Hindi/Tamil/English/Telugu/Kannada/Malayalam
08-05-2022 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 31-12-1990
Listen to the Murli audio file
‘‘తపస్యనే
అత్యంత పెద్ద సమారోహము, తపస్య అనగా తండ్రితో ఆనందంగా
ఉండటము’’
ఈ రోజు బాప్ దాదా నలువైపుల యొక్క - కొత్త
జ్ఞానం ద్వారా ప్రతి సమయం కొత్త జీవితాన్ని, కొత్త వృత్తిని, కొత్త దృష్టిని, కొత్త సృష్టిని అనుభవం చేసే
పిల్లలందరికీ ప్రేమపూర్వకమైన అభినందనలను తెలుపుతున్నారు. ఈ సమయంలో నలువైపుల యొక్క
పిల్లలు తమ హృదయం రూపీ దూరదర్శన్ ద్వారా వర్తమాన సమయం యొక్క దివ్య దృశ్యాన్ని
చూస్తున్నారు. దూరంగా ఉన్నా సమీపంగా అనుభవం చేయాలి అన్న ఒకే సంకల్పము అందరికీ
ఉంది. బాప్ దాదా కూడా పిల్లలందరినీ చూస్తున్నారు. అందరి కొత్త ఉల్లాస-ఉత్సాహాలతో
కూడిన హృదయపూర్వకమైన అభినందనల సంగీతాన్ని వింటున్నారు. అందరి స్నేహభరితమైన వెరైటీ
సంగీతము చాలా సుందరంగా ఉంది, అందుకే అందరికీ దానికి రిటర్నులో బదులు
ఇస్తున్నారు. కొత్త సంవత్సరం కోసం, కొత్త ఉల్లాస-ఉత్సాహాల కోసం, ప్రతి సమయము స్వయంలో దివ్యతను
తీసుకొచ్చినందుకు సదా కోసం శుభాకాంక్షలు. ఈ రోజు కేవలం కొత్త సంవత్సరం కారణంగా
అభినందనలు ఇవ్వడం లేదు,
కానీ
అవినాశీ తండ్రి యొక్క అవినాశీ ప్రీతిని నిలబెట్టే పిల్లలకు సంగమయుగం యొక్క ప్రతి
ఘడియ జీవితంలో నవీనతను తీసుకువచ్చేదిగా ఉంటుంది, అందుకే ప్రతి ఘడియ అవినాశీ తండ్రి నుండి
అవినాశీ అభినందనలు ఉంటాయి. బాప్ దాదా యొక్క విశేషమైన సంతోషభరితమైన అభినందనల
ద్వారానే సర్వ బ్రాహ్మణులు వృద్ధిని ప్రాప్తి చేసుకుంటున్నారు. బ్రాహ్మణ జీవితం
యొక్క పాలనకు ఆధారము అభినందనలు. అభినందనల సంతోషంతోనే ముందుకు వెళ్తూ ఉన్నారు.
తండ్రి స్వరూపంలో ప్రతి సమయము అభినందనలు ఉన్నాయి. శిక్షకుని స్వరూపంతో ప్రతి సమయం ‘శభాష్, శభాష్’ అనే మాట పాస్ విత్ ఆనర్ గా
తయారుచేస్తుంది. సద్గురువు రూపంలో ప్రతి శ్రేష్ఠ కర్మకు లభించే ఆశీర్వాదాలు సహజమైన
మరియు ఆనందమయమైన జీవితాన్ని అనుభవం చేయిస్తున్నాయి, అందుకే మీరు పదమాపదమ భాగ్యవంతులు. భాగ్యవిధాత
భగవంతునికి పిల్లలుగా అయ్యారు అనగా సంపూర్ణ భాగ్యానికి అధికారులుగా అయ్యారు.
మనుష్యులైతే విశేషమైన రోజుల్లో విశేషంగా అభినందనలు తెలుపుతారు మరియు మీకు కేవలం
కొత్త సంవత్సరం కోసమే అభినందనలు లభిస్తాయా? మొదటి తేదీ పూర్తి అయి రెండవ తేదీ వస్తూనే
అభినందనలు కూడా సమాప్తమైపోతాయా? మీ కొరకు ప్రతి సమయము, ప్రతి ఘడియ విశేషమైనది.
సంగమయుగము ఉన్నదే విశేషమైన యుగము, అభినందనల యుగము. అమృతవేళ ప్రతి రోజు తండ్రి
నుండి అభినందనలను తీసుకుంటారు కదా! ఈ రోజును కేవలం నిమిత్తమాత్రంగా జరుపుకుంటారు.
కానీ సదా గుర్తుంచుకోండి,
ప్రతి
ఘడియ ఆనందాల ఘడియ. ఆనందమే ఆనందముంది కదా? మీ జీవితంలో ఏముంది అని ఎవరైనా ప్రశ్నిస్తే
ఏమని జవాబిస్తారు?
ఆనందమే
ఆనందముంది కదా! మొత్తం కల్పం యొక్క ఆనందాలను ఈ జీవితంలో అనుభవం చేస్తారు ఎందుకంటే
తండ్రితో మిలనం యొక్క ఆనందాల అనుభవం పూర్తి కల్పానికి రాజ్య అధికారిగా మరియు పూజ్య
అధికారిగా,
రెండిటినీ
అనుభవం చేయిస్తుంది. పూజ్య స్థితి యొక్క ఆనందం మరియు రాజ్యం చేసే ఆనందం - రెండిటి
జ్ఞానము ఇప్పుడే ఉంది,
అందుకే
ఆనందము ఇప్పుడే ఉంది.
ఈ సంవత్సరం ఏం చేస్తారు? నవీనతను తీసుకొస్తారు కదా! ఈ
సంవత్సరాన్ని సమారోహ సంవత్సరంగా జరుపుకోండి. తపస్య చేయాలా లేక సమారోహాన్ని
జరుపుకోవాలా అని ఆలోచిస్తున్నారా? తపస్యనే అత్యంత పెద్ద సమారోహము ఎందుకంటే
హఠయోగం చేయాల్సిన అవసరమైతే లేదు. తపస్య అనగా తండ్రితో ఆనందంగా ఉండటము. మిలనం యొక్క
ఆనందము,
సర్వ
ప్రాప్తుల యొక్క ఆనందము,
సమీపమైన
అనుభవం యొక్క ఆనందము,
సమాన
స్థితి యొక్క ఆనందము. కనుక ఇది సమారోహం అయినట్లు కదా. సేవ యొక్క పెద్ద-పెద్ద
సమారోహాలు చేయరు కానీ తపస్య యొక్క వాతావరణము, వాణి ద్వారా చేసే సమారోహం కన్నా ఎక్కువగా
ఆత్మలను తండ్రి వైపుకు ఆకర్షిస్తుంది. తపస్య ఆత్మిక అయస్కాంతము, దాని ద్వారా ఆత్మలకు దూరం నుండే
శాంతి మరియు శక్తి యొక్క అనుభవం అవుతుంది. మరి మీలో ఏ నవీనతను తీసుకువస్తారు? నవీనతే అందరికీ
ప్రియమనిపిస్తుంది కదా. కనుక సదా స్వయాన్ని చెక్ చేసుకోండి - ఈ రోజున మనసాలో అనగా
స్వయం యొక్క సంకల్ప శక్తిలో విశేషంగా ఏ విశేషతను తీసుకొచ్చాను? మరియు ఇతర ఆత్మల పట్ల మనసా సేవ
అనగా శుభభావన,
శుభకామన
యొక్క విధి ద్వారా ఎంత వృద్ధిని ప్రాప్తి చేసుకున్నాను? అనగా శ్రేష్ఠత యొక్క ఏ నవీనతను
తీసుకొచ్చాను?
దీనితోపాటు
మాటలలో మధురత,
సంతుష్టత, సరళత యొక్క నవీనతను ఎంత
తీసుకొచ్చాను?
బ్రాహ్మణాత్మల
మాటలు సాధారణ మాటలుగా ఉండవు. మాటలలో ఈ మూడు విషయాలు స్వయానికి మరియు ఇతర ఆత్మలకు
అనుభవమవ్వాలి. దీనినే నవీనత అని అంటారు. ఇంకా, ప్రతి కర్మలో నవీనత అనగా ప్రతి కర్మ
స్వయానికి మరియు ఇతర ఆత్మలకు, ప్రాప్తి యొక్క అనుభవాన్ని చేయిస్తుంది. కర్మ
యొక్క ప్రత్యక్షఫలము మరియు భవిష్యత్తు కోసం జమ అయిన ఫలము అనుభవమవ్వాలి. వర్తమాన
సమయంలో ప్రత్యక్షఫలంగా సదా సంతోషము మరియు శక్తి యొక్క ప్రసన్నత అనుభవమవ్వాలి మరియు
భవిష్యత్తు యొక్క జమ కూడా అనుభవమవ్వాలి. అప్పుడు సదా స్వయాన్ని నిండుగా, సంపన్నంగా అనుభవం చేస్తారు. కర్మ
రూపీ బీజము ప్రాప్తి యొక్క వృక్షంతో సంపన్నంగా ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. నిండుగా ఉన్న
ఆత్మకు అలౌకిక నషా సహజంగా ఉంటుంది. కావున ఇలాంటి నవీనతతో కూడిన కర్మలు చేసారా? దీనితో పాటు సంబంధ-సంపర్కాలలో ఏ
నవీనతను తీసుకురావాలి?
ఈ సంవత్సరము దాత యొక్క పిల్లలు, మాస్టర్ దాతలు - ఈ స్మృతి
స్వరూపాన్ని అనుభవం చేయండి. బ్రాహ్మణాత్మలు కావచ్చు, సాధారణ ఆత్మలు కావచ్చు, ఎవరి సంబంధ-సంపర్కంలోకి వచ్చినా
కానీ,
ఆ ఆత్మలకు
మాస్టర్ దాత ద్వారా ప్రాప్తి యొక్క అనుభవమవ్వాలి. ధైర్యం లభించినా, ఉల్లాస-ఉత్సాహాలు లభించినా, శాంతి లేక శక్తి లభించినా, సహజ విధి లభించినా, సంతోషం లభించినా - అనుభవం యొక్క
వృద్ధి జరిగిందని వారికి అనుభూతి అవ్వాలి. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఇవ్వాలి, తీసుకోకూడదు, ఇవ్వాలి. ఇవ్వడంలో తీసుకోవడం
ఇమిడి ఉంది. కావున ఆత్మనైన నేను మాస్టర్ దాతగా అవ్వాలి. ఇదే విధంగా తమ స్వభావ-సంస్కారాలలో
తండ్రి సమానంగా అయ్యే నవీనతను తీసుకురావాలి. నా స్వభావము కాదు, తండ్రి స్వభావము ఏదో, అదే నా స్వభావము. బ్రహ్మా యొక్క
సంస్కారాలు ఏవో,
అవే
బ్రాహ్మణుల సంస్కారాలు. ఇలా ప్రతి రోజు తమలో నవీనతను తీసుకొస్తూ ఉంటే కొత్త
ప్రపంచం యొక్క స్థాపన స్వతహాగానే జరిగిపోతుంది. మరి కొత్త సంవత్సరంలో ఏం చేయాలో
అర్థమయిందా?
ఏదైతే
గడిచిపోయిందో,
ఆ
గడిచిపోయిన సంవత్సరం యొక్క సమాప్తి సమారోహాన్ని జరుపుకోండి మరియు వర్తమానం యొక్క
సమానత మరియు సమీపత సమారోహాన్ని జరుపుకోండి మరియు భవిష్యత్తు యొక్క సదా సఫలతా
సమారోహాన్ని జరుపుకోండి. సమారోహ సంవత్సరాన్ని జరుపుకుంటూ ఎగురుతూ ఉండండి.
డబల్ విదేశీయులు ఆనందంగా ఉండడం ఇష్టపడతారు
కదా! కావున ఆనందంగా ఉండేందుకు రెండు మాటలను గుర్తుంచుకోండి - 1. డాట్ (బిందువు) 2. నాట్ (వద్దు). దేనికి వద్దు అని
చెప్పాలి - ఇది తెలుసు కదా. మాయకు అనుమతి లేదు. వద్దు అని చెప్పడం వచ్చా? లేక కొద్ది కొద్దిగా రానిస్తారా? డాట్ (బిందువు) పెట్టినట్లయితే
నాట్ స్వతహాగానే అవుతుంది. డబల్ నషా ఉంది కదా.
భారతవాసులు ఏం చేస్తారు? భారత్ మహాన్ దేశము - ఇది ఈ నాటి
స్లోగన్. మరియు భారత్ యొక్క మహాన్ ఆత్మలే మహాత్ములుగా మహిమ చేయబడ్డారు. కనుక భారత్
మహాన్ అనగా భారతవాసులు మహాన్ ఆత్మలు. కనుక ప్రతి సమయము మీ మహానత ద్వారా భారత్ ను
మహానాత్మల స్థానంగా,
దేవాత్మల
స్థానంగా సాకార రూపంలో తయారుచేస్తారు. చిత్రాలు సమాప్తమై చైతన్య దేవాత్మల
స్థానాన్ని అందరికీ చూపిస్తారు. కనుక డబల్ విదేశీయులు మరియు భారత నివాసులు అని
కాదు,
కానీ ఇరువురు
ఇప్పుడు మధుబన్ నివాసులు. అచ్ఛా.
నలువైపుల యొక్క సర్వ మాస్టర్ దాతా ఆత్మలకు, సదా తండ్రి ద్వారా అభినందనలను
ప్రాప్తి చేసుకునే విశేష ఆత్మలకు, సదా ఆనందంగా ఉండే భాగ్యవాన్ ఆత్మలకు, సదా స్వయంలో నవీనతను తీసుకొచ్చే
మహాన్ ఆత్మలకు,
ఫరిశ్తా
సో దేవాత్మగా అయ్యే సర్వ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు. ప్రతి
ఘడియకు అభినందనలు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్ దాదా మిలనము
1. అచంచలమైన-స్థిరమైన ఆత్మలము - ఇలా అనుభవం
చేస్తున్నారా?
ఒక వైపు
అలజడి ఉంది మరియు ఇంకొక వైపు బ్రాహ్మణాత్మలైన మీరు సదా అచలంగా ఉంటారు. ఎంతగా అక్కడ
అలజడి ఉందో,
అంతగా మీ
లోపల అచంచలమైన-స్థిరమైన స్థితి యొక్క అనుభవం పెరుగుతూ ఉంది. ఏమి జరిగినా కానీ, అన్నింటికన్నా సహజమైన యుక్తి -
నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). ఏ విషయము కొత్తేమీ కాదు. ఇదేమి జరుగుతుంది, ఏమి జరగనున్నది అని ఎప్పుడైనా
ఆశ్చర్యమనిపిస్తుందా?
ఏదైనా
కొత్త విషయమైతే,
అప్పుడు
ఆశ్చర్యం కలుగుతుంది. ఏ విషయమైనా ఆలోచించలేదు, వినలేదు, అర్థం కాలేదు, కానీ అది అకస్మాత్తుగా జరిగింది అంటే, అప్పుడు ఆశ్చర్యమనిపిస్తుంది.
కనుక ఆశ్చర్యం కాదు,
కానీ ఫుల్
స్టాప్ పెట్టాలి. ప్రపంచం తికమకపడుతూ ఉంటుంది మరియు మీరు ఆనందంగా ఉండేటువంటివారు.
ప్రపంచంలోని వారు చిన్న-చిన్న విషయాలలో తికమకపడతారు - ఏం చేయాలి, ఎలా చేయాలి... అని, మరియు మీరు సదా ఆనందంగా ఉన్నారు, తికమకపడడం సమాప్తమైపోయింది.
బ్రాహ్మణులు అనగా ఆనందము,
క్షత్రియులు
అనగా తికమకపడడము. అప్పుడప్పుడు ఆనందము, అప్పుడప్పుడు తికమకపడడము. మీరందరూ మీ పేరును
- బ్రహ్మాకుమారులు మరియు కుమారీలు అని చెప్తారు కదా. క్షత్రియ కుమారులు మరియు
క్షత్రియ కుమారీలైతే కాదు కదా? సదా తమ భాగ్యం యొక్క సంతోషంలో ఉండేవారు.
హృదయంలో సదా,
స్వతహాగా
ఒక పాట మోగుతూ ఉంటుంది - వాహ్ బాబా మరియు వాహ్ నా భాగ్యము! ఈ పాట దానంతటదే మోగుతూ
ఉంటుంది,
దీనిని
మోగించాల్సిన అవసరం లేదు. ఇది అనాదిగా మోగుతూనే ఉంటుంది. అయ్యో-అయ్యో అనేది
సమాప్తమైపోయింది,
ఇప్పుడు
వాహ్-వాహ్ ఉంది. అయ్యో-అయ్యో అని అనేవారైతే మెజారిటీ చాలామంది ఉన్నారు మరియు
వాహ్-వాహ్ అనేవారు చాలా కొద్దిమంది ఉన్నారు. కనుక కొత్త సంవత్సరంలో ఏం
గుర్తుంచుకుంటారు?
వాహ్-వాహ్.
ఏదైతే ఎదురుగా చూస్తారో,
ఏదైతే
వింటారో,
ఏదైతే
మాట్లాడతారో - అన్నీ వాహ్-వాహ్, అయ్యో-అయ్యో కాదు. అయ్యో ఇదేం జరిగిపోయింది!
అలా కాదు,
వాహ్, ఇది చాలా బాగా జరిగింది. ఎవరైనా
చెడు చేసినా కానీ మీరు మీ శక్తితో చెడును మంచిలోకి పరివర్తన చేయండి. ఇదే కదా
పరివర్తన అంటే. మన బ్రాహ్మణ జీవితంలో చెడు జరగనే జరగదు. ఎవరైనా నిందించినా కానీ, నిందించేవారిపై బలిహారము, ఎందుకంటే వారు సహన శక్తి యొక్క
పాఠాన్ని నేర్పించారు. వారు మీకు మాస్టర్అయ్యారు అంటే వారిపై బలిహారము కదా! సహన
శక్తి ఎంత ఉంది అనేదైతే మీకు తెలిసింది కదా, మరి చెడు జరిగినట్లా లేక మంచి జరిగినట్లా? బ్రాహ్మణుల దృష్టిలో చెడు ఉండనే
ఉండదు,
బ్రాహ్మణుల
చెవులకు చెడు వినిపించనే వినిపించదు, అందుకే బ్రాహ్మణ జీవితము ఆనందాల జీవితము.
ఇప్పుడిప్పుడే చెడు,
ఇప్పుడిప్పుడే
మంచి అంటే ఆనందం ఉండజాలదు. సదా ఆనందమే ఆనందం ఉంటుంది. మొత్తం కల్పంలో
బ్రహ్మాకుమారులు మరియు కుమారీలు శ్రేష్ఠమైనవారు. దేవాత్మలు కూడా బ్రాహ్మణుల
ఎదురుగా ఏమీ కాదు. సదా ఈ నషాలో ఉండండి, సదా సంతోషంగా ఉండండి మరియు ఇతరులను కూడా సదా
సంతోషపరచండి. సంతోషంగా ఉండండి కూడా మరియు సంతోషపరచండి కూడా. నేనైతే సంతోషంగా
ఉంటాను,
ఇలా కాదు.
నేను అందరినీ సంతోషపరుస్తాను - ఇది కూడా ఉండాలి. నేనైతే సంతోషంగా ఉంటాను - ఇది
కూడా స్వార్థమే. బ్రాహ్మణుల సేవ ఏమిటి? మీరు జ్ఞానమిచ్చేదే సంతోషం కోసము.
2. విశ్వంలో ఎంతమందైతే శ్రేష్ఠ ఆత్మలుగా మహిమ
చేయబడతారో,
వారికన్నా
మీరు ఎంత శ్రేష్ఠమైనవారు. తండ్రి మీ వారిగా అయ్యారు. కనుక మీరు ఎంత
శ్రేష్ఠమైనవారిగా అయినట్లు! సర్వశ్రేష్ఠులుగా అయ్యారు. సదా ఇది స్మృతిలో ఉంచుకోండి
- ఉన్నతోన్నతమైన తండ్రి సర్వ శ్రేష్ఠ ఆత్మగా తయారుచేసారు. దృష్టి ఎంత ఉన్నతంగా
అయ్యింది,
వృత్తి
ఎంత ఉన్నతంగా అయ్యింది! అంతా మారిపోయింది. ఇప్పుడు ఎవరినైనా చూస్తే ఆత్మిక
దృష్టితో చూస్తారు మరియు సర్వుల పట్ల కళ్యాణ వృత్తి ఏర్పడింది. బ్రాహ్మణ జీవితం
అనగా ప్రతి ఆత్మ పట్ల దృష్టి మరియు వృత్తి శ్రేష్ఠంగా అయ్యాయి.
3. స్వయాన్ని సఫలతా సితారలము - ఇలా అనుభవం
చేస్తున్నారా?
ఎక్కడైతే
సర్వశక్తులు ఉన్నాయో,
అక్కడ
సఫలత జన్మ సిద్ధ అధికారము. ఏ కార్యము చేసినా, శరీర నిర్వహణార్థమైనా లేక ఈశ్వరీయ
సేవార్థమైనా,
ఆ
కార్యంలో కార్యం చేసేకన్నా ముందు ఈ నిశ్చయం పెట్టుకోండి. నిశ్చయం పెట్టుకోవడం మంచి
విషయమే కానీ ప్రాక్టికల్ గా అనుభవీ ఆత్మగా అయి నిశ్చయము మరియు నషాలో ఉండండి. సర్వ
శక్తులు ఈ బ్రాహ్మణ జీవితంలో సఫలతకు సహజ సాధనము. సర్వ శక్తులకు యజమానులు కనుక ఏ
శక్తినైనా ఏ సమయంలో ఆజ్ఞాపిస్తే, ఆ సమయంలో అది హాజరవ్వాలి. ఏ విధంగా ఎవరైనా
సేవాధారి ఉంటే,
ఆ
సేవాధారిని ఏ సమయంలో ఆజ్ఞాపిస్తే, ఆ సమయంలో సేవ కోసం తయారవుతారు, అలా సర్వశక్తులు మీ ఆజ్ఞ అనుసారంగా
ఉండాలి. ఎంతెంతగా మాస్టర్ సర్వశక్తివాన్ సీటుపై సెట్ అయి ఉంటారో, అంతగా సర్వ శక్తులు ఆజ్ఞ
అనుసారంగా ఉంటాయి. స్మృతి యొక్క సీటు నుండి కొద్దిగా కిందికి దిగినా కానీ శక్తులు
మీ ఆజ్ఞను అంగీకరించవు. సేవకులలో కూడా కొంతమంది ఆజ్ఞాకారులుగా ఉంటారు, కొంతమంది కొద్దిగా కింద-మీద
చేసేవారిగా ఉంటారు. మరి మీ ఎదురుగా సర్వశక్తులు ఎలా ఉన్నాయి? ఆజ్ఞాకారిగా ఉన్నాయా లేక కొంత
సమయం గడిచిన తర్వాత చేరుకుంటాయా? ఏ విధంగానైతే ఈ స్థూల కర్మేంద్రియాలను ఏ
సమయంలో ఎలా ఆజ్ఞాపిస్తే,
ఆ సమయంలో
ఆ ఆజ్ఞ అనుసారంగా నడుస్తాయో, అలానే ఈ సూక్ష్మ శక్తులు కూడా మీ ఆజ్ఞ
అనుసారంగా నడవాలి. చెక్ చేసుకోండి, మొత్తం రోజంతటిలో సర్వ శక్తులు ఆజ్ఞానుసారంగా
ఉన్నాయా?
ఎందుకంటే
ఈ సర్వశక్తులు ఇప్పటి నుండి మీ ఆజ్ఞానుసారంగా ఉంటేనే చివర్లో కూడా మీరు సఫలతను
ప్రాప్తి చేసుకోగలరు. దీని కోసం బహుకాలపు అభ్యాసం కావాలి. కనుక ఈ కొత్త సంవత్సరంలో
ఆజ్ఞానుసారంగా నడిపించే విశేషమైన అభ్యాసం చేయండి ఎందుకంటే విశ్వ రాజ్యాన్ని
ప్రాప్తి చేసుకోవాలి కదా. విశ్వ రాజ్యాధికారిగా అయ్యే కన్నా ముందు స్వరాజ్య
అధికారిగా అవ్వండి.
నిశ్చయము మరియు నషా పిల్లలు ప్రతి ఒక్కరికీ
ఎగిరేకళను అనుభవం చేయిస్తున్నాయి. డబల్ విదేశీయులు అదృష్టవంతులు ఎందుకంటే ఎగిర కళ
సమయంలో వచ్చారు. ఎక్కేటువంటి శ్రమ చేయాల్సి అవసరం పడలేదు. విజయ తిలకము సదా
మస్తకంపై మెరుస్తూ ఉంది. ఈ విజయ తిలకమే ఇతరులకు సంతోషాన్ని ఇప్పిస్తుంది ఎందుకంటే
విజయీ ఆత్మ ముఖము సదా హర్షితంగా ఉంటుంది. కావున మీ హర్షిత ముఖాన్ని చూసి అందరూ ఆ
సంతోషం వెనుక ఆకర్షితులవుతారు ఎందుకంటే ప్రపంచంలోని ఆత్మలు సంతోషం కోసం
వెతుకుతున్నారు మరియు మీ ముఖాలపై ఎప్పుడైతే సంతోషపు మెరుపును చూస్తారో, అప్పుడు స్వయం కూడా
సంతోషిస్తారు. వీరికి ఏదో ప్రాప్తి లభించిందని వారు భావిస్తారు. మున్ముందు మీ
ముఖాలు సంతోషపు ఆకర్షణ ద్వారా ఇంకా సమీపంగా తీసుకొస్తాయి. ఎవరికీ వినే సమయం
లేకపోయినా కానీ క్షణంలో మీ ముఖము ఆ ఆత్మల సేవ చేస్తుంది. మీరందరూ కూడా ప్రేమ మరియు
సంతోషాన్ని చూసి బ్రాహ్మణులుగా అయ్యారు కదా. కావున తపస్యా సంవత్సరంలో ఇలాంటి సేవ
చేయండి.
4. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు - ఇటువంటి
స్థితిలో సదా స్థితులయ్యే సహయోగి ఆత్మలు కదా? ఒక్కరిని స్మృతి చేయడం సులభము. అనేకులను
స్మృతి చేయడం కష్టము. అనేక విస్తారాలను వదిలి సార స్వరూపంలో ఒక్క తండ్రి - ఈ
అనుభవంలో ఎంత సంతోషముంటుంది. సంతోషము జన్మ సిద్ధ అధికారము, తండ్రి నుండి లభించిన ఖజానా కనుక
తండ్రి ఖజానా పిల్లలకు జన్మ సిద్ధ అధికారంగా ఉంటుంది. తమ ఖాజానాపై ‘నాది’ అనే నషా ఉంటుంది. మరియు అది
లభించింది ఎవరి నుండి?
అవినాశీ
తండ్రి నుండి. మరి అవినాశీ తండ్రి ఏది ఇచ్చినా, అవినాశీదే ఇస్తారు. అవినాశీ ఖజానా యొక్క నషా కూడా అవినాశీగా ఉంటుంది. ఈ నషాను
ఎవరూ విడిపించలేరు ఎందుకంటే ఇది నష్టం కలిగించే నషా కాదు. ఇది ప్రాప్తి కలిగించే
నషా. అదైతే ప్రాప్తులను పోగొట్టే నషా. కనుక సదా ఏం గుర్తుంటుంది? ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ
లేరు. రెండవ వారు,
మూడవ వారు
వస్తే ఘర్షణ జరుగుతుంది. మరియు ఒక్క తండ్రే ఉంటే ఏకరస స్థితి ఉంటుంది. ఒక్కరి
రసంలో లవలీనులుగా ఉండడం చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆత్మ యొక్క ఒరిజనల్
స్వరూపమే - ఏకరసము.
వీడ్కోలు సమయంలో కొత్త సంవత్సరం యొక్క శుభ
ఆరంభానికి అభినందనలు - నలువైపుల యొక్క లక్కీ మరియు
లవ్లీ పిల్లలందరికీ విశేషంగా కొత్త ఉల్లాసానికి, కొత్త ఉత్సాహానికి ప్రతి ఘడియకు అభినందనలు.
మీరు స్వయం కూడా డైమండ్ మరియు జీవితం కూడా డైమండ్ మరియు డైమండ్ మార్నింగ్, ఈవినింగ్, డైమండ్ నైట్ సదా ఉండాలి. ఈ
విధితోనే చాలా త్వరగా మీ రాజ్యాన్ని స్థాపన చేస్తారు మరియు రాజ్యం చేస్తారు. మీ
రాజ్యము ప్రియంగా అనిపిస్తుంది కదా. కావున ఇప్పుడు త్వరత్వరగా తీసుకురండి మరియు
రాజ్యం చేయండి. మీ రాజ్యం ఎదురుగా కనిపిస్తుంది కదా. కావున ఇప్పుడు ఫరిశ్తాలుగా
అవ్వండి మరియు దేవతలుగా అవ్వండి. నలువైపులా ఉన్న పిల్లలు విశేషంగా పదమాల రెట్ల
ప్రియస్మృతులను స్వీకరించండి. విదేశం వారు, దేశం వారు తపస్య యొక్క ఉల్లాస-ఉత్సాహాలలో
బాగున్నారు మరియు ఎక్కడైతే తపస్య ఉంటుందో, అక్కడ సేవ ఉండనే ఉంటుంది. సదా సఫలత యొక్క
అభినందనలు. ప్రతి ఒక్కరు ఎలాంటి నీవనతను చూపించాలంటే, మొత్తం విశ్వము మీ వైపు చూడాలి.
నవీనత యొక్క లైట్ హౌస్ గా అవ్వండి. అచ్ఛా. ప్రతి ఒక్కరు స్వయం కోసం ప్రియస్మృతులను
మరియు అభినందనలు స్వీకరించండి.
వరదానము:-
శుద్ధ సంకల్పాలు మరియు శ్రేష్ఠ సాంగత్యం ద్వారా తేలికగా అయి సంతోషం యొక్క
నాట్యం చేసే అలౌకిక ఫరిశ్తా భవ
బ్రాహ్మణ
పిల్లలైన మీ కోసం ప్రతి రోజు యొక్క మురళినే శుద్ధ సంకల్పాలు. తండ్రి ద్వారా ప్రతి
రోజూ ఉదయముదయమే ఎన్ని శుద్ధ సంకల్పాలు లభిస్తాయి, ఈ శుద్ధ సంకల్పాలలోనే బుద్ధిని బిజీ
పెట్టుకోండి మరియు సదా తండ్రి సాంగత్యంలో ఉండండి, అప్పుడు తేలికగా అయి సంతోషంలో నాట్యం చేస్తూ
ఉంటారు. సంతోషంగా ఉండేందుకు సహజ సాధనము - సదా తేలికగా ఉండండి. శుద్ధ సంకల్పాలు
తేలికగా ఉంటాయి మరియు వ్యర్థ సంకల్పాలు భారీగా ఉంటాయి, అందుకే సదా శుద్ధ సంకల్పాలలో
బిజీగా ఉంటూ,
తేలికగా
అవ్వండి మరియు సంతోషం యొక్క నాట్యం చేస్తూ ఉండండి, అప్పుడు అలౌకిక ఫరిశ్తా అని అంటారు.
స్లోగన్:-
పరమాత్మ ప్రేమ యొక్క పాలనకు స్వరూపము - సహజయోగీ జీవితము.


0 Comments