30-12-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- దూరదేశము నుండి
తండ్రి ధర్మాన్ని
మరియు రాజ్యాన్ని రెండింటినీ స్థాపన
చేయడానికి వచ్చారు,
ఎప్పుడైతే దేవతా
ధర్మము ఉంటుందో,
అప్పుడు రాజ్యము
కూడా దేవతలదే
ఉంటుంది, వేరే
ధర్మము లేక రాజ్యము ఉండదు’’
ప్రశ్న:-
సత్యయుగములో అందరూ పుణ్యాత్ములు ఉంటారు, పాపాత్మ ఎవ్వరూ ఉండరు, దాని గుర్తులేమిటి?
జవాబు:-
అక్కడ కర్మభోగము (వ్యాధి) మొదలైనదేది ఉండదు. ఇక్కడ వ్యాధులు మొదలైనవి, ఆత్మలు పాపాల యొక్క శిక్షను కర్మభోగం రూపములో అనుభవిస్తున్నారని నిరూపిస్తాయి,
వీటినే గతం యొక్క లెక్కాచారాలు అని అనడము జరుగుతుంది.
ప్రశ్న:-
తండ్రి యొక్క ఏ సూచనను దూరదృష్టి కల పిల్లలే అర్థం చేసుకోగలరు?
జవాబు:-
తండ్రి సూచన ఇస్తారు - పిల్లలూ, మీరు బుద్ధియోగం యొక్క పరుగు పెట్టండి. ఇక్కడ కూర్చుని తండ్రిని స్మృతి చేయండి. ప్రేమతో స్మృతి చేసినట్లయితే
మీరు తండ్రికి కంఠహారముగా అవుతారు. మీ ప్రేమ యొక్క కన్నీళ్ళు మాలలోని మణిగా అవుతాయి.
పాట:- చివరికి ఆ రోజు నేటికి వచ్చింది... (ఆఖిర్ వహ్ దిన్ ఆయా ఆజ్...)
ఓంశాంతి. పిల్లలు పాటను విన్నారు. పాట అర్థాన్ని అర్థం చేసుకున్నారు. భారత్ అయితే చాలా పెద్దది. మొత్తం భారత్ ను చదివించలేము.
ఇదైతే చదువు - కాలేజీలు తెరవబడుతూ ఉంటాయి.
ఇది అనంతమైన తండ్రి యొక్క యూనివర్శిటీ అయినట్లు. దీనిని పాండవ గవర్నమెంట్ అని అంటారు. సామ్రాజ్యాన్ని గవర్నమెంట్ అని అంటారు.
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - సామ్రాజ్యం స్థాపన అవుతూ ఉంది. ధర్మముతో పాటు సామ్రాజ్యము. రిలీజియో పొలిటికల్...
దేవీ-దేవతా ధర్మము కూడా స్థాపించబడుతూ ఉంది, ఇంకే ధర్మమువారు రాజ్యాన్ని స్థాపించరు. వారు కేవలం ధర్మ స్థాపన చేస్తారు. బాబా అంటారు, నేను ఆది సనాతన ధర్మాన్ని మరియు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాను,
అందుకే రిలీజియో పొలిటికల్ అని అంటారు.
పిల్లలు చాలా దూరదృష్టి బుద్ధి కలవారిగా అవ్వాలి. తండ్రి దూరదేశము నుండి వచ్చి ఉన్నారు. నిజానికి ఆత్మలందరూ దూరదేశము నుండే వస్తారు. మీరు కూడా దూరదేశము నుండి వచ్చారు. కొత్త ధర్మాన్ని ఎవరైతే స్థాపించేందుకు వస్తారో - వారి ఆత్మలు దూరం నుండి వస్తాయి. వారు ధర్మ స్థాపకులు,
వీరిని ధర్మ స్థాపకులు మరియు సామ్రాజ్య స్థాపకులు అని అంటారు. భారత్ లో సామ్రాజ్యము ఉండేది.
మహారాజా-మహారాణి ఉండేవారు.
మహారాజా శ్రీ నారాయణ, మహారాణి శ్రీ లక్ష్మి. కావున ఇప్పుడు పిల్లలైన మీరు అంటారు, మేము శ్రీమతముపై నడుస్తున్నాము. బాబా అని వారినే భారతవాసులైన మనమందరము పిలుస్తూ వచ్చాము - రండి, వచ్చి పాత ప్రపంచాన్ని మార్చి కొత్త సుఖం యొక్క ప్రపంచాన్ని స్థాపన చేయండి అని. పాత ఇంటికి మరియు కొత్త ఇంటికి తేడా అయితే ఉంటుంది కదా.
బుద్ధిలో కొత్త ఇల్లే గుర్తుంటుంది. ఈ రోజుల్లోనైతే ఇళ్ళు చాలా ఫ్యాషనబుల్ గా తయారవుతున్నాయి. ఇలాంటి-ఇలాంటి ఇల్లు కట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మీకు తెలుసు, మనం మన ధర్మాన్ని మరియు రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము.
స్వర్గములో మనం వజ్ర-వైఢూర్యాల మహళ్ళను నిర్మిస్తాము. ఇతర ధర్మాల వారు ఈ విధంగా భావించరు.
ఎలాగైతే క్రైస్టు క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చారు, ఆ సమయంలో దీనిని అర్థం చేసుకోరు, ఎప్పుడైతే వృద్ధి జరుగుతుందో అప్పుడు క్రిస్టియన్ ధర్మము అని పేరు పెడతారు. ఇస్లాము మొదలైన ధర్మం యొక్క గుర్తులు లేక పేరు ఏవీ ఉండవు. మీ గుర్తులు ప్రారంభం నుండి మొదలుకొని ఇప్పటివరకు కొనసాగుతూ ఉంటాయి. లక్ష్మీ-నారాయణుల చిత్రాలు ఉన్నాయని కూడా తెలుసు అంటే వారి రాజ్యం సత్యయుగములో ఉండేది. గతములో ఎవరి రాజధాని ఉండేది, భవిష్యత్తులో ఎవరి రాజధాని ఉంటుంది - మీకు ఈ జ్ఞానము అక్కడ ఉండదు. కేవలం వర్తమానము గురించి తెలుసు,
అంతే. ఇప్పుడు మీకు భూత,
భవిష్యత్తు, వర్తమానాల గురించి తెలుసు. మొట్టమొదట మన ధర్మం ఉండేది, ఆ తర్వాత ఈ ధర్మాలు వచ్చాయి. సంగమములోనే తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు త్రికాలదర్శిగా అయ్యారు. సత్యయుగములో త్రికాలదర్శిగా ఉండరు. అక్కడైతే రాజ్యం చేస్తూ ఉంటారు, ఇతర ధర్మాల నామ-రూపాలు ఉండవు. మీరు ఆనందములో రాజ్యము చేస్తూ ఉంటారు.
ఇప్పుడు మీకు మొత్తం చక్రం గురించి తెలుసు. తప్పకుండా దేవీ-దేవతా ధర్మం ఉండేదని మనుష్యులకు తెలియదు. అది ఎలా స్థాపించబడింది, ఎంత సమయం నడిచింది అన్నది తెలియదు. మీకు తెలుసు, సత్యయుగములో ఇన్ని జన్మలు రాజ్యం చేసారు,
మళ్ళీ త్రేతాలో ఇన్ని జన్మలు తీసుకున్నారు. వీరు కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. తప్పకుండా అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. మీకు తెలుసు, ఇది కృష్ణుని ఆత్మ యొక్క అనేక జన్మల అంతిమ జన్మ, వీరిలోకే వచ్చి ప్రవేశించారు. వీరికి బ్రహ్మా అన్న పేరు తప్పకుండా ఉండాలి. బ్రహ్మా నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మా. ఈ త్రిమూర్తి జ్ఞానము చాలా సాధారణమైనది. నిరాకార తండ్రి ఈ శివుడు,
వారి నుండి ఈ వారసత్వము లభిస్తుంది. నిరాకారుడి నుండి వారసత్వం ఎలా లభించింది - ఈ ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నారు. మళ్ళీ ఆ దేవతలే
84 జన్మల తర్వాత బ్రాహ్మణులుగా అవుతారు. ఈ చక్రం బుద్ధిలో ఉండాలి.
మనమే బ్రాహ్మణులము,
బ్రహ్మా సంతానమే రుద్రుని
(శివుని) సంతానము. ఆత్మలైన మనం నిరాకారీ పిల్లలము. తండ్రిని స్మృతి చేస్తాము. ఈ చిత్రాలపై అర్థం చేయించడం చాలా సహజము. తపస్య చేస్తున్నాము, మళ్ళీ సత్యయుగములోకి వస్తాము. మనం మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉండాలి. తర్వాత దేవతా ధర్మం యొక్క చక్రవర్తిగా అయి రాజ్యం చేస్తాము. యోగముతోనే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఒకవేళ ఇప్పటికీ పాపాలు చేస్తూ ఉంటే ఏమవుతారు.
యాత్రలకు వెళ్ళేటప్పుడు పాపాలు చేయరు. పవిత్రంగా కూడా తప్పకుండా ఉంటారు. దేవతల వద్దకు వెళ్తున్నామని భావిస్తారు.
మందిరంలో కూడా ఎల్లప్పుడూ స్నానం చేసే వెళ్తారు. స్నానం ఎందుకు చేస్తారు? ఒకటేమో, వికారాలలోకి వెళ్తారు, ఇంకొకటి లెట్రిన్ కి వెళ్తారు.
మళ్ళీ స్వచ్ఛంగా అయి దేవతలను దర్శనం చేసుకునేందుకు వెళ్తారు. యాత్రలలో ఎప్పుడూ పతితంగా అవ్వరు. పావనంగా ఉంటూ 4 ధామాల ప్రదక్షిణ చేస్తారు. కావున పవిత్రత ముఖ్యమైనది. దేవతలు కూడా ఒకవేళ పతితముగా ఉన్నట్లయితే ఇక తేడా ఏమున్నట్లు.
దేవతలు పావనంగా ఉంటారు,
మనం పతితంగా ఉన్నాము. మీకు తెలుసు, బాబా మనల్ని బ్రహ్మా ద్వారా ఒడిలోకి తీసుకున్నారు. నిజానికి ఆత్మలైన మీరందరూ నా పిల్లలు, కానీ మిమ్మల్ని ఎలా చదివించాలి? రాజయోగము ఎలా నేర్పించాలి? మధురాతి-మధురమైన పిల్లలైన మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా ఎలా తయారుచేయాలి? బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారని మీకు తెలుసు. కావున భగవంతుడు తప్పకుండా పిల్లలను యోగ్యులుగా తయారుచేసి వారసత్వం ఇస్తారు. ఎక్కడ యోగ్యులుగా తయారుచేస్తారు? సంగమయుగంలో.
నేను సంగమములో వస్తానని తండ్రి అంటారు.
మధ్యలో ఉన్న ఈ బ్రాహ్మణ ధర్మమే వేరుగా ఉంటుంది. కలియుగములో శూద్ర ధర్మము ఉంటుంది.
సత్యయుగములో దేవతా ధర్మము ఉంటుంది. ఇది బ్రాహ్మణ ధర్మము. మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందినవారు.
ఈ సంగమయుగము చాలా చిన్నది.
ఇప్పుడు మీరు మొత్తం చక్రాన్ని తెలుసుకున్నారు. దూరదృష్టి కలవారిగా అయ్యారు.
మీకు తెలుసు, ఇది బాబా రథము,
దీనిని నందీ గణము అని కూడా అంటారు. రోజంతా ఏమైనా స్వారీ ఉంటుందా.
ఆత్మ శరీరముపై రోజంతా స్వారీ చేస్తుంది.
వేరైపోతే శరీరం ఉండదు. బాబా అయితే రాగలరు-వెళ్ళగలరు ఎందుకంటే వారికి తమ ఆత్మ ఉంది.
కావున నేను వీరిలో సదా ఉండను, క్షణములో రాగలను-వెళ్ళగలను. నా లాంటి వేగవంతమైన రాకెట్ ఏది ఉండజాలదు.
ఈరోజుల్లో రాకెట్, విమానాలు మొదలైన వస్తువులను ఎన్నో తయారుచేసారు. కానీ అన్నింటికన్నా వేగవంతమైనది ఆత్మ.
మీరు తండ్రిని స్మృతి చేసిన వెంటనే వారు వచ్చేస్తారు. ఆత్మ లెక్కాచారాల అనుసారముగా లండన్ లో జన్మ తీసుకోవాల్సి ఉంటే క్షణములో అక్కడికి వెళ్ళి గర్భములో ప్రవేశిస్తుంది. కావున అన్నింటికన్నా వేగముగా పరిగెత్తేది ఆత్మ. ఇప్పుడు ఆత్మ తన ఇంటికి వెళ్ళలేదు ఎందుకంటే ఆ శక్తియే లేదు. బలహీనమైపోయింది, ఎగరలేదు. ఆత్మపై పాపాల భారము చాలా ఉంది, శరీరముపై ఒకవేళ భారం ఉన్నట్లయితే అది అగ్ని ద్వారా పవిత్రమవుతుంది, కానీ ఆత్మలోనే మాలిన్యం చేరుకుంటుంది.
కావున ఆత్మయే తనతోపాటు లెక్కాచారాలను తీసుకువెళ్తుంది, అందుకే గతం యొక్క కర్మభోగము అని అనడం జరుగుతుంది. ఆత్మ సంస్కారాలను తనతోపాటు తీసుకువెళ్తుంది. కొందరు జన్మతోనే కుంటివారిగా ఉంటే అప్పుడు గతంలో అటువంటి కర్మలు చేసారని అనడం జరుగుతుంది. జన్మ-జన్మాంతరాల కర్మలు ఉన్నాయి,
వాటిని అనుభవించవలసి ఉంటుంది.
సత్యయుగంలో పుణ్యాత్ములే ఉంటారు.
అక్కడ ఈ విషయాలు ఉండవు. ఇక్కడ అందరూ పాపాత్ములు ఉంటారు. సన్యాసులకు కూడా పక్షవాతం వస్తే దానిని కర్మభోగము అని అంటారు.
అరే, మహాత్మ శ్రీ శ్రీ 108
జగద్గురువుకు మరి ఈ అనారోగ్యం ఎందుకు?
కర్మభోగము అని అంటారు. దేవతల కోసం ఇలా అనరు. గురువు మరణిస్తే ఫాలోవర్స్ కు తప్పకుండా చింత కలుగుతుంది. తండ్రిపై కూడా ఎక్కువ ప్రేమ ఉంటే ఏడుస్తారు. స్త్రీకి పతిపై ఎక్కువ ప్రేమ ఉంటే ఏడుస్తుంది.
పతి దుఃఖాన్ని ఇచ్చేవారైతే ఏడ్వదు. మోహము లేకపోతే విధి రాత అని భావిస్తుంది. మీకు కూడా తండ్రిపై చాలా ప్రేమ ఉంది. చివర్లో బాబా వెళ్ళిపోతే - మీరంటారు, ఓహో!
బాబా, ఎవరైతే ఇంతటి సుఖాన్ని ఇచ్చారో,
వారు వెళ్ళిపోయారు!
చివర్లో చాలామంది ఉంటారు.
తండ్రిపై చాలా ప్రేమ ఉంటుంది. బాబా మాకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళిపోయారని మీరు అంటారు. ప్రేమ కన్నీళ్ళు వస్తాయి, దుఃఖానివి కావు. ఇక్కడ కూడా పిల్లలు చాలాకాలం తర్వాత వచ్చి తండ్రిని కలుస్తారు, అప్పుడు ప్రేమ కన్నీళ్ళు వస్తాయి.
ఈ ప్రేమ కన్నీళ్ళు మళ్ళీ మాలలోని మణులుగా అవుతాయి.
మనం బాబాకు కంఠహారముగా అవ్వాలన్నదే మన పురుషార్థము, అందుకే బాబాను స్మృతి చేస్తూ ఉంటారు.
బాబా ఆజ్ఞ ఉంది - స్మృతి యాత్ర చేస్తూ ఉండండి. ఎలాగైతే ఫలానా స్థానాన్ని ముట్టుకొని రండి అని పరిగెత్తించడం జరుగుతుంది, మళ్ళీ నంబరువారుగా ఉంటారు. ఇక్కడ కూడా ఎంతగా బాబాను ఎక్కువగా స్మృతి చేస్తారో, ఎవరైతే మొదట పరుగు తీసి వస్తారో, వారే మళ్ళీ మొదట స్వర్గములోకి తిరిగి వచ్చి రాజ్యం చేస్తారు. ఆత్మలైన మీరందరూ బుద్ధి యోగం ద్వారా పరుగు తీస్తున్నారు. ఇక్కడ కూర్చొని ఉంటూ అక్కడకు పరుగు తీస్తున్నారు. మనం శివబాబాకు పిల్లలము. బాబా సూచననిస్తున్నారు - నన్ను స్మృతి చేయండి, దూరదృష్టికలవారిగా అవ్వండి. మీరు దూరదేశము నుండి వచ్చారు. ఇప్పుడు ఈ పరాయి దేశము వినాశనమవుతుంది. ఈ సమయంలో మీరు రావణుని దేశములో ఉన్నారు,
ఈ ధరణి రావణుడిది. మళ్ళీ మీరు అనంతమైన తండ్రి ధరణిపైకి వస్తారు. అక్కడ ఉన్నది రామరాజ్యము. రామరాజ్యాన్ని తండ్రి స్థాపన చేస్తారు.
మళ్ళీ సగంలో రావణ రాజ్యము డ్రామానుసారముగా రచించబడి ఉంది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీకే తెలుసు,
అందుకే మీరు ప్రశ్న అడుగుతారు, ఎవ్వరూ చెప్పలేరు. ఒకవేళ ఆత్మకు ఫాదర్, గాడ్ ఫాదర్ అని అంటే, అచ్ఛా - మీకు వారి నుండి ఏం వారసత్వం లభించాలి?
ఇది పతిత ప్రపంచము. తండ్రి పతిత ప్రపంచాన్ని అయితే రచించలేదు కదా. ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. చిత్రాన్ని చూపించవలసి ఉంటుంది. త్రిమూర్తి చిత్రం ఎంత బాగుంది.
ఇలా నియమానుసారముగా త్రిమూర్తి శివుని చిత్రము ఎక్కడా లేదు. బ్రహ్మాకు గడ్డం చూపిస్తారు. విష్ణువుకు మరియు శంకరునికి చూపించరు. వారిని దేవతలుగా భావిస్తారు. బ్రహ్మా అయితే ప్రజాపిత. ఒకరు ఒకలాగ, ఇంకొకరు ఇంకోలాగ తయారుచేసారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి, ఇంకెవ్వరి బుద్ధిలోకి రావు. వెర్రివారి వలె ఉన్నారు.
రావణుడిని ఎందుకు కాలుస్తారో ఏమీ తెలియదు.
రావణుడు ఎవరు? ఎప్పటి నుండి వచ్చాడు? అనాది కాలముగా కాలుస్తున్నామని అంటారు.
ఇతడు అర్ధకల్పం యొక్క శత్రువు అని మీరు అర్థం చేసుకున్నారు. ప్రపంచములో అనేక మతాలు ఉన్నాయి, ఎవరు ఏ విధంగా అర్థం చేయిస్తే ఆ పేరును పెట్టేసారు. కొందరు మహావీరుడు అన్న పేరును పెట్టారు. ఇప్పుడు మహావీరునిగా అయితే హనుమంతుడిని చూపిస్తారు. ఇక్కడ ఆది దేవ్ మహావీర్ అన్న పేరును ఎందుకు పెట్టారు?
మందిరంలో మహావీర్, మహావీరిణి మరియు పిల్లలైన మీరు కూర్చున్నారు. వారు మాయపై విజయం పొందారు, అందుకే మహావీర్ అని అంటారు.
మీరు కూడా అప్రయత్నంగానే మీ స్థానములోకి వచ్చి కూర్చున్నారు. అది మీ స్మృతిచిహ్నము. అది జడమైనది. అయినా కూడా ఎప్పటివరకైతే చైతన్యమైనవారి వద్దకు వచ్చి అర్థం చేసుకోరో, అప్పటివరకు చిత్రాలను తప్పకుండా పెట్టవలసి ఉంటుంది. దిల్వాడా మందిరం రహస్యాన్ని చాలా బాగా అర్థం చేయించవచ్చు. వీరు చదువుకొని వెళ్ళారు, అందుకే భక్తి మార్గములో ఈ స్మృతిచిహ్నాలు తయారయ్యాయి. మీ రాజధానిని స్థాపించడంలో చాలా శ్రమ అనిపిస్తుంది.
నిందలు కూడా తినవలసి ఉంటుంది ఎందుకంటే కళంకధారులుగా అవ్వాలి. ఇప్పుడు మీరందరూ నిందలు తింటారు.
అందరికన్నా ఎక్కువగా నన్ను నింద చేసారు.
మళ్ళీ ప్రజాపిత బ్రహ్మాను కూడా నిందిస్తారు.
మిత్ర-సంబంధీకులు మొదలైనవారందరూ గొడవపడతారు. విష్ణువును లేక శంకరుడిని ఏమైనా నిందిస్తారా. తండ్రి అంటారు
- నేను నిందలు తింటాను. మీరు పిల్లలుగా అయ్యారు కావున మీరు కూడా భాగం పంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే వీరు తమ వ్యాపారములో ఉండేవారు, అక్కడ నింద విషయమే లేదు.
అందరికన్నా ఎక్కువగా నన్నే నిందిస్తారు. తమ ధర్మాన్ని-కర్మను మర్చిపోయారు.
ఎంతగా అర్థం చేయిస్తాము. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
దూరదృష్టి కలవారిగా అవ్వాలి.
స్మృతి యాత్రతో వికర్మలను వినాశనం చేసుకోవాలి. యాత్రలో ఏ పాప కర్మను చేయకూడదు.
2.
మహావీరులుగా అయి మాయపై విజయం పొందాలి. నిందకు భయపడకూడదు,
కళంకధారులుగా అవ్వాలి.
వరదానము:-
సర్వ శక్తులను
అనుభవం చేస్తూ
సమయానికి సిద్ధిని
ప్రాప్తించుకునే నిశ్చిత
విజయీ భవ
సర్వ శక్తులతో సంపన్నులైన నిశ్చయబుద్ధి పిల్లలకు విజయం నిశ్చితము. ఎలాగైతే ఎవరి వద్దనైనా ధనం యొక్క, బుద్ధి యొక్క లేక సంబంధ-సంపర్కాల శక్తి ఉంటే వారికి - ఇదేమంత పెద్ద విషయము అని నిశ్చయం ఉంటుంది! మీ వద్దనైతే అన్ని శక్తులు ఉన్నాయి. అన్నింటికన్నా
గొప్ప ధనమైన అవినాశీ ధనము సదా తోడుగా ఉంది, కనుక ధనం యొక్క శక్తి కూడా ఉంది, బుద్ధి మరియు పొజిషన్ యొక్క శక్తి కూడా ఉంది, కేవలం వాటిని ఉపయోగించండి,
స్వయం కోసం కార్యంలో ఉపయోగించినట్లయితే సమయానికి విధి ద్వారా సిద్ధి ప్రాప్తిస్తుంది.
స్లోగన్:-
వ్యర్థాన్ని చూడడము లేక వినడము అనే భారాన్ని సమాప్తం చేయడమే డబల్ లైట్ గా అవ్వడము.
0 Comments