28-12-2022 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- అనంతమైన తండ్రి
ద్వారా మీరు
చాలా ఉన్నతమైన
చదువును చదువుతున్నారు, పతితపావనుడైన గాడ్
ఫాదర్ కు మనం విద్యార్థులమని, కొత్త
ప్రపంచం కోసం
చదువుతున్నామని మీ బుద్ధిలో ఉంది’’
ప్రశ్న:-
ఆత్మిక గవర్నమెంట్ నుండి ఏ పిల్లలకు కానుక లభిస్తుంది?
జవాబు:-
ఎవరైతే అనేకులను తమ సమానముగా తయారుచేసేందుకు
కృషి చేస్తారో, సేవ యొక్క ఋజువును ఇస్తారో, వారికి ఆత్మిక గవర్నమెంట్ చాలా పెద్ద కానుకను ఇస్తుంది. వారు భవిష్య 21 జన్మల కోసం ఉన్నత పదవికి అధికారులుగా
అవుతారు.
ఓంశాంతి. తండ్రి పిల్లలతో అంటారు, నా ద్వారా మధురాతి మధురమైన పిల్లలైన మీరు చదువును చదువుకుంటున్నారు. ఈ చదువు కొత్త ప్రపంచం కోసమే.
మేము కొత్త ప్రపంచం కోసం చదువుకుంటున్నాము అని ఇంకెవ్వరూ ఇలా అనలేరు. ఎంత బాగా చదువుకుంటారో అంతగా 21 జన్మల కోసం మీ ప్రారబ్ధము జమ అవుతుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన చదువును చదువుకుంటున్నారు. ఇది అనంతమైన, చాలా ఉన్నతమైన చదువు.
మిగిలినవన్నీ సాధారణ చదువులే. కావున ఈ అనంతమైన చదువులో ఎంతగా మీరు పురుషార్థము చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. మీ బుద్ధిలో ఎల్లప్పుడూ ఏ విషయాలు ఉండాలంటే - మేము పతితపావనుడైన గాడ్-ఫాదర్ యొక్క విద్యార్థులము మరియు కొత్త ప్రపంచం కోసం చదువుకుంటున్నాము. మేము చదువుకుని మొదట తండ్రి వద్దకు వెళ్తాము,
మళ్ళీ తమ-తమ చదువు అనుసారముగా కొత్త ప్రపంచములోకి వెళ్ళి పదవిని పొందుతాము అని భావిస్తూ మీరు ఎంత మంచి పురుషార్థము చేయాలి. అది లౌకిక చదువు,
ఇది పారలౌకిక చదువు అనగా పరలోకము కోసము చదివే చదువు.
ఇది పాత పతిత లోకము.
మనము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నామని మీకు తెలుసు. ఇది ఘడియ-ఘడియ గుర్తుకు రావాలి,
అప్పుడు మీ బుద్ధిలో సంతోషము పెరుగుతుంది. వివాహాలు మొదలైనవాటికి వెళ్ళడంతో చాలామంది పిల్లలు మర్చిపోతారు. చదువును ఎప్పుడూ మర్చిపోకూడదు,
ఇంకా ఎక్కువ సంతోషము ఉండాలి.
మనం భవిష్య
21 జన్మల కోసం స్వర్గాధిపతులుగా అవుతాము.
ఎవరైతే మంచి రీతిలో అనేకులను తమ సమానంగా తయారుచేస్తారో వారు మళ్ళీ తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. ఈ రహస్యము ఇంకెవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు.
సేవ చేసే తెలివి కూడా ఉంటుంది. డిపార్ట్మెంట్లు వేర్వేరుగా ఉంటాయి.
స్లైడ్లు తయారుచేసేవారికి కూడా బాబా స్లైడ్లన్నీ ఒకే సైజులో ఉండాలని,
తద్వారా ఏ ప్రొజెక్టర్ లోనైనా అవి నడవగలవని చెప్తారు. మొట్టమొదట పరమపిత పరమాత్మతో మీకున్న సంబంధం ఏమిటి? అన్న స్లైడ్ ఉండాలి.
తద్వారా వారు పరమపిత పరమాత్మ తమ తండ్రి అని అర్థం చేసుకోవాలి. వారి ద్వారా ఏ వారసత్వము లభిస్తుంది?
ఆ తర్వాత త్రిమూర్తి బ్రహ్మా ద్వారా మనకు ఈ సూర్యవంశీ పదవి లభిస్తుంది అని చూపించాలి.
మీరు కూడా కొత్త ప్రపంచం కోసం పురుషార్థము చేస్తున్నారు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు, పావన ప్రపంచాన్ని తయారుచేస్తారు. మీ బుద్ధిలోకి ఇప్పుడు స్మృతి వచ్చింది. తప్పకుండా మనం 5000 సంవత్సరాల క్రితం దేవీ-దేవతలుగా ఉండేవారము, తర్వాత రాజ్యాన్ని పోగొట్టుకున్నాము, మిగిలిన ఈ రాజ్యాలు మొదలైనవి తీసుకుంటారు. అవన్నీ హద్దులోని విషయాలు.
మీది అనంతమైన యుద్ధము, శ్రీమతముపై మీరు పంచ వికారాల రూపీ రావణునితో యుద్ధం చేస్తారు. డ్రామాలో ఓటమి, గెలుపుల పాత్ర ఉందని మీకు తెలుసు.
ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ డ్రామా చక్రం తిరుగుతుంది.
ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతముపై నడవాలి, ఎవరికి ఏ డైరెక్షన్ లభిస్తే దాని అనుసారముగా నడవాలి.
పిల్లలు అంటారు,
మేము అర్థం చేసుకుంటున్నాము కానీ ఎవరికీ అర్థం చేయించలేకపోతున్నాము. అంటే
- అది ఏమీ అర్థం చేసుకోనట్లే అవుతుంది. ఎంతగా స్వయం అర్థం చేసుకొని ఉంటారో అంతగానే పదవిని పొందుతారు. బుద్ధిలో స్వదర్శన చక్రము తిరుగుతూనే ఉండాలి.
స్వదర్శన చక్రధారులుగా మీరు అవుతారు.
ఇతరులను మీ సమానంగా తయారుచేయకపోతే సేవాధారులు కానట్లే,
అందుకే పూర్తి పురుషార్థం చేయాలి,
ఇతరులకు కూడా నేర్పించాలి. బ్రాహ్మణీలు ప్రతి ఒక్కరి వెనుక కష్టపడాలి.
టీచర్లు ఎంతో కష్టపడతారు కావుననే వారికి కానుక లభిస్తుంది. మీకు చాలా పెద్ద గవర్నమెంటు నుండి కానుక లభిస్తుంది.
సేవ యొక్క ఋజువును చూపాలి.
పొరపాట్లు చేయకూడదు.
ఇక్కడ ఒక్క క్లాసులో అన్ని రకాల చదువూ ఉంటుంది. మనం భవిష్యత్తులో వెళ్ళి దేవీ-దేవతలుగా అవుతామని మీకు తెలుసు. వినాశనం కూడా తప్పకుండా జరగనున్నది. ఏ విధంగా కల్పపూర్వము స్వర్గంలో ఇళ్ళు మొదలైనవి నిర్మించారో,
వాటినే మళ్ళీ నిర్మిస్తారు. డ్రామా సహాయం చేస్తుంది.
అక్కడైతే పెద్ద-పెద్ద మహళ్ళను,
పెద్ద-పెద్ద సింహాసనాలను తయారుచేస్తారు. ఇక్కడేమైనా బంగారము,
వెండి మొదలైనవాటితో నిర్మించిన అంత పెద్ద భవనాలు ఉన్నాయా. అక్కడైతే వజ్ర-వైఢూర్యాలు రాళ్ళ వలె ఉంటాయి. భక్తిలోనే ఇన్ని వజ్ర-వైఢూర్యాలు ఉంటే మరి సత్యయుగ ఆదిలో ఏమి ఉండవు. షావుకారులు ఇక్కడ రాధే-కృష్ణులు లేక లక్ష్మీ-నారాయణులు మొదలైనవారి మూర్తులను అలంకరిస్తారు. బంగారపు నగలు మొదలైనవాటిని ధరింపజేస్తారు. బాబాకు గుర్తుంది - ఒక షావుకారు ఉండేవారు,
అతను నేను లక్ష్మీ-నారాయణ మందిరాన్ని నిర్మిస్తున్నాను, వారి కోసం కొత్త నగలు తయారుచేయాలి అని అన్నారు. ఆ సమయంలో చాలా చౌకగా ఉండేది,
మరి అలాంటప్పుడు సత్యయుగంలో ఇంకెలా ఉంటుంది. భక్తి మార్గంలో ఎంతో సంపద ఉండేది,
దానిని అందరూ దోచుకుని వెళ్ళిపోయారు.
ఇప్పుడు పిల్లలైన మీకు అన్నీ తెలిసాయి. ఈ చదువు చాలా ఉన్నతమైనది. చిన్న-చిన్న పిల్లలకు కూడా నేర్పించాలి.
లౌకిక చదువుతో పాటు ఈ విద్యను కూడా ఇస్తూ ఉండండి.
శివబాబా స్మృతిని కలిగిస్తూ ఉండండి.
చిత్రాలపై అర్థం చేయించండి. పిల్లల కళ్యాణము కూడా చేయండి. శివబాబా స్వర్గ రచయిత.
మీరు శివబాబాను స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. అవినాశీ జ్ఞానము యొక్క వినాశనము ఎప్పుడూ జరగదు. కొద్దిగా విన్నా రాజ్యములోకి వచ్చేస్తారు. సత్యయుగంలో లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది.
వారు తర్వాత ఎక్కడికి వెళ్ళారు?
మేము మీకు అర్థం చేయిస్తాము అనగా మిమ్మల్ని ఆ స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాము. నేర్పించడం ద్వారా నేర్చుకుంటారు. కష్టపడవలసి ఉంటుంది. వ్యర్థమైన విషయాలలో సమయం వృథా చేయకూడదు.
పొరపాట్లు చేయడం వల్ల చాలా పశ్చాత్తాపపడతారు. తండ్రి ధనాన్ని సంపాదించి పిల్లలకు ఇచ్చి వెళ్తారు. ఇప్పుడు అందరి వినాశనము జరగనున్నది. ఇప్పుడు కూడా ఎన్ని యుద్ధాలు, గొడవలు,
మృత్యువులు మొదలైనవి జరుగుతూ ఉంటాయి.
అసలు ఇవి ఏమీ కాదు.
ఇంకా కోట్లాది లెక్కలో వినాశనము జరుగుతుంది, అందరూ దగ్ధమై మరణించి అంతమైపోనున్నారు. స్మశానవాటికగా మారనున్నది, ఆ తర్వాత పరిస్తాన్ తయారవుతుంది. స్మశానవాటికైతే పెద్దగా ఉంది,
పరిస్తాన్ చిన్నగా ఉంటుంది. ముసల్మానులు కూడా ఏమంటారంటే
- అందరూ స్మశానగ్రస్థులుగా ఉన్నారు, ఖుదా వచ్చి అందరినీ మేల్కొల్పుతారు, మళ్ళీ తిరిగి తీసుకువెళ్తారు అని. ఈ సమయంలో ఆత్మలందరూ ఏదో ఒక రూపంలో ఉన్నారు.
సమాధిలో శరీరము మాత్రమే పడి ఉంది, ఇకపోతే ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరము తీసుకుంటుంది. ఈ సమయంలో మాయ అందరినీ స్మశానగ్రస్థులుగా చేసేసింది. అందరూ మరణించి ఉన్నారు.
అంతా అంతమవ్వనున్నారు, అందుకే ఎవ్వరిపైనా మనస్సు పెట్టుకోకూడదు. ఒక్క తండ్రిపైనే మనస్సు పెట్టుకోవాలి.
చివరికి మీకు అందరి నుండి మమకారం సమాప్తమైపోతుంది. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి,
చాలు. మేము ఈ చదువును భవిష్య 21 జన్మల కోసం పతితపావనుడైన తండ్రి ద్వారా చదువుకుంటున్నాము అని మీరు అర్థం చేసుకుంటారు. పరమపిత పరమాత్మ మనుష్య సృష్టికి బీజరూపుడు,
చైతన్యుడు. ఆత్మ కూడా చైతన్యమే.
ఎప్పటివరకైతే ఆత్మ శరీరములోకి రాదో అప్పటివరకూ శరీరము జడమే. ఆత్మయే చైతన్యము. ఇప్పుడు ఆత్మకు జ్ఞానము లభించింది. ప్రతి ఆత్మలో తన-తన పాత్ర నిశ్చితమై ఉంది.
ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారిదే. ఇది అద్భుతమైన డ్రామా,
దీనిని ప్రకృతి సిద్ధమైనది అని అనడం జరుగుతుంది.
ఇంత చిన్నని ఆత్మలో ఎంతటి పాత్ర రచింపబడి ఉంది. ఈ ఆత్మిక విషయాలను పరమ ఆత్మ కూర్చొని మీకు అర్థం చేయిస్తారు.
వారు షికారు చేయిస్తారు, ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది,
ఏదైతే డ్రామాలో రచింపబడి ఉందో,
దానిని సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు.
ఆట ముందే అనాదిగా రచింపబడి ఉన్నా కానీ ఇది అనాది అని మనుష్యులకు తెలియదు. మీకు అన్నీ తెలుసు.
ఏదైతే జరుగుతుందో అదంతా ఒక క్షణం తర్వాత గతంగా మారుతుంది.
ఏదైతే గతించిపోతుందో అది డ్రామాలో ఉందని మీరు అర్థం చేసుకుంటారు.
సత్యయుగం నుండి ఏ ఏ పాత్ర జరిగింది అనేది తండ్రి అర్థం చేయించారు.
ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు.
నా బుద్ధిలో ఏ జ్ఞానమైతే ఉందో దానిని మీకు ఇస్తున్నాను.
మిమ్మల్ని కూడా నా సమానంగా తయారుచేస్తాను. ఈ ప్రపంచమంతా భ్రష్టాచారీగా ఉందని మీకు తెలుసు. ఇప్పుడు మొట్టమొదట పావనంగా అవ్వాలి మరియు తయారుచేయాలి. మీరు తప్ప ఇంకెవ్వరూ పవిత్రంగా తయారుచేయలేరు.
ఇప్పుడు తండ్రి శ్రీమతంపై నడుస్తూ దైవీ గుణాలను ధారణ చేయాలి.
చాలా మధురంగా మాట్లాడాలి. చేదు మాటలేవీ వెలువడకూడదు.
అందరిపైనా దయ చూపించాలి. మీరు అందరికీ నేర్పించవచ్చు - భగవానువాచ - మన్మనాభవ.
వారికి భగవంతుడు ఎవరో మరియు వారు గీతను ఎప్పుడు వినిపించారో తెలియదు. మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు - భగవానువాచ
- అశరీరీ భవ.
దేహపు సర్వ ధర్మాలను, నేను ముసల్మానును, పారసీను...
వీటన్నిటినీ వదిలివేయండి.
ఇలా ఎవరు అంటున్నారు? ఆత్మలందరూ అయితే పరస్పరం సోదరులు. ఒకే తండ్రి పిల్లలు.
నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు ముక్తిధామంలోకి వెళ్తారు అని తండ్రి చెప్తున్నారని ఆత్మలు తమ సోదరులకు అర్థం చేయిస్తున్నారు. అందరూ నిర్వాణధామానికి వెళ్ళనున్నారు. రెండు మాటలనైనా గుర్తుంచుకొని అర్థం చేయించాలి.
భగవంతుడు అందరికీ ఒక్కరే. అతడు కృష్ణుడైతే కాజాలరు.
ఇప్పుడు తండ్రి అంటారు - దేహ ధర్మాలన్నింటినీ త్యజించి నన్నొక్కరినే స్మృతి చేయండి. ఆత్మ ప్రకృతి ఆధారాన్ని తీసుకొని ఇక్కడ పాత్రను అభినయిస్తుంది. క్రైస్టు గురించి కూడా ఇప్పుడు వారు బికారిగా ఉన్నారు అని అంటారు. ఇది అందరికీ పాత చెప్పు. క్రైస్టు కూడా తప్పకుండా పునర్జన్మలు తీసుకుని ఉంటారు. ఇప్పుడు చివరి జన్మలో ఉంటారు. ఈ సందేశకులను కూడా తండ్రియే వచ్చి మేల్కొల్పుతారు. పతితులను పావనంగా చేసేవారు ఒక్క తండ్రియే.
అందరూ పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ కిందకు రావాల్సిందే.
ఇప్పుడు ఇది కలియుగ అంతిమము.
ముందు-ముందు దీనిని కూడా అందరూ అంగీకరిస్తారు. తండ్రి వచ్చారు అన్న శబ్దము వ్యాపిస్తుంది. మహాభారీ యుద్ధంలో భగవంతుని పేరు ఉంది కదా. కానీ ఆ పేరును మార్చివేసారు. వినాశనము మరియు స్థాపన,
ఇవి భగవంతుని పనులే. తండ్రియే వచ్చి స్వర్గ ద్వారాలను తెరుస్తారు.
బాబా రండి,
మీరు వచ్చి వైకుంఠ ద్వారాలను తెరవండి అని మీరు పిలుస్తారు.
మీ ద్వారా తండ్రి వచ్చి ద్వారాలను తెరుస్తారు.
మీ పేరు శివశక్తి సేనగా ఎంతో ప్రసిద్ధమైనది. మిమ్మల్ని పాండవులు అని ఎందుకు అంటారు? ఎందుకంటే మీరు ఆత్మిక పండాలు, స్వర్గానికి దారి చూపుతారు.
తండ్రి కూర్చొని సర్వ శాస్త్రాల సారాన్ని తెలియజేస్తారు. ఎవరైతే కల్పపూర్వము అర్థం చేసుకున్నారో వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. ఆత్మలమైన మనం పండాలము,
అందరినీ శాంతిధామంలోకి తీసుకువెళ్తాము, మళ్ళీ సుఖధామంలోకి రావాలి.
దుఃఖధామపు వినాశనం జరగాలి - దీని కొరకే ఈ మహాభారత యుద్ధముంది.
మీ బుద్ధిలో విస్తారమంతా ఉంది.
మన్మనాభవ, మధ్యాజీభవ
- ఈ పదాలలో మొత్తం జ్ఞానమంతా వచ్చేస్తుంది. ఏ విధంగా బాబా జ్ఞానసంపన్నులో, అలా పిల్లలైన మీరు కూడా అవుతారు.
కేవలం దివ్యదృష్టి తాళం చెవిని నేను నా వద్ద ఉంచుకుంటాను.
దీనికి బదులుగా మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను. నేను అలా అవ్వను. ఈ తేడా ఉంటుంది.
దివ్యదృష్టి పాత్ర కూడా మీకు ఉపయోగపడుతుంది. భావనను బట్టి వారికి సెనగలను ఇస్తారు.
బాబా అర్థం చేయించారు - జగదాంబకు ఎంత గొప్ప మేళా జరుగుతుంది.
లక్ష్మికి అంత మేళా జరగదు.
ఎంత తేడా ఉంది. లక్ష్మి చిత్రాన్ని ఇనప్పెట్టెలో పెట్టుకుంటారు, ధనము లభిస్తుందని భావిస్తారు.
భక్తి మార్గంలో సెనగలు లభిస్తాయి,
జ్ఞానములో వజ్రాలు లభిస్తాయి. లక్ష్మి నుండి కేవలం ధనాన్నే కోరుకుంటారు.
వారిని సంతానమివ్వమని, ఆరోగ్యమివ్వమని అడగరు.
జగదాంబ వద్దకు అన్ని ఆశలతో వెళ్తారు.
మేము పూజ్యులుగా ఉండేవారమని, ఇప్పుడు పూజారులుగా అయ్యామని,
మళ్ళీ పూజ్యులుగా అవుతామని మీరు భావిస్తారు. జ్ఞానము ద్వారా పిల్లలకు ప్రకాశము లభించింది.
మీరు ఎంత అతీతమైనవారిగా అయ్యారు.
సద్గురువు జ్ఞానాంజనాన్ని ఇచ్చారు... మీరు డ్రామా ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది బుద్ధిలోకి వచ్చింది కావున మీకు ఈ చదువు పట్ల ఎంత గౌరవం ఉండాలి.
ఆ చదువును మీరు జన్మజన్మాంతరాలూ చదువుతూ వచ్చారు,
కాని లభించేదేమిటి?
సెనగలే. ఈ చదువును ఒక్క జన్మ చదవడంతో మీకు వజ్ర-వైఢూర్యాలు లభిస్తాయి.
ఇప్పుడు ఇక పురుషార్థం చేయడం పిల్లలైన మీ పని. మీరు చదవకపోతే ఇందులో టీచర్ ఏం చేస్తారు? ఇక్కడ కృప చూపించే విషయమే లేదు.
సంగమములో దేవతల రాజధాని అంతా స్థాపించబడుతోంది. యోగబలముతో మీరు మీ వికర్మలను వినాశనం చేసుకుంటారు మరియు జ్ఞానబలముతో మీరు ఎంత ఉన్నతంగా అవుతారు. జ్ఞానసాగరుడు మరియు జ్ఞాన నదులలో స్నానం చేయడం ద్వారా సద్గతి లభిస్తుంది.
పిల్లలకు అర్థం చేయించే యుక్తులు లభిస్తూ ఉంటాయి.
డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పపూర్వము ఏదైతే అర్థం చేయించారో అదే అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలు కూడా నంబరువారుగా వస్తూ ఉంటారు.
బ్రాహ్మణ కులం యొక్క వృద్ధి జరగాల్సిందే. పిల్లలైన మీరు మహాదానులుగా అవ్వాలి. ఎవరైనా వస్తే వారికి ఏదో ఒకటి అర్థం చేయిస్తూ ఉండండి. శంఖ ధ్వని చేయాలి.
ఇక్కడ మీరు ఎంతగా ధారణ చేయగలరో, అంతగా ఇంటిలో జరగదు.
శాస్త్రాలలో కూడా మధుబన్ యొక్క గాయనం ఉంది,
అక్కడ మురళి మ్రోగుతుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
చదువు పట్ల చాలా గౌరవం ఉంచాలి. తండ్రి నుండి కృప మొదలైనవి అడగకూడదు.
జ్ఞానబలాన్ని మరియు యోగబలాన్ని జమ చేసుకోవాలి.
2.
దయార్ద్ర హృదయులుగా అవ్వాలి. ఎప్పుడూ మీ నోటితో కఠినమైన మాటలు మాట్లాడకూడదు. సదా మధురంగా మాట్లాడాలి.
తమ సమానంగా తయారుచేసే సేవను తప్పకుండా చేయాలి.
వరదానము:-
వికారాల రూపీ
సర్పాలను కంఠహారంగా
చేసుకునే సత్యమైన
తపస్వీ భవ
ఈ పంచ వికారాలు మనుష్యులకు విషసర్పాల వంటివి కానీ యోగీ తపస్వీ ఆత్మలైన మీకు ఈ సర్పాలు కంఠహారంగా అవుతాయి. అందుకే బ్రహ్మాబాబా
మరియు బ్రాహ్మణులైన
మీ అశరీరీ, తపస్వీ శంకరుని స్వరూపం యొక్క స్మృతిచిహ్నంలో సర్పాల మాలను మెడలో చూపిస్తారు. సర్పము మీ కొరకు సంతోషంగా నాట్యం చేసే స్టేజ్ గా అవుతుంది, ఇది అధీనతకు గుర్తుగా చూపించబడింది. స్థితియే స్టేజ్. కనుక వికారాలపై ఇంత విజయులుగా అయినప్పుడు సత్యమైన తపస్వీ అని అంటారు.
స్లోగన్:-
పాత ప్రపంచము మరియు సంస్కారాల నుండి మరణించడమే జీవిస్తూ మరణించడము.
0 Comments