Header Ads Widget

Header Ads

TELUGU MURLI 01.01.23

 

01-01-2023  ప్రాత:మురళి  ఓంశాంతి  ‘‘అవ్యక్త బాప్ దాదా’’ రివైజ్ 26-03-1993 మధువనం


Listen to the Murli audio file



‘‘అవ్యక్త సంవత్సరంలో లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి’’

రోజు నిరాకారి మరియు ఆకారి అయిన బాప్ దాదా సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలను ఆకార రూపంతో మరియు సాకార రూపంతో చూస్తున్నారు. సాకార రూపం కల ఆత్మలైన మీరందరూ కూడా తండ్రి సమ్ముఖంలో ఉన్నారు మరియు ఆకారి రూపధారి పిల్లలు కూడా సమ్ముఖంలో ఉన్నారు. ఇరువురిని బాప్ దాదా చూసి హర్షిస్తున్నారు. అందరి మనసులో ఒకే సంకల్పం ఉంది, మేమందరము తండ్రి సమానంగా సాకారి నుండి ఆకారి మరియు ఆకారి నుండి నిరాకారి తండ్రి సమానంగా అవ్వాలి అన్న ఉల్లాసం ఉంది. బాప్ దాదా అందరి యొక్క లక్ష్యాన్ని మరియు లక్షణాలను చూస్తున్నారు. ఏం కనిపించింది? మెజారిటీ యొక్క లక్ష్యము చాలా బాగా దృఢంగా ఉంది కానీ లక్షణాలు అప్పుడప్పుడు దృఢంగా, అప్పుడప్పుడు సాధారణంగా ఉన్నాయి. లక్ష్యము మరియు లక్షణాలలో సమానత రావడము, ఇది సమానంగా అయ్యేందుకు గుర్తు. లక్ష్యాన్ని ధారణ చేయడంలో 99% కూడా కొంతమంది ఉన్నారు, మిగిలినవారు నంబరువారుగా ఉన్నారు. కానీ సదా, సహజంగా మరియు సహజ స్వభావంగా లక్షణాలను ధారణ చేయడంలో ఎక్కడి వరకు ఉన్నారు, ఇందులో మైనారిటీ 90% వరకు ఉన్నారు, మిగిలినవారు నంబరువారుగా ఉన్నారు. కనుక లక్ష్యము మరియు లక్షణంలో మరియు లక్షణాలను కూడా సహజంగా మరియు స్వభావంగా తయారుచేసుకోవడంలో తేడా ఎందుకుంది? సమయానుసారంగా, పరిస్థితులు అనుసారంగా, సమస్య అనుసారంగా చాలామంది పిల్లలు పురుషార్థం ద్వారా తమ లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా కూడా తయారుచేసుకుంటారు. కానీ ఇది సహజంగా మరియు స్వభావంగా అయిపోవాలి, ఇందులో ఇప్పుడు ఇంకా అటెన్షన్ కావాలి. సంవత్సరాన్ని అవ్యక్త ఫరిశ్తా స్థితిలో స్థితులై ఉండేదిగా జరుపుకుంటున్నారు. ఇది చూసి బాప్ దాదా పిల్లల ప్రేమ మరియు పురుషార్థము - రెండింటినీ చూసి-చూసి సంతోషిస్తున్నారు, ‘‘వాహ్ పిల్లలు, వాహ్’’ అనే పాటను కూడా పాడుతారు. దానితో పాటు ఇప్పుడు మరియు మున్ముందు సర్వ పిల్లలందరిలో లక్ష్యము మరియు లక్షణాలలో సమానతను చూడాలనుకుంటున్నారు. మీరందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు కదా. తండ్రి కూడా కోరుకుంటున్నారు, మీరు కూడా కోరుకుంటున్నారు, మరి మధ్యలో ఇంకేముంది? అది కూడా మంచి రీతిలో తెలుసు. పరస్పరంలో వర్క్ షాప్ చేస్తారు కదా!

బాప్ దాదా లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉండడానికి విశేషంగా ఒక విషయాన్నే చూసారు. ఆకారి ఫరిశ్తా కావచ్చు, నిరాకారి కావచ్చు, అది నిరంతరం సహజ స్వభావంగా అయిపోవాలి - దీనికి మూల ఆధారము నిరహంకారిగా అవ్వడము. అహంకారం అనేక రకాలుగా ఉంటుంది. అన్నింటిలోనూ విశేషంగా చెప్పడానికైతేదేహాభిమానముఅనే ఒకే పదం ఉంది కానీ దేహాభిమానం యొక్క విస్తారం చాలా ఉంది. ఒకటి - స్థూల రూపంలో ఉండే దేహాభిమానము, ఇది చాలామంది పిల్లలలో లేదు కూడా. స్వయం యొక్క దేహంపై కావచ్చు, ఇతరుల దేహంపై కావచ్చు, ఒకవేళ ఇతరుల దేహంపై కూడా ఆకర్షణ ఉంది అంటే అది కూడా దేహాభిమానము. చాలామంది పిల్లలు స్థూల రూపం విషయంలో పాస్ అయ్యారు, స్థూల రూపంతో దేహం యొక్క ఆకారంపై ఆకర్షణ లేక అభిమానము లేవు. కానీ దీనితో పాటు దేహ సంబంధం విషయంలో, మా సంస్కారాలు విశేషమైనవి, బుద్ధి విశేషమైనది, గుణాలు విశేషమైనవి, ఏవో కళలు విశేషమైనవి, ఏదో ఒక శక్తి విశేషమైనది, వీటి అభిమానము అనగా అహంకారము, నషా, ఆవేశము - ఇది సూక్ష్మమైన దేహాభిమానము. ఒకవేళ సూక్ష్మ అభిమానాలలో అభిమానం ఉన్నా కూడా ఆకారి ఫరిశ్తాగా సహజంగా-నిరంతరం అవ్వలేరు, నిరాకారిగా అవ్వలేరు ఎందుకంటే ఆకారి ఫరిశ్తాలో కూడా దేహ భానం ఉండదు, వారు డబల్ లైట్ గా ఉంటారు. దేహ-అహంకారము నిరాకారిగా అవ్వనివ్వదు. అందరూ సంవత్సరం అటెన్షన్ బాగా పెట్టారు, ఉల్లాస-ఉత్సాహాలు కూడా ఉన్నాయి, కోరిక కూడా చాలా బాగుంది, కోరుకుంటారు కూడా కానీ ముందు కోసం దయచేసి ఇంకా అటెన్షన్ పెట్టండి! చెక్ చేసుకోండి, ‘‘ రకమైన అభిమానము లేక అహంకారము సహజ స్వరూపం నుండి పురుషార్థీ స్వరూపంగా అయితే చేయడం లేదు కదా? ఏదైనా సూక్ష్మ అభిమానము అంశ రూపంలో కూడా మిగిలిపోలేదు కదా, అది సమయానుసారంగా మరియు సేవ అనుసారంగా కూడా ఎక్కడా ఇమర్జ్ అవ్వడం లేదు కదా?’’ ఎందుకంటే అంశ-మాత్రముగా ఉన్నదే సమయానికి మోసం చేస్తుంది, అందుకే సంవత్సరంలో లక్ష్యమైతే పెట్టుకున్నారో, లక్ష్యం సంపన్నమవ్వాల్సిందేనని బాప్ దాదా కోరుకుంటున్నారు.

నడుస్తూ-నడుస్తూ ఏదైనా విశేషమైన స్థూల రూపంలో రోజు, సమయంలో పొరపాటును కూడా చేయరు కానీ అప్పుడప్పుడు అనుభవం చేస్తారు కదా - ‘‘ రోజు లేక ఇప్పుడు ఏమైందో తెలియదు, ఎంతగా సంతోషం ఉండాలో అంతగా లేదు, రోజు ఒంటరితనం లేక నిరాశ లేక వ్యర్థ సంకల్పాల అకస్మాత్తు తుఫాను ఎందుకు వస్తుందో! తెలియదు. అమృతవేళ కూడా చేసాము, క్లాసు కూడా చేసాము, సేవ కూడా చేసాము, ఉద్యోగానికి కూడా వెళ్ళాము కానీ ఇలా ఎందుకు జరుగుతుంది?’’ కారణం ఏముంటుంది? స్థూల రూపాన్ని అయితే చెక్ చేసుకుంటారు మరియు అందులో ఎలాంటి పొరపాటు జరగలేదని భావిస్తారు. కానీ సూక్ష్మ అభిమానం యొక్క స్వరూపాల అంశము సూక్ష్మంగా ప్రత్యక్షమవుతుంది, అందుకే పనిలోనూ మనసు లగ్నమవ్వదు, వైరాగ్యము, ఉదాసీనంగా-ఉదాసీనంగా అనుభవమవుతుంది. లేదా ఇలా ఆలోచిస్తారు, ఏదైనా ఏకాంత స్థానానికి వెళ్ళిపోవాలి, లేదా ఇలా ఆలోచిస్తారు నిద్రపోవాలి, విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి లేదా కొద్ది సమయం కోసం పరివారం నుండి దూరంగా వెళ్ళిపోవాలి. అన్ని స్థితులకు కారణము, అంశం యొక్క అద్భుతము. అద్భుతమని అనకండి, అల్లకల్లోలం అనే అనండి. కనుక సంపూర్ణ నిరహంకారిగా అవ్వడము అనగా ఆకారి మరియు నిరాకారిగా సహజంగా అవ్వడము. ఎలాగైతే అప్పుడప్పుడు మనసు పెట్టాలని అనిపించదు, సదా ఒకే దినచర్యలోనే నడవాలా ఏమిటి, మార్పు అయితే ఉండాలి కదా అని అనుకుంటారు. కోరుకోకపోయినా కూడా స్థితి వచ్చేస్తుంది.

ఎప్పుడైతే నిరహంకారిగా అవుతారో, అప్పుడు ఆకారి మరియు నిరాకారి స్థితి నుండి కిందికి రావాలని మనసుకు అనిపించదు. దానిలోనే లవలీనంగా ఉండడాన్ని అనుభవం చేస్తారు ఎందుకంటే మీ ఒరిజినల్ అనాది స్థితి అయితే నిరాకారియే కదా. నిరాకార ఆత్మ శరీరంలో ప్రవేశించింది. శరీరం ఆత్మలో ప్రవేశించలేదు, ఆత్మ శరీరంలో ప్రవేశించింది. కనుక అనాది ఒరిజినల్ స్వరూపమైతే నిరాకారియే కదా లేక శరీరధారియా? శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు కానీ తీసుకున్నది ఎవరు? ఆత్మలైన మీరు, నిరాకారులైన మీరు సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. మరి ఒరిజినల్ ఏదైనట్లు, ఆత్మనా లేక శరీరమా? ఆత్మ. ఇది పక్కా కదా? కనుక ఒరిజినల్ స్థితిలో స్థితమవ్వడము సహజమా లేక ఆధారం తీసుకునే స్థితిలో స్థితమవ్వడము సహజమా?

అహంకారం రావడానికి ద్వారము ఒకే పదము, అదేమిటి? ‘‘నేను’’ కనుక అభ్యాసం చేయండి - ఎప్పుడు ‘‘నేను’’ అన్న పదము వచ్చినా కూడా ఒరిజినల్ స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండినేనుఎవరు? నేను ఆత్మనా లేక ఫలానా-ఫలానానా? ఇతరులకు జ్ఞానమిస్తారు కదానేనుఅన్న పదమే ఎగిరేలా చేస్తుంది, ‘నేనుఅన్న పదమే కిందికి తీసుకువచ్చేటువంటిది. ‘నేనుఅని అనడముతో ఒరిజినల్ నిరాకార స్వరూపం గుర్తుకు రావాలి, ఇది సహజమైపోవాలి. మరి మొదటి పాఠం సహజమే కదా. కనుక దీనిని చెక్ చేసుకోండి, అలవాటు చేసుకోండినేనుఅని అనుకోగానే నిరాకారి స్వరూపం స్మృతిలోకి రావాలి. ఎన్నిసార్లునేనుఅన్న పదాన్ని అంటారు! నేను ఇలా అన్నాను, ‘నేనుఇది చేస్తాను, ‘నేనుఇలా ఆలోచిస్తాను... అనేకసార్లునేనుఅనే పదాన్ని ఉపయోగిస్తారు. కనుక నిరాకారిగా లేక ఆకారిగా అయ్యేందుకు ఇదే సహజ విధి - ‘నేనుఅనే పదం ఎప్పుడు ఉపయోగించినా కూడా వెంటనే తమ నిరాకారి ఒరిజినల్ స్వరూపం ఎదురుగా రావాలి. ఇది కష్టమా లేక సహజమా? ఇక అప్పుడు లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా అయ్యే ఉన్నాయి. కేవలం నిరహంకారిగా తయారుచేసే యుక్తిని సహజ సాధనాన్ని తమదిగా చేసుకుని చూడండి. దేహ భానం యొక్కనేనుసమాప్తమైపోవాలి. ఎందుకంటేనేనుఅనే పదమే దేహ-అహంకారంలోకి తీసుకొస్తుంది మరియు ఒకవేళనేనునిరాకారి ఆత్మ స్వరూపాన్ని - దీనిని స్మృతిలోకి తీసుకొస్తే, అప్పుడు నేనుఅన్న పదమే దేహ-భానము నుండి అతీతంగా తీసుకువెళ్తుంది. అంతే కదా. రోజంతటిలో 25-30 సార్లు అయితే తప్పకుండా అంటూ ఉంటారు. బయటకు చెప్పకపోయినా కానీ ఆలోచిస్తూ అయితే ఉండవచ్చునేనుఇది చేస్తాను, నేను ఇది చేయాలి... అని. ప్లాన్ కూడా తయారుచేస్తున్నప్పుడు ఆలోచిస్తారు కదా. కనుక ఇన్నిసార్లు చేసే అభ్యాసము, ఆత్మ స్వరూపం యొక్క స్మృతి ఎలా తయారుచేస్తుంది? నిరాకారిగా చేస్తుంది. నిరాకారిగా అయి, ఆకారి ఫరిశ్తాగా అయి కార్యం చేసాము, మళ్ళీ నిరాకారిగా అయ్యాము! కర్మ-సంబంధపు స్వరూపంతో సంబంధంలోకి రండి, సంబంధాన్ని బంధనంలోకి తీసుకురాకండి. దేహాభిమానంలోకి రావడము అనగా కర్మ-బంధనంలోకి రావడము. దేహ-సంబంధంలోకి రావడము అనగా కర్మ సంబంధంలోకి రావడము. రెండింటిలో తేడా ఉంది. దేహాన్ని ఆధారంగా తీసుకోవడము మరియు దేహానికి వశమవ్వడము - రెండింటిలో తేడా ఉంది. ఫరిశ్తా లేక నిరాకారి ఆత్మ దేహాన్ని ఆధారంగా తీసుకొని దేహపు బంధనంలోకి రాదు, సంబంధం ఉంచుకుంటుంది కానీ బంధనంలోకి రాదు. కనుక, నిరహంకారి, ఆకారి ఫరిశ్తా మరియు నిరాకారి స్థితిలో లక్ష్యము మరియు లక్షణాలలో ఎంతగా సమానంగా అయ్యారు? అని బాప్ దాదా మళ్ళీ సంవత్సరంలో రిజల్టు చూస్తారు.

మహానతకు గుర్తు నిర్మానత. ఎంతగా నిర్మానంగా ఉంటారో, అంతగా అందరి మనసులలో మహాన్ గా స్వతహాగానే అవుతారు. నిర్మానత లేకుండా సర్వులకు మాస్టర్ సుఖదాతలుగా అవ్వలేరు. నిర్మానత నిరహంకారిగా సహజంగానే చేస్తుంది. నిర్మానత యొక్క బీజము మహానత అనే ఫలాన్ని స్వతహాగానే ప్రాప్తి చేయిస్తుంది. నిర్మానత అందరి హృదయాల నుండి ఆశీర్వదాలను ప్రాప్తి చేయించే సహజ సాధనము. నిర్మానత అందరి మనసులో నిర్మానత కల ఆత్మ పట్ల సహజంగానే ప్రేమ యొక్క స్థానాన్ని తయారుచేస్తుంది. నిర్మానత మహిమా యోగ్యంగా స్వతహాగానే తయారుచేస్తుంది. కనుక నిరహంకారిగా అయ్యేందుకు విశేషమైన గుర్తు - నిర్మానత. వృత్తిలో కూడా నిర్మానత, దృష్టిలో కూడా నిర్మానత, వాణిలో కూడా నిర్మానత, సంబంధ-సంపర్కంలో కూడా నిర్మానత. నా వృత్తిలో లేదు కానీ మాటలలో వచ్చేసింది అని కాదు. అలా కాదు. ఎటువంటి వృత్తి ఉంటుందో అటువంటి దృష్టి ఉంటుంది, ఎటువంటి దృష్టి ఉంటుందో అటువంటి వాణి ఉంటుంది, ఎటువంటి వాణి ఉంటుందో అదే సంబంధ-సంపర్కంలోకి వస్తుంది. నాలుగింటిలోనూ ఉండాలి. మూడింటిలో ఉండి, ఒకదానిలో లేకపోయినా కూడా అహంకారం రావడానికి మార్జిన్ ఉంది. ఇలా నిర్మానంగా ఉండేవారిని ఫరిశ్తా అని అనడం జరుగుతుంది. కనుక అర్థమయిందా, బాప్ దాదా ఏం కోరుకుంటున్నారు మరియు మీరేం కోరుకుంటున్నారు? ‘కోరుకోవడముఇరువురిది ఒక్కటే, ఇప్పుడుచేయడముకూడా ఒకటిగా చేయండి. అచ్ఛా!

మున్ముందు సేవ కోసం కొత్త-కొత్త ప్లాన్లు ఏం తయారుచేస్తున్నారు? కొన్ని తయారుచేసారు, కొన్ని తయారుచేస్తారు. సంవత్సరం కోసం కావచ్చు, రాబోయే సంవత్సరం కోసం కావచ్చు, ఎలాగైతే ఇతర ప్లాన్లు ఆలోచిస్తారో - భాషణ కూడా చేస్తాము, సంబంధ-సంపర్కాలను కూడా పెంచుతాము, పెద్ద ప్రోగ్రామ్లు కూడా చేస్తాము, చిన్న ప్రోగ్రామ్లు కూడా చేస్తాము, అని ఇలా అయితే తప్పకుండా ఆలోచిస్తారు కానీ వర్తమాన సమయపు వేగం అనుసారంగా ఇప్పుడు సేవది కూడా తీవ్ర వేగం కావాలి. అది ఎలా జరుగుతుంది? వాణి ద్వారా, సంబంధ-సంపర్కాల ద్వారా అయితే సేవ చేస్తూనే ఉన్నారు, మనసా-సేవ కూడా చేస్తారు కానీ ఇప్పుడు కావాల్సింది - కొద్ది సమయంలో సేవా సఫలత ఎక్కువ ఉండాలి. సఫలత అనగా ఫలితము. దానికి విధి - వాణితో పాటు మొదట తమ స్థితి మరియు స్థానం యొక్క వైబ్రేషన్లను శక్తిశాలిగా చేసుకోండి. ఎలాగైతే మీ జడ చిత్రాలు ఏం సేవను చేస్తున్నాయి? వైబ్రేషన్ల ద్వారా ఎంతమంది భక్తులను ప్రసన్నము చేస్తున్నాయి! డబల్ విదేశీయులు మందిరాలను చూసారా? మీ మందిరాలే కదా! కేవలం భారతవాసుల మందిరాలా? మీ చిత్రాలు సేవ చేస్తున్నాయి కదా! కనుక వాణి ద్వారానైతే చేయండి కానీ ఇప్పుడు ఇటువంటి ప్లానింగ్ చేయండి, వాణితో పాటు వైబ్రేషన్ యొక్క ఎలాంటి విధిని తయారుచేయాలంటే, దానితో వాణి మరియు వైబ్రేషన్ డబల్ పని చేయాలి. వైబ్రేషన్ చాలా కాలం ఉంటుంది. వాణి ద్వారా విన్న విషయాలు అప్పుడప్పుడు చాలామంది మర్చిపోతారు కూడా కానీ వైబ్రేషన్ యొక్క ముద్ర ఎక్కువ సమయం నడుస్తుంది. ఎలాగైతే మీరు మీ జీవితంలో అనుభవజ్ఞులు - ఎవరిదైనా వ్యతిరేకపు వైబ్రేషన్ ఒకవేళ మీ మనసులో లేక బుద్ధిలో కూర్చుండిపోతే, వ్యతిరేకపు వైబ్రేషన్ ఎంత సమయం నడుస్తుంది! వైబ్రేషన్ లోపల కూర్చుండిపోతుంది కదా. మరియు మాటనైతే సమయంలోనే మర్చిపోతారు కానీ వైబ్రేషన్ రూపంలో మనసు, బుద్ధిలో ముద్ర పడిపోతుంది. మరియు ఎంత సమయం అదే వైబ్రేషన్లకు వశమై, వ్యక్తితో వ్యవహారంలోకి వస్తారు? వ్యతిరేకమైనది కావచ్చు, సరైనది కావచ్చు కానీ వైబ్రేషన్ కష్టం మీద తొలగుతుంది.

కానీ ఆత్మిక వైబ్రేషన్లను వ్యాపింపజేసేందుకు మొదట తమ మనసులో, బుద్ధిలో వ్యర్థ వైబ్రేషన్లు సమాప్తం చేయాలి, అప్పుడే ఆత్మిక వైబ్రేషన్లు వ్యాపింపజేయగలరు. ఎవరి పట్ల అయినా ఒకవేళ వ్యర్థ వైబ్రేషన్లు ధారణ చేసి ఉంటే ఆత్మిక వైబ్రేషన్లను వ్యాపింపజేయలేరు. వ్యర్థ వైబ్రేషన్లు, ఆత్మిక వైబ్రేషన్ల ముందు ఒక గోడ వలె అవుతాయి. సూర్యుడు ఎంత ప్రకాశమయంగా అయినా ఉండవచ్చు, ఒకవేళ ఎదురుగా గోడ వచ్చింది, మేఘాలు వచ్చాయి అంటే సూర్యుని ప్రకాశాన్ని ప్రజ్వలితము కానివ్వవు. పక్కా వైబ్రేషన్ ఏదైతే ఉందో, అది గోడ వంటిది మరియు తేలికపాటి వైబ్రేషన్లు ఏవైతే ఉన్నాయో, అవి తేలికైన మేఘాలు లేక నల్లని మేఘాల వంటివి. అవి ఆత్మిక వైబ్రేషన్లను ఆత్మల వరకు చేరనివ్వవు. ఎలాగైతే సాగరంలో ఎవరైనా వల విసిరి అనేక వస్తువులను ఒక్కసారే పోగు చేస్తారు లేక తమ వలను ఎక్కడైనా వ్యాపింపజేసి ఒకే సమయంలో అనేకమందిని తమవారిగా చేసుకుంటారు, అలా వైబ్రేషన్లు ఒక్క సమయంలోనే అనేక ఆత్మలను ఆకర్షించగలవు. వైబ్రేషన్లు వాయుమండలాన్ని తయారుచేస్తాయి. కనుక జరగబోయే సేవలో వృత్తి ద్వారా ఆత్మిక వైబ్రేషన్లతో పాటు సేవ చేయండి, అప్పుడే ఫాస్ట్ గా జరుగుతుంది. వైబ్రేషన్లు మరియు వాయుమండలంతో కలిపి వాణి యొక్క సేవను కూడా చేస్తే ఒక సమయంలోనే అనేక ఆత్మల కళ్యాణం చేయగలరు.

ఇకపోతే, ప్రోగ్రామ్ల కోసం ముందుగానే తయారై తయారుచేయబడిన స్టేజ్ యొక్క ప్రయోగాన్ని ఇంకా ఎక్కువ చేయండి, దీనిని ఇంకా పెంచండి. సంపర్కంలో ఉండేవారి ద్వారా సహయోగం తీసుకొని సేవలో వృద్ధిని ప్రాప్తి చేసుకోగలరు. సహయోగుల సహయోగాన్ని ఏదో ఒక విధితో పెంచుకుంటూ వెళ్ళినట్లయితే స్వతహాగానే సేవలో సహయోగులుగా అవ్వడంతో సహజ యోగులుగా అయిపోతారు. చాలామంది ఇటువంటి ఆత్మలు ఉంటారు, వారు నేరుగా సహజయోగులుగా అవ్వరు కానీ సహయోగం తీసుకుంటూ వెళ్ళండి, సహయోగిగా తయారుచేస్తూ వెళ్ళండి. అలా సహయోగంలో ముందుకు వెళ్తూ-వెళ్తూ సహయోగమే వారిని యోగీగా తయారుచేస్తుంది. కనుక సహయోగి ఆత్మలను ఇంకా స్టేజి పైకి తీసుకురండి, వారి సహయోగాన్ని సఫలం చేయండి. అర్థమయిందా, ఏం చేయాలో? ఎవరైనా ఒక ఆత్మ సహయోగిగా అయినా కూడా, ఆత్మ ప్రాక్టికల్ గా సహయోగం తీసుకోవడం ద్వారా, ఇవ్వడం ద్వారా, ప్రత్యక్ష ఆశీర్వాదాల ద్వారా సహజంగా ముందుకు వెళ్తుంది మరియు అనేకుల సేవకు నిమిత్తంగా అవుతుంది.

దానితో పాటు సంవత్సరంలో నెలను ఫిక్స్ చేయండి, కొన్ని నెలలు విశేషంగా స్వ పురుషార్థం లేక శ్రేష్ట శక్తిని ధారణ చేసే అభ్యాసం కోసం ఫిక్స్ చేసుకోండి, వీటినే మీరు తపస్య, రిట్రీట్ లేక భట్టీలు అంటారు. ప్రతి ఒక్కరు దేశం అనుసారంగా రెండు- రెండు నెలలు ఫిక్స్ చేసుకోండి, ఎలాగైతే సీజన్ ఉంటుంది. రెండు నెలలు తపస్య కోసము, రెండు నెలలు చిన్న-చిన్న సేవల కోసము, రెండు నెలలు పెద్ద రూపంలో చేసే సేవల కోసము - ఇలా ఫిక్స్ చేసుకోండి. అంతేకానీ, 12 నెలలు సేవలో ఎంతో బిజీగా అయిపోయి స్వ ప్రగతి కోసం తక్కువ సమయం లభించేలా ఉండకూడదు. ఎలాగైతే దేశం యొక్క సీజను ఉంటుందో, కొన్ని సమయాలలో ఎలా ఉంటుంది అంటే, బయట విశేష సేవను చేయలేరు, సమయాన్ని తమ ప్రగతి కోసం విశేష రూపంలో పెట్టుకోండి. మొత్తం సంవత్సరం సేవ చేయకుండా ఉండడము, ఇలా కూడా జరగదు, మొత్తం సంవత్సరం కేవలం తపస్య చేయడము, ఇలా కూడా జరగదు, అందుకే రెండింటినీ లక్ష్యంగా పెట్టుకొని తమ స్థానం అనుసారంగా ఫిక్స్ చేసుకోండి, అందులో సేవ మరియు స్వ ప్రగతి - రెండూ కలిసి ఉండాలి.

అచ్ఛా. సంవత్సరం సీజన్ యొక్క సమాప్తి. సమాప్తిలో ఏం చేస్తారు? సమాప్తిలో ఒకటేమో వేడుక జరుపుకుంటారు మరియు రెండవది ఆధ్యాత్మిక విషయాలలో స్వాహా చేస్తారు. కనుక ఇప్పుడు స్వాహా ఏం చేస్తారు? ఒక విషయాన్ని, విశేషంగా మనసు-బుద్ధి ద్వారా స్వాహా చేయండి, వాణి ద్వారా కాదు, కేవలం చదివాము, అలా కాదు, మనసు-బుద్ధి ద్వారా స్వాహా చేయండి. అప్పుడు చూడండి, స్వ మరియు సేవలో తీవ్ర గతి ఎలా ఉంటుంది! కనుక నేటి అల ఏమిటంటే - ఆత్మ పట్ల అయినా వ్యర్థ వైబ్రేషన్ ను స్వాహా చేయండి. స్వాహా చేయగలరా? లేక కొద్ది-కొద్దిగా ఉంటుందా? ఇలా భావించకండి, వారు ఉన్నదే విధంగా, కనుక వైబ్రేషన్ అయితే ఉంటుంది కదా! ఎలా ఉన్నా కానీ మీరు నెగిటివ్ వైబ్రేషన్ ను మార్చి పాజిటివ్ వైబ్రేషన్ పెట్టుకున్నట్లయితే ఆత్మ కూడా నెగిటివ్ నుండి పాజిటివ్ లోకి తప్పకుండా వచ్చేస్తుంది, రావాల్సిందే ఎందుకంటే ఎప్పటివరకైతే వ్యర్థ వైబ్రేషన్ మనసు-బుద్ధిలో ఉంటుందో, అప్పటివరకు తీవ్ర వేగంతో కూడిన సేవ జరగనే జరగదు.

వృత్తి ద్వారా ఆత్మిక వైబ్రేషన్లు వ్యాపింపజేయాలి. వృత్తి అనేది రాకెట్, ఎవరైనా సరే ఇక్కడ కూర్చుని-కూర్చుని ఎక్కడికి కావాలనుకుంటే అక్కడ, ఎంత శక్తిశాలి పరివర్తన చేయాలనుకుంటే అంత చేయగలరు. ఇది ఆత్మిక రాకెట్. ఎక్కడి వరకు ఎంతమందికి చేర్చాలనుకుంటే, అంతగా శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్లను, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారుచేయవచ్చు. వారు వాస్తవానికి రాంగ్ కావచ్చు కూడా, కానీ మీరు వారి రాంగ్ ను ధారణ చేయకండి. రాంగ్ ను మీరెందుకు ధారణ చేస్తారు? ఇది శ్రీమతమా ఏమిటి? అర్థం చేసుకోవడము వేరే విషయము. జ్ఞాన స్వరూపంగా అవ్వండి కానీ జ్ఞాన స్వరూపంతో పాటు శక్తిశాలిగా అయి దానిని సమాప్తం చేయండి. అర్థం చేసుకోవడము వేరే విషయము, ఇముడ్చుకోవడము వేరే విషయము, సమాప్తం చేయడము, అదింకా వేరే విషయము. వీరు రాంగ్, వీరు రైట్, వీరు విధంగా ఉన్నారు అనైతే అర్థం చేసుకుంటారు. కానీ లోపల దానిని ఇముడ్చుకోకండి. ఇముడ్చుకోవడము వస్తుంది, సమాప్తం చేయడం రావడము లేదు. జ్ఞానము అంటే వివేకము. కానీ ఎవరికైతే అర్థం చేసుకోవడం కూడా వస్తుందో మరియు తొలగించుకోవడము కూడా వస్తుందో, పరివర్తన చేసుకోవడము కూడా వస్తుందో, వారినే వివేకవంతులు అని అనడం జరుగుతంది.

సంవత్సరంలో మనసు మరియు బుద్ధిని పూర్తిగా వ్యర్థం నుండి ఫ్రీ చేసుకోండి. ఇదే తీవ్ర వేగం నుండి సాధారణ వేగంలోకి తీసుకొస్తుంది, అందుకే సమాప్తి వేడుకను చేసుకోండి అనగా స్వాహా చేయండి. పూర్తిగా స్వచ్ఛంగా అయిపోవాలి. ఎలాంటి వారైనా సరే, క్షమించండి. శుభ భావన, శుభ కామనల వృత్తి ద్వారా శుభ వైబ్రేషన్లను ధారణ చేయండి ఎందుకంటే లాస్ట్ లో ముందుకు వెళ్తూ ఇదే వృత్తి-వైబ్రేషన్లు మీ సేవను పెంచుతాయి, అప్పుడు త్వరత్వరగా తక్కువలో తక్కువ 9 లక్షల మందిని తయారుచేయగలరు. అర్థమయిందా, ఏం స్వాహా చేయాలో? వ్యర్థ వృత్తి, వ్యర్థ వైబ్రేషన్లు స్వాహా! అప్పుడు చూడండి, సహజ యోగులుగా మరియు స్వభావంలో ఫరిశ్తాలుగా అయ్యే ఉన్నారు. అనుభవంపై రిట్రీట్ చేయండి, వర్క్ షాప్ చేయండి ‘‘ఎలా అవుతుంది అని కాదు; ఇలా అవుతుంది’’ అచ్ఛా!

సదా స్వయాన్ని పదే-పదే ఒరిజినల్ స్వరూపమైననేను నిరాకారిని’ - ఇటువంటి నిశ్చయం మరియు నషాలో ఎగిరేవారు, సదా నిర్మానత ద్వారా మహానతను ప్రాప్తి చేసుకునే అనుభవీ ఆత్మలు, ఇటువంటి నిర్మానులు, సదా మహాన్ మరియు సదా ఆకారి, నిరాకారి స్థితిని స్వభావంగా మరియు సహజంగా చేసుకునే సర్వ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క చాలా-చాలా-చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

మరజీవా జీవితంలో సదా సంతుష్టంగా ఉండే కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా కండి


పిల్లలైన మీరు సదా సంతుష్టంగా ఉండేందుకే మరజీవాగా అయ్యారు. ఎక్కడ సంతుష్టత ఉంటుందో, అక్కడ సర్వ గుణాలు మరియు సర్వ శక్తులు ఉంటాయి ఎందుకంటే రచయితను తమవారిగా చేసుకున్నారు, కనుక తండ్రి లభించారంటే అన్నీ లభించాయి. సర్వ కోరికలను పోగు చేసినా వాటి కన్నా కూడా పదమారెట్లు ఎక్కువగా లభించింది. దీని ముందు కోరికలు ఎటువంటివి అంటే సూర్యుని ముందు దీపం వంటివి. కోరిక ఉత్పన్నమవుతుంది అన్న విషయమే విడిచిపెట్టండి కానీ కోరిక కలుగుతుంది కూడా అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వదు. సర్వ ప్రాప్తి సంపన్నులు, అందుకే కోరిక అంటే ఏమిటో తెలియనివారు, సదా సంతుష్టమణులు.

స్లోగన్:-

ఎవరి సంస్కారాలైతే సరళంగా ఉంటాయో, వారు ఎటువంటి పరిస్థితిలోనైనా స్వయాన్ని మల్చుకుంటారు.

 Download PDF

Post a Comment

0 Comments