29-12-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- ఎవరు ఎంత గుణవంతులైనా, మధురమైనవారైనా, ధనవంతులైనా మీరు
ఎవ్వరివైపు ఆకర్షితులవ్వకూడదు, దేహాన్ని స్మృతి
చేయకూడదు’’
ప్రశ్న:-
ఏ పిల్లలకైతే జ్ఞానము లభించిందో వారి నోటి నుండి తండ్రి గురించి ఎటువంటి మధురమైన మాటలు వెలువడతాయి?
జవాబు:-
ఓహో! బాబా, మీరైతే మాకు ప్రాణదానమిచ్చారు.
మధురమైన బాబా, మీరు మాకు సృష్టి ఆదిమధ్యాంత జ్ఞానాన్ని ఇచ్చి సర్వ దుఃఖాల నుండి విముక్తులుగా చేసారు కావున ఎన్ని ధన్యవాదాలు వెలువడాలి.
ప్రశ్న:-
అంతిమ సమయంలో తండ్రి తప్ప ఇంకెవ్వరిపైనా
మోహము వెళ్ళకుండా ఉండేందుకు ఏమి చేయాలి?
జవాబు:-
బాబా అంటారు, పిల్లలూ - లోభానికి వశమై ఏ వస్తువునూ మీ వద్ద ఎక్స్ ట్రాగా ఉంచుకోకూడదు. ఎక్స్ ట్రా ఉంచుకుంటే దానివైపు మోహము వెళ్తుంది. తండ్రి స్మృతిని మర్చిపోతారు.
పాట:- ఓర్పు వహించు మానవా... (ధీరజ్ ధర్ మనువా...)
ఓంశాంతి. పిల్లలకు ఓర్పును ఎవరు ఇస్తున్నారు? పిల్లల బుద్ధి వెంటనే అనంతమైన తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. అదీ ఈ సమయంలోనే పిల్లలైన మీ బుద్ధి వెళ్తుంది. ఆ మాటకొస్తే అనంతమైన తండ్రి వైపుకు అనేకుల బుద్ధి వెళ్తుంది, కానీ వారికి ఇది సంగమయుగమని, తండ్రి వచ్చి ఉన్నారని తెలియదు. అందరికీ ఒకేసారి తెలియదు కదా.
పిల్లలు తండ్రికి చెందినవారిగా అయితే, అప్పుడు తెలుస్తుంది.
ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకున్నారు. తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. 5000 సంవత్సరాల క్రితం మీకు ఇచ్చిన అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు. వారు పిల్లలకు అనంతమైన స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకే వస్తారు.
వారు అనంతమైన తండ్రి అయి ఉండి చదివిస్తారు కూడా.
భగవంతుడు అనగా తండ్రి, తర్వాత భగవానువాచ అనగా చదివించడము.
ఏం చదివిస్తారు?
అది కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. మనం తండ్రి సమ్ముఖముగా కూర్చున్నాము.
బాబా శాస్త్రాలను ఏమీ చదవలేదు.
ఈ దాదా చదివారు. వారిని జ్ఞానసాగరుడు,
ఆల్మైటీ అథారిటీ అని అంటారు. వారు స్వయం కూడా ఏమంటారంటే - నాకు సర్వ వేదాలు, శాస్త్రాలు మొదలైనవాటన్నింటి గురించి బాగా తెలుసు, అవన్నీ భక్తి మార్గపు సామాగ్రి, అవి నా ద్వారా రచింపబడినవి కావు. ఈ శాస్త్రాలను ఎప్పటి నుండి చదువుతూ వచ్చారు అని అడగడం జరుగుతుంది. అప్పుడు, అది పరంపరగా నడుస్తూ వస్తోంది అని అంటారు.
తండ్రి అంటారు, నన్ను చదివించేవారు ఎవరూ లేరు. అలాగే నాకు తండ్రి కూడా ఎవరూ లేరు.
మిగిలినవారందరూ గర్భంలో ప్రవేశిస్తారు, తల్లి పాలనను తీసుకుంటారు.
తల్లి పాలనను తీసుకునేందుకు నేను గర్భములోకే రాను.
మనుష్యుల ఆత్మ గర్భంలోకి వెళ్తుంది. సత్యయుగం యొక్క లక్ష్మీ-నారాయణులు కూడా గర్భం ద్వారా జన్మ తీసుకున్నారు. కావున వారు కూడా మనుష్యులైనట్లు. నేనైతే ఈ శరీరములోకి డ్రామా ప్లాన్ అనుసారముగా కల్పపూర్వము వలె ప్రవేశిస్తాను. ఈ పదాలు ఇంకెవ్వరికీ తెలియవు.
కల్పం ఆయువు గురించే అసలు ఎవరికీ తెలియదు. తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు, నేను మీకు తండ్రిని కూడా,
శిక్షకుడిని కూడా మరియు సద్గురువును కూడా.
ఈ తండ్రి ఆస్తిని ఇచ్చేవారు అని మీకు తెలుసు.
తండ్రి స్వర్గ రాజ్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు. వారు నరకపు రాజ్యాన్ని ఏమైనా ఇస్తారా! అనంతమైన తండ్రి మనకు రాజయోగము నేర్పిస్తున్నారని బుద్ధిలో ఉండాలి.
తండ్రి స్వర్గ స్థాపన చేసేవారు. వారు అంటారు, నా మతముపై నడవండి, నేను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారుచేస్తాను. మళ్ళీ ద్వాపరము నుండి మీరు రావణుని మతముపై నడుస్తారు. సత్యయుగములో గతి సద్గతిల కోసం మనుష్యుల మతము ఏదీ లభించదు. అక్కడ వాటి అవసరం ఉండదు. కలియుగములో అందరూ గతి, సద్గతుల కోసం మతము కోరుకుంటారు. తాము ఏదో సమయంలో స్వర్గములో ఉండేవారని, పావనులుగా ఉండేవారని వారికి తెలుసు. కావుననే హే పతిత పావనా, హే సద్గతిదాతా, మాకు సద్గతిని ఇవ్వండి అని పిలుస్తారు. సత్యయుగములో ఇలా పిలవరు. బాబా వచ్చి ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు.
చాలా సరళతతో రాజయోగము మరియు సహజ జ్ఞానము యొక్క మతాన్ని ఇస్తారు. వారి శ్రీమతము ఉంది. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, వారికన్నా ఉన్నతమైనవారు ఇంకెవ్వరూ లేరు మరియు వారు మన ఆత్మిక తండ్రి.
ఆత్మిక తండ్రి అయిన కారణంగా వారు ఆత్మలకే జ్ఞానము ఇస్తారు.
దైహిక తండ్రి ఉంటే పిల్లలు దైహిక జ్ఞానం తీసుకుంటారు, అందుకే తండ్రి అంటారు - ఆత్మాభిమానులుగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి.
ఏ విధమైన దైహిక స్మృతి ఉండకూడదు.
మీరు ఆత్మ.
మనుష్యులు ఎంత మంచివారైనా, ధనవంతులైనా, మధురమైనవారైనా కానీ దేహధారులను స్మృతి చేయకూడదు. ఒక్క పరమపిత పరమాత్ముడినే స్మృతి చేయాలి. ఎవరైనా షావుకారుకు కొడుకు ఉంటే అతను తండ్రినే తలచుకుంటారు.
గాంధీ లేక శాస్త్రీ మొదలైనవారిని ఏమైనా తలచుకుంటారా. అందరికన్నా ఎక్కువగా పరమపిత పరమాత్ముడినే తలచుకుంటారు,
ఆ తర్వాత కొందరు లక్ష్మీ-నారాయణులను,
కొందరు రాధే-కృష్ణులను కూడా తలచుకుంటారు. వీరు ఒకప్పుడు ఉండి వెళ్ళారని భావిస్తారు. వారి చరిత్ర మరియు భౌగోళము కూడా ఉన్నాయి. ఉన్నతోన్నతమైనవారు తండ్రి,
వారు మళ్ళీ వస్తారు, ప్రపంచ చరిత్ర మరియు భౌగోళము తప్పకుండా రిపీట్ అవుతాయి. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. కానీ,
ఇది పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కేవలం నామమాత్రంగా చరిత్ర, భౌగోళములు రిపీట్ అవుతాయి అని అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. మొదట మీరు కూడా అలానే ఉండేవారు. తప్పకుండా లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేదని భావించేవారు, కానీ అది ఎంతకాలం నడిచింది,
ఆ తర్వాత ఏమైంది, తర్వాత వారు ఎక్కడికి వెళ్ళిపోయారు, అవేమీ తెలియవు. ఇప్పుడు కూడా నంబరువారుగా బాగా ధారణ చేసి శ్రీమతంపై నడుస్తున్నారు - ఇది కూడా మంచిదే.
మనసా, వాచా,
కర్మణా సహాయం చేస్తున్నారు. జ్ఞానము మరియు యోగము యొక్క సహాయము ద్వారా అనేకుల కళ్యాణము చేస్తారు.
శక్తి సేన అయిన మీరు డబుల్ అహింసకులు. మీలో ఎటువంటి హింసా లేదు. మీరు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వరు.
హింస అనగా దుఃఖము ఇవ్వడము. ఎవరినైనా గట్టిగా కొట్టడము, ఖడ్గాన్ని ఉపయోగించడము లేక కామ వికారములోకి వెళ్ళడము
- ఇదంతా దుఃఖము ఇవ్వడమే.
మీరు ఏ రకమైన దుఃఖము ఇవ్వరు,
అందుకే అహింసా పరమోధర్మము అని అంటారు.
మనుష్యులైతే అంతా హింస చేస్తారు. ఇది ఉన్నదే రావణ రాజ్యము. మనుష్యులు శ్రీకృష్ణుని చరిత్రలో కూడా హింసను చూపించారు. శ్రీకృష్ణుడు రాజకుమారుడని, అతనికి ఇటువంటి చరిత్ర లేక జీవిత కథ యొక్క విషయమే ఉండదని పిల్లలైన మీకు తెలుసు. చరిత్ర ఒక్క ఈశ్వరునిదే. వారే రత్నాకరుడు, వ్యాపారస్థుడు, జ్ఞానసాగరుడు,
ఇంద్రజాలికుడు. అరే, నిరాకారుడైన పరమాత్మ వ్యాపారము ఎలా చేస్తారు?
వ్యాపారస్థుడు అంటే మనిషే అవుతారు కదా.
వారు ఏ విధంగా రత్నాకరుడిగా మరియు వ్యాపారస్థుడుగా అవుతారు అన్న ఈ విషయాలన్నింటి గురించి మీకే తెలుసు. వారిని అందరూ ఎందుకు స్మృతి చేస్తారు?
హే పతిత పావనా, సర్వుల సద్గతి దాత, దుఃఖహర్త,
సుఖకర్త. మహిమ కూడా ఆ ఒక్కరిదే. ఈ మహిమ సూక్ష్మవతనవాసులదీ కాదు,
అలాగే స్థూలవతనవాసులదీ కాదు.
ఈ మహిమ మూలవతనవాసిదే. ఉన్నతోన్నతమైనవారు తండ్రి,
ఆత్మలమైన మనం వారి పిల్లలము. మనమందరమూ నంబరువారుగా పాత్రను అభినయించేందుకు వస్తాము. తండ్రి అంటారు
- ఈ జ్ఞానము ఏదైతే మీకు వినిపిస్తానో అది కనుమరుగైపోతుంది. ఆ గీతలైతే లెక్కలేనన్ని ఉన్నాయి.
అయినా కానీ పాత గీతలను వెలికి తీస్తారు. మీ కాగితాలు ఏమైనా వెలువడతాయా. గీత అనేక భాషలలో ఉంది.
ఉన్నతోన్నతమైనది గీతయే కానీ వాటన్నింటినీ తయారుచేసింది మనుష్యులే, అవి యథార్థమైనవైతే కాదు కావుననే అందరూ అంధకారంలో ఉన్నారు. అందుకే జ్ఞానసూర్యుడు ఉదయించారు... అని అంటారు. అది ఈ సూర్యుని మహిమ కాదు. ఇది జ్ఞాన సూర్యుని మహిమ.
ఈ సూర్యుడు ఎండను ఇస్తాడు, సాగరము నీటిని ఇస్తుంది. వారు పేర్లను తారుమారు చేసేసారు.
జ్ఞానసాగరుడినే జ్ఞానసూర్యుడు అని అంటారు. ఇప్పుడు మన అంధకారమంతా దూరమైపోయిందని మీకు తెలుసు. సృష్టి ఆదిమధ్యాంతముల గురించి మీకే తెలుసు. రచయిత పాత్రను తెలుసుకున్నప్పుడు ఇతరుల పాత్రను కూడా తప్పకుండా తెలుసుకొని ఉంటారు.
మీకు ఇప్పుడు జ్ఞానము లభిస్తోంది. ఈ తండ్రి చాలా ప్రియమైనవారని మీకు తెలుసు. వారు మనకు ప్రాణదానం చేస్తారు.
దుఃఖము నుండి విడిపిస్తారు. మృత్యువు పిడికిలి నుండి విడిపిస్తారు. ఎవరినైనా మరణించడం నుండి రక్షిస్తే, డాక్టరు ప్రాణదానం చేసారు అని అంటారు. మీకైతే ఒకేసారి ఎటువంటి ప్రాణదానం లభిస్తుందంటే
- ఇక దాని ద్వారా మీరు ఎప్పుడూ రోగగ్రస్థులుగా అవ్వరు,
అప్పుడిక ఫలానావారు ప్రాణదానం చేసారు అని అనవలసిన అవసరం రాదు. ఇది పూర్తిగా కొత్త విషయము.
ఇప్పుడు మీరు జీవిస్తూనే తండ్రికి చెందినవారిగా అయ్యారు. కొందరిని మాయా రావణుడు తనవైపుకు లాగేస్తాడు.
దానిని రావణరూపీ మృత్యువు కబళించివేసింది అని అంటారు. ఈశ్వరీయ ఒడిలోకి వచ్చి మళ్ళీ మారి ఆసురీ ఒడిలోకి వెళ్ళిపోతారు. మృత్యువు కబళించలేదు కానీ జీవిస్తూనే ఈశ్వరునికి చెందినవారిగా అయి మళ్ళీ జీవిస్తూనే రావణునికి చెందినవారిగా అవుతారు. ఇక్కడ ధర్మాత్ములుగా అయి మళ్ళీ అక్కడకు వెళ్ళి అధర్ములుగా అయిపోతారు. ఇక్కడ సంగమములో ధర్మము యొక్క రాజ్యము ఉంది, అక్కడ అధర్మము యొక్క రాజ్యము ఉంది. సత్యయుగంలో ఉండేది ఒక్క ధర్మమే. కలియుగంలో అధర్మము యొక్క రాజ్యము, కౌరవ రాజ్యము ఉంది. పాండవులతో శ్రీకృష్ణుడు ఉన్నారని అంటారు. మీతో శివబాబా ఉన్నారు. ఇక్కడ జూదము విషయమేమీ లేదు.
రాజ్యము కౌరవులదీ కాదు,
పాండవులదీ కాదు. తండ్రి వచ్చి ధర్మము యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తారు.
రామరాజ్యము కావాలని, తాము స్వర్గవాసులుగా అవ్వాలని కోరుకుంటారు కూడా అనగా ఇది నరకమనే కదా. కానీ ఎవరినైనా డైరెక్టుగా నరకవాసి అని అంటే డిస్టర్బ్ అవుతారు. తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. అనంతమైన తండ్రి నిరాకారుడు. అనంతమైన తండ్రినే భగవంతుడు అని అంటారు. హద్దులోని తండ్రిని భగవంతుడు అని ఏమైనా అంటారా. శ్రీకృష్ణుడిని జ్ఞానసాగరుడు, పతితపావనుడు అని ఏమైనా అంటారా. వారి మహిమను గురించి కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. మిమ్మల్ని తండ్రి వచ్చి తమ సమానంగా తయారుచేస్తారు. తండ్రికీ తెలుసు, పిల్లలైన మీరూ తెలుసుకుంటారు, వారసత్వం లభిస్తుంది. ఏ విధంగానైతే లౌకిక తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుందో,
అలా ఇక్కడా లభిస్తుంది. వారు వేరు, వేరు. ఇక్కడ మీరు - మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతున్నామని భావిస్తారు. ఈ విధంగా ఏ స్కూల్లోనూ లేక సత్సంగములోనూ, అందరూ, మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకొనేందుకు వచ్చాము అని అనరు. ఇక్కడ తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు.
మీరు నరుని నుండి నారాయణునిగా అవుతారు అని అంటారు.
అది తప్పకుండా సంగమయుగము అనగా కలియుగాంతము మరియు సత్యయుగ ఆది... వీటి సంగమములోనే మీరు పురుషార్థము చేసి నరుని నుండి నారాయణునిగా అవుతారు. ఈ రాజయోగాన్ని మనము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యేందుకు తండ్రి నుండి నేర్చుకుంటున్నాము. నర-నారాయణుని మందిరాన్ని కూడా నిర్మిస్తారు. అతనికి నాలుగు భుజాలను చూపిస్తారు ఎందుకంటే జంటగా ఉన్నారు. నారి అయిన లక్ష్మి యొక్క మందిరము లేదు.
నారి అయిన లక్ష్మిని దీపావళి నాడు పిలుస్తారు. ఆమెను మహాలక్ష్మి అని అంటారు. మీరు లక్ష్మి మూర్తిని నాలుగు భుజాలు లేకుండా చూడరు.
ఎవరినైతే పూజిస్తారో ఆ యుగళ రూపము విష్ణువు రూపము. కావుననే నాలుగు భుజాలను చూపించారు. ఈ విషయాలన్నింటినీ తండ్రియే అర్థం చేయిస్తారు. మనుష్యులకైతే ఏమీ తెలియదు. భగవంతుడిని వెతుకుతూ ఉంటారు. ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుడు పైనే ఉంటారు, ఇక వెతకవలసిన అవసరమేముంది. మందిరములో శ్రీకృష్ణుని చిత్రమేదైతే ఉందో,
ఆ చిత్రాన్ని ఇంట్లో పెట్టుకొని ఎందుకు పూజించరు? విశేషంగా మందిరములోకే ఎందుకు వెళ్తారు? మందిరములోకి వెళ్తారు, ధనం పెడతారు, దానం చేస్తారు. ఇంట్లో దానమెవరికి చేస్తారు? కావున ఇవన్నీ భక్తి మార్గపు ఆచారాలు. తండ్రి అంటారు, మీరు ఏ చిత్రాలను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు శివబాబా గురించి తెలియదా, మరి చిత్రాన్ని ఎందుకు పెట్టుకుంటున్నారు? చిత్రము పెట్టుకోవడం ద్వారా స్మృతి చేయగలుగుతారా? బాబా జీవించి ఉన్నారు కావున పిల్లలు చిత్రము ఎందుకు పెట్టుకుంటారు? తండ్రి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు, మరి చిత్రాన్ని ఏం చేసుకుంటారు? వృద్ధులైతే స్మృతిని మర్చిపోతారు కావున చిత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది.
ఇంకే దేహధారులనైనా స్మృతి చేస్తూ ఉంటే అంతిమ సమయంలో వారే గుర్తుకొస్తారు. ఎటువైపైనా మోహము ఉంటే, అది మీ వెంట పడుతుంది. ఇక అప్పుడు శివబాబా చిత్రాలు ఎన్ని పెట్టుకున్నా సరే,
ఒకవేళ మోహము ఇంకొకవైపు ఉంటే వారు తప్పకుండా గుర్తుకువస్తారు, కావుననే తండ్రి అంటారు,
పిల్లలూ, పూర్తి నష్టోమోహులుగా అవ్వండి. ఏ వస్తువుపైనైనా మోహము ఉంటే, 2-4 జతల చెప్పులు ఉంటే, అవి గుర్తుకొస్తాయి. కావుననే ఏ వస్తువులను ఎక్కువగా ఉంచుకోకూడదు అని చెప్పడం జరుగుతుంది. లేకపోతే బుద్ధి వాటివైపుకే వెళ్తుంది. తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి. మేము మంచి-మంచి వస్త్రాలను ఉంచుకోవాలని, 2-4 జతల చెప్పులు ఉంచుకోవాలని, గడియారము ఉంచుకోవాలని, కాస్త ధనం ఉంచుకోవాలని లోభం కలుగుతుంది కదా. ఉంచుకున్నట్లయితే అవి గుర్తుకువస్తాయి. మీ వద్ద ఏం ఉంచుకున్నారో బాబాకు తెలిసి ఉండాలి. నిజానికి మీరు ఏమీ ఉంచుకోకూడదు,
మీకేదైతే లభిస్తుందో అదే ఉంచుకోవాలి. ఒక్క తండ్రి తప్ప ఇంకేమీ గుర్తుకురాకూడదు. ఇంతటి అభ్యాసము చేయాలి, అప్పుడే విశ్వాధిపతులుగా అవుతారు. రాధే-కృష్ణులు విశ్వాధిపతులుగా ఉండేవారని ఎవరికీ తెలియదు, కేవలం వారు భారత్ లో రాజ్యము చేసి వెళ్ళారు అని అంటారు.
యమునా నదీ తీరంపై వీరి మహళ్ళు ఉండేవి. కానీ,
వారు మొత్తం విశ్వమంతటికీ అధిపతులుగా ఉండేవారు.
ఇది కేవలం మీ బుద్ధిలోనే ఉంది. అనంతమైన తండ్రి అనంతమైన అధిపతులుగా తయారుచేసేందుకు వచ్చారు. ప్రజలు మరియు రాజులలో ఎంతో తేడా ఉంటుంది.
ఇక్కడ మీరు నరుడి నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు కావున పూర్తిగా అనుసరించండి.
ఫకీరుల నుండి అమీరులుగా అవ్వాలి. అంతటి పురుషార్థము చేయాలి. సంతోషంగా చదువుకోవాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
జ్ఞాన-యోగాల ద్వారా అందరికీ సహాయం చేయాలి. డబుల్ అహింసకులుగా అవ్వాలి. ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు.
2.
నష్టోమోహులుగా అవ్వాలి, ఏ వస్తువుపైనా బుద్ధిలో మోహం ఉంచుకోకూడదు. ఒక్క తండ్రి స్మృతి సదా ఉండాలి, ఆ అభ్యాసము చేయాలి.
వరదానము:-
బ్రాహ్మణ జీవితంలో
స్మృతి మరియు
సేవ ఆధారంగా
శక్తిశాలిగా అయ్యే
మాయాజీత్ భవ
బ్రాహ్మణ జీవితానికి ఆధారము స్మృతి మరియు సేవ. ఒకవేళ స్మృతి మరియు సేవ యొక్క ఆధారము బలహీనంగా ఉంటే బ్రాహ్మణ జీవితం ఒక్కోసారి వేగంగా నడుస్తుంది, ఒక్కోసారి నెమ్మదిగా నడుస్తుంది. ఏదైనా సహయోగము లభిస్తే, ఎవరైనా తోడు లభిస్తే, ఏవైనా పరిస్థితులు లభిస్తే నడుస్తారు, లేకుంటే ఢీలాగా అయిపోతారు. అందుకే, స్మృతి మరియు సేవ, రెండింటిలో తీవ్ర వేగము ఉండాలి. స్మృతి మరియు నిస్వార్థమైన సేవ ఉంటే మాయాజీతులుగా అవ్వడం చాలా సహజము. అప్పుడు ప్రతి కర్మలో విజయము కనిపిస్తుంది.
స్లోగన్:-
ఎవరైతే సర్వ శక్తులతో సంపన్నంగా ఉంటారో, వారే విఘ్న-వినాశకులుగా
అవుతారు.
0 Comments