02-01-2023 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" N మధువనం
Listen to the Murli audio file
‘‘మధురమైన పిల్లలూ
- మీరు రాజఋషులు,
మీకు అనంతమైన
తండ్రి మొత్తం
పాత ప్రపంచం
యొక్క సన్యాసము
నేర్పిస్తారు, దానితో
మీరు రాజ్య
పదవిని పొందగలుగుతారు’’
ప్రశ్న:-
ఈ సమయంలో మనుష్యులెవ్వరి కర్మలు అకర్మలు కాలేవు, ఎందుకు?
జవాబు:-
ఎందుకంటే మొత్తం ప్రపంచంలో మాయా రాజ్యము ఉంది. అందరిలోనూ 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి, అందుకే మనుష్యులు ఏ కర్మలనైతే చేస్తారో, అవి వికర్మలుగానే
అవుతాయి. సత్యయుగంలోనే
కర్మలు అకర్మలు అవుతాయి ఎందుకంటే అక్కడ మాయ ఉండదు.
ప్రశ్న:-
ఏ పిల్లలకు చాలా మంచి ప్రైజ్ లభిస్తుంది?
జవాబు:-
ఎవరైతే శ్రీమతంపై పవిత్రంగా అయి అంధులకు చేతికర్రగా అవుతారో, ఎప్పుడూ 5 వికారాలకు వశమై కుల కళంకితులుగా అవ్వరో, వారికి చాలా మంచి ప్రైజ్ లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా పదే-పదే మాయతో ఓడిపోతూ ఉన్నట్లయితే వారి పాస్ పోర్టుయే క్యాన్సిల్ అయిపోతుంది.
పాట:- ఓం నమఃశివాయ...
ఓంశాంతి. అందరికన్నా ఉన్నతమైనవారు పరమపిత పరమాత్మ అనగా పరమ ఆత్మ. వారు రచయిత.
మొదట బ్రహ్మా,
విష్ణు,
శంకరులను రచిస్తారు,
తర్వాత కిందకు అమరలోకంలోకి వస్తే,
అక్కడ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉంటుంది.
అది సూర్యవంశీయుల రాజ్యము,
చంద్రవంశీయులది కాదు. ఇది ఎవరు అర్థం చేయిస్తున్నారు?
జ్ఞాన సాగరుడు.
మనుష్యులు,
మనుష్యులకు ఎప్పుడూ అర్థం చేయించలేరు.
తండ్రి అందరికన్నా ఉన్నతమైనవారు,
వారిని భారతవాసులు తల్లి-తండ్రి అని అంటారు.
మరి తప్పకుండా ప్రాక్టికల్ గా తల్లిదండ్రులు కావాలి.
పాడుతారు కావున తప్పకుండా ఏదో సమయంలో వారు ఉండి ఉంటారు.
కావున మొట్టమొదట ఉన్నతోన్నతమైనవారు ఆ నిరాకార పరమపిత పరమాత్మ,
మిగిలిన ప్రతి ఒక్కరిలోనూ ఆత్మ ఉంటుంది.
ఆత్మ ఎప్పుడైతే శరీరంలో ఉంటుందో,
అప్పుడు దుఃఖితముగా లేక సుఖీగా అవుతుంది.
ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు.
ఇవేమీ కట్టు కథలు కావు. ఇకపోతే,
గురువులు,
పండితులు మొదలైనవారు ఏవైతే వినిపిస్తారో,
అవన్నీ కట్టు కథలు. ఇప్పుడు భారత్ నరకముగా ఉంది. సత్యయుగములో దీనిని స్వర్గం అని అంటారు.
లక్ష్మీ-నారాయణులు రాజ్యం చేసేవారు,
అక్కడ అందరూ సౌభాగ్యశాలిగా ఉండేవారు.
దుర్భాగ్యశాలులు ఎవ్వరూ ఉండేవారే కాదు. దుఃఖము,
రోగము ఏదీ ఉండేదే కాదు. ఇది పాపాత్ముల ప్రపంచము.
భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు,
లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఉండేది.
శ్రీకృష్ణుడినైతే అందరూ అంగీకరిస్తారు.
చూడండి,
వారికి రెండు గోళాలను చూపించారు.
శ్రీకృష్ణుని ఆత్మ అంటుంది,
ఇప్పుడు నేను నరకాన్ని కాలదన్నుతున్నాను,
స్వర్గాన్ని చేతిలోకి తీసుకొని వచ్చాను.
మొదట కృష్ణపురి ఉండేది,
ఇప్పుడు కంసపురి ఉంది. ఇందులో ఈ శ్రీకృష్ణుడు కూడా ఉన్నారు.
ఇది వీరి 84 జన్మల అంతిమ జన్మ. కానీ ఇప్పుడు ఆ శ్రీకృష్ణుని రూపం లేదు. ఇవి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు.
తండ్రే వచ్చి భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు.
ఇప్పుడు నరకముగా ఉంది, మళ్ళీ స్వర్గముగా తయారుచేసేందుకు తండ్రి వచ్చారు.
ఇది పాత ప్రపంచము.
కొత్త ప్రపంచము ఏదైతే ఉండేదో,
ఇప్పుడు అది పాతదిగా ఉంది. ఇల్లు కూడా కొత్తదాని నుండి పాతదిగా అవుతుంది.
చివరికి కూలగొట్టే స్థితికి చేరుకుంటుంది.
ఇప్పుడు తండ్రి అంటారు,
నేను పిల్లలను స్వర్గవాసులుగా చేసేందుకు రాజయోగం నేర్పిస్తాను.
మీరు రాజఋషులు.
రాజ్యం ప్రాప్తి చేసుకునేందుకు మీరు వికారాలను సన్యసిస్తారు.
ఆ హద్దు సన్యాసులు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవులలోకి వెళ్ళిపోతారు.
కానీ వారు పాత ప్రపంచంలోనే ఉంటారు.
అనంతమైన తండ్రి మీ చేత నరకము యొక్క సన్యాసం చేయిస్తారు మరియు స్వర్గం యొక్క సాక్షాత్కారం చేయిస్తారు.
తండ్రి అంటారు,
మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు నేను వచ్చాను.
మీకు మీ జన్మల గురించి తెలియదని తండ్రి అందరికీ చెప్తారు.
ఇదైతే తప్పనిసరి,
ఎవరు ఎటువంటి కార్యం చేస్తారో,
మంచైనా లేక చెడైనా,
ఆ సంస్కారాల అనుసారంగా వెళ్ళి జన్మ తీసుకుంటారు.
కొందరు షావుకారులుగా,
కొందరు పేదవారిగా,
కొందరు రోగగ్రస్థులుగా,
కొందరు ఆరోగ్యవంతులుగా అవుతారు.
ఇవి గత జన్మల కర్మల యొక్క లెక్కాచారాలు.
ఎవరైనా ఆరోగ్యవంతులుగా ఉన్నారంటే తప్పకుండా ముందు జన్మలో హాస్పిటల్ మొదలైనవి నిర్మించి ఉంటారు.
దాన పుణ్యాలు ఎక్కువగా చేసినట్లయితే షావుకారులుగా అవుతారు.
నరకంలో మనుష్యులు ఏ కర్మలనైతే చేస్తారో అవి తప్పకుండా వికర్మలే అవుతాయి ఎందుకంటే అందరిలోనూ
5 వికారాలు ఉన్నాయి.
ఇప్పుడు సన్యాసులు పవిత్రంగా అవుతారు,
పాపాలు చేయడం వదిలేస్తారు,
అడవులలోకి వెళ్ళి ఉంటారు.
కానీ వారి కర్మలు అకర్మలు అవుతాయని కాదు. తండ్రి అర్థం చేయిస్తారు,
ఈ సమయంలో ఉన్నదే మాయా రాజ్యము,
అందుకే మనుష్యులు ఏ కర్మలనైతే చేస్తారో అవి పాపాలే అవుతాయి.
సత్య,
త్రేతాయుగాలలో మాయ ఉండదు,
అందుకే ఎప్పుడూ వికర్మలు అవ్వవు.
అలాగే దుఃఖము ఉండదు.
ఈ సమయంలో ఒకటేమో,
రావణుడి సంకెళ్ళు ఉన్నాయి,
మళ్ళీ భక్తి మార్గపు సంకెళ్ళు ఉన్నాయి.
జన్మ-జన్మాంతరాలు ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు.
తండ్రి అంటారు,
నేను ఇంతకుముందు కూడా చెప్పాను,
ఈ జప తపాదులు మొదలైనవాటి ద్వారా నేను లభించను.
ఎప్పుడైతే భక్తి యొక్క అంతిమము వస్తుందో,
అప్పుడే నేను వస్తాను.
భక్తి ద్వాపరము నుండి ప్రారంభమవుతుంది.
మనుష్యులు దుఃఖితులుగా అయినప్పుడు స్మృతి చేస్తారు.
సత్య,
త్రేతాయుగాలలో సౌభాగ్యశాలులు ఉంటారు మరియు ఇక్కడ దుర్భాగ్యశాలులు ఉంటారు.
ఏడుస్తూ,
రోదిస్తూ ఉంటారు.
అకాల మృత్యువులు సంభవిస్తూ ఉంటాయి.
తండ్రి అంటారు,
ఎప్పుడైతే నరకాన్ని స్వర్గముగా తయారుచేయవలసి ఉంటుందో,
అప్పుడు నేను వస్తాను.
భారత్ ప్రాచీన దేశము,
ఎవరైతే మొదట ఉండేవారో,
వారే అంతిమం వరకు ఉండాలి.
84 జన్మల చక్రము గురించి అంటూ ఉంటారు.
గవర్నమెంట్ త్రిమూర్తిని ఏదైతే తయారుచేస్తుందో,
అందులో బ్రహ్మా,
విష్ణు,
శంకరులు ఉండాలి,
కానీ జంతువులను పెట్టేస్తారు.
రచయిత అయిన తండ్రి చిత్రము లేదు మరియు కింద చక్రాన్ని కూడా పెట్టేసారు.
వారు రాట్నముగా భావిస్తారు కానీ అది డ్రామా యొక్క సృష్టి చక్రము.
ఇప్పుడు చక్రానికి అశోక చక్రమని పేరు పెట్టారు.
ఇప్పుడు మీరు ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారానే అశోకులుగా అవుతారు.
విషయమైతే సరైనది,
కేవలం తలక్రిందులుగా చేసేసారు.
మీరు ఈ 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయడం ద్వారానే
21 జన్మల కోసం చక్రవర్తీ రాజులుగా అవుతారు.
ఈ దాదా కూడా 84 జన్మలు పూర్తి చేసారు.
ఇది శ్రీకృష్ణుని అంతిమ జన్మ. వీరికి తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు.
వాస్తవానికి ఇది మీ అందరి అంతిమ జన్మ, ఏ భారతవాసులైతే దేవీ-దేవతా ధర్మానికి చెంది ఉన్నారో,
వారే పూర్తి
84 జన్మలను అనుభవించారు.
ఇప్పుడైతే అందరి చక్రం పూర్తవుతంది.
ఇప్పుడు మీ ఈ తనువు ఛీ-ఛీ గా అయిపోయింది.
ఈ ప్రపంచమే ఛీ-ఛీ గా ఉంది, అందుకే మీ చేత ఈ ప్రపంచాన్ని సన్యాసం చేయిస్తారు.
ఈ స్మశానవాటికపై మనసు పెట్టుకోకూడదు.
ఇప్పుడు తండ్రిపై మరియు వారసత్వముపై మనసు పెట్టుకోండి.
ఆత్మలైన మీరు అవినాశీ,
ఈ శరీరము వినాశి.
ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది.
అంతిమ కాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో...
అని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు తండ్రి అంటారు,
అంతిమ కాలములో ఎవరైతే శివబాబాను స్మరిస్తారో,
వారు నారాయణ పదవిని పొందగలరు.
నారాయణ పదవి సత్యయుగంలోనే లభిస్తుంది.
తండ్రి తప్ప ఈ పదవిని ఎవరూ ఇప్పించలేరు.
ఈ పాఠశాల ఉన్నదే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు.
చదివించేవారు తండ్రి.
వారి మహిమనే విన్నారు
- ఓం నమః శివాయ అని. మీకు తెలుసు,
మనం వారికి పిల్లలుగా అయ్యాము,
ఇప్పుడు వారసత్వం తీసుకుంటున్నాము.
ఇప్పుడు మీరు మనుష్య మతముపై నడవడం లేదు. మనుష్య మతముపై నడవడం ద్వారానైతే అందరూ నరకవాసులుగా అయ్యారు.
శాస్త్రాలు కూడా మనుష్యులకు చెందినవేనని అంటూ ఉంటారు లేక మనుష్యుల ద్వారా తయారుచేయబడినవి.
మొత్తం భారత్ ఈ సమయంలో ధర్మ భ్రష్టముగా,
కర్మ భ్రష్టముగా అయ్యింది.
దేవతలైతే పవిత్రముగా ఉండేవారు.
ఇప్పుడు తండ్రి అంటారు,
ఒకవేళ సౌభాగ్యశాలులుగా అవ్వాలనుకుంటే పవిత్రంగా అవ్వండి,
ప్రతిజ్ఞ చేయండి
- బాబా,
మేము పవిత్రముగా అయి మీ నుండి పూర్తి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము.
ఇదైతే పాత పతిత ప్రపంచము,
సమాప్తమయ్యేటువంటిది.
కొట్లాటలు-గొడవలు ఏమేమి జరుగుతున్నాయి.
క్రోధం ఎంతగా ఉంది. బాంబులను ఎంత పెద్ద-పెద్దవి తయారుచేసారు.
ఎంత క్రోధులుగా,
లోభులుగా ఉన్నారు.
అక్కడ శ్రీకృష్ణుడు గర్భ మహలు నుండి ఏ విధంగా బయటకు వస్తారు అన్నదైతే పిల్లలకు సాక్షాత్కారం జరిగింది.
ఇక్కడ గర్భ జైలు ఉంటుంది,
బయటకు రావడముతో మాయ పాపాలు చేయించడం మొదలుపెడుతుంది.
అక్కడైతే గర్భ మహలు నుండి కుమారుడు వస్తాడు,
ప్రకాశవంతమవుతుంది.
చాలా విశ్రాంతిగా ఉంటారు.
గర్భం నుండి బయటకు వస్తారు మరియు దాసీలు ఎత్తుకుంటారు,
బాజా భజంత్రీలు మ్రోగుతాయి.
ఇక్కడికి అక్కడికి ఎంత తేడా ఉంది.
ఇప్పుడు పిల్లలైన మీకు మూడు ధామాలను అర్థం చేయించారు.
శాంతిధామం నుండే ఆత్మలు వస్తాయి.
ఆత్మ అయితే నక్షత్రం వలె ఉంటుంది,
అది భృకుటి మధ్యలో ఉంటుంది.
ఆత్మలో
84 జన్మల అవినాశీ రికార్డు నిండి ఉంది. డ్రామా ఎప్పుడూ వినాశనమవ్వదు,
అలాగే పాత్రలో మార్పు ఉండజాలదు.
ఇది కూడా అద్భుతము
- ఎంత చిన్నని ఆత్మలో
84 జన్మల పాత్ర పూర్తిగా ఏక్యురేట్ గా నిండి ఉంది. ఇది ఎప్పుడూ పాతదిగా అవ్వదు.
నిత్యము కొత్తగా ఉంటుంది.
ఆత్మ మళ్ళీ అదే విధంగా తన ఆ పాత్రనే ప్రారంభిస్తుంది.
ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మే పరమాత్మ అని అనలేరు.
హమ్ సో యొక్క అర్థాన్ని తండ్రే యథార్థ రీతిలో అర్థం చేయిస్తారు.
వారైతే తప్పుడు అర్థాన్ని తయారుచేస్తారు లేక ఇలా అయినా అంటారు,
అహం బ్రహ్మాస్మి,
మేము పరమాత్మలము,
మాయను రచించేవారము అని. ఇప్పుడు వాస్తవానికి మాయను రచించడము జరగదు.
మాయ అనగా 5 వికారాలు.
ఆ తండ్రి మాయను రచించరు.
తండ్రి అయితే కొత్త సృష్టిని రచిస్తారు.
నేను సృష్టిని రచిస్తానని ఇలా ఇంకెవరూ అనలేరు.
అనంతమైన తండ్రి ఒక్కరే.
ఓం అర్థాన్ని కూడా పిల్లలకు అర్థం చేయించడము జరిగింది.
ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపము.
శాంతిధామంలో నివసిస్తుంది.
కానీ తండ్రి జ్ఞాన సాగరుడు,
ఆనంద సాగరుడు.
ఆత్మకు ఈ మహిమను పాడరు.
అయితే,
ఆత్మలో జ్ఞానం వస్తుంది.
తండ్రి అంటారు,
నేను ఒక్కసారే వస్తాను.
నేను వారసత్వాన్ని కూడా తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది.
నా వారసత్వం ద్వారా భారత్ ఒక్కసారిగా స్వర్గముగా అవుతుంది.
అక్కడ పవిత్రత,
సుఖ-శాంతులు అన్నీ ఉండేవి.
ఇది అనంతమైన తండ్రి ఇచ్చే సదా సుఖం యొక్క వారసత్వము.
పవిత్రత ఉన్నప్పుడు సుఖ-శాంతులు కూడా ఉండేవి.
ఇప్పుడు అపవిత్రత ఉంది కావున దుఃఖం,
అశాంతి ఉన్నాయి.
తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు,
ఆత్మలైన మీరు మొట్టమొదట మూలవతనంలో ఉండేవారు.
మళ్ళీ దేవీ-దేవతా ధర్మంలోకి వచ్చారు,
ఆ తర్వాత క్షత్రియ ధర్మంలోకి వచ్చారు,
8 జన్మలు సతోప్రధానములో,
మళ్ళీ
12 జన్మలు సతోలో,
ఆ తర్వాత
21 జన్మలు ద్వాపరంలో,
తర్వాత
42 జన్మలు కలియుగంలో తీసుకుంటారు.
ఇక్కడ శూద్రులుగా అయ్యారు,
ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణ వర్ణంలోకి రావాలి,
తర్వాత దేవతా వర్ణంలోకి వెళ్తారు.
ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు.
తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు.
84 జన్మలను తెలుసుకోవడంతో మళ్ళీ అందులో అన్నీ వచ్చేస్తాయి.
మొత్తం చక్రం యొక్క జ్ఞానం బుద్ధిలో ఉంది. ఇది కూడా మీకు తెలుసు,
సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది,
వరల్డ్ ఆల్మైటీ అథారిటీ రాజ్యం ఉంటుంది.
ఇప్పుడు మీరు లక్ష్మీ-నారాయణ పదవిని పొందుతున్నారు.
సత్యయుగం పావన ప్రపంచము,
అక్కడ చాలా కొద్దిమంది ఉంటారు.
మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామంలో ఉంటారు.
సర్వుల సద్గతి దాత తండ్రి ఒక్కరే.
వారి గురించి ఎవరికీ తెలియనే తెలియదు,
ఇంకా,
పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు.
తండ్రి అంటారు,
మీకు ఎవరు చెప్పారు?
గీతలో రాయబడి ఉంది అని అంటారు,
గీతను ఎవరు తయారుచేసారు?
భగవానువాచ,
నేనైతే ఈ సాధారణ బ్రహ్మా తనువును ఆధారముగా తీసుకుంటాను.
యుద్ధ మైదానంలో కూర్చుని ఒక్క అర్జునుడికి ఎలా జ్ఞానం వినిపిస్తారు.
మీకు యుద్ధము లేక జూదము మొదలైనవి ఏవైనా నేర్పించడము జరుగుతుందా.
భగవంతుడు ఉన్నదే మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేవారు.
వారు ఎలా చెప్తారు
- జూదమాడండి,
యుద్ధం చేయండి అని. మళ్ళీ అంటారు,
ద్రౌపదికి ఐదుగురు పతులు ఉండేవారు.
ఇది ఎలా జరగగలదు.
కల్ప క్రితము బాబా స్వర్గాన్ని తయారుచేసారు.
ఇప్పుడు మళ్ళీ తయారుచేస్తున్నారు.
శ్రీకృష్ణుని
84 జన్మలు పూర్తయ్యాయి,
యథా రాజా రాణి తథా ప్రజ, అందరివీ
84 జన్మలు పూర్తయ్యాయి.
ఇప్పుడు మీరు శూద్రుల నుండి మారి బ్రాహ్మణులుగా అయ్యారు.
ఎవరైతే బ్రాహ్మణ ధర్మంలోకి వస్తారో,
వారే మమ్మా,
బాబా అని అంటారు.
మరి ఎవరైనా అంగీకరించవచ్చు లేక అంగీకరించకపోవచ్చు.
మా కోసం గమ్యం ఉన్నతమైనదని భావిస్తారు.
అయినా ఎంతో కొంత వింటారు కావున స్వర్గంలోకి తప్పకుండా వస్తారు.
కానీ తక్కువ పదవిని పొందుతారు.
అక్కడ యథా రాజా రాణి తథా ప్రజా అందరూ సుఖీగా ఉంటారు,
పేరే ఉంది హెవెన్.
హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్ ను స్థాపిస్తారు,
ఇది హెల్. సీతలందరినీ రావణుడు జైలులో బంధించి ఉంచాడు.
అందరూ శోకములో కూర్చొని భగవంతుడిని,
ఈ రావణ రాజ్యం నుండి విడిపించండి అని గుర్తు చేస్తున్నారు.
సత్యయుగము అశోక వాటిక.
ఎప్పటివరకైతే మీ సూర్యవంశీ రాజధాని స్థాపన అవ్వదో,
అప్పటివరకు వినాశనం జరగజాలదు.
రాజధాని స్థాపన అవ్వాలి,
పిల్లలు కర్మాతీత అవస్థకు చేరుకోవాలి,
అప్పుడే ఫైనల్ యుద్ధం జరుగుతుంది,
అప్పటివరకు రిహార్సల్స్ జరుగుతూ ఉంటాయి.
ఈ యుద్ధము తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకునేది ఉంది. పిల్లలైన మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా అవ్వాలి.
బాబా పాస్ పోర్టును తయారుచేస్తారు.
ఎంతెంతగా పవిత్రంగా అవుతారో,
అంధులకు చేతి కర్రగా అవుతారో,
అంతగా ప్రైజ్ కూడా మంచిది లభిస్తుంది.
బాబాతో ప్రతిజ్ఞ చేయాలి
- మధురమైన బాబా, మేము మీ స్మృతిలో తప్పకుండా ఉంటాము.
ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించినది.
పంచ వికారాల దానాన్ని తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది.
కొందరు ఓడిపోయి మళ్ళీ నిలబడతారు కూడా. ఒకవేళ రెండు,
నాలుగు సార్లు మాయ దెబ్బ తిని మళ్ళీ పడిపోయారు అంటే ఫెయిల్ అయిపోతారు.
పాస్ పోర్టు క్యాన్సల్ అవుతుంది.
తండ్రి అంటారు,
పిల్లలూ,
కుల కళంకితులుగా అవ్వకండి.
మీరు వికారాలను విడిచిపెట్టండి.
నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తప్పకుండా తయారుచేస్తాను.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1.
సౌభాగ్యశాలిగా అయ్యేందుకు తండ్రితో పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేయాలి.
ఈ ఛీ-ఛీ పతిత ప్రపంచముపై మనసు పెట్టుకోకూడదు.
2.
మాయ దెబ్బను ఎప్పుడూ తినకూడదు.
కుల కళంకితులుగా అవ్వకూడదు.
యోగ్యులుగా అయి స్వర్గము యొక్క పాస్ పోర్టును తండ్రి నుండి తీసుకోవాలి.
వరదానము:-
మనసును బిజీ
పెట్టుకునే కళ
ద్వారా వ్యర్థం
నుండి ముక్తులుగా
ఉండే సమర్థ
స్వరూప భవ
ఎలాగైతే ఈ రోజుల్లో ప్రపంచంలో పెద్ద పొజిషన్ లో ఉన్నవారు తమ కార్యం యొక్క దినచర్యను సమయానుసారంగా సెట్ చేసుకుంటారో, అలాగే మీరు విశ్వ నవ నిర్మాణానికి
ఆధారమూర్తులు, అనంతమైన డ్రామాలో హీరో పాత్రధారులు,
వజ్ర తుల్యమైన జీవితం కలవారు, మీరు కూడా తమ మనసు మరియు బుద్ధిని సమర్థ స్థితిలో స్థితి చేసే ప్రోగ్రామ్ ను సెట్ చేసుకోండి. మనసును బిజీ పెట్టుకునే కళ సంపూర్ణ రీతిలో ఉపయోగించినట్లయితే వ్యర్థము నుండి ముక్తులవుతారు. ఎప్పుడూ కూడా అప్ సెట్ అవ్వరు.
స్లోగన్:-
డ్రామా యొక్క ప్రతి దృశ్యాన్ని చూస్తూ హర్షితంగా ఉన్నట్లయితే ఎప్పుడూ మంచి చెడు యొక్క ఆకర్షణలోకి రారు.
0 Comments