఉంటుంది. సెంటర్లకు ఒకవేళ ఎవరైనా రాకపోతే స్వయానికి నష్టపర్చుకుంటారు. ఎవరైనా చదువుకునేందుకు రాకపోతే వారికి మళ్ళీ ఉత్తరం రాయాలి - మీరు చదవడం లేదు, దీని వలన మీకు చాలా నష్టం జరుగుతుంది. ప్రతిరోజు చాలా గుహ్యమైన పాయింట్లు వెలువడతాయి. ఇవి వజ్రాలు, రత్నాలు, మీరు చదవకపోతే ఫెయిల్ అయిపోతారు. ఇంతటి ఉన్నతమైన స్వర్గపు రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. మురళీనైతే రోజు వినాలి. ఇటువంటి తండ్రిని వదిలేస్తే గుర్తుంచుకోండి, ఫెయిల్ అయిపోతారు, తర్వాత చాలా ఏడుస్తారు. రక్తపు కన్నీరు కారుస్తారు. చదువును ఎప్పుడు విడిచిపెట్టకూడదు. బాబా రిజిష్టరు చూస్తారు. ఎంతమంది రెగ్యులర్ గా వస్తున్నారు. రానివారిని మళ్ళీ సావధానపర్చాలి. శ్రీమతం చెప్తుంది - చదవకపోతే పద భ్రష్టులుగా అవుతారు. చాలా నష్టం జరుగుతుంది. విధంగా రాయండి - అప్పుడు మీరు స్కూలును మంచి రీతిలో పైకెత్తగలుగుతారు. ఎవరూ రాకపోతే వదిలివేయడం కాదు. మా విద్యార్థులు ఎక్కువమంది పాస్ అవ్వకపోతే పరువు పోతుందని టీచరుకు చింత ఉంటుంది. బాబా రాస్తారు కూడా, మీ సెంటర్లో సేవ తక్కువగా నడుస్తుంది, బహుశా మీరు నిద్రిస్తూ ఉన్నారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పాత శరీరాన్ని అలంకరించుకోకూడదు. వనవాహంలో ఉంటూ కొత్త ఇంట్లోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి.

2. జ్ఞాన స్నానం రోజూ చేయాలి. ఎప్పుడూ కూడా చదువును మిస్ చేయకూడదు.

వరదానము:-

మహానతతో పాటు నిర్మానతను ధారణ చేసి సర్వుల గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే సుఖదాయీ భవ


మహానతకు గుర్తు నిర్మానత. ఎంత మహానతయో, అంత నిర్మానత ఎందుకంటే వారు సదా నిండుగా ఉంటారు. ఎలాగైతే వృక్షం ఎంత నిండుగా ఉంటుందో, అంతగా వంగి ఉంటుంది. కావున నిర్మానతయే సేవ చేస్తుంది మరియు ఎవరైతే నిర్మానులుగా ఉంటారో, వారు సర్వుల ద్వారా గౌరవం పొందుతారు. ఎవరైతే అభిమానంలో ఉంటారో, వారికి ఎవరూ గౌరవం ఇవ్వరు, వారి నుండి దూరంగా పారిపోతారు. ఎవరైతే నిర్మానులో, వారు సుఖదాయిగా ఉంటారు. వారి ద్వారా అందరూ సుఖాన్ని అనుభూతి చేస్తారు. అందరూ వారికి సమీపంగా రావాలని కోరుకుంటారు.

స్లోగన్:-

ఉదాసీనతకు విడాకులిచ్చేందుకు సంతోషాల ఖజానాను సదా తోడుగా పెట్టుకోండి.

 

మాతేశ్వరిగారి మధురమైన మహావాక్యాలు

పాట:- నయనహీనునికి మార్గం చూపించండి ప్రభూ... ఇప్పుడు మనుష్యులు పాటను ఏదైతే పాడుతారో, నయనహీనునికి మార్గం తెలియజేయండి అని, అంటే మార్గం చూపించేవారు ఒక్క పరమాత్మే అయినట్లు, అందుకే పరమాత్మను పిలుస్తారు మరియు సమయంలోనైతే ప్రభూ, మార్గం తెలియజేయండి అని అంటారో, తప్పకుండా మనుష్యులకు మార్గం చూపించేందుకు స్వయం పరమాత్మ నిరాకార రూపం నుండి సాకార రూపంలోకి తప్పకుండా రావలసి ఉంటుంది, అప్పుడే స్థూలంగా మార్గం తెలియజేస్తారు, రాకుండా అయితే మార్గం తెలియజేయలేరు. ఇప్పుడు మనుష్యులు ఎవరైతే తికమకపడి ఉన్నారో, తికమకలో ఉన్నవారికి మార్గము కావాలి, అందుకే పరమాత్మను, నయనహీనునికి మార్గం తెలియజేయండి ప్రభూ... అని అంటారు, వీరినే మళ్ళీ నావికుడు అని కూడా అంటారు, వారు అటువైపు తీరానికి లేక 5 తత్వాలతో సృష్టి ఏదైతే తయారుచేయబడిందో, దీనిని దాటి అటువైపు తీరానికి అనగా 5 తత్వాలకు అతీతంగా ఉన్న ఆరవ తత్వం అఖండ జ్యోతి మహతత్వం ఏదైతే ఉందో, దానిలోకి తీసుకువెళ్తారు. కావున పరమాత్మ కూడా ఎప్పుడైతే తీరం నుండి తీరానికి వస్తారో, అప్పుడే తీసుకువెళ్తారు. కావున పరమాత్మ కూడా తమ ధామం నుండి రావాల్సి ఉంటుంది, అందుకే పరమాత్మను నావికుడు అని అంటారు. వారే మన బోట్ ను (ఆత్మ రూపీ నావను) తీరానికి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఎవరైతే పరమాత్మతో యోగం పెట్టుకుంటారో, వారిని తోడుగా తీసుకువెళ్తారు. ఇక మిగిలినవారు ఎవరైతే ఉంటారో, వారు ధర్మరాజు శిక్షలు అనుభవించిన తర్వాత ముక్తులవుతారు.

2) ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల నీడలోకి తీసుకువెళ్ళు, ఇప్పుడు పిలుపు కేవలం పరమాత్మ కోసం అంటున్నారు. ఎప్పుడైతే మనుష్యులు అతి దుఃఖితులుగా అవుతారో, అప్పుడు పరమాత్మను, పరమాత్మ ముళ్ళ ప్రపంచం నుండి పుష్పాల నీడలోకి తీసుకువెళ్ళు అని స్మృతి చేస్తారు. దీనితో తప్పకుండా అది కూడా ఒక ప్రపంచము అని ఋజువు అవుతుంది. ఇప్పుడు ఇదైతే మనుష్యులందరికీ తెలుసు, ఇప్పటి ప్రపంచం ఏదైతే ఉందో అది ముళ్ళతో నిండి ఉంది. కారణంగా మనుష్యులు దుఃఖాన్ని మరియు అశాంతిని ప్రాప్తి చేసుకుంటున్నారు మరియు స్మృతి మళ్ళీ పుష్పాల ప్రపంచాన్ని చేస్తారు. కావున తప్పకుండా ప్రపంచం కూడా ఒకటి ఉంటుంది, ప్రపంచం యొక్క సంస్కారాలు ఆత్మలో నిండి ఉన్నాయి. ఇప్పుడు ఇదైతే మనకు తెలుసు, దుఃఖం-అశాంతి ఇవన్నీ కర్మబంధనం యొక్క లెక్కాచారాలు. రాజు నుండి మొదలుకొని నిరుపేద వరకు మనుష్యమాత్రులు ప్రతి ఒక్కరు లెక్కలో చిక్కుకొని ఉన్నారు, అందుకే పరమాత్మ స్వయంగా అంటారు, ఇప్పటి ప్రపంచము కలియుగము, మరి ఇదంతా కర్మబంధనంతో తయారుచేయబడి ఉంది మరియు ఇంతకుముందు ప్రపంచము సత్యయుగంగా ఉండేది, దానిని పుష్పాల ప్రపంచము అని అంటారు. అది కర్మబంధన రహిత జీవన్ముక్త దేవీ-దేవతల రాజ్యము, అది ఇప్పుడు లేదు. ఇప్పుడు మనం జీవన్ముక్తి అని ఏదైతే అంటామో, దీని అర్థము - మనం ఏమీ దేహం నుండి ముక్తులుగా ఉండేవారము అని కాదు. వారికేమీ దేహ భానం ఉండేది కాదు, కానీ వారు దేహంలో ఉంటూ కూడా దుఃఖాన్ని పొందేవారు కాదు, అంటే అక్కడ ఎటువంటి కర్మబంధనం యొక్క విషయం ఉండదు. వారు జీవితం తీసుకుంటూ, జీవితం విడిచిపెడుతూ ఆది మధ్యాంతాలు సుఖాన్ని పొందేవారు. కావున జీవన్ముక్తికి అర్థము జీవితము ఉంటూ కూడా కర్మాతీతము, ఇప్పుడు మొత్తం ప్రపంచము 5 వికారాలలో పూర్తిగా చిక్కుకొని ఉంది అనగా 5 వికారాలు పూర్తి-పూర్తిగా నివాసం ఉన్నట్లుగా ఉన్నాయి, కానీ మనుష్యులలో 5 భూతాలను జయించగలిగే అంత శక్తి లేదు, అందుకే పరమాత్మ స్వయంగా వచ్చి మనల్ని 5 భూతాల నుండి విడిపిస్తారు మరియు భవిష్య ప్రారబ్ధమైన దేవీ-దేవతా పదవిని ప్రాప్తి చేయిస్తారు. అచ్ఛా - ఓం శాంతి.

Download PDF

Post a Comment

0 Comments